కొండారెడ్డి బురుజు కొత్త చరిత్ర లిఖించమంటోంది. మహానందిమార్పు తెమ్మంటోంది. కొండగుట్టల మధ్య కొలువైన శ్రీశైలమల్లికార్జునుడూ ఇదే ఉపదేశిస్తున్నాడు. యాగంటి.. అహోబిలం..మంత్రాలయం ఇలా ఒకటేమిటి.. కర్నూలు జిల్లాలో అణువణువూఅదే మాట అంటోంది. ఎన్నికల సమరాంగణాన కుయుక్తులతోమళ్లీ ప్రజల ముందుకొస్తున్న వారిని ఎదుర్కోమని చెబుతోంది.ఎందరో ఉద్ధండులను రాజకీయ రంగానికి అందించిన జిల్లాగా..మంచి, చెడుల మర్మమెరిగి ముందుకు సాగమంటోంది.
16 పర్యాయాలు లోక్‌సభ.. 14 పర్యాయాలు శాసనసభ ఎన్నికలను చవిచూసిన కర్నూలు జిల్లా మరోసారి ఎన్నికలకు సిద్ధమైంది. జిల్లాలో కర్నూలు, పాణ్యం, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, శ్రీశైలం, బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు(ఎస్సీ), కోడుమూరు(ఎస్సీ) నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో 11 అసెంబ్లీ సెగ్మెంట్లు, 2 ఎంపీ స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. పత్తికొండ, బనగానపల్లె, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఎక్కువ సీట్లను టీడీపీకి కట్టబెట్టలేదన్న అక్కసుతో జిల్లాకు ఏ ఒక్క ప్రాజెక్టు రాకుండా అధికార పార్టీ నాటకమాడింది. శ్రీశైలం రిజర్వాయర్ ఉన్నా నీరివ్వకుండా వివక్ష చూపింది. ఎన్నికలు రావటంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్ల కుటుంబాన్ని చేర్చుకుని.. జిల్లాకు భారీగా సాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్టు ఉత్తుత్తి జీవోలిచ్చి నాటకమాడుతోంది. ఇక్కడ ఓర్వకల్లు వద్ద 30 వేల ఎకరాల్లో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఉపాధి లేక ఇక్కడి ప్రజలు నిరంతరం వలసబాట పడుతున్నారు. నియోజకవర్గాల వారీగా ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే..
కర్నూలు :ప్రధానంగా ముస్లింలు, క్రైస్తవులు, వైశ్య, రెడ్డి, ఇతర బీసీ కులాల ఆధిపత్యం ఉంది. 2014లో ఎస్వీ మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీ తరఫున గెలిచారు. అధికార యావతో ఆయన టీడీపీలో చేరారు. ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేష్.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన తనయుడు టీజీ భరత్ టీడీపీ నుంచి సీటు ఆశిస్తుండగా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎవరికి సీటిచ్చినా సీటు రానివారు సహకరించే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇక్కడ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జిగా హఫీజ్‌ఖాన్ ఉన్నారు. మైనార్టీల ప్రాబల్యం గల నియోజకవర్గం కావడంతో ఆయన గెలుపు సులభతరం కానుంది. కర్నూలు కార్పొరేషన్‌లో భారీగా కమీషన్లు దండుకున్న చరిత్ర ఎస్వీ మోహన్‌రెడ్డికి ఉంది.
పాణ్యం
నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నుంచి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గౌరు చరిత కొద్దిరోజుల క్రితం టీడీపీలో చేరారు. టీడీపీ సీటు ఆమెకు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏరాసు ప్రతాప్‌రెడ్డి తనకే సీటివ్వాలని కోరుతున్నారు. ఇదిలావుంటే కాటసాని రాంభూపాల్‌రెడ్డి 2014లో స్వతంత్రంగా పోటీ చేసి.. 60వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఆయన వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేయనుండటంతో గెలుపు నల్లేరు మీద బండి నడకగా మారనుందని చెప్పవచ్చు.
డోన్
వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన కేఈ ప్రతాప్ మరోసారి టీడీపీ తరఫున బరిలో ఉండనున్నారు. పార్టీ ఇన్‌చార్జి హోదాలో అధికారం చెలాయించిన ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోగా, దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఖాళీ స్థలం కనపడితే చాలు కబ్జా చేశారు. పొలాలకు నీరందించే వాగులనూ ఆక్రమించే ప్రయత్నం సాగింది. ఇక టీడీపీలో చేరిన కోట్ల సుజాతమ్మ కూడా అభ్యర్థిత్వం ఆశిస్తుండగా.. సీటిచ్చే అవకాశం లేకపోవడంతో ఆమె అనుచరులు కేఈకు సహకరించే పరిస్థితి లేదు. మంచి వక్తగా, మేధావిగా పేరొందిన బుగ్గనపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. దీనికితోడు సొంత నిధులతో షాదీఖానా, హాస్పిటల్ నిర్మించటం వంటి అంశాలు ఆయనకు కలిసి వస్తున్నాయి
ఎమ్మిగనూరు
వైఎస్సార్‌సీపీ నుంచి ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఉన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండటం, గతంలో ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిన సేవతో పాటు గ్రామగ్రామాన ఆయనకు నేరుగా పరిచయాలు ఉండటం కలిసొచ్చే అంశాలు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీవీ జయనాగేశ్వరరెడ్డిపై అవినీతి ఆరోపణలతోపాటు ప్రతి చిన్న పనికి పైకం తీసుకున్నారన్న విమర్శలు భారీగా ఉన్నాయి.
ఆదోని
ఆదోనిలో వైఎస్సార్ సీపీకి మంచి పట్టు ఉంది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన సాయిప్రసాద్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈయనకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. ఇక అధికార పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మీనాక్షి నాయుడుకు సీటు ఇస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. ఆయనతోపాటు ఆయన సోదరుడు ఉమాపతినాయుడు చేసిన అవినీతి వ్యవహారాలతో ప్రజలు విసుగెత్తిపోయారు.
మంత్రాలయం
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి ఉన్నారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు ఉన్నాయి. పార్టీకి మంచి బలం ఉండటం కలిసొచ్చే అంశం. అధికారపార్టీ నుంచి తిక్కారెడ్డి ఇన్‌చార్జిగా ఉన్నారు. పొలాలకు నీరు అందకుండా సొంత పొలాలకు మళ్లించుకోవడంపై రైతుల్లో వ్యతిరేకత నెలకొంది. అనుమతి లేకుండానే చానల్ నిర్మాణాన్ని కమీషన్ల కోసం చేపట్టారన్న అపవాదు ఉంది.
ఆళ్లగడ్డ
వైఎస్సార్‌సీపీ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరిగెల సోదరుల చేరికతో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరింది. పార్టీ మారిన భూమా కుటుంబంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీడీపీ నుంచి మంత్రి అఖిలప్రియ బరిలో ఉన్నారు. అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా ప్రత్యర్థులను వేధించేందుకు ఉపయోగించారన్న విమర్శ ఉంది. భూమా నాగిరెడ్డి ఆప్తమిత్రుడు ఏవీ సుబ్బారెడ్డి ఈమె వైఖరిపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
నందికొట్కూరు
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన నందికొట్కూరులో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఐజయ్య ఉన్నారు. బైరెడ్డి సిద్థార్థరెడ్డి చేరికతో పార్టీకి మరింత బలం చేకూరింది. టీడీపీ ఇన్‌చార్జిగా మాండ్ర శివానందరెడ్డి ఏ నేతనూ ఎదగనివ్వలేదు. దీంతో అధికార పార్టీకి అభ్యర్థి లేకుండా పోయారు. మాండ్ర చేతిలో కీలుబొమ్మగా ఉండే వ్యక్తినే బరిలో నిలపనుండటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.
పత్తికొండ
వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణరెడ్డి 2017లో దారుణ హత్యకు గురయ్యారు. దీంతో ఆయన సతీమణి శ్రీదేవిని ఇన్‌చార్జిగా ప్రకటించడమే కాకుండా రాష్ట్రంలో మొదటి సీటును ఆమెకు ఖరారు చేశారు. నారాయణరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డెప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలను తిరిగి ఫ్యాక్షన్ కోరల్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉందని నియోజకవర్గ ప్రజలు ఆయన అభ్యర్థిత్వంపై మండిపడుతున్నారు. ఇక తుగ్గలి నాగేంద్ర కుటుంబం సహకరించే పరిస్థితి లేదు. హత్యా రాజకీయాలను సహించే ప్రసక్తే లేదని శ్రీదేవికి మద్దతు తెలుపుతున్నారు.
శెట్టిపల్లికిడబుల్ ధమాకా
తిరుపతి దగ్గర ఉండేశెట్టిపల్లికి సర్పంచ్ ఒక్కరే కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు. ఆ పంచాయతీలో కొంతభాగం తిరుపతి అసెంబ్లీనియోజకవర్గ పరిధిలోకి వస్తే.. కొంత భాగం చంద్రగిరి పరిధిలోకి వస్తుంది. పంచాయతీలోని శెట్టిపల్లి కేంద్రం, సీఆర్ క్వార్టర్స్ కొంతభాగం,ఉప్పరపాలెం, వినాయక నగర్ తదితర ప్రాంతాలు తిరుపతిలో ఉంటే.. మిగిలిన ఓటర్లు చంద్రగిరి సెగ్మెంట్లో ఉన్నారు. కొందరు ఓటర్లు తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలో, మరికొందరు చిత్తూరు ఎంపీ సెగ్మెంట్లలో ఉన్నారు. – కె.జి.రాఘవేంద్రరెడ్డి,సాక్షి ప్రతినిధి, కర్నూలు
పత్తికొండ
వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణరెడ్డి 2017లో దారుణ హత్యకు గురయ్యారు. దీంతో ఆయన సతీమణి శ్రీదేవిని ఇన్‌చార్జిగా ప్రకటించడమే కాకుండా రాష్ట్రంలో మొదటి సీటును ఆమెకు ఖరారు చేశారు. నారాయణరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డెప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలను తిరిగి ఫ్యాక్షన్ కోరల్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉందని నియోజకవర్గ ప్రజలు ఆయన అభ్యర్థిత్వంపై మండిపడుతున్నారు. ఇక తుగ్గలి నాగేంద్ర కుటుంబం సహకరించే పరిస్థితి లేదు. హత్యా రాజకీయాలను సహించే ప్రసక్తే లేదని శ్రీదేవికి మద్దతు తెలుపుతున్నారు.
నంద్యాల
వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జిగా శిల్పా మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ముస్లిం, వైశ్య, బలిజలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మోహన్‌రెడ్డి మంచివాడనే పేరు ఉంది. శిల్పా సహకార్ ద్వారా పేదలకు తక్కువ ధరకే సరుకులను అందించడంతోపాటు నంది రైతు సమాఖ్య ద్వారా రైతు సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి ఏమీ చేయలేకపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు.
శ్రీశైలం
వెఎస్సార్ సీపీ ఇన్‌చార్జిగా శిల్పా చక్రపాణి రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిని మూడు నెలలకే తృణప్రాయంగా పార్టీ విలువల కోసం త్యాగం చేసి మరీ పార్టీలో చేరారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి పార్టీ మారినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. నీరు–చెట్టులో భారీగా అవినీతితోపాటు సొంత పార్టీ నేతల నుంచే కమీషన్లు దండుకున్నారన్న అపవాదు ఉంది.
ఆలూరు
ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం వైఎస్సార్ సీపీ నుంచి ఉన్నారు. వాల్మీకులు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో జయరాంకు సౌమ్యుడిగా పేరుంది. వెనుకబడిన ఈ నియోజకవర్గాన్ని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వీరభద్ర గౌడుకు సీటు వచ్చే అవకాశం లేదు. కొత్తగా పార్టీలో చేరిన కోట్ల సుజాతమ్మకు ఇస్తారని చెబుతున్నారు.
బనగానపల్లె
వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జిగా కాటసాని రామిరెడ్డి ఉన్నారు. సమస్యలపై నిరంతరం ప్రజలతో కలిసి పోరాడటంతో పాటు పార్టీ బలంగా ఉండటం ఈయనకు కలిసి వస్తోంది. కొద్దిరోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి చేరిక అదనపు బలంగా మారింది. ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి కేవలం కాంట్రాక్టులు చూసుకున్నారే కానీ తమను పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు.
కోడుమూరు
వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జిగా మురళీకృష్ణ ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడంతో నియోజకవర్గమంతటా ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా తక్షణం స్పందిస్తారని, నియోజకవర్గం నుంచి ఎవరు హాస్పిటల్‌కు వచ్చినా దగ్గరుండి వైద్యం చేయిస్తారనే పేరు ఉంది. కోట్ల కుటుంబం నుంచి కోట్ల హర్షవర్దన్‌రెడ్డి చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మణిగాంధీ టీడీపీలో చేరారు. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేరికతో ఆయన అభిప్రాయం మేరకే సీటు కేటాయించనున్నారు. దీనిపై నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విష్ణువర్దన్ రెడ్డి మండిపడుతున్నారు.
బ్యాలెట్టా.. బుక్‌లెట్టా !
సాధారణంగా ఒక్క సీటుకు ఎంత మంది అభ్యర్థులు పోటీ పడతారు..? 10.. 20.. మహా అయితే 30! కానీ ఒకే సీటుకు 1033 మంది పోటీ చేశారు. ఇది నిజం.. 1966లో తమిళనాడులోని మొదారుచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అంతమంది ఒకేసారి బరిలో నిలిచారు. దీంతో అభ్యర్థుల గుర్తుల జాబితా చాంతాడులా పెరిగి.. బ్యాలెట్ పేపర్ కాస్తా బుక్‌లెట్‌గా మారింది!
స్పీకర్‌ను ఓడించిన ఇండిపెండెంట్
అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన 13 సాధారణ ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఆయనే.. తలుపుల మండలం రెడ్డివారిపల్లికి చెందిన దివంగత సి.నారాయణరెడ్డి. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, అప్పటి శాసనసభ స్పీకర్‌కేవీ వేమారెడ్డిపై 2002 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో నారాయణరెడ్డి పేరుచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ప్రముఖుల మాట
ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి పార్టీని భుజస్కందాల మీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు.
– వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగావైఎస్ జగన్ ట్వీట్
ప్రభుత్వం వద్ద ఉండాల్సిన డేటా ప్రైవేటు సంస్థలకు ఎలా వెళ్లింది? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఐటీ గ్రిడ్స్ వంటి సంస్థలకు డేటా ట్రాన్స్‌ఫర్ చేసినా అది తప్పే.
– రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సీఎం చంద్రబాబు కుట్ర బయటపడింది. జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ తరఫున భీమిలి నుంచి పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ అనుకూల మీడియాలో వచ్చింది.
– మీడియాతోవైఎస్సార్ సీపీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు, నందమూరి లక్ష్మీపార్వతి
Comments
Please login to add a commentAdd a comment