ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి
ఆదోని (కరర్నూలు): వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన బంద్‌ను విఫలం చేయడానికి ప్రభుత్వం చేసిన కుట్రను ప్రజలు తిప్పికొట్టారని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ డిపో వద్ద ఆయన ఆందోళన కారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న వంచనను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన బంద్‌ను విఫలం చేయడం ద్వార ప్రత్యేక హోదా ఆకాంక్షను ప్రభుత్వం కాలరాయాలని చూసిందని విమర్శించారు. అయితే విజ్ఞులైన ప్రజలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రత్యేక హోదా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక హోదా కోసం నిజాయితీతో పోరాడాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం ప్రజలను వంచించడం మానుకోవాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతు అవుతాయని హెచ్చరించారు. అక్రమ సంపాదన కోసం ప్యాకేజికి ఒప్పుకుని, కుట్ర రాజకీయాలలో భాగంగా బీజేపీతో కలిసి నాటకాలాడుతున్నారని ఆయన సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని, అయితే చంద్రబాబే అడ్డుకుంటున్నట్లు ప్రజలకు అర్థం అయినందు వల్లే వైఎస్‌ఆర్‌సీపీ బంద్‌కు సంపూర్ణ మద్దతు పలికారని అన్నారు. వైఎస్సార్సీపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తోందని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని, ఇకపై చంద్రబాబు ఆటలు సాగవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment