sai prasad reddy
-
సర్కారు చేయూత.. చదువుల తల్లి కల సాకారం
ఆదోని రూరల్/ఆస్పరి: చదువుల్లో అత్యుత్తమంగా రాణిస్తున్న ఆ బాలికను పేదరికంతో తల్లిదండ్రులు చదువు మానిపించారు. ఆ చదువుల తల్లి పదో తరగతిలో 537 మార్కులు సాధించినా.. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉన్నా.. ఆ ర్థిక పరిస్థితుల రీత్యా చదువుకు దూరమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ఆమెకు వరమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి గతేడాది జూన్‌లో బాలిక ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో తాను చదువుకుంటానంటూ బాలిక ఆయనకు మొరపెట్టుకోవడంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాలికను కర్నూలు జిల్లా ఆస్పరి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో చేర్పించారు. అడుగడుగునా ప్రభుత్వ ప్రోత్సాహం అందించడంతో తాజాగా విడుదలైన మొదటి ఏడాది ఇంటర్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 421 మార్కులు సాధించి ఆ బాలిక టాపర్‌గా నిలిచింది. ‘కార్పొరేట్ కళాశాలల్లో చదివితేనే ఎక్కువ మార్కులు’ అనే అపోహను తుడిచిపెట్టేసి ప్రభుత్వ విద్యాసంస్థలో చదివి అత్యుత్తమ మార్కులను సొంతం చేసుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది చదువుల తల్లి నిర్మల. కూలి పనుల నుంచి కాలేజీకి పంపిన ప్రభుత్వం కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు హనుమంతమ్మ, శీనప్ప దంపతులకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించారు. నాలుగో కుమార్తె నిర్మలను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివించారు. పదో తరగతిలో 600కి 537 మార్కులు సాధించి నిర్మల సత్తా చాటింది. అయితే నిరుపేద కుటుంబం కావడంతో ఉన్నత చదువులు చదివించేందుకు నిర్మల తల్లిదండ్రులకు ఆ ర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో ఆమెను చదువు మానిపించి తమతోపాటే కూలిపనులకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటిలోనే ఉన్న నిర్మల ‘సార్ నేను చదుకుంటాను. నాకు సీటు ఇప్పించండి. మా అమ్మానాన్నలు పేదవాళ్లు. డబ్బులు పెట్టి చదివించలేని పరిస్థితి’ అని వేడుకుంది. చలించిపోయిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వెంటనే ఆమెను కాలేజీలో చేర్పించాలని అప్పటి ఎంపీడీవో గీతావాణి, తహసీల్దార్ వెంకటలక్షి్మని ఆదేశించారు. మరోవైపు నిర్మలపై ‘సాక్షి’లో కథనం రావడంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన నిర్మలను తన కార్యాలయానికి పిలిపించారు. నిర్మల ఉన్నత చదువులకు ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పి ఆమెను ఆస్పరి కేజీబీవీలో చేర్పించారు. ప్రభుత్వం అండగా నిలవడంతో రూపాయి కూడా ఫీజు కట్టకుండానే నిర్మల చదువుకుంది. అంతేకాకుండా ఆమెకు మెటీరియల్, పుస్తకాలను కూడా కలెక్టర్ అందించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఓవైపు చదువుల్లోనే కాకుండా మరోవైపు ఆటల్లోనూ నిర్మల రాణిస్తోంది. గతేడాది కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైంది. ఈ క్రమంలో నిర్మలను జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ కావాలన్నదే నా జీవిత ఆశయం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ సృజన నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కలెక్టర్ మాటలను ఎప్పటికీ మర్చిపోలేను. నా చదువుకు మేడమ్ అన్నివిధాల సహకరిస్తున్నారు. ఐపీఎస్ కావాలన్నదే నా లక్ష్యం. – నిర్మల, విద్యా ర్థిని చాలా గర్వంగా ఉంది.. నిర్మల ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది.. పాఠ్యాంశాలపై ఆసక్తి చూపుతోంది. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రూపకల్పన చేసిన పంచతంత్ర ప్రోగ్రామ్ ద్వారా డైలీ, వీక్లీ, గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం. నిరంతర మూల్యాంకనంతోపాటు విద్యార్థుల సందేహలను నివృత్తి చేస్తున్నాం. ఈ టెస్ట్‌ల్లో నిర్మల మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె సాధిస్తున్న విజయాల పట్ల ఎంతో గర్వంగా ఉంది. – శారున్ స్మైలీ, ప్రిన్సిపాల్, కేజీబీవీ, ఆస్పరి, కర్నూలు జిల్లా -
Andhra Pradesh: వారికి దారిచూపిన ‘గడప గడపకు’
కర్నూలు(సెంట్రల్) : నిర్మల కోరిక నెరవేరింది. చదువుకోవడానికి మార్గం సుగమమైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. తాను చదువుకుంటానని.. అందుకు తన తల్లిదండ్రులను ఒప్పించాలని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని కోరడంతో కలెక్టర్ డాక్టర్ జి.సృజన స్పందించారు. బాలికను ఆస్పరి కస్తూర్బా జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూప్‌లో ఇంటర్ చదివేందుకు సీటు ఇప్పించారు. భవిష్యత్‌లోనూ ఆ బాలిక చదువుకు ఆటంకాలు లేకుండా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భర్తిస్తుందని భరోసా ఇచ్చారు. ఆదోని మండలం పెద్ద హరివణంకు చెందిన శ్రీనివాసులు, అనుమంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో నిర్మల చిన్న కుమార్తె. మిగిలిన ముగ్గురికి పెళ్లిళ్లయ్యాయి. నిర్మల చిన్నతనం నుంచే చదువులో రాణిస్తుండటంతో తల్లిదండ్రులు పదో తరగతి వరకు చదివించారు. 2022 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 537 మార్కులు తెచ్చుకుంది. అయితే తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత ఆ బాలిక ఉన్నత చదువులకు శాపమైంది. చదువుకుంటానంటే తమకు అంత స్థోమత లేదని, ఇంటి దగ్గర ఉండాలని చెప్పారు. దీంతో గతేడాది ఇంటి దగ్గర ఉంటూ సాయంత్రం చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ పొలం పనులకు వెళ్లేది. అయితే ఆ బాలికలో చదువుకోవాలన్న కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ఈ క్రమంలో బాలికకు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం వరమైంది. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారుల బృందం బుధవారం ఇంటింటికీ తిరుగుతూ ఆ బాలిక ఇంటికి చేరుకున్నారు. తాను పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నానని, తాను ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేదని, ఆ దిశగా తనకు సాయం చేసి.. తన తల్లిదండ్రులను కూడా తనను చదివించేలా ఒప్పించాలని కోరింది. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. మరుసటి రోజు బాలిక ఉదంతం మీడియాలో రావడంతో పాటు ఎమ్మెల్యే కూడా ఆదేశించడంతో కలెక్టర్ డాక్టర్ సృజన వెంటనే స్పందించారు. బాలికను, ఆమె తల్లిదండ్రులను తన క్యాంపు కా>ర్యాలయానికి పిలిపించి మాట్లాడి.. నిర్మలను కాలేజీలో చే ర్పిం చేందుకు మార్గం సుగమం చేశారు. తాను ఐపీఎస్ అయి దేశానికి సేవ చేస్తానని నిర్మల సంతోషంగా చెప్పింది. -
Fact Check: భూకబ్జా అంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. వాస్తవాలు ఇవిగో!
తప్పుడు ప్రచారాలు చేయడం తమకు మించినవారు లేరని మళ్లీమళ్లీ చాటుకుంటోంది ఎల్లో మీడియా. ఇప్పటికి ఇప్పుడు ఓ కట్టుకథను సృష్టించారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఆయన కుమారుడు జయమనోజ్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని మీడియా ప్రచారానికి తెగించారు. ఆ కథలోని వాస్తవాలేంటో.... అవాస్తవాలేంటో మీరే గమనించండి. ఆదోనిలో ఉండే శంషుద్దీన్... అప్పుల బాధ తట్టుకోలేక నాలుగైదుసార్లు మధ్యవర్తుల చుట్టూ తిరిగి రెండు సంవత్సరాల క్రితం భూమిని అమ్ముకున్నారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కుమారుడు జయమనోజ్ రెడ్డి, ఆయనతో పాటి మరి కొంతమంది భాగస్వాములకు ఆ భూమిని అమ్మారు. ఈ విషయం భూమి అమ్మిన యజమాని శంషుద్దీనే చెబుతున్నారు. శంషుద్దీన్‌కు ఇద్దరు భార్యలు. ఆయన పెద్ద భార్య ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పిల్లలను తీసుకుని, ఆస్తిని పంచుకుని వెళ్లిపోయింది. అయితే ఆమె కుమారులు రెండేళ్ల క్రితం అమ్మిన భూమిలో వాటా కావాలని వచ్చారు. తమకు తెలీకుండా ఎలా అమ్ముతారని తండ్రితో గొడవ పెట్టుకున్నారు. అంతే కాదు వారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారిని కలిసి తమ ఇంటి గొడవను వారికి వినిపించారు. వారు కథను మలుపు తిప్పి, కుటుంబ గొడవను కాస్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాయిప్రసాద్, ఆయన కుమారుడిపైకి మళ్లించారు. వారిని భూకబ్జాదారులుగా తేల్చారు. ఇలా ఛానెల్ ద్వారా బురద చల్లారు. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెబుతున్నదంతా అబద్దమని...తన తండ్రే అప్పులు తీర్చడానికి భూమిని అమ్ముకున్నానని శంషుద్దీన్ రెండవ భార్య కుమారుడు అల్తాఫ్ స్పష్టం చేశారు. వాస్తవాలు తెలియకుండా కుటుంబ గొడవను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేపై బురద చల్లడం న్యాయం కాదని అంటున్నారు. శంషుద్దీన్ కూతురు రెండో భార్య కూతుర రమీజా కూడా ఇదే మాట చెబుతోంది. మా పెద్దమ్మ కొడుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మా పరిస్థితుల కారణంగా భూమిని అమ్ముకున్నామని స్పష్టం చేసింది. ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ వార అపనిందలు వేయడం సమంజసం కాదని అంటోంది రమిజ, శంషుద్దీన్ కూతురు. శంషుద్దీన్ దగ్గరనుంచి రెండు సంవత్సరాల క్రితం భూమిని కొన్నామని... అన్ని నియమ నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేయడం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. భూమికి సంబంధించి శంషుద్దీన్ కుటుంబంలో అభిప్రాయబేధాలు వస్తే వాటిని ఆధారం చేసుకొని తమపై నిందలు వేశారని, తప్పుడు వార్తను ప్రసారం చేశారని ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం బురద చల్లడం వారికి అలవాటైపోయిందని ఈసారి తప్పకుండా ఏబీఎన్‌పై పరువునష్టం దావా వేస్తామని అన్నారు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి. కళ్లెదుట వాస్తవాలు కనిపిస్తున్నా దుష్ప్రచారాలతో వార్తలు అల్లడం ఎల్లోమీడియాకే చెల్లిందని, ఎమ్మెల్యేతో పాటు,శంషుద్దీన్ కుటుంబసభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కుటుంబగొడవలను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలకోసం అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని వారు కోరుతున్నారు. -
అల్లా.. జగన్ సీఎం కావాలి
సాక్షి, ఆదోని టౌన్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న ఖాజా గరీబ్ నవాజ్ దర్గాను గురువారం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నాయకు లు, సన్నిహితులు దర్శించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని ఖాజా గరీబ్ నవాజ్ దర్గాలో ఫాతెహాలు చేశారు. అదేవిధంగా పుష్కర్‌లోని బ్రహ్మస్వామి దేవాలయాన్ని సాయి ప్రసాద్‌రెడ్డి బృందం దర్శించుకుంది. స్వామివారికి పూజలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురువాలని, పాడిపంటలతో అన్నదాతలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని స్వామివారిని కోరినట్లు సాయి ప్రసాద్‌రెడ్డి ఫోన్లో తెలిపారు. వారం రోజుల్లో వెలుబడే ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఈ సందర్భంగా సాయి ధీమా వ్యక్తం చేశారు. 120 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. సీఎం చంద్రబాబు శకం వచ్చే గురువారంతో ముగి యనుందని చెప్పారు. నీరజ్ డాంగిని కలిసిన సాయి రాజస్థాన్ రాష్ట్రం మాజీ హోంమంత్రి దినేష్ డాంగి తనయుడు, ప్రస్తుత రాజస్థాన్ పీసీసీ ప్రధాన కార్యదర్శి నీరజ్ డాంగిని జైపూర్‌లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డితోపాటు సన్నిహితులు మురళీమోహన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రవికుమార్ రెడ్డి, సాయినాథ్‌రెడ్డి, మైనార్టీ నాయకులు మజార్ అహ్మద్, ఈషాబాషా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి నీరజ్‌డాంగికి శాలువా కప్పి పూలమాల వేసి సన్మానించారు. -
ఇక్కడ మీకేంటి పని?
ఆదోని టౌన్: సాయి డిగ్రీ కళాశాల పోలింగ్ కేం ద్రంలో మాజీ కౌన్సిలర్ లింగారెడ్డితోపాటు కొం దరు టీడీపీ నాయకులు ఉండడంతో గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాయి ప్రసాద్‌రెడ్డి భార్య శైలజారెడ్డి... ఇక్కడ మేకేంటి పని... ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడికి వచ్చిన ఆమె టీడీపీ నాయకుల గుంపును గమనించారు. ఓటర్ల ను ప్రలోభపెడుతూ... సైకిల్ గుర్తుకు ఓటేయా లని కోరుతున్న విషయాన్ని గమనించిన ఆమె మాజీ కౌన్సిలర్ లింగారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పోలింగ్ బూత్ ఇక్కడ కాదుకదా... ఎందుకొచ్చినట్లు... ఏమి చేస్తున్నారు... ఎన్నికల నిబంధనలు తెలియవా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అక్కడున్న పోలీసులు, మీడియా చుట్టుముట్టారు. లింగారెడ్డి ఓటరు కాదు.. ఏజెంటు కాదు... పోలింగ్ బూత్‌లో పనేంటని ప్రశ్నించారు. ఇంత దారుణంగా ప్రచారం చేస్తు న్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నాయకులు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. అదేవిధంగా అ ర్ధగేరి బసన్న గౌడ్ స్కూల్లోనూ పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. డీఎస్పీ వెంకటరాముడుతో మాట్లాడారు. టీడీపీ నాయకులు లోపలకు వచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు, -
ఆదోని పై పట్టెవరిది !
సాక్షి, అమరావతి : పూర్వం దక్షిణాది ధాన్యం మార్కెట్‌గా వెలుగొంది.. ఇప్పుడు దుస్తులు, బంగారం మార్కెట్‌కు కేంద్రంగా విరాజిల్లుతున్న ఆదోనికి ఘనమైన చారిత్రక నేపథ్యమే ఉంది. రెండో ముంబైగా వినుతికెక్కిన ఈ ప్రాంతం 16వ శతాబ్దములో యాదవుల పాలనలో ఉండేది. అప్పుట్లో దీనిపేరు యాదవగిరి. ముస్లింల పాలనలో ఆదవోని అయ్యింది. కాలక్రమంలో ఆదోనిగా రూపాంతరం చెందింది. బ్రిటిష్ పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలోని బళ్లారి జిల్లాలో భాగంగా ఉండేది. 1952లో ఏర్పడిన ఆదోని నియోజకవర్గానికి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు జరగ్గా.. ఆరుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర, ఒకసారి ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఒకసారి వైఎస్సార్ సీపీ గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ), కొంకా మీనాక్షినాయుడు (టీడీపీ) తలపడుతున్నారు. ఇక్కడి ఓటర్లు వైవిధ్యమైన తీర్పునిస్తూ ప్రతి ఎన్నికలోనూ ఆసక్తి గొలుపుతూ ఉంటారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానితో సంబంధం లేకుండా.. తమకు నచ్చిన, ఎప్పుడూ అండగా, అందుబాటులో ఉండే అభ్యర్థికే ఓట్లు వేసి ఎమ్మెల్యే గిరీని కట్టబెడుతుంటారు. ఈ ఎన్నికలలో జనసేన, బీజేపీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి సాయి ప్రసాద్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి కొంకా మీనాక్షినాయుడు మధ్యే ప్రధాన పోటీ ఉంది. టీడీపీ అభ్యర్థి కొంకా మీనాక్షినాయుడు గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి. నాలుగు కాలాలపాటు ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క పనీ చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎల్లారెడ్డిగారి సాయిప్రసాద్‌రెడ్డి హయాంలో పలు శాశ్వత పథకాలు ఆవిష్కారమయ్యాయి. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారనే విశ్వాసం ఓటర్లలో ఉంది. దీంతో ఈసారి ఎన్నికలో సాయిప్రసాద్‌రెడ్డి విజయం నల్లేరుమీద నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సైకిల్‌కు ఎదురు గాలి.. టీడీపీ అభ్యర్థి మీనాక్షినాయుడుతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణంలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుతో ఆదోనికి పూర్వ వైభవాన్ని తెస్తామని చెప్పారు. పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. మండగిరి నీటి పథకాల నిర్మాణం నత్తను తలపిస్తోంది. రాష్ట్రంలో అత్యంత పురాతనమైన మున్సిపాల్టీల్లో ఒకటైన ఆదోనిలో ఆక్రమణలతో రోడ్లు కుంచించుకుపోయాయి. రోజు, రోజుకు జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నిత్య నరకం చూస్తున్నారు. రోడ్లు విస్తరణ చేపడతామని, వైఎస్ఆర్ హయాంలో మంజూరు అయి, మూడింట ఒకవంతు మిగిలిపోయిన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కూడా ముఖ్యమంత్రితోపాటు టీడీపీ అభ్యర్థి కూడా ప్రజలకు మాట ఇచ్చారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా 8 గ్రామాలకు మాత్రం సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన 32 గ్రామాల రైతులు వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్నారు. కాలువను విస్తరించి తమ గ్రామాలకు కూడా సాగునీటి సదుపాయం కల్పించాలనే డిమాండ్ ఉంది. ఆ దిశగా ప్రతిపాదనలు ఏవీ లేవు. ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేరని హామీలతో టీడీపీకి నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తోంది. ఎన్నో పథకాలు.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి పలు శాశ్వత పథకాలు తెచ్చారు. ఆదోని పట్టణంలో రూ.32 కోట్లతో తాగునీటి పథకం మంజూరు చేయించారు. కుప్పగల్లు వద్ద రూ.8 కోట్లతో రెండు నీటి పథకాలు, తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ, పట్టణానికి బైపాస్ రోడ్డు, విక్టోరియా పేట, ఇస్వి ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. మున్సిపాల్టీలో 23 మంది కౌన్సిలర్లు, రూరల్‌లో 28 మంది తాజా మాజీ సర్పంచ్‌లు, 18 మంది ఎంపీటీసీలతో పాటు పార్టీకి పటిష్టమైన కేడర్ ఉంది. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
సర్వే పేరుతో ఓట్ల తొలగింపు
కర్నూలు, ఆదోని టౌన్: సర్వే పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సూచించారు. ఆదోని పట్టణంలో బుధవారం సర్వే చేస్తున్న రెండు బృందాలను వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కొన్ని రోజులనుంచి 50 మంది సర్వే చేస్తున్నారన్నారు. సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, సానుభూతిపరులని తేలితే ఓట్లను తొలగిస్తున్నారన్నారు. సర్వే పేరుతో ఇళ్లవద్దకు వచ్చే వారికి ఎలాంటి వివరాలు చెప్పవద్దని, ఆధార్, రేషన్‌కార్డులు చూపమని అడిగితే తమవద్ద లేవని సమాధానంగా చెప్పాలని ప్రజలకు సూచించారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, టీడీపీకి ఓటమి తప్పదని భావించే సీఎం చంద్రబాబు నాయుడు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఎవరైనా ఇంటివద్దకు వస్తే సమాచారం అందించాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సర్వే బృందంపై ఫిర్యాదు సర్వే ముసుగులో ఓట్లను తొలగిస్తున్నారని టూ టౌన్ సీఐ భాస్కర్, వన్‌టౌన్ సీఐ శ్రీనివాసులు, త్రీ టౌన్ సీఐ శ్రీరాములుకు వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. సర్వే చేస్తున్న యువకులపై తమకు సమాచారం అందించాలని, విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐలు.. వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలిపారు. ఆదోని పట్టణం ప్రధాన రోడ్డులోని లాడ్జీల్లో ఉంటూ యువకులు సర్వే చేస్తున్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు దేవా, నల్లారెడ్డి, యూత్ నాయకుడు శ్రీనివాసరెడ్డి తెలుసుకున్నారు. లాడ్జిలలోని యువకుల వద్దకు బుధవారం వెళ్లారు. ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ సంస్థ తరఫున సర్వే చేస్తున్నారు.. ఐడీ కార్డు ఇవ్వాలని అడగగా..యువకులు ఎలాంటి ఆధారాలు చూపలేదు. దీంతో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఎలాంటి ఆధారాలు లేకుండా సర్వే చేసున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రభుత్వ కుట్రను ప్రజలు తిప్పికొట్టారు
ఆదోని (కరర్నూలు): వైఎస్ఆర్సీపీ చేపట్టిన బంద్‌ను విఫలం చేయడానికి ప్రభుత్వం చేసిన కుట్రను ప్రజలు తిప్పికొట్టారని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ డిపో వద్ద ఆయన ఆందోళన కారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న వంచనను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన బంద్‌ను విఫలం చేయడం ద్వార ప్రత్యేక హోదా ఆకాంక్షను ప్రభుత్వం కాలరాయాలని చూసిందని విమర్శించారు. అయితే విజ్ఞులైన ప్రజలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రత్యేక హోదా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక హోదా కోసం నిజాయితీతో పోరాడాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం ప్రజలను వంచించడం మానుకోవాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతు అవుతాయని హెచ్చరించారు. అక్రమ సంపాదన కోసం ప్యాకేజికి ఒప్పుకుని, కుట్ర రాజకీయాలలో భాగంగా బీజేపీతో కలిసి నాటకాలాడుతున్నారని ఆయన సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని, అయితే చంద్రబాబే అడ్డుకుంటున్నట్లు ప్రజలకు అర్థం అయినందు వల్లే వైఎస్ఆర్సీపీ బంద్‌కు సంపూర్ణ మద్దతు పలికారని అన్నారు. వైఎస్సార్సీపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తోందని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని, ఇకపై చంద్రబాబు ఆటలు సాగవని హెచ్చరించారు. -
ఏపీజీబీ మేనేజర్ దుర్మరణం
మరి కొందరు బ్యాకర్లకు తీవ్ర గాయాలు కదిరి : కదిరి-పులివెందుల రహదారిలో నామాలగుండు సమీపంలో సోమవారం లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కదిరి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆర్ఎం ఆఫీసులో మేనేజర్‌గా పనిచేస్తున్న సాయిప్రసాద్‌రెడ్డి(55) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న ఆయన తోటి సీనియర్ మేనేజర్ రాఘవేంద్రప్రసాద్, ఇతని భార్య కదిరి మెయిన్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా ఉన్న వకులాదేవి, ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న నవనీశ్వర్, ఇతని సతీమణి పులివెందుల జేఎన్టీయూలో పనిచేస్తున్న శరణ్య, వీరి రెండేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం 108లో పులివెందులలో గంగిరెడ్డి ఆసుపత్రికి తరలించారు. తలుపుల ఎస్ఐ గోపాలుడు కథనం ప్రకారం... మృతుడు సాయిప్రసాద్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా కడపలో టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న బాలాజీ పేటలో కాపురం ఉంటున్నారు. నిత్యం తన సొంత కారులో విధులకు హాజరయ్యేవారు. కదిరిలోనే కాపురం ఉంటూ కడపలో ఉంటున్న తమ తల్లిదండ్రులను చూడ్డానికి వెళ్లిన నవనీశ్వర్, రాఘవేంద్ర ప్రసాద్ కుటుంబసభ్యులు సైతం సాయిప్రసాద్ వెంట కారులో సోమవారం విధులకు హాజరయ్యేందు బయలుదేరారు. నామాలగుండు సమీపంలోని మలుపు వద్ద కదిరి వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఆ కారును బలంగా ఢీ కొనడంతో కారు పూర్తిగా నుజ్జు జుజ్జు అయిపోయింది. కారు డ్రైవ్ చేస్తున్న సాయిప్రసాద్ గుండెలమీద బలంగా వత్తిడి పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మిగిలిన వారు దిక్కుకొకరు దూరంగా పడిపోయారు. సాయిప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు బాగా శ్రమించారు. అనంతరం కదిరి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య స్వర్ణలత, కుమార్తె దివ్యసాయి ఉన్నారు. తీవ్రంగా గాయపడి పులివెందులలో చికిత్స పొందుతున్న వారికెవ్వరికీ ప్రాణాపాయం లేదని అక్కడి వైద్యులు తెలిపారు. మృతుని కుటుంబసభ్యులను, గాయపడిన వారిని ఏపీజీబీ ఆర్ఎం ప్రతాప్‌రెడ్డి, మిగిలిన ఆ బ్యాంకు ఉద్యోగులు పరామర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కులమతాలకు అతీతంగా వేడుకలు నిర్వహించుకుందాం
అల్లర్లు అందరికి నష్టదాయకమే ఆదోని: కుల,మత బేధం లేకుండా కలిసిమెలసి వేడుకలను నిర్వహించుకుందామని ముస్లిం మత పెద్ద కతీఫ్సాహెబ్, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అల్తాఫ్, మరికొంతమంది ఆయా వర్గాల పెద్దలతో కలిసి ఆదివారం రాత్రి కతీఫ్ సాహెబ్ ఇంటికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సాహెబ్ ఇంటి నుంచి ప్రజలను ఉద్దేశించి ఇరువురు మాట్లాడారు. ఆదోని పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోయినా కొందరు అదేపనిగా పుకార్లు సృష్టిస్తున్నారని..వాటిని నమ్మవద్దని కోరారు. పరస్పర సహకారం లేనిదే సుఖమయ ప్రశాంత జీవనం గడపలేమని పేర్కొన్నారు. బక్రీద్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఇటీవల వినాయక చవితి, దసరా మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని గుర్తు చేశారు. అంతకుముందు జిల్లా ఎస్పీ ఆకె రవిక్రిష్ణ, డీఎస్పీ శివరామిరెడ్డితో ఎమ్మెల్యే, కతీఫ్ సాహెబ్ ఫోన్లో మాట్లాడారు. పట్టణంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేదని, అయితే.. అవసరమైన పోలీస్ బందోబస్తును నియమించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆకె రవి కృష్ణ సమాచారం అందుకుని ఆదోని చేరుకుని పరిస్థితి సమీక్షించారు.