Fact Check: భూకబ్జా అంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. వాస్తవాలు ఇవిగో! | Fact Check:Yellow Media False Allegation On MLA Sai Prasad Reddy | Sakshi
Sakshi News home page

Fact Check: భూకబ్జా అంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. వాస్తవాలు ఇవిగో!

Published Sat, Sep 10 2022 3:51 PM | Last Updated on Sat, Sep 10 2022 4:23 PM

Fact Check:Yellow Media False Allegation On MLA Sai Prasad Reddy - Sakshi

ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి(ఫైల్‌పోటో)

తప్పుడు ప్రచారాలు చేయడం తమకు మించినవారు లేరని మళ్లీమళ్లీ చాటుకుంటోంది ఎల్లో మీడియా. ఇప్పటికి ఇప్పుడు ఓ కట్టుకథను సృష్టించారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఆయన కుమారుడు జయమనోజ్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని మీడియా ప్రచారానికి తెగించారు.  ఆ కథలోని వాస్తవాలేంటో.... అవాస్తవాలేంటో మీరే గమనించండి.

ఆదోనిలో ఉండే శంషుద్దీన్... అప్పుల బాధ తట్టుకోలేక నాలుగైదుసార్లు మధ్యవర్తుల చుట్టూ తిరిగి రెండు సంవత్సరాల క్రితం  భూమిని అమ్ముకున్నారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి కుమారుడు జయమనోజ్ రెడ్డి, ఆయనతో పాటి మరి కొంతమంది భాగస్వాములకు ఆ భూమిని అమ్మారు. ఈ విషయం భూమి అమ్మిన యజమాని శంషుద్దీనే చెబుతున్నారు. శంషుద్దీన్‌కు ఇద్దరు భార్యలు. ఆయన పెద్ద భార్య ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పిల్లలను తీసుకుని, ఆస్తిని పంచుకుని వెళ్లిపోయింది. 

అయితే  ఆమె కుమారులు రెండేళ్ల క్రితం అమ్మిన భూమిలో వాటా కావాలని వచ్చారు. తమకు తెలీకుండా ఎలా అమ్ముతారని తండ్రితో గొడవ పెట్టుకున్నారు. అంతే కాదు వారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారిని కలిసి తమ ఇంటి గొడవను వారికి వినిపించారు. వారు కథను మలుపు తిప్పి, కుటుంబ గొడవను కాస్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాయిప్రసాద్, ఆయన కుమారుడిపైకి మళ్లించారు. వారిని భూకబ్జాదారులుగా తేల్చారు. 

ఇలా ఛానెల్ ద్వారా బురద చల్లారు. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెబుతున్నదంతా అబద్దమని...తన తండ్రే అప్పులు తీర్చడానికి  భూమిని అమ్ముకున్నానని శంషుద్దీన్ రెండవ భార్య  కుమారుడు అల్తాఫ్ స్పష్టం చేశారు. వాస్తవాలు తెలియకుండా కుటుంబ గొడవను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేపై బురద చల్లడం న్యాయం కాదని అంటున్నారు. 

శంషుద్దీన్ కూతురు రెండో భార్య కూతుర రమీజా  కూడా ఇదే మాట చెబుతోంది. మా పెద్దమ్మ కొడుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మా పరిస్థితుల కారణంగా భూమిని అమ్ముకున్నామని స్పష్టం చేసింది. ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ వార అపనిందలు వేయడం సమంజసం కాదని అంటోంది రమిజ, శంషుద్దీన్ కూతురు. 

శంషుద్దీన్ దగ్గరనుంచి రెండు సంవత్సరాల క్రితం భూమిని కొన్నామని... అన్ని నియమ నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేయడం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. భూమికి సంబంధించి శంషుద్దీన్ కుటుంబంలో అభిప్రాయబేధాలు వస్తే వాటిని ఆధారం చేసుకొని తమపై  నిందలు వేశారని, తప్పుడు వార్తను ప్రసారం చేశారని ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం బురద చల్లడం వారికి అలవాటైపోయిందని ఈసారి తప్పకుండా ఏబీఎన్‌పై పరువునష్టం దావా వేస్తామని అన్నారు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి.

కళ్లెదుట వాస్తవాలు కనిపిస్తున్నా దుష్ప్రచారాలతో వార్తలు అల్లడం ఎల్లోమీడియాకే చెల్లిందని, ఎమ్మెల్యేతో పాటు,శంషుద్దీన్ కుటుంబసభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కుటుంబగొడవలను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలకోసం అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని వారు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement