Girl Appeal To The Government For Higher Studies In Gadapa Gadapaku Mana Prabutvam - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: వారికి దారిచూపిన ‘గడప గడపకు’

Published Fri, Jun 30 2023 5:02 AM | Last Updated on Fri, Jun 30 2023 11:39 AM

Girls appeal to the government - Sakshi

కర్నూలు(సెంట్రల్‌) : నిర్మల కోరిక నెరవేరింది. చదువుకోవడానికి మార్గం సుగమమైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. తాను చదు­వుకుంటానని.. అందుకు తన తల్లిదండ్రుల­ను ఒప్పించాలని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని కోరడంతో కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన స్పందించారు. బాలికను ఆస్పరి కస్తూర్బా జూనియర్‌ కాలేజీలో బైపీసీ గ్రూప్‌లో ఇంటర్‌ చదివేందుకు సీటు ఇప్పించారు. భవిష్యత్‌లోనూ ఆ బాలిక చదువుకు ఆటంకాలు లేకుండా చూస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భర్తిస్తుందని భరోసా ఇచ్చారు.

ఆదోని మండలం పెద్ద హరివణంకు చెందిన శ్రీనివాసులు, అనుమంతమ్మ దంపతులకు నలుగురు కుమా­ర్తెలు. వీరిలో నిర్మల చిన్న కుమార్తె. మిగిలిన ము­గ్గురికి పెళ్లిళ్లయ్యాయి. నిర్మల చిన్నతనం నుంచే చదువులో రాణిస్తుండటంతో తల్లిదండ్రులు పదో తరగతి వరకు చదివించారు. 2022 మార్చి­లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 537 మార్కులు తెచ్చుకుంది. అయితే తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత ఆ బాలిక ఉన్నత చదువులకు శాపమైంది. చదువుకుంటానంటే తమకు అంత స్థోమత లేదని, ఇంటి దగ్గర ఉండాలని చెప్పారు. దీంతో గతేడాది ఇంటి దగ్గర ఉంటూ సాయంత్రం చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ పొలం పనులకు వెళ్లేది.

అయితే ఆ బాలికలో చదువుకోవాలన్న కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ఈ క్రమంలో బాలికకు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం వరమైంది. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారుల బృందం బుధవారం ఇంటింటికీ తిరుగుతూ ఆ బాలిక ఇంటికి చేరుకున్నారు. తాను పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నానని, తాను ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేదని, ఆ దిశగా తనకు సాయం చేసి.. తన తల్లిదండ్రులను కూడా తనను చదివించేలా ఒప్పించాలని కోరింది.

అందుకు ఎమ్మెల్యే సాను­కూ­లంగా స్పందించి వారి తల్లిదండ్రులతో మా­ట్లాడారు. మరుసటి రోజు బాలిక ఉదంతం మీడియాలో రావడంతో పాటు ఎమ్మెల్యే కూడా ఆదేశించడంతో కలెక్టర్‌ డాక్టర్‌ సృజన వెంటనే స్పందించారు. బాలికను, ఆమె తల్లిదండ్రులను తన క్యాంపు కా>ర్యాలయానికి పిలిపించి మా­ట్లా­డి.. నిర్మల­ను కాలేజీలో చే ర్పిం చేందుకు మార్గం సుగమం చేశారు. తాను ఐపీఎస్‌ అయి దేశానికి సేవ చేస్తానని నిర్మల సంతోషంగా చెప్పింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement