Srujana
-
ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు!
కర్నూలు: సార్వత్రిక ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే అవకాశం ఉండటంతో ఏర్పాట్లపై జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. వీటితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ , కౌంటింగ్ కేంద్రాల్లో పని చేసేందుకు అవసరమైన ఉద్యోగుల వివరాల సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకోసం ట్రేజరీస్ డీడీ, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో మ్యాన్ పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో నివేదికకు సిద్ధం ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండడానికి సమాయత్తం అవుతోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను నియమించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల వివరాలు సేకరణ కోసం ఏర్పాటు చేసిన మ్యాన్‌పవర్ కమిటీ తన విధులను ప్రారంభించింది. అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్, జూనియర్ , సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు, వివిధ శాఖల ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసే ఏఈలు, డీఈలు, ఈఈలు, ఎస్ఈలు డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, జేసీలు, కలెక్టర్ వరకు ఇలా అన్ని స్థాయిలా అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఒకటి, రెండు రోజుల్లో దాదాపు 33 శాఖల్లో పనిచేసే అధికారుల వివరాలను నివేదించేందుకు మ్యాన్ పవర్ కమిటీ సిద్ధమవుతోంది. 18 వేల మంది సిబ్బంది అవసరం.. ఎన్నికల విధుల్లో ప్రధానంగా పోలింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలతోపాటు ఇతర విధుల్లో పాల్గొనేందుకు జిల్లాకు 18 వేల మంది సిబ్బంది అవసరం అవుతారు. జిల్లాలో 2,186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రైసెడింగ్ ఆఫీసర్, ఒక అడిషినల్ ప్రైసెడింగ్ ఆఫీసర్, నలుగురు అదర్ ప్రైసెడింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఈ లెక్కన దాదాపు 13,116 మంది సిబ్బంది అవసరం అవుతారు. అంతేగాక మరో 2 వేల మంది వరకు రిజర్వ్‌లో ఉండేందుకు అవసరం. వీరితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ తోపాటు ఇతర విధులకోసం మరో 3 వేల వరకు సిబ్బంది అవసరం అవుతారు. పోలీసులు కాకుండానే జిల్లాలో మొత్తంగా దాదాపు 18 వేల మంది వరకు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల విధుల్లో సెక్టోరల్, నోడల్ ఆఫీసర్లు ఇప్పటికే 20 మందిని నోడల్ అధికారులుగా నియమించగా.. వారు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో 234 మంది సెక్టోరల్ ఆఫీసర్లను నియమించారు. వీరంతా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. పోలీసులకు సంబంధించి 234 మంది పోలీసు సెక్టోరల్ అధికారులను నియమించారు. వీరు పోలింగ్ కేంద్రాల భద్రత అంశాలపై పరిశీలన చేస్తున్నారు. వీరంతా కూడా ఒకటి, రెండురోజుల్లో కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఎంపికై న ఉద్యోగులకు శిక్షణ ఇస్తాం సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాం. సిబ్బంది ఎంపిక కోసం మ్యాన్ పవర్ కమిటీని నియమించాం. ఒకటి, రెండు రోజుల్లో నివేదికలు వస్తాయి. ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తాం. – డాక్టర్ జి.సృజన, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికార ఇవి చదవండి: ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ -
అభాగ్యులకు ఆపన్నహస్తం
కర్నూలు(సెంట్రల్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభాగ్యులకు ఆపన్నహస్తం అందించారు. గురువారం ఎమ్మిగనూరుకు వచ్చిన ఆయనను పలువురు కలిసి తమ బాధలు చెప్పుకోవడంతో సీఎం చలించిపోయారు. తక్షణ సాయం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.సృజనకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమె తన కార్యాలయంలో ఆరుగురు బాధితులకు రూ.లక్ష చొప్పున సాయం అందించారు. అలాగే సీఎంను ఉద్యోగాలు అడిగిన వారికి ఉపాధి కల్పన అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన బాధితుల వివరాలు ♦ కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన యు.అశోక్ ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ♦ గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామానికి చెందిన కురువ రాజు కుమార్తె అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ♦ ఎమ్మిగనూరుకు చెందిన షేక్ రేష్మకు బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా రెండు కళ్లు కోల్పోయింది. ♦ ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామానికి చెందిన బి.భాస్కర్ కుడి కాలు ఆపరేషన్ చేయించుకుని ఆరి్థకంగా చితికిపోయారు. ♦ గోనెగండ్ల మండలం పెద్దమరివీడు గ్రామానికి చెందిన డి.ఖాజావలి ఆరేళ్లుగా కిడ్నీ, యూరిన్ బ్లాడర్ సమస్యతో బాధపడుతున్నారు. ♦ ఎమ్మిగనూరుకు చెందిన గొల్ల లక్ష్మన్న కుమార్తె శ్రావణి మానసిక జబ్బుతో బాధపడుతోంది. -
Andhra Pradesh: వారికి దారిచూపిన ‘గడప గడపకు’
కర్నూలు(సెంట్రల్) : నిర్మల కోరిక నెరవేరింది. చదువుకోవడానికి మార్గం సుగమమైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. తాను చదువుకుంటానని.. అందుకు తన తల్లిదండ్రులను ఒప్పించాలని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని కోరడంతో కలెక్టర్ డాక్టర్ జి.సృజన స్పందించారు. బాలికను ఆస్పరి కస్తూర్బా జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూప్‌లో ఇంటర్ చదివేందుకు సీటు ఇప్పించారు. భవిష్యత్‌లోనూ ఆ బాలిక చదువుకు ఆటంకాలు లేకుండా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భర్తిస్తుందని భరోసా ఇచ్చారు. ఆదోని మండలం పెద్ద హరివణంకు చెందిన శ్రీనివాసులు, అనుమంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో నిర్మల చిన్న కుమార్తె. మిగిలిన ముగ్గురికి పెళ్లిళ్లయ్యాయి. నిర్మల చిన్నతనం నుంచే చదువులో రాణిస్తుండటంతో తల్లిదండ్రులు పదో తరగతి వరకు చదివించారు. 2022 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 537 మార్కులు తెచ్చుకుంది. అయితే తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత ఆ బాలిక ఉన్నత చదువులకు శాపమైంది. చదువుకుంటానంటే తమకు అంత స్థోమత లేదని, ఇంటి దగ్గర ఉండాలని చెప్పారు. దీంతో గతేడాది ఇంటి దగ్గర ఉంటూ సాయంత్రం చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ పొలం పనులకు వెళ్లేది. అయితే ఆ బాలికలో చదువుకోవాలన్న కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ఈ క్రమంలో బాలికకు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం వరమైంది. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారుల బృందం బుధవారం ఇంటింటికీ తిరుగుతూ ఆ బాలిక ఇంటికి చేరుకున్నారు. తాను పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నానని, తాను ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేదని, ఆ దిశగా తనకు సాయం చేసి.. తన తల్లిదండ్రులను కూడా తనను చదివించేలా ఒప్పించాలని కోరింది. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. మరుసటి రోజు బాలిక ఉదంతం మీడియాలో రావడంతో పాటు ఎమ్మెల్యే కూడా ఆదేశించడంతో కలెక్టర్ డాక్టర్ సృజన వెంటనే స్పందించారు. బాలికను, ఆమె తల్లిదండ్రులను తన క్యాంపు కా>ర్యాలయానికి పిలిపించి మాట్లాడి.. నిర్మలను కాలేజీలో చే ర్పిం చేందుకు మార్గం సుగమం చేశారు. తాను ఐపీఎస్ అయి దేశానికి సేవ చేస్తానని నిర్మల సంతోషంగా చెప్పింది. -
మర్డర్ మిస్టరీ
అరుణ్, సృజన జంటగా సురేష్ రెడ్డి దర్శకత్వంలో ‘వేటాడతా’ చిత్రం తెరకెక్కుతోంది. ఎమ్.అంకయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. వైజాగ్ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సాయివెంకట్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత నాగులపల్లి పద్మిని స్క్రిప్ట్ అందించగా, నిర్మాత రామ సత్యనారాయణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ అండ్ మర్డర్ మిస్టరీగా ‘వేటాడతా’ చిత్రం రూపొందుతోంది. ఈ నెలాఖరులో షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం. అరకు, హైదరాబాద్, నంద్యాల ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు అంకయ్య. ‘‘మా నాన్న(అంకయ్య) సిద్ధం చేసిన కథతో హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు అరుణ్. ఈ సినిమాకు సహ–నిర్మాత: డి.శివ ప్రసాద్, సంగీతం: శేఖర్ మోపూరి. -
కర్నూలు మొదటి మహిళా జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ సృజన (ఫోటోలు)
-
కర్నూలు జిల్లా నూతన కలెక్టర్‌గా సృజన పదవి బాధ్యతలు
-
మొదలైన పెట్టుబడుల కార్యాచరణ
సాక్షి, అమరావతి: విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. సదస్సులో కుదిరిన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తీసుకురావడానికి సీఎస్ చైర్మన్‌గా 17 మంది సభ్యులతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. వీరితో పాటు వ్యవసాయ, పశు సంవర్థక, ఆర్థిక, ఇంధన, జలవనరులు, పర్యాటక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జీఏడీ (కో–ఆర్డినేషన్), స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్లానింగ్, ఐటీ–ఐటీఈఎస్, ట్రాన్‌పోర్ట్ శాఖల కార్యదర్శలు సభ్యులుగా ఉంటారు. వీరుకాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారు. ప్రతీ శాఖలో కుదరిన ఒప్పందాలను ఆయా ఇన్వెస్టర్లతో సమీక్షించి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పటిలోగా ఉత్పత్తిలోకి తీసుకొస్తారన్న అంశాలపై ఒక అజెండాను రూపొందించి ఆ వివరాలను పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు సమీక్ష కోసం మానిటరింగ్ కమిటీకి ఇవ్వాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇక మానిటరింగ్ కమిటీ తరచూ సమావేశమై పెట్టుబడులను త్వరితగతిన వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఉన్న అడ్డంకులు, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. విశాఖ జీఐఎస్–2023 సమావేశాల సందర్భంగా మొత్తం 386 ఒప్పందాలు జరిగినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో పాటు 6,07,383 మందికి ఉపాధి లభించనుంది. ప్రతీ 15రోజులకోసారి సమీక్షిస్తాం జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజ ప్రముఖలను విశాఖకు తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం ఇప్పుడు వాటిని వాస్తవరూపం తీసుకురావడంపై దృష్టిసారించింది. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలు ఎప్పటిలోగా ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నాయో అన్న దానిపై సమాచారం సేకరించి దానికనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలి సమావేశం గత శుక్రవారం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఇలా ప్రతీ 15 రోజులకొకసారి సమావేశమై ఎంఓయూల పరిస్థితిని సమీక్షిస్తాం. – జి. సృజన, రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ -
మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్
సాక్షి, అమరావతి: మత్స్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ ఉత్పత్తులు భేష్ అని జర్మనీలో భారత్ రాయబారి పర్వతనేని హరీష్ ప్రశంసించారు. స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఉంటే వాటికి అంతర్జాతీయ మార్కెట్ ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఎగుమతుల్లో ఏపీకి ఎదురుండదన్నారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఉద్యానవన పంటలకు అంతర్జాతీయ జీఏపీ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్) సర్టిఫికేషన్‌పై దృష్టి పెడితే రెట్టింపు ఎగుమతులు సాధ్యమన్నారు. ఉత్పత్తిలో నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్‌లపై దృష్టి పెడితే ఏపీ మరింత రాణిస్తుందని చెప్పారు. మత్స్య ఆధారిత ఉత్పత్తులకు విలువ జోడింపు వల్ల రెట్టింపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఆ దిశగా ఏపీ ముందడుగు వేయాలన్నారు. ఏపీలో ఆయా ఉత్పత్తుల వ్యర్థాల ద్వారా బయో మీథేన్.. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయని వివరించారు. అలాగే రాష్ట్రం నుంచి జర్మనీకి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తుల ప్రదర్శనను హరీష్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఎగుమతులపై చర్చించారు. అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. ఇప్పటిదాకా ఏపీలో 1,006 భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.2,35,152 కోట్ల పెట్టుబడులు, 4,66,738 మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. దేశం నుంచి సరుకుల ఎగుమతుల్లో గతేడాది ఏపీ నాలుగో స్థానంలో నిలిచిందని వివరించారు. మరోవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ ఉందన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన లీడ్స్–2022 ర్యాంకుల్లో తీర ప్రాంత రాష్ట్రాల్లో ఏపీ మొదటి ర్యాంకు దక్కించుకుందని తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్రం సాధించిన పురోగతిని తెలిపే వివిధ అంశాలపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. గత మూడేళ్ల కాలంలో 106 యూనిట్లు ప్రారంభించడం ద్వారా రూ.44,802 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా 68,418 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సింగిల్ డెస్క్ పోర్టల్‌లో 90 రకాల ఆన్లైన్ సేవలను పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాష్ట్రానికి దేశంలో పోటీ లేదన్నారు. అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువు ఏపీలో అన్ని రకాల పెట్టుబడులకు ’ఈడీబీ’ కేంద్ర బిందువుగా ఉంటుందని ఏపీఈడీబీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ సావరపు తెలిపారు. ఎలక్ట్రానిక్, సోలార్, ఫార్మా, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, బొమ్మలు, ఫర్నీచర్ తయారీ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నట్లు వెల్లడించారు. 2050 కల్లా పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ అవతరించేలా, లాజిస్టిక్ హబ్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మొత్తం 1,362 అమృత్ సరోవర్లను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ‘మిషన్ అమృత్ సరోవర్’పై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా చేనేత, జౌళి వస్త్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత వెల్లడించారు. పెడనలో తయారయ్యే కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలా చేరాయన్నారు. నార్వే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేయగలిగే ఉత్పత్తుల జాబితాపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. పండ్లు, చేపల ఉత్పత్తికి ఏపీ చిరునామాగా మారిందని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో ఉల్లిపాయలు, అనంతపురంలో దానిమ్మ, విజయనగరంలో ఒక రకమైన ఎరుపు, పసుపు రంగు మామిడిపండ్లు, గుంటూరు మిర్చి, ఏలూరులో బాదం, నెల్లూరులో నిమ్మ, శ్రీకాకుళం జీడిపప్పు, కోనసీమ కొబ్బరి వంటివాటితో ఏపీ ప్రత్యేకత సంతరించుకుందన్నారు. వీటిలో రెట్టింపు ఎగుమతులు సాధించే దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు. -
3టీ విధానంతో జర్మనీ, నార్వేకు ఎగుమతులు
సాక్షి, అమరావతి: ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా జర్మనీ, నార్వే దేశ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ దేశాలతో టూరిజం, ట్రేడ్ (వ్యాపారం), టెక్నాలజీ ‘3టీ’ల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఏపీఐఐసీ కార్యాలయంలో నార్వే, జర్మనీ దేశాల ఎగుమతి, దిగుమతిదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి నార్వే, జర్మ నీ దేశాల్లోని భారత రాయబారులు బి.బాలభాస్కర్, పి.హరిష్ హాజరుకానున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన తెలిపారు. రాష్ట్రం నుంచి ఎగుమతికి అవకాశం ఉన్న ఉత్పత్తులు, సులభతర వాణిజ్యం కోసం అమలు చేస్తున్న ప్రణాళికలను జర్మనీ, నార్వే దేశ రాయబారులకు వివరించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉద్యాన ఉత్పత్తులు, మత్స్య సంపద, చేనేత, టెక్స్టైల్తోపాటు టూరిజం వంటి రంగాలపై దృష్టి సారించామని, మంగళవారం సమావేశానికి ఆయా రంగాల భాగస్వాములు హాజరవుతారని తెలిపారు. అలాగే ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా ఆయా జిల్లాలకు చెందిన ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలను వివరిస్తామని, ఇందులో భాగంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కాకినాడ జిల్లా ఉత్పత్తులను ఆయా జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా వివరించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్యర్యంలో అమలవుతున్న అమృత్ సరోవర్ కార్యక్రమం వివరాలను కూడా వివరిస్తారు. రాష్ట్రం నుంచి 2021–22లో రూ.1,43,843.19 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇది దేశీయ మొత్తం ఎగుమతుల్లో 5.5 శాతం. దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగానే దేశంలోఎక్కడా లేనివిధంగా ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రూ.25,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు భావనపాడు, రామాయపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, మచిలీపట్నం వద్ద పోర్టు ఆధారిత భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇవన్నీ పూర్తయి, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
ప్రేమను చంపుకోలేక.. ప్రాణం తీసుకుంది
పీఎం పాలెం (భీమిలి): నవ వధువు సాయి సృజన మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రేమ కోసం పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మధురవాడలో ఈ నెల 11న నవ వధువు సాయి సృజన పెళ్లి పీటలపై కుప్పకూలిపోవడం.. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని విష పదార్థం తీసుకోవడం వల్లే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించడంతో అనుమానాస్పద మృతిగా పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండటం, ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో గన్నేరు పప్పు తొక్కు కనిపించడం.. మరోవైపు ఆమె ఫోన్లోని కొంత సమాచారం డిలీట్ చేసి ఉండటంతో సాంకేతికత సాయంతో దర్యాప్తు చేశారు. డిలీట్ చేసిన సమాచారాన్ని కాల్ డయల్ రికార్డర్ (సీడీఆర్) సాయంతో వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రేమించిన యువకుడితో కాకుండా వేరే వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లికి నిర్ణయించడంతో ఆ వివాహాన్ని ఆపాలని ఆమె ప్రయత్నించిందని.. ఈ క్రమంలో తీసుకున్న విషపదార్థం మోతాదు మించడంతో ఆరోగ్యం విషమించి చనిపోయిందని పోలీసులు నిర్థారించారు. ఇంటర్లో చిగురించిన ప్రేమను చంపుకోలేక.. బంధువుల ఇంట్లో ఉంటూ పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలోని విజ్ఞాన్ కాలేజీలో 2015లో ఇంటర్ చదివే సమయంలో సాయి సృజనకు అదే కళాశాలలో చదువుతున్న తోకాడ మోహన్(24)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇంటర్ పూర్తయ్యాక సృజన హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అయినప్పటికీ వీరి మధ్య గత ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో 2021లో మోహన్ హైదరాబాద్ వెళ్లడంతో మరింత దగ్గరై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, సరైన ఉద్యోగం వచ్చే వరకు నిరీక్షించాలని మోహన్ కోరాడు. ఈ క్రమంలో సృజనకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించి ఈ నెల 11న ముహూర్తం ఖరారు చేశారు. విశాఖ నగర శివారు మధురవాడలో వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడు మోహన్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో సృజన చాటింగ్ చేస్తూ... తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ఎలాగైనా తీసుకెళ్లిపోమని కోరింది. ఉద్యోగం లేకుండా తీసుకెళ్లలేనని, కొన్నాళ్లు నిరీక్షించాలని మోహన్ బదులిచ్చాడు. అందుకోసం పెళ్లి ఎలాగైనా ఆపుతానని సృజన చెప్పడంతో.. ఎటువంటి అఘాయిత్యం చేసుకోవద్దని మోహన్ కోరాడు. దీనికి తన జాగ్రత్తలో తానున్నానని, ఎలాగైనా పెళ్లి ఆపుతానని ఆమె బదులిచ్చింది. అనంతరం ఈ వ్యవహారంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఫోనులోని వివరాలు డిలీట్ చేసేసింది. తర్వాత పెళ్లి ఆపాలన్న ఉద్దేశంతో ఈ నెల 10న ఆస్పత్రిలో చేరింది. వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపేయడంతో.. మరుసటి రోజున గుర్తు తెలియని విష పదార్థం తినడంతో పెళ్లి పీటలపై కుప్పకూలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇలా పెళ్లి ఆపడానికి ఆడిన నాటకం చివరకు ఆమె ప్రాణాలనే బలిగొంది. అందరూ అనుమానాస్పద మరణమే అనుకున్నప్పటికీ సీడీఆర్ నివేదిక ద్వారా పోలీసులు వివరాలు సేకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
నవ వధువు సృజన మృతిపై వీడిన మిస్టరీ.. అతడి కోసమే ఇలా..
సాక్షి, విశాఖపట్నం: మధురవాడలో నవ వధువు సృజన మృతిపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలసులు నిర్ధారించారు. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వెల్లడించారు. పెళ్లికి 3 రోజుల ముందు ఇన్స్‌స్టాగ్రామ్‌లో పరవాడకు చెందిన ప్రియుడు మోహన్‌తో చాటింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కావాలని మోహన్.. సృజనను కోరినట్టు చెప్పారు. దీంతో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. అనంతరం పెళ్లి ఆపేందుకు సృజన విష పదార్థం సేవించింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవ వధువు సృజన మృతి చెందినట్టు స్పష్టం చేశారు. ఇదీ జరిగింది.. విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. -
పెళ్లి పీటలపైనే నవ వధువు మృతి.. ఎన్నో అనుమానాలు..
పెళ్లంటే తాళాలు, తప్పట్లు, పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడుముళ్లు, బంధువుల సందడి ..ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, పెళ్లి ఇంట సందడే సందడి. ఘనంగా వేడుకకు ఏర్పాట్లు చేసుకున్నారు. మరేం జరిగిందో...వధువు పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోయింది. ఆ సందడంతా క్షణకాలంలో చెదిరిపోయింది. బంధువులంతా షాక్ నుంచి తేరుకోలేదు..ఏమైందో ఒకటే ఆందోళన...ఆస్పత్రిలో చేర్పించారు. రాత్రంతా చికిత్స అందించారు. గురువారం ఉదయం నవ వధువు మృతి చెందింది. ఆమె మృతి వెనుక ఎన్నో అనుమానాలు...ఎన్నో సందేహాలు..పెళ్లింట సమాధానం చెప్పలేని ప్రశ్నలు... సాక్షి, మధురవాడ (భీమిలి): మధురవాడ కళానగర్‌కు చెందిన టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ, హైదరాబాదు చందానగర్ పాపిరెడ్డి కాలనీ, ఆర్జీకే కాలనీ బ్లాక్ నెంబరు.58 జీఎఫ్ 6లో నివాసం ఉంటున్న ముంజేటి సాయి సృజన (22)కు వివాహం నిశ్చయించారు. పెళ్లి ఏర్పాట్లు నిమిత్తం ఈ నెల 7న మధురవాడలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. ఇందులో భాగంగా 8వ తేదీన ప్రదానం పూర్తయ్యింది. అదే రోజు సాయంత్రం సంగీత్ కూడా జరిపించారు. వధువు రుతుక్రమం నుంచి తప్పించడానికి 5వ తేదీ నుంచి 10 వరకు మాత్రలు వాడింది. బుధవారం ఉదయం 7 గంటలు సమయంలో వధువు అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. దీంతో వైద్యం నిమిత్తం వెంకోజీపాలెంలోని అమ్మ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి ఇంటికి తీసుకు వచ్చారు. అదే రోజు 4గంటలకు ఇంటి వద్దనే కాళ్ల గోరు సంబరం, పెళ్లి కూతురుగా అలంకరణ, ఇతర కార్యక్రమాలు కూడా జరిపించారు. 9.45 గంటలకు మధురవాడ కళానగర్‌లోని శివాజీ ఇంటి సమీపంలోని వివాహ వేదిక వద్దకు తీసుకు వచ్చి పెళ్లి తంతు ప్రారంభించారు. యువతి బ్యాగులో లభ్యమైన గన్నేరు పప్పు మాదిరిగా ఉన్న తొక్కలు మరి కొద్ది సయంలో వేద మంత్రాలు నడుమ తాళి బొట్టు కడతాడనుకునే క్రమంలో రాత్రి 10.10 గంటలకు వధువు కుప్పకూలిపోయింది. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి మొదట తరలించారు. పరిస్థితి మెరుగవుతుందని భావించి మళ్లీ 2 గంటలకు కూడా మరో ముహూర్తం ఖరారు చేసి వధువు కోసం పెళ్లి మండపం వద్ద బంధువులు వేచి చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వధువు పరిస్థితి విషమించడంతో ఇండస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందిందని వైద్యులు సమాచారం ఇచ్చినట్టు మధురవాడ జోన్(విశాఖ నార్త్ జోన్) ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు చెప్పారు. గుర్తు తెలియని విషపదార్థం తీసుకోవడం వల్ల మృతిచెందిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించామన్నారు. పోస్టు మార్టం నివేదిక వస్తే మృతికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. మృతురాలి తండ్రి ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు బీకాం పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. వధువు సృజన కుటుంబం శ్రీకాకుళం జిల్లా జలుమూరు నుంచి ఉపాది నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈశ్వరరావు ట్రెడెంట్ లైఫ్ కెమికల్స్ కంపెనీలో మెయింటినెన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మృతురాలి బ్యాగులో గన్నేరు తొక్కలు వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమయ్యాయి. గన్నేరు పప్పు తిని ఉంటుందా? మరేమన్న కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..) -
వైజాగ్.. ది ల్యాండ్ ఆఫ్ లవ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం.. సిటీ ఆఫ్ డెస్టినీ.. పర్యాటకుల స్వర్గధామంగా పేరొందిన వైజాగ్.. ప్రకృతి అందాలకు నెలవు. కనుచూపు మేర కనువిందు చేసే పచ్చని కొండలు.. నీలి సంద్రం.. మనసు దోచే సహజ అందాల కలబోత. సాగర తీర సొగసులకు ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. అందుకే.. విశాఖ విశ్వనగరిగా మారింది. ఇప్పుడు కార్యనిర్వాహక రాజధానిగా రూపాంతరం చెందుతోంది. ఈ నేపథ్యంలో.. విశాఖ వైభవాన్ని మరింత చాటేందుకు జీవీఎంసీ కమిషనర్ జి.సృజన సోషల్ మీడియాను వేదికగా మలచుకున్నారు. అలరారే సాగరతీర అందాలతో ఉన్న ఫొటోను ట్వీట్ చేసి.. విశాఖపట్నంపై స్లోగన్స్ రాయండి... టాప్ త్రీ స్లోగన్స్‌కు ప్రశంసలు అందిస్తాం. అంటూ పోస్ట్ చేశారు. (విశాఖ విజయీభవ.. రాజధానిగా రాజముద్ర) అసలే వాహ్.. వైజాగ్ అంటూ ట్విటర్లో అత్యధికంగా పోస్టులు వస్తున్న నేపథ్యంలో కమిషనర్ పిలుపునకు విశాఖ ప్రజలతో పాటు రాష్ట్రం నలుదిశల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. 1084 లైక్స్‌తో పాటు 154 మంది రీట్వీట్ చేశారు. ఇక 303 మంది తమ కవి హృదయాన్ని వెల్లడిస్తూ.. విశాఖ అందాలపై షార్ట్ అండ్ స్వీట్ కవితలను ఇంగ్లిష్ హిందీ భాషల్లో పోస్ట్ చేశారు. వాటిలో కొన్ని మెచ్చుతునకలివీ... ఎస్జే బాబు– ది ల్యాండ్ ఆఫ్ లవ్.. హోప్ అండ్ డ్రీమ్స్.. ద గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. వైజాగ్ పట్టణం.. ఆంధ్రుల స్వప్నాల చిహ్నం రాఘవ– విశాల మనసులున్న పట్నం.. విశాఖపట్నం సంతోష్‌బాబు ఎస్ఎస్ఎంబీ – విశాఖపట్నం.. అచీవ్ యువర్ డ్రీమ్స్ లైక్ ద సైలెంట్ వేవ్స్.. చెగువీరా– విశాఖపట్నం.. ద ప్లేస్ ఫర్ పీస్.. ద ప్లేస్ ఫర్ లవ్.. ద ప్లేస్ ఫర్ కామన్ పీపుల్ మోహన్– అమ్మ.. ఆవకాయ్.. వైజాగ్ బీచ్ ఎప్పుడూ బోర్ కొట్టవు త్రిలోక్ చంద్ర– కలలో స్వర్గానికి ఇలలో విశాఖ మార్గం.. వీరబాబు– సాగర తీరాన కార్యనిర్వాహక రాజధాని.. కృష్ణమ్మ చెంత శాసన రాజధాని.. చారిత్రక కర్నూలులో న్యాయ రాజధాని.. ప్రాంతాల మధ్య ఇక చెక్కు చెదరని అనుబంధాలకు తిరుగులేని పునాది. రవికుమార్– విశాఖ సాగరతీరం.. భారత మాతకు మణిహారం ఏఎన్వీఎల్ శ్రీకాంత్– బిల్డింగ్ ఏ బ్యూటిఫుల్ సిటీ నాట్ జస్ట్ బై బ్రిక్ బై బ్రిక్.. బట్ బై హార్ట్ బై హార్ట్.. సాయిప్రదీప్ పోలెపల్లి– సాగరతీర మెరిక.. మన విశాఖ, ప్రకృతి సౌందర్య దీపిక– మన విశాఖ, రమణీయ వీచిక.. మన విశాఖ. శశాంక్ శ్రీధరాల– ల్యాండ్ ఆఫ్ హోప్ అండ్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ రైజింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్.. రైజింగ్ స్టార్ సిటీ విశాఖప ట్నం -
చేతిలో నెల రోజుల బిడ్డతో..
-
చేతిలో నెల రోజుల బిడ్డతో..
పండంటి బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు కూడా కాలేదు.. అయినా కరోనా వైరస్‌పై పోరాడేందుకు విధుల్లో చేరారు. సెలవు తీసుకునే వెసులుబాటును పక్కకు పెట్టి.. విశాఖలో కరోనా నియంత్రణ కోసం శ్రమిస్తున్నారు. మాతృత్వాన్ని, వృత్తి ధర్మాన్ని సమానంగా భావించి.. విపత్కర పరిస్థితుల్లో ఎంతో బాధ్యతతో, ప్రజాసేవ చేయాలనే పట్టుదలతో ముందుకు కదులుతున్నారు. ఆమె జీవీఎంసీ కమిషనర్ జి సృజన. సాక్షి, విశాఖపట్నం : విశాఖ మహానగరపాలక సంస్థ కమిషనర్‌గా విధులు నిర్వరిస్తున్న సృజన.. నెల రోజుల కిందట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆమె బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజుల్లోనే కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఇలాంటి సమయంలో విశాఖపట్నం లాంటి మహానగరంలో మున్సిపల్ కమిషనర్ అవసరం ఎంతమేర ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా నియంత్రణకు తన అవసరం ఎంత ఉందో తెలిసిన సృజన.. వెంటనే విధుల్లో చేరారు. బిడ్డను భర్త, తల్లికి అప్పజెప్పి తన విధులకు హాజరవుతున్నారు. కేవలం ఆఫీస్‌కే పరిమితం కాకుండా.. క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. అలాగే పేద ప్రజలకు నిత్యావసరాలు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ కరోనా కట్టడి తన వంతు బాధ్యతను నిర్వరిస్తున్నారు. ఆమె ప్రసవానికి కొద్ది రోజుల ముందువరకు కూడా తన బాధ్యతలను నిర్వర్తించారు. ఈ క్రమంలో విశాఖలోని ప్రస్తుత పరిస్థితులు, ఇతర అంశాలపై సృజన సాక్షి టీవీతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో, జిల్లా యంత్రాంగం సహకారంతో కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నామని సృజన తెలిపారు. విశాఖలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..‘కరోనాతో అనుకోని క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా నియంత్రణలో భాగంగా నా పాత్రను నిబద్ధతతో పోషించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ప్రజల తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి అవసరం ఉంటుందని తెలుసు. కానీ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టాను. కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్నా. కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. కరోనా కట్టడికి సీఎం జగన్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఆ స్ఫూర్తిలో నాది చిన్న పాత్ర. నా కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ ధైర్యమిచ్చారు’ అని పేర్కొన్నారు. -
కాబోయే భర్తకు ఫోన్ చేశాడని ప్రియుడినే..!
సాక్షి, కడప: తాను పెళ్లి చోసుకోబోయే యువకుడికి ఫోన్ చేసి తన గురించి చెడ్డగా చెప్పి తన పెళ్లి చెడగొడుతున్నాడనే కారణంగా సాలా శ్రీనివాసులు అనే వ్యక్తిని ఓ నర్సు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కడప నగరం చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలో అప్సర సర్కిల్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్లో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న సాలా శ్రీనివాసులు అనే వ్యక్తి గత నెల 25న హత్యకు గురైన విషయం విదితమే. మృతుని భార్య సుమతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. ఈ సంఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం చిన్నచౌకు పోలీసుస్టేషన్ ఆవరణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిన్నచౌకు సీఐ కె.అశోక్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. చదవండి: 'నేను ఏ తప్పు చేయలేదు' 2014లో నారిపోగు సృజన అలియాస్ సృజన వాహని, హతుడు శ్రీనివాసులు కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసేవారు. ఆ సమయంలో పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ సమయంలో వారిమధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత శ్రీనివాసులు సృజనను అనుమానంతో వేధిస్తుండడంతో ఆమె అక్కడ ఉద్యోగం మానేసి హైదరాబాదుకు వెళ్లి అక్కడి ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో నర్సుగా పనిచేస్తూ ఉండింది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబరు 27న తిరిగి కడపలోని అదే ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అక్కడ ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులుతో తిరిగి వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే శ్రీనివాసులు అప్పటికే సుమతి అనే మహిళను వివాహం చేసుకుని సంతానం కలిగి ఉన్నాడని తెలుసుకున్న సృజన అతనికి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ పరిస్థితిలో సృజనకు రాజేష్ అనే యువకుడితో పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయమై సృజన, శ్రీనివాసులు మధ్య గొడవ జరిగింది. చదవండి: నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..! రాజేష్‌ను పెళ్లి చేసుకోవద్దని ఆమెపై ఒత్తిడి తీసుకురాగా, అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో సృజన దగ్గరి నుంచి రాజేష్‌కు సంబంధించిన ఫోన్ నంబరును హతుడు తీసుకుని అతనికి ఫోన్ చేసి బెదిరించినట్లు విచారణలో తెలిసింది. శ్రీనివాసులు తనకు ఎప్పటికైనా అడ్డుగా ఉంటాడని భావించి అతన్ని అంతమొందించాలని భావించింది. అదను కోసం వేచి ఉండగా గత నెల 24వ తేదీ రాత్రి శ్రీనివాసులు డ్యూటీకి వచ్చి సృజనతోపాటు విధులు నిర్వర్తించాడు. 25వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో నర్సులు విశ్రాంతి తీసుకునే గదిలో వీరిద్దరూ గొడవ పడ్డారు. శ్రీనివాసులు కోపంగా గదిలో ఉన్న చీరతో ఉరి వేసుకుని చనిపోతానని బెదిరించాడు. అప్పటికే శ్రీనివాసులును చంపాలనే ఉద్దేశంతో ఉన్న సృజన ఆలస్యం చేయకుండా అతని మెడకు చీరను బిగించి చంపేసింది. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలిని గుర్తించి అరెస్టు చేశారు. అయితే ఈ సంఘటన జరిగే సమయంలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఉండటంతో ఈ హత్య చేసేందుకు నిందితురాలికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నామని సీఐ వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐలు ఎస్కే రోషన్, ఎం.సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ జె.రామసుబ్బారెడ్డి, కానిస్టేబుళ్లు సి.సుధాకర్ యాదవ్, ఎ.శివప్రసాద్, వి.చెండ్రాయులను సీఐ అశోక్‌రెడ్డి, డీఎస్పీ సూర్యనారాయణ అభినందించారు. -
కలత ఘటనల నుంచి కోలుకొని సాగిపోవాలి ముందుకు
స్పందించడం మంచిదే. ఆరోగ్యకరమైన స్పందన ఉండాల్సిందే. కాని అతి స్పందన అవసరం లేదు. సమాజంలో జరుగుతున్న దారుణమైన ఘటనలకు అతిగా స్పందించి, అవి మనకే జరిగితే అని పదేపదే ఆలోచిస్తూ వ్యాకుల పడితే ప్రమాదం. ఈ దశను దాటాలి. భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథం ఉండాలి. కలత ఘటనల నుంచి ముందుకు సాగాలి. అలా సాగమని చెప్పేదే ఈ కథనం. సృజనను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆమెకు నలభై ఏళ్లుంటాయి. మనిషి కలతగా ఉంది. కన్నీరుగా ఉంది. ఉలికిపాటుగా ఉంది. అపనమ్మకంగా ఉంది. తనకేదో ప్రమాదం రాబోతున్నట్టుగా ఉంది. ‘ఏమిటి సంగతి?’ అని అడిగాడు సైకియాట్రిస్ట్ ఆమెను తీసుకొచ్చిన భర్తని. ‘వారం రోజులుగా తన పరిస్థితి బాగోలేదు డాక్టర్. ఒళ్లు హటాత్తుగా చల్లబడిపోతూ ఉంటుంది. అర్ధరాత్రి లేచి కూచుంటోంది. ఎప్పుడూ పక్కన మనిషి ఉండాలంటుంది. మాటిమాటికి వెళ్లి మా అమ్మాయి ఉన్న తలుపు తెరిచి అమ్మాయి లోపల ఉందా లేదా అని చూసి వస్తుంటుంది. దేనిమీదా ధ్యాస లేదు. ఎప్పుడూ టీవీ చూస్తూ ఉలికులికిపడుతుంటుంది. ఏమిటి నీ భయం అంటే ఏమీ చెప్పదు. మాకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు తీసుకొచ్చాము’ అన్నాడు భర్త. ఆయన హైస్కూల్ టీచర్‌గా పని చేస్తున్నాడు. ‘మీ అమ్మాయి వయసెంతా?’ అని అడిగాడు సైకియాట్రిస్ట్. ‘21 సంవత్సరాలు’ ‘ఏం చేస్తుంటుంది?’ ‘కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. షిఫ్ట్లుంటాయి. క్యాబ్ వచ్చి పికప్ చేసుకుంటుంది. ఇవాళ లీవ్ పెట్టి తోడొచ్చి బయట కూచొని ఉంది. తనకేం ప్రాబ్లం లేదు. తను బాగుంది. ఈమే’... అని ఆగాడు. ‘సరే.. మీరెళ్లండి.. మాట్లాడతాను’ అని చెప్పి పంపించాడు. అతను వెళ్లాక సృజనను అడిగాడు – ‘చెప్పండమ్మా.. ఎందుకిలా ఉన్నారు?’ ‘ఏమో డాక్టర్... నాకు భయంగా ఉంటోంది. నిద్రపోతే నలుగురు మనుషులు నా కూతురిని చుట్టుముట్టినట్టుగా అనిపిస్తోంది. లాక్కెళుతున్నట్టుగా కనపడుతుంది. ఒకటే భయం. నిద్ర లేచేస్తాను’ ‘ఎందుకలాంటి కలలొస్తున్నాయి?’ ‘ఈ మధ్య జరిగిన ఘటనను టీవీలో పదేపదే చూశాను. చాలా బాధ కలిగింది. పాపం ఆ అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. ఆ తల్లిదండ్రుల దుఃఖం చూడలేకపోయాను. అలా టీవీ చూస్తూ ఉంటే సడన్‌గా నాకు ఏమిటోగా అనిపించింది. ఆ తల్లి స్థానంలో నేనున్నట్టుగా, ఆ అమ్మాయి స్థానంలో నా కూతురు ఉన్నట్టుగా అనిపించడం మొదలెట్టింది. అంతే. నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. కన్ను తెరిచినా మూసినా అలాంటి నరకం నా కూతురికి ఎదురైతే నేనేం కావాలి అన్నదే నా భయం’ అందామె. ‘మీరు మీ బాల్యంలోగాని టీనేజ్లోగాని ఇలాగే ఏ విషయానికైనా కలత పడ్డారా?’ ‘పడ్డాను డాక్టర్. నేను ఎవరి కష్టాన్నీ గట్టిగా చూళ్లేను. ఒకవేళ చూస్తే ఆ కష్టం నాకే వచ్చినట్టు బాధ పడి ఇబ్బంది తెచ్చుకుంటాను’ అందామె. డాక్టర్ ఆమెకు మంచినీళ్లిచ్చాడు. ‘చూడండమ్మా... మీకు పెద్ద జబ్బేమీ లేదు. కొంచెం సున్నితంగా ఉన్నారు. పెను ఘటనలు చూసినప్పుడు అవి నాలుగు రకాల మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి. సెన్సిబుల్ పర్సనాలిటీస్, డిపెండెంట్ పర్సనాలిటీస్, యాంగ్జియస్ పర్సనాలిటీస్, డిప్రెసివ్ పర్సనాలిటీస్... ఈ నాలుగు రకాల్లో మీరు ఏదో ఒక రకం అయి ఉండాలి. ‘దిశ’లాంటి ఘటనలు జరిగినప్పుడు పౌరులుగా మనం స్పందించాలి. మార్పు జరగాలని ఆశించాలి. అది కరెక్ట్. కాని తీవ్రంగా దాని గురించే ఆలోచిస్తూ అనుక్షణం అదే బుర్రలో నింపుకోవడం సరికాదు. ఫస్ట్ మీరు రిలాక్స్ కండి. ఊహించని చెడు ఘటనలు, ప్రమాదాలు, వైపరీత్యాలు అనాదిగా జరుగుతున్నాయి అని గుర్తు చేసుకోండి. మనం ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత జాగ్రత్తలో ఉండాలి, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా చెక్ చేసుకొని ముందుకు సాగిపోవాలి. అంతే తప్ప అక్కడే ఆగిపోకూడదు’ అని బెల్ నొక్కాడు. భర్త, కూతురు లోపలికి వచ్చారు. ‘చూడండి.. ముందు మీ భార్యను మాట్లాడనివ్వాలి. ఆమె చెప్పేది మీరు పదే పదే వినాలి. ఆమె దేనికి భయపడుతోందో దానికి వెంటిలేషన్ ఇవ్వాలి. కసరొద్దు. ఆపు అనొద్దు. అదంతా మాట్లాడి మాట్లాడి ఖాళీ అయిపోవాలి. అప్పుడు మీరు ఆమెకు ధైర్యం మాటలు మాట్లాడాలి. ఆమెను నార్మల్‌గా ఉంచాలి. పాజిటివ్ విషయాలను చూపించాలి. పాటలు వినిపించాలి. ఆమెకు ఏదైనా వ్యాపకం ఉంటే అందులో బిజీగా ఉంచాలి. ఒకటి రెండు మందులు రాస్తాను అవి కూడా సాయం చేస్తాయి.’ అన్నాడు డాక్టర్. ఆ తర్వాత సృజనతో మళ్లీ అన్నాడు. ‘సృజనగారూ... రాక్షసులు ఎప్పుడూ ఉన్నారు. కాని వారి సంఖ్య చాలా తక్కువ. మరి దేవతలు? ముక్కోటిమంది ఉన్నారని మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నానంటే చెడు కంటే ఎప్పుడూ మంచి శాతమే ఎక్కువగా ఉంటుంది. మంచి తనను తాను కాపాడుకుంటుంది. మీకూ మీ అమ్మాయికి ఎప్పుడూ ఏమీ కాదని మనస్ఫూర్తిగా అనుకోండి. ఇప్పటికే మీ అమ్మాయి తన హ్యాండ్‌బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రే పెట్టుకొని తిరుగుతోంది. తన ఫోన్ డిస్ప్లేలో పోలీస్ నంబర్‌ను క్విక్ డయల్‌గా పెట్టుకుని ఉంది. ఇంకేం భయం చెప్పండి’ అని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆమె మెల్లమెల్లగా తేరుకోవడం కనిపించింది. ఎవరైనా చేయాల్సింది అదే. తేరుకుని ముందుకు సాగడం. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
జనసేనలో టికెట్లు అమ్ముకుంటున్నారు
-
పెథాయ్‌ను ఎదుర్కొందాం
విశాఖపట్నం, నక్కపల్లి/పాయకరావుపేట: పెథాయ్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సృజన ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో ఆమె నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లో ఆదివారం పర్యటించారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట, ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం, రేవుపోలవరం తీర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మత్య్సకారులు, తీరప్రాంత గ్రామాలవారితో మాట్లాడారు. భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. మండల, గ్రామస్థాయి అధికారులను అప్రమత్తం చేసి తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో అందుబాటులో ఉంచామన్నారు. కేటాయించిన గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో కంట్రోలు రూములు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అధికారులతో సమీక్ష.. పాయకరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో తీరప్రాంతం ఉన్న రాంబిల్లి, అచ్యుతాపురం,ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల అధికారులతో జేసీ సృజన అత్యవసర సమావేశం నిర్వహించారు. దీనికి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్, ఉపాధిహామీ, ట్రాన్స్‌కో, రవాణా, విద్యా, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ సృష్టించిన విధ్వంసం తెలిసిందే అన్నారు. అక్కడ చోటుచేసుకున్న పొరపాట్లు ఇక్కడ జరగకుండా పెథాయ్‌ను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సోమవారం ఉదయం పదిగంటలకు తీరం దాటవచ్చని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభావిత గ్రామాలకు ముందుగానే నిత్యావసర సరుకులు తరలించాలని పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రక్షిత భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను పునరావాస కార్యక్రమాలకోసం స్వాధీనంలోకి తీసుకోవాలన్నారు. విద్యుత్‌సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్లను అందుబాటులో ఉంచాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. 4 వేల విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. 400 స్తంభాలు పాయకరావుపేట నియోజకవర్గానికి కేటాయించామన్నారు. మిగిలిన స్తంభాలు తూర్పుగోదావరి జిల్లాకు పంపినట్టు చెప్పారు. గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాల ఓవర్ హెడ్ ట్యాంకులన్నింటినీ నీటితో నింపాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోని ట్యాంకులను కూడా నింపి తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. అవసరమైతే వాటర్ ప్యాకేట్ బస్తాలు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. రేషన్ డీలర్లతో పాటు, మధ్యాహ్నభోజన పథక నిర్వాహకులను కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఒక్కో తుఫాన్ రక్షిత కేంద్రంలో 3 వేల మందికి భోజన వసతి ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిత్యావసర సరకులు ఈ రాత్రికే తీరప్రాంత గ్రామాలకు చేర్చాలని ఆదేశించారు. పొక్లెయిన్లు, జనరేటర్లతో సిద్ధంగా ఉండాలని విపత్తుల నివారణ శాఖను ఆదేశించారు. ఎక్కడైనా భారీ వృక్షాలు కూలిపోతే వెంటనే తొలగించడానికి అవసరమైన సంరంజామా సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వంనుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తీరప్రాంత గ్రామాల్లో విధులకు నియమించిన వారంతా అక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమావేశంలో నర్సీపట్నం ఆర్డీవో విశ్వేశ్వరరావు, ఏఎస్పీ హఫీజ్, డ్వామాపీడీ కల్యాణ చక్రవర్తి, డీపీవో కృష్ణకుమారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, ఐదుమండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు,ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు. -
చాంపియన్ సృజన
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సృజన రాయరాల అండర్–14 బాలికల విభాగంలో టైటిల్‌ను సాధిం చింది. కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో సృజన 6–3, 6–2తో ప్రేరణ కోయిరాలపై విజయం సాధించింది. అండర్–16 బాలికల ఫైనల్లో సృజన 2–6, 5–7తో సీహెచ్ రితుజ చేతిలో పరాజయం పాలైంది. -
పెద్దల అరెస్టుకు రంగం సిద్ధం...
సాక్షి, విశాఖ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఎన్వోసీ ఉల్లంఘనుల్లో డిప్యూటీ కలెక్టర్, ఆ పైస్థాయి అధికారులు కూడా ఉండటంతో వారి అరెస్ట్‌లకు రంగం సిద్ధమైంది. సిట్ సభ్యురాలు, జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన నిన్న (సోమవారం) ఇందుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. వచ్చేవారం అరెస్టులు ఉంటాయని తెలిపారు. సిట్‌కు మరో రెండు నెలల గడువు ఎన్వోసీల విచారణ పూర్తయేందుకు మరో నెల రోజుల సమయం పడుతుందని జేసీ తెలిపారు. సిట్ దర్యాప్తుపై పూర్తిస్థాయి నివేదికలు తయారు చేసేందుకు సమయం పట్టే అవకాశాలు ఉన్నందున మరో రెండు నెలల సమయం కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు. 20మందిపై క్రిమినల్ కేసులు...! సిట్ పరిధిలో వచ్చిన 337 అర్జీల్లో 260 అర్జీలపై దర్యాప్తు పూర్తయింది. తహసీల్దారు కార్యాలయాల్లో రికార్డుల పరిశీలన సమయంలో రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు కూడా పరిశీలించారని జేసీ తెలిపారు. వారిలో 48మందిపై శాఖాపరమైన చర్యలు, 20మందిపై క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేశామన్నారు. ఈ 48మందిలో వీఆర్వోల స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకూ ఉన్నారన్నారు. ఇప్పటివరకూ విచారించిన 260 ఫిర్యాదుల్లో ప్రభుత్వానికి సంబంధించిన 2వేల ఎకరాల భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించామని, వాటిని త్వరలో స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. సిట్ పరిగణనలోకి తీసుకున్న 2,500 ఫిర్యాదుల్లో సుమారు 1300 ఫిర్యాదులకు సంబంధించి రిపోర్టులను ఎమ్మార్వోల నుంచి తీసుకున్నామన్నారు. వారిచ్చిన ప్రతి రిపోర్టును చదువుతామని, అందులో ఏమైనా లోపాలుంటే మళ్లీ తిప్పి పంపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారి 22(ఎ) లో భూముల వివరాల సవరణ కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, వారి బాధలను అర్థం చేసుకుని 22(ఎ) సవరణ, యూఎల్సీ ఎన్వోసీ అనుమతి మీ సేవ ద్వారా పొందేందుకు అవకాశం కల్పించామని జేసీ తెలిపారు. ఇది రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖ జిల్లాలో ప్రారంభిస్తున్నామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని చెప్పారు. 22(ఎ) కు సంబంధించి పాత, కొత్త లిస్టులు ఉన్నాయని, అయితే గతంలో పాత లిస్ట్ పంపించడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. ప్రస్తుతం కొత్త లిస్టును అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రికార్డుల స్వచ్ఛీకరణ బాధ్యత వీఆర్వోలదే గతంలో రికార్డుల మార్పుచేర్పులు వీఆర్వోలకు తెలిసే జరిగాయి. కాబట్టి ప్రస్తుతం రికార్డుల స్వచ్ఛీకరణ వారి బాధ్యతగా తీసుకొని సరైన సమాచారాన్ని పొందుపరచాలి. లేదంటే గతంలో రికార్డులు మార్పుచేర్పులకు కారణమైన వాటిపై విచారణ చేస్తానని వారిని హెచ్చరించారు. స్వచ్ఛీకరణకు సహకరిస్తే పాత తప్పులను విడిచిపెడతామని వారికి చెప్పామన్నారు. అందువల్ల ప్రస్తుతం బాగా జరుగుతోందన్నారు. రోజుకు 50 నుంచి 60 ఎకరాల భూములకు సంబంధించి స్వచ్ఛీకరణ చేస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో 27 మండలాల్లో 128 పంచాయతీల్లో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. పత్రాల జారీలో జాప్యం వహిస్తే నోటీసులే... మీ సేవా ద్వారా నెల రోజుల్లో పత్రాలను జారీ చేయాలి. అలా చేయని అధికారులకు నోటీసులు ఇస్తున్నాం. ఒక తహసీల్దారు, నలుగురు ఆర్ఐవోలు, నలుగురు వీఆర్వోలకు నోటీసులు జారీ చేశామన్నారు. -
విశాఖ కలెక్టర్‌పై ఒత్తిళ్లు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భూకుంభకోణంపై విశాఖ జాయింట్ కలెక్టర్ సృజనతో విచారణ చేయిస్తున్నట్టు ప్రకటించిన కలెక్టర్.. విచారణ పూర్తికాకుండానే కొమ్మాదిలో 13.79 ఎకరాలు మాత్రమే కబ్జాకు గురయ్యాయని.. 178.06 ఎకరాలకు చెందిన 1బి రికార్డులు మాత్రమే ట్యాంపరింగ్‌కు గురైనట్టుగా చెప్పడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ పూర్తికాకుండానే కబ్జాలపై కలెక్టర్ ఎందుకు తొందరపాటు ప్రకటన చేశారన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. పైగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో రికార్డులకు సంబంధించి అవకతవకలు జరగలేదని ప్రకటించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు బలంగా పనిచేశాయని అంటున్నారు. విశాఖ రూరల్‌లో ఎక్కడా అవకతవకలు, భూకబ్జాలు జరగలేదని మీడియా సమావేశంలో కలెక్టర్ ప్రకటించడం సందేహాలకు తావిస్తోంది. ఇక విశాఖ పరిసర మండలాల్లోనే కాదు.. గ్రామీణ మండలాల్లో కూడా ఎక్కడా రికార్డుల ట్యాంపరింగ్ జరగలేదని కలెక్టర్ చెబుతుండడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. -
విజేతలు తనిష్క్, సృజన
ఐటా చాంపియన్‌షిప్ సిరీస్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్ సిరీస్ అండర్-16 బాలబాలికల టోర్నమెంట్లో తనిష్క్, సృజన విజేతలుగా నిలిచారు. బోరుున్పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ అకాడమీలో శుక్రవారం జరిగిన బాలుర ఫైనల్లో తనిష్క్ మల్పాని 6-1, 6-3తో అఖిల్ కుమార్‌పై గెలుపొందగా... బాలికల సింగిల్స్ ఫైనల్లో సృజన 2-6, 6-0, 6-3తో సంజన సిరిమల్లపై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. బాలికల డబుల్స్ ఫైనల్లో సంజన సిరిమల్ల-సంజన ఐరెడ్డి జోడీ 4-2, 3-5, 10-5తో రిధి- పవిత్ర జంటపై నెగ్గి విజేతగా నిలిచింది. -
బాలీవుడ్‌కు సై.. టాలీవుడ్‌కు నై..
బాలీవుడ్‌ను ఏలుతున్న ముంబయి ఫ్యాషన్ తెలుగు తెర కెక్కని స్థానిక సృజన రోజూ ఆంగ్ల పత్రికల పతాక శీర్షికల్లో కనిపిస్తుంటారు. పాట్నీ నుంచి పారిస్ దాకా ర్యాంప్ మీద క్రియేటి విటీని మెరిపిస్తుంటారు. ప్రపంచ స్థాయి ఫ్యాషన్లకు దగ్గరగా ఉండే మన నగర డిజైనర్లు వెండితెరకు మాత్రం దూరమంటారు. ఒకటి రెండు హిట్లతో ‘తారా’పథానికి దూసుకుపోయే అవకాశాలను సైతం తూచ్.. అనేస్తున్నారు. తరుణ్ తహిల్యానీ, నీతాలుల్లా.. ఇలా ఏ ముంబయి డిజైనర్‌ని చూసినా హిందీ సినిమా ఫ్యాషన్ ‘వెలుగు’లకు కేరాఫ్‌గా ఉంటున్నారు. దీనికి భిన్నంగా తెలుగు సినిమా సోకులను తీర్చిదిద్దడాన్ని హైదరాబాద్ డిజైనర్లు ‘లైట్’గా తీకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఇదే సిటీ డిజైనర్లు బాలీవుడ్ సినిమాలకు, తారలకు సైతం డిజైన్లను అందిస్తున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి టాలీవుడ్లో భారీ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. సిటీలో వరల్డ్ క్లాస్ ఫ్యాషన్ ఉత్పత్తులున్నాయి. అయితే ఈ రెండింటి మధ్యా సరైన వారధి మాత్రం ఏర్పడలేదు. నగరంలో పేరున్న డిజైనర్లలో అత్యధికులు తెలుగు సినిమా రంగానికి దూరంగానే ఉంటున్నారు. గతంలో అస్మితా మార్వా, సాహిల్ గులాటి వంటి ఒకరిద్దరు కొన్ని సినిమాలకు వర్క్ చేసినా అరకొర దృష్టాంతాలే తప్ప, సిటీ డిజైన్స్కీ సినిమాకీ మధ్య గ్యాప్ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు సిటీ టాప్ డిజైనర్లతో ‘సాక్షి’ ముచ్చటించినప్పుడు... అదో ‘చిత్రమైన’ ప్రపంచం తొలిసారి నాకు కృష్ణవంశీ ‘చక్రం’ సినిమాకు ఆఫర్ వచ్చింది. అయితే చాలా తక్కువ టైమ్ ఇచ్చారు. దాంతో చేయలేనని చెప్పేశాను. ఆ తర్వాత కృష్ణవంశీ తీసిన ‘రాఖీ’కి, రాఘవేంద్రరావు తనయుడు హీరోగా వచ్చిన ‘మార్నింగ్ రాగా’.. వంటి సినిమాలకు పనిచేశా. కానీ టాలీవుడ్లో ఇమడలేకపోయాను. నటి శ్రీయ శరన్ తో వర్క్ చేశాను. ఆమె చాలా డౌన్ టు ఎర్త్. అలాగే హ్యాండ్లూమ్ వర్క్స్ మాత్రమే వాడే షబానా ఆజ్మీ, లలిత్ దూబెతో చేసిన వర్క్ కూడా మెమొరబుల్. తప్పొప్పుల గురించి అనను గాని.. మన సినీ ఇండస్ట్రీలో మనగలగాలంటే కొన్ని ‘ప్రత్యేక’ శక్తియుక్తులు కావాలనేది నాకు అర్థమైంది. అవి లేవు కాబట్టి నేను నా వ్యక్తిగత మార్కెట్‌నే నమ్ముకున్నాను. - శశికాంత్ నాయుడు సమయమే కీలకం.. బాలీవుడ్లో సోనమ్ కపూర్, విద్యాబాలన్ వంటివారికి డిజైన్స్ ఇచ్చాను. టాలీవుడ్ సినిమాలు చేయడం ఇష్టమే. కొన్నేళ్లగా భారతీయ మహిళ కట్టు, బొట్టు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఖాదీ, సిల్క్స్, కాటన్ వస్త్రాలను రూపొందిస్తున్నాం. అయితే సినిమాలకు సంబంధించి ఉన్న ప్రత్యేక సమస్య సమయం.. సినిమా క్రియేషన్లు తక్కువ టైమ్‌లో ఎక్కువ వర్క్‌ని డిమాండ్ చేస్తాయి. అంతేకాకుండా మా వర్క్స్ పూర్తిగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేవే. తగిన సమయం ఇచ్చి, మా తరహా వర్క్స్‌ని కోరుకునే స్థానిక సినిమా రూపకర్తలతో పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు. అనేక మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకు వ్యక్తిగతంగా మా గౌరంగ్ లేబుల్ చిరపరిచితం. అలాగే ఇండో వెస్ట్రన్ కలగలిపిన డిజైన్లను క్రియేట్ చేయడానికి, భారతీయ వస్త్ర శైలికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడానికి సినీరంగానికి ఇదే సరైన సమయం అని నా అభిప్రాయం. - గౌరంగ్ అడిగితే ఎందుకు వర్క్ చేయం? ఇప్పటిదాకా 13 ఫ్యాషన్ వీక్‌లలో పాల్గొన్నాను. కంటిన్యూస్‌గా నా కలెక్షన్స్ రిలీజ్ చేస్తుంటాను. అయితే టాలీవుడ్ నుంచి మూవీస్‌కి పనిచేయమని ఎవరూ అప్రోచ్ కాలేదు. అది మాకూ సర్ప్రైజింగ్. విశేషమేమిటంటే... నేను ముంబయిలో కంగనా రనౌత్‌తో పనిచేశాను. ఆమెకు డిజైన్స్ ఇచ్చాను. ముంబయిలో క్యారెక్టర్‌ను బట్టి నెయిల్ పాలిష్, హెయిర్ స్టైల్ ఇలా ప్రతి అంశంలోనూ పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. మన సిటీలో ఫ్యాషన్ ఫాలోయర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరంతా చాలా వరకూ బాలీవుడ్‌నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఈ పరిస్థితి మారాలంటే టాలీవుడ్ మరింత ఫ్యాషన్ కాన్షియస్గా మారాల్సి ఉందేమో..! అయితే, ఇక్కడ కూడా నాకు చాలా మంది నటీనటులు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లు నా కలెక్షన్స్‌ను వ్యక్తిగతంగా వినియోగిస్తుంటారు. - శివాలీ సింగ్ సినీ వర్కింగ్ స్టైల్ వేరు.. మూవీస్ షెడ్యూలింగ్ కంప్లీట్‌గా డిఫరెంట్. టాలీవుడ్లో ప్రీ ప్లానింగ్ చాలా తక్కువ. ఫినిషింగ్ పట్టించుకోరు. లోపలెలా ఉన్నా పర్లేదు. అంతేకాదు నైట్ చెప్పి రేప్పొద్దున్నకల్లా కావాలంటారు. అది డిజైనర్ వర్క్ స్టైల్ కాదు. ఫ్యాషన్ డిజైనర్ అంటే సీరియస్ ట్రెండ్ సెట్టర్స్. నా వరకూ ఒక్క కరెంట్తీగలో మాత్రం రకుల్‌ప్రీత్ సింగ్‌కి చేశాను. నా వర్కింగ్ స్టైల్ తెలుసు కాబట్టి. మంచు లక్ష్మి నాకు తగిన టైమ్ ఇచ్చి చేయించుకున్నారు. ముందే బ్రీఫ్ చేసి టైమ్ ఇవ్వడం వల్ల చేయగలిగాను. పార్టీస్‌కి, ఈవెంట్స్‌కి మాత్రం స్టార్స్ చాలా వరకూ డిజైనర్స్ క్రియేషన్స్ వేసుకుంటారు. ‘కామెడీ విత్ కపిల్’ అనే బిగ్ టీవీ షోకి శృతిహాసన్ నా డిజైన్ వేసుకుంటే అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. అలాగే సన్ని లియోన్‌కి కూడా డిజైన్స్ ఇచ్చాను. బాలీవుడ్లో అడుగుతున్నారు కాబట్టి అనే కాదు.. వాళ్లు తగిన టైమ్ ఇస్తారు కూడా. - శిల్పారెడ్డి -
ఒకరికొకరు
నా అప్రయత్న ప్రియసఖి.. చీకటి నిజాలు.. పగటి కలలు.. రేయి చంద్రుడు, సంధ్యా సూర్యుడు.. సరదావిహారాలు.. సైద్ధాంతిక పోరాటం అన్నిటికీ కావాలి నువ్వు. తోడునీడలు కావొద్దు.. కోయిల గోరింకలు కావొద్దు.. కలసి తిరిగే స్వతంత్ర స్నేహితులమవుదాం.. తను జతకూడాలి అనుకున్న అమ్మాయితో అబ్బాయి మనసు చెప్పిన ఊసు ఇది! వాళ్ల సహజీవనానికి ఎనిమిదేళ్లు. ముందు అనుకున్నట్టుగానే వాళ్లిద్దరూ తోడునీడలుగా లేరు.. కోయిల, గోరింకలు అసలే కాలేదు! ఆమె అతని సృజన.. అతను ఆమె తేజమై.. ఎవరికివారు ఎంచుకున్న దారుల్లో కలసి నడుస్తున్నారు! మార్గనిర్దేశకాలుండవ్.. తడబడితే చేయూత ఉంటుంది ! ఆలుమగలులా కాకుండా స్వతంత్ర స్నేహితులుగా ఉంటున్న ఆ జంటలో అతడు.. పదిరి రవితేజ, ఆమె.. గుమ్మళ్ల సృజన. వాళ్ల చెలిమే ఈ యూ అండ్ ఐ! - రవితేజ, సృజన ఈ ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరువేరు కాదు కొంచెం ఘనమైనవి కూడా. రవితేజ ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు వాసిరెడ్డి కృష్ణారావు మనవడు. సృజన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గుమ్మళ్ల బలరామయ్య కూతురు. ఈ భిన్నాలు వీళ్లలోనూ ఉన్నాయి. రవితేజ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకు. సృజన.. పుస్తకాల పురుగు. ఆ సంఘజీవికి.. ఈ ఇంట్రావర్టిస్ట్కి స్నేహం ఎలా కుదిరింది?. సెంట్రల్ యూనివర్సిటీలో.. ‘నేను అప్పుడు పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. తేజ.. విజయవాడలో లా చదువుతున్నాడు. సమతా విద్యార్థి సమాఖ్య మీటింగ్స్ కోసం తరచుగా యూనివర్సిటీకి వచ్చేవాడు. నేను స్టూడెంట్ పాలిటిక్స్‌లో యాక్టివేం కాదు.. కానీ సంఘీభావం తెలపడానికి మీటింగ్స్‌కు అటెండ్ అయ్యేదాన్ని. అలా అతను పరిచయం’ అని చెప్తుంది సృజన. ప్రణయం.. పరిణయం.. ‘ఓ మూడు నెలల తర్వాత అనుకుంటా.. నేనే చెప్పాను తనతో నువ్వంటే ఇష్టం అని’ సృజన అంటుంటే.. ‘అలా ఏం లేదు.. నాకూ అనిపించింది. నేను మొదటి నుంచి ఫంకి, చింకి, కెరీరిస్ట్ అమ్మాయిలకు చాలా దూరం. సృజన అందుకు భిన్నం. అందుకే చాలా నచ్చింది’ అన్నాడు రవితేజ. ‘కాబట్టే నేను ప్రపోజ్ చేసిన మూడు నెలలకు ఆలోచించుకుని ఓకే చెప్పాడు’ నవ్వుతూ సృజన. ‘ఒక రోజు ఈవెనింగ్ చెప్పాను.. నాతో కలసి ఉంటావా? మనిద్దరం కలసి ఉండగలం అని. విని పొద్దున్నే నువ్వన్నది నిజమేనా అని రీకన్ఫర్మ్ చేసుకుంది’ రవితేజ. ‘అలా నిర్ణయించుకున్న అయిదేళ్లకు పెళ్లయింది. పెళ్లనే ఫ్రేమ్‌లోకి వచ్చి మూడేళ్లయినా.. మా సహజీవనం మాత్రం ఎనిమిదేళ్ల నుంచి’ అని ప్రీషియస్ పోస్ట్‌ను జ్ఞాపకం చేసుకుంది సృజన. కెరీర్.. ‘పెళ్లికి ముందు మూడుసార్లు సివిల్స్ రాశాను.. రాలేదు. గ్రూప్‌వన్ రాసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను కూడా. సివిల్స్‌కి ఇంకో చాయిస్ ఉంది కదా అని తేజ గుర్తు చేస్తే అప్పుడు మళ్లీ దాని మీద దృష్టి పెట్టాను. వచ్చింది. ఆ క్రెడిట్ తేజాదే’ అంటుంది ఇంతకన్నా భాగస్వామి సహకారం ఏముంటుంది అన్నట్టు. మరి తేజకు? ‘నేను హైకోర్ట్ అడ్వొకేట్‌ని. ఎన్‌కౌంటర్స్‌కి, సోంపేట ఫైరింగ్‌కు వ్యతిరేకంగా కేసులు టేకప్ చేశాను. నా ఈ చర్యల వల్ల సృజన మీద ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసు. అయినా తను ఏనాడు క్వశ్చన్ చేయలేదు. అసలు ఆ ప్రెషర్స్ తాలూకు ప్రభావం ఏదీ నా మీద పడనీయదు’ గర్వంగా చెప్తాడు రవితేజ. కోపాల్ తాపాల్.. గొడవలు పోట్లాటలు.. ‘పెద్దగా ఉండవ్. ఎప్పుడైనా నాకే కోపం వచ్చి అరుస్తాను కానీ తేజకు అస్సలు కోపం ఉండదు. నా కోపం కూడా తను తీసింది తీసిన చోట పెట్టనప్పుడే. అరుస్తాను.. అయినా ఏమీ అనడు’ అని సృజన అంటుంటే ‘ఏమీ అనను.. ఆ వస్తువు తీసుకెళ్లి తీసిన చోట పెట్టను’ అని నింపాదిగా ఆన్సర్ చేస్తాడు తేజ. ‘ఇక గొడవలు.. పోట్లాటలు లేనేలేవు. బేసిక్‌గా ఇద్దరం పీస్‌ఫుల్‌గా ఉండటానికే ఇష్టపడతాం. గొడవపడి మాటలు మానేసుకున్న సందర్భాలు లేవు ఈ ఎనిమిదేళ్ల కాలంలో అంటుంది సృజన. కంప్లయింట్స్ అండ్ డిమాండ్స్ ‘అస్సలు లేవు’ ఇద్దరూ చెప్తారు ఏక కంఠంతో. ‘తను నా ప్రిన్సిపుల్స్‌ని రెస్పెక్ట్ చేస్తుంది. నగలు, షాపింగ్లాంటివేమీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయదు’ అంటాడు. ‘తను ఏం చెప్పినా, ఏం చేసినా ఓ క్లారిటీ ఉంటుంది. ఆలోచించి చెప్తాడు, చేస్తాడు. ఒకరిపట్ల ఒకరికి ఇలాంటి గౌరవం, నమ్మకం ఉంటాయి కాబట్టి కంప్లయింట్స్, డిమాండ్స్ ఉండవ్’ అని చెప్తుంది సృజన. కాంప్లిమెంట్స్.. ఇన్స్పిరేషన్.. ‘నాలో నాకన్నా తేజానే ఎక్కువుంటాడు’ అని ఆమె తన ప్రేమకు కాంప్లిమెంట్ ఇస్తే, ‘ఐ లవ్ లివింగ్ విత్ హర్’ అని అతని మాట. ‘పెళ్లికి ముందు అమ్మానాన్న, ఇప్పుడు తేజ.. అమ్మానాన్న, కొడుకు, స్నేహితుడు ఎవ్రీథింగ్.. ఆయన సహచర్యం అందించిన గిఫ్ట్ ఇది’ భర్త ప్రభావం ఆమెను మురిపిస్తుంటే.. ‘సృజన వల్ల విషయాలను సిస్టమేటిక్‌గా ఎలా డీల్ చేయగలరో తెలుసుకున్నాను’ అని భార్య ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌ను ఒప్పుకుంటాడు రవితేజ నిజాయితీగా. ఈ అవగాహన.. అన్యోన్యత వెనుక.. ‘వీ నెవర్ ఇన్సిస్ట్ ఆన్ లివింగ్ టుగెదర్ ఫిజికల్లీ, మనీ అండ్ సెక్స్.. ఈ రెండింటి కన్నా బలమైన బాండింగ్ ఒకటుండాలి’ అని ఆయన అంటే ‘u have been my love, my dad, my mom, my guru, my support system.. my god.. for all that u were n u were not, i am that blessed soul.. to have u around always.. i wish i could love half as much as u do and shall always be my endeavor.. thanks for being u.’ అంటూ సృజన నిర్వచిస్తుంది. - సరస్వతి రమ