మర్డర్‌ మిస్టరీ | vetadatha new movie launch | Sakshi
Sakshi News home page

మర్డర్‌ మిస్టరీ

Published Mon, Jun 12 2023 3:54 AM | Last Updated on Mon, Jun 12 2023 4:08 AM

vetadatha new movie launch - Sakshi

అరుణ్, సృజన జంటగా సురేష్‌ రెడ్డి దర్శకత్వంలో   ‘వేటాడతా’ చిత్రం తెరకెక్కుతోంది. ఎమ్‌.అంకయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. వైజాగ్‌ మాజీ మేయర్‌ దాడి సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌  చేయగా, నిర్మాత సాయివెంకట్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత నాగులపల్లి పద్మిని స్క్రిప్ట్‌ అందించగా, నిర్మాత రామ సత్యనారాయణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ అండ్‌ మర్డర్‌ మిస్టరీగా ‘వేటాడతా’ చిత్రం రూపొందుతోంది. ఈ నెలాఖరులో షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తాం. అరకు, హైదరాబాద్, నంద్యాల ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు అంకయ్య. ‘‘మా నాన్న(అంకయ్య) సిద్ధం చేసిన కథతో హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు అరుణ్‌. ఈ సినిమాకు సహ–నిర్మాత: డి.శివ ప్రసాద్, సంగీతం: శేఖర్‌ మోపూరి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement