Arun
-
కేంద్ర వైద్య, ఆరోగ్య బృందం పర్యటన
ముంచంగిపుట్టు: ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర వైద్య, ఆరోగ్య బృందం ప్రతినిధులు అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండల కేంద్రంలో మంగళవారం పర్యటించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. మందుల స్టాక్, రికార్డులను పరిశీలించారు. అనంతరం రక్త పరీక్షల గదికి వెళ్లి నెల వారీగా నమోదవుతున్న మలేరియా, టైఫాయిడ్ కేసుల వివరాలను వైద్యాధికారులు సంతోశ్, ధరణిలను అడిగి తెలుసుకున్నారు. కేసుల వివరాలు ఆన్లైన్లో నమోదు కావడంలో జాప్యాన్ని గుర్తించి, ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. వార్డుల్లో ఉన్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. గ్రామాల నుంచి ఆరోగ్య కేంద్రాలకు మధ్య దూరం, రవాణా సౌకర్యం, రోడ్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)ను, పుట్టిన బిడ్డలు, బాలింతల ఆరోగ్య పరీక్షలు, అధికంగా నమోదవుతున్న కేసులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కర్రిముఖిపుట్టు, దార్రెల గ్రామాల్లో ఉన్న సబ్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. అనంతరం కిలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. రక్తహీనత కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ తీరుపై ఆరా తీశారు. మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూచించి, నిల్వ లేని మందుల వివరాలు నమోదు చేసుకున్నారు. సీహెచ్‌సీ, పీహెచ్సీ, సబ్‌సెంటర్ల నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవాల్సిందిగా ఢిల్లీకి చెందిన కేంద్ర సచివాలయ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ సూచించారు. -
వివాహమైన 3 వారాలకే సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
రాజేంద్రనగర్: పెళ్లయిన 3 వారాలకే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన అరుణ్ (28) ఇదే ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని (21)తో 21 రోజుల క్రితం వివాహం జరిగింది. అనంతరం వీరు హైదర్‌గూడలో అద్దె ఇంట్లోకి వచ్చారు. అరుణ్‌కు నైట్ షిఫ్ట్ కాగా.. ఆయన భార్య ఉదయం షిఫ్ట్ ముగించుకుని మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా.. గది తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఘటన స్థలానికి చేరుకొని డోర్ తెరిచి చూడగా అరుణ్ ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు హ్యాండిచ్చిన సీఎండీ అరుణ్ భక్షీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కార్మిక సంఘాలకు స్టీల్ ప్లాంట్ సీఎండీ అరుణ్ భక్షీ హ్యాండిచ్చారు. ఈరోజు కార్మిక సంఘాలను సమావేశానికి రావాలని పిలిచి ఆయన మాత్రం ఢిల్లీకి వెళ్లిపోయారు.కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం అరుణ్ భక్షీ.. కార్మిక సంఘాలకు భారీ షాకిచ్చారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కార్మిక సంఘాల నేతలను సమావేశాలని రావాలని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ, ఇంతలోనే ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇక, సీఎండీ పిలుపుతో కార్మిక సంఘాలు సమావేశానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలా జరగడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయం స్టీల్ ప్లాంట్ లోపల కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలు చేస్తున్నారు. కార్మికుల నినాదాలతో స్టీల్ ప్లాంట్ దద్దరిల్లుతోంది. మరోవైపు.. నాలుగు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అందలేదు. తమ జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారికి పీఎఫ్ చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల్లో దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విధుల్లోకి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’ -
షా డీప్‌ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగ వీడియోను డీప్‌ఫేక్‌గా సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అమిత్ షా వీడియోను ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్‌రెడ్డి డీప్‌ఫేక్ చేశారని పోలీసులు నిర్ధారించారు. దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.సృష్టించి.. సర్క్యులేట్ చేసి..మెదక్‌లో ఏప్రిల్ 23న నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే మతప్రాతిపదికన అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అరుణ్‌రెడ్డి ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని షా అన్నట్లుగా యాడ్ చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అనంతరం ఆ వీడియోను ఏఐసీసీ, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అరుణ్‌రెడ్డి పోస్ట్ చేశారని పేర్కొన్నారు.కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో..షా డీప్‌ఫేక్ వీడియోను వీక్షించిన నెటిజన్లు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే దీనిపై ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా మరికొందరు పార్టీ నేత లు స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగ సభల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేడు మరో అరెస్టుకు అవకాశం..వీడియో సృష్టికర్త అరుణ్‌రెడ్డి కాగా దాన్ని వైరల్ చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తేనంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆదివారంలోగా తమకు సమర్పించాలని ‘ఎక్స్’తోపాటు ‘ఫేస్బుక్’ను పోలీసులు కోరారు. ఆదివారంలోగా ఆ డీప్‌ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయనున్నారు. -
మరో బాలరాముని విగ్రహాన్ని తయారుచేసిన యోగిరాజ్
ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ బాలరాముని చిన్న నమూనా విగ్రహాన్ని తయారు చేశారు. ఈయన గతంలో అయోధ్య రామాలయానికి రామ్‌లల్లా విగ్రహాన్ని తయారు చేశారు. యోగిరాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్లో బాలరాముని చిన్న నమూనా రూపానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. యోగిరాజ్ ట్విట్టర్లో తాను రాతితో రామ్‌లల్లా చిన్న విగ్రహాన్ని తయారు చేశానని తెలిపారు. వెండి సుత్తితో, బంగారు ఉలితో రామ్‌లల్లా కళ్లను చెక్కానని పేర్కొన్నారు. ఈ భూమిపై తాను ఎంతో అదృష్టవంతుడినని, తన పూర్వీకుల ఆశీస్సులు, శ్రీరాముని ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. అరుణ్ యోగిరాజ్ 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా గేట్ వద్ద 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా యోగిరాజ్ రూపొందించారు. అలాగే కేదార్‌నాథ్‌లోని 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, మైసూర్ జిల్లాలోని చుంచన్కట్టేలో 21 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను యోగిరాజ్ తీర్చిదిద్దారు. -
అప్సర రాణి కొత్త సినిమా షురూ
అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంటగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, ప్రముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం యం శ్రీలేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ.. ''సినిమా ప్రారంభోత్సవం ఒక పండగగా జరగడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ధన్యవాదాలు. ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తాం. సబ్జెక్టు బాగా వచ్చింది. అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంటగా చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం..'' అని తెలిపారు. అప్సరరాణి మాట్లాడుతూ... ''మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది. సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుందన్న నమ్మకంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్టర్‌కు ధన్యవాదాలు..'' అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ యం యం శ్రీలేఖ మాట్లాడుతూ.. తొలిషాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పాటలు చాలా బాగా వచ్చాయి. అందరిని ఆకట్టుకుంటాయి, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. అందరికి నచ్చుతుంది..'' అని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ వెంకటేష్ మాట్లాడుతూ... ఒక అద్భుతం జరుగుతుందంటే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని ఈ సందర్బం రుజువు చేసింది. ఒక టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఈ సినిమాను ఒక తపస్సులా చేస్తున్నాడు. కృష్ణబాబు స్క్రిప్టును అద్భుతంగా రెడీ చేశారు. ఈ ప్రాజెక్టును ఎంతో నిజాయితీగా, పర్ఫెక్ట్ సిద్ధం చేశారు. హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం, హీరోయిన్ అప్సర రాణి కూడా నిబద్దతతో, అంకితభావంతో పని చేసే వ్యక్తి. ఆమె డెడికేషన్ ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది..'' అని తెలిపారు. -
సకాలంలో నివేదికలిస్తే బాధితులకు సత్వర న్యాయం
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా అధికారులు సకాలంలో నివేదికలు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జస్టిస్ అరుణ్ మిశ్రాతో పాటు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు డాక్టర్ డి.ఎం.మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, రిజి్రస్టార్(లా) సురాజిత్ బృందం బుధవారం విజయవాడలో విచారణ నిర్వహించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులతో సమావేశమయ్యారు. అనంతరం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో 30 కేసులను విచారించి, తగిన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రూ.80 లక్షల మేర పరిహారం చెల్లింపులకు సిఫార్సు చేశామని తెలిపారు. 17 కేసుల్లో తుది ఉత్తర్వులు జారీ చేశామన్నారు. లైంగిక నేరాల కేసుల్లో బాలబాలికలకు నష్టపరిహారం విషయంలో పోక్సో కోర్టు ముందు ప్రతిపాదనలు ఉంచాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. మానసిక ఆరోగ్యం, వెట్టి చాకిరీ, ఆహార భద్రత హక్కు, జ్యుడీషియల్–పోలీసు కస్టడీలో ఆత్మహత్యల నివారణ తదితర అంశాలపై కార్యాచరణ నివేదికలను సమర్పించాలని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అభినందించారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై hrcnet.nic.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దుర్గమ్మ సేవలో జస్టిస్ అరుణ్ మిశ్రా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ అరుణ్‌మిశ్రా బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొనేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చిన జస్టిస్ అరుణ్మిశ్రాకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ ఈవో కేఎస్ రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువ్రస్తాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు. -
జూనియర్ ఆర్టిస్ట్ ని మోసగించిన ఎస్ఐ అరుణ్
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువతిని శారీరకంగా లోబరుచుకుని.. మరో యువతితో వివాహ నిశ్చితార్థం చేసుకున్న కేసులో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన ఎస్ఐని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన పబ్బా అరుణ్ (29) ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అరుణ్ 2021లో సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్‌గా పని చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన యువతి (23) సైదాబాద్ సరస్వతీనగర్ కాలనీలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తుండేది. 2022 జనవరిలో బంధువుల కుటుంబ సమస్యల విషయమై సదరు యువతి అప్పట్లో సైదాబాద్ పీఎస్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే ట్రైనీ ఎస్ఐ పబ్బా అరుణ్ ఆమెకు పరిచయమయ్యాడు. వీరు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఎస్ఐ అరుణ్ ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అతను సిద్దిపేట పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లలో పని చేస్తున్న సమయంలోనూ యువతిని తన వద్దకు రప్పించుకునేవాడు. ఇటీవల అరుణ్‌కు వేరే యువతితో వివాహ నిశి్చతార్థమైన ఫొటోలను స్మార్ట్ ఫోన్లో చూసిన బాధితురాలు అతడిని నిలదీసింది. ఖంగు తిన్న అతను నిశ్చితార్థాన్ని ఉపసంహరించుకుంటానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. నిశ్చితార్థమైన యువతి సోదరుడు బాధిత యువతికి గత నెల ఫోన్ చేశాడు. అరుణ్ తన సోదరినే పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె అరుణ్‌కు ఫోన్ చేసి ఈ విష యంపై ప్రశ్నించడంతో.. ‘అవును నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను.. నువ్వు నన్ను మరచిపో’ అంటూ ఫోన్ పెట్టేశాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన యువతి శనివారం సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పబ్బా అరుణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆ దివ్య దరహాసం వెనుక..
రెండు రోజులుగా దేశమంతా ఎటు చూసినా బాలరాముడే. ఎక్కడ విన్నా అతన్ని గురించిన చర్చే. సోషల్ మీడియాలోనూ అయోధ్యలో కొలువుదీరిన రామ్ లల్లా ముచ్చట్లే. అతని ఫొటోలే. అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నది బాలరాముని మందస్మిత వదనం. సమ్మోనమైన ఆ నవ్వుకు సెలబ్రిటీలు మొదలుకుని సామాన్యుల దాకా అందరూ ముగ్ధులవుతున్నారు. అమితమైన కరుణతోపాటు అంతులేని దివ్యత్వాన్ని వర్షిస్తున్న ఆ కళ్లు నిజంగా అద్భుతమంటూ కొనియాడుతున్నారు. అదే సమయంలో బాలలకు సహజమైన అమాయకత్వంతో చూస్తున్న ఆ నయనాల సొగసు వర్ణనాతీతమని ముక్త కంఠంతో చెప్తున్నారందరూ. బాలరాముని కళ్లను అంత అందంగా తీర్చిదిద్దినందుకు మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రతిభను ఎంత పొడిగినా తక్కువేనంటున్నారు. విగ్రహ రూపకల్పనకు, ముఖ్యంగా కళ్లను అంతలా తీర్చిదిద్దేందుకు ఆయన అక్షరాలా తపస్సే చేశారు. చిన్నపిల్లల ముఖ కవళికలను దగ్గరగా ఒడిసిపట్టేందుకు ఎన్నోసార్లు స్కూళ్లకు వెళ్లారు. శిల్ప శాస్త్రాన్ని ఆమూలాగ్రం పదేపదే అధ్యయనం చేశారు. అరుణ్ దీక్ష, శ్రమ, పట్టుదలకు రాముని కరుణ తోడైందని భార్య విజేత చెబుతున్నారు. విగ్రహ రూపకల్పనకు అనువైన కృష్ణ శిలను ఎంచుకోవడం వంటివాటి వెనక దాగున్న సాంకేతికత మొదలుకుని దాన్ని అత్యంత అందంగా చెక్కేదాకా ప్రతి దశలోనూ అరుణ్ ఎదుర్కొన్న సవాళ్లు తదితరాలను ఆమె మీడియాతో వివరంగా పంచుకున్నారు. శాస్త్ర ప్రమాణాల మేరకు... విగ్రహ తయారీలో అరుణ్ పూర్తిగా శిల్ప శాస్త్ర ప్రమాణాలను అనుసరించారు. ఆ మేరకే బాలరాముని ముఖారవిందపు స్వరూప స్వభావాలను ఖరారు చేశారు. ముఖ్యంగా కళ్లు, ముక్కు, చుబుకం, పెదాలు, చెంపల నిష్పత్తి తదితరాలను శాస్త్రంలో నిర్దేశించిన మేరకు నిర్ణయించారు. ‘‘అరుణ్ చేతిలో నిజంగా అద్భుతమైన కళ దాగుంది. విగ్రహం ఎలా ఉండాలో రామ జన్మభూమి ట్రస్టు ప్రతినిధులు క్లుప్తంగా చెప్పారు. నవ్వుతున్న ముఖం, దివ్యత్వం, ఐదేళ్ల స్వరూపం, రాకుమారుని రాజసం... ఇవీ అరుణ్‌తో పాటు మరో ఇద్దరు శిల్పులు జీఎల్భట్, సత్యనారాయణ పాండేకు వాళ్లు నిర్దేశించిన ప్రాతిపదికలు. అవి మినహా మిగతాదంతా అరుణ్ ఊహ, భావుకతల ఫలమే. ఇందుకోసం చిన్నపిల్లల స్కూళ్లకు వెళ్లి గంటల కొద్దీ గడిపాడు. వాళ్ల ముఖ కవళికలు, అవి పలికించే భావాలను లోతుగా పరిశీలించాడు. వాటిని పేపర్‌పై ఎప్పటికప్పుడు స్కెచ్‌లుగా గీసుకున్నాడు. అవయవాల పొందిక నిమిత్తం శరీర నిర్మాణ శాస్త్ర పుస్తకాలు తిరగేశాడు. అందుకే విగ్రహం అంత వాస్తవికంగానూ, అదే సమయంలో ఎంతో ముగ్ధమనోహరంగానూ రూపుదిద్దుకుంది’’ అని విజేత వివరించారు. ‘‘అరుణ్ నిజంగా అత్యంత అదృష్టశాలి. మా ఆయనతో రాముడే ఇంతటి మహత్కార్యం చేయించుకున్నాడు’’ అంటూ మురిసిపోయారు. గుండ్రని ముఖమండలం... ఉత్తరాది సంప్రదాయంలో రూపొందే శిల్పాల ముఖం, ముఖ లక్షణాలు కాస్త కొనదేరి ఉంటాయి. అయోధ్య బాలరాముని ముఖమండలం గుండ్రని రూపుతో కనువిందు చేస్తోంది. ఇది దక్షిణాదిలో శిల్పాల రూపకల్పనలో ఎక్కువగా కని్పస్తుందని ఢిల్లీలోని ప్రముఖ చరిత్రకారుడు, రచయిత విక్రం సంపత్ అన్నారు. ‘‘కానీ కాస్త చక్కని చుబుకం, ఉబ్బెత్తు చెంపలు, బుల్లి పెదాలు, వాటిపైనే గాక ముఖమంతటా పరుచుకున్న మార్మిక మందహాసం... ఇలాంటి దివ్య లక్షణాలన్నీ బాలరాముని ముఖంలో ప్రస్ఫుటమవుతున్న తీరు మాత్రం నిజంగా అద్భుతమేనని చెప్పారాయన. ఈ విషయంలో శిల్పిగా అరుణ్ పనితనాన్ని ఎంత పొగిడినా తక్కువేనన్నారు. 51 అంగుళాల వెనక... రామ్ లల్లా విగ్రహం ఎత్తును 51 అంగుళాలుగా నిర్ణయించడం వెనక కూడా శాస్త్రీయ కారణాలున్నట్టు విజేత చెప్పారు. ‘‘ఏటా రామనవమి రోజున సూర్య కిరణాలు సరిగ్గా బాలరాముని నుదిటిపై పడాలన్నది ట్రస్టు నిర్ణయం. ఆలయ నిర్మాణం తదితరాల దృష్ట్యా విగ్రహం సరిగ్గా 51 అంగుళాల ఎత్తుంటేనే అది సాధ్యం’’ అన్నారు. అవసరమైన మేరకు పలు విషయాల్లో పలురకాల సాఫ్ట్వేర్ల సాయమూ తీసుకున్నా అంతిమంగా కేవలం సుత్తి, ఉలి ఉపయోగించి విగ్రహాన్ని ఆసాంతం అరుణ్ తన చేతులతోనే చెక్కారని వివరించారు. కృష్ణ శిలే ఎందుకు? విగ్రహ రూపకల్పనకు కృష్ణ శిలనే ఎంచుకోవడం వెనక శాస్త్రీయ కారణాలున్నాయి. ఆమ్లాలతో ఈ శిల ప్రతి చర్య జరపదు. వేడి, తీవ్ర వాతావరణ చర్యలకు కూడా స్పందించదు. ‘‘కనుక పాలు తదితరాలతో అభిషేకం చేసినప్పుడు వాటితో చర్య జరపదు. దాంతో రెండు లాభాలు. వాటిని ప్రసాదంగా తీసుకున్నా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావమూ ఉండదు. ఈ లక్షణం వల్ల విగ్రహం కనీసం వెయ్యేళ్ల దాకా చెక్కుచెదరదు. దానిపై కనీసం గీత కూడా పడదు’’ అని విజేత వివరించారు. అత్యున్నత నాణ్యతతో కూడిన కృష్ణ శిలలు కొన్నిచోట్ల మాత్రమే దొరుకుతాయి. బాలరామున్ని రూపొందించేందుకు వాడిన కృష్ణ శిల ఆ కోవలోదేనని విజేత చెప్పారు. ఇది మైసూరు సమీపంలోని హెచ్డీ కోటె దగ్గర లభ్యమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది?
అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. అదేరోజు ఆలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. సుప్రసిద్ధ మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ అయోధ్యలో కొలువుదీరే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ నేపధ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆరు నెలల మౌనదీక్ష అరుణ్ యోగిరాజ్ బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో నెలల తరబడి తన కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడకుండా, ఎంతో దీక్షతో ఈ కార్యాన్ని నెరవేర్చారని ట్రస్ట్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. విగ్రహ తయారీలో అరుణ్ యోగిరాజ్ పూర్తి అంకితభావాన్ని ప్రదర్శించారని తెలిపింది. కుటుంబానికి దూరంగా.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో విగ్రహ నిర్మాణ సమయంలో అరుణ్ యోగిరాజ్ చూపిన ఏకాగ్రత, కనబరిచిన త్యాగం అమోఘమని అన్నారు. విగ్రహం తయారు చేసే సమయంలో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఆయన దూరంగా ఉన్నారని చంపత్ రాయ్ తెలిపారు. చివరికి తన పిల్లల ముఖాలు కూడా చూడలేదని, మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించలేదని పేర్కొన్నారు. శంకరాచార్యుల విగ్రహం కూడా.. అరుణ్ యోగిరాజ్‌కు విగ్రహాల తయారీతో అమితమైన అనుబంధం ఉందన్నారు. వారి పూర్వీకులు కూడా శిల్పకళా నైపుణ్యం కలిగినవారేనన్నారు. కాగా కేదార్‌నాథ్‌లోని శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇంటిలో సంక్రాంతి సంబరాలు అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్న నేపధ్యంలో అతని కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపధ్యంలోనే వారంతా మకర సంక్రాంతిని అత్యంత వేడుకగా చేసుకున్నారు. ఈ సందర్భంగా శిల్పి అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి, భార్య విజేత యోగిరాజ్ మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ట్రస్ట్ ప్రకటన ఆనందదాయకం అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రోజున శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ కుమారుని గురించి చేసిన ప్రకటన తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కడానికి మైసూర్‌లోని హెగ్గదేవన్కోట్లోని కృష్ణ శిలను తమ కుమారుడు ఎంచుకున్నాడన్నారు. ఆ రాయిని శిల్పంగా మలిచేముందు తాను ఆ కృష్ణ శిలను పూజించానని తెలిపారు. ‘జీవితం సార్థకమైంది’ అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ తన భర్త చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ జీవితం సార్థకమైందన్నారు. తన భర్త అరుణ్ ఆరు నెలలపాటు అయోధ్యలో ఉన్న సమయంలో పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టంగా మారిందన్నారు. అయితే ఇప్పుడు తన భర్త రూపొందించిన విగ్రహం ఎంపిక కావడం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన భర్తను అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ బస చేయాలి? -
రాముణ్ణి చెక్కిన చేతులు
ఎంబిఏ చేసిన అరుణ్ యోగిరాజ్ కొన్నాళ్లు కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాడు.కాని అనువంశికంగా వస్తున్న కళ అతనిలో ఉంది.నా చేతులున్నది శిల్పాలు చెక్కడానికిగాని కీబోర్డు నొక్కడానికి కాదని ఉద్యోగం మానేశాడు.2008 నుంచి అతను చేస్తున్న సాధన ఇవాళ దేశంలోనే గొప్ప శిల్పిగా మార్చింది. అంతే కాదు ‘బాల రాముడి’ విగ్రహాన్ని చెక్కి అయోధ్య ప్రతిష్ఠాపన వరకూ తీసుకెళ్లింది.తమలో ఏ ప్రతిభ ఉందో యువతా, తమ పిల్లల్లో ఏ నైపుణ్యం ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలనడానికి ఉదాహరణ అరుణ్. జనవరి 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవంలో ఒక్కో విశేషం తెలుస్తూ వస్తోంది.ప్రాణప్రతిష్ఠ జరగనున్న విగ్రహాల్లో ‘బాల రాముడి’ విగ్రహం సమర్పించే గొప్ప అవకాశం మైసూరుకు చెందిన 40 ఏళ్ల శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు దక్కింది. కర్ణాటకకు చెందిన బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని తెలియచేసి హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయోధ్య రామమందిరంలో ‘బాల రాముడి’ విగ్రహం ప్రతిష్ట కోసం శిల్పం తయారు చేయమని దేశంలో ముగ్గురు శిల్పులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్‌క్షేత్ర ట్రస్ట్ బాధ్యత అప్పజెప్పింది. వారిలో ఒకరు అరుణ్ యోగిరాజ్. ఇతని కుటుంబం ఐదు తరాలుగా శిల్ప కళలో పేరు గడించింది. అరుణ్ తండ్రి యోగిరాజ్, తాత బసవణ్ణ శిల్పులుగా కర్ణాటకలో పేరు గడించారు. అయితే అరుణ్ ఈ కళను నేర్చుకున్నా అందరిలాగే కార్పొరేట్ ఉద్యోగం వైపు దృష్టి నిలిపాడు. కాని రక్తంలో ఉన్న శిల్పకళే మళ్లీ అతణ్ణి తనవైపు లాక్కుంది. 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తున్న అరుణ్ ఇప్పటికే అనేకచోట్ల శిల్పాలు స్థాపించి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. అరుణ్ తయారు చేసిన శిల్పాల్లో కేదార్‌నాథ్‌లోని ఆది శంకరాచార్య విగ్రహంతో మొదలు మైసూరులోని ఆర్.కె.లక్ష్మణ్ విగ్రహం వరకూ ఉన్నాయి. మైసూర్ రైల్వే స్టేషన్లో ‘లైఫ్ ఈజ్ ఏ జర్నీ’ పేరుతో ఒక కుటుంబం లగేజ్‌తో ఉన్న శిల్పాలు ప్రతిష్టించి అందరి దృష్టినీ ఆకర్షించాడు అరుణ్. అలా రాముడి విగ్రహం చెక్కే అవకాశం ΄÷ందే వరకూ ఎదిగాడు. 51 అంగుళాల విగ్రహం అరుణ్ చెక్కిన బాల రాముడి విగ్రహం శిరస్సు నుంచి పాదాల వరకు 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. అరుణ్ భార్య విజేత వివరాలు తెలియచేస్తూ ‘అరుణ్‌కి ఈ బాధ్యత అప్పజెప్పాక శిల్ప ఆకృతి గురించి అతడు ఎంతో పరిశోధించాల్సి వచ్చింది. దానికి కారణం బాల రాముడి విగ్రహం ఇలా ఉంటుందనడానికి ఎలాంటి రిఫరెన్స్ లేక΄ోవడమే. అందుకని అరుణ్ పురాణాల అధ్యయనంతో పాటు రాముడి వేషం కట్టిన దాదాపు 2000 మంది బాలల ఫొటోలు పరిశీలించాడు’ అని తెలిపింది. ఈ విగ్రహం కోసం ట్రస్ట్ శిలను అందించింది అరుణ్‌కు. ‘మామూలు గ్రానైట్ కంటే ఈ శిల దృఢంగా ఉంది. చెక్కడం సవాలుగా మారింది. అయినప్పటికీ తనకు వచ్చిన అవకాశం ఎంత విలువైనదో గ్రహించిన అరుణ్ రేయింబవళ్లు శిల్పాన్ని చెక్కి తన బాధ్యత నిర్వర్తించాడు’ అని తెలిపింది విజేత. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తల్లి ఆనందం కుమారుడు చెక్కిన శిల్పం రామ మందిరంలోప్రాణప్రతిష్ఠ చేసుకోనుందన్న వార్త విన్న అరుణ్ తల్లి ఆనందంతో తబ్బిబ్బవుతోంది. మరణించిన భర్తను తలచుకొని ఉద్వేగపడుతోంది. ‘అరుణ్ వాళ్ల నాన్న దగ్గరే శిల్పం చెక్కడం నేర్చుకున్నాడు. వాళ్ల నాన్న పేరు నిలబెడుతున్నాడు’ అంది. తల్లిదండ్రులు తెలుసుకోవాలి తల్లిదండ్రులు పిల్లల బాగు కోరుతారు. అయితే అన్నీ తాము ఆదేశించినట్టుగా పిల్లలు నడుచుకోవాలన్న «ధోరణి కూడా సరి కాదు. పిల్లలు తమకు ఇష్టమైన చదువులు చదవాలనుకుంటే ఎందుకు ఆ కోరిక కోరుతున్నారో పరిశీలించాలి. కళాత్మక నైపుణ్యాలుండి ఆ వైపు శిక్షణ తీసుకుంటామంటే వాటి బాగోగుల గురించి కనీసం ఆలోచించాలి. కఠినమైన చదువులకు అందరు పిల్లలూ పనికి రారు. రాని చదువును తప్పక చదవాల్సిందేనని హాస్టళ్లల్లో వేసి బాధించి ఇవాళ చూస్తున్న కొన్ని దుర్ఘటనలకు కారణం కారాదు. ఐశ్వర్యంతో జీవించడానికి కొన్నే మార్గాలు ఉండొచ్చు. కాని ఆనందంగా జీవించడానికి లక్షమార్గాలు. పిల్లల ఆనందమయ జీవితం కోసం చిన్నారుల ఆలోచనలను కూడా వినక తప్పదు. ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
ఆనంద డోలికల్లో అరుణ్ యోగిరాజ్ తల్లి
కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన శ్రీరాముని విగ్రహాన్ని అయోధ్యలోని నూతన రామాలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ సందర్భంగా అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు తీర్చిదిద్దిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠాపనకు ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే తన కుమారుడు శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేస్తుండగా, తాను చూడలేకపోయానని ఆమె తెలిపారు. తన కుమారుడు శ్రీరాముని శిల్పాన్ని తయారు చేస్తున్నప్పుడు.. విగ్రహం తయారీ చివరి రోజున చూపిస్తానని చెప్పాడన్నారు. తన కుమారుడు సాధించిన ఈ విజయానికి చాలా సంతోషంగా ఉందని, అయితే ఈ విజాయానందాన్ని పంచుకునేందుకు తన భర్త ఇప్పుడు జీవించి లేరని ఆమె తెలిపారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! -
అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే!
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న కొలువుదీరనున్న రాముని విగ్రహం ఖరారయ్యింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో ఇలా రాశారు.. ‘రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. రాముడు, హనుమంతునికి మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి సేవా కార్యం జరిగినదనడంలో సందేహం లేదు’ అని పేర్కొన్నారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్‌లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా నుండి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది. ఈ రాళ్లన్నింటినీ పరీక్షించగా కేవలం రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలో లభించిన శ్యామ శిల, రాజస్థాన్‌లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్లను ఎంపిక చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైనది. అలాగే కర్నాటకలోని శ్యామ శిల.. శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రాళ్ళు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయి. ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్(37) ఎంబీఏ పూర్తిచేశారు. ఇతను యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి, పూర్తిస్థాయి శిల్పకారునిగా మారారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అరుణ్ యోగిరాజ్.. మహారాజా జయచామరాజేంద్ర వడయార్‌తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. కేదార్‌నాథ్‌లో స్థాపించిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని రూపొందించారు. అలాగే మైసూరులో మహారాజా శ్రీకృష్ణరాజ వడయార్-IV, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే! "ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು" ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q — Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024 -
సస్పెన్స్ సహస్ర
‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘కాలింగ్ సహస్ర’. అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథి నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ అంశాలతో రానున్న ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘గాలోడు’ హిట్‌తో నాకు మాస్ ఇమేజ్ వచ్చింది. ‘కాలింగ్ సహస్ర’తో సస్పెన్స్ జానర్లోకి అడుగుపెడుతున్నా’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఇప్పటివరకు ఇలాంటి కథతో ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు’’ అన్నారు అరుణ్ విక్కిరాలా. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు విజేష్ తయాల్. -
వ్యర్థాలూ ఆదాయ మార్గం కావాలి!
పంట వ్యర్థాలను సేకరించే శ్రమను తీసుకోవాలంటే రైతులకు ఒక ప్రేరణ అవసరం. అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలూ ఎరువులను ఉత్పత్తి చేయడానికి అనువైనవి. దీని నుంచే వచ్చే ఘన ఎరువు స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్‌ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువులను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదగిన అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్ చేయవచ్చు. అప్పుడు కాలుష్యానికి కారణమయ్యేలా పంట వ్యర్థాలను వృథాగా కాల్చే పనివుండదు. ప్రభుత్వ సీనియర్ అధికారులు కచ్చితంగా క్వాంటమ్ కణాలకు చాలా భిన్నమైనవారు. అయినప్పటికీ, కణాలకూ, అధికారులకూ ఒక సారూప్యమైన గుణం ఉంటుంది. గమనించినప్పుడు స్థితి మార్చుకోవడం! పరిశీలనకుసంబంధించిన తక్షణ చర్యే మార్పును ప్రేరేపిస్తుంది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం పంట అవశేషాల దహనానికి స్వస్తి చెప్పాలని ఉత్తర భారత రాష్ట్రాల అధికారులను ఆదేశించినందున, అది ఎలా చేయాలో వారికే వదిలేస్తే, మనం ఎంతో కొంత చర్యను ఆశించవచ్చు. తదుపరి పంటను వేయడానికి తమ పొలాల్లోని పంట అవశేషాలను తొలగించాల్సిన రైతులతో విభేదాలు లేకుండా కోర్టు ఆదేశాలపై ఎలా చర్య తీసుకోవాలనే విషయంపై ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రపంచంలోని ఐదు అత్యంత కాలుష్య నగరాలలో నాలుగు దక్షిణాసియా నగరాలే. అవి: లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. భారత దేశం, పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా ధాన్యాన్ని వేరుచేసిన తర్వాత పొలాల్లో మిగిలినదాన్ని తగుల బెట్టే ఆచారం సమస్యలకు కారణం అవుతోంది. వాస్తవానికి, గాలిలో సాంద్రతలో ఈ మసి గరిష్ఠంగా 40 శాతం వరకు ఉంటుంది. దీంతో గాలి వేగాన్ని తగ్గించే వాతావరణం ఏర్పడడం వల్ల, కురుస్తున్న వర్షాన్ని అరికట్టడం వల్ల ఈ కాలుష్య కారకాలు చాలాకాలం పాటు అలా గాలిలో నిలిచివుంటాయి. ఇది గాలి నాణ్యతను గణనీయంగా క్షీణింపజేస్తుంది. వాహనాల పొగ, నిర్మాణపరమైన పనుల వల్ల ఏర్పడే దుమ్ము కాలుష్య కారకాలలో ఎక్కువ భాగంగా ఉంటున్నాయి. ఈ కాలుష్య మూలాలను అరికట్టడం చాలా కష్టం. వాహనాల కాలుష్యాన్ని తొల గించాలంటే, శిలాజ ఇంధనాలను వినియోగించే అంతర్గత దహన యంత్రాల స్థానంలో వాహనాలకు విద్యుచ్ఛక్తిని ఇవ్వాల్సి ఉంటుంది. శుభ్రపర్చిన ఇంధనాలు, మెరుగైన ఇంజన్లు తాత్కాలికంగా సహాయ పడతాయి. కాలుష్య కారక వాహనాలను శుభ్రపరిచి వాటిని మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దీనికి సమయం పడుతుంది. రోడ్డుపై నుండి వాహనాలు వెలువరించే ధూళిని ఎలా తగ్గించవచ్చు అంటే... అన్ని రోడ్ల పక్కన బహిర్గతమైన నేల, బహిరంగ ప్రదేశాలను కప్పడానికి గడ్డిని నాటడం ద్వారా. వెంటనే మొదటి గాలికే దుమ్మును దులిపే రకం చెట్లను కాకుండా, ఆ దుమ్మును నిలుపుకోగలిగే పచ్చద నాన్ని నాటడం కూడా మేలుచేస్తుంది. అయితే ఎడారి నేల మీదుగా వీచే గాలుల ద్వారా కొట్టుకువచ్చే దుమ్మును తగ్గించడానికి చేయ గలిగేది తక్కువ. నగరాల్లో జరిగే నిర్మాణ పనుల్లో దాని స్థానిక రూపంలోని పొడి సిమెంట్‌ను కాకుండా ముందే కలిపిన కాంక్రీట్‌ను మాత్రమే ఉపయో గించేట్టు చేయాలి. కాంక్రీట్ కలపడం కూడా బహిరంగంగా కాకుండా పరివేష్టిత ప్రదేశాలలో జరగాలని పట్టుబట్టడం ద్వారా చాలావరకు నిర్మాణాల పరమైన ధూళిని అరికట్టవచ్చు. ఇవి అవసరమైన చర్యలు. సంపూర్ణంగా ఆచరణీయమైనవి. అలాగని 19వ శతాబ్దానికి చెంది నట్లుగా ఇంకా పంట అవశేషాలను తగులబెట్టడం కొనసాగాలని అర్థం కాదు. ఆ అలవాటు అంతరించిపోవాలి. కానీ ఎలా? పంట వ్యర్థాలు, అలాగే అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలు, జీవ జీర్ణక్రియలో చిక్కుకున్న శక్తిని విడుదల చేయడానికీ, ఎరువులను ఉత్పత్తి చేయడానికీ అనువైనవి. నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, పేడనీళ్లతో కలిపిన మొక్కల అవశేషాలు మీథేన్‌గా కుళ్లిపోతాయి. దీని నుండి అవసరమైతే ఘన ఎరువులను తీయవచ్చు. దీనికిదే స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్‌ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువు లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించడం, వాటిని నిర్వహించడం అనేవి వ్యవసాయానికి భిన్నమైన కార్యకలాపాలు. బయోగ్యాస్ ప్లాంట్ నిర్వాహకులు కొనుగోలు చేయగలిగిన పంట అవశేషాలను కుప్పలుగా సేకరించడానికి రెతుకు ఒక ప్రేరణ అవసరం. పంట వ్యర్థా లను వదిలించుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, హ్యాపీ సీడర్ అనే యంత్రాన్ని ఉపయోగించడం. ఇది పొలాల నుండి వ్యర్థాలను అటు తీస్తూనే, ఇటు తదుపరి పంట విత్తనాలను నాటుతుంది. ఆ వ్యర్థాలను పొలంలోనే నశించేట్టు చేస్తుంది. అయితే ఈ పరికరం విస్తృతమైన కొనుగోలుకు లేదా అద్దెకు నోచుకోలేదు. తదుపరి పంటను నాటడా నికి ఉన్న విరామం చాలా స్వల్పం. రైతులందరికీ ఆ వ్యవధిలో పని చేయడానికి సరిపడా హ్యాపీ సీడర్లు అందుబాటులో లేవు. బయోగ్యాసును ఉత్పత్తి చేసే శక్తిమంతమైన కొత్త పరిశ్రమకు ముడి పదార్థంగా ఈ పంట అవశేషాలను అందించడమే మేలైన ప్రత్యామ్నాయంగా కనబడుతోంది. దీనిద్వారా రైతులు తమ పంట అవశేషాలను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందు తారు. పైగా సింథటిక్ ఎరువుల ధరతో పోల్చదగిన ధరకు సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉంటాయి. కానీ పంట అవశేషాలు అనేవి చురుకైన కాలుష్య కారకాల నుండి అదనపు వ్యవసాయ ఆదాయానికి పనికొచ్చే ప్రయోజనకరమైన ప్రవాహంగా మారడం దానంతటదే జరగదు. దానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బయోడైజెస్టర్లు వివిధ స్థాయుల సాంకేతిక అధునాతనత్వంతో రావచ్చు. ఇది ఎక్కువగా ముడి పదార్థంగా ఉపయోగించే వివిధ రకాల సేంద్రియ పదార్థాల ముందస్తు చికిత్సపై ఆధారపడి ఉంటుంది. ఒక భారతీయ బహుళజాతి సంస్థ బయోగ్యాస్ కోసం పెద్ద ప్రణాళికలను కలిగి ఉంది. బహుశా అధునాతన బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించి సరఫరా చేస్తుంది. ఇది ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో చెరకు పంట వ్యర్థాలను నిర్వహిస్తోంది. ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదVýæ్గ అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్ చేయవచ్చు. ఈ ప్రక్రియ పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆలో చించి సబ్సిడీతో బలం చేకూర్చినప్పటికీ, ప్లాంట్లను నిర్మించడం, గ్యాçసు కోసం పైప్‌లైన్ నెట్వర్క్ వేయడం, గ్యాసును ఎలా ఉపయోగించాలో నిర్ణయించడం వంటి వాటికి కాస్త సమయం పడుతుంది. అయితే ఇప్పుడు పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలని కోర్టు ఆదేశం. దీని వల్ల మంటలను ఎలాగైనా ఆర్పడానికి పోలీసులను ఉపయోగించాలనే ఆలోచన కలిగించవచ్చు. ఇది ఓటర్లుగా కూడా ఉన్న రైతుల్లో భిన్నమైన మంటలను రేకెత్తిస్తుంది. అందువల్ల పంట వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడమే సరైన పరిష్కారం. వ్యర్థా లను బయటకు తీయడానికి, రవాణా చేయడానికి రైతులకు అయ్యే ఖర్చును భరించడానికి ఒక సేకరణ ఏజెన్సీ సరిపోతుంది. భాక్రానంగల్ డ్యామ్ నిర్మిస్తున్నప్పుడు, దాని నిర్మాణానికి చెల్లించాల్సిన పన్ను గురించి రైతులు నిరసన వ్యక్తం చేసినప్పుడు, రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు ఆ ప్రాంతాన్ని రైతులు సందర్శించేలా చూశారు. తమ ముందు రూపుదిద్దుకుంటున్న ఆధునిక అద్భుతాన్ని స్వయంగా చూసేందుకు రైతులను ప్రాజెక్ట్ స్థలానికి తీసుకెళ్లారు. ప్రతాప్ సింగ్ ౖకైరోన్(పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి), అప్పటి వ్యవసాయ కార్యదర్శి ఆర్ఎస్ రంధావా, అప్పటి శాఖ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ సింగ్ వంటి వారు గ్రామీణ ప్రాంతాలలో పర్యటించారు. రైతులు మరింత ఆహా రాన్ని పండించాలనీ, మార్పునకు ఏజెంట్లుగా ఉండాలనీ కోరారు. నేడు పంజాబ్‌లోని రాజకీయ, పరిపాలనా నాయకులు మార్పుకు ఏజెంట్లుగా మారడానికి అవకాశం ఉంది. అయితే వారు ఈ సంద ర్భానికి తగినట్టుగా ప్రవర్తించగలరా అనేది ప్రశ్న. టి.కె. అరుణ్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో..!
కథ అనే సనిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నటుడు త్రిగుణ్. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యారు. తాజాగా ఈ హీరో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. బంధుమిత్రుల సమక్షంలో నివేదిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు తిరుపురులో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. (ఇది చదవండి: అవార్డులు నాకు చెత్తతో సమానం.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్! ) చెన్నైలో పుట్టి పెరిగిన త్రిగుణ్ కథ అనే చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత త్రిగుణ్ పలు సినిమాల్లో నటించారు. వైవిధ్యభరితమైన కథలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో ఫేమస్ అయ్యాడు. పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘ, చీకటి గదిలో చితక్కొట్టుడు, ప్రేమదేశం, కథ కంచికి.. మనం ఇంటికి, తుంగభద్ర, 24 కిస్సెస్, కిరాయి, లైన్మెన్ లాంటి చిత్రాల్లో నటించారు. త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. పాన్ ఇండియా రేంజ్లో!) -
ఆ దర్శకుడితో ధనుష్ మరో సినిమా
హీరో ధనుష్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. అయితే ‘కెప్టెన్ మిల్లర్’ తర్వాత అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలోనే మరో సినిమా చేయనున్నారు ధనుష్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇలా ధనుష్, అరుణ్ కాంబినేషన్ రిపీట్ కానుంది. అలాగే ఈ సినిమాకు ధనుష్ నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన కెరీర్‌లోని 50వ సినిమాతో బిజీగా ఉన్నారు ధనుష్. ఈ మూవీలో ఆయన హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే అరుణ్ సినిమాని స్టార్ట్ చేస్తారట. -
క్షణాల్లో మాయమైతివా బిడ్డా..
గొల్లపల్లి(ధర్మపురి): ‘క్షణాల్లో మాయమైతివా బిడ్డా’అంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అప్పటి వరకు బాగానే ఉన్న యువకుడు కళ్లముందే కుప్పకూలడం, ఆపై ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాలు.. గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఓరుగంటి సరోజన– మల్లేశం దంపతులకు అరుణ్(18), కూతురు అక్షిత సంతానం. అరుణ్ జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాలో డిగ్రీ రెండో సంవత్సరం, కూతురు గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే దంపతులు పిల్లలను ఉన్నంతలో చదివిస్తున్నారు. అరుణ్ గురువారం మధ్యాహ్నం మినరల్ వాటర్ తీసుకొచ్చేందుకు వెళ్లాడు. నీటిని క్యాన్‌లో పడుతున్న క్రమంలో అక్కడే ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయాడు. మరోసారి బలవంతంగా లేచి నిలుచునే క్రమంలో మళ్లీ కుప్పకూలాడు. క్షణాల్లో కుప్పకూలడం, ఆపై ప్రాణాలు పోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. అయినా ఆందోళనలో ఉన్న స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, కిందపడిపోవడంతో శ్వాస ఆగి చనిపోయాడని ధ్రువీకరించారు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించగా, వారిని ఆపడం ఎవరితరం కాలేదు. -
‘ఇద్దరు’ విజయం సాధించాలి
అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి, జె.డి చక్రవర్తి, ఫైజల్ ఖాన్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరు’. ఎఫ్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఫర్హీన్ ఫాతిమా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ సమీర్ దర్శకుడు. ఈ నెల 7న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర సక్సెస్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘అర్జున్ మంచి నటుడు. విలక్షణమైన పాత్రలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. జె.డి.చక్రవర్తికి సినిమా అంటే ప్యాషన్. వీరిద్దరూ కలిసి నటించిన ఈ చిత్రం హిట్ కావాలి. సమీర్ కష్టపడే తత్వం గలవాడు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. త్వరలోనే అతను బాలీవుడ్లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. చిన్న సినిమాలు ఆడితేనే పరిశ్రమ బావుంటుంది’ అని అన్నారు. ‘ఈ సినిమా ట్రైలర్ చూశా. ఆసక్తికరంగా ఉంది. మున్ముందు కూడా ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావాలి’ అని తీన్మార్ మల్లన్న అన్నారు. ‘యాక్షన్‌తోపాటు చక్కని వినోదాన్ని పంచే సినిమా ఇది’అని దర్శకుడు ఎస్ ఎస్ సమీర్ అన్నారు. ‘చాలా కష్టం పడి సినిమా పూర్తి చేశాం. సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది చివరి వరకూ గెస్ చేయలేరు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది’ అని నిర్మాత ఫర్హీన్ ఫాతిమా అన్నారు. నటుడు సమీర్, క్కుమార్, కరాటే లక్ష్మీ తదితరులతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. -
మర్డర్ మిస్టరీ
అరుణ్, సృజన జంటగా సురేష్ రెడ్డి దర్శకత్వంలో ‘వేటాడతా’ చిత్రం తెరకెక్కుతోంది. ఎమ్.అంకయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. వైజాగ్ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సాయివెంకట్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత నాగులపల్లి పద్మిని స్క్రిప్ట్ అందించగా, నిర్మాత రామ సత్యనారాయణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ అండ్ మర్డర్ మిస్టరీగా ‘వేటాడతా’ చిత్రం రూపొందుతోంది. ఈ నెలాఖరులో షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం. అరకు, హైదరాబాద్, నంద్యాల ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు అంకయ్య. ‘‘మా నాన్న(అంకయ్య) సిద్ధం చేసిన కథతో హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు అరుణ్. ఈ సినిమాకు సహ–నిర్మాత: డి.శివ ప్రసాద్, సంగీతం: శేఖర్ మోపూరి. -
నాడు ‘చల్ మేరీ లూనా’.. త్వరలో ఏం అనబోతున్నారంటే..
దేశంలో ఎలక్ట్రికల్ వాహనాలకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో నూతన స్టార్టప్‌లు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇదేసమయంలో పలు పాత కంపెనీలు కూడా మార్కెట్లో నూతన హంగులతో తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 80-90 దశాబ్ధాలలో తన హవా చాటిన లూనా గురించి అందరికీ తెలిసేవుంటుంది. అదే లూనా ఇప్పుడు మార్కెట్లోకి కొత్త హంగులతో వచ్చేందుకు సకల సన్నాహాలు చేస్తోంది. అయితే ఈసారి లూనా ఎలక్ట్రిక్ అవతారంలో పరుగులు తీయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ సులజ్జా ఫిరోదియా మోత్వానీ సోషల్ మీడియా మాధ్యమంలో తెలియజేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తన తండ్రికి సంబంధించిన పాత ఫొటోతో పాటు లూనా వింటేజ్ వీడియోను పోస్ట్ చేశారు. దానిలో బ్లాస్ట్ ఫ్రమ్ ద పోస్ట్!!‘చల్ మేరీ లూనా’. దీని రూపకర్త నా తండ్రి, పద్మశ్రీ అరుణ్ ఫిరోదియా!కైనెటిక్ గ్రీన్ కు ఆధునిక మార్పులు చేస్తూ‘ఈ- లూనా’ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా దీనికిముందు బజాజ్ ఆటో కూడా తన ప్రముఖ స్కూటర్ చేతక్‌ను పాత నేమ్ ప్లేట్‌తోనే ఎలక్ట్రిక్ వాహనంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. అలాగే ఎల్ఎంఎల్ కూడా ఇదే ఏడాది తన స్టార్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ అవతార్‌లో తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ లూనా అంటే ఈ- లూనా.. ఇది కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ వవర్ సొల్యూషన్ ద్వారా మార్కెట్లోకి ప్రవేశించనున్న తొలి మోడల్. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కంపెనీ నెలకు 5 వేల ‘ఈ లూనా’లను ఉత్పత్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కైనెటిక్ తన ఎలక్ట్రిక్ లూనా కోసం మరో అసెంబ్లీ లైన్ నెలకొల్పుతోంది. కంపెనీ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ఈ- లూనాలను ఉత్పత్తి చేయనుంది. కాగా కైనెటిక్ లూనా నాటి కాలంలో ఎంతో ఆదరణ పొందింది. దీనిని కైనెటిక్ ఇంజినీరింగ్ తొలిసారి 1972లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. సుమారు 50 సీసీ ఇంజను సామర్థ్యం కలిగిన ఈ వాహనం దేశంలో తొలి మోపెడ్‌గా పేరొందింది. తరువాతి కాలంలో టీఎఫ్ఆర్, డబల్ ప్లస్, వింగ్స్, మేగ్నం, సూపర్ పేర్లతో రకరకాల వేరియంట్స్‌లో ఈ వాహనం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం లూనాను తొలిసారి మార్కెట్లోకి తీసుకువచ్చినప్పుడు దీని ధర రూ.2,000. 1972లో వచ్చిన ఒరిజినల్ లూనా పియాజియో సియావో మోపెడ్‌కు చెందిన లైసెన్స్డ్ వెర్షన్. దీని తరువాత 2000 దశకం తొలినాళ్లలో లూనా ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు కైనెటిక్ తెలిపింది. -
మంచుఖండం మనసైన సాహసం
అంటార్కిటికా విహారం తెర మీద చూసినంత సౌకర్యంగా ఉండదు. కానీ మాటల్లో చెప్పలేనంత ఆహ్లాదంగా ఉంటుంది జర్నీ. అంటార్కిటికా గురించి తెలుసుకోవాలంటే స్వయంగా పర్యటించాల్సిందే అనుకున్నాడు హైదరాబాద్ కుర్రాడు హసన్ అరుణ్. లండన్, కింగ్స్ కాలేజ్‌లో ఎకనమిక్స్ చదువుతున్న అరుణ్ గత డిసెంబర్లో అంటార్కిటికా సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. విశేషాలను లండన్ నుంచి సాక్షితో పంచుకున్నాడు. మూడు సముద్రాల కలయిక ‘‘అంటార్కిటికా గురించి తెలుసుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇంటర్నెట్లో ఉన్న సమాచారం నాకు సంతృప్తినివ్వలేదు. స్వయంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే అనుకున్నాను. ఆ అడ్వెంచర్‌ని ఎంజాయ్ చేయాలని కూడా. హైదరాబాద్ నుంచి గత డిసెంబర్ 21వ తేదీ బయలుదేరి దాదాపుగా ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత బ్రెజిల్ లోని ‘రియో డీ జెనీరో’మీదుగా అర్జెంటీనా రాజధాని ‘బ్యూనోస్ ఎయిరిజ్’కి చేరాను. అక్కడ మూడు రోజులున్నాను. ప్రపంచం అంచు అని చెప్పే ‘ఉషుయాయియా’ ను చూశాను. అంటార్కిటికా క్రూయిజ్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఉషుయాయియా నుంచి 26వ తేదీ ఉదయం క్రూయిజ్ ప్రయాణం మొదలైంది. బీగెల్ చానెల్లో సాగుతుంది క్రూయిజ్ ప్రయాణం. డ్రేక్ ప్యాసేజ్ మీదుగా ఒకటిన్నర రోజు ప్రయాణించాలి. ఈ జర్నీలో అత్యంత క్లిష్టమైన ప్రదేశం ఇదే. అట్లాంటిక్, పసిఫిక్, సదరన్ ఓషన్ ఈ మూడు సముద్రాలు కలిసే ప్రదేశం ఇది. అలలు నాలుగు మీటర్ల నుంచి పదకొండు మీటర్ల ఎత్తు లేస్తుంటాయి. సీ సిక్నెస్ వచ్చేది ఇప్పుడే. తల తిరగడం, వాంతులతో ఇబ్బంది పడతారు. సిక్నెస్ తగ్గడానికి మందులు, సీ బ్యాండేజ్ ఇస్తారు. ఈ స్థితిలో నిద్ర సమయం కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత మైనస్ రెండు ఉంటుంది. క్రూయిజ్ లోపల ఏసీ ఉంటుంది, కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓపెన్ ప్లేస్‌లో నాలుగైదు నిమిషాలకంటే ఎక్కువసేపు ఉండలేం. అలలు పైకి లేచినప్పుడు అంత భారీ క్రూయిజ్ కూడా నీటి తాకిడికి కదిలిపోతుంటుంది. అలలు ఆరు మీటర్ల ఎత్తు వస్తున్నంత వరకు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అంతకు మించితే మాత్రం క్రూయిజ్ ఆగాల్సిందే. లంగరు వేసి వాతావరణం నెమ్మదించిన తర్వాత కదులుతుంది. మా జర్నీలో నాలుగు మీటర్లకు మించలేదు, కాబట్టి ఆగాల్సిన అవసరం రాలేదు. నేలను పలకరిస్తూ నీటిలో ప్రయాణం వెడెల్ సీలోకి ప్రవేశించామంటే అంటార్కిటికా ఖండంలోకి అడుగుపెట్టినట్లే. వెడెల్ సీ లో దాదాపు సగం రోజు సాగుతుంది ప్రయాణం. గ్లేసియర్లు, ఐస్‌బెర్గ్‌లు, పర్వతాలు, పెంగ్విన్ కాలనీలు, వేల్స్, సీల్స్ కనిపిస్తుంటాయి. అంటార్కిటికా చేరిన తర్వాత ఆరు రోజుల పా టు రోజుకు రెండు దీవులు లేదా ద్వీపకల్పాల మీద ల్యాండ్ అవుతూ ఆరు రోజుల్లో పన్నెండింటిని కవర్ చేశాను. జనవరి రెండవ తేదీ తిరుగు ప్రయాణం. ‘బ్యూనోస్ ఎయిరిజ్’ నుంచి నేను లండన్‌కి వచ్చేశాను. రోజంతా పగలే! అంటార్కిటికాలో రోజంతా నింగికీ నేలకూ మధ్యనే గడిపినప్పటికీ ఆ వారం రోజులూ సూర్యాస్తమయాన్ని చూడలేకపోయాను. సూర్యుడు చండప్రచండంగా ఉదయించే ఉన్నాడు. ఇది అద్భుతమైన అనుభూతి. కాలుష్యం అంటే ఏమిటో తెలియని స్వచ్ఛమైన నీరు, లెక్కకు మించిన హిమనీనదాలు, గుంపుల కొద్దీ పెంగ్విన్ లు, సహజమైన దారుల్లో ట్రెకింగ్ నాకు మరిచిపోలేని జ్ఞాపకాలు. నేను అడ్వెంచర్స్ని బాగా ఇష్టపడతాను, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లో కూడా ట్రెకింగ్ చేశాను. కానీ అంటార్కిటికా ట్రెకింగ్ సహజత్వం ఒడిలో సాగిన సాహసం అనిపించింది’’. మనిషి వల్లే హాని అంటార్కిటికా గురించి ప్రయాణంలోనే ఎక్కువ తెలుసుకోగలిగాను. క్రూయిజ్‌లో మెరైన్ ఇంజనీర్లు, సైంటిస్ట్‌లు, నేచరిస్ట్లు కూడా ఉంటారు. ఒక ప్రదేశానికి వెళ్లడానికి ముందు ఆ ప్రదేశం వివరాలు, అక్కడ మెలగాల్సిన విధానం కూడా చెప్తారు . పెంగ్విన్ లకు కనీసం ఐదు మీటర్ల దూరంగా ఉండాలని, మనుషుల నుంచి వాటికి ఇన్ఫెక్షన్ సోకితే ఏకంగా వేలకొద్దీ ఉన్న కాలనీలే తుడిచిపెట్టుకుపోతాయని తెలిసింది. మనిషి ఎంత హానికారకుడో, ప్రకృతికి ఎంత పెద్ద శత్రువో మొదటిసారి తెలిసింది. వాళ్లు పర్యాటకులను ఆహ్వానిస్తూనే మంచుఖండం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించుకుంటున్నారు. ఇక్కడ పర్యటించడానికి డిసెంబర్ రెండవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకు అనుకూలమైన సమయం. – హసన్ అరుణ్, సాహస యాత్రికుడు -- ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
ఇంగ్లండ్‌లో ప్రజా చైతన్యం ఎక్కువ
తెనాలి: ఇంగ్లండ్‌లో ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంతో వ్యవహరిస్తారని, ప్రజల్లో కూడా చైతన్యం ఎక్కువని హ్యాంప్‌షైర్ కౌంటీ కౌన్సిలర్ అరుణ్ ముమ్మలనేని చెప్పారు. అక్కడి నాయకులు గాలివాటుగా వాగ్దానాలు చేయడం కుదరదని, అలా చేసినందువల్ల దేశ ప్రధానమంత్రి సైతం పదవి నుంచి వైదొలగినట్టు గుర్తుచేశారు. స్వస్థలం వచ్చిన అరుణ్ ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలోని మిత్రుడు కుర్రా శ్రీనివాసరావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన వృత్తి ఉద్యోగమని, రాజకీయం ప్రవృత్తి మాత్రమేనని తెలిపారు. పుట్టినగడ్డలో పలు సేవాకార్యక్రమాలు చేస్తున్న ఆయన తెలిపిన వివరాలు.. ► నా స్వస్థలం రేపల్లె దగ్గర్లోని చాట్రగడ్డ. పెరిగిందీ, చదువుకుందీ అమ్మమ్మగారి ఊరైన అమృతలూరు మండలం, మోపర్రు గ్రామం. కాకినాడ, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చేశాక సీఎంసీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తర్వాత ఇంగ్లండ్ వెళ్లాను. ► హ్యాంప్‌షైర్ కౌంటీలోని బేజింగ్‌స్టోక్ వాయవ్య నియోజకవర్గం ప్రతినిధిగా గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీ నుంచి భారీ మెజారిటీతో ఎన్నికైన తొలి శ్వేత జాతీయేతరుడిని. ► పార్టీ బేజింగ్‌స్టోక్ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగుతున్నా. అక్కడి ప్రాథమిక సభ్యుల ఆమోదంతో ఎంపీగా పోటీచేసేందుకు అర్హత లభించింది. బేజింగ్‌స్టోక్, బారో కౌన్సిల్‌కూ ఎన్నికయ్యాను. స్త్రీ శిశు, కుటుంబ సంక్షేమ అడ్వయిజరీ ప్యానల్ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని రక్షణ మంత్రిత్వశాఖకు ఫ్రీలాన్స్ కన్సల్టెంటుగా ఉన్నా. ► ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాక తెలుగువారితో ఓ సంఘం ఏర్పాటులో భాగస్వామినయ్యా. బేజింగ్‌స్టోక్ కల్చరల్ ఫోరం చైర్మన్‌గానూ చేస్తున్నా. తెలుగు బడి పేరుతో వారాంతాల్లో మన వాళ్ల పిల్లలకు తెలుగు నేర్పుతున్నాం. ► ఇంగ్లండ్‌లో నిజమైన అర్హులకే సంక్షేమ పథకాలు లభిస్తాయి. అనర్హులు వాటిని ఆశించరు కూడా. ► ప్రతి ఒక్కరి ఆదాయం, ఖర్చు లెక్కలు ప్రభుత్వానికి తెలుస్తుంది. అవినీతికి ఆస్కారం ఉండదు. 10వ తరగతి వరకు నిర్బంధ విద్య ఉంటుంది. ► సేవా కార్యక్రమాల్లో భాగంగా చాట్రగడ్డలో వృద్ధాశ్రమానికి వితరణ, మోపర్రు, పరిసరాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం ప్లేట్లు, పుస్తకాలు, యూనిఫాంలు అందించాను. ► కోవిడ్ రోజుల్లోకూడా పలు సేవలు చేశాం. ప్రతిభావంతులైన పేద విద్యార్థులను చదివిస్తున్నాను. -
రెండు వారాలుగా టాప్‌లో స్ట్రీమింగ్.. ఓటీటీలో దూసుకెళ్తున్న సస్పెన్స్ థ్రిల్లర్
ఎస్తేర్ నోహ, అమర్ దీప్, అరుణ్ ప్రధాన పాత్రల్లో ఒక తెల్లటి కెమెరా ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఐరావతం'. నూజివీడు టాకీస్ పతాకంపై గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రేఖ పలగాని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి, లలిత కుమారి తోట నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 'ఫ్యూజన్' సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఐరావతం మూవీ ఈ నెల 17 నుంచి రెండు వారాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఎస్తేర్, అమర్ దీప్, తన్వి నెగ్గి అరుణ్ డబుల్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... 'సుహాస్ మాకు ఆటవిడుపుగా ఐరావతం కథ చెప్తే విని కథలోని స్క్రీన్ ప్లే స్ట్రాటజీ నచ్చి మూవీ తీద్దామనుకున్నాం. చివరికి ఈ మూవీ హాట్ స్టార్‌లో అనుకోకుండా రెండు వారాలుగా టాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మంచి కథని నమ్మినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం.' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...'ఫ్యూజన్ జోనర్లో తీసిన ఐరావతం హాట్ స్టార్ ప్రేక్షకులకు నచ్చడం చాలా హ్యాపీ. నిర్మాతలకు థాంక్స్. టెక్నీషియన్స్ థాంక్స్.' అని అన్నారు. -
T20 WC: కోహ్లిని సెలక్ట్ చేయాలా? వద్దా? అని వాళ్లే నిర్ణయిస్తారు! కెప్టెన్‌గా..
Virat Kohli: నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి కోశాధికారి అరుణ్ ధుమాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లికి విశ్రాంతినివ్వాలా లేదంటే జట్టుకు ఎంపిక చేయాలా అన్నది పూర్తిగా సెలక్టర్ల నిర్ణయమే అన్నాడు. ఇక కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కోహ్లి నిర్ణయించుకున్నపుడు, దానిని తాము గౌరవించామని పేర్కొన్నాడు. అంతేతప్ప ఎవరూ బలవంతంగా అతడిని తప్పించలేదంటూ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. అదే విధంగా భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అరుణ్ ధుమాల్ పునురుద్ఘాటించాడు. అయితే, ఇరువురి అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్న క్రమంలో ఇలాంటి వదంతులు వ్యాపించడం సహజమేనని చెప్పుకొచ్చాడు. కాగా గత కొన్ని రోజులుగా తన స్థాయికి తగ్గట్టు రాణించలేక కోహ్లి పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెస్టిండీస్, జింబాబ్వే టూర్లకు అతడు దూరం కావడం గమనార్హం. విశ్రాంతి పేరిట కావాలనే కోహ్లిని తప్పిస్తున్నారని అభిమానులు అంటుండగా... తన కెరీర్‌కు ఏది సరైందో కోహ్లి ఆ నిర్ణయమే తీసుకుంటాడంటూ మరికొంత మంది అంటున్నారు. అది వాళ్లు చూసుకుంటారు! ఇక పలువురు క్రికెట్ దిగ్గజాలు సైతం కోహ్లికి ప్రస్తుతం బ్రేక్ అవసరమని, అప్పుడే అతడు తిరిగి పుంజుకుని మునుపటిలా రాణిస్తాడని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టు విమల్ కుమార్‌తో బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ముచ్చటించాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో జట్టులో కోహ్లి స్థానం గురించి చర్చ జరుగుతుండగా అతడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘కోహ్లి ఎంపిక విషయంలో సెలక్టర్లదే తుది నిర్ణయం. అతడు జట్టులో ఉండాలా వద్దా అనేది వాళ్లే నిర్ణయిస్తారు. ఇక కెప్టెన్సీ గురించి చెప్పాలంటే.. తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటానని కోహ్లి తనకు తానుగా చెప్పాడు. అది అతడి సొంత నిర్ణయం. మేము దానిని గౌరవించాం. భారత క్రికెట్‌కు అతడు ఎనలేని సేవ చేశాడు. ప్రతి ఒక్కరు అందుకు అతడిని గౌరవిస్తారు కూడా! ఏదేమైనా జట్టుకు అతడిని ఎంపిక చేయాలా వద్దా అనేది మాత్రం సెలక్టర్లు చూసుకుంటారు’’ అని పేర్కొన్నాడు. ఇక కోహ్లి వర్సెస్ రోహిత్ అంటూ బయట జరుగుతున్న చర్చ గురించి తాము పట్టించుకోమన్న అరుణ్.. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడే స్వేచ్ఛ నెటిజన్లకు ఉందన్నాడు. అయినా, ఇలాంటి రూమర్లు కొత్తేమీ కాదని.. గతంలో సునిల్ గావస్కర్- కపిల్ దేవ్.. సచిన్ టెండుల్కర్- సౌరవ్ గంగూలీ విషయంలోనూ ఇలాగే మాట్లాడారని గుర్తుచేశాడు. చదవండి: CWG 2022: వైరల్‌గా మారిన నిఖత్ జరీన్ చర్య.. ఏం జరిగింది? Hardik Pandya May Vice Captain: రోహిత్ బాటలోనే కేఎల్ రాహుల్.. హార్దిక్‌కు ప్రమోషన్! -
Ind Vs Sa: ‘దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పు లేదు’
Omicron: BCCI Arun Dhumal Comments Over India Tour Of South Africa: వచ్చే వారం నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టు షెడ్యూల్లో ఇప్పటి వరకైతే ఎలాంటి మార్పూ లేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ విస్తరిస్తుండటంతో ఈ టూర్‌పై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ధుమాల్ స్పష్టతనిచ్చారు. అయితే ఆటగాళ్ల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడబోమని, ఈ విషయంలో భారత ప్రభుత్వం ఏమైనా సూచనలు చేస్తే వాటిని అనుసరిస్తామని చెప్పారు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత డిసెంబరు 8 లేదంటే 9న భారత జట్టు దక్షిణాఫ్రికాకు పయనం కావాల్సి ఉంది. ఇక కివీస్‌తో తొలి టెస్టును టీమిండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా 2021-22 షెడ్యూల్ మూడు టెస్టులు: ►తొలి టెస్టు- డిసెంబరు 17-21, జొహన్నస్‌బర్గ్. ►రెండో టెస్టు- డిసెంబరు 26-30, సెంచూరియన్ ►మూడో టెస్టు- జనవరి 3-7, కేప్‌టౌన్ మూడు వన్డేలు: ►మొదటి వన్డే- జనవరి 11, పర్ల్ ►రెండో వన్డే- జనవరి 14, కేప్‌టౌన్ ►మూడో వన్డే- జనవరి 16, కేప్‌టౌన్ నాలుగు టీ20 మ్యాచ్‌లు ►మొదటి టీ20- జనవరి 19, కేప్‌టౌన్ ►రెండో టీ20- జనవరి 21, కేప్‌టౌన్ ►మూడో టీ20- జనవరి 23, కేప్‌టౌన్ ►నాలుగో టీ20- జనవరి 26, పర్ల్. చదవండి: IPL Retention: ఈ 27 మంది ఓకే.. మరి ఆ ఆరు స్థానాలు.. వార్నర్, రాహుల్, రషీద్, గిల్ ఇంకా -
ఏపీ తక్షణ స్పందన అందరికీ ఆదర్శం
సాక్షి, అమరావతి: ప్రేమోన్మాది చేతిలో పది రోజుల క్రితం గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిన తీరు అభినందనీయమని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థిని హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుకు నూటికి 200 మార్కులు వేయవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలు ముఖ్యంగా మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. రమ్య హత్యోదంతం ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం వేగంగా వ్యవహరించిన తీరును దేశమంతా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర కేసుల్లోనూ ఇలాగే స్పందించాలని కమిషన్ కోరుకుంటోందని తెలిపారు. ఘటన పూర్వాపరాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం మంగళవారం గుంటూరు చేరుకుని బాధిత కుటుంబాన్ని కలుసుకుని పరామర్శించి వివరాలు సేకరించింది. వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులతో సమావేశం అనంతరం కమిషన్ సభ్యులు అంజుబాలా, సుభాష్పార్థిలతో కలసి అరుణ్ హల్దార్ మీడియాతో మాట్లాడారు. అత్యాచార నిరోధక చట్టాన్ని వేగంగా అమలు చేయడం, నిందితుడిని వెంటనే అరెస్టు చేయడం, చార్జ్‌షీట్ వేగంగా ఫైల్ చేయడం, పరిహారాన్ని వెంటనే చెల్లించడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. శభాష్ పోలీస్.. అవార్డులకు సిఫార్సు డీఐజీ నేతృత్వంలో గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందని అరుణ్ హల్దార్ అభినందించారు. ఈ కేసును వేగవంతంగా పరిష్కరించేలా కృషి చేసిన అధికారులకు అవార్డులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. ఎస్సీల వినతులు సత్వర పరిష్కారం కోసం జాతీయ కమిషన్ తరఫున ఒక ప్రత్యేక సెల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రతకు ప్రత్యేక చర్యలు: సీఎస్ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. గుంటూరు ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలిచిందని చెప్పారు. బాధితురాలి తల్లికి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిబంధనల ప్రకారం రూ.8.25 లక్షల పరిహారాన్ని అందించడంతోపాటు అదనంగా మరో రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెల్లించినట్లు తెలిపారు. ఇంటిపట్టాను కూడా మంజూరు చేసి సొంత ఇంటి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా గత ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ లెవెల్ హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగిందని, జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన క్రమం తప్పకుండా సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. త్వరలో ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల ప్రతినిధులతో సంప్రదించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు: డీజీపీ సవాంగ్ ఘటన జరిగిన వెంటనే పోలీస్ యంత్రాంగం యుధ్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరించి చార్జ్‌షీట్ ఫైల్ చేసిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళల భద్రత కోసం దిశ యాప్‌ను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడంతో రాష్ట్రానికి ఐదు జాతీయ అవార్డులు లభించాయని చెప్పారు. పోలీస్ సేవా యాప్ ద్వారా గత 10 నెలల వ్యవధిలో 7 లక్షల మందికిపైగా ఎఫ్ఐఆర్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖ ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న నేపథ్యంలోగత ఏడాదిన్నర కాలంలో 34 వేల కేసులు రిజిస్టర్ అయ్యాయని, వీటిలో 52 శాతం ఫిర్యాదులు మహిళలకు సంబంధించినవేనని తెలిపారు. సమావేశంలో డీఐజీలు రాజకుమారి, పాలరాజు, గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు పాల్గొన్నారు. దిశ యాప్‌తో దేశానికే ఆదర్శంగా నిలిచారు మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ఎస్సీ కమిషన్ సభ్యులు అంజుబాలా ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి దిశ యాప్ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. వీటిని సమర్థంగా నిర్వహిస్తూ ఏపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కమిషన్ బృందం వెంట సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ హర్షవర్థన్ తదితరులున్నారు. మేం అడగకుండానే ప్రభుత్వం ఆదుకుంది ఇటీవల గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని ఎన్.రమ్య దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబం కూడా అదే కోరుతోందని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ పేర్కొన్నారు. తాము వచ్చి అడగక ముందే బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకుని చట్టపరంగా రావాల్సిన అన్ని సదుపాయాలను అందచేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బాధిత కుటుంబం పట్ల ఏపీ ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించిందన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ బృందం మంగళవారం గుంటూరులో పర్యటించింది. బాధితురాలు రమ్య ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించింది. సంఘటనా స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరుపై వివరాలు సేకరించింది. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వివిధ పక్షాల నుంచి వినతిపత్రాలు స్వీకరించింది. ఈ సందర్భంగా హల్దార్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి చార్జిషీట్ దాఖలు చేశారని చెప్పారు. కేంద్ర సాయం అందించేలా చర్యలు.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాధితురాలి కుటుంబానికి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హల్దార్ తెలిపారు. అధైర్యం చెందవద్దని, బాధితులకు ఎస్సీ కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్సీల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కమిషన్ రక్షణ కల్పిస్తుందన్నారు. వివిధ పక్షాలు అందచేసిన వినతిపత్రాలను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, విడదల రజని, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మద్య విమోచన కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితోపాటు పలు పార్టీల నేతలు కమిషన్‌ను కలిశారు. -
యూట్యూబ్‌లో సత్తా చాటుతోన్న శివాని రాజశేఖర్ సాంగ్
ఆదిల్ అరున్, శివాని రాజాశేఖర్ హీరోహీరోయిన్లుగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘కన్నులు చెదిరే’ లిరికల్ వీడియో సాంగ్‌ను నటుడు అడివి శేష్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రేండ్ అవుతోంది. ‘కన్నులు చెదిరే అందాన్నె వెన్నెల తెరపై చూశానే.. కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే...’ అంటూ సాగే ఈ లవ్ మెలోడి సాంగ్ సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట శ్రోతలని ఆకట్టుకుంటూ యూట్యూజ్‌లో 1 మిలియన్‌కి పైగా వ్యూస్‌ని సాధించింది. అనంత శ్రీరామ్ లిరిక్స్ , యాజిన్ నిజార్ గాత్రం.. సైమన్ కె కింగ్ బాణీ అన్నీ కూడా చక్కగా కుదిరాయి. ఇప్పటికే ఈ వీడియో సాంగ్ విడదల కార్యక్రమంలో అడవి శేష్ మాట్లాడుతూ పాట అద్భుతంగా ఉందంటూ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తాజాగా తమ పాట ఇంతటి ఆదరణను దక్కించుకున్నందుకు చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ.. ‘మా రామంత్ర క్రియేషన్స్ బేనర్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ ఇది. అలాగే ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు మూవీ. ఇప్పటికే విడుదలైన టీజర్, నైలునది, లాక్డౌన్ ర్యాప్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా `మేజర్` అడివిశేష్ రిలీజ్ చేసిన `కన్నులు చెదిరే..` లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 1 మిలియన్‌కి పైగా ఆర్గానిక్ వ్యూస్‌ని సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ పాట విడుదల చేసిన అడివిశేస్‌కు, ఆదిత్య మ్యూజిక్ వారికి మా రామంత్ర క్రియేషన్స్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అంటు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ చక్కగా నటించారని, గుహన్ అద్బుతంగా తెరకెక్కించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సమన్ కె. కింగ్ సంగీతం అందించారు. -
'ఖైదీ' నటుడి అకాల మరణం
చెన్నై: తమిళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అరుణ్ అలెగ్జాండర్ కన్నుమూశారు. సోమవారం నాడు ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. 48 ఏళ్ల వయసులోనే ఆయన మృత్యువాత పడటం చిత్రసీమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతికి అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. "ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోతావని ఊహించలేదు. దుఃఖం ఆగట్లేదు. నీ లోటును ఎవరూ పూడ్చలేరు. నా గుండెలో ఎప్పటికీ నువ్వు పదిలంగా ఉంటావు" అంటూ దర్శకుడు కనగరాజ్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. కాగా అరుణ్ అలెగ్జాండర్ 'కోలమావు కోకిల', 'బిగిల్', 'ఖైదీ', 'మాస్టర్' వంటి చిత్రాల్లో నటించారు. ఆయన చివరిసారిగా నటించిన 'మాస్టర్' సినిమాలో స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించగా ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది. (చదవండి: విషాదం: ప్రముఖ నటుడు దుర్మరణం) (చదవండి: జీఎస్టీ టీజర్ బాగుంది) Actor #ArunAlexander who was seen with Thalapathy in Bigil is no more! He had acted in Master too. #RIP pic.twitter.com/GDCmGBp7dA — Actor Vijay Fans (@Actor_Vijay) December 28, 2020 -
ఐపీఎల్ 2020: బీసీసీఐ ఆదాయం ఎంతంటే!
న్యూఢిల్లీ: క్యాష్ రిచ్ ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కరోనా కాలంలోనూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సిరులు కురిపించింది. యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్-13వ సీజన్‌కు గానూ బోర్డు సుమారు 4 వేల కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అదే విధంగా గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ వ్యూయర్షిప్ కూడా 25 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు. కాగా మహమ్మారి కరోనా దెబ్బకు క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడ్డ వేళ ఐపీఎల్ నిర్వహణపై కూడా సందేహాలు తలెత్తిన విషయం తెలిసిందే. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో మార్చి 29న మొదలు కావాల్సిన ఐపీఎల్-2020 సీజన్‌ను తొలుత వాయిదా వేశారు.(చదవండి: కోహ్లి త్వరలోనే ఆ ఘనత సాధిస్తాడు: భజ్జీ) ఆ తర్వాత జూన్-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం పడకపోవడంతో.. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని బీసీసీఐ పెద్దలు భావించారు. అయితే టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బోర్డు.. అక్కడి అధికారులతో సంప్రదించగా సానుకూల స్పందన లభించింది. దీంతో కోవిడ్ నిబంధనల నడుమ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీని బీసీసీఐ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్న బోర్డుగా పేరొందిన బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం గడించినట్లు అరుణ్ ధుమాల్ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘గతేడాది ఐపీఎల్‌తో పోలిస్తే ఈసారి 35 శాతం మేర నిర్వహణ ఖర్చు తగ్గింది. కరోనా కాలంలో 4 వేల కోట్ల రూపాయాల ఆదాయం ఆర్జించాం. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. టీవీ వ్యూయర్షిప్ 25 శాతం వరకు పెరిగింది. తొలుత మాపై సందేహాలు వ్యక్తం చేసిన వారే ఐపీఎల్‌ను విజయవంతంగా పూర్తిచేసినందుకు మాకు ధన్యవాదాలు తెలిపారు. ఒకవేళ ఈ సీజన్ నిర్వహించకపోయి ఉంటే క్రికెటర్లు ఓ ఏడాది కాలాన్ని కోల్పేయేవారు’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: యూఏఈకి బీసీసీఐ బంపర్ బొనాంజ!) ఇక కోవిడ్ కాలంలో టోర్నీ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తల గురించి చెబుతూ.. ‘‘ఈ టీ20 లీగ్‌లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా 1800 మందికి సుమారు 30 వేల మేర కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పక్షంలో వారు కోలుకునేంత వరకు అన్ని రకాల చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. క్వారంటైన్ కోసం సుమారు 200 గదులు బుక్ చేశాం’’ అని అరుణ్ ధుమల్ పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-13వ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ ట్రోఫీని ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. తద్వారా ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుగా రోహిత్ సేన చరిత్ర సృష్టించింది. -
వాసన్ హెల్త్ కేర్ ఫౌండర్ కన్నుమూత
సాక్షి, చెన్నై : వాసన్ ఐ కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్ (51) ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. అరుణ్ మరణవార్తను చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఒమాండురార్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. కాగా అరుణ్ దేశవ్యాప్తంగా వాసన్ ఐ కేర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. -
ప్రభుత్వం అనుమతిస్తే ఇళ్లు నిర్మిస్తాం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలను ఇవ్వనుందని, తమకు ప్రభుత్వం అనుమతిస్తే ఆ స్థలాల్లో చక్కటి ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇస్తామని ఆశ్రయం ప్రాజెక్ట్స్ సీఈవో, కొండూరు ఆర్కా గ్రూప్ ఆఫ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్భవానీ చెప్పారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. ► ఆశ్రయం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలు పూర్తి చేశాం. ► ప్రభుత్వం పేదలకిచ్చే స్థలాల్లో మా కంపెనీ ఆధ్వర్యంలో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి 400 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతి కోరతాం. ► అందుకు సంబంధించిన డిజైన్‌ను ముఖ్యమంత్రికి, మంత్రులకు చూపించనున్నాం. ► వైఎస్సార్ గృహనిర్మాణ్ పేరుతో ఆకృతి నమూనాను విడుదల చేశాం. ► ప్రభుత్వం కానీ, లబ్ధిదారులు కానీ ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అనువైన స్థలాన్ని తమకు కేటాయిస్తే చాలు. -
యువ దర్శకుడు మృతి.. విషాదంలో శంకర్
చెన్నై : యువ దర్శకుడు అరుణ్ ప్రసాత్ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న అరుణ్‌ను.. లారీ ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని మెట్టుపాలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అరుణ్.. జీవీ ప్రకాష్ కుమార్, గాయత్రి సురేష్, సురేష్ మీనన్, సతీష్ ముఖ్య పాత్రల్లో 4 జీ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. అయితే సీవీ కుమార్ నిర్మించిన ఈ చిత్రం పలు కారణాలతో ఇప్పటివరకు విడుదల కాలేదు. అరుణ్ ఆకస్మిక మరణం కోలివుడ్లో విషాదం నెలకొంది. పలువురు తమిళ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. అరుణ్ మృతిపై దర్శకుడు శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. యువదర్శకుడు, తన మాజీ అసిస్టెంట్ అరుణ్ ఆకస్మిక మరణం.. తనను కలిచివేసిందని చెప్పారు. అరుణ్ మృదు స్వభావి అని, పాజిటివ్ థింకింగ్‌తో కష్టపడుతూ ముందుకు సాగేవాడని గుర్తుచేసుకున్నారు. అరుణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హీరో జీవీ ప్రకాష్, హాస్యనటుడు మనోబాలా కూడా అరుణ్ మృతిపట్ల సంతాపం తెలిపారు. (చదవండి : అనసూయను అభినందించిన రాచకొండ పోలీసులు) Heartbroken by the sudden demise of the young director and my ex-assistant, Arun. You were always sweet, positive and hardworking. My prayers are forever with you and my deepest condolences to your family and friends.🙏 pic.twitter.com/ZA6kvfcYLj — Shankar Shanmugham (@shankarshanmugh) May 15, 2020 -
బుల్లితెర శోభన్‌బాబు
బుల్లితెరపై విజె సన్నిగా అలరించిన అరుణ్ సీరియల్ నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు. ‘అందరూ సీరియల్ శోభన్‌బాబు అని కితాబులిస్తున్నారు’ అంటూ సరదాగా వివరించిన అరుణ్ సింగిల్ ట్రావెల్ జర్నీ అంటే అమితంగా ఇష్టపడతానని తన విషయాలు చెప్పుకొచ్చాడు. ‘మాది ఖమ్మం. పీజీ చేస్తున్నప్పుడు అవకాశం వస్తే ముందు ఒక టీవీ చానెల్లో లైఫ్‌సై్టల్ రిపోర్టర్‌గా పనిచేశాను. ఆ తర్వాత యాంకరింగ్ వైపు వచ్చాను. మూడేళ్లపాటు టీవీ యాంకర్‌గా వర్క్ చేశాను. నా యాంకరింగ్ చూసిన టీవీ సీరియల్ వాళ్లు ఆడిషన్స్‌కు పిలిచారు. అలా ‘కళ్యాణవైభోగం’ సీరియల్ ద్వారా నటుడిగా పరిచయం అయ్యాను. మూడేళ్లుగా ఈ సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్నాను. ‘కళ్యాణవైభోగం’ సీరియల్లోని దృశ్యం సూర్యదేవర జయసూర్య అనే నేను ‘జీ తెలుగు’లో వచ్చే ‘కళ్యాణౖవైభోగం’ సీరియల్లో సూర్యదేవర జయసూర్యగా లీడ్ రోల్లో నటిస్తున్నాను. ఈ సీరియల్లో బిజినెస్ మ్యాన్‌గా రాణిస్తుంటాను. బిజినెస్ ఉమన్ నిత్యను చూసి, ఇష్టపడి పెళ్లిచేసుకుంటాను. తనే నా లైఫ్ అన్నట్టుగా ఉంటాను. అయితే, అనుకోకుండా మా ఇద్దరి మధ్య బిజినెస్ వార్ నడుస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో నిత్య చనిపోయిందని అందరూ అనుకుంటారు. నిత్య స్థానంలో అదే పోలికతో ఉండే మంగను చేర్చుతారు. ఈ విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని భయం. ఇలా ఓ భిన్న కథాంశంతో సీరియల్ నడుస్తుంది. మా టీమ్‌లో అందరూ నన్ను సీరియల్ శోభన్‌బాబు అని పిలవడానికి కారణం కూడా అదే. మూడేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో ఉన్నందుకు గాను టీవీ అవార్డు నన్ను వరించింది. ఈ రంగానికి వచ్చినందుకు ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తుంటాను. అమ్మ కష్టంతో ఎదిగాం ఖమ్మంలో అమ్మ విలేజ్ హెల్త్ రిప్రజెంటేటివ్‌గా వర్క్ చేసేవారు. ఇద్దరు అన్నయ్యలు. అమ్మ సింగిల్ పేరెంట్‌గా మా ముగ్గురిని చదివించింది. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకుంటూ పెరిగాం. మా ముగ్గురిలో చిన్నవాడిని కాబట్టి నేను కాస్త గారంగానే పెరిగాను. పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తుండగా రిపోర్టర్‌గా, అటు నుంచి వీడియోజాకీగా.. అవకాశాలు వచ్చాయి. దీంతో టీవీనే నా ప్రపంచం అనుకుంటూ వచ్చేశాను. అన్నయ్యలిద్దరూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. నాకున్న ఇష్టం కొద్దీ ఈ ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మకు మా మీద చాలా నమ్మకం. ఏ వర్క్ అయినా స్వేచ్ఛ ఉంటుంది. ఇదే చేయ్, ఇదే చదువుకొని జాబ్ తెచ్చుకో.. అని అనలేదు. దీంతో సృజన ఉన్న ఈ రంగాన్ని ఎంచుకున్నాను. సీరియల్స్‌తో పాటు సినిమాలోనూ రాణించాలనుకుంటున్నాను. ప్రయాణాలతో ప్రమోదం సీరియల్ షూటింగ్, ఈవెంట్స్, షోస్ అంటూ నెలలో పాతిక రోజులు గడిచిపోతాయి. మిగతా రోజులను ట్రావెల్‌కు ఉపయోగించుకుంటాను. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే చాలా ఇష్టం. అలాగని ట్రూప్‌లుగా వెళ్లే జర్నీ అంటే ఇష్టముండదు. అమ్మవాళ్లు తీర్థయాత్రలు చేస్తుంటారు. నేను మాత్రం బైక్‌పైన ఫ్రెండ్స్‌తో ట్రావెల్ ఎక్కువ చేస్తుంటాను. ప్రపంచ పర్యాటక స్థలాలన్నీ సందర్శించాలనేది నా కల’ అంటూ తన జీవనవిధానంతోపాటు అభిరుచులనూ షేర్ చేశారు సన్ని. – నిర్మలారెడ్డి -
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
‘‘దసరా బుల్లోడు’ చిత్రంలోని ‘చేతిలో చెయ్యేసి చెప్పుబావ...’ అంటూ అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ఆడిపాడారు. ఆ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడదే పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. అరుణ్, రోహిణిపూజ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఆదిత్య ఓం మరో హీరోగా నటిస్తున్నారు. కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. మేరీ కృపావతి, ప్రభుదాస్ సమర్పణలో కె.జె.రాజేష్, దేవదాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుగుతోంది. కట్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ లవ్ అండ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇద్దరు ప్రేమికులు చనిపోయినా వాళ్ల ప్రేమను ఎలా బతికించుకుంటారు? అనే నేపథ్యంలో సాగుతుంది. ఈ ఏడాది ఆఖరులో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమాలోని నటీనటులందరూ చాలా బాగా నటించారు’’ అన్నారు రాజేష్. ‘‘చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రంతో వస్తున్నా’’ అన్నారు ఆదిత్య ఓం. ‘‘నందిని’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడినే. ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాను’’ అన్నారు అరుణ్ రాహుల్. దేవదాస్, రోహిణి పూజ, చలపతి రాజు పాల్గొన్నారు. -
బ్యాచిలర్స్ హంగామా
భూపాల్, అరుణ్ హీరోలుగా డి. రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘బ్యాచిలర్ పార్టీ’. బి.సుధాకర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. నటుడు శ్రీకాంత్ క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్‌ను సుధాకర్‌రెడ్డికి అందజేశారు. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘యువతకు మంచి వినోదాన్ని అందించే యాక్షన్ ఎంటర్టైనర్ మా బ్యాచిలర్ పార్టీ. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో పాటు కమర్షియల్ హంగులు ఉన్నాయి. నటనకు ఆస్కారం ఉన్న చిత్రం ఇది. సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది’’అన్నారు. ‘‘కథ వినగానే ఎంతో నచ్చింది. యూత్ మెచ్చే చిత్రం ఇది. వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు సుధాకర్‌రెడ్డి. నటులు శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. రమణారెడ్డి, బెనర్జీ, కార్తిక్, రియా, గిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అద్దంకి రాము కెమెరామేన్‌గా వ్యవహరించనున్నారు. -
డబ్బు కోసం కాదు.. కథ నచ్చి చేశా
‘‘సక్సెస్, ఫెయిల్యూర్ గురించి నేను ఆలోచించను. కొన్ని సినిమాలు ఆడతాయి.. మరికొన్ని ఆడవు. మంచి సినిమా చేశామా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఇండస్ట్రీలో నా ఏజ్ ఉన్నవాళ్లలో కొందరు ఇప్పటికీ సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు. అలాగని సక్సెస్ అవసరం లేదని చెప్పను’’ అని అదిత్ అరుణ్ అన్నారు. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. అదిత్ అరుణ్, నిక్కీ తంబోలి జంటగా, హేమంత్, ‘తాగుబోతు’ రమేష్ ప్రధానపాత్రల్లో నటించారు. బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదిత్ అరుణ్ మాట్లాడుతూ– ‘‘ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుని అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. హారర్ కామెడీ స్టోరీకి ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుంది. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, కామెడీ ఉంటాయే కానీ, ఫిజికల్‌గా అసభ్యకరంగా ఉండదు. ‘డబ్బుల కోసం ఈ సినిమా చేశావా?’ అని చాలామంది అడుగుతున్నారు. డబ్బు కోసం కాదు.. కథ బాగా నచ్చి చేశా. ప్రస్తుతం ‘డ్యూడ్’ అనే సినిమా చేస్తున్నా. మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశాను’’ అన్నారు. -
జలజ్ శతకం: కేరళ 227/1
తిరువనంతపురం: ఆంధ్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కేరళ భారీ ఆధిక్యానికి బాటలు పర్చుకుంది. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 227 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (127 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా, అరుణ్ కార్తీక్ (56) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించారు. ప్రస్తుతం జలజ్‌తో పాటు రోహన్ ప్రేమ్ (34 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఆంధ్ర జట్టు మరో 29 పరుగులు జత చేసి తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులకు ఆలౌటైంది. -
అరుణ్ కేసుపై ఆరా తీస్తున్నాం
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఏడాది క్రితం అదృశ్యమై.. తిరిగొచ్చిన బాలుడు అరుణ్ కేసుపై ఆరా తీస్తున్నామని యాదగిరిగుట్ట టౌన్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది మే 16వ తేదీన అరుణ్ (బిట్టు)ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు అశోక్–నిర్మల దంపతులు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అప్పటినుంచి బాలుడి అదృశ్యం కేసు మిస్టరీని ఛేదించేందుకు కృషిచేస్తున్నామన్నారు. తీసుకెళ్లిన అగంతకుడే బాలుడిని తిరిగి తీసుకువచ్చి వదిలివెళ్లడం సంతోషకరమన్నారు. అయినా అతను ఎవరు..? ఏ కారణంతో బాలు డిని తీసుకెళ్లాడు..? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. బాలుడిని వదిలి వెళ్లే క్రమంలో అతడు యాదగిరిగుట్టలో ఎక్కడెక్కడ సంచరించాడు. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్టు సీఐ వివరించారు. గారాబంగా చూసుకున్నారు : అరుణ్ తనను ఇంటివద్ద నుంచి తీసుకెళ్లిన వ్యక్తి, వారి కు టుంబ సభ్యులు గారాబంగా చూసుకున్నారు. మీ నాన్న నా దగ్గరే ఉన్నాడంటే అతడి వెంట వెళ్లా. అనంతరం బస్సులో తెలియని ఊరికి తీసుకెళ్లా డు. అక్కడ నన్ను ఎవరూ కొట్టలేదు.. తిట్టలేదు. ఇటీవల ఫోన్లో మా తల్లిదండ్రి ఫొటోలు చూపిం చాడు. నేను గుర్తుపట్టడంతో ఆదివా రం సాయంత్రం యాదగిరిగుట్టకు తీసుకువచ్చి.. నా చేతిలో ఒక చిట్టీ పెట్టి తెల్లబట్టలు వేసుకున్న పోలీస్ అంకుల్‌కు అది ఇవ్వమని చెప్పి వెళ్లాడు. ఎవరా అగంతకుడు..? బాలుడిని యాదగిరిగుట్టకు తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. బాలుడిని సుమారు 30 సంవత్సరాల వ్యక్తి యాదగిరిగుట్ట బస్టాండ్ నుంచి గ్రామపంచాయతీ వరకు తీసుకెళ్లాడని, అతడు తలపై టోపీ ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాలో కనపిస్తోందన్నారు. ఆ వ్యక్తి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, అతడు పట్టుబడితేనే బా లు డిని ఎందుకు తీసుకెళ్లారు.. ఎక్కడికి తీసుకెళ్లారు అనే అంశాలు తెలుస్తాయని చెప్పారు. త్వరలోనే కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామన్నారు. -
అరుణ్ దొరికాడోచ్..
తప్పిపోయిన కుమారుడి కోసం ఆ తల్లిదండ్రి వెతకని చోటు లేదు.. మొక్కని దేవుడు లేడు.. సరిగ్గా ఏడాది తర్వాత ఆ చిరుప్రాయం స్వస్థలం యాదగిరిగుట్టలోనే ప్రత్యక్షమవ్వడంతో పేద దంపతుల ఆనందానికి అవధుల్లేవు..తమ కన్నపేగు దరికి చేరేలా చొరవచూపిన ‘సాక్షి’కి వారు ఈ సందర్భంగా ఆనందబాష్పాలతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదగిరి పట్టణానికి న్యాలపట్ల అశోక్, నిర్మల దంపతులకు అరుణ్ ఒక్కడే కుమారుడు. అశోక్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతేడాది మే 16వ తేదీన అరుణ్ తన స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.ఆ రోజు అరుణ్ తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఏసీపీ సాదూమోహన్రెడ్డి, సీఐ రఘువీరారెడ్డి, ఎస్ఐ గోపాల్‌దాస్ ప్రభాకర్ వివిధ ప్రాంతాల్లో బాలుడి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ముగ్గురు పోలీస్ అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లారు. దీంతో ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఏసీపీ శ్రీనివాసచార్యులు, టౌన్ సీఐ అశోక్ కుమార్‌లను బాలుడి తల్లిదండ్రులు కలిసి తన కొడుకు జాడ చూపాలని వేడుకున్నారు. జనసంద్రంగా పోలీస్‌స్టేషన్... ఏడాది క్రితం తప్పిపోయిన బాలుడు ఆదివారం కనిపించడంతో యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు బీసీకాలనీ, గుండ్లపల్లి, శ్రీరాంనగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. బాలుడిని చూసి అరుణ్ బంధువులతో పాటు స్థానిక ప్రజలు కన్నీరుకార్చారు. సంవత్సరం అంతా చిన్నారి ఎక్కడ ఉన్నాడు.. ఎలా ఉన్నాడు.. ఏమీ చేశాడని పలువురు బాలుడిని అడిగే ప్రయత్నం చేశారు. దీంతో బాలుడు తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ తాతా, తన స్నేహితులను ప్రతి ఒక్కరిని పేరుపెట్టి అడగడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ చిట్టీలో ఏముంది..? అరుణ్‌ను పాతగుట్ట చౌరస్తాలో సుమారు సాయంత్రం 4.20గంటల సమయంలో ఓ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి వదిలి వెళ్లారని తెలుస్తోంది. వారు వెళ్లే ముందు బాలుడి జేబులో ఓ చిట్టీని ఆ వ్యక్తులు పెట్టి వెళ్లారని తెలుస్తోంది. ఆ చిట్టీలో ‘నాకు ముగ్గురు కూతుళ్లు.. మగపిల్లలు లేరు.. అరుణ్‌ను నాకు రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ సమీపంలో కనిపించాడు.. అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లాను.. ఇటీవల ఓ దిన పత్రికలో వచ్చిన కథనం చూసి బాలుడిని ఇక్కడ వదిలేసి వెళ్తున్నా.. వేరే ఏ దురుద్దేశంతో బాలుడిని తీసుకెళ్లలేదు.. నన్ను క్షమించండి’ ఉందని తెలుస్తోంది. కారు ఎక్కడి నుంచి వచ్చింది.. ఆ కారులో ఎవరు ఉన్నారనే అంశాలపై సీఐ అశోక్ కుమార్ ఆరా తీస్తున్నారు. బాలుడిని తీసుకెళ్లిన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అరుణ్‌ను ఎవరైనా కిడ్నాప్ చేసి ఈ రోజు వదిలి వెళ్లిన వ్యక్తులకు అమ్మారా.. లేక.. ఇక్కడి నుంచి అరుణ్‌ను తీసుకెళ్లిన వ్యక్తులే పెంచుకుంటున్నారా అనే అంశాలు తెలియాల్సి ఉంది. ఆస్పత్రికి బాలుడి తరలింపు ఏడాది తర్వాత కనిపించిన అరుణ్‌ను స్థానిక సీఐ అశోక్‌కుమార్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు సీఐ వెల్లడించారు. అరుణ్ వద్ద పూర్తి వివరాలు సేకరించి మీడియాకు తెలుపుతామని సీఐ పేర్కొన్నారు. ‘సాక్షి’కి ప్రత్యేక ధన్యవాదాలు... సాక్షి పత్రికలో ఈ నెల 16వ తేదీన ప్రచురితమైన కథనంతోనే తమ కొడుకు దొరికాడని అరుణ్ తల్లిదండ్రులు న్యాలపట్ల అశోక్–నిర్మల తెలిపారు. ఇటీవల సాక్షి పత్రికల్లో కథనాలు రావడంతోనే ఆ వ్యక్తి అరుణ్‌ను గుట్టలో వదిలేసి వెళ్లారని చెప్పారు. ట్రాఫిక్ పోలీసుల చెంత...ఏడాది క్రితం ఇంట్లో నుంచి కిడ్నాప్ అయినా అరుణ్.. ఆదివారం పాతగుట్ట చౌరస్తా వద్ద ఏడ్చూకుంటూ తిరుగుతున్నాడు. దీంతో వాహనాలను క్రమబద్ధీకరిస్తున్న ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్, కానిస్టేబుల్స్ గోవర్ధన్, సిద్దులు, నర్సింహలు బాలుడి వద్దకు వెళ్లి ఎవరని ఆరా తీశారు. దీంతో అరుణ్ మాది గుట్టనే.. నేను ఆటోడ్రైవర్ కొడుకును అని చెప్పాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి టౌన్ సీఐ అశోక్‌కుమార్‌కు అప్పగించారు. ఇటీవల సాక్షి పత్రికలో వచ్చిన కథనంలో బాలుడిలానే ఉన్నాడని సీఐ అశోక్ కుమార్ అరుణ్ తల్లిదండ్రులు అశోక్–నిర్మలలకు సమాచారం ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అరుణ్ తల్లిదండ్రులతో పాటు యాదగిరిగుట్ట ఎంపీపీ గడ్డమీది స్వప్నరవీందర్గౌడ్లు అనంద బాష్పాలతో కన్నీరు కార్చారు. ఈనెల 16న సాక్షి కథనంతో... ఈనెల 16వ తేదీన సాక్షి మినీలో ‘ బాలుడి ఆచూకీ ఎక్కడ..? అరుణ్ కనిపించక నేటికి ఏడాది.. కిడ్నాప్ అయ్యాడా..? తప్పిపోయాడా..? ఎమయ్యాడో స్పష్టత కరువు.. బాలుడి కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు..’ అనే కోణంలో కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంతో అప్రమత్తమైన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాలుడి తల్లిదండ్రులతో స్థానిక టౌన్ సీఐ అశోక్ కుమార్ పలుమార్లు కలిసి.. ఏవరైనా శత్రువులు ఉన్నారా.. ఎవరిపైన అనుమానం ఉందా.. అనే అంశాలపై ఇటీవల ఆరా తీశారు.ప్రత్యేకంగా ఆయనే రంగంలోకి దిగి బాలుడి ఆచూకీ కోసం వెతకడానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆదివారం బాలుడు యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చౌరస్తాలో కనిపించాడు. -
బయటపడ్డ మరో బ్యాంకింగ్ మోసం
న్యూఢిల్లీ : మరో బ్యాంకింగ్ మోసం శనివారం బయటపడింది. సుమారు రూ.621 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై యూకో బ్యాంక్ మాజీ చైర్మన్ అరుణ్ కౌల్‌తో పాటు మరి కొంత మంది బిజినెస్ ఎక్జిక్యూటివ్‌లపై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ప్రేవేటు ఇన్ఫ్రా స్ట్రక్చర్ సంస్థ ఎరా ఇంజనీరింగ్ ఇఫ్రా లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ అల్టియస్ ఫిన్సర్వ్ ప్రైవేటు లిమిటెడ్‌లకు రుణాల చెల్లింపు విషయంలో అరుణ్ కౌల్ అవతవకలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అరుణ్ కౌల్ 2010 నుంచి 2015 మధ్యంలో యూకో బ్యాంకుకు చైర్మన్‌గా వ్యవహరించారని, ఈ సంస్థలకు రుణాలు మంజూరు చేయడంలో అరుణ్ కౌల్‌దే ప్రధాన భూమిక అని సీబీఐ అధికారులు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ఫిబ్రవరి తర్వాత బయట పడిన మరో పెద్ద మోసం ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో ఇద్దరు వజ్రాల వ్యాపారులు బ్యాంకులకు సుమారు రెండు బిలియన్ డాలర్లు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెల్సిందే. ఈ మోసం కేసు బ్యాంకింగ్ రంగాన్నే ఓ కుదుపు కుదుపేసింది. ఈ నెల1న యూకో బ్యాంక్ మాజీ మేనేజర్‌తో పాటు మరో నలుగురిపై రూ.19 కోట్ల మోసానికి సంబంధించి సీబీఐ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ మోసం వెలుగులోకి రావడంతో యూకో బ్యాంకు ఉద్యోగులు ఆశ్చర్యపోయే పరిస్థితి తలెత్తింది. యూకో బ్యాంకు కేసుకు సంబంధించి అరుణ్ కౌల్‌తో పాటు కొంత మందిబ్యాంకు అధికారులు, రెండు ప్రైవేటు కంపెనీలకు చెందిన అకౌంటెంట్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు మంజూరు చేసిన రుణాలు దేనికి సంబంధించి మంజూరు చేశారో దానికి వినియోగించలేదని, చార్టడ్ అకౌంటంట్ తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి రుణాలను అటువైపు మళ్లించి మోసానికి పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. దీనికి సంబంధించి రెండు కంపెనీలు, అకౌంటంట్లు, నిందితుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. -
పూరి జగన్నాథ్ అంటే పిచ్చి
‘‘డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారంటే నాకు పిచ్చి. ఆయన్ను దృష్టిలో పెట్టుకునే ‘పడిపోయా నీ మాయలో’ సినిమా డిజైన్ చేసుకున్నా. ఆయనలా సినిమా తీయాలనేది నా కల’’ అని దర్శకుడు ఆర్.కె. కాంపల్లి అన్నారు. అరుణ్ గుప్తా, సావేరి, జయవర్ధన్ ముఖ్యపాత్రల్లో మహేశ్ పైడ, భరత్ అంకతి నిర్మించిన ‘పడిపోయా నీ మాయలో’ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. కాంపల్లి మాట్లాడుతూ– ‘‘భరత్‌గారు నాకు పదేళ్లుగా పరిచయం. నేను చెప్పిన లైన్ నచ్చి, ఆయన సినిమా చేద్దామన్నారు. తర్వాత మహేశ్‌గారు మాతో జత కలిశారు. ముందుగా ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నాం. కానీ, కథానుగుణంగా ‘పడిపోయా నీ మాయలో’ యాప్ట్ అవుతుందని పెట్టాం. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇదే బ్యానర్లో నా రెండో సినిమా కూడా చేస్తా. ’’ అన్నారు. ‘‘ఆర్.కె.గారి ప్రతిభ గుర్తించాం. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశాం. అరుణ్, సావేరి చక్కగా నటించారు’’ అన్నారు మహేశ్ పైడ, భరత్ అంకతి. -
రైతులపై కేసులు పెట్టడం అన్యాయం
- సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : నష్ట పరిహారం చెల్లించకుండా తమ భూముల జోలికి వెళ్ళవద్దన్న రైతులపై 356 సెక్షన్ కింద నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్యని సీపీఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం భూ సేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతులకు సరైన న్యాయం చేయకుండా వారి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం పురుషోత్తపట్నం, రామచంద్రరావు పేట, నాగం పేట, చిన కొండేపూడి, వంగలపూడి గ్రామాల్లో 240 ఎకరాలు సేకరిస్తోందన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో అనేక ఎత్తిపోతల పథకాల కింద రైతుల భూములను లాక్కొందని, ఉన్న కాస్త భూమిని కూడా ఇప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరిట స్వాధీనం చేసుకుంటోందన్నారు. మూడు పంటలు పండే భూమికి కేవలం రూ. 17.50 లక్షలు, రూ.19.50 లక్షలు ఇస్తామనడం దారుణమన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎకరాకు రూ. 40 లక్షలు పలుకుతోందన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రైతులకు రూ. 28 లక్షలు ఇవ్వడానికి అవార్డ్ ప్రకటించారని, ఒప్పందం కదుర్చుకోకుండా కోర్టుకు వెళ్ళిన రైతుల నుంచి మాత్రం బలవంతంగా భూమిని లాక్కోవడానికి చూస్తున్నారన్నారు. రైతుల తరపున పోరాడేందుకు వెళ్ళిన రాజకీయ పార్టీల ప్రతినిధులను సీతానగరంలోనే అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయ బద్ధంగా నష్ట పరిహారం చెల్లించిన తరువాతే భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. రైతు నాయకుడు సతీష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో భూమికి భూమి కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. భూమి కోల్పోతే తమకు భవిష్యత్తు లేదన్నారు. పుష్కర 1, 2 కాలువలను ఈ పథకం కోసం వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతుల నుంచి భూమిని లాక్కోంటోందన్నారు. సీపీఎం నగర కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, పురుషోత్తపట్నం రైతులు రాంబాబు, సతీష్, తాతారావు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. -
ఐదేళ్లలో 4 వండర్లా కొత్త పార్క్‌లు
⇒ రూ.350 కోట్లతో చెన్నైలో 56 ఎకరాల్లో ప్రారంభం ⇒ శరవేగంగా నిర్మాణ పనులు; రెండేళ్లలో అందుబాటులోకి ⇒ ఆ తర్వాత గోవా, మహారాష్ట్ర, గుజరాత్లో కూడా.. ⇒ ఏడాదిలో 6.2 లక్షలకు హైదరాబాద్ పార్క్ సందర్శకులు ⇒ వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్యూజ్మెంట్ పార్క్‌ల నిర్వహణలో ఉన్న వండర్లా దేశంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 4 అమ్యూజ్మెంట్ పార్క్‌లను ఏర్పాటు చేయనుంది. ముందుగా రూ.350 కోట్ల పెట్టుబడులతో చెన్నైలో ప్రారంభించనుంది. పాత మహాబలిపురంలో రోడ్డులో 56 ఎకరాల్లో పార్క్‌ను నిర్మిస్తున్నామని, రెండేళ్లలో పార్క్‌ను అందుబాటులోకి వస్తుందని వండర్లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి తెలిపారు. ఆ తర్వాత గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో పార్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారమిక్కడ వండర్లా కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018 ఆర్ధిక సంవత్సరంలో మార్కెటింగ్ కోసం రూ.26 కోట్లు కేటాయించామని ఇందులో భాగంగా కొత్త లోగోను డిజైన్ చేశామని చెప్పారు. ప్రస్తుతం కోచి, బెంగళూరు, హైదరాబాద్‌లో పార్క్లుండగా.. 26 లక్షల మంది సందర్శించారని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధిని పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్‌లో పార్క్‌ను ప్రారంభించి నేటితో ఏడాది. తొలి సంవత్సరంలో 6.2 లక్షల మంది సందర్శించారు. ఈ ఏడాది 8 లక్షలు, మూడేళ్లలో 10 లక్షల సందర్శకులు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాతే హైదరాబాద్‌లోనూ రిసార్ట్ ఏర్పాటు యోచన చేస్తామని తెలియజేశారు. కొత్త కస్టమర్లనే కాకుండా పాత కస్టమర్లనూ అకర్షించేందుకు ప్రతి ఏటా రూ.30–40 కోట్ల పెట్టుబడులతో కొత్త కొత్త రైడ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ వేసవిలో హైదరాబాద్ పార్క్‌లో స్కై వీల్‌ను, సెప్టెంబర్‌లో ఫ్లై థీమ్ స్పేస్ థియేటర్‌ను, కోచిలో రోలర్ కోస్ట్, బెంగళూరులో ఫ్యామిలీ రైడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. ఏపీలో పార్క్ ప్రాథమిక స్థాయిలోనే.. ఆంధ్రప్రదేశ్‌లో పార్క్ ఏర్పాటు ఒప్పందం గురించి ప్రశ్నించగా.. ‘‘రూ.350 కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌లో అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రెండేళ్ల క్రితమే ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. కానీ, అదింకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. స్థల ఎంపిక, రాయితీలపై స్పష్టత వచ్చాకే పార్క్ ఏర్పాటుపై ముందడుగేస్తామని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు సమాధానమిచ్చారు. ప్రస్తుతం కోచి, బెంగళూరు, హైదరాబాద్‌లో పార్క్‌లున్నాయి. ఇప్పటివరకు 3 కోట్ల మంది సందర్శించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కలెక్టర్ అరుణ్‌కుమార్ వెలుగుబంద (రాజానగరం) : పర్యావరణ పరిరక్షణను అంతా బాధ్యతగా తీసుకుంటేనే సరైన ఫలితాలను అందుకోగలుగుతామని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక గైట్ కళాశాలలో 'స్వచ్చ భారత్ – స్వచ్చ ఆంధ్రప్రదేశ్'లో భాగంగా బుధవారం నిర్వహించిన 'మై బైక్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేడు ప్రపంచమంతా పచ్చని వాతావరణంతో కోరుకుంటుందని, మన దేశానికి ఎంతో అవసరమన్నారు. రాజమహేంద్రవరంలో సుమారు 15 వేల ఆటోలు తిరుగుతున్నాయని, వాటితోపాటు ఇతర వాహానాల నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. సైకిలు వాడకంతో వాతావరణ కాలుష్యం తగ్గి పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. ప్రజలు సైకిలు వినియోగంపై మరింతగా చైతన్యవంతులు కావలన్నారు. ఇందులో గైట్ కళాశాల ముందుండం అభినందనీయమన్నారు. సైకిలు తొక్కడం వలన కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, కె.కిరణ్‌వర్మ అన్నారు. తమ కళాశాల ప్రాంగణాన్ని పర్యవరణ హితంగా చేసేందుకు ఏడేళ్లుగా ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు అన్నారు. ఇప్పటికే ప్రాంగణంలో బ్యాటరీ కార్లు వినియోగిస్తున్నామని, సంప్రదాయేతర ఇందన వనరులైన సౌర్యశక్తి, పవన విద్యుత్‌తో ట్రాన్సమిషన్ కష్టాలు లేకుండా ఒక మోగావాట్టు సామర్థ్యంతో రెండు యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నామన్నారు. కళాశాల విద్యార్థుల కోసం 200 సైకిళ్లను అందుబాటులో ఉంచడంలోపాటు గైట్ కళాశాల ద్వారా మూడు గ్రామాలను దత్తత తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ విజయరాజు, కళాశాల ఎండి కె. శశికిరణ్‌వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, చైతన్య విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్ ఎన్ రాజు, డీవైఎం ఎ. నరేష్‌రాజు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ డివి రామ్మూర్తి, డాక్టర్ ఎస్. సత్యనారాయణరాజు, డాక్టర్ ధనరాజ్, జీఎం డాక్టర్ పి. సుబ్బరాజు, డైరెక్టర్ పివి రామరాజు, తదితరులు పాల్గొన్నారు. -
కొడుకును బేరం పెట్టిన తండ్రి
కామారెడ్డి: కన్న బిడ్డను అమ్మకానికి పెట్టిన భర్తకు, భార్య దేహశుద్ది చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా భాన్సువాడ మండలం దేశాయిపేటలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి తన ఏడాదిన్నర కొడుకు అరుణ్‌ను రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతనిని ప్రశ్నించగా బంగారు తల్లి పథకం వర్తించాలని అమ్ముతున్నట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న అతని భార్య పోలీసులకు సమాచారం అందించి.. కన్న పేగును అమ్మేందుకు యత్నించిన అతనికి దేహశుద్ధి చేసింది. -
అసలే పేద... ఆపై కొత్త బాధ..!
ఉత్తరప్రదేశ్ : అతనిది అందరిలాంటి జీవితం కాదు. పుట్టుకతోనే నాలుగు కాళ్లతో పుట్టాడు. ఆపై బీదరికం. ఈ రెండు సవాళ్లను అధిగమించడానికి ఆ యువకుడు పడని కష్టాలు లేవు.తన అదనపు రెండు కాళ్లను తీసేయమని డాక్టర్లను వేడుకోవడం ఒకటైతే.. పుట్టుకతో వచ్చిన దారిద్య్రానికి ఎవరైనా చేయూతనిచ్చి ఆపరేషన్ కు సాయం చేయాలని దీనంగా అర్థిస్తున్నాడు. ‘అందరిలాగే సాధారణ జీవితం గడపాలని నాకూ ఉంది. దీనికి అదనంగా ఉన్న రెండు కాళ్లూ అడ్డం పడుతున్నాయి. ఆ భారాన్ని మోయడం నా వల్ల కాదు. దయచేసి వాటిని తీసేయండి’ ఇదీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణ్ కుమార్ సోషల్‌మీడియా ద్వారా చేసిన వినతి. రెండు కాళ్లకు అదనంగా అతడి వెనుక భాగంలో నడుము కింద మరో రెండు వేలాడుతూ ఉంటాయి. అవి అతడికి చాలా ఇబ్బందిగా పరిణమించాయి. వాటిని అరుణ్ కదపలేడు. నడవడానికి, కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నాడు. అరుణ్ పుట్టినపుడు నాలుగు కాళ్లూ ఒకే సైజులో ఉన్నాయని అతడి తల్లి కోకిలాదేవి చెప్పారు. ఈ శస్త్రచికిత్స కోసం చాలా ఆస్పత్రులకు తిరిగామన్నారు.చిన్న వయసులో ఆపరేషన్ మంచిది కాదని డాక్టర్లు చెప్పారన్నారు. కుమారుడి పరిస్థితి తమకు చాలా ఆవేద న కలిగించిందని తండ్రి రామ్‌సింగ్ అంటున్నాడు. అరుణ్ వినతికి ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. డాక్టర్ హెర్మంత్ శర్మ నేతృత్వంలోని వైద్యుల బృందం పలు పరీక్షలు చేసింది. అతడికి రెండో పెల్విన్ (వెన్నెముక కింది భాగంలో ఉండే కటి) కూడా ఉన్నట్లు గుర్తించారు. ‘అదనంగా ఉన్న కాళ్లకు రక్త సరఫరా ఎలా జరుగుతుంది? వాటి నిర్మాణం ఎలా ఉంది? అనేది పరిశీలించాల్సి ఉంది’ అని డాక్టర్ శర ్మ తెలిపారు. ఆ తర్వాతే శస్త్రచికిత్సపై చెప్పగలమన్నారు. -
వర్మీ కంపోస్టు, నాడెప్ యూనిట్లకు పోత్సాహం
కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : జిల్లాలో వర్మీ కంపోస్టు యూనిట్లతో బాటు నాడెప్ యూనిట్లను కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ఈ సంవత్సరం 15 వేల వర్మీ కంపోస్టు యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటివరకూ 300 ఏర్పాటు చేశారన్నారు. వానపాముల వినియోగం లేకుండా నూతనంగా రూపొందించిన నాడెప్ యూనిట్లలో చెత్త, పేడ, గడ్డి, ఆకులు, కొమ్మలు వంటి వ్యర్థ పదార్థాలను ఎరువుగా మార్చవచ్చన్నారు. రూ.10 వేలు ఖర్చయ్యే ఈ యూనిట్లను ఉపాధి హామీ పథకం ద్వారా ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఐదు నెలల్లో ఉపాధి హామీ, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మొత్తం 60 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టవలసి ఉంటుందన్నారు. ఏజెన్సీలో దోమతెరల పంపిణీకి ఆదేశం ఏజెన్సీలో పంపిణీకి 1.03 లక్షల దోమ తెరలు సోమవారం జిల్లాకు వచ్చాయన్నారు. వీటిని మంగళవారం నుంచి ఏజెన్సీలో పంపిణీ చేయాలని ఆదేశించారు. కుటుంబంలోని సభ్యుల ఆధారంగా వివిధ సైజులలో దోమతెరలను పంపిణీ చేస్తారన్నారు. జెడ్పీ నిర్ణయాలపై స్పందించాలి ఇటీవల జెడ్పీ సర్వసభ్య సమావేశాలలో పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.వివిధ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్లపై శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా వెబ్సైట్లో డేష్ బోర్డు జిల్లా వెబ్సైట్లో జిల్లా డేష్బోర్డులో వివిధ శాఖల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చన్నారు. మీకోసం పోర్టల్‌లో పెండిం గ్లో ఉన్న ఫిర్యాదులపై తగు చర్యలను నిర్ణీత కాలంలో చేపట్టాలనిÜూచించారు. ఈ సమావేశంలో జేసీ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం రవాణాపై నిఘా కాకినాడ సిటీ : ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ల నుంచి రవాణా చేసి జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు కొంతమంది మిల్లర్లు చూపుతున్న విధానంపై నిరంతర నిఘా అవసరమని కలెక్టర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్షించా రు. వాణిజ్య పన్నుల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ కమిటీల స హకారంతో ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రవాణా అక్రమాల ను అరికట్టాలన్నారు. చెక్‌పోస్ట్‌లను అప్రమత్తం చేసి, కోతలు మొ దలయ్యే ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ వరకూ నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై ప్రాథమిక పరపతి సంఘాలు, డ్వాక్రా మహిళల ద్వారా ప్ర చారం చేయించాలని డీసీఓ, డీఆర్డిఏ అధికారులను ఆదేశించారు. -
మానేరు డ్యాంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన కరీంనగర్ మానేరులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మంగమ్మతోటకు చెందిన బీరెల్లి అరుణ్(16) శ్రీగాయాత్రి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన సునంద్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. వీరిద్దరు ఈ రోజు ఉదయం మరో ఐదుగురు స్నేహితులతో కలిసి లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వె ళ్లారు. ఈ క్రమంలో ఈతకొడుతూ వీరిద్దరు నీట మునిగారు. ఇది గుర్తించిన తోటి స్నేహితులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు!
సహాయక పదవులకు బంగర్, అరుణ్, శ్రీధర్ కూడా... న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి మాజీ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది పదవులకు సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్‌లు మళ్లీ దరఖాస్తు చేసుకోనున్నారు. మరో రెండు రోజుల్లో బోర్డు కోచ్ పదవులకు ప్రకటన జారీ చేయనున్న నేపథ్యంలో ఆ నలుగురు దరఖాస్తు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ‘శాస్త్రి, అరుణ్, బంగర్, శ్రీధర్‌లు తమ గత పోస్ట్‌లకు మళ్లీ దరఖాస్తులు పంపుతున్నారు. బీసీసీఐ అధ్యక్షుడి నుంచి వీళ్లకు సానుకూల సంకేతాలు అందాయి. అయితే ప్రతి అభ్యర్థి ప్రత్యేకమైన ఫార్మాట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ నలుగురు బోర్డు జారీ చేసే ప్రకటన కోసం వేచి చూస్తున్నారు’ అని సదరు అధికారి పేర్కొన్నారు. బీసీసీఐ పగ్గాలు చేపట్టిన అనురాగ్ ఠాకూర్‌ను ఇటీవలే ఢిల్లీలో సహాయక సిబ్బంది కలిసి ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా కోచ్ ఎంపికకు లెవల్-3 డిగ్రీతో పాటు సీనియర్ జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాగే ఎంపికయ్యే అభ్యర్థి తమ దేశం తరఫున కనీసం 50 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అనవసరమైన దరఖాస్తులు రాకుండా ఈ రెండు నిబంధనలను విధించారని బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
ఆలయ కోనేరులో పడి ముగ్గురు దుర్మరణం
నిజామాబాద్ జిల్లా యెడపల్లి మండలం జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. స్వామి దర్శనం కోసం వచ్చిన ముగ్గురు కోనేరులో పడి మృతి చెందారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం ఆదివారం సాయంత్రం ఆలయానికి వచ్చింది. స్వామి దర్శనం అనంతరం రాజమ్మ (50) తన ఇద్దరు మనవళ్లు నవతేజ (10), అరుణ్(10)తో కలసి కోనేరు దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లింది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ఒకరు కోనేరులో దిగి మునిగిపోతుండగా మరో బాలుడు బయటకు లాగే ప్రయత్నం చేశాడు. అతడు కూడా నీటిలో పడిపోవడంతో వారిని రక్షించేందుకు వెళ్లిన రాజమ్మ కూడా కోనేరులో మునిగి ప్రాణాలు కోల్పోయింది. రాత్రి 9 గంటల తర్వాత మృతదేహాలను వెలికి తీయించిన పోలీసులు పోస్ట్‌మార్టం కోసం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. -
మాల్యా.. బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకో!
న్యూఢిల్లీ: ''బ్యాంకులకు బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకోండి.. లేదంటే చర్యలు తప్పవు'' అంటూ విజయ్ మాల్యాలాంటి ఎగవేతదారులను ఉద్దేశించి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరికలు చేశారు. బకాయిలు చెల్లించకుంటే బ్యాంకులు, విచారణ సంస్థలు తీసుకొనే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత కేసుల్లో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనని, పెద్ద గ్రూపుల విషయం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు బ్యాంకులకు ఎగవేసిన విజయ్ మాల్యా విషయంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన ఓ ఇంటర్వూలో స్పష్టం చేశారు. బ్యాంకులకు సెక్యూరిటీలు ఉంటాయని, ఇతర సంస్థలు కూడా చట్టపరమైన చర్యల ద్వారా ఎగవేతదారుల వద్ద నుంచి బకాయిలు వసూలు చేసే పద్ధతులు ఉన్నాయని, వీటన్నింటిని సంబంధింత ఏజెన్సీలద్వారా పరిశోధన చేస్తున్నారని జైట్లీ అన్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారతదేశం విడిచి మార్చి 2న లండన్ పారిపోయే ముందు... అతని గ్రూప్ సంస్థలనుంచి రికవరీ కోరుతూ ప్రభుత్వరంగ బ్యాంకులు సుప్రీంకోర్లును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యం వల్ల అనేక కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో వాటి మొండి బకాయిల సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. ప్రస్తుతం మొండి బకాయిల సమస్యకు పరిష్కార దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని, ముందే చెప్పినట్లుగా ఇవి రెండు రకాలుగా ఉంటాయని, ఆర్థిక వాతావరణంలో కొన్ని, పరిశ్రమల వైఫల్యంవల్ల కొన్ని ఉంటాయని, ఇప్పుడు ఇటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జైట్తీ తెలిపారు. -
వివాహానికి వెళ్లి వస్తూ..
సదాశివపేట: బందువుల వివాహానికి వెళ్లి వస్తుండగా పట్టణంలోని 65 నంబర్‌జాతీయ రహాదారి కబ్రాస్తాన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణ్(25) అక్కడికక్కడే దుర్మరణం చేందాడని ఎస్ఐ. పరమేశ్వర్‌గౌడ్ తెలిపారు. మృతుడు ఆరుణ్ హైదరాబాద్‌లోని మాణికేశ్వర్‌నగర్ కాలనీకి చేందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడు ఆరుణ్, తల్లిలక్ష్మి, మేనమామలు వెంకటేశ్, వాసు, ఆత్త శ్రీదేవి మరో బందువుతో కలిసి టేవేరా వాహనంలో శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా రాయికోడ్ మండలం హస్నాబాద్ గ్రామంలో జరిగిన బందువుల వివాహానికి హజరైయ్యారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌లోని మాణిక్వేశ్వర్నగర్ కాలనీలో వేలుతుండగా రాత్రి 7 గంటలకు సదాశివపేట పట్టణం కబ్రాస్తాన్ వద్దకు రాగానే తాము ప్రయాణిస్తున్న తవేరా వాహనం చేడిపోయింది. వాహనాన్ని డ్రై వర్ మరమ్మత్తు చేయిస్తుండగా సమీపంలోనే పానీపూరి కనిపించడంతో కారుమరమ్మతు పనులు పూర్తయ్యేవరకు పానీపూరీ తిందామని ఆరుగురు వెలుతున్నారు. జహిరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వేలుతున్న లారీ మృత్యూరుపాంలో ఆరుణ్ను ఢీకోట్టడంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఆరుణ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందు కొడుకు దుర్మణం చేందడంతో తల్లి లక్ష్మి రోదనలు అందరిని కలిచివేసింది. -
'పైసా' చిక ప్రేమ
మనసు దొంగిలించేవాళ్లు అనుకుంటే బీరువా తాళాలు అప్పగించినవాళ్లవుతారు.ఎక్కడ కాపు కాస్తున్నారో తెలీదు. ఎవరి మీద కన్నేశారో తెలీదు. మనం జాగ్రత్తగా లేకపోతే ఈ దొంగలు మనింటికే రావచ్చు. అరుణ్ హైదరాబాద్‌లో ఆటోవాలా. వయసు 24. అక్కడే ఉంటున్న సౌమ్య (పేరు మార్చాం) ఇంటర్ చదువుతోంది. వయసు 16. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు సౌమ్య. కాలేజీకి వెళ్లొస్తుండే దారిలో అరుణ్ పరిచయం అయ్యాడు. ముందు ఫోన్లలోనే మాట్లాడుకునే ఇద్దరు ఆ తర్వాత ఫేస్ బుక్, చాటింగ్ వరకు వెళ్లారు. ఆ పరిచయం... కలిసి తిరిగేంతవరకు వెళ్లింది. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను. మనం పెళ్లి చేసుకుందాం’ అని సడెన్‌గా అన్నాడు అరుణ్ ఒకరోజు. అంతే కాదు, మాయ మాటలతో సౌమ్య మనసు దోచుకున్నాడు. అరుణ్ తప్ప మరో ప్రపంచం లేనట్టుగా ఉంది సౌమ్యకు. చూస్తుండగానే ఆరు నెలలు గడచిపోయాయి. ఓ రోజు అరుణ్ (మూడు నెలల క్రితం) సౌమ్య దగ్గరకు వచ్చి, ‘నాకు కడుపులో అల్సర్ ఉందట. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంట. లేకపోతే బతకను. ఆరేడు లక్షలు అవుతుంది అంటున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వే ఎలాగైనా సర్దాలి’ అన్నాడు. సౌమ్య ప్రాణం విల్లవిల్లాడింది. కానీ అంత డబ్బు! ఎలా..? సౌమ్యకు దిక్కు తోచలేదు. రెండు మూడు రోజులుగా అరుణ్ అడగడం, సౌమ్య ఏమీ సమాధానం ఇవ్వకపోవడం జరుగుతూనే ఉంది. నాల్గవరోజు అరుణ్ ఫోన్ చేశాడు. ‘డబ్బు ఇవ్వకపోతే మనిద్దరికీ సంబంధం ఉందని అందరికీ చెబుతాను. మనం దిగిన ఫొటోలు అందరికీ పంచుతాను! నీ పరువు, మీ అమ్మనాన్నల పరువు పోతుంది’ అని వార్నింగ్ ఇచ్చాడు. సౌమ్య హతాశురాలైంది. నిజంగానే ఆ ఫొటోలు బయటపెడితే తన పరిస్థితి ఏంటి?! ఈ కష్టం నుంచి బయటపడటం ఎలా?’ అని ఆలోచించింది. ఒంట్లో బాగోలేదని ఆ రోజు ఇంట్లోనే ఉంది. అమ్మానాన్నలు ఆఫీస్లకెళ్లిపోయారు. బీరువా తాళాలు తీసి చూసింది. బంగారం, ఆ పక్కనే డబ్బు కనిపించాయి. నాన్నకు తెలియకండా ఆయన పర్సులోంచి ఎ.టి.ఎమ్ కార్డు కూడా తీసింది. అరుణ్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. వచ్చాక దాదాపు 30 తులాల బంగారం, 3 లక్షలకు పైగా నగదు ఇచ్చింది. ఎ.టి.ఎమ్ కార్డ్ తీసుకెళ్లి మరికొంత డబ్బు తీసి ఇచ్చింది. డబ్బు తీసుకుని అరుణ్ ఉడాయించాడు. సౌమ్య మళ్లీ ఆలోచనలో పడింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఊరుకోరు.. ఎలా? తనను తానే కట్టేసుకుని, దొంగలు పడి, దోచుకెళ్లినట్టుగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన ఈ సంఘటనను పోలీసులు దర్యాప్తు చేసి ఈ నెల 9న అరుణ్‌ని అరెస్ట్ చేసి, అసలు విషయం బయటపెట్టారు. ఇప్పుడీ విషయం గురించి మనమెందుకు మాట్లాడుకోవాలంటే.. మన ఇంట్లోనూ ఈ వయసు పిల్లలుంటారు. ఏది తప్పో, ఏది ఓప్పో తెలియని స్థితిలో కష్టాల ఊబిలో వారు పడిపోకూడదు. ప్రేమ పేరుతో ట్రాప్ చేసే వంచకుల చేతికి చిక్కకూడదు. అందుకు మనమేం చేయాలి? ► కుటుంబసభ్యుల మధ్య ఉండే ఆప్యాయతలు మాత్రమే అసలైన ప్రేమ అని అమ్మాయికి తెలియజెప్పాలి. ► ఎంతసేపూ పుస్తకాలు, మార్కులు, ర్యాంకుల గొడవలతో కాకుండా అమ్మాయి మానసిక వికాసానికి కావల్సిన పెద్దల అనుభవాలను జాగ్రత్తలుగా షేర్ చేసుకోవాలి. ► ఏ బాధ్యతా లేకుండా రోడ్లమీద తిరిగేవారే అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటారు. అదికూడా అమాయకమైన అమ్మాయిలనే టార్గెట్ చేస్తుంటారు. తమ ట్రాప్‌లో పడేందుకు కావల్సిన అన్ని శక్తులనూ ఉపయోగిస్తుంటారు. ఆ విషయాన్ని అమ్మాయిలకి అర్థమయ్యేలా చెప్పాలి. ► పిల్లల చిన్న చిన్న సమస్యలను, అవసరాలను వాయిదా వేయకూడదు. చిన్న అవసరాలే కదా అని కొట్టిపారేయకుండా సాధ్యమైనంతవరకు తీర్చాలి. సమస్యను పూర్తిగా విని సానుకూలంగా స్పందించాలి. ► పిల్లలు తమ సమస్యలను, భావోద్వేగాలను పంచుకునేలా ఇంటి వాతావరణం ఉండాలి. ► సమాచారం వేగవంతంగా మారిన ఈ రోజుల్లో ప్రేమ పేరుతో జరిగే మోసాలు కూడా రెట్టింపు వేగంతో జరిగిపోతున్నాయి. అందుకని, పిల్లల స్నేహాలు, వారి ప్రవర్తనవైపు గమనింపు తప్పనిసరి. ► బోర్ కొడుతోందని టైమ్ పాస్ కోసం ప్రేమలో పడ్డవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. కాబట్టి పిల్లలకి బోర్ అనిపించకుండా చదువుతో పాటు నృత్యం, సంగీతం, క్రీడలు, పుస్తకపఠనం... హాబీస్వైపుగా వారి దృష్టి మళ్లేలా చూడాలి. ► ‘ప్రేమలో పడ్డాం’ అని కౌన్సెలింగ్‌కు వచ్చే అమ్మాయిలు దాదాపు నిరుద్యోగులుగా తిరుగుతుండేవారినే ఇష్టపడటం చూస్తున్నాం’ అని కౌన్సెలర్లు చెబుతున్నారు. జాగ్రత్త అవసరం. - నిర్మలారెడ్డి ఇన్పుట్స్: యాదగిరి, సాక్షి, తుర్కయంజాల్ ఆకర్షణలు... లక్ష్యాలు ఒక బకెట్‌ను ముందు ఇసుకతో నింపాక అందులో రాళ్లు పట్టవు. అదే ముందు రాళ్లు వేసి, తర్వాత అంతే ఇసుకతో అదే బకెట్ నింపవచ్చు. పిల్లలు తెలియక తమ జీవితంలో ముందు ఇసుకనే నింపుకుంటున్నారు. రాళ్లుగా చెప్పుకునే లక్ష్యాలను వెనకేసుకోవాలనే జ్ఞానం వారికి ఉండటం లేదు. ఈ వయసులో ఆకర్షణలు ఇసుకతో సమానం అని, ఆ ఆకర్షణలో పడితే లక్ష్యాలను సాధించలేమని పిల్లలకు తెలియ చెప్పాలి. - డా. గీతాచల్లా, సైకాలజిస్ట్ మోసాలు పెరుగుతున్నాయి ప్రేమ పేరుతో నమ్మించి మోసాలు చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా టెన్త్, ఇంటర్మీడియెట్ అమ్మాయిలే ప్రేమ అనే ఆకర్షణలో పడుతున్నారు. తర్వాత మోసపోయి, బాధపడుతున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలపై దృష్టిపెట్టి వారిని సరిదిద్దాలి. - భాస్కర్‌గౌడ్, ఏసీపీ, వనస్థలిపురం -
ఎవరబ్బాయో..!
నాటకీయ పరిణామాల మధ్య వీరబల్లి పోలీసులకు దొరికిన బాలుడు తమ బిడ్డేనంటూ తిరుపతి, హైదరాబాద్ దంపతుల పోటీ కడప ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో చిన్నారి కడప రూరల్ : ఓ బాలుడి ఉదంతం మిస్టరీగా మారింది. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ జిల్లా వీరబల్లికి చెందిన ఈశ్వరయ్య, ప్రభావతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో గత ఆదివారం వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతికి వెళ్లి, ఓ బాలుడిని వెంట తెచ్చుకున్నారు. ఈ సంఘటన గ్రామంలో చర్చనీయాంశం కావడంతో గురువారం పోలీసులు రంగప్రవేశం చేసి బాలుడిని స్వాధీనం చేసుకుని కడప ఐసీడీఎస్ అధికారులకు అప్పజెప్పారు. ఇదిలా ఉండగా ఆ బాలుడు తమ కుమారుడేనని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన వడ్డె వెంకటయ్య, మణెమ్మ దంపతులు శుక్రవారం ఐసీడీఎస్ అధికారులను సంప్రదించారు. తమ కుమారుడైన అరుణ్ గత జనవరి 5వ తేదీన పిల్లలతో బయట ఆడుకుంటుండగా ఎవరో ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ విషయమై స్థానిక నార్సింగ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామన్నారు. అయితే అదే సమయంలో తిరుపతికి చెందిన లక్ష్మి, చందు అలియాస్ బాషా దంపతులు ఆ పిల్లాడు తమ కుమారుడు దీపక్‌గా చెబుతూ అధికారుల వద్దకు వచ్చారు. తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వైద్యం కోసం ఆదివారం తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్లామన్నారు. బయట ఉన్న వృద్ధుడి వద్ద పిల్లాడిని వదిలి లోపలికి వెళ్లి తిరిగివచ్చేసరికి పిల్లాడు కనిపించ లేదన్నారు. దీనిపై స్పందిస్తూ బాలుడిపై సమగ్రంగా విచారణ చేపడతామని, అవసరమైతే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఐసీడీఎస్ పీడీ రాఘవరావు తెలిపారు. -
చర్చి ఎక్కిన మతిస్థిమితంలేని వ్యక్తి
రంగారెడ్డి (కుత్బుల్లాపూర్): హైదరాబాద్ నగరం బాలానగర్ పరిధిలోని రంగారెడ్డి నగర్లో చర్చి ఎక్కి మతిస్థిమితం లేని వ్యక్తి హంగామా సృష్టించాడు. వివరాలు.. ఇబ్రహీంపట్నంకు చెందిన అరుణ్(28)కు మతిస్థిమితం లేదు. రంగారెడ్డినగర్‌లో ఉంటున్న తన పిన్నమ్మ ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చాడు. శనివారం ఉదయం చర్చి మూడో అంతస్తు మీద ఉన్న ఏసు ప్రభువు శిలువ మీదకెక్కడంతో రోడ్డుపైన ఉన్న జనం గుమిగూడారు. విషయం తెలుసుకున్న బాలానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలానగర్ కానిస్టేబుల్ నవీన్, చర్చి మీదున్న అరుణ్‌ని మెల్లగా మాటల్లో పెట్టి కిందికి దిగేలా చేశాడు. సుమారు గంటపాటు ఈ తతంగం నడిచింది. -
ఫ్యామిలీ డ్రామాతో....
ఓ తప్పటడుగు జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? అనే కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘తప్పటడుగు’. ఎ.ఎస్.ఎస్.వి అటిలియర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో అరుణ్ రూపొందించారు. లక్ష్మణ్, సురభిస్వాతి, సూర్యతేజ, నవీనజాక్సన్ హీరోహీరోయిన్లు. ఈ నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నామనీ, ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుందనీ అరుణ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి మధుకర్, కెమెరా: కర్ణ, సహ నిర్మాత: వి. రామకృష్ణ. -
యువకుడి అవయవదానం
వేలూరు: ద్విచక్ర వాహన ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో సీఎంసీ ఆస్పత్రి నుంచి చెన్నైకి అంబులెన్స్‌లో తరలించారు. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని మోర్థాంగల్ గ్రామానికి చెందిన అరుణ్(23) ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ నెల 13న ద్విచక్ర వాహన ప్రమాదంలో అరుణ్ తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చేర్పించా రు. చికిత్స చేసినా ఫలించక అరుణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందు కు వచ్చారు. చెన్నైలోని మద్రాసు మెడిక ల్ మిషన్ ఆస్పత్రిలోని ఒక రోగికి గుండె ఆపరేషన్ చేసేందుకు అత్యవసరం కావడంతో వేలూరు సీఎంసీలోని వైద్యులు అధునాతన పద్ధతిలో అరుణ్ గుండెను శస్త్ర చికిత్స ద్వారా వేరుచేసి సోమవారం సాయంత్రం 5.50 గంటల సమయంలో అంబులెన్స్‌లో చెన్నైకి తరలించారు. అరుణ్ కళ్లు, గుండె, వంటి అవయవాలను వివిధ రోగులకు అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఓవర్టేక్ తెచ్చిన ప్రమాదం
పూడూరు: వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. చన్గోముల్ ఎస్ఐ నాగరాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన మదన్, మౌలాలికి చెందిన విశాల్, అరుణ్, సుమన్‌లు స్నేహితులు. సుమన్ కొండాపూర్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో పనిచేస్తుండగా మిగిలిన ముగ్గురు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి మంగళవారం కారులో వికారాబాద్ సమీపంలోని ఓ రిసార్టుకు బయలు దేరారు. అరుణ్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. పూడూరు మండలం అంగ డిచిట్టంపల్లి కాటన్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే ముందుగా ఉన్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి సమీపంలోని పొలాల్లోకి ఎగిరి పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక రైతులు వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు లాగారు. అప్పటికే మదన్(28) మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో సుమన్(27) మృతి చెందాడు. అరుణ్ పరిస్థితి విషమంగా ఉంది. విశాల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారు పూర్తిగా దెబ్బతింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను వికారాబాద్ మార్చూరీకి తరలించారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. -
భయపెడుతుంది..!
‘‘హారర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా అందర్నీ భయపెడుతుంది’’ అని దర్శకుడు సతీశ్‌కుమార్ చెప్పారు. సన్ని, ఆకాంక్ష, అరుణ్, కవిత ముఖ్యతారలుగా కాండ్రేగుల ఆదినారాయణ నిర్మించిన ‘అంతా అక్కడే జరిగింది’ ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ పాటల సీడీని ఆవిష్కరించగా, కథానాయికలు ఇషికా సింగ్, శ్రీవాణీరెడ్డి, అవని థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఓ మంచి సినిమా తీయాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని నిర్మాత పేర్కొన్నారు. హాలీవుడ్ మూవీ ‘ఫారానార్మల్ యాక్టివిటీ’ ప్రేరణతో ఈ సినిమా తీసినట్టుగా ఉందని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ఇందులో అన్ని పాటలూ బాగా వచ్చాయని సంగీత దర్శకుడు రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయివెంకట్, ప్రసన్నకుమార్ తదితరులు మాట్లాడారు. -
తొలిరోజు భారత్‌కు నిరాశ
రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ తాష్కెంట్: ప్రపంచ చాంపియన్‌షిప్ అర్హత రౌండ్లో తొలి రోజు భారత రెజ్లర్లు నిరాశపరిచారు. సోమవారం ప్రారంభమైన ఈ పోటీల్లో... కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన రాజీవ్ తోమర్ 125కేజీల ఫ్రీస్టయిల్లో 1-3 తేడాతో కొరియాకు చెందిన ర్యోంగ్ సంగ్ చేతిలో ఓడాడు. అలాగే 70కేజీల ఫ్రీస్టయిల్లోనూ అరుణ్ 0-4 తేడాతో క్లియోపస్ క్యూబ్ (కెనడా) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో మరో ఇద్దరు భారత రెజ్లర్లు రాహుల్ బాలాసాహెబ్ అవారే, నరేశ్ కుమార్ తమ ప్రత్యర్థుల చేతిలో మట్టికరిచారు. ఆసియా గేమ్స్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్ తరఫున ద్వితీయ శ్రేణి రెజ్లర్లు బరిలోకి దిగారు. -
ప్రాంతీయ అసమానతలను పెంచి పోషిస్తారా?
రాజధాని ఎంపిక కు ప్రాంతీయ అసమానతల తొలగింపు, అభివృద్ధి వికేంద్రీకరణ గీటు రాళ్లు కావాలి. వెనుకబడిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలి. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, నగరాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రాంతీయ అసమానతలు మరింత పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం చూస్తే పాలకులు రాష్ట్ర ప్రజలతో ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారనిపిస్తోంది. సీఎం ఆ లోచనలు, మాటలు గుంటూరు - విజ యవాడ - తెనాలి చుట్టే పరిభ్రమిస్తుం డటం చూస్తూనే ఉన్నాం. అన్ని ముఖ్య కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు, విద్యా, వైద్య సంస్థలను విశాఖ నుండి గుం టూరు పరిధిలోనే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి రాజధానిపై ముందే నిర్ణయం జరిగిందనే భావన బలపడుతోంది. దుర దృష్టవశాత్తూ మన మహా నగరాల అభివృద్ధి అనుభవాల గుణ పాఠాల దృష్టి నుండి, ప్రాంతీయ అసమానతల వల్ల తలెత్తుతున్న సామాజిక ఉద్రిక్తతల నేపథ్యం నుండి మన రాజధాని ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అనే అంశం చర్చకు రావడం లేదు. ముఖ్యమంత్రి సహా చాలా మంది రాజధానిని ఒక ‘స్వప్నసీమ’గా, సింగపూర్ దిగొచ్చినట్టుగా ఉండాలని భావిస్తున్నారు. ఇది చూస్తే హైదరాబాద్‌లో ప్రభు త్వ కార్యాలయాలు, అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల కలిగిన దుష్ఫలితాలను విస్మరించారనిపిస్తుంది. ఇక అత్యం త అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలున్న ఈరోజుల్లో రాజధాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండాలనే వాదన అర్థరహితం. అమెరికా రాజధాని ‘వాషింగ్టన్ డీసీ’ ఒక మూలకు ఉంది! తెలంగాణ, కర్నాటక (బెంగళూరు), తమిళనాడు (చెన్నై) రాజధానులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలలో రాజధాని ఏర్పా టు వల్ల మౌలిక సదుపాయాల కల్పన సులభమనే వాదన సమంజసమైనదిగా కనబడుతుంది. కానీ రాజధాని ఎంపిక కమిటీ విధివిధానాలలోని 3వ క్లాజు... విలువైన వ్యవసాయ భూములను రాజధాని నిర్మాణానికి వాడరాదని విధించిన నిబంధన అత్యంత విజ్ఞతాయుతమైనది. మన మహా నగ రాల అభివృద్ధి అంతా పంట భూములను మింగేస్తూ జరిగినదే. దీంతో రైతులు, రైతు కూలీలు, వృత్తి పనివారి జీవితాలు ధ్వంసమయ్యాయి. మహానగరాల అభివృద్ధిలోని చీకటి నీడలను విస్మరించి అన్నీ అమరి ఉన్న నగరాల్లోనే రాజధానిని నిర్మించడం విధ్వంసకర వృద్ధికి ఆహ్వానం పలకడమే. పాలకుల దృష్టిలో ఉన్నవి నీటి పారుదల గల వ్యవసాయ భూములు. ప్రభుత్వ భూములు తక్కువ. అక్కడ భూసేకరణ అత్యంత ఖర్చుతో కూడిన పనే కాదు, అనర్ధదాయకం. అటవీ భూముల్లో రాజ ధానిని నిర్మించడం మరింత ప్రమాదకరం. రాష్ట్రంలో అడ వులు అభిలషణీయ స్థాయి కంటే చాలా తక్కువగా ఉన్నా యని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అకాల ప్రకృతి వైపరీత్యాలకు ఆలవాలమైన రాష్ట్రాన్ని మరింత ప్రమాదం లోకి నెట్టే యోచన అర్ధరహితం. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నేడు దేశవ్యాప్తంగానే అత్యంత ప్రాధాన్యం గల అంశం. కాబట్టి రాజధాని ఎంపికకు ప్రాంతీయ అసమానతల తొలగింపు, అభివృద్ధి వికేంద్రీకరణ అనేవే ప్రధానమైన గీటు రాళ్లు కావాలి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలి. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలూ ఏర్పాటు ఆ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడు తుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, నగరాలకే ప్రాధా న్యం ఇవ్వడం ప్రాంతీయ అసమానతలు మరింత పెరుగు తాయి. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు ప్రజల్లో అసంతృప్తి పెరగడం, పోరాటాలకు దిగడం అనివార్యం. తెలంగాణ విడిపోయిన తర్వాతనైనా సీమ అవసరాలను గుర్తించక కేంద్ర, రాష్ట్ర సంస్థలను, ఆర్టీసీ, వ్యవసాయ విద్యాలయం, రైల్వే జోన్ తదితరాలన్నిటినీ కోస్తా పట్టణాలకు కేటాయి స్తున్నారు. దీంతో సీమ వాసుల్లో మరలా మోసపోతున్నా మనే భావన ఏర్పడింది. అలాగే ఉత్తరాంధ్ర (విశాఖపట్టణం మినహా) ప్రజల్లో కూడా కొత్త రాష్ట్రం తమను విస్మరించిం దనే భావన నెలకొంది. మేం ఆంధ్రప్రదేశ్‌లో భాగమేనా? అనే ప్రశ్న సీమ (ప్రకాశం, నెల్లూరు సహా), ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉదయిస్తోంది. అధికార కేంద్రీకరణలాగే అభివృద్ధి కేంద్రీకరణ కూడా అప్రజాస్వామికం. 1937లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల ఐక్యతకు ప్రాతిపదికగా రూపొందిన ‘శ్రీబాగ్ ఒడంబడిక’ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక. ఆ చారిత్రక ఒప్పందాన్ని నేడైనా అమలు చేసి కర్నూలును రాజధాని చేయడం సబబు. కాదనుకుంటే సీమలోకెల్లా వెనుకబడిన అనంతపురం లేదా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం లేదా విజయనగరాల్లో ఒక దాన్ని లేదా పల్నాడును ఎంపిక చేయాలని రాయలసీమ విద్యా వంతుల వేదిక భావిస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో ఒక చోట రాజధానిని ఏర్పరిస్తే, రెండో చోట ఏడాదికి కనీసం ఒకమారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, మూడవ చోట హైకోర్టును నెలకొల్పడం న్యాయం. అప్పుడే అన్ని ప్రాంతాల మధ్య సమ న్యాయాన్ని పాటించినట్టవుతుంది. (వ్యాసకర్త రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్) అరుణ్ -
ఎవరికి ఎవరు మూవీ ఓపెనింగ్
-
వారు ఆమెకు వెరీ స్పెషల్!
ఆసరా దొరికితే మల్లెతీగ పూల పందిరి అవుతుంది. అప్పుడప్పుడే కళ్లు తెరుస్తున్న పక్షి పిల్లలకు ఎగరగలవనే ఆశను కల్పిస్తూ రెక్కల భరోసాను అందిస్తే అవి ప్రపంచాన్నంతా చుట్టేస్తాయి.మరి... సంకల్పం గల మనసుకు, ఆ మనసులోని ఆశయాలకు అండగా నిలిస్తే, అవకాశాలను కల్పిస్తే..! ఆ వ్యక్తులు అద్భుతాలే చేయగలుగుతారు. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు కర్ణాటకలోని సుంటికొప్ప ప్రాంతానికి చెందిన గంగా చెంగప్ప. మెంటల్లీ చాలెంజ్డ్ చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఆమె తీర్చిదిద్దిన రత్నాల్లాంటి ముగ్గురు పిల్లలు ఏకంగా...స్పెషల్ ఒలింపిక్స్ స్థాయికి వెళ్లారు.ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌లో... భారతదేశానికి పసిడి, రజత, కాంస్య పతకాలను గెలుచుకొచ్చారు. కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన ఓ సామాన్య గృహిణి గంగా చెంగప్ప. భర్త, పిల్లలు- ఇలా సంసార బాధ్యతల్లో మునిగిపోయిన ఆమె ఆ తరువాత తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలని అనుకున్నారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు పాఠాలు చెప్పే స్పెషల్ ఎడ్యుకేటర్‌గా అర్హత సాధించిన గంగా చెంగప్ప తను చేయబోయే పని మెంటల్లీ ఛాలెంజ్డ్, ఆటిజం చిన్నారుల కోసమే అయితే మరింత బాగుంటుందని భావించారు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. తన లక్ష్యానికి కుటుంబ సభ్యుల సహకారం కూడా తోడవడంతో తన మనసులోని ప్రాజెక్టు రూపకల్పన పనిలో నిమగ్నమయ్యారు గంగా చెంగప్ప. 2003లో సుంటికొప్ప ప్రాంతంలో ఈ ‘స్పెషల్’ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ శిక్షణ కేంద్రాన్ని ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రారంభించారు. 2003లో కేవలం 20 మందితో ప్రారంభమైన ఈ కేంద్రంలో ప్రస్తుతం 125మంది శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ కేంద్రంలో ఉచిత హాస్టల్ వసతితో పాటు పదో తరగతి వరకు విద్యాబోధన కూడా జరుగుతోంది. ఈ ‘స్పెషల్’ చిన్నారులకు తమ పనులను తామే చేసుకునేలా శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు గాను టైలరింగ్, న్యూస్‌పేపర్ బ్యాగ్‌ల తయారీ వంటి వివిధ అంశాల్లో ‘స్వస్థ’ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు గాను ‘స్వస్థ’ సంస్థలో నిపుణులైన ఏడుగురు శిక్షకులు పనిచేస్తున్నారు. పతకాల దిశగా ప్రోత్సాహం... ‘ప్రతి మనిషికీ దేవుడిచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే అది మనిషిగా జీవించగల అవకాశాన్ని అందించడమే’ అంటారు గంగా చెంగప్ప. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దాన్ని కనుక పదును పెట్టగలిగితే వారు అద్భుతాలను చేయగలుగుతారనేది ఆమె నమ్మకం. అదే నమ్మకంతోనే తమ సంస్థలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారుల్లో ఉన్న నైపుణ్యాలకు పదును పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా క్రీడల పట్ల వారిని ఆకర్షితులను చేసేందుకు చాలా శ్రమించారు. ‘ఆటిజం, మెంటల్లీ చాలెంజ్డ్ చిన్నారులను ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచడం ఎంతో అవసరం. అప్పుడే వారు కొత్త విషయాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. అందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మా సంస్థలోని చిన్నారులకు క్రీడల్లో శిక్షణనిచ్చేందుకు శిక్షకులను ఏర్పాటు చేశాం. క్రీడల్లో రాణించిన చిన్నారుల ప్రతిభ కేవలం మా సంస్థ వరకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతోనే వారిని జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి విభాగాల్లో ప్రత్యేక క్రీడల పోటీలకు పంపేవాళ్లం. జాతీయ స్థాయిలో పాల్గొన్న మా చిన్నారులు మందన్న, అరుణ్, గౌతమ్‌లు స్పెషల్ ఒలింపిక్స్‌కు కూడా ఎంపికయ్యారు. అక్కడ కూడా వారు తమ ప్రతిభతో భారతదేశానికి పసిడి, రజత, కాంస్య పతకాలను గెలుచుకు రావడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అన్నారు గంగా చెంగప్ప. భవిష్యత్తుకు భరోసానిచ్చేలా... ఇక స్వస్థ సంస్థలో శిక్షణ తీసుకున్న చిన్నారులకు శిక్షణ తర్వాత కూడా గంగా చెంగప్ప తోడుగా ఉంటున్నారు. టైలరింగ్ విభాగంలో శిక్షణ తీసుకున్న వారికి గార్మెంట్స్ సంస్థల యాజమాన్యంతో మాట్లాడి ఉద్యోగాలను ఇప్పించడంతో పాటు అనేక మందికి స్వస్థలోనే తిరిగి ఉద్యోగాలను కల్పించారు. ‘కేవలం శిక్షణ సమయంలోనే కాదు వారి భవిష్యత్తులోనూ భరోసాను అందించాలన్నదే నా ఆశయం. అందుకే మందన్న, అరుణ్‌లకు మా సంస్థలోనే ఉద్యోగాలను అందజేశాం. ఇక పేపర్ బ్యాగ్ ప్రింటింగ్ విభాగంలో శిక్షణ తీసుకున్న వారికి చిన్నపాటి యూనిట్ ఏర్పాటుకు సహకారం అందించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం. ‘స్పెషల్’ చిన్నారులు ఎవరిపైనా ఆధారపడకుండా ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించగలిగేందుకు ఇలాంటి కార్యక్రమాల రూపకల్పన అవసరమనేది నా అభిప్రాయం’ అన్నారు గంగా చెంగప్ప. సాధారణ పిల్లల కంటే స్పెషల్ కిడ్స్ దీక్షగా పనిచేస్తారంటారు ఆమె. అయితే వీరి ఇష్టాన్ని తెలుసుకోవడం, శిక్షణ ఇవ్వడంలో ఓపిగ్గా వ్యవహరించాలి. ఆ మాత్రం శ్రద్ధ తీసుకుంటే ఇక వీళ్లు ఎవరికీ తీసిపోరు అనేటప్పుడు ఆమెలో మాతృత్వపు మురిపెం కనిపించింది. నిజమే! స్పెషల్ చిల్డ్రన్ని పెంచాలంటే తల్లికి ఉన్నంత ఓర్పు ఉండాలి. అంతటి ఓర్పు ఉన్న మహిళ గంగాచెంగప్ప. - షహనాజ్ కడియం, సాక్షి రిపోర్టర్, బెంగళూరు శభాష్ మందన్న... మందన్నది కర్ణాటకలోని కొడగు ప్రాంతం. చెన్నై, హైదరాబాద్‌లలో స్పెషల్ చిన్నారుల కోసం నిర్వహించిన ప్రత్యేక పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. ఆస్ట్రేలియాలో స్పెషల్ ఒలంపిక్స్‌లో వంద మీటర్ల పరుగుపందెంలో స్వర్ణం, నాలుగు వందల రిలేలో రజతం, 200మీటర్ల పరుగులో కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు. స్వస్థ పాఠశాలలోనే ఆఫీస్‌బాయ్‌గా నెలకు రూ.1,500జీతాన్ని సంపాదిస్తున్నాడు. పేపర్ బ్యాగ్ ప్రింటింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేస్తానని చెబుతున్నాడు. తల్లిదండ్రుల కోసమే ఈ ‘అరుణ్’ కిరణం... అరుణ్‌ది కొడగులోని సోమవార్‌పేట. పదో తరగతి వరకు విద్యాభ్యాసాన్ని కూడా పూర్తి చేశాడు. అంతేకాదు బోసె(ఇటలీలో ప్రముఖమైన ఆట) క్రీడలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ శిక్షణతోనే స్పెషల్ ఒలింపిక్స్ 4, 6వ స్థానాలను కైవసం చేసుకున్నాడు. స్వస్థలో బటర్ ఫ్లై గార్డెన్‌ను చూసుకుంటున్నాడు. తన వేతనం రూ.1,500ను తన తల్లిదండ్రులకు పంపుతున్నానంటూ గర్వంగా చెబుతాడు అరుణ్. గౌతమ్ తల్లి స్వస్థ సంస్థలో పనిచేస్తూ బిడ్డకు అదే సంస్థలో శిక్షణ ఇప్పించింది. బోసె క్రీడలో రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నాడు.