స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలకు హ్యాండిచ్చిన సీఎండీ అరుణ్‌ భక్షీ | Visaka Steel Plant CMD Arun Bhakshi Went To Delhi | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలకు హ్యాండిచ్చిన సీఎండీ అరుణ్‌ భక్షీ

Sep 18 2024 12:44 PM | Updated on Sep 18 2024 1:11 PM

Visaka Steel Plant CMD Arun Bhakshi Went To Delhi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ‍స్టీల్‌ ప్లాంట్‌ అంశంలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. కార్మిక సంఘాలకు స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీ అరుణ్‌ భక్షీ హ్యాండిచ్చారు. ఈరోజు కార్మిక సంఘాలను సమావేశానికి రావాలని పిలిచి ఆయన మాత్రం ఢిల్లీకి వెళ్లిపోయారు.

కాగా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో సీఎం అరుణ్‌ భక్షీ.. కార్మిక సంఘాలకు భారీ షాకిచ్చారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కార్మిక సంఘాల నేతలను సమావేశాలని రావాలని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. కానీ, ఇంతలోనే ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇక, సీఎండీ పిలుపుతో కార్మిక సంఘాలు సమావేశానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలా జరగడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు.  

ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయం స్టీల్‌ ప్లాంట్‌ లోపల కాంట్రాక్ట్‌ కార్మికులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలు చేస్తున్నారు. కార్మికుల నినాదాలతో స్టీల్‌ ప్లాంట్‌ దద్దరిల్లుతోంది. మరోవైపు.. నాలుగు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అందలేదు. తమ జీతాల నుంచి పీఎఫ్‌ కట్‌ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారికి పీఎఫ్‌ చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల్లో దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొన్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విధుల్లోకి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్‌ ప్లాంట్‌ కాదా?’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement