Visaka steel plant
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉక్కు కార్మికుల డెడ్‌లైన్
సాక్షి, విశాఖ: విశాఖ ఉక్కు కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డెడ్ లైన్ విధించారు. తమకు చెల్లించాల్సిన జీతాలను వారం రోజుల్లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. జీతాలు ఇవ్వని పక్షంలో ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టేందుకు అర్హత లేదంటూ సీపీఎం నేత కామెంట్స్ చేశారు.విశాఖ ఉక్కు కార్మికుల జీతాల విషయంపై సీపీఎం నేత గంగారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. విశాఖ వచ్చే లోపు కార్మికులకు జీతాలు చెల్లించాలి. లేదంటే విశాఖలో కాలుపెట్టే అర్హత లేదు.. అడుగడుగునా ముట్టడిస్తాం. ఉద్యోగుల జీతాల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలి.ఉక్కు కార్మికులకు ఇంత అన్యాయం జరుగుతుంటే విశాఖ ఎంపీ ఏం చేస్తున్నారు?. యూనివర్సిటీని నడుపుకోడానికి నిన్ను ఎంపీని చేయలేదు. జీతాలకోసం యాజమాన్యంతో మాట్లాడాలి. ఎంపీ మాట కూడా యాజమాన్యం వినకపోతే ఉద్యమంలోకి రావాలి. ఆయనతో కలిసి మేమంతా ఉద్యమిస్తాం అని చెప్పుకొచ్చారు. -
కూటమి చేష్టలు.. విశాఖ ఉక్కు ఉద్యోగుల ఆశలపై నీళ్లు!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఉద్యోగులు.. కూటమి నేతలపై ఆశలు వదులుకున్నారు. కూటమి సర్కార్ కారణంగా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉక్కు కార్మికులు వీఆర్ఎస్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. వైదొలగడమే మంచిదనే భావనలో ఉక్కు ఉద్యోగులు ఉన్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం విశాఖ ఉక్కు కార్మికులకు శాపంగా మారింది. స్టీట్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూటమి నేతలు అడ్డుకోకపోవడంతో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్న వేళ కార్మికుల్లో గందరగోళం నెలకొంది. ముడి సరుకు రాకపోవడం, ఉత్పత్తి లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సమయానికి జీతాలు కూడా ఇవ్వకపోతుండటంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో కూటమి సర్కార్‌పై ఉక్కు కార్మికులు ఆశలు వదులుకున్నారు. చేసేదేమీ లేకపోవడంతో ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ కార్మికులు వీఆర్ఎస్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ నుంచి వైదొలగడమే మంచిదనే భావనకు వచ్చారు. మరోవైపు.. కూటమి సర్కార్ తీరు కార్మిక సంఘాలు మాట్లాడుతూ కార్మిక శక్తి తగ్గిపోతే ప్లాంట్ నిర్వీర్యం అవుతుందని చెబుతున్నారు. -
స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తున్న A1, A 2, A 3
-
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులకు వేధింపులు!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులకు వేధింపులు ప్రారంభమయ్యాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. ఉద్యోగులను అనేక రకాలుగా వేధిస్తోంది. దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే కుట్ర జరుగుతోంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులకు యాజమాన్యం నుంచి కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగుల అలవెన్స్‌లు, హెచ్ఆర్ఏను యాజమాన్యం తొలగించింది. అలాగే, దాదాపు 500 మంది ఉద్యోగులను నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాకుండా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న దాదాపు 3000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తోంది. మరోవైపు.. వీఆర్ఎస్ పేరుతో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు కార్మికులు చెబుతున్నారు. యాజమాన్యం ప్రయత్నాలు అన్నీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగమేనని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.ఇక, ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ మూసివేత కారణంగా 455 మంది శాశ్వత, 2500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మొదపకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి కార్మికులు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.ఇది కూడా చదవండి: టీడీపీ గూండాల ఆరాచకం.. వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై దాడి -
పురుషులందు దుర్మార్గ చంద్రబాబు వేరయా: విజయసాయి రెడ్డి సెటైర్లు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో విశాఖ ఉక్కును తుక్కు కింద మార్చేశారని అన్నారు. అలాగే, పురుషులందు ఈ దుర్మార్గపు చంద్రబాబు వేరయా అని చెప్పుకోవాలి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా.. చంద్రబాబు 100 రోజుల పనితీరు పార్ట్-2 పేరుతో..100 రోజుల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. 100 రోజుల్లో 60 అత్యాచారాలు జరిగాయి.100 రోజుల్లో విజయవాడలో "ఐరన్ లెగ్" పాలనలో వరదల్లో 60 మందిని చంపేశారు వరద బాధితులకు కనీస సహయ సహకారాలు కూడా అందించలేదు. బాబు ఫోటోషూట్ తప్ప. 100 రోజుల్లో గుడ్లవల్లేరు కాలేజీ మహిళ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి 3 వేల వీడియోలు తీసారు. 100 రోజుల్లో విశాఖ ఉక్కు ను తుక్కు కింద మార్చేశారు.వైజాగ్ ఆర్థిక వెన్ను ను చంద్రబాబు ప్రభుత్వం విరిచేసింది. విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమ తుఫానులో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయం. అమరావతి వరదముంపులో ఇల్లు లేక కలెక్టర్ ఆఫీసు లో తలదాచుకున్న బాబుకు అదికూడా మిగలదు. 100 రోజుల్లో పోలవరాన్ని నాశనం చేశారు.100 రోజుల్లో అమరావతిని మునిగి పోకుండా ఉండటానికి ప్రకాశం బ్యారేజీని టిడిపి నేత బోట్లతో గుద్దించారు.100 రోజుల్లో మెడికల్ కాలేజీ లను నాశనం చేశారు.100 రోజుల్లో సచివాలయ వ్యవస్థను నాశనం చేశారు.100 రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను నాశనం చేశారు.100 రోజుల్లో రేషన్ వాహనాలు నాశనం చేశారు. 100 రోజుల్లో 10 వ్యాపార కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు. 100 రోజుల్లో రోడ్లను నాశనం చేశారు, గుంతలపై తట్ట మట్టి కూడా వేయలేదు100 రోజుల్లో ప్రత్యర్థి రాజకీయ నేతలపై పదివేల దాడులు చేశారు. 100 రోజుల్లో రాష్ట్రాన్ని నేరమయం చేశారు , నేరాలు దారుణంగా పెరిగిపోయాయి.100 రోజుల్లో 40వేల కోట్ల అప్పులు చేశారు.100 రోజుల్లో మొత్తంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.👉మిగతా 1725 రోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు కష్టాలు, రాష్ట్రవిధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి.👉భారతదేశంలో బాబులాంటి నిష్కారణ శత్రువులు వుంటారు. మనం ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పులు చేస్తూ ఎదుటివారి మీద నిందలు వేస్తుంటారు. వారిలో ఆద్యుడు ఈ చంద్రబాబు.👉చంద్రబాబు జీవిత చరిత్ర అంతా ఏ పేజీ తిరగేసినా నేరాల చిట్టా కనిపిస్తుంది. అబద్ధాల వాక్యాలతో నిండిన ఈ దరిద్రపు పుస్తకాన్ని ఎల్లో కుల మీడియా చాటున గొప్ప చరిత్ర గా చూపిస్తూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు.👉పురుషులందు పుణ్య పురుషులు వేరయా అంటాడు వేమన. కానీ పురుషులందు ఈ దుర్మార్గపు చంద్రబాబు వేరయా అని చెప్పుకోవాలి.నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటాడు చంద్రబాబు.👉తప్పొప్పులు, సత్యా అసత్యాలకు సరిహద్దు మర్చిపోయిన చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం.👉మొదట్లో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయన ఒక్కరే ఇతని చేతిలో మోసపోయాడు అనుకున్నాను. కానీ 1995నుండి ప్రజలు కూడా వెన్నుపోటుకు గురయ్యారని బాధగా అనిపిస్తున్నది.👉టీడీపీ నాయకులకి ఏంచెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్లే. సిగ్గు ఎప్పుడో వదిలేసారు. మానం, మర్యాదలు వాళ్ళ నిఘంటువు లో లేవు.👉వైఎస్సార్సీపీ నాయకులూ కార్యకర్తలు పోరాడాలి. టీడీపీ వాళ్ళు మట్టిలో కలిసే వరకు పోరాడాలి అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు 100 రోజుల పనితీరు - పార్ట్ 2 @ncbn************~100 రోజుల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ~100 రోజుల్లో 60 అత్యాచారాలు జరిగాయి.~100 రోజుల్లో విజయవాడలో "ఐరన్ లెగ్" పాలనలో వరదల్లో 60 మందిని చంపేశారు ~వరద బాధితులకు కనీస సహయ సహకారాలు కూడా అందించలేదు. బాబు ఫోటోషూట్ తప్ప.…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2024ఇది కూడా చదవండి: ప్రైవేటీకరణ దిశగా స్టీల్‌ప్లాంట్.. ఉక్కు కార్మికుల నిరసన -
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు హ్యాండిచ్చిన సీఎండీ అరుణ్ భక్షీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కార్మిక సంఘాలకు స్టీల్ ప్లాంట్ సీఎండీ అరుణ్ భక్షీ హ్యాండిచ్చారు. ఈరోజు కార్మిక సంఘాలను సమావేశానికి రావాలని పిలిచి ఆయన మాత్రం ఢిల్లీకి వెళ్లిపోయారు.కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం అరుణ్ భక్షీ.. కార్మిక సంఘాలకు భారీ షాకిచ్చారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కార్మిక సంఘాల నేతలను సమావేశాలని రావాలని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ, ఇంతలోనే ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇక, సీఎండీ పిలుపుతో కార్మిక సంఘాలు సమావేశానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలా జరగడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయం స్టీల్ ప్లాంట్ లోపల కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలు చేస్తున్నారు. కార్మికుల నినాదాలతో స్టీల్ ప్లాంట్ దద్దరిల్లుతోంది. మరోవైపు.. నాలుగు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అందలేదు. తమ జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం వారికి పీఎఫ్ చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల్లో దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విధుల్లోకి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’ -
టీడీపీ భరత్, పల్లా.. మిమ్మల్ని ప్రజలు క్షమించరు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావును మాదిరిగానే విశాఖ టీడీపీ ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తాజాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను 2024 జనవరిలో స్పీకర్ ఆమోదించారు. అప్పటి గంటా శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత వైజాగ్ పార్లమెంటు సభ్యుడు భరత్ మతుకుమల్లి, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలి. వారు అలా రాజీనామా చేయకపోయినా, ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోయినా చరిత్ర వారిని ద్రోహులుగా, మోసగాళ్లుగా పరిగణిస్తుంది. ప్రజలు వారిద్దరినీ క్షమించరు. వారు చేసిన ద్రోహానికి వారిద్దరికీ గట్టి గుణపాఠం జనం చెబుతారు అంటూ కామెంట్స్ చేశారు. The then MLA, Sri Ganta Srinivas Rao, resigned in February 2021 in protest against the decision to privatize the Vizag Steel Plant, and his resignation was accepted in January 2024. Taking inspiration from him, Vizag Lok Sabha MP Bharat Mathukumilli (@sribharatm) and local MLA…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 13, 2024 అయితే, నిన్న కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి కొట్టుకుపోయినట్టే. ఈ సంక్షోభం సమయంలో ఆయన మౌనం ఎన్డీయే కేంద్రప్రభుత్వానికి ఉక్కు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగా భావించవచ్చు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డట్టే. స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్ లో ఎగిసి పడిన ఒక ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) ఇక ఛిద్రమైనట్టే. చంద్రబాబు మోసాన్ని, కాపాడే శక్తి ఉన్నా నిర్లిప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు. టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. (1/7) భయపడినంతా అయింది. చంద్రబాబు@ncbn గారి హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 12, 2024 ఇది కూడా చదవండి: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏలేరు వరదలు: వైఎస్ జగన్ -
Vishaka: స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో శనివారం( జనవరి 13) సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-3లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్లాంటుకు చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా ప్లాంటులో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పలు అగ్ని ప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇదీచదవండి.. లొంగిపోయి పూచికత్తులు సమర్పించిన చంద్రబాబు -
విశాఖ ఉక్కుపై హైకోర్టులో కేఏ పాల్ పిల్
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నామమాత్రపు ధరకు విక్రయించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఉక్కు కర్మాగారం ఆదాయ, వ్యయాలపై విచారణ జరిపేందుకు తెలుగు తెలిసిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోర్టును కోరారు. అంతేకాక విశాఖ స్టీల్ ప్లాంట్ నడిచేందుకు రూ. 8 వేల కోట్లు అయినా, రూ.42 వేల కోట్లైనా తన గ్లోబల్ పీస్ సంస్థ ద్వారా విరాళాల రూపంలో సేకరిస్తానని, ఇందుకోసం అనుమతినిచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా కోరారు. గురువారం ఉదయం ఆయన స్వయంగా హైకోర్టుకు వచ్చి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ముందు తన పిల్ గురించి ప్రస్తావించారు. తన వ్యాజ్యంపై లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని ధర్మాసం పేర్కొంది. ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్‌ప్లాంట్ కొంటా: KA పాల్ -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినట్టు వచ్చిన వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని పేర్కొంది. RINL ఉపసంహరణ ప్రక్రియపై ఎలాంటి ప్రతిష్టంభన లేదు. RINL పనితీరు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రం వెల్లడించింది. -
పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు ప్రజా గర్జన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉక్కు ప్రజాగర్జనకు పిలుపునిచ్చింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాగర్జన కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. విశాఖ గర్జన సభలో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొననున్నారు. -
విశాఖలో ఉక్కు ఉద్యమం ప్రజా వేదిక..
-
రైతు ఉద్యమం తరహాలో విశాఖ ఉక్కు పోరు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ రంగం మొత్తాన్ని మోదీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని జాతీయ ప్రజా ఉద్యమ ప్రతినిధి మేధా పాట్కర్ నిప్పులు చెరిగారు. అందులో భాగంగానే ప్రజల సంపద అయిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం జాతి సంపదను అత్యంత చౌకగా కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని దుయ్యబట్టారు. రైతు ఉద్యమం తరహాలో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్య ఉద్యమాలే దేశ పాలకులు తమ నిరంకుశ నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా చేస్తాయన్నారు. ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయడం ప్రజలందరి కర్తవ్యమని తెలిపారు. విశాఖపట్నం కూర్మన్నపాలెంలో స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరాహార దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించి మద్దతు తెలిపిన మేధా పాట్కర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి: ప్రైవేటీకరణపై విశాఖ ఉక్కు కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని మీరెలా చూస్తున్నారు? మేధా పాట్కర్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఐక్య ఉద్యమం అద్భుతం. స్టీల్‌ప్లాంట్ కార్మికులు 261 రోజులుగా పోరాడుతున్నారు. ఇది అనేక ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తోంది. సాక్షి: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉండవచ్చు? మేధా పాట్కర్: మొత్తం దేశాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. అందులో భాగంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్ సహా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు. ఈ విధానం వల్ల దేశానికి చాలా నష్టం జరుగుతుంది. జాతి సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం కూడా. సాక్షి: ప్రైవేటీకరణ వల్ల ఎలాంటి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? మేధా పాట్కర్: ప్రైవేటీకరణతో అన్నీ నష్టాలే. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్), తప్పనిసరి పదవీ విరమణ (సీఆర్ఎస్), గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో కార్మికులను తొలగిస్తారు. ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉద్యోగులను కాంట్రాక్టు లేబర్‌గా మార్చుకుంటారు. రిజర్వేషన్లు అమలు కావు. ఇది ఊహాజనితం కాదు.. అనేక చోట్ల రుజువైంది కూడా. ఇప్పుడు రైల్వే రంగాన్ని చూస్తే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైల్వేలో అన్ని విభాగాలను ఒక్కొక్కటిగా కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు. రేపు ఇక్కడా (విశాఖ స్టీల్ ప్లాంట్‌లోనూ) అదే జరుగుతుంది. దీనివల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోతారు. ఇప్పటికే 29 కార్మిక చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా నాలుగు కోడ్లుగా మార్చి హక్కులను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాక్షి: మీరు కొంతమంది నిర్వాసితులను కలిశారు కదా. వారు ఏమంటున్నారు? మేధా పాట్కర్: వారి సమస్యలను తెలుసుకొన్నాను. నిర్వాసితులు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమందికి ఇంకా పునరావాసం కూడా కల్పించలేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నెరవేరలేదు. స్టీల్‌ప్లాంట్ కోసం తమ వ్యవసాయాన్ని వదులుకొని భూములిచ్చారు. పబ్లిక్ అవసరాల కోసం భూములను ఇస్తే ప్రభుత్వం మాత్రం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోంది. సాక్షి: ప్లాంట్ విలువను చాలా తక్కువకే అంచనా వేశారన్న ఆరోపణలున్నాయి. నిజమేనంటారా? మేధా పాట్కర్: అవును. రెండున్నర లక్షల కోట్ల విలువైన ప్రజా సంపదను కేవలం రెండు, మూడు వేల కోట్లుగా అంచనా వేసినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ వ్యక్తులకు కారుచౌకగా దీన్ని ఇచ్చేయాలన్నది మోదీ ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టేశారు. స్టీల్‌ప్లాంట్‌ను కూడా ఆయనకే అప్పగిస్తారు. ఆ రెండింటినీ అనుసంధానం చేసి రూ.వేల కోట్ల లాభాలను సంపాదిస్తారు. వారి ఆకలి అక్కడితో ఆగదు. సాక్షి: స్టీల్‌ప్లాంట్ కార్మికుల పోరాటం మరింత బలోపేతం కావాలంటే ఏం చేయాలి? మేధా పాట్కర్: ప్రస్తుతం కార్మికులు, నిర్వాసితులు వేర్వేరుగా ఆందోళన శిబిరాలను నిర్వహిస్తున్నారు. వారిద్దరూ కలిసి పోరాడాలి. రైతు ఉద్యమం తరహాలో విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగాలి. దీనికి మేము కూడా కృషి చేస్తాం. పార్లమెంట్లో పోరాడటానికి అవకాశం లేదు. అందువల్ల పార్లమెంట్ బయట ఉధృతంగా ఉద్యమాలను నడపాలి. కార్మిక సంఘాల నాయకులు, నిర్వాసితులు, రైతులు, ప్రజలు, ఐక్యంగా పోరాడాలి. సాక్షి: పోరాడటం వల్ల ప్రైవేటీకరణను అడ్డుకొనే అవకాశం ఉందా? మేధా పాట్కర్: ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. అలాంటి విజయాలు చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్రాన్ ప్రాజెక్టు ఆగింది.. నర్మదా ప్రాజెక్టుపై పోరాటం జయప్రదంగా సాగింది. పోరాడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు. -
కుదిరితే అమ్మకం, లేదంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్కు వంటి ప్రభుత్వరంగ సంస్థలను సాధ్యమైతే ప్రైవేటీకరించడం, కుదరని పక్షంలో వాటిని శాశ్వతంగా మూసివేయడం నూతన పబ్లిక్ సెక్టర్ విధానమని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విశాఖ ఉక్కులో వందశాతం వాటాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జనవరి 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో వాటాల ఉపసంహణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి లేఖలో వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేస్తూ ఈ అంశంపై తమ నిర్ణయంలో మార్పులేదని స్పష్టంచేసినట్లు తెలిపారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ.1,750 కోట్లను కేంద్రం విడుదల చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఇందులో 2016–17 నుంచి 2020–21 వరకు ఐదేళ్లలో రూ.1,050 కోట్లు విడుదలయ్యాయని టీడీపీ సభ్యుడు కనకమేడల ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
ప్రైవేటీకరణను ఆపాల్సిందే..
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర ప్రభుత్వం భేషజానికి పోకుండా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగరంలోని సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 100వ రోజుకు చేరుకున్నాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ..ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వారికి కారుచౌకగా అమ్మేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలను పెడచెవిన పెట్టి.. కేంద్రం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ర్యాలీలో కార్మిక సంఘాల నేతలు ఓబులేసు, సి.హెచ్.నర్శింగరావు, జె.వెంకటేశ్వరరావు, పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి. ఆదినారాయణ, జె. అయోధ్యరామ్, గంధం వెంకటరావు, కె.ఎస్.ఎన్.రావు, వై. మస్తానప్ప, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ కార్మికులు పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరైన నిర్ణయం కాదు
ఢిల్లీ : కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా తగ్గుతోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే కేంద్ర పన్నుల వాటా క్రమేణా తగ్గుతోందని తెలిపారు. జనాభాకు ఎక్కువ ప్రాధన్యాత ఇచ్చిన పన్నుల వాటాలో కోత పెడుతున్నారని, జనాభాను నియంత్రణ చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారని పేర్కొన్నారు.జనాభా ఆధారంగా పన్నుల వాటాను నిర్ధారించే పద్ధతిని మార్చుకోవాలని,ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరైన నిర్ణయం కాదని, ప్రభుత్వ వనరుల సమీకరణ కోసం సంస్థ నమ్మడం మంచిది కాదని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వం వనరులు సమీకరించుకోవాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసన ప్రకటిస్తున్నా, కేంద్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 'ఎన్నో త్యాగాల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు. 2015 వరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే ఉంది. రుణాలను వాటాలుగా మారిస్తే ప్లాంట్ మళ్ళీ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అని విజయసాయిరెడ్డి నినదించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏడాది 120 కోట్ల రూపాయల జిఎస్టి చెల్లిస్తోందని, హిందుత్వకు తామే ప్రతినిధులం అని చెప్పుకునే బిజెపి ప్రభుత్వం దేవాలయాలపై పన్నులు ఉపసంహరించుకోవాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. 'భక్తులు ఉండే గదుల పైన సైతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాణిజ్య సంస్థ కాదు..లాభార్జన కోసం అక్కడ కార్యక్రమాలు జరగడం లేదు దేవుడి సేవ కోసమే భక్తులు ఉన్నారు. జీఎస్టీ వ్యవస్థ కంటే ముందు టిటిడిపై పన్నుల భారం లేదు.కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తిరుమలపై జిఎస్టి ఉపసంహరించుకోవాలి' అని విజయసాయిరెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. చదవండి : ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే ప్రత్యేక హోదాపై ఒత్తిడి పెంచిన వైఎస్సార్సీపీ -
నేడు విశాఖ ఉక్కు.. రేపు బీహెచ్ఈఎల్.. ఎల్లుండి సింగరేణి
బంజారాహిల్స్ (హైదరాబాద్): నేడు విశాఖ ఉక్కు.. రేపు బీహెచ్ఈఎల్.. ఎల్లుండి సింగరేణి.. ఇలా కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ అమ్మకానికి పెడుతుందని, భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ సర్కార్ ప్రైవేట్‌పరం చేసేలా ఉందని మున్సిపల్ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం 100 శాతం అమ్మే ప్రయత్నం చేస్తోందని, తాము అక్కడి ప్రజలకు అండగా ఉంటామని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి తీసుకొని విశాఖకు వెళ్లి మద్దతు తెలుపుతామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై.. మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకుండా చేపట్టిన ఉక్కు ఉద్యమానికి నైతికంగా సంఘీభావం పలుకుతామన్నారు. తెలంగాణలో ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రయత్నం జరిగితే ఏపీ ప్రజలు కూడా మాతో కలిసి రావాలని కోరారు. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు వస్తారన్నారు. అన్నీ అమ్మిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటుపరం చేయండని అంటారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చింది సున్నా.. తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా ఉక్కు కర్మాగారం స్థాపించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న కేంద్ర పెద్దలు.. విశాఖలో పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని అమ్మే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు నోరు ఎందుకు మెదపడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో లెక్కలతో సహా చూపించామన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రకటించిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం వస్తున్న బీజేపీ నేతలను పట్టభద్రులు గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ విద్యాసంస్థలు, కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్, ట్రైబల్ వర్సిటీ, ఇలా ఎన్నో అడగడంతోపాటు లేఖలు రాసినా.. చివరికి కేంద్రం చేసింది గుండు సున్నా అని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టండి.. రాష్ట్రంలో 15 వేల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామన్నారు. విదేశాల్లో చదువు కోసం పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. నగరంలో 350 బస్తీ దవాఖానాలు, 25 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా 650 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిది ప్రశ్నించే గొంతు కాదని.. పరిష్కరించే గొంతు అవుతుందన్నారు. ఆమెకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి.. పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు. గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ వాణీదేవికి మద్దతు ప్రకటించింది. -
దక్షిణాది రాష్ట్రాలంటే చిన్నచూపు, హిందీ మాట్లాడని వారిపై..
సాక్షి, విశాఖ : కడప స్టీల్ ప్లాంట్..విభజన చట్టం హామీలోనే ఉందని, ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలంటే చిన్నచూపని, హిందీ మాట్లాడేవాళ్ళు మాత్రమే భారతీయులు అనే వివక్షత ఉందని ఆరోపిచంచారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీలకతీతంగా అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని విఙ్ఞప్తి చేశారు. మార్చి 5నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తాలని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పోస్కో కంపెనీని అడుగు పెట్టనివ్వమని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు వివరించారు. సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని తెలుగు వారందరూ ముందుకు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమని విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ అన్నారు. ఈ విషయంపై ఢిల్లీలో పోరాటం చేస్తామని, అక్కడ కూడా విఫలమైతే తక్షణమే పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పిసిసి ప్రెసిడెంట్ శైలజానాథ్ వ్యాఖ్యలకు ఎంపీ ఘాటుగా బదులిచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్‌కు 100 మంది ఎంపీలు ఉండి ఒక్కమాట మాట్లాడలేదని, ఈరోజు రాహుల్‌కు ఓటేయమని అడుగుతున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ రుణాలను ఈక్విటిగా మార్చాలిని డిమాండ్ చేశారు. -
నా రూటే సెపరేటూ.. చంద్రన్న వింత వాదన
సాక్షి, విశాఖపట్నం : వరుస ఎన్నికల్లో రాజకీయంగా చావుదెబ్బ తింటున్న టీడీపీ అధినేత, ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు రాజకీయ అస్థిత్వం కోసం పోరాడుతున్నారు. సమయం, సందర్భం, సమస్య లేకుండానే రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లె ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలను కూడా రాష్ట్రంపై నెడుతూ.. రాజకీయ పబ్బం గడుపుతున్నారు. ఆయన తీరుతో అసంహించుకుంటున్న ప్రజలు.. ఎన్నికల్లో బుద్ధిచెబుతున్నప్పటకీ వ్యవహార శైలిని మాత్రం ఏమాత్రం మార్చుకోవడంలేదు. నా రూటే సెపరేటూ అంటూ నానాటికీ దిగజారిపోతున్నారు. తాజాగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై ఆయన వ్యవహరిస్తున్న తీరుతో సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. విశాఖలో అమరావతి ప్రసంగం.. మంగళవారం విశాఖ స్టీల్ ప్లాంట్ రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని పన్నెత్తి మాట కూడా అనకుండా.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేయొద్దంటూ కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పేరు కూడా ప్రస్తావించలేదు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలంటూ వింత వాదన చేశారు. అంతేకాకుండా ప్లాంట్‌పై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా విమర్శలకు దిగడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా ఎక్కడున్నామనే సోయిమరిచిన చంద్రబాబు.. విశాఖ దీక్ష శిబిరంలో అమరావతి భూముల గురించి ప్రస్తావించి విమర్శల పాలయ్యారు. కార్మిక సంఘాల నేతలను తమ్ముళ్లు అంటూ సంభోదించారు. చంద్రబాబు తీరుతో అక్కడి కార్మిక నేతల విసుగుచెందారు. కాగా విశాఖ ఉక్కు కర్మాగాన్ని ప్రైవేటుపరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన దీక్షలు చేపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖరాశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 20న పాదయాత్ర చేపట్టనున్నారు. జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వరకు 22 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగనుంది. -
స్టీల్‌ప్లాంట్ సెంటిమెంట్ వివరించాం: సోము
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. సుమారు అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. అనంతరం భేటీ వివరాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివరించారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రజల సెంటిమెంటును కేంద్రమంత్రికి వివరించామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యామ్నాయాలు చూడాలని కోరామన్నారు. బ్యాంకుల విలీనం తరహాలోనే, వేరే ప్రభుత్వ రంగ సంస్థలలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందరి ప్రయోజనాలు కాపాడాలని కోరినట్లు సోము తెలిపారు. అయితే ఏపీ నేతలతో భేటీ అనంతరం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకారణ చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎన్నారైల సమరభేరి
వాషింగ్టన్ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అమెరికాలోని ఎన్నారైలు మేధోమధనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లిన విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని తెలిపారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ప్రముఖ ఎన్నారై కేవీ రెడ్డి ఆధ్వర్యంలో మేధోమధనం కార్యక్రమాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా కేవీ రెడ్డి మాట్లాడుతూ..'మన ఉక్కు - మన హక్కు' అని అన్నారు. ఆనాడు సుమారు 32 మంది ఆంధ్రుల బలిదానంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారని, ప్రత్యక్షంగా 24వేల మంది, పరోక్షంగా లక్షమందికి పైగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగకుండా ఉండే మార్గాలను, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎలా లాభాల్లోకి తీసుకుని రావచ్చనే విషయంపై మీద కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీట్ ప్లాంట్ అంశంపై వేగంగా స్పందించి కేంద్రానికి లేఖ రాశారని, ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు కృతఙతలు తెలిపారు. కార్యచరణ తీర్మానాలు : ♦ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు బదులుగా అవసరమైన గనులను కేటాయించాలి ♦ బాండ్స్ రూపంలో నిధులు సమీకరించడం ద్వారా ప్రజల భాగస్వామ్యతో ప్రజల ఆస్తిగా మార్చవచ్చు ♦ లోన్స్ ను ఈక్విటీలుగా మార్చడం ద్వారా ఇంట్రస్ట్ రేట్లను గణనీయంగా తగించవచ్చు. ♦ భవిషత్తులో ౩౦౦ మిలియన్ టన్నుల స్టీల్ అవసరాలు ఉంటాయన్నది అంచనా. అందువల్ల , ఉత్పత్తి పెంచడం ద్వారా ప్లాంట్నును లాభాల్లోకి తీసుకురావచ్చు. -
స్టీల్ ప్లాంట్ వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్లాంట్ ఉద్యోగులు, ప్రజాసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు బుధవారం టీడీఐ జంక్షన్ వద్ద భారీగా నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ, మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్‌రాజు, ఐఎన్టీయూసీ నేత మంత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. అదే విధంగా లెఫ్ట్ పార్టీ నేతలు నరసింగరావు, సత్యనారాయణ, ట్రేడ్ యూనియన్ నేతలు హాజరయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి తన చేపట్టబోయే నిరసన కార్యక్రమాల కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 12న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఐఎస్టీయూసీ పేర్కొంది. కూర్మన్నపాలెంలో వేలాది మంది కార్మికులతో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపింది. 18న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, భార్యా పిల్లలతో నిరసన కార్యక్రమం చేపడతామని ప్రకటించింది. కేంద్రం ఆధ్వర్యంలోనే స్టీల్‌ప్లాంట్ కొనసాగాలని, వేలాది మంది భూముల త్యాగంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పడిందని ఐఎన్టీయూసీ డిమాండ్ చేసింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు: నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాజకీయాలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని మొదటి నుంచి చెప్తున్నామని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకూడదన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాజకీయాలకతీతంగా ఉద్యమించి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలని స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రైవేట్‌పరం చేయాలనే ఉద్దేశంతో సొంత గనులు ఇవ్వలేదని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానికి లేఖ రాసి, సూచనలు చేశారని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం కార్మిక సంఘాలతో కలిసి పోరాడతామని, అన్ని కార్మిక సంఘాలను ఢిల్లీ తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరతామని ఆయన తెలిపారు. చదవండి: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై పోరాటం -
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం
విశాఖపట్నం: మరోసారి విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సెమ్మెస్ 2 విభాగంలో నిర్వహణ లోపంతో వేడి ఉక్కుద్రవం నేలపాలైంది. దీంతో దానికి సమీపంలోని రెండు క్రేన్లు పూర్తిగా కాలిపోయాయి. పలువురు కార్మికులు స్వల్ఫంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపుచేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. లోపాన్ని సరిదిద్దనున్నారు. -
ఉక్కు సీఎండీకి ఐకాన్ అవార్డు
ఉక్కునగరం, న్యూస్‌లైన్: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్‌కు ప్రతిష్టాత్మకమైన ఐకాన్-2013 అవార్డు లభించింది. భువనేశ్వర్‌లో ఆదివారం జరిగిన 55వ వ్యయ సదస్సులో ఒడిశా రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి సూర్యనారాయణపాత్రో ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం లో టీమ్ బిల్డింగ్ అనే అంశంపై ఏర్పాటైన 2 రోజుల సదస్సులో మధుసూదన్ ముఖ్య వక్తగా ప్రసంగించారు. ప్రస్తుత మార్కెట్లో గతంలో ఎన్నడూలేని విధంగా ధరల పోటీ పరిస్థితి నెలకొందన్నారు. ఈ పోటీలను ఎదుర్కోవడం వ్యయ నియంత్రణతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల్లో సమష్టి కృషిని పెంచడం ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం
విశాఖపట్నం: జిల్లాలోని స్టీల్‌ప్లాంట్‌లో గురువారం ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్-2లో 40టన్నుల ఉక్కుద్రవం నేలపాలైనట్టు సమాచారం. ఉక్కును తయారుచేసేందుకు ఉంచిన ఉక్కుద్రవం ప్రమాదవశాత్తూ నేలపాలవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో 2కోట్ల రూపాయల పైనే నష్టం ఉంటుందని స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం అంచనా వేసింది.