సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నామమాత్రపు ధరకు విక్రయించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఉక్కు కర్మాగారం ఆదాయ, వ్యయాలపై విచారణ జరిపేందుకు తెలుగు తెలిసిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోర్టును కోరారు.
అంతేకాక విశాఖ స్టీల్ ప్లాంట్ నడిచేందుకు రూ. 8 వేల కోట్లు అయినా, రూ.42 వేల కోట్లైనా తన గ్లోబల్ పీస్ సంస్థ ద్వారా విరాళాల రూపంలో సేకరిస్తానని, ఇందుకోసం అనుమతినిచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా కోరారు. గురువారం ఉదయం ఆయన స్వయంగా హైకోర్టుకు వచ్చి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ముందు తన పిల్ గురించి ప్రస్తావించారు. తన వ్యాజ్యంపై లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని ధర్మాసం పేర్కొంది.
ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్‌ప్లాంట్ కొంటా: KA పాల్
Comments
Please login to add a commentAdd a comment