వాషింగ్టన్ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అమెరికాలోని ఎన్నారైలు మేధోమధనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లిన విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని తెలిపారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ప్రముఖ ఎన్నారై కేవీ రెడ్డి ఆధ్వర్యంలో మేధోమధనం కార్యక్రమాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా కేవీ రెడ్డి మాట్లాడుతూ..'మన ఉక్కు - మన హక్కు' అని అన్నారు.
ఆనాడు సుమారు 32 మంది ఆంధ్రుల బలిదానంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారని, ప్రత్యక్షంగా 24వేల మంది, పరోక్షంగా లక్షమందికి పైగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగకుండా ఉండే మార్గాలను, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎలా లాభాల్లోకి తీసుకుని రావచ్చనే విషయంపై మీద కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీట్ ప్లాంట్ అంశంపై వేగంగా స్పందించి కేంద్రానికి లేఖ రాశారని, ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు కృతఙతలు తెలిపారు.
కార్యచరణ తీర్మానాలు :
♦ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు బదులుగా అవసరమైన గనులను కేటాయించాలి
♦ బాండ్స్ రూపంలో నిధులు సమీకరించడం ద్వారా ప్రజల భాగస్వామ్యతో ప్రజల ఆస్తిగా మార్చవచ్చు
♦ లోన్స్ ను ఈక్విటీలుగా మార్చడం ద్వారా ఇంట్రస్ట్ రేట్లను గణనీయంగా తగించవచ్చు.
♦ భవిషత్తులో ౩౦౦ మిలియన్ టన్నుల స్టీల్ అవసరాలు ఉంటాయన్నది అంచనా. అందువల్ల , ఉత్పత్తి పెంచడం ద్వారా ప్లాంట్‌నును లాభాల్లోకి తీసుకురావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment