సాక్షి, విశాఖ : కడప స్టీల్ ప్లాంట్..విభజన చట్టం హామీలోనే ఉందని, ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలంటే చిన్నచూపని, హిందీ మాట్లాడేవాళ్ళు మాత్రమే భారతీయులు అనే వివక్షత ఉందని ఆరోపిచంచారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీలకతీతంగా అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని విఙ్ఞప్తి చేశారు. మార్చి 5నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తాలని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పోస్కో కంపెనీని అడుగు పెట్టనివ్వమని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు వివరించారు. సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని తెలుగు వారందరూ ముందుకు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమని విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ అన్నారు. ఈ విషయంపై ఢిల్లీలో పోరాటం చేస్తామని, అక్కడ కూడా విఫలమైతే తక్షణమే పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పిసిసి ప్రెసిడెంట్ శైలజానాథ్ వ్యాఖ్యలకు ఎంపీ ఘాటుగా బదులిచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్‌కు 100 మంది ఎంపీలు ఉండి ఒక్కమాట మాట్లాడలేదని, ఈరోజు రాహుల్‌కు ఓటేయమని అడుగుతున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ రుణాలను ఈక్విటిగా మార్చాలిని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment