సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ అజెండాను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భుజానికెత్తుకున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతిని«ధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నా«థ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విశాఖ ఉక్కు కార్మిక నాయకులంతా ఆయన వ్యాఖ్యలను ఖండించాలని సూచించారు. ఆదివారం మద్దిలపాలెం పార్టీ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని చెబుతూ ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ ఎంత తెలివిగా మోసం చేస్తున్నారో వేదికపైనున్న కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నామన్నారు. అమర్‌నాథ్ ఇంకా ఏమన్నారంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ముందుండి పోరాటం చేయలేను: పవన్ కల్యాణ్
ఎవరు బాధ్యులు?
► విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అలాంటి ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ ప్రభుత్వంపై పల్లెత్తు మాట కూడా అనలేదేమి? ఈ విషయం తెలిసీ కూడా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చావు?
► 260 రోజులుగా ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ పేరుతో ఉక్కు కార్మిక సంఘాలు, విశాఖ ప్రజలు పోరాటం చేస్తుంటే..‘ఊళ్లో దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగాయన్నట్లు’ ఇప్పుడు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నాడు.
► ‘దేశాన్ని దృష్టిలో పెట్టుకునే పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నారు.. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టదు.. వ్యాపారం చేయదు’ అని అప్పుడు ఎందుకు చెప్పావు?
► ప్లాంట్ విషయమై వైఎస్సార్‌సీపీ ఎంపీలు చట్టసభల్లో మాట్లాడలేదని అనడం ఆశ్చర్యంగా ఉంది. పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పలుసార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. మా ఎంపీలంతా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడం నీకు తెలీదా?
► గెలిపిస్తే పోరాటం చేసేవాడిని.. అన్నావు. మీరు వచ్చినా రాకపోయినా స్టీల్ ప్లాంట్ కోసం ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీలో కేంద్రంపై పోరాటం చెయ్యి.
Comments
Please login to add a commentAdd a comment