visakha steelplant
-
స్టీల్‌ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతం
సీతంపేట (విశాఖ ఉత్తరం): విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సి.హెచ్.నరసింగరావు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఫిబ్రవరి 12 నాటికి 365 రోజులు పూర్తవుతున్న సందర్భంగా వార్షిక నిరసన తెలపడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 12న 365 మందితో 365 ఐక్య జెండాలతో స్టీల్ ప్లాంట్ వద్ద నిరాహార దీక్షతో నిరసన చేపడతామన్నారు. 13న విశాఖ నగర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. సొంత గనులు కేటాయించాలన్న డిమాండ్‌తో 23న విశాఖ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ రోజు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని అన్ని రాష్ట్ర రాజకీయపార్టీలను, ప్రజా సంఘాలను కోరుతున్నట్టు తెలిపారు. విశాఖ ప్రజలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు, అన్ని వర్గాలు కోటి సంతకాల ఉద్యమంలో పాలుపంచుకునేలా చేసి.. భవిష్యత్‌లో జరిగే పోరాటంలో ప్రత్యక్షంగా పా ల్గొనేలా చేస్తామన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా కేంద్రానికి నిరసన తెలియ జేస్తామన్నారు. ఈ సమావేశంలో పోరాట కమిటీ చైర్మన్, ఇంటక్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, వైఎస్సార్టీయూసీ ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.రామకృష్ణ, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి, పోరాటకమిటీ సభ్యులు జి.గణపతిరెడ్డి పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్ ఒక స్థిరత్వంలేని వ్యక్తి: ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
-
పవన్.. ప్రశ్నించాల్సింది ఎవరిని?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ అజెండాను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భుజానికెత్తుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతిని«ధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నా«థ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విశాఖ ఉక్కు కార్మిక నాయకులంతా ఆయన వ్యాఖ్యలను ఖండించాలని సూచించారు. ఆదివారం మద్దిలపాలెం పార్టీ నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని చెబుతూ ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ ఎంత తెలివిగా మోసం చేస్తున్నారో వేదికపైనున్న కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నామన్నారు. అమర్నాథ్ ఇంకా ఏమన్నారంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ముందుండి పోరాటం చేయలేను: పవన్ కల్యాణ్ ఎవరు బాధ్యులు? ► విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అలాంటి ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ ప్రభుత్వంపై పల్లెత్తు మాట కూడా అనలేదేమి? ఈ విషయం తెలిసీ కూడా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చావు? ► 260 రోజులుగా ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ పేరుతో ఉక్కు కార్మిక సంఘాలు, విశాఖ ప్రజలు పోరాటం చేస్తుంటే..‘ఊళ్లో దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగాయన్నట్లు’ ఇప్పుడు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నాడు. ► ‘దేశాన్ని దృష్టిలో పెట్టుకునే పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నారు.. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టదు.. వ్యాపారం చేయదు’ అని అప్పుడు ఎందుకు చెప్పావు? ► ప్లాంట్ విషయమై వైఎస్సార్సీపీ ఎంపీలు చట్టసభల్లో మాట్లాడలేదని అనడం ఆశ్చర్యంగా ఉంది. పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పలుసార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తారు. మా ఎంపీలంతా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడం నీకు తెలీదా? ► గెలిపిస్తే పోరాటం చేసేవాడిని.. అన్నావు. మీరు వచ్చినా రాకపోయినా స్టీల్ ప్లాంట్ కోసం ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీలో కేంద్రంపై పోరాటం చెయ్యి. -
పవన్..టికెట్లపై కాదు.. ప్రజా సమస్యలపై స్పందించండి..
రాప్తాడు: సినిమా టికెట్లపై కాకుండా ప్రజా సమస్యలపై పవన్‌కల్యాణ్ స్పందిస్తే బాగుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణకు 230 రోజులుగా కార్మికులు పోరాటాలు చేస్తున్నా.. అక్కడికి పవన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కాగా, ఈ ఏడాది వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయిందని, నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం వద్ద ఎండిన వేరుశనగ పంట పొలాలను పరిశీలించారు. సీఎం జగన్ తక్షణమే వ్యవసాయ శాఖ మంత్రిని, వ్యవసాయ, రెవెన్యూ అధికారులను పంట పొలాలకు పంపాలని సూచించారు. రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం: విజయసాయిరెడ్డి
-
జనసేన నేతలకు చేదు అనుభవం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నేతలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ వైఖరి తెలపాలని కార్మికుల డిమాండ్ చేశారు. దీక్షా శిబిరానికి పవన్ కల్యాణ్ రావాలంటూ కార్మికుల డిమాండ్ చేయగా, పవన్‌ను గాజువాకలో ఓడించారు.. ఆయనెందుకొస్తారంటూ జనసేన నేతలు ఎదురుదాడికి దిగారు. జనసేన, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నాయకులు వెళ్లిపోవాలంటూ కార్మికుల నినాదాలు చేశారు. -
స్టీల్‌ప్లాంట్ వేతన చర్చల్లో ప్రతిష్టంభన
ఉక్కు నగరం (విశాఖ): స్టీల్‌ప్లాంట్ కార్మికుల వేతన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆరు రోజులుగా జరుగుతున్న చర్చల్లో కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యం మొండి వైఖరి అవలంబించడంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. చర్చల్లో కార్మిక సంఘాల్లో విభేదాలు వచ్చాయని, వాటిని యాజమాన్యం ఉపయోగించుకుని డిమాండ్లు నెరవేర్చడంలో అలసత్వం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016 డిసెంబర్ 31తో ఉక్కు కార్మికులకు గత వేతన ఒప్పందం గడువు ముగిసింది. 2017 జనవరి 1 నుంచి జరగాల్సిన వేతన సవరణ నాలుగున్నరేళ్లు కావస్తున్నా జరగకపోవడంతో కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. కార్మిక సంఘాలు తొలుత ఈ ఏడాది మే 6న సమ్మె చేయాలని సంకల్పించగా సెయిల్ చైర్మన్ వేతన సవరణకు హామీ ఇవ్వడంతో దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత జరిగిన సమావేశాల్లో కూడా యాజమాన్యం కార్మిక సంఘాల డిమాండ్లకు పొంతన లేని ప్రతిపాదనలు చేసింది. దీంతో ఆగ్రహించిన కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మె చేస్తామని యాజమాన్యానికి నోటీసిచ్చాయి. సమ్మె నివారణా చర్యల్లో భాగంగా నేషనల్ జాయింట్ కమిటీ ఫర్ స్టీల్ (ఎన్‌జేసీఎస్) ఆధ్వర్యంలో ఆరు రోజులుగా వేతన చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కార్మిక సంఘాలు 15% ఎంజీబీ డిమాండ్ చేయగా యాజమాన్యం 13% ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ప్రధానంగా పెర్క్స్ అంశంపై ఇరువర్గాల మధ్య పీటముడి బిగిసింది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వలే రివైజ్డ్ బేసిక్‌పై 35% పెర్క్స్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేయగా యాజమాన్యం 15% ఇస్తామని ప్రతిపాదించింది. 15% అంగీకరిస్తే జూనియర్ కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని కార్మిక సంఘాలు చెప్పినప్పటికీ యాజమాన్యం వైఖరిలో మార్పు రాలేదు. -
విశాఖ స్టీల్ సీఎండీగా అతుల్ భట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్ నియమితులయ్యారు. గతంలో ఆయన టాటా స్టీల్‌తో పాటు పలు స్టీల్ప్లాంట్లలో పనిచేశారు. ఈ నియామకంతో ఆయన విశాఖకు సీఎండీగా జులై 1 నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి -
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు
-
అందుకే ప్రజలు పాదయాత్రను విజయవంతం చేశారు
సాక్షి, విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్ర విజయవంతం అయింది. శనివారం ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ మధ్యాహ్నం తన వెంట నడిచిన వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు, సామాన్య ప్రజలతో గాజువాక చేరుకున్నారు. గాజువాక ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున పూలతో స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటు నినాదాలు చేశారు. మరికొద్ది సేపట్లో స్టీల్‌ప్లాంట్ ఎదుట వైఎస్సార్ సీపీ నేతల బహిరంగ సభ జరగనుంది. (‘ఉక్కు’ పోరాటానికి నాంది పలికాం: విజయసాయిరెడ్డి) ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ద్రోహి అని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ప్రజలు ఎప్పటికీ చంద్రబాబును క్షమించరన్నారు. ప్రజల ఆకాంక్షను వైఎస్సార్ సీపీ నెరవేరుస్తుందనే నమ్మకంతోనే.. పాదయాత్రను ప్రజలు విజయవంతం చేశారని అన్నారు. -
పాదయాత్ర చేప్పట్టిన ఎంపి విజయసాయిరెడ్డి
-
‘ఉక్కు’ పోరాటానికి నాంది పలికాం: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. శనివారం.. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించి విజయసాయిరెడ్డి మొదటి అడుగు వేశారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అప్పలరాజు, ఎంపీలు సుభాష్‌చంద్రబోస్, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, గొల్ల బాబురావు, గుడివాడ అమర్నాథ్, అదీప్‌రాజు, విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ మోహన్, కన్వీనర్ కేకే రాజు, కుంబా రవిబాబు, విజయప్రసాద్, పంచకర్ల రమేష్, పసుపులేటి బాలరాజు, పార్టీ శ్రేణులు, విశాఖ నగర వాసులు, స్టీల్‌ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆయన వెంట కదిలారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఉదయం జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఆశీల్ మెట్ట జంక్షన్, సంగం శరత్, కాళీ టెంపుల్, తాటిచెట్ల పాలెం, ఊర్వశి జంక్షన్, 104 ఏరియా, మర్రిపాలెం, ఎన్ఏడీ జంక్షన్, ఎయిర్ పోర్ట్, షీలానగర్, బీహెచ్‌పీవీ, పాత గాజువాక, శ్రీనగర్ మీదుగా కూర్మన్నపాలెం జంక్షన్ స్టీల్ ప్లాంట్ ప్రధాన ఆర్చ్ వరకు ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 4.30 గంటలకు స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది. జనసంద్రంగా కంచరపాలెం.. విశాఖలో పురాతన ప్రాంతంగా చెప్పుకునే కంచరపాలెం జనసంద్రంగా మారింది. కిక్కిరిసిన జనం మధ్య విజయసాయిరెడ్డి నడక ముందుకు సాగింది పారిశుద్ధ్య కార్మికులు వ్యాపారులు పలువురు మేధావులు ఈ సంఘీభావ యాత్రలో తమ మద్దతు పలుకుతూ విజయసాయిరెడ్డి కి స్వాగతం పలికారు. తాటిచెట్లపాలెం కంచరపాలం ఊర్వశి జంక్షన్ పరిసరప్రాంతాలు పాదయాత్రతో జనసంద్రంగా మారాయి.మంత్రుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు కూడా ఈ సంఘీభావ యాత్ర లో పాల్గొన్నారు. కవులు కళాకారులు మేధావులు. పలువురు జర్నలిస్టులు దీనికి మద్దతుగా నిలిచారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకే.. యావత్ తెలుగు జాతికి గర్వకారణమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించేందుకు పాదయాత్ర చేపడుతున్నానని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉక్కు ఉద్యమ పరిరక్షణ పాదయాత్ర సాగనుందన్నారు. ‘‘స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ.. ప్రైవేటీకరణ జరగకుండా పరిశ్రమను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడంతో పాటు రుణాలను ఈక్విటీ రూపంలో మార్చాలని సీఎం కేంద్రానికి ప్రతిపాదించారని’’ ఆయన పేర్కొన్నారు. ఒడిశాలో పుష్కలంగా ఉన్న ఇనుప ఖనిజానికి సంబంధించిన మైన్స్‌తో లీజు ఒప్పందాల్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కార్మికులకు అండగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉందనే భరోసాను విశాఖ ప్రజల్లో కల్పించేందుకుకు ఈ పోరాటయాత్ర చేస్తున్నామన్నారు. ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన వివిధ వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: వారిని పిలిచినా రాలేదు: విజయసాయిరెడ్డి విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్ -
అది బాబు ముసలి కన్నీరు: విజయ సాయిరెడ్డి
సాక్షి, అమరావతి: బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయంగా, ఆర్థికంగా బీసీ కులాలకు సీఎం జగన్ ప్రాధాన్యం కల్పించారని, జీవీఎంసీలో యాదవ సామాజిక వర్గానికి 16 స్థానాలు కేటాయించారని తెలిపారు. యాదవులను ఉన్నత స్థానంలో నిలపాలన్నది సీఎం జగన్ ఉద్దేశమన్నారు. యాదవ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామిన ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా వైజాగ్ స్టీల్ ప్టాంట్‌పై ఆయన ట్వీట్ బుధవారం ట్వీట్ చేశారు. బీజేపీతో కలిసి ఉన్న రోజుల్లో ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరణ చేయాలని టీడీపీ అథ్యక్షుడు చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తుండేవారని కమలం పెద్దలు ఇప్పటికి చెబుతారన్నారు. పెద్ద నోట్ల రద్దు సలహా కూడా తనదేనని మొదట చంద్రబాబు కోతలు కోసి తర్వాత యూటర్న్ తీసుకున్నట్టే ఇప్పుడు వైజాగ్ స్టీల్‌పై ముసలీ కన్నీరు కారుస్తున్నారని విజయ సాయిరెడ్డి విమర్శించారు. -
తమ్ముడి పెళ్లి చేసిన మూడురోజులకే..
విజయనగరం, ఎచ్చెర్ల క్యాంపస్: తమ్ముడికి పెళ్లి చేసి మూడు రోజులు గడవకముందే అన్నయ్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం అర్ధరాత్రి విశాఖలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయతీ రుప్పపేటకు చెందిన సాధు సతీష్ (30 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం రమ్యతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు దేవాన్షు ఉన్నాడు. తండ్రి రాములు, తల్లి రమణమ్మ, అక్క రాధ, తమ్ముడు వెంకటేష్ రుప్పపేటలో ఉంటున్నారు. వెంకటేష్‌కు ఈ నెల 15న వివాహం జరిగింది. సతీష్ వారం రోజులు సెలవు పెట్టి దగ్గరుండి వివాహం జరిపించాడు. తిరిగి ఈ నెల 16న కుటుంబంతో కలిసి విశాఖపట్నం వెళ్లాడు. మంగళవారం అర్థరాత్రి సమయంలో డ్యూటీలోనే ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎటువంటి తగాదాలు లేవని, ఎందుకు ఆత్మహత్య చేసుకోవా ల్సి వచ్చిందోనని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. షాక్‌లో భార్య..:సతీష్ మంగళవారం రాత్రి 9 గంటలకు భార్యతో ఫోన్లో మాట్లాడాడు. మళ్లీ రాత్రి ఒంటిగంటకు భార్యకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో నిద్రపోవడంతో ఫోన్ తీయలేదు. ఉదయం మిస్డ్‌కాల్ ఉండటంతో ఫోన్ చేయగా భర్త ఫోన్ లిఫ్టు చేయలేదు. దీంతో ఆందోళనకు గురైంది. ఇంతలో పరిశ్రమ సిబ్బంది సతీష్ మృతి విషయం చెప్పడంతో షాక్‌కు గురైంది. సతీష్ మృతితో రుప్పపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. -
సాంకేతిక సామర్థ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ దిట్ట
విశాఖపట్నం: సాంకేతిక సామర్థ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ దిట్టని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా ఆయన శనివారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్ ఇనుప ఖనిజం కొరతను ఎదుర్కొంటున్నందున ఓఎండీసీ నుంచి తక్కువ ధరలకు సరఫరా చేయడానికి కృషి చేస్తామన్నారు. దీనివల్ల స్టీల్‌ప్లాంట్‌కు లాభం కలుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఖనిజ సంపన్న రాష్ట్రాలని చెప్పారు. జాయింట్ వెంచర్స్ కోసం, పోటీని ఎదుర్కోవడానికి, సంపద సృష్టికి స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ముందుకు వెళ్లాలని సూచించారు. ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలతో ఎక్కువ ఉపాధి అవకాశాలు, ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం లభిస్తాయన్నారు. అంతకుముందు ఆయన స్టీల్‌ప్లాంట్‌లోని మోడల్ రూమ్, అవార్డు గ్యాలరీలను సందర్శించారు. వివిధ విభాగాలను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి, విశాఖపట్నం ఎంపీలు డాక్టర్ బి.సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే రథ్, డైరెక్టర్లు కేసీ దాస్, వీవీ వేణుగోపాలరావు, కేకే ఘోష్, ఏకే సక్సేనా, తదితరులు పాల్గొన్నారు. -
'విశాఖ ఉక్కును కాపాడుకుందాం'
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సంరక్షిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె విశాఖ స్టీల్‌ప్లాంట్ గేటు వద్ద ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ఏ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయబోమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను విస్తరణ చేస్తామని, విశాఖపట్నానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏమి చేయాలనుకున్నారో అన్నీ చేస్తామన్నారు. ఉక్కు గనుల కొరతను తీర్చటంతో పాటు ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్రంతో పోరాడైనా స్టీల్‌ప్లాంట్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామన్నారు.