సాక్షి, విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్ర విజయవంతం అయింది. శనివారం ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ మధ్యాహ్నం తన వెంట నడిచిన వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు, సామాన్య ప్రజలతో గాజువాక చేరుకున్నారు. గాజువాక ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున పూలతో స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటు నినాదాలు చేశారు. మరికొద్ది సేపట్లో స్టీల్‌ప్లాంట్ ఎదుట వైఎస్సార్ సీపీ నేతల బహిరంగ సభ జరగనుంది. (‘ఉక్కు’ పోరాటానికి నాంది పలికాం: విజయసాయిరెడ్డి)
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ద్రోహి అని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ప్రజలు ఎప్పటికీ చంద్రబాబును క్షమించరన్నారు. ప్రజల ఆకాంక్షను వైఎస్సార్ సీపీ నెరవేరుస్తుందనే నమ్మకంతోనే.. పాదయాత్రను ప్రజలు విజయవంతం చేశారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment