సాక్షి, అమరావతి: బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయంగా, ఆర్థికంగా బీసీ కులాలకు సీఎం జగన్ ప్రాధాన్యం కల్పించారని, జీవీఎంసీలో యాదవ సామాజిక వర్గానికి 16 స్థానాలు కేటాయించారని తెలిపారు. యాదవులను ఉన్నత స్థానంలో నిలపాలన్నది సీఎం జగన్ ఉద్దేశమన్నారు.
యాదవ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామిన ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా వైజాగ్ స్టీల్ ప్టాంట్‌పై ఆయన ట్వీట్ బుధవారం ట్వీట్ చేశారు. బీజేపీతో కలిసి ఉన్న రోజుల్లో ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరణ చేయాలని టీడీపీ అథ్యక్షుడు చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తుండేవారని కమలం పెద్దలు ఇప్పటికి చెబుతారన్నారు. పెద్ద నోట్ల రద్దు సలహా కూడా తనదేనని మొదట చంద్రబాబు కోతలు కోసి తర్వాత యూటర్న్ తీసుకున్నట్టే ఇప్పుడు వైజాగ్ స్టీల్‌పై ముసలీ కన్నీరు కారుస్తున్నారని విజయ సాయిరెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment