సాక్షి, అమరావతి: విశాఖ గర్జనను డైవర్ట్ చేసేందుకు పవన్ పర్యటన పెట్టుకున్నారని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. నిన్న మంత్రులపై దాడి చేసింది జనసేన కార్యకర్తలే కదా?.. పవన్ కల్యాణ్ సూటిగా సమాధానం చెప్పాలన్నారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ టెర్రరిస్ట్. ఉత్తరాంధ్రపై కక్ష కట్టారంటూ మంత్రి మండిపడ్డారు. అభిమానులను 3 పెళ్లిళ్లు చేసుకోమని పవన్ ప్రేరేపిస్తున్నారు. జనసేన కార్యకర్తల దాడులను పవన్ సమర్థిస్తారా?. పవన్ తీరునే జనసేన కార్యకర్తలు అనుసరిస్తున్నారు. దాడులను ప్రభుత్వం సహించదు. ఆదివారం షూటింగ్‌లకు సెలవు కాబట్టే పవన్ విశాఖకు వచ్చారని మంత్రి అమర్‌నాథ్ దుయ్యబట్టారు.
చదవండి: ‘జనసేన అసలు రాజకీయ పార్టీనేనా? ఆ లక్షణం ఒక్కటీ లేదు’
‘‘మా విధానం మూడు రాజధానులైతే.. జనసేన విధానం మూడు పెళ్లిళ్లు. జనసేన నేతలకు సంబంధించిన కుటుంబ సభ్యులు పవన్ కామెంట్లని గమనించి జాగ్రత్త పడాలని కోరుతున్నా. తమ విధానం మూడు పెళ్లిళ్లు అని చెప్పడానికే పవన్ విశాఖ వచ్చాడా..? పెళ్లి అనేదే ఓ అడ్జస్ట్‌మెంట్.. పెళ్లాంతోనే అడ్జస్ట్ కాలేని పవన్.. ప్రజలతో ఎలా అడ్జస్ట్ అవుతారు?. పవన్ 1.80 లక్షల పుస్తకాలు చదివింది దీనికోసమేనా..?’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు.
‘‘పవన్ ప్యాకేజ్ స్టార్ అని ప్రజలు బలంగా నమ్మేలా వ్యవహరిస్తున్నారు. సీఎంను గఢాఫీతో పోలుస్తూ ఏదేదో కామెంట్లు చేశారు. జనవాణి కార్యక్రమం మొదలు పెట్టిందే ఈ మధ్య కాలంలో.. అలాంటిది విశాఖలో జనవాణి కార్యక్రమం 3 నెలల క్రితమే ఫిక్స్ అయిందని పవన్ ఎలా చెబుతారు.?. విశాఖ వెళ్లేందుకు చంద్రబాబుకు పవన్ మూడు రోజుల కాల్షీట్లు ఇచ్చారు’’ అని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.
‘‘జనసేన కార్యకర్తలు సైకోలు.. సంఘ విద్రోహ శక్తులు. పవన్‌ను చూడడానికి వచ్చిన వాళ్లంతా ఓట్లేస్తే దేశాన్ని సినిమా వాళ్లే పాలించేవాళ్లు. కొడాలి నాని వస్తోంటే జనసేన కార్యకర్తలు బ్లేడులు.. చిన్న చిన్న కత్తులతో ఉన్నారట. ఎవరిని చంపుదామని అనుకుంటున్నారు..?. షూటింగుల ద్వారా వచ్చే డబ్బుల కన్నా.. చంద్రబాబు ఇచ్చే డబ్బు ఎక్కువ కాబట్టి విశాఖలోనే ఉంటారా..?. ఫ్లాప్, హిట్‌తో సంబంధం లేకుండా చంద్రబాబు డబ్బులిస్తారు’’ అంటూ మంత్రి అమర్‌నాథ్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment