సంసారం బీజేపీతో.. సహజీవనం టీడీపీతో.. పవన్‌కు మంత్రి అమర్‌నాథ్‌ చురకలు | Minister Gudivada Amarnath Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

సంసారం బీజేపీతో.. సహజీవనం టీడీపీతో.. పవన్‌కు మంత్రి అమర్‌నాథ్‌ చురకలు

Published Fri, Aug 11 2023 12:54 PM | Last Updated on Fri, Aug 11 2023 1:54 PM

Minister Gudivada Amarnath Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పవన్‌కు ఓ విధానం, ఓ సిద్ధాంతం, స్థిరత్వం లేదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంసారం బీజేపీతో.. సహజీవనం టీడీపీతో పవన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే పవన్‌ ఆరేడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు ఏం చెబితే దానికి పవన్‌ వత్తాసు పలుకుతాడు. ఆయనకు పొలిటికల్‌ ప్రొడ్యూసర్‌ చంద్రబాబు’’ అంటూ దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్‌ చదువుతున్నాడు. పవన్‌.. ఎప్పుడైనా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో చెప్పారా?. చంద్రబాబును సీఎం చేయాలనే పవన్‌ ఉద్దేశ్యం. పవన్‌ ఏకైక టార్గెట్‌ సీఎం జగన్‌ను విమర్శించాలనే. ఆయనను విమర్శిస్తే నాయకుడు అయిపోతాడని పవన్‌ అనుకుంటున్నాడు. పవన్‌ కల్యాణ్‌ను చూస్తే జాలేస్తుంది’’ అని మంత్రి పేర్కొన్నారు.

‘‘ఆంధ్రా యూనివర్శిటీపై పవన్‌ అవగాహన లేకుండా మాట్లాడారు. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో ఒక్క సెమిస్టరయినా పవన్ పాసయ్యారా?. ఏయూలో గత వారమే రూ.100 కోట్లతో నిర్మించిన భవనాలు సీఎం జగన్‌ ప్రారంభించిన విషయం పవన్‌కు కనిపించలేదా?’’ అంటూ మంత్రి అమర్‌నాథ్‌ ప్రశ్నించారు.
చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement