
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
టీడీపీ, జనసేన విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని. నాదెండ్ల మనోహర్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాదెండ్ల వ్యాఖ్యలు ఉన్నాయి. కొన్ని కంపెనీలకే భూములు కేటాయిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అంటూ మంత్రి అమర్‌నాథ్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment