సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వినతిపత్రం సమర్పించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్‌సీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని వినతిపత్రం సమర్పించారు వైఎస్సార్‌సీపీ ఎంపీలు. పార్టీలు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి అయోధ్య రెడ్డి, సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ప్రతీక. 20వేల మంది ఉద్యోగులకు మించి అక్కడ పనిచేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. అప్పులను వాటాలుగా బదిలీ చేయాలి’ అని కామెంట్స్ చేశారు.
Met Hon’ble Minister for Steel Shri H.D. Kumaraswamy Garu along with @YSRCParty MPs to urge reconsideration of Visakhapatnam Steel Plant’s privatization. Minister assured that VSP will remain a PSU and ₹15,000 crore will be pumped in for revival. RINL, a Navratna & Telugu pride,… pic.twitter.com/D9lalIywBR
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 2, 2024
Comments
Please login to add a commentAdd a comment