పురుషులందు దుర్మార్గ చంద్రబాబు వేరయా: విజయసాయి రెడ్డి సెటైర్లు | YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

పురుషులందు దుర్మార్గ చంద్రబాబు వేరయా: విజయసాయి రెడ్డి సెటైర్లు

Published Sun, Sep 22 2024 11:30 AM | Last Updated on Sun, Sep 22 2024 1:32 PM

YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On Chandrababu

సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో విశాఖ ఉక్కును తుక్కు కింద మార్చేశారని అన్నారు. అలాగే, పురుషులందు ఈ దుర్మార్గపు చంద్రబాబు వేరయా అని చెప్పుకోవాలి అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు.

ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా.. చంద్రబాబు 100 రోజుల పనితీరు పార్ట్-2 పేరుతో..

  • 100 రోజుల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. 

  • 100 రోజుల్లో 60 అత్యాచారాలు జరిగాయి.

  • 100 రోజుల్లో విజయవాడలో "ఐరన్ లెగ్" పాలనలో వరదల్లో 60 మందిని చంపేశారు 

  • వరద బాధితులకు కనీస సహయ సహకారాలు కూడా అందించలేదు. బాబు ఫోటోషూట్ తప్ప. 

  • 100 రోజుల్లో గుడ్లవల్లేరు కాలేజీ మహిళ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి 3 వేల వీడియోలు తీసారు. 

  • 100 రోజుల్లో విశాఖ ఉక్కు ను తుక్కు కింద మార్చేశారు.

  • వైజాగ్  ఆర్థిక వెన్ను ను చంద్రబాబు ప్రభుత్వం విరిచేసింది. 

  • విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమ తుఫానులో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయం. 

  • అమరావతి వరదముంపులో ఇల్లు లేక కలెక్టర్ ఆఫీసు లో తలదాచుకున్న బాబుకు అదికూడా మిగలదు. 

  • 100 రోజుల్లో పోలవరాన్ని నాశనం చేశారు.

  • 100  రోజుల్లో అమరావతిని మునిగి పోకుండా ఉండటానికి ప్రకాశం బ్యారేజీని టిడిపి నేత బోట్లతో గుద్దించారు.

  • 100 రోజుల్లో మెడికల్ కాలేజీ లను నాశనం చేశారు.

  • 100 రోజుల్లో సచివాలయ వ్యవస్థను నాశనం చేశారు.

  • 100 రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను నాశనం చేశారు.

  • 100 రోజుల్లో రేషన్ వాహనాలు నాశనం చేశారు. 

  • 100 రోజుల్లో 10 వ్యాపార కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు. 

  • 100 రోజుల్లో  రోడ్లను నాశనం చేశారు, గుంతలపై తట్ట మట్టి కూడా వేయలేదు

  • 100 రోజుల్లో ప్రత్యర్థి రాజకీయ నేతలపై పదివేల దాడులు చేశారు. 

  • 100 రోజుల్లో రాష్ట్రాన్ని నేరమయం చేశారు , నేరాలు దారుణంగా పెరిగిపోయాయి.

  • 100 రోజుల్లో 40వేల కోట్ల అప్పులు చేశారు.

  • 100 రోజుల్లో  మొత్తంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.

👉మిగతా 1725 రోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు కష్టాలు, రాష్ట్రవిధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి.

👉భారతదేశంలో బాబులాంటి నిష్కారణ శత్రువులు వుంటారు. మనం ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పులు చేస్తూ ఎదుటివారి మీద నిందలు వేస్తుంటారు. వారిలో ఆద్యుడు ఈ చంద్రబాబు.

👉చంద్రబాబు జీవిత చరిత్ర అంతా ఏ పేజీ తిరగేసినా నేరాల చిట్టా కనిపిస్తుంది. అబద్ధాల వాక్యాలతో నిండిన ఈ దరిద్రపు పుస్తకాన్ని ఎల్లో కుల మీడియా చాటున గొప్ప చరిత్ర గా చూపిస్తూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు.

👉పురుషులందు పుణ్య పురుషులు వేరయా అంటాడు వేమన. కానీ పురుషులందు ఈ దుర్మార్గపు చంద్రబాబు వేరయా అని చెప్పుకోవాలి.
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటాడు చంద్రబాబు.

👉తప్పొప్పులు, సత్యా అసత్యాలకు సరిహద్దు మర్చిపోయిన చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం.

👉మొదట్లో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయన ఒక్కరే ఇతని చేతిలో మోసపోయాడు అనుకున్నాను. కానీ 1995నుండి ప్రజలు కూడా వెన్నుపోటుకు గురయ్యారని బాధగా అనిపిస్తున్నది.

👉టీడీపీ నాయకులకి ఏంచెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్లే. సిగ్గు ఎప్పుడో వదిలేసారు. మానం, మర్యాదలు వాళ్ళ నిఘంటువు లో లేవు.

👉వైఎస్సార్‌సీపీ నాయకులూ కార్యకర్తలు పోరాడాలి. టీడీపీ వాళ్ళు మట్టిలో కలిసే వరకు పోరాడాలి అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

 

ఇది కూడా చదవండి: ప్రైవేటీకరణ దిశగా స్టీల్‌ప్లాంట్‌.. ఉక్కు కార్మికుల నిరసన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement