
ర్యాలీగా వస్తున్న కార్మిక సంఘం నాయకులు
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర ప్రభుత్వం భేషజానికి పోకుండా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగరంలోని సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 100వ రోజుకు చేరుకున్నాయి.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ..ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వారికి కారుచౌకగా అమ్మేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటలను పెడచెవిన పెట్టి.. కేంద్రం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ర్యాలీలో కార్మిక సంఘాల నేతలు ఓబులేసు, సి.హెచ్.నర్శింగరావు, జె.వెంకటేశ్వరరావు, పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి. ఆదినారాయణ, జె. అయోధ్యరామ్, గంధం వెంకటరావు, కె.ఎస్.ఎన్.రావు, వై. మస్తానప్ప, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment