Riley strikes
-
సిసలైన సైకో చంద్రబాబు నాయుడే
తాడికొండ: ఓట్ల కోసం తోక పార్టీలతో కలిసి కులవాదులు డ్రామాలాడుతున్నారని బహుజన పరిరక్షణ సమితి నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 832వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో శనివారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. పేదలకు ఇంగ్లిషు మీడియం విద్య అందకుండా కోర్టుల్లో కేసులు వేయడంతో పాటు, వికేంద్రీకరణ జరగనీయకుండా అడ్డుకుంటున్న చంద్రబాబును జనం తరిమికొట్టడం ఖాయమన్నారు. మామ దగ్గర సైకిల్‌ను దొంగిలించి.. సైకో రాజకీయాలు చేస్తూ జనంలో తిరుగుతున్న సిసలైన సైకో చంద్రబాబేనని ధ్వజమెత్తారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో ప్రజలు చనిపోతే కనీసం చలించకుండా ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కుప్పంలో పర్యటనలు చేయడమంటే ప్రజలను రెచ్చగొట్టడం కాదా.. అని ప్రశ్నించారు. బహుజనులను బలిచేస్తున్న దొంగ సభలను రద్దుచేయకుంటే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. ప్రచారార్భాటాల కోసం చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అధికారమే పరమావధిగా బాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరనేది గుర్తుంచుకుంటే మంచిదని, ఇకనైనా కళ్లు తెరిచి పేదల పక్షాన నిలువకపోతే ఆయనను ప్రజల్లో తిరగకుండా అడ్డకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు మాదిగాని గురునాథం, బొలిమేర శామ్యూల్, పెరికే వరప్రసాద్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం, కారుమూరి పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: కందుకూరు, గుంటూరు ఘటనలపై విచారణ కమిషన్ -
ప్రైవేటీకరణను ఆపాల్సిందే..
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర ప్రభుత్వం భేషజానికి పోకుండా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగరంలోని సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 100వ రోజుకు చేరుకున్నాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ..ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వారికి కారుచౌకగా అమ్మేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలను పెడచెవిన పెట్టి.. కేంద్రం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ర్యాలీలో కార్మిక సంఘాల నేతలు ఓబులేసు, సి.హెచ్.నర్శింగరావు, జె.వెంకటేశ్వరరావు, పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి. ఆదినారాయణ, జె. అయోధ్యరామ్, గంధం వెంకటరావు, కె.ఎస్.ఎన్.రావు, వై. మస్తానప్ప, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ కార్మికులు పాల్గొన్నారు. -
కరోనా విజృంభణ.. వైఎస్ షర్మిల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలను తాత్కా లికంగా వాయిదా వేస్తున్నట్టు వైఎస్ షర్మిల ప్రకటించారు. కోవిడ్ సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆమె కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గత ఆరేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాల విషయంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా యువకులు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి ఉందని, నిరుద్యోగుల బాధలకు చలించి, వారికి భరోసా కల్పించాలనే ఉద్యోగ సాధన దీక్ష చేపట్టామన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తల, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యత కలిగిన నాయకురాలిగా కొలువుల సాధన దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వెల్లడించారు. కొలువులు సాధించే వరకు ఈ పోరాటం కచ్చితంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
చంద్రబాబును అరెస్టు చేయాలి
తాడికొండ: చంద్రబాబుపై దేశద్రోహం కింద కేసు కట్టి అరెస్టు చేయాలని దళిత బహుజన పరిరక్షణ సమితి నేతలు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి అడ్డుపడితే దళిత ద్రోహి బాబును రాజకీయంగా బొందపెడతామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 105వ రోజుకు చేరుకున్నాయి. పలుంవురు దళిత నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు తన భార్య, కొడుకు, కోడలు, మనవడితో సంక్రాంతి పండుగ చేసుకుంటూ.. హక్కుల కోసం పోరాడుతున్న పేదలకు మాత్రం సంక్షేమం అందకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు బినామీ నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ తగిలినా బుద్ధి రాలేదన్నారు. దేశంలోనే విచ్చిన్నకరమైన ఉగ్రవాది చంద్రబాబు అని, రాజకీయాల కోసం మామ, తోడల్లుడికి వెన్నుపోటు పొడిచి నందమూరి వంశాన్ని కనిపించకుండా చేశాడని దుయ్యబట్టారు. పేదల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు బాబు అండ్ కో కోర్టుల్లో వేసిన కేసులు విత్‌డ్రా చేసుకుని, ముక్కు నేలకు రాసి దళితులు, బహుజనులకు క్షమాపణ చెప్పాలని సూచించారు. నాయకులు మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, పరిశపోగు శ్రీనివాసరావు, జూపూడి బాలస్వామి, పల్లె బాబు తదితరులు పాల్గొన్నారు. -
అందుకే బాబుకు ఆలయాలపై ప్రేమ
తాడికొండ: తనపై పడిన కుల రాజధాని ముద్రను తొలగించుకొనేందుకే చంద్రబాబు రాష్ట్రంలో ఆలయాలపై టీడీపీ నాయకులతో దాడులు చేయించి తిరిగి అదే ఆలయాల చుట్టూ ప్రేమ పొంగినట్టు చెప్పులతో మెట్లెక్కి ప్రదక్షిణలు చేస్తున్నాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 96వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. పేదలకు అండగా 31 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు 15 లక్షల ఇళ్లు ప్రారంభించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ఆదివారం చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు మాదిగాని గురునాథం, కట్టెపోగు ఉదయ్‌భాస్కర్, రుద్రపోగు సురేష్, రాజేంద్ర కుమార్, నిక్కిరాల మురళీ కృష్ణ పాల్గొన్నారు. -
మూడు రాజధానులకు మద్దతుగా 85వ రోజుకు చేరిన దీక్షలు
తాడికొండ: మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 85వ రోజుకు చేరుకున్నాయి. ముఖ్య అతిథులుగా హాజరైన రాయలసీమ విద్యార్థి సంఘం, దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న చంద్రబాబుకు భవిష్యత్‌లోనూ అధికారం కల్లేనన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనే యోచనతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే.. చంద్రబాబు మాత్రం బినామీల ఆస్తులను కాపాడుకునేందుకు, కుల రాజధాని నిర్మించేందుకు ఆరాట పడుతున్నారని ధ్వజమెత్తారు. నదీ తీర ప్రాంతంలో ఉన్న అమరావతిలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం సాధ్యపడదని, మూడు రాజధానులు నిర్మిస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసినా చంద్రబాబు పెడచెవిన పెట్టారని విమర్శించారు. రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు, బహుజన పరిరక్షణ సమితి నాయకులు పరిశపోగు శ్రీనివాసరావు, మాదిగాని గురునాథం, పిడతల అభిషేక్, నత్తా యోనారాజు తదితరులు పాల్గొన్నారు. -
కుల రాజధాని కోసమే బాబు దొంగ దీక్షలు
తాడికొండ: నలభయ్యేళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల అభివృద్ధిని వదిలి.. కుల రాజధాని నిర్మాణానికి తన బినామీల కోసం దొంగ దీక్షలు చేయించడంలో ఆంతర్యం ఏమిటో చంద్రబాబు చెప్పాలని యానాది సంఘం సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల ఏడుకొండలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 39 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మూడు రాజధానులకు సంఘీభావం తెలుపుతున్న మహిళలు, దళిత సంఘాల ప్రతినిధులు పూలింగ్ పేరుతో రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు శనిలా మారి ఒకే రాజధాని అంటూ తన బినామీల కోసం రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాడన్నారు. సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తానని గ్రాఫిక్స్‌లో బొమ్మలు చూపించిన ఆయన కార్పొరేట్ సంస్థలకు విలువైన భూములను ధారాదత్తం చేసి రైతులకు మొండిచేయి చూపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, వికలాంగుల సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బందెల కిరణ్‌రాజు, ఏపీ మాల మహానాడు అధ్యక్షుడు యోనారాజు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కుల రాజధాని కన్నా .. పాలన వికేంద్రీకరణే మిన్న
తాడికొండ: కుల వివక్షతో కూడిన ఏక రాజధాని కన్నా.. మూడు రాజధానులే మిన్న అని ఐడియల్ దళిత్ ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ జి.రాజసుందర బాబు అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో బుధవారం ఆయన మాట్లాడారు. అమరావతిలో కుల వివక్ష తాండవిస్తోందని, ఇలాంటి వివక్ష దేశంలో ఎక్కడా లేదన్నారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటే.. వాటిని చంద్రబాబు బృందం అడ్డుకోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఎక్కడైతే దాడి జరిగిందో అదే కృష్ణాయపాలెం గ్రామం నుంచి 50 వేల మంది బహుజన మహిళలతో ర్యాలీగా తరలివస్తామని తెలిపారు. 36 రోజులుగా కొనసాగుతున్న 3 రాజధానుల ఉద్యమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఐడియల్ నాయకులు కందుల దీనమణి రాజీ, బేతపూడి భారతి, మట్టుపల్లి వీరమ్మ, ఐడీబీ నాయక్, నత్తా యోనారాజు, నూతక్కి జోషి, సుభాషిణి, పిడతల అభిషేక్, బూదాల సలోమి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. -
గొంతెండుతోంది.. నీళ్లివ్వండి
లెమల్లెపాడు(వట్టిచెరుకూరు): రెండు నెలలుగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని కోరుతూ లెమల్లెపాడు గ్రామస్థులు గ్రామంలోని పోలేరమ్మ తల్లి గుడి సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షల్ని బుధవారం నుంచి చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు చానల్ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల నుంచి చందాలు వేసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నామని, తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. అధికారులు అలసత్వ వైఖరి నిరసనగా గత్యంతరం లేక నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ రాములునాయక్, ఎస్ఐ అశోక్ దీక్ష స్థలానికి వచ్చి దీక్షలో పాల్గొన్న గ్రామస్థులతో మాట్లాడారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా గ్రామస్థులు పట్టువీడలేదు. శాంతిభద్రతల్ని దృష్టిలో ఉంచుకుని రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఫలించిన పోరాటం
► కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను కొనసాగిస్తూ ఉత్తర్వులు ► రిలే దీక్షలు విరమణ పాడేరు: తమను విధు ల్లోకి తీసుకోవాలంటూ కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు ఐటీడీఏ వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఫలించాయి. ఎపిడమిక్ కాలానికి 6 నెలలు పాటు కాంట్రాక్టు ప్రాతి పదికన పనిచేస్తున్న వీరి ని నవంబరు 30న విధుల నుంచి తొలగిం చారు. అయితే తమను కాంట్రాక్టు హెల్త్ అసి స్టెంట్లుగా కొన సాగిం చాలంటూ డిసెంబరు 4వ తేదీ నుంచి ఆందోళన చేపట్టారు. స్పందించి న ఐటీడీఏ పీవో రవిసుభాష్ వీరిని విధుల్లో కొనసాగించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదించా రు. ఈ మేరకు మరో 6 నెలలు కాంట్రాక్ట్ పొడిగిస్తూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిుషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 95 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల ను విధుల్లోకి తీసు కుంటూ నియామక ఉత్తర్వులు అందజేసినట్టు ఏడీఎంహెచ్‌వో వై.వేంకటేశ్వరరావు తెలిపారు. తమ పోరాటం ఫలించడంతో 12 రోజులుగా ఐటీడీఏ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలను విరమించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ శర్మ, ఏపీజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పి.అప్పలనర్శ, వైద్య ఉద్యోగుల సంఘం నాయకుడు శెట్టి నాగరాజు కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లతో దీక్షలను విరమింపజేశారు. -
కార్మికుల పొట్టకొట్టొద్దు
రిలే దీక్షలు చేపట్టిన నగరపాలక సంస్థ కార్మికులు ఈ జీవో కార్మికుల కడుపుకొట్టేదే.. దీక్షనుద్దేశించి ప్రసంగించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం ఒంగోలు క్రైం : మున్సిపల్, నగరపాలక సంస్థ కార్మికుల పొట్టకొట్టే జీవో నంబర్-279ని వెంటనే రద్దు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను ప్రారంభించిన యూనియన్ రాష్ర్ట అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం దీక్షలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ఫెడరేషన్ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తారన్నారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన జీవో 279ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అప్పటి నుంచి కార్మికుల పొట్టకొట్టే జీవోను రద్దు చేయాలని అనేక సార్లు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా కనీసం ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రావు మాట్లాడుతూ రెండు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్నా చలనం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు, మున్సిపల్ ఉన్నతాధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. చర్చల ద్వారా కూడా సమస్యను విన్నవించారన్నారు. దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో 13వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామని, అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి స్తామని హెచ్చరించారు. ఆ తరువాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే మున్సిపల్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జెఏసి) నిర్ణయించిందని గుర్తు చేశారు. రిలే దీక్షల్లో యూనియన్ నాయకులు కె.గోపి, కె.చిననాగేశ్వరరావు, కె.రవి, కె.బాలకృష్ణ, కె.చినయాకోబు, కసుకుర్తి వెంకాయమ్మ, రాగిరాములు, సుజాత, ఆర్.సుందరం, వెంకటేశ్వర్లు, కె.రామకృష్ణ, టి.విజయ, కె.మోహనరావు, ఎన్.కోటయ్య, ఎస్.నాగేశ్వరరావు, మెండెం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
100రోజుల దీక్ష చేస్తాం..
నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిజాం షుగర్ రక్షణ కమిటీడిమాండ్ చేసింది. గురువారం బోదన్ మండల కేంద్రంలో కమిటీ సభ్యులు దీక్ష చేపట్టారు.కమిటీకన్వీనర్ రాఘవులు మాట్లాడుతూ.. 100రోజుల పాటు రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. కార్మికులు, రైతులు, పలు ప్రజా సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నాయి. -
వెల్లువెత్తిన ప్రజామద్దతు
ముద్రగడ ఆమరణ దీక్షకు సంఘీభావం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఖాళీ కంచాలపై గరిటలతో కొడుతూ నిరసనలు పలు ప్రాంతాల్లో రిలే దీక్షలు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దంపతుల దీక్షకు జిల్లావ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. వారి దీక్షకు సంఘీభావంగా పలుచోట్ల నిరాహార దీక్షలు ప్రారంభించారు. మధ్యాహ్న సమయంలో పలువురు ఖాళీ కంచాలు, గరిటలతో రోడ్లపైకి వచ్చి వాటితో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. కాకినాడ : అమలాపురంలో దివంగత కాపు నేత నల్లా సూర్యచంద్రరావు, ఆయన సోదరుడునల్లా విష్ణుమూర్తిల తనయులు పవన్, అజయ్ ఆమరణ దీక్ష చేపట్టారు. గడియారం స్తంభం సెంటరులో కోనసీమ తెలగ, బలిజ, కాపు (టీబీకే) సంఘం అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ ఆధ్వర్యాన రిలే దీక్షలు ప్రారంభించారు. 19 మంది కాపు నాయకులు దీక్షల్లో కూర్చున్నారు. అల్లవరం పోలీసు స్టేషన్ సెంటర్లో రిలే దీక్షలకు ఆల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు, మత్స్యకార నాయకులు మల్లాడి హనుమంతరావు, నాతి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. ఉప్పలగుప్తంలో జరుగుతున్న దీక్షలకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, పార్టీ నాయకులు బద్రి బాబ్జీ, జున్నూరి వెంకటేశ్వరరావు, కడిమి చిన్నారావు సంఘీభావం తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం గేదెల్లంక, ఐ.పోలవరం మండలం కొమరగిరి, మండల కేంద్రమైన తాళ్ళరేవు, కాట్రేనికోన మండలం చెయ్యేరులో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. అమలాపురం మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. పి.గన్నవరం మండలం బోడపాటివారిపాలెంలో 200 మంది మహిళలు, కంచాలను గరిటెలతో వాయిస్తూ ముద్రగడ దీక్షకు మద్దతు తెలిపారు. రావులపాలెం మండలం గోపాలపురంలో కాపు నాయకుడు ఆకుల రామకృష్ణ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కొత్తపేట మండలం వాడపాలెంలో కాపు యువకులు రిలే దీక్షలు చేపట్టారు.మండపేట పట్టణ కాపు సంఘం ఆధ్వర్యాన రిలే దీక్షలు ప్రారంభించారు. సంఘ నాయకులు కామన ప్రభాకరరావు, సత్యవాణి దంపతులు, జున్నూరు సాయిబాబా, అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మెట్ట ప్రాంతంలో.. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో రిలే దీక్షలు చేశారు. పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, తుని, తొండంగి, కోటనందూరు, రౌతులపూడి, రాజోలు, మల్కిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అంబాజీపేట, అయినవిల్లి తదితర మండలాల్లో ఆందోళనలు చేశారు. నగరాల్లో.. రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్లో ఖాళీ కంచాలపై గరిటెలతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుడు ఆకుల వీర్రాజు, కాపు సంఘ నాయకులు రామినీడు మురళి, నందెపు శ్రీనివాస్, శేషు నారాయణ, ఇసుకపల్లి శ్రీనివాస్, సుంకర శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు. కడియం దేవీచౌక్ సెంటర్లో మండల కాపు ఐక్యవేదిక ఆధ్వర్యాన ఆందోళన నిర్వహించారు. చీకట్ల రమణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ గిరిజాల వెంకట స్వామినాయుడు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ సిద్ధార్థనగర్‌లో కాపు సద్భావన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వా ప్రభాకరరావు ఆధ్వర్యాన కంచాలు, గరిటెలతో శబ్దాలు చేస్తూ ఆందోళన చేశారు. కరప మండలం కరప, అరట్లకట్ట, పెనుగుదురు, చినకొత్తూరు, పెదకొత్తూరు, కూరాడ గ్రామాల్లో రిలే దీక్షలు చేపట్టి, మధ్యాహ్న భోజన సమయంలో కంచాలపై గరిటెలతో కొట్టి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు కరప శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తే అభ్యంతరం లేదని అన్నారు. కాకినాడ మసీదు సెంటర్లో కాపులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ైవైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.