ఫలించిన పోరాటం
► కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను కొనసాగిస్తూ ఉత్తర్వులు
► రిలే దీక్షలు విరమణ
పాడేరు: తమను విధు ల్లోకి తీసుకోవాలంటూ కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు ఐటీడీఏ వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఫలించాయి. ఎపిడమిక్ కాలానికి 6 నెలలు పాటు కాంట్రాక్టు ప్రాతి పదికన పనిచేస్తున్న వీరి ని నవంబరు 30న విధుల నుంచి తొలగిం చారు. అయితే తమను కాంట్రాక్టు హెల్త్ అసి స్టెంట్లుగా కొన సాగిం చాలంటూ డిసెంబరు 4వ తేదీ నుంచి ఆందోళన చేపట్టారు. స్పందించి న ఐటీడీఏ పీవో రవిసుభాష్ వీరిని విధుల్లో కొనసాగించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదించా రు. ఈ మేరకు మరో 6 నెలలు కాంట్రాక్ట్ పొడిగిస్తూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిుషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
95 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ల ను విధుల్లోకి తీసు కుంటూ నియామక ఉత్తర్వులు అందజేసినట్టు ఏడీఎంహెచ్‌వో వై.వేంకటేశ్వరరావు తెలిపారు. తమ పోరాటం ఫలించడంతో 12 రోజులుగా ఐటీడీఏ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలను విరమించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ శర్మ, ఏపీజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పి.అప్పలనర్శ, వైద్య ఉద్యోగుల సంఘం నాయకుడు శెట్టి నాగరాజు కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లతో దీక్షలను విరమింపజేశారు.