సాక్షి, అమరావతి: వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టులను కొత్తగా సృష్టిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 88 పీహెచ్‌సీల కోసం 1,232 పోస్టులను కేటాయించింది. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ ఉన్న 63 మండలాల్లో సీహెచ్‌సీ కేంద్రంగా వైద్యులు, వైద్య సిబ్బందితో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయడం కోసం మిగిలిన 378 పోస్టులను కేటాయించింది.
కొత్తగా సృష్టించిన వాటిలో 302 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 264 స్టాఫ్ నర్స్, 151 ఎంపీహెచ్‌ఈవో/సీహెచ్‌వో, ఇతర పోస్టులు ఉన్నాయి. కాగా ఇప్పటికే వైద్య శాఖలో ప్రభుత్వం 48 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసింది. కొత్తగా భర్తీ చేసే సిబ్బందితో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి.
చదవండి: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
Comments
Please login to add a commentAdd a comment