ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఆదివాసీ–గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రసవాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడుతోంది. ఆదివాసీ మహిళల కాన్పులు ఇళ్లలో కాకుండా ఆసుపత్రుల్లో లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్ సీలు) జరిగేలా ఆరోగ్య సిబ్బంది చూస్తున్నారు. ఏపీలో మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారని, ఈ విషయంలో దేశంలో కేరళ తర్వాత రెండో స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి.
శ్రామిక శక్తికి (లేబర్ ఫోర్స్) సంబంధించిన 2021–2022 సర్వే ప్రకారం ఏపీలో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 2019–20లో 1021 మంది బాలికలు ఉండగా, ఈ సంఖ్య 2021–2022 నాటికి 1046కు పెరిగిందని కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పుట్టిన ఆడపిల్లలు ఆరేళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా పెరగడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో పాటు వివిధ రకాల ప్రభుత్వ సిబ్బంది కృషిచేస్తున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పోషకాహారం అందజేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమం చక్కటి ఫలితాలు అందిస్తుంది. దీనివల్ల 10,032మంది డాక్టర్లు వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంబీబీఎస్ డాక్టర్లు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ల ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తూ అవసరైన గైడెన్స్ అందజేస్తున్నారు.
విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment