Family Doctor
-
కాపీ కొట్టిన మేనిఫెస్టోనే అంతా చెబుతోంది!
తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న ‘కన్సల్టెన్సీ’ హెడ్ రాబిన్ శర్మ ‘‘ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమనీ, తాము చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదనీ, చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేక పోవడమే అసలు సమస్య’’ అనడం రేపు ‘పోలింగ్ బూత్’లో తటస్థ ఓటరుపై గట్టి ప్రభావం చూపి స్తుంది. ఎందుకంటే, ఇది మరొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటున్న మాట కాదు. మన కోసం మనం ‘ఫీజు’ కట్టి పెట్టుకున్న ‘సర్వీస్ ప్రొవైడర్’ వ్యక్తం చేసిన నిస్సహాయత. ఇది ఎటువంటిది అంటే, మన ‘ఫ్యామిలీ డాక్టర్’– ‘‘మీ జబ్బును నేను తగ్గించ లేకపోతున్నాను’’ అని పెదవి విరవడం వంటిది. వాళ్ళు అటువంటి ముగింపుకు రావడానికి కారణం, ఆరు నెలల క్రితం ‘మేనిఫెస్టో’లో నుంచి ‘బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ’ పేరుతో ‘సూపర్ సిక్స్’ పథకాలు ‘ట్రయిల్’ కోసం విడుదల చేశారు. ఆ తర్వాత దానికి విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజల నుండి స్పందన లేదు. ఈ ‘టీం’ ఇటువంటి అభిప్రాయానికి రావడానికి ఇదే ప్రధాన కారణం అయింది. ఈ దశలో ‘రిస్క్ మేనేజ్మెంట్’ కోసం ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చి, తన ప్రకటనకు ముందూ వెనుకా ఎటువంటి వివరణ లేకుండా, ‘ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవదు’ అని ఏకవాక్య ప్రకటన చేసి మళ్ళీ ఎక్కడా కనిపించకుండా నిష్క్రమించారు. ఈ ప్రకటన మనం నమ్మడం కోసం ముందుగా – ‘ఈ ఎన్నికల్లో నేను టీడీపీ కోసం పనిచేయడం లేదు’ అని ప్రకటించాక, ‘వైఎస్సార్సీపీ గెలవదు’ అన్నారు. ఇది జరిగాక కావొచ్చు, చివరి ప్రయత్నంగా ప్రశాంత్ కిషోర్– ‘వదలొద్దు మరో ప్రయత్నం చేయండి’ అని రాబిన్ శర్మ బృందానికి సూచించారు. ఇప్పుడు టీడీపీ పూర్తి స్థాయిలో ‘మేనిఫెస్టో’ వెల్లడించిన తర్వాత కూడా అన్ని ‘సర్వే’ నివేదికలు జగన్‌కు అనుకూలంగా ఉన్నాయి. సరిగ్గా ఈ కాలంలోనే, చంద్రబాబు తన ప్రసంగాల్లో ‘బ్యాలెన్స్’ కోల్పోవడం మొదలయింది. సభకు వచ్చినవాళ్లను ‘మీ ఊళ్లో గంజాయి దొరుకుతోందా’ అని గుచ్చి గుచ్చి అడుగుతూ తనకు అనుకూలమైన సమా ధానం పొందేందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని సాధారణంగా శత్రు వుగా చూడరు. జగన్ విషయంలో బాబు ఆ హద్దు ఎప్పుడో దాటారు. ఎప్పుడైనా ఎన్నికల ‘నోటిఫికేషన్’ అంటే చంద్ర బాబుకు ఆయన పార్టీ అభ్యర్థులకు అది ‘టెండర్ నోటీస్’ వంటిది. అందుకే ఎన్నికల సమయానికి ఆర్థిక నేరస్థులూ, ‘ఎన్నారై’లూ అ పార్టీలో అభ్య ర్థులుగా ఉంటారు. వీరి వద్ద నుంచి నిధులను సమీకరించి ముందుగా వాటిని తన నేలమాళిగలో దాచి, అప్పుడు తన పార్టీ ‘మేనిఫెస్టో’ అంటూ బాబు ప్రజల ముందు ‘టెండర్’ దాఖలు చేస్తారు. గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఐదేళ్ళ సంపాదనముందుగా దాచిన దానికి అదనం. ప్రతి ఎన్నికలో బాబుది ఇదే ‘ఫార్ములా’. అందుకే, ప్రతిపక్ష నాయ కుడిగా బాబు ఎలాగోలా నెట్టుకుంటూ తన పార్టీ ఉనికిని ఎన్నికల వరకు దొర్లించి, చివరిలో ఎవరో కొందరి మద్దతు తీసుకుని; మళ్ళీ తన టోపీని ఎన్నికల ‘ఎరీనా’లోకి విసురుతారు. గెలిస్తే, ‘డబల్ బెనిఫిట్’; ఓడిపోతే, ‘సింగిల్ బెనిఫిట్’. బాబుకు ఎన్నికలు అంటే, ఇంత ‘సింపుల్’.అందుకే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తప్పు పట్టిన బాబు, ఎన్నికల ముందు ‘సూపర్ సిక్స్’ అంటూ అరువు తెచ్చుకున్న అంశాలతో ‘కిచిడీ’ మేనిఫెస్టో’ ప్రకటించారు. అందులోని అంశాలు: టీడీపీ అధికారంలోకి వస్తే ‘మహా శక్తి’ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ‘స్త్రీనిధి‘ కింద నెలకు 1500 రూపాయలు, ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున, ‘దీపం‘ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడం, స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. జగన్ సంక్షేమ పథకాలను తప్పు పట్టి, మళ్ళీ వాటినే పేర్లు మార్చి అమలుచేస్తాననే ఈ ‘యూ టర్న్’ ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మనం మూడు చోట్ల వెతకాలి. మొదటిది అమరావతి. బాబును నమ్మి అక్కడ భూములు కొన్న ‘ఎన్నారై’లకు ఈ ఎన్నికల్లో బాబు గెలుపు అవసరం. అది వారికి జీవన్మరణ సమస్య. అందుకే వాళ్ళు స్వయంగా నెల ముందుగా ఇండియా వచ్చి టీడీపీ కోసం ఇక్కడ ప్రచారం చేసే పనిలో ఉన్నారు. రెండవది – ‘మార్గదర్శి’ రామోజీరావు భవిష్యత్తు. మూడవది – పై రెండింటి కంటే సంక్లిష్టమైన కొడుకు లోకేష్ చుట్టూ అల్లుకుని ఉన్న కుటుంబ చట్రంలో నుంచి బాబు క్షేమంగా బయటపడటం. బయట నుంచి దీన్ని చూస్తున్న మనకే వీటికి పరిష్కారం ఉందని అనిపించడం లేదు. ఇంకా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో వాటి సంగతి ఏమిటో... మరో నెల రోజులు కాలం తర్వాత తెలుస్తుంది. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు మొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
ప్రతి పేదవాడికి ఫ్యామిలీ డాక్టర్..ఈ స్కిం సాధించిన విజయాలపై గ్రౌండ్ రిపోర్ట్
-
ఇంటికే డాక్టర్.. ఇంటికే మెడిసిన్
-
ఫ్యామిలీ డాక్టర్ విధానం భేష్
సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు గ్రూపు అండ్ రీసెర్చ్ ట్రయాంగిల్ ఇనిస్టిట్యూట్(ఆర్టీఐ) ప్రశంసించింది. ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతున్న తీరు, దాని వల్ల ప్రజలకు కలుగుతున్న ఆరోగ్య ప్రయోజనాలపై ఆ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అధ్యయనం నిర్వహించింది. ఆ అధ్యయనం వివరాలను శనివారం ఢిల్లీ నుంచి వీడియో సమావేశం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వివరించారు. రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక భరోసాను ఇవ్వనుందని ప్రపంచ బ్యాంకు గ్రూపు ప్రతినిధి అమిత్, ఆర్టీఐ ప్రతినిధి సత్య చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లోకి రాక ముందు అనంతర పరిస్థితులపై ఈ సంస్థ అధ్యయనం చేసి మందుల వినియోగం, రోగ నిర్ధారణ పరీక్షల సేవల పెరుగుదలను పరిశీలించింది. ఈ విధానం వచ్చాక పీహెచ్సీ, వీహెచ్సీల కంటే ఫ్యామిలీ డాక్టర్ వద్ద వ్యాధి నిర్థారణ పరీక్షలు, షుగర్ వ్యాధి, హైపర్ టెన్షన్ పరీక్షలు అధికంగా జరుగుతున్నట్టు తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సంస్థ ప్రభుత్వానికి పలు సూచనలిచ్చింది. అనంతరం సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు, మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వంటి అనేక కీలక చర్యలు చేపట్టిందని చెప్పారు. దీనివల్ల రానున్న రోజుల్లో ఆరోగ్య శ్రీ భారం చాలా వరకూ తగ్గనుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. మహిళలు, బాలికల్లో పౌష్టికాహార లోప నివారణ, రక్త హీనత నివారణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్, ఆర్టీఐ సంస్థ ప్రతినిధులు డా.జామి, డా.గురురాజ్ తదితరులున్నారు. -
ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ జగన్ సర్కార్ నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతిఆయోగ్ విడుదల చేస్తు న్న ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంటోంది. రక్తహీనత నివారణ చర్యల్లో భేష్ రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోష ణ ప్లస్, జగనన్న గోరుముద్ద కార్యక్రమాల కింద ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్ హెల్త్ యాప్‌తో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. డిజిటల్ వైద్య సేవల్లో ఫస్ట్ ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడం, భవిష్యత్‌లో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్లు సృష్టించడంతోపాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్ వై ద్యసేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి. డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సై తం ఏపీ విధానాలను అవలంభించాలని అన్ని రా ష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో లేఖ రాశారు.రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు కాగా.. ఇందులో 25 శాతానికిపైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఆరోగ్య ధీమా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి, పేద కు టుంబాల ఆరోగ్యానికి సీఎం జగన్ ప్రభు త్వం అండగా నిలుస్తోంది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. దీంతో ఏపీలోని 95 శాతం కుటుంబా లకు ఆరోగ్య బీమా లభిస్తోంది. అత్యధిక జనా భాకు పూర్తి ఆరోగ్య బీమా కలి్పస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించింది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్యరంగం బలోపేతానికి తీసుకున్న చర్యలివీ ► వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్న ప్రభుత్వం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ► రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం ►గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు ►దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు ► టీడీపీ హయాంలో నిర్విర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంపు. వైద్య ఖర్చుల పరిమితి రూ.25 లక్షలకు పెంపు ►108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. -
15 నెలల్లో రికార్డు స్థాయిలో 3.15 కోట్ల వైద్య సేవలు
ఇది గతం.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గ్రామంలో ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యానికి జిల్లా ఆస్పత్రికో లేదా ప్రైవేటు ఆస్పత్రికో వెళ్లాల్సిందే. వైద్య సదుపాయం ఉన్న గ్రామాలే తక్కువ. అక్కడ వైద్యుడు ఉంటాడన్న నమ్మకం లేదు. ప్రాంతీయ ఆస్పత్రులూ అంతంతమాత్రమే. అక్కడా వైద్యులు ఉండరు. దీంతో వృద్ధులైనా, మహిళలైనా, దివ్యాంగులైనా వ్యయప్రయాసలకోర్చి జిల్లా ఆస్పత్రికో, ప్రైవేటు ఆస్పత్రికో వెళ్లక తప్పని పరిస్థితి. అక్కడా పెద్ద క్యూలు. ఉండేదే అరకొర వైద్య సిబ్బంది. ఆరోజు తమను చూస్తారో లేదోనన్న ఆందోళన. నేడు గ్రామాలకే వైద్యులు.. ఇప్పుడున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్.. గ్రామాల్లోని ఆస్పత్రుల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. అంతే కాదు.. గ్రామీణ ప్రజలు చిన్న సమస్యలకు కూడా పెద్దాస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యులనే గ్రామాలకు పంపిస్తున్నారు. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు గ్రామీణులెవరూ వైద్యం కోసం పరుగులు పెట్టాల్సిన అవసరంలేదు. వారి వద్దకే వైద్యులు వస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, పరీక్షలు చేసి, అవసరమైన మందులు కూడా ఇస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం ‘ఫ్యామిలీ డాక్టర్’. ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యులు వెళ్లే ఈ కార్యక్రమాన్ని 2022 అక్టోబర్ నెలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ట్రయల్ రన్ మొదలు పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 15 నెలల్లో రికార్డు స్థాయిలో 3.15 కోట్ల వైద్య సేవలు అందించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా ప్రస్తుతం ఉన్న 1142 పీహెచ్‌సీలకు అదనంగా 88 కొత్త వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మండలంలో ఒక పీహెచ్సీ, సీహెచ్‌సీ ఉన్న 63 చోట్ల వైద్యులను నియమించింది. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులకు వారి పరిధిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను సమానంగా విభజించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,032 విలేజ్ క్లినిక్‌లను వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శిస్తున్నారు. 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లతో పాటు వైద్యులు గ్రామాలకు వెళుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న 676 ఎంఎంయూలకు అదనంగా 260 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ 104 యూనిట్, వైద్యుడు గ్రామానికి వెళ్లిన రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ప్రజలకు అవుట్‌పేòÙంట్ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పిల్లల ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇక నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్సీడీ) సర్వేలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరినీ వైద్య శాఖ స్క్రీనింగ్ చేస్తోంది. వీరిలో బీపీ, షుగర్, ఇతర సమస్యలు ఉన్న వారికి నిర్దేశించిన ప్రమాణాలతో మెడికల్ ఫాలోఅప్ చేస్తూ ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వరం సాధారణంగా బీపీ, షుగర్, ఇతర ధీర్ఘకాలిక వ్యాధిగ్రçÜ్తులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు, వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. మారుమూల గ్రామాల్లో ఉండే వారు ప్రతి నెలా వైద్యుడిని సంప్రదించాలంటే 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు వెళ్లాలి. ఆస్పత్రికి వెళ్లి రావడానికి ప్రయాణ చార్జీలతో పాటు, ఒక రోజంతా కేటాయించాలి. మంచానికే పరిమితమైన వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే ఆ కుటుంబాలు పడే కష్టాలు వర్ణనాతీతం. ఈ కష్టాలకు చెక్ పెడుతూ సీఎం వైఎస్ జగన్ వైద్యులనే ప్రజల వద్దకు పంపుతున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వరంగా మారింది. విలేజ్ క్లినిక్‌లలోనే 105 రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. థైరాయిడ్, గుండె సంబంధిత, ఇతన సమస్యలకు మందులు గ్రామస్థాయిలోనే అందుబాటులో ఉంటున్నాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు ♦ జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ♦ బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ♦ గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. ♦ ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం ♦ చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు ♦ తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ ♦ పాలియేటివ్ కేర్ ♦ రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు ♦ గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్ ♦ హిమోగ్లోబిన్ టెస్ట్ ♦ ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (సుగర్) ♦ మలేరియా టెస్ట్ ♦ హెచ్ఐవీ నిర్ధారణ ♦ డెంగ్యూ టెస్ట్ ♦ మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) ♦ అయోడిన్ టెస్ట్ ♦ వాటర్ టెస్టింగ్ ♦ హెపటైటిస్ బి నిర్ధారణ ♦ ఫైలేరియాసిస్ టెస్ట్ ♦ సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్ ♦ విజువల్ ఇన్స్పెక్షన్ ♦ స్పుటమ్ (ఏఎఫ్‌బీ) -
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజారోగ్యానికి అండగా నిలుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పూర్తయిన అనంతరం.. ఆస్పత్రులకు వెళ్లి ఫాలోఅప్ వైద్య సేవలు పొందడం కోసం రోగుల ప్రయాణాలకయ్యే ఖర్చును కూడా వారికి అందించబోతోంది. కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున.. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే చికిత్సల సంఖ్య(ప్రొసీజర్లు)ను వైఎస్ జగన్ ప్రభుత్వం 3,257కు పెంచింది. అలాగే ఆరోగ్యశ్రీ వైద్య వ్యయ పరిమితిని కూడా రూ.25 లక్షలకు పెంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత భరోసా కల్పించింది. అంతేకాకుండా 1,500కు పైగా ప్రొసీజర్లలో చికిత్సల తర్వాత వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి గాను రోగులకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద గరిష్టంగా నెలకు రూ.5 వేల వరకు సాయం అందిస్తోంది. ఇప్పుడు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. ఆరోగ్యశ్రీ పథకంలోని గుండె, మెదడు, ఆర్థో, పీడియాట్రిక్స్ విభాగాలకు సంబంధించిన 138 ప్రొసీజర్లలో ఏదైనా చికిత్స చేయించుకున్న తర్వాత.. ఏడాదిలోపు రోగులు 4సార్లు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే రోజే.. ఫాలోఅప్ సేవల కోసం రావాల్సిన తేదీలను వైద్యులు చెబుతుంటారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందేవారంతా నిరుపేద, మధ్యతరగతి ప్రజలే. వీరు ప్రయాణాల ఖర్చులకు వెనుకడుగు వేసి ఫాలోఅప్ వైద్య సేవలపై నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో సమస్య పూర్తిగా నయం కాకపోవడంతో భవిష్యత్‌లో మళ్లీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ 138 ప్రొసీజర్లలో ఏదైనా చికిత్స పొందిన వారికి ప్రయాణ చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఒక్కో కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన మందులూ అందజేత.. ఫాలోఅప్ కన్సల్టేషన్ సమయంలోనే రోగికి అవసరమైన మందులను కూడా ఆస్పత్రిలో అందజేస్తారు. ఏటా ఆరోగ్యశ్రీ కింద చేసే మొత్తం చికిత్సల్లో 10 శాతం మేర కేసుల్లో ఫాలోఅప్ కన్సల్టేషన్లు అవసరం ఉంటాయని వైద్య శాఖ అంచనా వేసింది. ఫాలోఅప్ కన్సల్టేషన్ వైద్య సేవల పొందేందుకు ప్రభుత్వం ఇలా అదనపు సాయం చేయడం వల్ల రోగులు పూర్తి స్థాయిలో కోలుకుంటారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇది ప్రజలకు గొప్ప మేలు చేస్తుందన్నారు. ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టాం.. అవసరం ఉన్న ప్రతి ఒక్క రోగి ఫాలోఅప్ కన్సల్టేషన్ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమలు చేయడానికి చర్యలు చేపట్టాం. మెడ్కో లాగిన్‌లో ఓ ప్రత్యేక ఆప్షన్ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన వ్యక్తి ఫాలోఅప్ కన్సల్టేషన్‌కు హాజరయ్యాడని నిర్ధారిస్తే.. ఆ రోగి, వారి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో రూ.300 చొప్పున నగదు జమ అవుతాయి. – డీకే బాలాజీ, సీఈవో, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
CM Jagan: ‘నాడి’ పట్టిన నేత
సాక్షి, గుంటూరు: 2019కి ముందు చిన్న జబ్బు చేసినా ప్రజలు పట్టణాలు, నగరాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నం. ఏకంగా రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కింద వివిధ కార్యక్రమాలను చేపట్టారు.గతంలో పడకేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి రెట్టింపు భరోసా కల్పిస్తున్నారు. పథకంలో ఏకంగా 3,257 వైద్య ప్రొసీజర్లు అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాక.. దేశంలో ఎక్కడా లేనట్లుగా వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి చికిత్సలు అందించే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు.నాడుప్రభుత్వాసుపత్రుల్లో శిశువులను ఎలుకలు పీక్కుతిన్న అధ్వాన పరిస్థితులు.. సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో సర్జరీలు చేసిన ఘటనలు.. విపరీతమైన సిబ్బంది కొరత.. వెరసి ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం అడుగంటింది.. నేడుసర్కారీ వైద్యం ప్రజలకు అత్యంత చేరువైంది. నాడు–నేడుతో ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా మారాయి. 53 వేలకుపైగా పోస్టుల భర్తీ. అటకెక్కిన ఆరోగ్యశ్రీ మళ్లీ పట్టాలెక్కింది. పిలవగానే పలికే అంబులెన్సులు. గ్రామస్థాయిలో ఆరోగ్య శిబిరాలు. ఇలా నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజారోగ్య ముఖచిత్రాన్ని సీఎం వైఎస్ జగన్ సమూలంగా మార్చేశారు. ఆరోగ్యశ్రీ బలోపేతం ఇలా.. ♦ 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 1,059 ♦ వైఎస్ జగన్ సర్కార్ కొత్తగా చేర్చిన ప్రొసీజర్లు 2,198 ♦ వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు. ♦ 2019 నుంచి ఈ ఏడాది నవంబరు వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం పొందినవారు– 37,40,525 మంది ♦ వీరికి వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం – రూ. 11,859.96 కోట్లు ♦ ఆరోగ్య ఆసరా కోసం వెచ్చించిన మొత్తం– రూ.1,309.90 కోట్లు ♦ నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం చేసిన ఖర్చు– రూ.13,169.86 కోట్లు ♦ ఆరోగ్యశ్రీకి 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు– రూ. 5,177.38 కోట్లు ♦ కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్ నెలల్లో ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. ♦ రెండు లక్షల మందికిపైగా కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించారు. ♦ కోవిడ్ బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.744 కోట్లు. ప్రజారోగ్యానికి రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష.. ♦ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శిబిరాలు12,423 ♦ మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసింది 86,690 మంది ♦ సొంత గ్రామంలోనే చికిత్స పొందినవారు 60.27 లక్షలు ♦ కేటరాక్ట్ సర్జరీలు నిర్వహించింది 78,292 మందికి నాడు–నేడులో పనులు.. ♦ రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు.. వీటి ద్వారా 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు గ్రామంలోనే అందుతున్నాయి. ♦ రూ.664.96 కోట్లతో పీహెచ్‌సీల బలోపేతం చేశారు. 983 పీహెచ్సీ భవనాలకు మరమ్మతులు చేయడంతోపాటు 150 కొత్త భవనాలను నిర్మించారు. కొత్తగా 176 పీహెచ్‌సీల ఏర్పాటు. ప్రతి పీహెచ్సీలో 63 రకాల వైద్య పరీక్షలు, 215 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. ♦ రూ. 374.61 కోట్లతో 528 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. వీటికోసం 184 భవనాలకు మరమ్మతులు, 344 కొత్త భవనాల నిర్మాణం. ♦ రూ.682 కోట్లతో 42 ఏరియా ఆస్పత్రులు, రూ.13 కోట్లతో ఎంసీహెచ్/జిల్లా ఆస్పత్రులు, రూ.528 కోట్లతో 121 సీహెచ్‌సీల బలోపేతం చేశారు. ♦ రూ.246 కోట్లతో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఐదు ట్రైబల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు.. ♦ రూ. 272 కోట్లతో కడపలో క్యాన్సర్, మెంటల్ హెల్త్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. ♦ రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేశారు. 17 వైద్యకళాశాలల ఏర్పాటుతో నూతన అధ్యాయం మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలను మెరుగుపరచడంతో పాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో తన ముద్ర చూపించారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా వైద్యవిద్యకు పెద్దపీట వేశారు.♦ రూ. 8,480 కోట్లతో 17 కొత్త కళాశాలల ఏర్పాటుద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు. ♦ 2023లో విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం వైద్యకళాశాలల ప్రారంభం. ♦ కొత్త వైద్య కళాశాలలో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి. ♦ వచ్చే విద్యాసంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని వైద్యకళాశాలల ప్రారంభం. ♦ ఇక మిగిలిన ఏడు కళాశాలలు 2025–26లో ప్రారంభించడానికి అనుగుణంగా చర్యలు. 108 సేవలకు ఊపిరి.. ఇక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సు సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి ఉండేది. ఈ పరిస్థితుల్లో మార్పునకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ 2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను ప్రారంభించారు. దీంతో.. ♦ ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చుచేశారు. ♦ గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్‌లను 2022 అక్టోబరులో అదనంగా కొన్నారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. ♦ వీటిలో 2.5 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఈ ఏడాది జూలైలో 146 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటి కొనుగోలుకు మరో రూ.34.79 కోట్లు ఖర్చుచేసింది. ♦ మరోవైపు.. గత ప్రభుత్వంలో కేవలం 292 ‘104’ వాహనాలు ఉండగా ఇందులో పాతవాటిని తొలగించి మొత్తం 910 మొబైల్ క్లినిక్ యూనిట్లను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి నిర్వహణ కోసం గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు భారీగా ఖర్చు పెడుతున్నారు. ♦ ఇలా అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు ఖర్చుచేశారు. వీటి నిర్వహణ కోసం ఏటా రూ.188 కోట్ల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ♦ ఈ లెక్కన పరిశీలించినట్లయితే నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు రూపంలో రూ.750 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లయింది. -
ఏపీ విధానాలు నచ్చాయి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పాలనా విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని అంతర్ రాష్ట్ర మండలి ప్రశంసించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారని కితాబిచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామాల్లో ప్రజల ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తున్నారని, రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్‌ను గ్రామాల్లోనే అందుబాటులోకి తెచ్చారని కొనియాడింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో భూ యజమానులకు కచ్చితమైన భూ హక్కు పత్రాలను అందజేస్తున్నారని..ఇదొక మంచి విధానమని (గుడ్ ప్రాక్టీస్) పేర్కొంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న గుడ్ ప్రాక్టీసెస్‌పై అంతర్ రాష్ట్ర మండలి ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. అందులో మన రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సచివాలయాలతో పాలనా వికేంద్రీకరణ ♦ ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన పాలనా వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తద్వారా వివిధ సంక్షేమ పథకాలతోపాటు పలు ప్రభుత్వ సేవలను పౌరుల ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అవసరాలను తీర్చడంలో ఈ వ్యవస్థ వన్‌స్టాప్ సొల్యూషన్‌గా నిలిచింది. ♦ గ్రామాల్లో 50 ఇళ్లకు.. పట్టణాల్లో 70–100 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున పని చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది చొప్పున, పట్టణ సచివాలయాల్లో 10 మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు తమ పరిధిలోని ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నారు. ఆరు అంచెల్లో ట్రాక్ చేయడం ద్వారా పథకాలకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు. ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా చెబుతూ దరఖాస్తు తిరస్కరిస్తున్నారు. సమగ్ర సర్వేతో భూ రికార్డుల శుద్ధీకరణ ♦ దశల వారీగా సమగ్ర భూ సర్వేను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. డ్రోన్స్ ద్వారా ఏరియల్ ఫ్లయింగ్‌తో సర్వే చేయడంతో పాటు గ్రౌండ్ ట్రూథింగ్, రికార్డుల తయారీ, క్షేత్ర స్థాయిలో ధృవీకరణ, రికార్డుల అప్డేషన్, సరిహద్దు వివాదాలపై అప్పీల్స్, సెక్షన్–13 నోటిఫికేషన్ ప్రచురణ, ఫైనల్ రికార్డ్ ఆఫ్ రైట్స్, స్టోన్ ప్లాంటేషన్, సబ్ డివిజన్స్.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లను క్రమానుగతంగా అమలు చేస్తున్నారు. ♦ సరిహద్దుల ఆన్లైన్ పర్యవేక్షణ, జోనల్, నిబంధనలు, భూమిపై భౌతిక మార్పులతో సహా సమగ్ర భూసర్వే చేపట్టారు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా కచ్చితమైన భూ హక్కు పత్రాలను భూ యజమానులకు పంపిణీ చేస్తున్నారు. తద్వారా భూ రికార్డులు క్లీన్ అవుతాయి. ఇది చాలా మంచి విధానం. ‘ఫ్యామిలీ డాక్టర్’తో ప్రజల్లో నిశ్చింత ♦ డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టం చేసింది. ఇందులో భాగంగా రోగుల ఇంటి వద్దే వైద్య సేవలను అందిస్తోంది. తద్వారా చిన్న చిన్న జబ్బులకు పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం తప్పిందని ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమం. ♦ ఆయుష్మాన్ భారత్ హెల్త్–వెల్నెస్ సెంటర్ల ఏకీకరణ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. ♦ గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పన డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. ♦ ప్రతి విలేజ్ క్లినిక్‌లో ఒక కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ముగ్గురు నలుగురు ఆశా వర్కర్లను నియమించారు. ♦ విలేజ్ క్లినిక్స్ భవనాలను 932 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వార్టర్‌తో సహా నిరి్మంచారు. వీటిల్లో 105 రకాల మందులు, 14 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ♦ ప్రతీ పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రతీ పీహెచ్‌సీకి విలేజ్ క్లినిక్స్‌ను అనుసంధానించారు. ♦ 104 మెబైల్ మెడికల్ యూనిట్‌తో సహా ఫ్యామిలీ డాక్టర్ సేవలను అందిస్తున్నారు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఓపీ సేవలను అందిస్తే.. మరో డాక్టర్ విలేజ్ క్లినిక్స్‌కు హాజరవుతున్నారు. ♦ ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సాధారణ ఓపీలతో పాటు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నిర్వహణ, యాంటినేటల్ కేర్.. తల్లులు, నవజాత శిశువులకు పోస్ట్‌నేటల్ కేర్, అంగన్వాడీలు, పాఠశాలల సందర్శన, రక్తహీనత పరీక్షలు, పర్యవేక్షణ, మంచానికే పరిమితమైన రోగుల ఇళ్ల సందర్శన, పంచాయతీల సమన్వయంతో గ్రామ పారిశుధ్య పర్యవేక్షణ జరుగుతోంది. ♦ ఈ ఏడాది మే 3 నాటికి గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలను 97,11,224 మంది ప్రజలు వినియోగించుకున్నారు. రైతులకు అండగా ఆర్బీకేలు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి విధానమని, తద్వారా ప్రభుత్వం రైతుల సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్‌ను ఉంటున్న ఊళ్లలోనే పొందే అవకాశం కల్పిందని అంతర్రాష్ట్ర మండలి నివేదిక పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు వారికి పనికొచ్చే ఇతర సేవలనూ ఆర్బీకేలు అందిస్తున్నాయని తెలిపింది. అన్ని పంటలను ఈ–క్రాప్ ద్వారా నమోదు చేస్తూ, వాస్తవ సాగుదారు సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకుంటోందని.. తద్వారా నిజమైన సాగుదారులకు వైఎస్సార్ సున్నా వడ్డీ, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీలను అందిస్తోందని ప్రశంసించింది. రైతుల నుంచి పంటల కొనుగోలు కూడా ఆర్బీకేల్లోనే చేపడుతోందని తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదాతలను అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తోందని కొనియాడింది. -
ఆరోగ్యం మీ హక్కు!
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఈ విషయంలో సంతృప్తి కరంగా సేవలందించేలా అడుగులు వేస్తోంది. పేదలందరికీ ఆరోగ్యం అనేది హక్కుగా ఉండాలన్న లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా రోగులను చేయి పట్టుకుని నడిపిస్తూ వారికి నాణ్యమైన సేవలతోపాటు మందుల నుంచి చికిత్స వరకు అందించే బాధ్యతను భుజానకెత్తుకుంది. గతంలో చికిత్స పొందిన వారి ఆరోగ్యంపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటూనే మందుల విషయంలో రాజీపడకుండా ఎంత ఖరీదైనవి అయినా సరే వారికి అందించాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని.. ఈ విషయంలో వాళ్లు అప్పులపాలు కాకుండా ఉండేందుకు వీలుగా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా బలోపేతం చేసింది. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేస్తూ ప్రజలు నచ్చేలా.. ప్రభుత్వాన్ని మెచ్చేలా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతీ ఒక్కరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని సంకల్పించారు. సేవలు వినియోగించడం గురించి తెలియని వ్యక్తి అంటూ రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,42,34,464 కొత్త కార్డులను ప్రింట్ చేయిస్తున్నారు. ఈనెల 18 నుంచి వీటిని అందజేస్తారు. మరోవైపు.. ఆరోగ్యశ్రీ యాప్ ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దిశ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకునేలా కార్యక్రమం చేపడుతోంది. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో ఈ రెండు యాప్‌లు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య సురక్షపై నిరంతర సమీక్ష మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా యజ్ఞంలా సాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూతనందించే కార్యక్రమాన్ని నిరంతరం సమీక్షించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టనుంది. అందులో మొదటిది.. ► సురక్షలో గుర్తించిన రోగులకు మందులు అందించడం, కాలానుగుణంగా ఆరోగ్యంపై ఫాలోఅప్ చేయడం.. ► రెండోది.. గతంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసుకున్న వారికి అవసరమైన మందులు, చికిత్సపై ఫాలోఅప్ సేవలు అందించడం.. ► మూడోది.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందిస్తున్న మందులను కోర్సు ముగిసేలోపే వాటిని అందుబాటులో ఉంచడం. ఈ మూడు ప్రధాన అంశాలపై నిరంతరం సమీక్ష చేయనుంది. ► అలాగే, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మందులపై ప్రత్యేక శ్రద్ధ.. ఇక ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేదా? అన్న దానిపైనా దృష్టి కేంద్రీకరించనుంది. ఈ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. అలాగే, సురక్షలో గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స అవసరమున్న రోగులకు రవాణా ఖర్చుల కింద రూ.500 చొప్పున ఇవ్వడమే కాక.. సురక్ష క్యాంపుల నుంచి ఆస్పత్రులకు రిఫర్ చేసి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఇన్పేషెంట్లుగా చేరిన వారిని మరోసారి డాక్టర్ల బృందం పరిశీలించేలా.. శిబిరాల్లో ఇంకా వైద్యం అందాల్సిన వారికి వెంటనే నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోనుంది. చైనా వైరస్‌పైనా అప్రమత్తం చైనాలో హెచ్9ఎన్2 వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా మన దగ్గర ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖను సీఎం జగన్ అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల వారీగా ఉన్న మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. మందులు, ఆక్సిజన్, పడకల విషయంలో అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడా వైద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీలు లేకుండా చూడాలని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సూచించారు. 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. అంతకుముందు.. వైద్యశాఖలో అమలుపరుస్తున్న పలు కార్యక్రమాల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు నెలాఖరు వరకూ 12,42,118 మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించుకున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 24.64 శాతం చికిత్సలు పెరిగాయన్నారు. అలాగే.. ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచేలా చూస్తున్నామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, పురోగతిని కూడా వారు సీఎంకు వివరించారు. ► కంటి చికిత్సలు కాకుండా ఇతర వైద్య చికిత్సలు అవసరమైన వారు 86,690 మంది ఉన్నారని.. ► ఇందులో 73,602 మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్సలు అందేలా చర్యలు తీసుకున్నామని.. ► చాలామందికి పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు మందులు ఇచ్చారని.. అనంతరం తదుపరి చికిత్స కోసం 16,128 మందిని ఆస్పత్రుల్లో అడ్మిట్ చేశామని చెప్పారు. ► వీరిలో 15,786 మందికి సర్జరీలు, ట్రీట్మెంట్లు పూర్తయ్యాయి. ► 78,292 మందికి కంటిచికిత్సలు అవసరమని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా గుర్తించామని అధికారులు వివరించారు. ► ఇక కంటిచూపు సంబంధిత సమస్యలున్న 13,614 మందికి ఇప్పటికే కేటరాక్ట్ సర్జరీలు చేయించామన్నారు. 5,26,702 మందికి కంటి అద్దాలు అందిస్తున్నామన్నారు. ► క్యాంపుల్లో గుర్తించిన రోగులకు సకాలంలో మందులు అందేలా అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. జనవరి నుంచి రెండోదశ ఆరోగ్య సురక్ష.. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలంలో ప్రతీవారం ఒక ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాటుచేసేలా ప్రణాళిక రచించామన్నారు. క్యాంపుల్లో స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని.. మందులు, వైద్య పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఇలా 110 మున్సిపాలిటీల్లోని పట్టణ, నగర ప్రాంతాలను కవర్ చేస్తూ వారంలో 162 క్యాంపులు ఉంటాయన్నారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రివెంటివ్ కేర్ మరింత బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రివెంటివ్ కేర్‌పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారణకు చర్యలు చేపడుతున్నారు. ప్రివెంటివ్ కేర్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్(బీపీయూహెచ్)లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 334 యూనిట్లు నిర్మించాల్సి ఉండగా, తొలి దశలో 166 యూనిట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు భవన నిర్మాణానికి రూ.50 లక్షలు, వైద్య పరికరాల కోసం రూ.30 లక్షలు చొప్పున రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్మాణాలన్నీ చేపడుతున్నారు. ఇప్పటి వరకూ 141 యూనిట్ల భవన నిర్మాణాలకు టెండర్లు ఖరారు కాగా, 94 చోట్ల పనులు కొనసాగుతున్నాయి. మండల స్థాయి సర్వేలెన్స్ యూనిట్లుగా.. పీహెచ్సీ ప్రాంగణాల్లో నిర్మిస్తున్న బీపీయూహెచ్‌లు మండల స్థాయి సర్వేలెన్స్ యూనిట్లుగా వ్యవహరిస్తాయి. వీటిల్లో హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(హెచ్ఎంఐఎస్) యూనిట్‌తోపాటు పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సెమీఆటో అలైజర్, సెల్ కౌంటర్, ట్రూనాట్, అల్ట్రాసౌండ్, హెచ్‌బీ1సీ పరికరాలు ల్యాబ్‌లలో ఉంటాయి. కరోనా వైరస్, డయేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు వ్యాపించినప్పుడు ఈ యూనిట్ల ద్వారా సర్వేలెన్స్ ఉంచుతారు. ఎపిడమాలజిస్ట్‌లతోపాటు విజిలెన్స్ సెల్ కూడా అందుబాటులోకి వస్తాయి. యూనిట్లన్నింటినీ జిల్లా, బోధనాస్పత్రుల్లోని ల్యాబ్‌లకు అనుసంధానం చేస్తారు. -
జగనన్న ఏర్పాటు చేసిన వైయస్ఆర్ హెల్త్ సెంటర్ వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుంది..!
-
గతం మర్చిపోతే ఎలా!?
సాక్షి, అమరావతి: ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు బుకాయించడంలో రామోజీ దిట్ట. అలా చేయకపోతే ఆయన కంటి మీద కునుకు పట్టదు. ఇలా బుకాయించడంలో ఆయన గిన్నీస్‌బుక్ రికార్డు కూడా ఇప్పటికే నెలకొల్పి ఉంటారు. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం ఆయన విషం కక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి. తాజాగా.. సీఎం జగన్ ప్రభుత్వంపై ఎప్పటిలాగే ఆయన మరోమారు తన కడుపుమంటను చాటుకున్నారు. గతంలో తన ఆత్మబంధువు చంద్రబాబు పాలన ఎంతో ఘనంగా ఉండేదని, ఇప్పుడే ఏమీ జరగడం లేదన్నట్లుగా ‘మొహం చాటేసిన సీఎం’ అంటూ ఈనాడులో ఆదివారం ఓ అబద్ధాల మాలికను అల్లారు. అప్పట్లో ప్రభుత్వాసుపత్రుల్లో అందే సేవలకూ, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అందుతున్న సేవలకూ మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుండడంతో దిక్కతోచని స్థితిలోనే తాజా కథనం రాసినట్లు దానిని చదివిన వారికి ఇట్టే అర్థమవుతుంది. విప్లవాత్మక మార్పులపై విషం.. నిజానికి.. సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తుండగా, అందులో ఐదు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవైపు.. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నాడు–నేడు కింద అభివృద్ధి పరచడంతోపాటు ఎక్కడా ఖాళీల్లేకుండా 53,126 సిబ్బందిని వైద్య, ఆరోగ్య శాఖలో కొత్తగా నియమించారు. గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన విలేజ్ క్లినిక్ వ్యవస్థ, దేశంలోనే పలువురి ప్రశంసలు అందుకున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కొత్త వైద్య కళాశాలలుం ఇలా ప్రజారోగ్య రంగంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి విప్లవాత్మక మార్పు పైనా రాజగురువు వరుసగా తప్పుడు కథనాలు రాస్తున్నారు. తాజా కథనం కూడా ఈ కోవకు చెందినదే. నిత్యం 2,204 వాహనాల పరుగులు.. గతంలో ఎన్నడూ లేనట్లుగా రాష్ట్రంలో ‘108’ వాహనాలు 768 ఉన్నాయి. మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ) ‘104’లు 936, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ కింద 500 వాహనాలు నిత్యం పరుగులు పెడుతున్నాయి. ఇలా మొత్తం 2,204 వాహనాల ద్వారా వేగవంతమైన, ప్రజల ప్రాణాలను కాపాడే వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. ఇది చూసి ప్రభుత్వానికి ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుందోనని తొలి నుంచీ ఈ సేవలపై రామోజీ విషం కక్కుతూనే ఉన్నారు. ఆదివారం నాటి కథనంలోనూ ఆయన అలాగే తన అక్కసును వెళ్లగక్కారు. నాడు దైన్యం.. నేడు ధైర్యం.. గత టీడీపీ ప్రభుత్వంలో 108, 104 సేవలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అత్యవసర సమయంలో ఫోన్‌చేస్తే 108 అంబులెన్సు వస్తుందో రాదో తెలియని దుస్థితి. అయితే, అప్పట్లో సీఎం కుర్చీలో తమ బాబు ఉన్నాడు కాబట్టి రామోజీకి సహజంగా ఇవేమీ కనపడేవి కావు. టీడీపీ ప్రభుత్వంలో దైన్యంగా మారిన ఈ సేవలను సీఎం జగన్ పట్టాలెక్కించి ప్రజల్లో ధైర్యం నింపారు. మరోవైపు.. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి 108 అంబులెన్సులు 531 ఉండగా వీటిలో 336 వాహనాలు అరకొరకగా రోడ్లపై కనిపించేవి. అంటే.. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించిన సీఎం జగన్ 2020 జూలై 1న 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చుచేశారు. 2022 అక్టోబరులో అదనంగా మరో 20 అంబులెన్సులను (108 వాహనాలు) గిరిజన ప్రాంతాలకు కేటాయించారు. వీటి కోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. అంతేకాక.. ఈ ఏడాదే 2.5 లక్షల కిలో మీటర్లకుపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో 146 కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టారు. వీటి కోసం రూ.34.79 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేసింది. ఈ లెక్కన 2020 నుంచి ఇప్పటివరకు కొత్త అంబులెన్సుల కొనుగోలుకు రూ.135.05 కోట్లు ఖర్చుచేసినట్లయింది. ‘108’ల కోసం ఏటా రూ.188 కోట్ల ఖర్చు ఇక ఈ అంబులెన్స్‌ల నిర్వహణ కోసం నెలకు రూ.14.39 కోట్లు చొప్పున ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108 అంబులెన్సుల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. వీటికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు వెచ్చిస్తోంది. అంటే మొత్తంగా ఒక ఏడాదిలో 108 వాహనాలు కోసం చేస్తున్న ఖర్చు రూ.188.56 కోట్లు. ఇదంతా పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో భాగంగానే జరుగుతోంది. ఇంత చిత్తశుద్ధితో 108 సేవలు అమలుచేస్తుంటే రామోజీరావు బురద జల్లే రాతలు రాయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అర్బన్ ప్రాంతాల్లో నిర్దేశించుకున్న 15 నిమిషాలు, రూరల్ ప్రాంతాల్లో నిర్దేశించుకున్న 20 నిమిషాల్లోపే 108 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఇదీ 108 సేవల సమర్థతకు నిదర్శనం. సొంత ఊర్లలోనే ‘104’ సేవలు.. ఇక సీఎం జగన్ ప్రభుత్వంలో 104 సర్వీసుల స్వరూపానికి పూర్తిగా మార్పులు చేశారు. జూలై 2020లో 656 ఎంఎంయూ (104)లను సీఎం జగన్ ప్రారంభించారు. ఇందుకు రూ.108 కోట్లు ఖర్చుచేశారు. రూ.4 కోట్లతో మరో 20 వాహనాలను గిరిజన ప్రాంతాల్లో సేవల కోసం కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుచేయడానికి వీలుగా అదనంగా 260 (104) వాహనాలను ప్రవేశపెట్టారు. వీటికోసం రూ.58 కోట్లు వెచ్చించారు. ఈ మొత్తం 936 మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా కోట్లాది మంది ప్రజలు తమ సొంత ఊర్లలోనే వైద్యసేవలు పొందారు. ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నా.. 108, 104 సిబ్బందికి ఒప్పందం ప్రకారం సర్వీస్ ప్రొవైడర్ నుంచి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిని కూడా రామోజీ తట్టుకోలేకపోతున్నారు. గత సంవత్సరం ఉద్యోగులకు నిర్దేశించిన బేసిక్ పే పై 8 శాతం ఇంక్రిమెంట్‌తో జీతాలు పెంచేలా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా ఇంక్రిమెంట్ ఇచ్చి, ఆ ఇంక్రిమెంట్ ఎరియర్స్‌ను చెల్లించేలా ఆదేశాలిచ్చారు. ఉద్యోగులకు ప్రతినెలా జీతాలను జమచేయడంలో ఎప్పుడన్నా జాప్యం జరిగినా వెంటనే వేతనాలు అందేలా చర్యలు ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే సెప్టెంబరు వరకూ వేతనాలు పూర్తిగా చెల్లించారు. అయినా జీతాలు ఇవ్వలేదని ఈనాడు పెడబొబ్బలు పెడుతోంది. అలాగే, అక్టోబరు నెల వేతనం నవంబరులో ఇస్తారు. ఇవన్నీ ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా రామోజీ రోత రాతలు లేనిపోని సమస్యలను సృష్టించేందుకు తప్ప మరొకటి కాదు. ‘తల్లీబిడ్డ’ సేవల్లోనూ ఎంతో మార్పు ► గతంలో కేవలం 279 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వాటి సంఖ్య 500కు పెరిగింది. ► అప్పట్లో తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ పేరిట ఓమ్నీ వాహనాలను వినియోగించేవారు. ఒక్కో దానిలో ఇద్దరు గర్భిణులను తరలించేవారు. ఏసీ సదుపాయం కూడా లేదు. ► కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో విశాలమైన ఎకో మోడల్ ఏసీ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో దాంట్లో ఒకరిని మాత్రమే తరలిస్తున్నారు. ► గత ప్రభుత్వ హయాంలో ఒక ట్రిప్పునకు కేవలం రూ.499లు మాత్రమే ఖర్చుచేయగా.. ఈ ప్రభుత్వం రూ.895లు వెచ్చిస్తోంది. -
ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాకారం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): దేశంలో ఎక్కడా లేని పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నాయని పలువురు వైద్యులు, వివిధ రంగాల నిపుణులు కొనియాడారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య రంగాల్లో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దే వైద్యం అందుతోందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం దేశంలో ఎక్కడా లేదన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, బెటర్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులో శుక్రవారం ‘నాడు–నేడు ఆంధ్రప్రదేశ్‌లో వైద్యం, ఆరోగ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వివిధ రంగాల నిపుణులు మాట్లాడారు. బెటర్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో ఎవరేమన్నారంటే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన ఆపరేషన్లు రాష్ట్రంలో వైద్య సేవలను నీతి ఆయోగ్ సైతం ప్రశంసించడం అభినందించదగ్గ విషయం. వైద్య రంగంలో ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధిక ఆస్పత్రులతో ఏపీ అగ్రస్థానంలో ఉంది. అలాగే అత్యధిక బెడ్లు కలిగిన రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో నిలవడం గర్వకారణం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఆరోగ్య రంగంలో ఏపీకి 8 జాతీయ అవార్డులు, రెండు అంతర్జాతీయ అవార్డులు రావడం హర్షించదగ్గ విషయం. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ కొత్త వైద్య కళాశాలలతో వైద్య రంగం బలోపేతం గతంలో ఆస్పత్రుల్లో మందులు, వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ప్రజల ఇళ్లకే వెళ్లి వైద్యులు పరీక్షలు నిర్వహించే స్థాయికి పరిస్థితి మారింది. కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించి వైద్య రంగాన్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు, బెటర్ ఆంధ్రప్రదేశ్ నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎన్నో సంస్కరణలు నాడు–నేడు కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య, విద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్నారు. పేదవారికి సైతం ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు మంచి చేశారో వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. –బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, సాయి భాస్కర్ ఆస్పత్రుల అధినేత -
ఒక్కో పోస్టుకు 15 మంది పోటీ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) పోస్టులకు డిమాండ్ నెలకొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 250 సీఏఎస్ వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో 3,906 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితాను ఇప్పటికే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. బుధవారంతో ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇన్–సర్వీస్ కోటాలో 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ చదివేందుకు వెళ్లే వైద్యుల స్థానాలను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం పోస్టుల భర్తీ చేపడుతోంది. ఖాళీ అయ్యే పోస్టులను అంచనా వేసి వైద్యులు రిలీవ్ అయి వెళ్లే సమయానికి కొత్తవారిని అందుబాటులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్, ఇతర పీహెచ్సీ సేవలకు అంతరాయం కలగకుండా ముందు చూపుతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది. -
ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్...
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు 45 ఏళ్లు నిండిన వారిలో కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్, ఇప్పుడు యుక్త వయస్సు వారిలో కూడా గుర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రొమ్ము క్యాన్సర్‌ను వైద్యుడి వద్దకు వెళ్లకుండానే సెల్ఫ్ చెక్ చేసుకోవడం ద్వారా గుర్తించే అవకాశం ఉన్నా, చాలా మంది రెండు, మూడు దశల వరకూ గుర్తించలేక పోతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కొంత వరకూ సత్ఫలితాలు ఇస్తున్నా, ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో 50 ఏళ్లు దాటిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతుండగా, మన దేశంలో 40 ఏళ్లు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చాలా అరుదుగా 30 ఏళ్ల వయస్సులోనూ, పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతోంది. ప్రభుత్వం సైతం క్యాన్సర్ వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. రాష్ట్రంలో కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి, అత్యుత్తమ చికిత్సలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా వివిధ సంస్థలు ప్రజల్లో దీనిపై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’తో మేలు.. గ్రామీణ ప్రాంత మహిళలకు కుటుంబ డాక్టర్ కార్యక్రమం వరంలా మారింది. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామానికే వైద్యులు వెళ్లడం, ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా స్పెషలిస్టు వైద్యులు సైతం వెళ్లడంతో గ్రామీణ మహిళలు ఆరోగ్య చెకప్ చేయించుకుంటున్నారు. అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే మమోగ్రామ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇలా ఇప్పటికే అనేక మందికి ప్రాథమిక దశలో గుర్తించారు. అంతేకాదు శస్త్ర చికిత్స తర్వాత కూడా వారిని ఫాలోఅప్ చేస్తూ మందులు అందజేస్తున్నారు. సెల్ఫ్ చెక్ ఇలా.. ► పీరియడ్ వచ్చి, ఆగిన ఐదు రోజుల తర్వాత రొమ్ము సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ► రొమ్ముపై గింజంత సైజులో కణితులు ఏమైనా వచ్చాయా, రొమ్ముపై చర్మం రంగు మారిందేమో చూడాలి. ► చంకల్లో గడ్డలు లాంటివి వచ్చాయా అనే విషయాలను మహిళలు చెక్ చేసుకోవాలి. ► రొమ్ముపై ఏమైనా కాయలు ఉన్నాయా, రొమ్ము టైట్ అవుతుందా, అల్సర్స్ వచ్చాయా, చనుమొనల నుంచి రక్తకారుతుందా వంటి అంశాలను సెల్ఫ్‌చెక్ చేసుకోవచ్చు. ► నొప్పిలేని కణితులను క్యాన్సర్‌గా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలి. వీరికి రొమ్ము క్యాన్సర్ రావచ్చు.. లేటు వయస్సులో పిల్లలు పుట్టిన వారికి, బిడ్డకు పాలివ్వని తల్లులకు, వంశపారంపర్యంగా, జీవనశైలి, పన్నెండేళ్లలోపు రజస్వల కావడం, రెడ్‌మీట్ తినేవారిలో, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. ఊబకాయంతో ఉన్న మహిళలు, మోనోపాజ్ చేరే సమయంలో వచ్చే దుష్ఫలితాలకు వాడే మందులు కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ రావొచ్చు. పెళ్లిచేసుకోని మహిళలకు, పిల్లలు లేని మహిళలకు, ధూమపానం, ఆల్కాహాల్ తాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలపై అవగాహన ఉండాలి.. రొమ్ము క్యాన్సర్ లక్షణాలపై ప్రతి మహిళా అవగాహన పెంచుకోవడం ద్వారా తొలిదశలో గుర్తించవచ్చు. మన దేశంలో 40 ఏళ్లు దాటిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతొంది. మహిళలకు సోకే క్యాన్సర్లలో 70 శాతం మందిలో బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు ఉంటున్నాయి. ప్రతి మహిళ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. రొమ్ముపై నొప్పిలేని కణితి వచ్చినా, చంకలో గడ్డలు ఏర్పడినా వైద్యుడిని సంప్రదించాలి. రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. – డాక్టర్ ఎన్. సుబ్బారావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు ప్రత్యేక దృష్టి.. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో నాన్ కమ్యూనికల్ డిసీజెస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. అందులో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి లక్షణాలతో వచ్చిన వారిని గుర్తించి స్క్రీనింగ్ కోసం పంపుతున్నాం. అంతేకాకుండా ఆయా వ్యాధులతో చికిత్స పొందుతున్న వారిని సైతం మానిటరింగ్ చేసి మందులు అందిస్తున్నాం. రొమ్ముపై కణితులు, రొమ్ములో గడ్డలు ఉన్నట్లు మహిళలు వస్తే వారి లక్షణాలను పరిశీలించి నిర్ధారణ పరీక్షల కోసం పంపుతున్నారు. అన్ని పరీక్షలు ప్రభుత్వాస్పత్రిల్లో ఉచితంగా నిర్వహిస్తున్నాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్జిల్లా -
పథకాల అమలులో ఏపీ ప్రామాణికం
సాక్షి, బెంగళూరు: సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే గొప్ప ప్రామాణికంగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించొచ్చనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రముఖ మీడియా గ్రూప్.. సౌత్ ఫస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో శనివారం దక్షిణ్ డైలాగ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ భారత రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై మదింపు జరిగింది. దీనికి ఆయా రాష్ట్రాల ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలకు ఒక అభివృద్ధి నమూనా ఉందా? ఒకవేళ ఉంటే అది సరైన దారిలోనే ఉందా? అనే అంశాలపై చర్చ నిర్వహించారు. అనేక సంస్కరణలకు శ్రీకారం.. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. మన దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ముందుకు దూసుకెళుతోందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ప్రతి పథకం ఆయన ఆలోచన నుంచి వచ్చేందేనన్నారు. అమ్మఒడి ద్వారా ఏటా 44.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థుల డ్రాపవుట్లు నివారించి అక్షరాస్యత శాతాన్ని పెంచగలిగామన్నారు. నాలుగేళ్లలో ఈ పథకానికి తమ ప్రభుత్వం ఏకంగా 26,067.28 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. అలాగే రాష్ట్రంలోని 46 వేల పాఠశాలలను నాడు–నేడు కింద రూ.17,805 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన కార్యక్రమాల ద్వారా 1 నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. నిజమైన మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటివరకు 7.98 లక్షల మహిళా గ్రూపులకు రూ.19,178.17 కోట్ల రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. అలాగే వైఎస్సార్ చేయూత కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున అందించిందన్నారు. 30 లక్షల మందికిపైగా మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా కట్టి ఇస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ రైతు భరోసా, వాహన మిత్ర , నేతన్న నేస్తం.. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీ ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో తమ ప్రభుత్వం కనీవినీ ఎరుగని సంస్కరణలు ప్రవేశపెట్టిందని రజిని తెలిపారు. రాష్ట్రంలోని అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేశామని చెప్పారు. దేశంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీయేనని వెల్లడించారు. రూ.16 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. -
వైద్యరంగంలో ఏపీ సంస్కరణలు భేష్
సాక్షి, అమరావతి/మూలపాడు (ఇబ్రహీంపట్నం): రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవల కల్పన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని జర్మనీకి చెందిన అంతర్జాతీయ సంస్థ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జె–పాల్) ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఈ బృందం గురువారం మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్‌తో సమావేశమైంది. అంతకుముందు బృందం సభ్యులు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలును పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు, ప్రజలను అడిగి వైద్యసేవలు అందుతున్న తీరు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే, ఇతర కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం కమిషనర్‌తో సమావేశమయ్యారు. వైద్య, ఆరోగ్యరంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని సంస్థ ప్రతినిధులకు కమిషనర్ నివాస్ వివరించారు. నాడు–నేడు కింద ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, 17 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు సహా పలు అంశాలను తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జె–పాల్ బృంద సభ్యులు ప్రొఫెసర్ నిక్కిల్ సుదర్శనన్ (మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ), ప్రొఫెసర్ హర్షా తిరుమూర్తి (పెన్సిల్వేనియా యూనివర్సిటీ) మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణకు ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు మంచి నిర్ణయమని తెలిపారు. ఆరోగ్య సురక్ష కింద హెల్త్ క్యాంప్‌లు నిర్వహించి స్పెషలిస్ట్ వైద్య సేవల కల్పన అభినందనీయమని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ రాష్ట్ర నోడల్ అధికారి టి.రమేష్, ఎన్టీఆర్ జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, మూలపాడు పీహెచ్సీ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవల్లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలు చాలా బాగున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్ష మంగ్లా చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని, ఈ విధానం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు వైద్యుల సేవలు అందించడం శుభపరిణామం అని చెప్పారు. హర్ష మంగ్లా శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య కార్యక్రమాలు, వైద్య శాఖ పని తీరు వంటి పలు అంశాలపై ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. వైద్య సేవలు చేరువ ఎఫ్డీసీ ఓ వినూత్న కార్యక్రమం. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు చేరువ అవుతాయి. రాష్ట్రంలో వంద శాతం విలేజ్ క్లినిక్స్‌ను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయడం చాలా మంచి విషయం. వీటి ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. గ్రామాల్లోనే 12 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వీటిలో సేవలు అందిస్తున్నారు. వెల్నెస్ సెంటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు, చరిత్ర వీటిలో ఉంటాయి. వీటి ఆధారంగా వైద్య సేవలు అందుతాయి. ప్రజలకు డిజిటల్ వైద్య సేవల కల్పనే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం అమలులోనూ ఏపీ ప్రభుత్వం ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. అవయవ దానానికి ముందుకు రావాలి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ, అవయవ దానం క్యాంపెయిన్, రక్తదానం క్యాంప్‌లు వంటి నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అవయవ దానం, రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. అవయవదానానికి ఏపీలో చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. ప్రజలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ కార్డుల జారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. -
ప్రజారోగ్యానికి ‘రక్ష’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా చేపడుతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములయ్యారని తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం ఫ్యామిలీ డాక్టర్ విధానం రూపంలో ప్రివెంటివ్ కేర్‌లో నూతన ఒరవడికి నాంది పలికాం. తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపంలో ప్రివెంటివ్ కేర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో ఎవరూ, ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మనం ధైర్యంగా, సాహసోపేతంగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను, 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తేగలిగాం. వీటిలో పూర్తి స్థాయిలో వనరులన్నీ సమకూర్చాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేలా చర్యలు చేపట్టాం. పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు, ఒక 104 వాహనాన్ని సమకూర్చాం. పీహెచ్‌సీల్లోని వైద్యులకు ఆ మండలంలోని గ్రామాలను విభజించి వైద్య సేవలు అందించేలా చూస్తున్నాం. ఇద్దరు వైద్యుల్లో ఒకరు పీహెచ్సీలో సేవలు అందిస్తుంటే మరొకరు 104 ఆంబులెన్స్‌లో తనకు కేటాయించిన గ్రామానికి వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఇలా తనకు కేటాయించిన గ్రామాలను ప్రతి వైద్యుడు నెలలో రెండు సార్లు సందర్శిస్తున్నారు. క్రమం తప్పకుండా ఓ గ్రామానికి వైద్యుడు వెళ్లడం వల్ల ఆర్నెల్లలో గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఆయా గ్రామాల్లో ప్రజలకు వైద్య పరంగా ఏ అవసరాలున్నాయనేది గుర్తించి మెరుగైన వైద్య సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. అప్పులపాలయ్యే పరిస్థితులు రాకుండా దురదృష్టవశాత్తూ ఏదైనా జబ్బు బారినపడితే పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అప్పుల పాలయ్యే పరిస్థితులు రాకుండా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అండగా ఉంటున్నాం. టీడీపీ హయాంలో కేవలం 1,056 ప్రోసీజర్స్‌కు పరిమితం కాగా ఇప్పుడు 3256కు ప్రొసీజర్స్‌ను పెంచాం. గతంలో 915 నెట్వర్క్ ఆసుపత్రులుంటే ఈ రోజు 2,200 పైచిలుకు ఆస్పత్రులున్నాయి. ప్రజలు వైద్యం కోసం అప్పులపాలు కాకుండా ఉండాలనే ఈ చర్యలన్నీ చేపట్టాం. ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం. ఆ ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలున్నా గుర్తించేలా సర్వే నిర్వహిస్తున్నాం. ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు చేసి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నాం. అనంతరం గ్రామంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్టు డాక్టర్లతో చికిత్స అందిస్తున్నాం. రోగం నయం అయ్యే దాకా సంబంధిత వ్యక్తిని చేయిపట్టి నడిపిస్తాం. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆరోగ్య ఆసరాపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు ఏరకంగా పొందాలనే విషయాలను వివరించాలి. వైద్య సేవలు పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు ఎలా చేయాలో కూడా తెలియచేయాలి. అవసరమైన మందులు అందేలా, ఆ మేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్ చేయాలి. క్యాన్సర్, డయాలసిస్ రోగులకు ఖరీదైన మందులు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉచితంగా అందిస్తాం. ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి ఐదు దశలను క్రోడీకరిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఇప్పటికే అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాం. గ్రామస్ధాయి నుంచి నెట్ వర్క్ అంతా కనెక్ట్ అయింది. ప్రతి ఒక్కరు తమ విధులను బాధ్యతగా భావించాలి. కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా), అసోసియేషన్ ఆఫ్ నెట్ వర్క్ హాస్పిటల్స్ ఆఫ్ ఏపీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) భాగస్వామ్యం అయ్యాయి. వీరందరికీ నా తరపున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఐదు దశలుగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ మొదటి దశ: మొదటి దశ ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు, సీఎం జగన్ ప్రభుత్వం పట్ల అభిమానం, ప్రేమ ఉన్న వారెవరైనా ఇందులో పాల్గొనవచ్చు. వీరు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. ఏ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు? ఎలాంటి వైద్య సేవలు అందిస్తారు? అనే వివరాలు ప్రజలకు చెప్పాలి. అనంతరం సీహెచ్‌వో, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఆయా ఇళ్లకు వచ్చి ఆరోగ్యంపై వాకబు చేస్తారని, ఏడు రకాల టెస్టులు నిర్వహించేందుకు వీలుగా వారి వద్ద కిట్స్ ఉంటాయని తెలియచేయాలి. రెండో దశ: గ్రామంలోని విలేజ్ క్లినిక్‌లో ఒక భాగానికి సీహెచ్‌వో, మరొక భాగానికి ఏఎన్ఎం బాధ్యత తీసుకుని ఆశావర్కర్లు, వలంటీర్లతో మమేకమై ప్రతి ఇంటిని జల్లెడ పడతారు. ప్రతి ఇంట్లోనూ బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేపడతారు. ఇలా ఏడు రకాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్లి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై వాకబు చేస్తారు. ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తారు. స్మార్ట్ ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి మందులు ఇవ్వడమే కాకుండా మ్యాపింగ్ చేసి పుడ్ సప్లిమెంటేషన్ కోసం చర్యలు చేపడతారు. మూడో దశ: గ్రామం, పట్టణంలో హెల్త్ క్యాంపునకు మూడు రోజుల ముందు వలంటీర్లు, గృహసారధులు, ఔత్సాహికులు, ప్రభుత్వం పట్ల, ఆరోగ్యశ్రీ పథకం మీద మమకారం ఉన్నవారంతా ఏకమై ప్రతి ఇంటికీ వెళతారు. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై వివరాలు అందిస్తారు. హెల్త్ క్యాంపులో పాల్గొనాలని సూచిస్తారు. రెండో దశలో ఇచ్చిన టోకెన్ నెంబర్లు ఉన్నవాళ్లు తప్పకుండా క్యాంపులో హాజరవ్వాలని వివరిస్తారు. టోకెన్ లేకపోయినా వైద్యం అవసరమైన వారు కూడా హెల్త్ క్యాంపులకు రావచ్చని తెలియజేస్తారు. నాలుగో దశ: హెల్త్ క్యాంపుల నిర్వహణ ఈ దశలో ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహించే రోజు వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, ఆశావర్కర్లు, సీహెచ్‌వోలు, ఔత్సాహికులు మమేకమవుతారు. క్యాంప్ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందేలా చూస్తారు. మందులు సమకూర్చడం, ఇతర సహాయ సహకారాలు అందిస్తారు. సంబంధిత వ్యక్తులను విలేజ్ క్లినిక్స్ వారీగా ఫ్యామిలీ డాక్టర్, ఏఎన్ఎంలకు మ్యాప్ చేస్తారు. మ్యాప్ అయిన వ్యక్తులకు తర్వాతి రోజుల్లో తగిన వైద్యం అందించే చర్యలు తీసుకుంటారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడం, చికిత్స అనంతరం మందులు, రెగ్యులర్ ఫాలో అప్ చేపడతారు. ఐదో దశ: ఈ దశలో ప్రజలను చేయిపట్టుకుని నడిపిస్తాం. సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంత వరకూ చేయూత నిస్తాం. ఆయా వ్యక్తుల పర్యవేక్షణ బాధ్యతలను వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్‌వోలు తీసుకుంటారు. చికిత్స అందించడంతోపాటు క్రమం తప్పకుండా ఆరోగ్యంపై వాకబు చేస్తారు. -
దేవదూతలందరికీ రెక్కలు ఉండవ్!... ! కొందరికి స్టెతస్కోప్‌లే ఉంటాయ్!!
అందరూ ఆయా నేపథ్యల రీత్యా వేరువేరు వృత్తులు చేస్తుంటాం. ఇది సర్వసాధారణం. ఆయా వృత్తులకు అనుగుణంగా వారు ధరించే డ్రస్‌లు, తీరు బట్టి వారు ఏం చేస్తున్నారని చెప్పేస్తాం. మెడలోని ఈ సెతస్కోప్ చూడగానే మాత్రం..ఒక్కసారిగా కళ్లు పెద్దవి అవుతాయి. తెలియకుండాని చేతులు పైకెత్తి నమస్కారిస్తాయి. అంత గొప్పది వైద్య వృత్తి. వైద్యో నారాయణో హరిః అన్న పెద్దల మాట అక్షరాల నిజం. అలాంటి వైద్య విద్యకు పెద్దపీట వేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఒకేరోజు ఐదు మెడికల్ కాలేజ్‌లు ప్రారంభించి రికార్డు సృష్టించారు. పేదలకు అందని ద్రాక్షలా ఉండే వైద్య విద్యను మరింత దగ్గర చేసేలా నిరుపేదలకు మెరుగైన వైద్యం అందేలా ఓ సరికొత్త సువర్ణ అధ్యయనానికి నాంది పలికారు. ఈ సందర్భంగా ఏపీలో స్వతంత్రం వచ్చాక వైద్య విద్య ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? తదతరాల గురించి సవివరంగా చూద్దాం! స్వతంత్రం వచ్చాక ఏపీలో కేవలం 11 కాలేజ్లే ఉన్నాయి. పైగా అప్పట్లో విద్యార్థులెవరు డాక్టర్ అవుతానని చెప్పే సాహసం చేసేవారు కూడా కాదు. ఎందుకంటే అది డబ్బున్నోళ్లు చదివే చదువు అని భావించేవారు. అందుకు తగ్గట్టుగానే కాలేజ్‌లు పెద్దగా అందుబాటులో ఉండేవి కావు. దీనికితోడు ఆయా కాలేజ్‌లో వసతులు తక్కువగానే ఉండేవి. ఇక మెడిసిన్ సీట్లు విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త పలుకుబడి, పెద్దల అండదండ ఉన్నవాళ్లకే దొరికేవి. బాగా చదివిన పేద స్టూడెంట్స్ సైతం నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి. మంచి ర్యాంకు వచ్చిన ఉద్యోగాల్లో స్థిరపడిపోయే ఫార్మాస్యూటిక్స్ వంటి ఇతర రంగాలు లేదా అగ్రికల్చర్ బీఎస్సీ వంటి కోర్సుల వైపుకి వెళ్లిపోయేవారు. తొందరగా సెటిల్ అవ్వోచ్చు లేదా ఉద్యోగం కూడా సంపాదించడం ఈజీగా ఉంటుందనో వేరే రంగాలవైపుకి వెళ్లిపోయేవారు. ఎంబీబీఎస్ సీటు దక్కించుకోవటం, డాక్టర్ అవ్వడం ఓ తియ్యటి కలలానే ఉండేది విద్యార్థులకు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వైద్య విద్య విషయంలో అంతగా చొరవ చూపలేదు. ఇక ఇక్కడ ప్రజలు కూడా వైద్యులు సంప్రదించేవారు కాదు. ఒకరకంగా చెప్పాంటే ఆస్పత్రులు అందుబాటులో లేవని చెప్పాలి. పేదవాడికి రోగం అంటే చావుతో సమానం. అలాంటి రోజులు. చుట్టుపక్కల ఉండే ఆర్ఎంపీ డాక్టర్లే వారికి దిక్కు. ఎంత పెద్ద ప్రమాదం వచ్చిన వారి వద్దకే. పట్టణాలకి వెళ్లి చూపించుకునేంత స్థోమత లేకపోవడం కూడా ఓ కారణం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో సరిగ్గా ఆ టైంలో వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వం ఆ పరిస్థితిని చక్కబెట్టింది. ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో పేదలు కూడా మంచి వైద్యం అందుకునే అవకాశం కల్పించారు. పేద, బలహీన బడుగు వర్గాల మహిళలు పురుడు పోసుకోవడం ఓ నరకంగా ఉండేది. ఇక ఆ సమస్యకు 108 సర్వీస్‌తో చెక్‌పెట్టి.. సత్వరమే ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించడం వైద్యం అందేలా చూడటం వంటి సేవలతో ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అనే వరం ఇచ్చారు. ఆయన హయంలో ఏపీలో ఉద్యోగులు, పేద విద్యార్థలకు, మహిళలకు ఓ సువర్ణయుగంలో సాగిపోయింది. హెలికాప్టర్లో ఆయన అకాల మరణం, తర్వాత జరిగిన రకారకాల పరిణామాల మధ్య మళ్లీ పరిస్థితి అగోమ్య గోచరంలోకి వచ్చేసింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వం కూడా ఆయన సాగించిన పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకురాలేకపోయింది. మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వంతో మళ్లీ ఏపీ గత సువర్ణ యుగంతో కాంతులీనడం మొదలైంది. తండ్రి ఆశయాలను, ఆకాంక్షలను నిలబెడుతూ..ప్రజారంజకంగా పాలించి ప్రజల మన్నలను పొందుతున్నారు. తండ్రి రెండు అడుగులు వేసి ఏపీని అభివృద్ధి దిశగా వచ్చేలా చేస్తే.. ఆయన తనయుడు జగన్ మరో నాలుగు అడుగులు ముందుకేసి మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేలా పథకాలను ప్రజల వద్దకు తీసుకువచ్చి జనం మెచ్చిన సీఎం, జననాయకుడు అనే బిరుదులు అందుకుంటున్నారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఫీజు రీయంబర్స్‌మెంట్‌లతో పేదలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య అందుకునేలా చేస్తే తనయుడు మరో ముందడుగు వేసి అత్యంత ఖరీదైన వైద్య వృత్తిని పేదవాడి ముంగిట ఉండేలా చేశారు. పేదలకు ఆరోగ్యాన్ని మరింత చేరువ చేసేలా ఫ్యామిలీ డాక్టర్ వంటి వాటితో 95% ప్రజలు ఆరోగ్య శ్రీ పథకాన్ని అందుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మరో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడతూ.. రాష్ట్ర చరిత్రలోనే ఒకే రోజు ఐదు కళాశాలలు ప్రారంభించి జనం మెచ్చిన నాయకుడంటే ఏంటో చూపించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా వైద్య కళశాలలు ఏర్పాటు చేయడమేగాక ఈ ఏడాది నుంచే ఎంబీబీఎస్ తరగతులు అందుబాటులో ఉండేలా చేశారు. అంతేగాదు ప్రతి పార్లమెంట్‌కు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవడమేగాక ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి.. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు అని పించుకున్నారు సీఎం జగన్. దీని ఫలితంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరగడం, పేద విద్యార్థుల సైతం వైద్య విద్యా\ను అభ్యసించే గొప్ప అవకాశం రెండు లభిస్తున్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే పేదలకు కూడా మెరుగైన వైద్యం మరింత చేరవవుతుంది. ఏ రాష్ట్రమైన సుభీక్షంగా ఉండాలంటే అది విద్యతోనే సాకారం అవుతుంది. అదికూడా సామాన్యుడు సైతం ఉన్నత విద్యను అందుకోగలిగితేనే ఆ రాష్ట్రం స్యశ్యామలంగా ఊహకందని రీతిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనడానికి ఏపీనే ఉదాహారణ. (చదవండి: మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!) -
ఏపీ వైద్య విద్యలో వందేళ్ల రికార్డు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజయనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టడం ద్వారా సీఎం జగన్ నూతన అధ్యాయాన్ని లిఖించారు. 17 కొత్త కళాశాలలు.. 2,550 ఎంబీబీఎస్ సీట్లు రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మిషన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది. మూడేళ్లలోనే సీట్లు రెట్టింపు రాష్ట్రంలో ఆంధ్రా వైద్య కళాశాల 1923లో మొదటిసారిగా ఏర్పాటైంది. ఆ తరువాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా 2,185 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాయి. అంటే 2,185 సీట్లు సమకూరడానికి వందేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 17 వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూరుస్తుండటం గమనార్హం. అంటే కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపు దాటనున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి అత్యాధునికంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ కాలేజీ కంటే మెరుగ్గా ఉంది. అత్యాధునిక ల్యాబ్స్, టీచింగ్ హాల్స్, లెక్చర్ హాల్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో తొలి బ్యాచ్‌లో చదవడం చక్కటి అనుభూతి. ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయకపోయి ఉంటే మేం ప్రైవేట్ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. – సీహెచ్, ఢిల్లీరావు, వైద్య విద్యార్థి, ఏలూరు వైద్య కళాశాల గొప్ప వరంలా భావిస్తున్నా మాది విశాఖపట్నం. మధ్యతరగతి కుటుంబం. నీట్లో కొంత మెరుగైన ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ బీసీ ‘ఏ’ కేటగిరీలో గతంలో ఈ ర్యాంకుకు మెడిసిన్‌లో సీటు రావటం సాధ్యమయ్యేది కాదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడంతో నా ర్యాంక్‌కు సీట్ దక్కింది. లేదంటే మళ్లీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఒత్తిడితోపాటు విలువైన సమయం, డబ్బు వృథా అయ్యేది. కార్పొరేట్ వైద్య కళాశాలలకు ధీటుగా మా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం గొప్ప వరంలా నాలాంటి ఎందరో విద్యార్థులు భావిస్తున్నారు. – బమ్మిడి లక్ష్మీజ్యోత్న్స, వైద్య విద్యార్థిని, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల రెండు రకాల లాభాలు.. వైద్యవిద్య డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో మన విద్యార్థులు వలస వెళుతున్నారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరుగుతున్నాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రులున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఇలా విద్య, వైద్యంలో రెండురకాలుగా లాభాలుంటాయి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ ఉన్నత స్థాయి వైద్యం కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు పని చేస్తాయి. వీటిద్వారా ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు అభివృద్ధి చెందుతాయి. ఆయా ప్రాంతాల్లో జబ్బులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు పెరుగుతాయి. సేవలు రెట్టింపు అవుతాయి. అన్ని ప్రాంతాల్లో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు వ్యయ ప్రయాసలు తొలగి అనుభవజ్ఞులైన వైద్యుల సంరక్షణ లభిస్తుంది. రోగులు మరింత త్వరగా కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. – డాక్టర్ జి.రవికృష్ణ,ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న చోటే వైద్య విద్యలో చేరా.. ప్రభుత్వం మా ప్రాంతంలో కొత్త వైద్య కళాశాలను ప్రారంభించడంతో అక్కడే ఆప్షన్ ఇచ్చా. అందులోనే సీటు వచ్చింది. ఇటీవలే తరగతులు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. మేం ఉంటున్న ప్రాంతంలోనే వైద్య విద్య అభ్యసిస్తున్నా. లేదంటే దూర ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చేది. మనవద్ద మెడికల్ సీట్లు పెరగడంతో చాలా మందికి అవకాశాలు లభించాయి. – మహ్మద్ హర్సిన బేగం, వైద్య విద్యార్థిని, రాజమండ్రి వైద్య కళాశాల నాలుగేళ్లలో వైద్యం బలోపేతం ఇలా.. నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వాలు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. టీడీపీ హయాంలో 108 అంబులెన్స్‌లు కేవలం 531 మాత్రమే ఉండగా ఇందులో కేవలం 336 మాత్రమే మనుగడలో ఉండేవి. పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. జాతీయస్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు ఖాళీలు 61 శాతం కాగా మన రాష్ట్రంలో అది కేవలం 3.96% మాత్రమే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద దీర్ఘకాలిక రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా ఇంటి వద్దే పెన్షన్లు గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు. -
ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ఆస్పత్రులను ఆధునీకరించి, వైద్య సేవలను మెరుగు పరిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్య సేవలను ప్రజల ముంగిటకే చేర్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి వాకబు చేసి, ముందస్తుగానే వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్య క్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రభుత్వ సిబ్బంది వాకబు చేస్తారు. ఆ తర్వాత వైద్య శిబిరాల్లో పరీక్షలు చేసి అవసరమైన వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తారు. దీని ద్వారా అరోగ్య సమస్యలు మరింత పెద్దవై, చికిత్సకు లొంగని దశకు చేరకుండా ముందుగానే గుర్తించి, వైద్యం అందించి, ఆరోగ్యవంతులుగా చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఈ కార్యక్రమం లక్ష్యం. 5 దశల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి క్యాంపెయిన్ మొదలవుతుంది. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో కూడా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తారు. తొలుత వాలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు వారి పరిధిలోని ఇళ్లను సందర్శించి, ప్రజలందరీకి ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తారు. తొలి దశ వైద్య శిబిరాలు నిర్వహించే పట్టణాలు/గ్రామాల్లో ముందుగా ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సేవలను కూడా వివరిస్తారు. అవసరమైన వారు ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలను ఏ విధంగా పొందాలో తెలియజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.60 కోట్లకు పైగా గృహాల్లో ఆరోగ్యశ్రీ సేవలను వివరిస్తూ ప్రత్యేక బ్రోచర్‌ను వాలంటీర్లు అందజేస్తారు. పథకం కింద ఎన్ని రకాల జబ్బులకు చికిత్స అందిస్తారు, వైద్యం అందించే ఆస్పత్రులు, వాటి చిరునామాలు, ఇతర వివరాలు ఉంటాయి. అదే విధంగా స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ సిటిజెన్ యాప్‌ను డౌన్లోడ్ చేయించి దాని వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఇంటింటికీ వచ్చి ఆరోగ్యపరమైన అంశాలపై వాకబు చేస్తారు. ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంప్ నిర్వహించే రోజు, ప్రాంతం తెలిపి, ఆరోజున అందుబాటులో ఉండాలని ప్రజలకు చెబుతారు. ఈ నెల 30 నుంచి మొదటి దశ వైద్య శిబిరాలు (హెల్త్ క్యాంప్‌లు) ప్రతి మండలంలో ఏదో ఒక పట్టణం/గ్రామంలో నిర్వహిస్తారు. ఇందులో వైద్యులు, ఇతర సిబ్బంది ప్రజలకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. మందులు కూడా ఉచితంగా ఇస్తారు. అవసరమైన వారిని సమీపంలోని పెద్ద ఆస్పత్రులకు పంపించి, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తారు. ఆరోగ్య ఏపీ సాధనే లక్ష్యం ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెప్పారు. ఈ కార్యక్రమం అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు దశల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తొలి దశలో క్యాంపెయిన్, రెండో దశలో ప్రజల ఆరోగ్యంపై వాకబు, ఏడు రకాల వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. మూడో దశలో మరో మారు హెల్త్ క్యాంప్‌లపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నాలుగో దశలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఐదో దశలో కాలానుగుణంగా ఫాలోఅప్ సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో గ్రామ, వార్డు సచివాలయాలు, మహిళా, శిశు సంక్షేమ, విద్య, మున్సిపల్, గిరిజన శాఖల బాధ్యతలను ఉత్తర్వుల్లో తెలియజేశారు. -
అమ్మకు ఆరోగ్య రక్షణ
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం వారికి వరంగా మారింది. ఒకవైపు ప్రతినెలా ప్రభుత్వాస్పత్రుల్లో 9న ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎం) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా గర్భిణులకు మధుమేహం, బీపీ, రక్త పరీక్షలు, అవసరం మేరకు స్కానింగ్‌లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి గర్భిణికి గ్రామాల్లో నెలలో రెండుసార్లు వైద్యులు సేవలందిస్తున్నారు. నెలకు మూడుసార్లు గర్భిణులకు ప్రసవంలోగా నాలుగుసార్లు, బాలింతలకు ప్రసవానంతరం ఆరుసార్లు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించాలనేది కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధన. హైరిస్క్ గర్భిణులకు 8సార్లు ప్రసవంలోగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ.. ఇతర రాష్ట్రాల్లో లేనట్టుగా మన రాష్ట్రంలో నెలలో మూడుసార్లు గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందుతున్నాయి. పీఎంఎస్ఎం డే రోజున ఆస్పత్రుల్లో ఒకసారి, ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వచి్చన సందర్భంలో రెండుసార్లు చొప్పున వైద్యులు సేవలు అందిస్తున్నారు. మరోవైపు మిగిలిన రోజుల్లో గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో ఉండే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎం వాకబు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతినెలా గర్భిణులు, బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) టెస్ట్ నిర్వహించి రక్తహీనతను పర్యవేక్షిస్తున్నారు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి వారిపై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తీవ్ర రక్తహీనత ఉన్న వారికి కృత్రిమంగా రక్తం ఎక్కించడం, ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు వేయడం చేస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు ఆరోగ్యశ్రీ కింద మూడు స్కాన్లను ఉచితంగా ప్రభుత్వం చేయిస్తోంది. ఇందులో ఒక స్కాన్‌ను వైద్యుల సూచనల మేరకు టిఫ్ఫా స్కాన్ చేయిస్తున్నారు. ఆగస్టులో 2.04 లక్షల మందికి.. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఆగస్టు నెలలో 2.26 లక్షల మంది గర్భిణులకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా 90.41 శాతం 2.04 లక్షల మందికి సేవలు అందించారు. 64,092 బాలింతలకు గాను 92.29 శాతం 59,149 మంది బాలింతలకు వైద్యం చేశారు. గ్రామాలకు వెళుతున్న ఫ్యామిలీ డాక్టర్లు బాలింతల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేస్తున్నారు. మరోవైపు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి గ్రామాల్లోనే గర్భిణులకు 14.74 లక్షలు, బాలింతలకు 5.08 లక్షల సేవలను వైద్య శాఖ అందించింది. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రక్ష కొందరు గర్భిణులు యాంటీనేటల్ కేర్ (ఏఎన్సీ), పోస్ట్‌నేటల్(పీఎన్సీ)కు దూరమైన గర్భిణులు, బాలింతల వివరాలు ఫ్యామిలీ డాక్టర్‌కు ఆన్లైన్లో పంపుతున్నాం. వారికి గ్రామాల్లోనే వైద్యులు సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరం అనుకున్న వారిని దగ్గరలోని పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. మాతా, శిశు మరణాల కట్టడికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రభుత్వం రక్షగా నిలుస్తోంది. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, వైద్య శాఖ -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు ముమ్మరంగా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటిని పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం కోసం ఆరోగ్య శాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా నిర్వహి ంచిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కా రానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. రూ.66.65 కోట్లతో మందులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎంలు వారి పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజల ఆరోగ్య సమస్యలపై సర్వే చేస్తారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తున్నారు. సర్వేలో గుర్తించిన ఆరోగ్య సమస్యలున్న ప్రజలకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, వారికి అవసరమైన పరీక్షలు చేసి, మందులు ఇస్తారు. ఇందు కోసం రూ.66.65 కోట్ల విలువ చేసే 162 రకాల మందులు, 18 సర్జికల్ పరికరాలు, ఎమర్జెన్సీ కిట్స్, ఇతర వస్తువులను కొంటున్నారు. ఈ నెల 30వ తేదీ వైద్య శిబిరాల నిర్వహణ మొదలయ్యే నాటికి అన్ని ప్రాంతాలకు వీటిని సరఫరా చేస్తారు. 342 మంది స్పెషలిస్ట్ వైద్యులు 10,032 విలేజ్ క్లినిక్స్, 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించాలన్నది ప్రణాళిక. ప్రతి క్యాంప్‌నకు సంబంధిత పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ వైద్యులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 342 మంది స్పెషలిస్ట్ వైద్యులను గుర్తించారు. కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి కంట్రోల్ రూమ్‌ల నుంచి వైద్యులు, మందులు, డయగ్నోస్టిక్స్ లభ్యత వంటి ఇతర అంశాలపై పర్యవేక్షణ మొదలవుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణ ఇలా ♦ 15వ తేదీ నుంచి కార్యక్రమంపై వలంటీర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ♦ 16వ తేదీ నుంచి ప్రజల్లో ఆరోగ్య సమస్యల గుర్తింపునకు ఇంటింటి సర్వే ♦ 30వ తేదీ వైద్య శిబిరాల నిర్వహణ ఉచితంగా చికిత్స శిబిరాల్లో వైద్యుల కన్సల్టేషన్ అనంతరం ఎవరికైనా తదుపరి వైద్యం అవసరమైతే దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు పంపుతారు. ఆస్పత్రుల్లో వారికి ఉచితంగా చికిత్స చేస్తారు. ఈ కార్యక్రమంపై వలంటీర్లు 15 రోజుల పాటు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్