అందరూ ఆయా నేపథ్యల రీత్యా వేరువేరు వృత్తులు చేస్తుంటాం. ఇది సర్వసాధారణం. ఆయా వృత్తులకు అనుగుణంగా వారు ధరించే డ్రస్‌లు, తీరు బట్టి వారు ఏం చేస్తున్నారని చెప్పేస్తాం. మెడలోని ఈ సెతస్కోప్ చూడగానే మాత్రం..ఒక్కసారిగా కళ్లు పెద్దవి అవుతాయి. తెలియకుండాని చేతులు పైకెత్తి నమస్కారిస్తాయి. అంత గొప్పది వైద్య వృత్తి. వైద్యో నారాయణో హరిః అన్న పెద్దల మాట అక్షరాల నిజం. అలాంటి వైద్య విద్యకు పెద్దపీట వేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఒకేరోజు ఐదు మెడికల్ కాలేజ్‌లు ప్రారంభించి రికార్డు సృష్టించారు. పేదలకు అందని ద్రాక్షలా ఉండే వైద్య విద్యను మరింత దగ్గర చేసేలా నిరుపేదలకు మెరుగైన వైద్యం అందేలా ఓ సరికొత్త సువర్ణ అధ్యయనానికి నాంది పలికారు. ఈ సందర్భంగా ఏపీలో స్వతంత్రం వచ్చాక వైద్య విద్య ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? తదతరాల గురించి సవివరంగా చూద్దాం!
స్వతంత్రం వచ్చాక ఏపీలో కేవలం 11 కాలేజ్‌లే ఉన్నాయి. పైగా అప్పట్లో విద్యార్థులెవరు డాక్టర్ అవుతానని చెప్పే సాహసం చేసేవారు కూడా కాదు. ఎందుకంటే అది డబ్బున్నోళ్లు చదివే చదువు అని భావించేవారు. అందుకు తగ్గట్టుగానే కాలేజ్‌లు పెద్దగా అందుబాటులో ఉండేవి కావు. దీనికితోడు ఆయా కాలేజ్‌లో వసతులు తక్కువగానే ఉండేవి. ఇక మెడిసిన్ సీట్లు విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త పలుకుబడి, పెద్దల అండదండ ఉన్నవాళ్లకే దొరికేవి. బాగా చదివిన పేద స్టూడెంట్స్ సైతం నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి. మంచి ర్యాంకు వచ్చిన ఉద్యోగాల్లో స్థిరపడిపోయే ఫార్మాస్యూటిక్స్ వంటి ఇతర రంగాలు లేదా అగ్రికల్చర్ బీఎస్సీ వంటి కోర్సుల వైపుకి వెళ్లిపోయేవారు.
తొందరగా సెటిల్ అవ్వోచ్చు లేదా ఉద్యోగం కూడా సంపాదించడం ఈజీగా ఉంటుందనో వేరే రంగాలవైపుకి వెళ్లిపోయేవారు. ఎంబీబీఎస్ సీటు దక్కించుకోవటం, డాక్టర్ అవ్వడం ఓ తియ్యటి కలలానే ఉండేది విద్యార్థులకు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వైద్య విద్య విషయంలో అంతగా చొరవ చూపలేదు. ఇక ఇక్కడ ప్రజలు కూడా వైద్యులు సంప్రదించేవారు కాదు. ఒకరకంగా చెప్పాంటే ఆస్పత్రులు అందుబాటులో లేవని చెప్పాలి. పేదవాడికి రోగం అంటే చావుతో సమానం. అలాంటి రోజులు. చుట్టుపక్కల ఉండే ఆర్‌ఎంపీ డాక్టర్లే వారికి దిక్కు. ఎంత పెద్ద ప్రమాదం వచ్చిన వారి వద్దకే. పట్టణాలకి వెళ్లి చూపించుకునేంత స్థోమత లేకపోవడం కూడా ఓ కారణం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో సరిగ్గా ఆ టైంలో వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వం ఆ పరిస్థితిని చక్కబెట్టింది.
ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో పేదలు కూడా మంచి వైద్యం అందుకునే అవకాశం కల్పించారు. పేద, బలహీన బడుగు వర్గాల మహిళలు పురుడు పోసుకోవడం ఓ నరకంగా ఉండేది. ఇక ఆ సమస్యకు 108 సర్వీస్‌తో చెక్‌పెట్టి.. సత్వరమే ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించడం వైద్యం అందేలా చూడటం వంటి సేవలతో ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అనే వరం ఇచ్చారు. ఆయన హయంలో ఏపీలో ఉద్యోగులు, పేద విద్యార్థలకు, మహిళలకు ఓ సువర్ణయుగంలో సాగిపోయింది. హెలికాప్టర్‌లో ఆయన అకాల మరణం, తర్వాత జరిగిన రకారకాల పరిణామాల మధ్య మళ్లీ పరిస్థితి అగోమ్య గోచరంలోకి వచ్చేసింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వం కూడా ఆయన సాగించిన పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకురాలేకపోయింది.
మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వంతో మళ్లీ ఏపీ గత సువర్ణ యుగంతో కాంతులీనడం మొదలైంది. తండ్రి ఆశయాలను, ఆకాంక్షలను నిలబెడుతూ..ప్రజారంజకంగా పాలించి ప్రజల మన్నలను పొందుతున్నారు. తండ్రి రెండు అడుగులు వేసి ఏపీని అభివృద్ధి దిశగా వచ్చేలా చేస్తే.. ఆయన తనయుడు జగన్ మరో నాలుగు అడుగులు ముందుకేసి మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేలా పథకాలను ప్రజల వద్దకు తీసుకువచ్చి జనం మెచ్చిన సీఎం, జననాయకుడు అనే బిరుదులు అందుకుంటున్నారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఫీజు రీయంబర్స్‌మెంట్‌లతో పేదలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య అందుకునేలా చేస్తే తనయుడు మరో ముందడుగు వేసి అత్యంత ఖరీదైన వైద్య వృత్తిని పేదవాడి ముంగిట ఉండేలా చేశారు.
పేదలకు ఆరోగ్యాన్ని మరింత చేరువ చేసేలా ఫ్యామిలీ డాక్టర్ వంటి వాటితో 95% ప్రజలు ఆరోగ్య శ్రీ పథకాన్ని అందుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మరో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడతూ.. రాష్ట్ర చరిత్రలోనే ఒకే రోజు ఐదు కళాశాలలు ప్రారంభించి జనం మెచ్చిన నాయకుడంటే ఏంటో చూపించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా వైద్య కళశాలలు ఏర్పాటు చేయడమేగాక ఈ ఏడాది నుంచే ఎంబీబీఎస్ తరగతులు అందుబాటులో ఉండేలా చేశారు.
అంతేగాదు ప్రతి పార్లమెంట్‌కు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవడమేగాక ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి.. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు అని పించుకున్నారు సీఎం జగన్. దీని ఫలితంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరగడం, పేద విద్యార్థుల సైతం వైద్య విద్యా\ను అభ్యసించే గొప్ప అవకాశం రెండు లభిస్తున్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే పేదలకు కూడా మెరుగైన వైద్యం మరింత చేరవవుతుంది. ఏ రాష్ట్రమైన సుభీక్షంగా ఉండాలంటే అది విద్యతోనే సాకారం అవుతుంది. అదికూడా సామాన్యుడు సైతం ఉన్నత విద్యను అందుకోగలిగితేనే ఆ రాష్ట్రం స్యశ్యామలంగా ఊహకందని రీతిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనడానికి ఏపీనే ఉదాహారణ.
(చదవండి: మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!)
Comments
Please login to add a commentAdd a comment