New medical colleges
-
తెలంగాణకు 8 ఏపీకి సున్నా..
ఏపీలో కాలేజీ రెడీ.. మరి మెడికల్ సీట్లు ఎందుకు రాలేదు బాబూ?ఇక్కడ కనిపిస్తున్నది వైఎస్సార్ జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీ. దీనిని సర్వహంగులతో గత ప్రభుత్వం సిద్ధం చేసింది. బోధనాస్పత్రి, కాలేజీ భవనాలు, స్కిల్ ల్యాబ్, హాస్టళ్లు, సిబ్బంది.. ఇలా అన్నీ సమకూర్చింది. ఈ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ అను మతులు కూడా ఇచ్చి0ది. కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఎన్ఎంసీకి లేఖ రాసింది. తెలంగాణలో కాలేజీ లేదు.. శిలాఫలకమే ఉంది.. మరి సీట్లు ఎలా వచ్చాయి బాబూ?తెలంగాణలోని మహేశ్వరం ప్రాంతంలోని మెడికల్ కాలేజీ శంకుస్థాపన శిలాఫలకం. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్టలేదు. అయినా 50 సీట్లతో 2024–25లో తరగతులు ప్రారంభించేందుకు అనుమతులు వచ్చాయి. వెంటనే ప్రైవేటు భవనాల్లో తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసేసింది. తెలంగాణలో ఈ ఏడాది ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు కాగా మెదక్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, యాదాద్రి భువనగిరి వైద్య కళాశాలలకు భవనాలే లేకపోవడంతో ప్రైవేట్ కాలేజీల భవనాలను అద్దెకు తీసుకున్నారు. సాక్షి, అమరావతి: ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయం వేల కుటుంబాల్లో విద్యార్థులకు పిడుగుపాటులా మారింది. డాక్టర్ కావాలనే ఆశయంతో నీట్లో ఉత్తమ స్కోర్ సాధించినప్పటికీ ఎంబీబీఎస్ సీట్ దక్కక తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ‘పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి 8 కొత్త వైద్య కళాశాలలు రావడంతో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ఏపీలోనూ సిద్ధంగా ఉన్న ఐదు కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 750 సీట్లు అదనంగా వస్తాయని ఆశపడ్డాం. పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే వద్దని నిరాకరించింది. కాలేజీలకు అనుమతులు రాకుండా కూటమి ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంది. ఈ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే మాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఉండేది. ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. వచ్చే ఏడాది ప్రారంభం కావాల్సిన మరో ఏడు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం నిలిపివేసి ప్రైవేట్‌కు అప్పగించడం ద్వారా మరో 1,050 సీట్లు నష్టపోతున్నాం.రెండేళ్లలో మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో ఇక వైద్య విద్య కల నెరవేరే అవకాశం లేదు. లాంగ్ టర్మ్ శిక్షణ కోసం ఇప్పటికే రూ.లక్షల్లో వెచ్చించిన మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది..’ అనే చర్చ ప్రస్తుతం ప్రతి నీట్ ర్యాంకర్ల కుటుంబాల్లో సాగుతోంది. నీట్ అర్హులకు సంబంధించిన వాట్సప్ గ్రూప్‌ల్లో ఆ మెసేజ్‌లే చక్కర్లు కొడుతున్నాయి.కుట్రపూరితంగా కాలదన్ని సాకులుపులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోనిల్లో ఒక్కో చోట 150 ఎంబీబీఎస్ సీట్లతో 2024–25లో తరగతులు ప్రారంభించేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కార్ వాటికి అనుమతులు రాబట్టకుండా మోకాలడ్డింది. గత ప్రభుత్వ కృషితోపులివెందుల కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఎల్ఓపీ మంజూరు చేసినా.. కళాశాల నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాయడంతో అనుమతులు రద్దయ్యాయి. ఇక పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లకు అనుమతులు రాగా ఈ కాలేజీ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్రంలో భాగస్వామిగా కొనసాగుతున్నా..తెలంగాణకు 2024–25 విద్యా సంవత్సరంలో 8 కొత్త వైద్య కళాశాలలు మంజూరు కావడంతో 400 సీట్లు అదనంగా సమకూరాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఇలాంటి సానుకూల పరిస్థితి ఉండగా ఏపీలో కూటమి సర్కారు ఏర్పాటైనా, కేంద్రంలో భాగస్వామిగా కొనసాగుతున్నా విద్యార్థుల ప్రయోజనాలను కాలరాయడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. పులివెందుల కళాశాలను నిర్వహించలేమంటూ ఎన్ఎంసీకి లేఖ రాసి అడ్డంగా దొరికిపోవడం.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో సాకులను అన్వేషిస్తోంది. గత ప్రభుత్వం ఏమీ చేయకుండానే సీట్లొచా్చయా?కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడానికి తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎటువంటి చర్యలు తీసుకోలేదని గత నెల 16న మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒప్పుకున్నారు. ఈ ఏడాది ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లు నష్టపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుండటంతో వైఎస్ జగన్ సర్కారు వైద్య కళాశాలలను ప్రారంభించేలా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త రాగం అందుకుంది. మరి గత ప్రభుత్వం ఏమీ చేయకుండానే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలలకు 50 సీట్లను ఎన్ఎంసీ ఎందుకు మంజూరు చేస్తుందని వైద్య రంగ నిపుణులు, ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా తెలంగాణలో అదనంగా సీట్లు సమకూరడంతో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు దక్కుతుండగా ఏపీలో మాత్రం 600 దాటినా నిరాశే మిగులుతోందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.తప్పు కప్పిపుచ్చేందుకు సతమతంవైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా ఈ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది. ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు సతమతం అవుతున్నారు. మేం వచ్చి మూడు నెలలే అయింది... వసతులు ఎలా కల్పిస్తామని అంటున్నారు. ఈ ఏడాది కనీసం 50 సీట్లతో కళాశాలలు ప్రారంభించినా వచ్చే ఏడాది పెంచుకోవడానికి అవకాశం ఉండేది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మార్గాలు అనేకం ఉంటాయి. మంగళగిరి ఎయిమ్స్‌లో భవనాలు అందుబాటులోకి రాకముందే తరగతులు ప్రారంభించారు. తాత్కాలికంగా విజయవాడలో కొద్ది రోజులు తరగతులు నిర్వహించి అనంతరం అక్కడకు మార్చారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో భవనాలు అందుబాటులోకి రానందునతాత్కాలిక భవనాల్లో ప్రభుత్వం కళాశాలలు నిర్వహిస్తోంది. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
'టాప్‌లో కటాఫ్'
సాక్షి, అమరావతి: గతేడాది ఏయూ పరిధిలో ఓసీ విద్యార్థికి ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నీట్ కటాఫ్ మార్కులు 563.. ఈ ఏడాది ఏకంగా 615..! ఇదే కేటగిరీకి ఎస్వీయూ పరిధిలో గతేడాది కటాఫ్ 550.. ఈ ఏడాది 601..!! ఆదివారం కన్వీనర్ కోటా తొలిదశ కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పరిస్థితి ఇదీ!! అప్పుడు సీటు దొరకటానికి.. ఇప్పుడు గగనంగా మారటానికి కారణం.. కొత్త మెడికల్ కాలేజీలే!గతేడాది 5 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంతో సీట్లు పెరిగి మన విద్యార్థులు ఎంతో మంది డాక్టర్లు కాగలిగారు! ఇప్పుడు నాలుగు కొత్త కాలేజీలకు కూటమి సర్కారు నిర్వాకంతో అనుమతులు రాకపోగా పాడేరులో వచ్చింది 50 సీట్లే! ఎంబీబీఎస్ సీట్లు పెరగకపోవడంతో మనకు ఎంత నష్టం జరిగిందో తొలి దశ కౌన్సెలింగ్‌లోనే స్పష్టంగా కనిపించింది!!గతేడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావడంతో అదనంగా 750 సీట్లు సమకూరి మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలు నెరవేరాయి. ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా దూరదృష్టితో వ్యవహరించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కశాశాలలకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో ఐదు కొత్త కాలేజీలు గతేడాది అందుబాటులోకి రాగా ఈ సంవత్సరం కూడా మరో ఐదు నూతన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైతే తమ కలలు ఫలిస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు! కూటమి సర్కారు ప్రైవేట్ జపం, కొత్త కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఆ ఆశల సౌథాలు కుప్పకూలాయి. ఏడాదంతా లాంగ్ టర్మ్ శిక్షణతో రూ.లక్షలు వెచ్చించి సిద్ధమైన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తొలి దశ కౌన్సెలింగ్‌లోనే సీట్ దొరక్కపోవడంతో ఇక మిగిలిన దశల్లో సీటు లభించే అవకాశాలు తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అప్పు చేసిన మధ్యతరగతి కుటుంబాలు మేనేజ్మెంట్ కోటా సీట్ కొనే పరిస్థితి లేదు. మరోసారి ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్‌కి పంపుదామంటే కూటమి సర్కారు ప్రైవేట్ మోజుతో వచ్చే ఏడాదైనా సీట్లు పెరుగుతాయనే నమ్మకం పోయింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో నీట్ యూజీ విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతో నాలుగు కొత్త కాలేజీలకు అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. కేవలం పాడేరు కళాశాలలో 50 సీట్లకే అనుమతులు లభించాయి. పిల్లల గొంతు కోశారు!ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని.. అది కూడా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే చేసి చూపిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి సర్కారు దాన్ని గాలికి వదిలేసి బేరాలకు తెర తీసింది. వైఎస్సార్ సీపీ హయాంలో తీసుకున్న చర్యల ఫలితంగా గిరిజన ప్రాంతంలోని పాడేరు మెడికల్ కాలేజీకి ఈ ఏడాది అరకొరగానైనా 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా వాటిలో 21 సీట్లను సెల్ఫ్‌ఫైనాన్స్ కోటా కింద తాజాగా అమ్మకానికి పెట్టింది. ఈమేరకు 2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోనిలో ప్రారంభించాల్సిన ఐదు నూతన వైద్య కళాశాలలను కుట్రపూరితంగా అడ్డుకుని ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి పిల్లల భవిష్యత్తును అంధకారంగా మార్చారని మండిపడుతున్నారు. పులివెందుల వైద్య కళాశాలకు అనుమతులు వచ్చినా.. మేం నిర్వహించలేమంటూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్ఎంసీకి కూటమి ప్రభుత్వమే లేఖ రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ పలు సందర్భాల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌కు హామీ గుర్తు లేదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వం.. పేదల పక్షపాత ప్రభుత్వమంటూ తరచూ చెప్పే సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనకు పీ 4 ప్రణాళిక పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించి పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ప్రజా సంఘాలు మండిపతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.రెండేళ్లలో కోల్పోతున్న సీట్లు 1,750టీడీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ వైద్య విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కాకపోవడం దీనికి నిదర్శనం. 2004–09 మధ్య దివంగత వైఎస్సార్ సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో రిమ్స్‌లను నెలకొల్పారు. రాష్ట్ర విభజన అనంతరం వైఎస్సార్ సీపీ హయాంలో జగన్ ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కొత్త వైద్య కళాశాలలు గత ఏడాది ప్రారంభం అయ్యాయి. 750 ఎంబీబీఎస్ సీట్లు ఒక్కసారిగా అదనంగా పెరగడంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి. ఈ విద్యా సంవత్సరంలో కూడా మరో ఐదు కళాశాలలు ప్రారంభించేలా గత ప్రభుత్వం చర్యలు చేపట్టినా కూటమి సర్కారు దాన్ని కొనసాగించలేదు. దీంతో కేవలం 50 సీట్లు సమకూరగా అదనంగా రావాల్సిన 700 సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ఇక వచ్చే ఏడాది ప్రారంభం కావాల్సిన మరో ఏడు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల అదనంగా మరో 1,050 మెడికల్ సీట్లను విద్యార్థులు నష్టపోతున్నారు. వెరసి మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవడం ద్వారా జరుగుతున్న నష్టం ఊహించలేనిది!!.ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ఆప్షన్ల నమోదు ప్రారంభం2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం తొలి దశ కౌన్సెలింగ్‌కు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 19వ తేదీ రాత్రి తొమ్మిది గంటలను ఆప్షన్ల నమోదు చివరి గడువుగా విధించారు. https://drntr.uhsap.in వెబ్సైట్లో విద్యార్థులు ఆప్షన్ నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. గతేడాది ప్రారంభించిన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, ఈ ఏడాది ప్రారంభించనున్న పాడేరు వైద్య కళాశాలలో 240 సెల్ఫ్‌ఫైనాన్స్, 101 ఎన్ఆర్ఐ కోటా (సీ కేటగిరి) సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రైవేట్, మైనార్టీ, స్విమ్స్ కళాశాలల్లో బీ కేటగిరి 1078, సీ కేటగిరి 495 సీట్లున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలుంటే 9000780707, 8008250842 నంబర్లలో విద్యార్థులు సంప్రదించాలని తెలిపారు.ప్రైవేటీకరణ దుర్మార్గంపులివెందుల కళాశాలకు సీట్లను నిరాకరించడమేంటి? సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల రద్దు హామీ ఏమైంది? సీఎం చంద్రబాబుకు ఎస్ఎఫ్ఐ లేఖ విద్యార్ధుల వైద్య విద్య ఆశలను కూటమి ప్రభుత్వం చిద్రం చేస్తోందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) మండిపడింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్‌లు సోమవారం మీడియాకు విడుదల చేశారు. విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యతను విస్మరించి ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కట్టడం దారుణమన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కొత్త కళాశాలలకు అనుమతులు తేవాల్సిన కూటమి ప్రభుత్వం పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూడా వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క పాడేరుకు 50 సీట్లు వచ్చాయని, మిగిలిన నాలుగు కొత్త కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్వోపీ ఇచ్చి ఉంటే అనుమతులు లభించేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు 700 సీట్లు కోల్పోయారన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి విద్యార్ధులు వైద్య విద్యకు దూరం కావడం ఖాయమన్నారు. రిజర్వేషన్ల ఊసే ఉండదని, తద్వారా వెనకబడిన తరగతుల విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పేదలకు ఉచిత వైద్య సేవలు కూడా అందవని ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రద్దు చేస్తామన్న హామీపై ఎందుకు నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. వెంటనే వైద్య విద్య ప్రైవేటీకరణను విరమించుకుని ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.రాయలసీమకు బాబు ద్రోహం మెడికల్ సీట్లు వద్దనడం దారుణం పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దు వైఎస్సార్ సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి టీడీపీ కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోందని వైఎస్సార్ సీపీ పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. వైద్య, ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈమేరకు సోమవారం ఆరు అంశాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్కి లేఖ రాశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల ఈ ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకపోగా ఎన్ఎంసీ పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన 50 సీట్లు కూడా పోయాయని మండిపడ్డారు. ఇది రాయలసీమ ప్రజలకు ద్రోహం చేయడం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్ పులివెందుల మెడికల్ కళాశాలను ఎప్పుడైనా సందర్శించారా? అని నిలదీశారు. ప్రశ్నించారు. రాయల సీమ నుంచి గెలిచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉంటూ ఇలా చేయటం దుర్మార్గం అనిపించటం లేదా? అని దుయ్యబట్టారు. 2023 డిసెంబర్ 15వ తేదీన పులివెందుల మెడికల్ కళాశాల స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీచేసి పోస్టులు భర్తీ చేసి 2023లో మార్చిలో కాలేజీని ప్రారంభించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చిన్న చిన్న ఇబ్బందులుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అండర్ టేకింగ్ లెటర్ ఇస్తే అడ్మిషన్లు నిర్వహించుకోవటానికి ఎంఎన్సీ అనుమతిస్తుందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కేవలం మాజీ సీఎం జగన్ హయాంలో నిర్మాణం, ప్రారంభం అయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక అడ్మిషన్లకు కూటమి ప్రభుత్వం అడ్డుపడిందని విమర్శించారు. -
తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదం
‘ఏడాదిపాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ యూజీ–2024లో 595 స్కోర్ చేశా. గతేడాదితో పోలిస్తే మెరుగైన స్కోర్ చేసినా కన్వీనర్ కోటాలో సీటు వస్తుందన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది మరో 5 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభిస్తే మనకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరేవి. దీనికి తోడు టీడీపీ తన హామీ మేరకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తే మరో 319 సీట్లు కన్వీనర్ కోటాలో పెరిగేవి. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు ఎన్ఎంసీ అండర్ టేకింగ్ కోరినా ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేస్తే మేం నిర్వహించలేమంటూ ప్రభుత్వమే లేఖ రాసి నాలాంటి విద్యార్థులకు తీవ్ర నష్టం తలపెట్టింది. ఇప్పటికే లాంగ్‌టర్మ్ కోచింగ్ రూపంలో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈసారి కూడా సీటు రాకుంటే నా భవిష్యత్ అంధకారమే. తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు ఈసారి సీట్లు వస్తున్నాయి. అక్కడ 8 వైద్య కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగడమే దీనికి కారణం. ఏపీలో మాత్రం వచ్చిన సీట్లు సైతం వద్దంటూ ప్రభుత్వమే లేఖ రాసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై చిత్తశుద్ధి లేని జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది...!’ విశాఖకు చెందిన నీట్ ర్యాంకర్ సాయి ఆక్రోశం ఇదీ!సాక్షి, అమరావతి: వైద్య విద్యపై ఎంతో ఆశ పెట్టుకుని లాంగ్ టర్మ్ శిక్షణతో ఏడాదంతా సన్నద్ధమై మంచి స్కోర్ సాధించిన పలువురు ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కాలేజీలు అందుబాటులోకి రాకపోవడంతో ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది 700, వచ్చే ఏడాది 1,050 చొప్పున మొత్తం 1,750 సీట్లు కోల్పోవడంతో తమ ఆశలు గల్లంతవుతున్నాయని నీట్ ర్యాంకర్లు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? అని ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే ఇక ‘కోట్లు’న్న వారికే తెల్లకోటు భాగ్యం దక్కుతుందని పేర్కొంటున్నారు.మంచి స్కోరైనా..సీట్ కష్టంనీట్ యూజీలో అర్హత సాధించిన 13,849 మంది ఈసారి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నీట్లో 500–550 స్కోర్ చేసినా రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీటు కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఓసీ విద్యార్థులైతే దాదాపు 600 స్కోర్ చేసినప్పటికీ అసలు సీటు వస్తుందో? లేదో? అనే ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణలో 500 లోపు స్కోర్ చేసిన ఓసీ విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు దక్కుతున్నాయని, ఏపీలో మాత్రం ప్రతిభ ఉన్నప్పటికీ వైద్య విద్య చదివే అదృష్టం లేదని వాపోతున్నారు. గత పదేళ్లలో తెలంగాణలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు గణనీయంగా పెరగడం, ఈ విద్యా సంవత్సరంలో 8 కళాశాలలకు ఏకంగా 400 సీట్లు అదనంగా మంజూరవడం అక్కడి విద్యార్థులకు కలిసి వస్తోంది.సీట్లు పెరిగింది గత ఐదేళ్లలోనే⇒ ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడప రిమ్స్‌లను నెలకొల్పడంతో పాటు నెల్లూరు ఎసీఎస్ఆర్ కళాశాల ఏర్పాటుకు బీజం వేశారు. ⇒ 2004కు ముందు, 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కాలేదు. దీంతో వైద్య విద్యపై తీవ్ర ప్రభావం పడింది. ⇒ గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ⇒ వీటిలో ఐదు కొత్త కళాశాలలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరడంతో వైద్య విద్యపై ఆశలు చిగురించాయి. ⇒ ఈ క్రమంలో ఈ ఏడాది మరో ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా వాటిని ప్రైవేట్‌పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.⇒ దీంతో ఈ ఏడాది 750 సీట్లు సమకూరాల్సి ఉండగా కేవలం పాడేరు వైద్య కళాశాలలో కేవలం 50 సీట్లు అది కూడా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు వాటికి అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. ⇒ ఇదే విషయం ఎంఎన్సీ (జాతీయ వైద్య కమిషన్) రాసిన లేఖ ద్వారా ఇప్పటికే బహిర్గతమైన సంగతి తెలిసిందే. ⇒ ఈ ఏడాది మెడికల్ కాలేజీలు పెరిగితే తమ పిల్లలకు కచ్చితంగా సీటు వస్తుందనే అంచనాతో సగటున రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసి నీట్ శిక్షణ ఇప్పించామని, అయితే స్కోర్ 500 దాటినా దక్కని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ⇒ పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంఎన్సీ సీట్లు మంజూరు చేయడం విస్మయం కలిగించిందంటూ ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వమే వ్యాఖ్యానించడంపై నివ్వెరపోతున్నారు.మా ఆశలను కాలరాశారుగతేడాది నీట్లో 515 స్కోర్ చేశా. ఓసీ కేటగిరీలో 543 స్కోర్‌కు కన్వీనర్ కోటాలో చివరి సీట్ వచ్చింది. దీంతో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. ఈసారి 555 స్కోర్ సాధించినా పోటీ తీవ్రంగా ఉంది. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే నాకు సీటు దక్కేది. కనీసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసినా మాకు న్యాయం జరిగేది. ప్రభుత్వమే మా ఆశలను కాలరాసింది. మేనేజ్మెంట్ కోటాలో చేరాలంటే మా తల్లిదండ్రులకు తలకు మించిన భారం. ఇప్పటికే నాతోపాటు మా సోదరుడి లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ. లక్షల్లో ఖర్చు పెట్టారు. – ఎన్. సుచేతన, రాజంపేట, అన్నమయ్య జిల్లాఅప్పుడు అదృష్టం.. ఇప్పుడు!నాకు ఇద్దరు కుమార్తెలు. 2023లో పెద్దమ్మాయి నీట్లో 530 మార్కులు సాధించి ఏలూరు కాలేజీలో సీట్ దక్కించుకుంది. ఆ విద్యా సంవత్సరంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడం, అదనంగా 750 సీట్లు పెరగడం మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు రెండో అమ్మాయి 543 మార్కులు సాధించినా ప్రభుత్వ సీట్ రావటం లేదు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఐదు కొత్త కళాశాలలు ప్రారంభం అయితే అదృష్టం కలసి వస్తుందని ఆశపడ్డాం. ప్రభుత్వమే వసతులు కల్పించలేమని చేతులెత్తేస్తే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? అదే మా అమ్మాయి పక్క రాష్ట్రంలో ఉంటే మొదటి రౌండ్లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చేది. – సీహెచ్.ఉమామహేశ్వరరావు, పోలాకి మండలం, శ్రీకాకుళంప్రభుత్వమే వ్యాపారం చేస్తానంటే ఎలా?సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ దాన్ని నెరవేర్చకపోగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వం ఉచితంగా వైద్య విద్య అందించడానికి కృషి చేయాలి. అంతేగానీ వైద్య విద్యా వ్యాపారం చేస్తానంటే ఎలా? గతేడాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమై అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రావడంతో ఎంతో సంతోషించాం. ఈ ఏడాది మరో ఐదు కొత్త కాలేజీల ద్వారా అదనంగా 750 సీట్లు వస్తాయని భావిస్తే పీపీపీ విధానం పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురి చేశారు. – జి.ఈశ్వరయ్య, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి -
ఎన్ఎంసీ సాక్షిగా కూటమి సర్కారు కుట్ర బట్టబయలు
-
కొత్తగా 400 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది అదనంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం 4 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీలకు అనుమతి ఇస్తూ ప్రిన్సిపాళ్లకు లేఖ రాసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 8 కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసింది. వాటిలో నాలుగింటికి గత నెలలో అనుమతులు రాగా, తాజాగా మిగిలిన నాలుగింటి అనుమతులపై స్పష్టత ఇచ్చింది. గత నెలలో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వీటిల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగినట్టు మంత్రి వెల్లడించారు. ముమ్మర ప్రయత్నాలు... ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది. జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమన్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. ఈ అప్పీల్ తర్వాత ములుగు, నర్సంపేట, గద్వాల నారాయణపేట కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్ఎంసీ, మిగిలిన 4 కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. ఈ కాలేజీల అనుమతులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెగ్యులర్‌గా పర్యవేక్షించారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు సిబ్బందిని నియమించారు. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్లలో తొలుత ఆ 4 కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే, మిగిలిన కాలేజీల్లోకి స్టాఫ్‌ను బదిలీ చేశారు. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి ప్రమోషన్లు ఇప్పించారు. కాలేజీ, హాస్పిటల్లో ఉండాల్సిన లేబొరేటరీ, డయాగ్నస్టిక్స్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. ఇలా ఎన్ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు సెకండ్ అప్పీల్ చేశారు. మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశాలతో వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ డాక్టర్ వాణి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ చేయాలని ఎన్ఎంసీని ఆదేశించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఆయన కృషి ఫలితంగా కొత్తగా మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. -
కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ఆపేయండి
సాక్షి, అమరావతి: ప్రైవేట్‌పై మోజుతో ప్రభుత్వ వైద్యాన్ని నిరీ్వర్యం చేసే దిశగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించిన క్రమంలో కళాశాలల నిర్మాణం ఆపివేయాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు ఏపీఎంస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కర్నూలు జిల్లా ఆదోని, సత్యసాయి జిల్లా పెనుకొండ వైద్య కళాశాలల నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కర్నూలు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా ప్రాంగణాల్లో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు వీల్లేదన్నారు.నిజానికి ఈ విద్యాసంవత్సరంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లెలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించాల్సి ఉంది. ఈ ఐదు మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుగుణంగా గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రక్రియను చంద్రబాబు సర్కార్ కొనసాగించి ఉంటే కాలేజీకి 150 చొప్పున ఈ ఏడాది 750 సీట్లు అందుబాటులోకొచ్చేవి. ప్రైవేట్‌పై ప్రేమతో వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. ఒక్క పాడేరు వైద్య కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు ఎన్ఎంసీ అనుమతి ఇచి్చంది. 150 సీట్లు రావాల్సిన చోట కేవలం మూడో వంతే అందుబాటులోకొచ్చాయి. పులివెందులలో 50 సీట్లకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వకపోవడంతో ఆ సీట్లు కోల్పోవాల్సి వచి్చంది. ఇక ఉచిత వైద్యం ఊసుండదు ప్రతి జిల్లాలో ప్రభుత్వ రంగంలోనే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్న లక్ష్యంతో రూ. 8 వేల కోట్లకుపైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి, ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే లక్ష్యం. కాగా, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి విద్యా, వైద్యానికి పేద, మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బు గుంజాలన్నది చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. పీపీపీ విధానంలో ప్రైవేట్ అజమాయిషీలోకి బోధనాస్పత్రులు వెళితే ఉచిత వైద్యం ఊసే ఉండదని, పీపీపీ విధానం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇదే జరుగుతోందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. బాబు హయాంలో ప్రైవేట్‌కు పచ్చజెండా గతంలో 1994 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో, అనంతరం 2014–19 విభజిత ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా వాటిలో చంద్రబాబు పాలనలో ఏర్పాటైనవి ఒక్కటీ లేదు. ప్రస్తుతం 18 ప్రైవేట్ వైద్య కళాశాలలుండగా 12 కళాశాలలకు చంద్రబాబు పాలనలోనే అనుమతులు లభించాయి. గతంలోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామిగా కొనసాగినా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు బాబు కృషి చేయలేదు. ప్రస్తుతం బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్రంలోనూ అనుకూల పరిస్థితులున్నా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో 17 కొత్త కాలేజీలు వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐదింటిని గతేడాది ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను ఒకే ఏడాది సమకూర్చారు. ఈ ఏడాది మరో ఐదు కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ పీపీపీ మోడల్ పేరిట కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతోంది. -
కొత్త వైద్య కళాశాలలకు 380 పోస్టుల మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలకు 21 విభాగాల్లో 380 పోస్టులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలను సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, 2023–24 విద్యా సంవత్సరంలో మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలను ప్రారంభించారు. 2024–25 విద్య సంవత్సరంలో పాడేరు, పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని కళాశాలలను ప్రారంభించనున్నారు. కళాశాలకు 222, బోధన ఆస్పత్రికి 484 చొప్పున గతంలోనే కొత్త పోస్టులను మంజూరు చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, టీచింగ్ ఫ్యాకల్టీని అందుబాటులో ఉంచడంలో భాగంగా తాజాగా మరో 380 పోస్టులను మంజూరు చేశారు. 60 ప్రొఫెసర్, 85 అసోసియేట్ ప్రొఫెసర్, 75 అసిస్టెంట్ ప్రొఫెసర్, 160 ఎస్ఆర్/ట్యూటర్ పోస్టులకు కొత్తగా మంజూరు చేసిన వాటిలో ఉన్నాయి. కాగా, 2024–25 విద్య సంవత్సరంలో ప్రారంభిస్తున్న వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా శుక్రవారం 130 మంది ట్యూటర్, 37 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నియామక ఉత్తర్వులిచ్చింది. కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సరీ్వసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థుల జాబితాలను డీఎంఈకి అందజేయగా వీరికి పోస్టింగ్‌లు ఇస్తున్నారు. -
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 112 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు సంబంధించిన దరఖాస్తులను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పరిశీలించింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం 112, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు 58 దరఖాస్తులు వచి్చనట్టు వెల్లడించింది. కాగా, ఏపీలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ఐదు దరఖాస్తులు అందినట్టు తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను 2023–24 విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచి్చంది. కాగా వచ్చే విద్యా సంవత్సరం (2024–25)లో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరుల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు వైద్య శాఖ దరఖాస్తు చేసింది. అలాగే మరో ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి వీలుగా బోధనాస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొత్తం 17 వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకు 2,550 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెస్తోంది. తద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను వారికి చేరువ చేస్తోంది. ఐదు దశల్లో అనుమతుల ప్రక్రియ కొత్త కళాశాలలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను ఎన్ఎంసీ ఐదు దశల్లో చేపడుతోంది. తొలి దశలో దరఖాస్తుల పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలు సమరి్పంచని, బోధనాస్పత్రుల్లో పడకలు, ఫ్యాకలీ్ట, ఇతర అంశాల్లో లోటుపాట్లు ఉన్న కళాశాలలకు నోటీసులు జారీ చేస్తోంది. వివరణ ఇవ్వడానికి కళాశాలలకు గడువు విధించింది. ఈ ప్రక్రియ ముగిశాక రెండో దశలో ఫ్యాకల్టీ ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్) నమోదు చేపట్టనుంది. ఈ రెండు దశల ప్రక్రియ ముగియడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. అనంతరం మూడో దశలో కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఎన్ఎంసీ తనిఖీలు చేపట్టనుంది. నాలుగో దశలో కళాశాలలపై సమీక్ష చేపడుతుంది. ఐదో దశలో అనుమతులు జారీ చేస్తుంది. -
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటును జీర్ణించుకోలేక ఈనాడు వక్రరాతలు
-
రామోజీకే తక్షణం చికిత్స కావాలి!
రామోజీకి పచ్చ పైత్యం మరీ ఎక్కువై పోయింది. నిత్యం ఏదో రకంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లనిదే నిద్ర పట్టని స్థితికి చేరుకున్నారు. ప్రజలకు అందుబాటులో అత్యుత్తమ వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ బాబు పాలనలో కుదేలైన వైద్య ఆరోగ్య రంగం ఇప్పుడు పూర్తిగా రూపురేఖలు మార్చుకోవడాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఎక్కడైనా కొత్త వైద్య కళాశాల ప్రారంభమైతే అదనంగా సేవలు అందుతాయనే కనీస విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పచ్చి అబద్ధాలతో ప్రజల మెదళ్లలో విషం నింపుతున్నారు. వైద్య సేవలు అందడం లేదని చెబుతున్న రామోజీ ఈ ఆస్పత్రులకు వస్తే.. ఆయన రోగాలన్నింటికీ, ప్రత్యేకించి పచ్చ పైత్యానికి మంచి మందు ఇస్తారు. సాక్షి, అమరావతి : చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన ప్రభుత్వ వైద్య రంగానికి విప్లవాత్మక సంస్కరణలతో ఈ ప్రభుత్వం ఊపిరి ఊదడం రామోజీరావుకు ఏమాత్రం నచ్చలేదు. ప్రభుత్వాస్పత్రుల ద్వారా జరిగే మంచి నుంచి ప్రజల దృష్టి మరల్చేలా డొల్ల కథనాలు ప్రచురిస్తున్నారు. కొత్తగా వైద్య సేవలు ప్రారంభమైతే సంతోషించాల్సింది పోయి ‘ఇవేం బోధనాస్పత్రులు?’ అంటూ బుధవారం ఓ కథనంలో అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన బోధనాస్పత్రుల్లో రోగులకు సేవలు అందడం లేదంటూ ఆరోపణలు చేశారు. వైద్య విద్యను బలోపేతం చేయడం ద్వారా మన విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలు పెంచడంతో పాటు, ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయాలని సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఐదు చోట్ల జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేశారు. అయితే ఈ ఆస్పత్రుల్లో రోగులకు సేవలు సక్రమంగా అందడం లేదంటూ రామోజీ పనిగట్టుకుని అసత్యాలు అచ్చేశారు. ఇందులో నిజానిజాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ : విజయనగరం జీజీహెచ్‌లో ఓపీ మధ్యాహ్నం 12.30 వరకు చూస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 700 వరకూ ఓపీలు నమోదు అవుతున్నాయి. గతంలో 200 పడకలకు ఉన్న సిబ్బందినే 400 పడకలకు వాడుతున్నారు. వాస్తవం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఓపీ చూస్తున్నారు. ఉదయం ఓపీలో చూపించుకున్న వారికి ఫాలోఅప్ సేవల కోసం తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓపీలు చూస్తున్నారు. బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసిన అనంతరం అందుకు తగ్గట్టుగా పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టించి వాటి భర్తీ చేపట్టింది. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా బోధనాస్పత్రికి అవసరమైన అన్ని స్పెషాలిటీల్లో వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ఈ ఆస్పత్రిలో రోజుకు వెయ్యి వరకు ఓపీలు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరుకు 2.40 లక్షల ఓపీలు నమోదు అయ్యాయి. అదే జిల్లా ఆస్పత్రిగా ఉన్నప్పుడు 2020–21లో 2.11 లక్షల ఓపీలు నమోదు అయ్యాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఆస్పత్రిలో ఓపీ సేవల్లో వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఈనాడు రాసింది తప్పుడు రాతలని స్పష్టంగా తెలుస్తోంది. ఆరోపణ : ఏలూరు జీజీహెచ్‌లో 24 వైద్య పోస్టులకుగాను 10 మంది మాత్రమే ఉన్నారు. వాస్తవం : ఇక్కడ 73 వైద్య పోస్టులు శాంక్షన్‌లో ఉండగా 64 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఏలూరుతో పాటు, మిగిలిన నాలుగు వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల కోసం ప్రభుత్వం 3,530 పోస్టులను కొత్తగా సృష్టించింది. వీటిలో మెజారిటీ శాతం పోస్టులను ప్రారంభంలోనే భర్తీ చేశారు. అనంతరం వివిధ కారణాలతో ఎక్కడైనా పోస్టులు ఖాళీ ఏర్పడితే వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపడుతున్నారు. కొరత అన్న మాటకు ఆస్కారం లేకుండా చర్యలు ఉంటున్నాయి. ఆరోపణ : రాజమండ్రి జీజీహెచ్‌లో సేవలు అధ్వాన్నం.. వాస్తవం : ఈనాడు ఆరోపించినట్టు ఇక్కడ అలాంటి పరిస్థితి లేనే లేదు. గతంతో పోలిస్తే వైద్య సేవల్లో వృద్ధి ఉంది. 2020–21లో జిల్లా ఆస్పత్రిగా ఉన్నప్పుడు 1.61 లక్షల ఓపీ (అవుట్ పేషంట్)లు, 24 వేల ఐపీ (ఇన్ పేషంట్)ల చొప్పున ఇక్కడ నమోదు అయ్యాయి. బోధనాస్పత్రిగా అభివృద్ధి చేశాక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు మధ్య 2 లక్షల ఓపీలు, 18,351 ఐపీలు నమోదయ్యాయి. ఆరోపణ : మచిలీపట్నంలో సగానికి పైగా తగ్గిన ఓపీలు వాస్తవం : జిల్లా ఆస్పత్రిగా ఉన్న సమయంతో పోలిస్తే ప్రస్తుతం ఓపీలు తగ్గాయన్నది పచ్చి అబద్ధం. 2020–21లో 1.70 లక్షల ఓపీలు నమోదు అయ్యాయి. అంటే రోజుకు 466 చొప్పున అన్న మాట. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య లక్షకుపైనే ఓపీలు నమోదు అయ్యాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే ఓపీలు తగ్గినట్లా.. పెరిగినట్లా? ప్రజారోగ్యానికి పెద్దపీట ♦ 2019లో అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం జగన్ ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు పాలనలో నిరీ్వర్యమైన ప్రభుత్వ వైద్య రంగానికి ఊపిరిలూదారు. ఇందులో భాగంగా నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలలతో పాటు పలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. అప్పటికే ఉన్న ఆస్పత్రుల బలోపేతం చేపట్టారు. ♦ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 1,146కు అదనంగా 88 కొత్త పీహెచ్‌సీలను మంజూరు చేసింది. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులతో పాటు 14 మంది సిబ్బందిని సమకూర్చారు. మరోవైపు పల్లెల్లోనే ప్రజలకు వైద్య సేవలు అందించేలా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. ♦ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి విలేజ్ క్లినిక్ పరిధిలో పీహెచ్సీ వైద్యులు నెలలో రెండుసార్లు పర్యటించి వైద్య సేవలు అందిస్తున్నారు. మంచానికే పరిమితం అయిన వారికి ఇళ్ల వద్దే వైద్యం చేస్తున్నారు. ఈ విధానంలో ఇప్పటి వరకు 1.16 కోట్ల మంది స్వగ్రామాల్లోనే వైద్య సేవలు పొందారు. ♦ దేశంలో ఎక్కడా లేనట్టుగా రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం, సమస్యలు గుర్తించడం, వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజలకు వైద్య పరంగా చేయిపట్టి నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 12,419 సురక్ష శిబిరాలు నిర్వహించగా, 60,25,614 మంది రోగులు సేవలు పొందారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న 86,603 మందిని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచితంగా చికిత్స చేయిస్తున్నారు. ♦ ఆరోగ్యశ్రీలో ప్రోసీజర్లను 1,059 నుంచి 3,257కు పెంచారు. అంతేకాకుండా చికిత్స అనంతరం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి భృతిని ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు ప్రధాన సమస్య అయిన మానవ వనరుల కొరతకు ఈ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఏకంగా 53 వేలకు పైగా పోస్టులను ఇప్పటి వరకు భర్తీ చేసింది. వైద్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా బోర్డ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చింది. -
జగనన్న లేకుంటే నా కల కలగానే మిగిలేది
-
మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు రావడం చాలా సంతోషంగా ఉంది..!
-
ఈ విద్యా సంవత్సరం నుండే ప్రారంభమైన రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల
-
నా బిడ్డను డాక్టర్ చేస్తునందుకు జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం
-
మరో 8 మెడికల్ కాలేజీలకు నిధులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యం వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తికానుంది. రెండు రోజుల కిందే తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించగా.. వచ్చే ఏడాది మరో ఎనిమిదింటిని అందుబాటులోకి తేనున్నట్టు ప్రక టించారు. రూ.1,447 కోట్లతో ఈ 8 మెడికల్ కాలే జీలకు భవనాలు, హాస్టళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం పరి పాలన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండగా.. వచ్చే ఏడాది నాటికి ఏకంగా 34కు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తొమ్మిది కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించుకున్న మరుసటి రోజే మరో ఎనిమిది కాలేజీల ఏర్పాటుకు పరిపాలన అనుమతుల మంజూరు చేసేలా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. నారాయణపేట్, ములుగు, మెదక్‌లలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీల కోసం రూ. 180 కోట్ల చొప్పున.. గద్వాల, నర్సంపేట, యాదాద్రిలలో కాలేజీలకు రూ.183 కోట్ల చొప్పున, కుత్బుల్లాపూర్ కాలేజీకి రూ.182 కోట్లు, మహేశ్వరం కాలేజీకి రూ. 176 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఈ మేరకు కాలేజీలు, హాస్టల్ భవనాల నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ 8 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి, ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీడబ్ల్యూసీ భేటీ పేరుతో కాంగ్రెస్ జిమ్మిక్కులు హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల పేరుతో కాంగ్రెస్ జిమ్మిక్కులకు పాల్పడుతోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయడం కుదరదని, రాష్ట్రానికి పర్మనెంట్ గ్యారంటీ కేసీఆరేనని చెప్పా రు. ఎవరెన్ని చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం దేశానికే దిక్సూచి అని అభివర్ణించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
దేవదూతలందరికీ రెక్కలు ఉండవ్!... ! కొందరికి స్టెతస్కోప్‌లే ఉంటాయ్!!
అందరూ ఆయా నేపథ్యల రీత్యా వేరువేరు వృత్తులు చేస్తుంటాం. ఇది సర్వసాధారణం. ఆయా వృత్తులకు అనుగుణంగా వారు ధరించే డ్రస్‌లు, తీరు బట్టి వారు ఏం చేస్తున్నారని చెప్పేస్తాం. మెడలోని ఈ సెతస్కోప్ చూడగానే మాత్రం..ఒక్కసారిగా కళ్లు పెద్దవి అవుతాయి. తెలియకుండాని చేతులు పైకెత్తి నమస్కారిస్తాయి. అంత గొప్పది వైద్య వృత్తి. వైద్యో నారాయణో హరిః అన్న పెద్దల మాట అక్షరాల నిజం. అలాంటి వైద్య విద్యకు పెద్దపీట వేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఒకేరోజు ఐదు మెడికల్ కాలేజ్‌లు ప్రారంభించి రికార్డు సృష్టించారు. పేదలకు అందని ద్రాక్షలా ఉండే వైద్య విద్యను మరింత దగ్గర చేసేలా నిరుపేదలకు మెరుగైన వైద్యం అందేలా ఓ సరికొత్త సువర్ణ అధ్యయనానికి నాంది పలికారు. ఈ సందర్భంగా ఏపీలో స్వతంత్రం వచ్చాక వైద్య విద్య ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? తదతరాల గురించి సవివరంగా చూద్దాం! స్వతంత్రం వచ్చాక ఏపీలో కేవలం 11 కాలేజ్లే ఉన్నాయి. పైగా అప్పట్లో విద్యార్థులెవరు డాక్టర్ అవుతానని చెప్పే సాహసం చేసేవారు కూడా కాదు. ఎందుకంటే అది డబ్బున్నోళ్లు చదివే చదువు అని భావించేవారు. అందుకు తగ్గట్టుగానే కాలేజ్‌లు పెద్దగా అందుబాటులో ఉండేవి కావు. దీనికితోడు ఆయా కాలేజ్‌లో వసతులు తక్కువగానే ఉండేవి. ఇక మెడిసిన్ సీట్లు విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త పలుకుబడి, పెద్దల అండదండ ఉన్నవాళ్లకే దొరికేవి. బాగా చదివిన పేద స్టూడెంట్స్ సైతం నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి. మంచి ర్యాంకు వచ్చిన ఉద్యోగాల్లో స్థిరపడిపోయే ఫార్మాస్యూటిక్స్ వంటి ఇతర రంగాలు లేదా అగ్రికల్చర్ బీఎస్సీ వంటి కోర్సుల వైపుకి వెళ్లిపోయేవారు. తొందరగా సెటిల్ అవ్వోచ్చు లేదా ఉద్యోగం కూడా సంపాదించడం ఈజీగా ఉంటుందనో వేరే రంగాలవైపుకి వెళ్లిపోయేవారు. ఎంబీబీఎస్ సీటు దక్కించుకోవటం, డాక్టర్ అవ్వడం ఓ తియ్యటి కలలానే ఉండేది విద్యార్థులకు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వైద్య విద్య విషయంలో అంతగా చొరవ చూపలేదు. ఇక ఇక్కడ ప్రజలు కూడా వైద్యులు సంప్రదించేవారు కాదు. ఒకరకంగా చెప్పాంటే ఆస్పత్రులు అందుబాటులో లేవని చెప్పాలి. పేదవాడికి రోగం అంటే చావుతో సమానం. అలాంటి రోజులు. చుట్టుపక్కల ఉండే ఆర్ఎంపీ డాక్టర్లే వారికి దిక్కు. ఎంత పెద్ద ప్రమాదం వచ్చిన వారి వద్దకే. పట్టణాలకి వెళ్లి చూపించుకునేంత స్థోమత లేకపోవడం కూడా ఓ కారణం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో సరిగ్గా ఆ టైంలో వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వం ఆ పరిస్థితిని చక్కబెట్టింది. ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో పేదలు కూడా మంచి వైద్యం అందుకునే అవకాశం కల్పించారు. పేద, బలహీన బడుగు వర్గాల మహిళలు పురుడు పోసుకోవడం ఓ నరకంగా ఉండేది. ఇక ఆ సమస్యకు 108 సర్వీస్‌తో చెక్‌పెట్టి.. సత్వరమే ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించడం వైద్యం అందేలా చూడటం వంటి సేవలతో ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అనే వరం ఇచ్చారు. ఆయన హయంలో ఏపీలో ఉద్యోగులు, పేద విద్యార్థలకు, మహిళలకు ఓ సువర్ణయుగంలో సాగిపోయింది. హెలికాప్టర్లో ఆయన అకాల మరణం, తర్వాత జరిగిన రకారకాల పరిణామాల మధ్య మళ్లీ పరిస్థితి అగోమ్య గోచరంలోకి వచ్చేసింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వం కూడా ఆయన సాగించిన పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకురాలేకపోయింది. మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వంతో మళ్లీ ఏపీ గత సువర్ణ యుగంతో కాంతులీనడం మొదలైంది. తండ్రి ఆశయాలను, ఆకాంక్షలను నిలబెడుతూ..ప్రజారంజకంగా పాలించి ప్రజల మన్నలను పొందుతున్నారు. తండ్రి రెండు అడుగులు వేసి ఏపీని అభివృద్ధి దిశగా వచ్చేలా చేస్తే.. ఆయన తనయుడు జగన్ మరో నాలుగు అడుగులు ముందుకేసి మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేలా పథకాలను ప్రజల వద్దకు తీసుకువచ్చి జనం మెచ్చిన సీఎం, జననాయకుడు అనే బిరుదులు అందుకుంటున్నారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఫీజు రీయంబర్స్‌మెంట్‌లతో పేదలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య అందుకునేలా చేస్తే తనయుడు మరో ముందడుగు వేసి అత్యంత ఖరీదైన వైద్య వృత్తిని పేదవాడి ముంగిట ఉండేలా చేశారు. పేదలకు ఆరోగ్యాన్ని మరింత చేరువ చేసేలా ఫ్యామిలీ డాక్టర్ వంటి వాటితో 95% ప్రజలు ఆరోగ్య శ్రీ పథకాన్ని అందుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మరో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడతూ.. రాష్ట్ర చరిత్రలోనే ఒకే రోజు ఐదు కళాశాలలు ప్రారంభించి జనం మెచ్చిన నాయకుడంటే ఏంటో చూపించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా వైద్య కళశాలలు ఏర్పాటు చేయడమేగాక ఈ ఏడాది నుంచే ఎంబీబీఎస్ తరగతులు అందుబాటులో ఉండేలా చేశారు. అంతేగాదు ప్రతి పార్లమెంట్‌కు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవడమేగాక ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి.. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు అని పించుకున్నారు సీఎం జగన్. దీని ఫలితంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరగడం, పేద విద్యార్థుల సైతం వైద్య విద్యా\ను అభ్యసించే గొప్ప అవకాశం రెండు లభిస్తున్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే పేదలకు కూడా మెరుగైన వైద్యం మరింత చేరవవుతుంది. ఏ రాష్ట్రమైన సుభీక్షంగా ఉండాలంటే అది విద్యతోనే సాకారం అవుతుంది. అదికూడా సామాన్యుడు సైతం ఉన్నత విద్యను అందుకోగలిగితేనే ఆ రాష్ట్రం స్యశ్యామలంగా ఊహకందని రీతిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనడానికి ఏపీనే ఉదాహారణ. (చదవండి: మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!) -
వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను ప్రారంభిస్తాం
-
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..!
-
ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యలో నూతన విప్లవం
-
ఏపీ వైద్య విద్యలో వందేళ్ల రికార్డు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజయనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టడం ద్వారా సీఎం జగన్ నూతన అధ్యాయాన్ని లిఖించారు. 17 కొత్త కళాశాలలు.. 2,550 ఎంబీబీఎస్ సీట్లు రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మిషన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది. మూడేళ్లలోనే సీట్లు రెట్టింపు రాష్ట్రంలో ఆంధ్రా వైద్య కళాశాల 1923లో మొదటిసారిగా ఏర్పాటైంది. ఆ తరువాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా 2,185 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాయి. అంటే 2,185 సీట్లు సమకూరడానికి వందేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 17 వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూరుస్తుండటం గమనార్హం. అంటే కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపు దాటనున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి అత్యాధునికంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ కాలేజీ కంటే మెరుగ్గా ఉంది. అత్యాధునిక ల్యాబ్స్, టీచింగ్ హాల్స్, లెక్చర్ హాల్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో తొలి బ్యాచ్‌లో చదవడం చక్కటి అనుభూతి. ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయకపోయి ఉంటే మేం ప్రైవేట్ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. – సీహెచ్, ఢిల్లీరావు, వైద్య విద్యార్థి, ఏలూరు వైద్య కళాశాల గొప్ప వరంలా భావిస్తున్నా మాది విశాఖపట్నం. మధ్యతరగతి కుటుంబం. నీట్లో కొంత మెరుగైన ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ బీసీ ‘ఏ’ కేటగిరీలో గతంలో ఈ ర్యాంకుకు మెడిసిన్‌లో సీటు రావటం సాధ్యమయ్యేది కాదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడంతో నా ర్యాంక్‌కు సీట్ దక్కింది. లేదంటే మళ్లీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఒత్తిడితోపాటు విలువైన సమయం, డబ్బు వృథా అయ్యేది. కార్పొరేట్ వైద్య కళాశాలలకు ధీటుగా మా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం గొప్ప వరంలా నాలాంటి ఎందరో విద్యార్థులు భావిస్తున్నారు. – బమ్మిడి లక్ష్మీజ్యోత్న్స, వైద్య విద్యార్థిని, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల రెండు రకాల లాభాలు.. వైద్యవిద్య డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో మన విద్యార్థులు వలస వెళుతున్నారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరుగుతున్నాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రులున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఇలా విద్య, వైద్యంలో రెండురకాలుగా లాభాలుంటాయి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ ఉన్నత స్థాయి వైద్యం కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు పని చేస్తాయి. వీటిద్వారా ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు అభివృద్ధి చెందుతాయి. ఆయా ప్రాంతాల్లో జబ్బులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు పెరుగుతాయి. సేవలు రెట్టింపు అవుతాయి. అన్ని ప్రాంతాల్లో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు వ్యయ ప్రయాసలు తొలగి అనుభవజ్ఞులైన వైద్యుల సంరక్షణ లభిస్తుంది. రోగులు మరింత త్వరగా కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. – డాక్టర్ జి.రవికృష్ణ,ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న చోటే వైద్య విద్యలో చేరా.. ప్రభుత్వం మా ప్రాంతంలో కొత్త వైద్య కళాశాలను ప్రారంభించడంతో అక్కడే ఆప్షన్ ఇచ్చా. అందులోనే సీటు వచ్చింది. ఇటీవలే తరగతులు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. మేం ఉంటున్న ప్రాంతంలోనే వైద్య విద్య అభ్యసిస్తున్నా. లేదంటే దూర ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చేది. మనవద్ద మెడికల్ సీట్లు పెరగడంతో చాలా మందికి అవకాశాలు లభించాయి. – మహ్మద్ హర్సిన బేగం, వైద్య విద్యార్థిని, రాజమండ్రి వైద్య కళాశాల నాలుగేళ్లలో వైద్యం బలోపేతం ఇలా.. నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వాలు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. టీడీపీ హయాంలో 108 అంబులెన్స్‌లు కేవలం 531 మాత్రమే ఉండగా ఇందులో కేవలం 336 మాత్రమే మనుగడలో ఉండేవి. పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. జాతీయస్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు ఖాళీలు 61 శాతం కాగా మన రాష్ట్రంలో అది కేవలం 3.96% మాత్రమే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద దీర్ఘకాలిక రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా ఇంటి వద్దే పెన్షన్లు గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు. -
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తరగతుల ప్రారంభం
-
Fact Check: వైద్యానికి శాశ్వత బలం
సాక్షి, అమరావతి: నాలుగేళ్లలో 53 వేలకు పైగా వైద్య పోస్టులను భర్తీ చేసిన చరిత్ర మన రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉందా? మన కళ్లెదుటే స్పెషలిస్టు డాక్టర్లు, కొత్త మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ అవుతున్నాయి. అసలు ఖాళీల భర్తీకే ప్రత్యేకంగా మెడికల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటైందంటే వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తోందో వేరే చెప్పాలా? అయినా సరే చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని కాకమ్మ కధలు అల్లే రామోజీని ఏమనుకోవాలి? ‘కాంట్రాక్ట్’ క్రమబద్ధీకరణ.. ఏపీ వీవీపీ విలీనం టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో చంద్రబాబు అతి కష్టమ్మీద వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేసింది కేవలం 1,693 పోస్టులు. ప్రభుత్వాస్పత్రుల వైపు చూడాలంటేనే జనం జంకే పరిస్థితి కల్పించారు. మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేదలకు ప్రైవేట్ వైద్యాన్నే దిక్కుగా మార్చేశారు. ఇలాంటి దుస్థితిలో ఉన్న వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్ ఏకంగా 53,126 పోస్టులను భర్తీ చేసి జవసత్వాలు చేకూర్చారు. వైద్య రంగంలో మన రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా మార్చారు. వైద్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీ ఏర్పడినా ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే వెంటనే భర్తీ చేసేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు ఇచ్చింది. వైద్య శాఖ నియామకాల కోసమే ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్‌ను ఏర్పాటు చేసింది. ఇది గొప్ప ప్రగతిశీల చర్యగా కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. పీహెచ్‌సీల్లో వైద్యులు ఎవరైనా దీర్ఘకాలిక సెలవుపై వెళితే సేవలకు అంతరాయం కలగకుండా జిల్లాకు నలుగురు చొప్పున 114 మంది డాక్టర్లను సిద్ధంగా ఉంచగా తాత్కాలిక సెలవుపై వెళ్లిన చోట విధులు నిర్వర్తించేందుకు 175 మంది చొప్పున పూల్ అప్ వైద్యులను అందుబాటులో ఉంచారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత 61 శాతం కాగా మన రాష్ట్రంలో కేవలం 5 శాతానికే పరి మితమైంది. వైద్య శాఖలో 2014కు ముందు ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వీలుగా ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఏపీ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా వేల మంది ఉద్యోగులకు భద్రత కల్పించింది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు (ఎంఎల్‌హెచ్‌పీ) దేశంలో ఎక్కడా లేనివిధంగా పారి తోషికం చెల్లిస్తోంది. పనితీరును అంచనా వేసి అదనంగా రూ.15 వేల వరకూ ప్రోత్సాహకం అందిస్తోంది. ప్రోత్సాహకంతో కలిపి గరిష్టంగా రూ.40 వేల వరకూ వేతనా లను చెల్లిస్తోంది. మరి ఇలాంటి చర్యలు చంద్రబాబు ప్రభుత్వంలో రామోజీ ఎప్పుడైనా చూశారా? కనీసం ఇప్పుడైనా తెలుసుకుంటున్నారా? -
కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం
విజయనగరం ఫోర్ట్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/నంద్యాల టౌన్/కోనేరుసెంటర్/ఏలూరు టౌన్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు మెడికల్ కళాశాలల్లో శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లాలోని గాజులరేగ వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల ప్రారంభించారు. అమె మాట్లాడుతూ..మొదటి ఏడాది విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ విభాగాలకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కళాశాలలో అందుబాటులో ఉన్న 150 సీట్లలో ఇప్పటివరకు 116 మంది విద్యార్థులు చేరారని, మరో 34 సీట్లు భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మించిన వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులకు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మీ హాజరయ్యారు. మొత్తం 150 మంది విద్యార్థులకు ఫేజ్ 1,2 లలో 120 మందికి కౌన్సిలింగ్ పూర్తి చేసి ప్రవేశాలు కల్పించారు. తొలిరోజు తరగతులకు 70 మంది హాజరయ్యారు. నంద్యాలలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల హాజరు నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాదరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ ఆనంద కుమార్ల ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 2023–24 మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులకు సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాల్లో 222 మంది భోదన, భోదనేతర సిబ్బందితో, 150 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 150 సీట్లకుగానూ ఇప్పటివరకూ 113 మంది విద్యార్థులు చేరారు. కళాశాలకు 11 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 17 మంది సీనియర్ రెసిడెంట్లు, ఇతర సిబ్బందిని నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందిన 112 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఏపీ వైద్యవిద్య అదనపు డైరెక్టర్ డాక్టర్ కేవీవీ విజయ్‌కుమార్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
ఆంధ్రప్రదేశ్‌లో నూతన మెడికల్ కాలేజీల కల సాకారం..ఇంకా ఇతర అప్డేట్స్