
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు యాస్పిరేషనల్ జిల్లా కింద కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ కోరారు. మంగళవారం కేంద్ర మంత్రిని కలసి న ఈటల మీడియాతో మాట్లాడారు.
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ఏడు జిల్లాలతో ప్రతిపాదనలు ఇచ్చామని, వాటిలో రెండు లేదా మూడు జిల్లాల్లో కొత్త కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరామన్నారు.