Harsha Vardhan
-
ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్
న్యూఢిల్లీ: 2024–25 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్‌గా ఇమామి లిమిటెడ్ ఎండీ హర్షవర్ధన్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.నవంబర్ 21న ఫిక్కీ 97వ వార్షిక సమావేశం ముగిసిన తర్వాత అగర్వాల్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఫిక్కీ ప్రెసిడెంట్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా ఉన్నారు.ఇదీ చదవండి: అభినవ ‘టాటా’! సంపదలో భారీ మొత్తం విరాళం -
గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేసిన వారికే బదిలీలు: హర్షవర్ధన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనలో పార్టీ కోసం పనిచేసిన వారికే బదిలీలు చేసేవారని అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో టీచర్లకు హామీ ఇచ్చి వారిని మోసం చేసిన ఘనత కేసీఆర్‌దే అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ముందు డాక్టర్‌కు చూపించండి. నిన్న టీచర్స్ డేను టీచర్లు పండుగలా చేసుకున్నారు. నిన్న రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి 2014 నుంచి 2023 వరకు టీచర్స్ డే వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారా?. నిన్న ఐటీ సదస్సులో సీఎం పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు.బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎప్పుడైనా టీచర్స్ సమస్యలపై సమీక్ష చేపట్టారా?. సీఎం రేవంత్ ఇప్పటికే 30 మందికి ప్రమోషన్ ఇచ్చారు. మీ పాలనలో బదిలీలు జరిగితే సస్పెండ్ అయ్యారు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ కోసం పనిచేసిన వారికే బదిలీలు చేసేవారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా బదిలీలు, ప్రమోషన్లు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. జూన్ ఆరో తేదీన ఎన్నికలు అయిపోగానే మరుసటి రోజు సీఎం రేవంత్ బదిలీలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దరఖాస్తులు పెట్టుకోకున్నా బెస్ట్ టీచర్ అవార్డులు ఇచ్చాం. తెలంగాణ వచ్చిన తర్వాత టీచర్లపై బీఆర్ఎస్ వివక్షత చూపింది. కొఠారీ కమిషన్ బడ్జెట్లో ఆరు శాతం నిధులు ఇవ్వాలంటే.. సీఎం రేవంత్ మాత్రం ఏడు శాతం ఇచ్చారు. విద్య పట్ల సీఎం రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంది’ అని కామెంట్స్ చేశారు. -
49 ఏళ్లయినా సింగిల్‌గానే.. కారణమేంటో చెప్పిన నటుడు
హర్షవర్దన్.. డైరెక్టర్‌గా కంటే కూడా అమృతం సీరియల్ నటుడిగా ఎక్కువమందికి సుపరిచితం. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా ఎన్నో చిత్రాల్లో నటించాడు. గుండెజారి గల్లంతయ్యిందే, మనం, గురు వంటి సినిమాలకు డైలాగులు రాశాడు. ఇటీవల రిలీజైన మామా మశ్చీంద్ర సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ ఇది బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇకపోతే 49 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంటున్నాడు హర్ష వర్ధన్. తను ఒంటరిగా ఉండటానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'నా లైఫ్ స్టైల్‌కు పెళ్లి అనేది పడదు. నేను అందరితోనూ స్నేహంగా ఉంటాను. ఉన్న కాసేపు చాలా బాగా మాట్లాడతాను. అలా అని పార్టీలకు గట్రా వెళ్లను. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాను. వేరేవాళ్లకు ఎక్కువ సమయం ఇవ్వడం, వాళ్లకు నచ్చినట్లుగా ఉండటం అనేది కష్టం. నేనసలు నా కుటుంబ బాధ్యతలనే సరిగా పట్టించుకోను. నేను పెళ్లి చేసుకుంటే భార్యను వదలను, వేరే అమ్మాయిని కన్నెత్తి చూడను, పిల్లలను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను. వాళ్లు చనిపోయేవరకు నేను బతికుండాలి.. ఎందుకంటే వారికోసం కష్టపడాలి, వాళ్లకు రక్షణ కవచంగా ఉండాలి! అని ఆరాటపడతాను. అయినా పెళ్లి అనేది తోడు కోసం అంటారు. కానీ, అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ, బిజినెస్ డీల్. మనకు చేతకానప్పుడు భార్యాపిల్లలు చూసుకుంటారు. మన పనులన్నీ చేసిపెడతారంతే! నాకు కూడా గతంలో రిలేషన్స్ ఉన్నాయి. పెళ్లి కోసం అమ్మాయిల వెంటపడ్డాను కూడా! ఒకమ్మాయైతే బ్రేకప్ అయ్యాక కూడా అప్పుడప్పుడూ మెసేజ్‌లు చేస్తూ ఉంటుంది. నా మంచి చెడూ చూసేందుకు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక జీవితమంతా ఆడుతూ పాడుతూ సింగిల్‌గా బతికేస్తాను' అని చెప్పుకొచ్చాడు హర్ష వర్ధన్. చదవండి: బిగ్‌బాస్ 7 మినీ లాంచ్‌లో నాగ్ వేసుకున్న షర్ట్ ధరెంతో తెలుసా? -
కొల్లాపూర్‌లో హీటెక్కిన రాజకీయం
-
క్రైమ్ థ్రిల్లర్
రితికా సింగ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఇన్ కార్’. హర్ష వర్ధన్ దర్శకత్వంలో అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది. రితికా సింగ్ మాట్లాడుతూ–‘‘ఈ మూవీలోని నా పాత్ర కోసం షూటింగ్ పూర్తయ్యే వరకు నేను తల స్నానం చేయలేదు’’ అన్నారు. ‘‘సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్’’ అన్నారు హర్ష వర్ధన్. ఈ చిత్రానికి కెమెరా: మిథున్ గంగోపాధ్యాయ. -
కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన సుధీర్ బాబు
Sudheer Babu Next Film Directed By Harsha Vardhan Goes On Floors: సుధీర్‌బాబు కెరీర్లో 15వ సినిమాగా రాబోతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ షురూ అయ్యింది. నటుడు–దర్శకుడు హర్షవర్ధన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభం అంటూ చిత్రయూనిట్ ఓ వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. సుధీర్‌బాబు కోసం భిన్నమైన కథను రెడీ చేశారు హర్షవర్ధన్. ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తారు సుధీర్ బాబు. ఈ చిత్రంలో ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తున్నారాయన. ఈ తొలి షెడ్యూల్లో కీలక పాత్రధారులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా. -
చిన్నారికి చిత్రహింసలు
తూప్రాన్: మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని ఆవేశంతో మూడేళ్ల కొడుకును విచక్షణ రహితంగా చితకబాదాడొక తండ్రి. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లాంపూర్‌లో బెడ బుడగ జంగాల కాలనీకి చెందిన గణేశ్, పుష్ప దంపతులకు ఇద్దరు కొడుకులు. దంపతులిద్దరూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. గణేశ్ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ భార్య పుష్పతో నిత్యం గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే తనకు రూ.5 వేలు కావాలని, ఇందుకోసం ఆమె వెండి పట్టీ గొలుసులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన గణేశ్ భార్యపై రాయితో దాడి చేసేందుకు యత్నించాడు. ఆమె తప్పించుకోవడంతో ఎదురుగా ఉన్న మూడేళ్ల కొడుకు హర్షవర్ధన్‌ను కర్రతో పైశాచికంగా చితకబాదాడు. బాలుడి వీపు, ముఖం, శరీర భాగాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. భార్యను సైతం చంపుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. చుట్టు పక్కల వారితో కలిసి బిడ్డను పట్టణ ప్రభుత్వాస్పత్రికి చికిత్సకు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి ఇంటికి వెళ్తే తిరిగి ఎక్కడ కొడతాడోనని భయంతో పుష్ప మాసాయిపేటలోని పుట్టింటికి ఇద్దరు పిల్లలతో వెళ్లింది. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
నెక్స్ట్ సినిమాను లైన్లో పెట్టిన సుధీర్‌బాబు
హీరో సుధీర్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో మూవీని అనౌన్స్ చేశాడు. హర్షవర్ధన్ డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే నటుడిగా, రచయితగా హర్షవర్థన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. రొమాంటికి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. హీరోయిన్ సహా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇప్పటికే ఈ బ్యానర్లో లవ్‌స్టోరీ సినిమాతో పాటు ధనుష్- శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందుతున్నాయి. ప్రస్తుతం సుధీర్‌బాబు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో పాటు కరుణ కుమార్ డైరెక్షన్లో శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు పుల్లెల గోపీచంద్ బయోపిక్ సినిమాకు సైతం సైన్ చేశారు. #Sudheer15 & @SVCLLP #ProdNo5 is in talented hands of #HarshaVardhan ... This is going to be a challenging journey for me and the team ... Safe to say that, it's something that I haven't tried yet 😉#NarayanDasNarang #PuskurRamMohanRoa pic.twitter.com/wx8eQL9f9I — Sudheer Babu (@isudheerbabu) July 12, 2021 -
Corona Down Fall : 7 రాష్ట్రాల్లో వెయ్యిలోపు కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. గడిచిన 24 గంటలలో మన దేశంలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, న్యూఢిల్లీ, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, జార్ఖండ్ ఏడు రాష్ట్రాలలో 1,000 లోపు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అదే విధంగా జమ్ముకశ్మీర్, పంజాబ్, బీహర్, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్ అయిదు రాష్ట్రాలలో 2,000 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. కరోనా కట్టడికి వైద్యం, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి హర్షవర్దన్ ఈ వివరాలు వెల్లడించారు. తాజా, లెక్కల ప్రకారం, ఇప్పటి వరకు దేశంలో 2,89,09,975 మంది కరోనా వైరస్‌కు గురికాగా .. 3,49,186 మంది ఈ మహమ్మారి బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 1,74,399 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,01,609 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించారు. చదవండి: జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ -
వ్యాక్సిన్ పాస్‌పోర్టు సరైంది కాదు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడానికి వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని తీసుకురావాలనే కొన్ని దేశాలు ప్రతిపాదనల్ని జీ–7 సదస్సు వేదికగా భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది అత్యంత వివక్షాపూరిత చర్యగా అభివర్ణించింది. వ్యాక్సిన్ పాస్‌పోర్టు వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–7 దేశాల సదస్సుకు ఈ ఏడాది భారత్‌ను అతిథిగా ఆహ్వానించారు. జీ–7 ఆరోగ్య మంత్రుల సమావేశంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన హర్షవర్ధన్ అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యాక్సిన్ కొరతని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. భారత్‌లో కేవలం 3 శాతం మంది ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రతిపాదల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు టీకాల సరఫరా, పంపిణీ, రవాణా, సామర్థ్యం వంటి అంశాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని అమల్లోకి తీసుకువస్తే అది వివక్ష చూపించడమే’’ అని ఆయన గట్టిగా చెప్పారు. కాగా ఈ సదస్సులో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలందరికీ టీకాలు ఇవ్వడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాలను మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వ్యాక్సిన్ పాస్‌పోర్టు అంటే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని అమలు చేయాలని అంతర్జాతీయంగా ప్రతిపాదనలు వస్తున్నాయి. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారు తాము వ్యాక్సిన్ తీసుకున్నామని ధ్రువపత్రం చూపించాలి. అయితే ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది. ఇప్పటికే కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు తయారుచేసిన యాప్‌లలో ప్రజలు వ్యాక్సినేషన్ వివరాలను పొందుపరచాలి. విదేశీ ప్రయాణం సమయంలో ఆ దేశాలు ఈ యాప్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో తెలుసుకుంటాయి. కరోనాని కట్టడి చేయాలంటే ఈ విధానాన్ని అమలు చేయాలని అమెరికా, కొన్ని యూరప్ దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. అదే జరిగితే భవిష్యత్‌లో వ్యాక్సిన్ పాస్‌పోర్టు ఉంటేనే విదేశీ ప్రయాణాలు సాధ్యమవుతాయి. -
వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే ఏమిటి?, భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
న్యూఢిల్లీ : వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ప్రక్రియను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్దన్ వ్యతిరేకించారు. మరికొద్దిరోజుల్లో జీ7 సమ్మిట్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీ 7 సమ్మిట్ కు సంబంధించి ఆయా దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హర్షవర్దన్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను వ్యతిరేకిస్తున్నట్లు హర్ష వర్ధన్ ప్రకటించారు. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఇవ్వడం దేశాలపట్ల వివక్షత చూపినట్లే అవుతుందన్నారు. దీంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలకు కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాక్సినేషన్ తక్కువగా ఉండడం, సంబంధిత సమస్యలను పరిష్కరించడం, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ల సరఫరా మరియు పంపిణీలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని హర్షవర్దన్ అన్నారు.ఇక వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అమలు అంటే దేశాల పట్ల వివక్షత చూపినట్లేనని, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతికూలంగా ఉంటుందనే విషయాన్ని భారత్ స్పష్టం చేస్తోందని చెప్పారు. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే కోవిడ్-19 నేపథ్యంలో ఆయా దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పని సరిగా వ్యాక్సిన్ పాస్ పోర్ట్ కలిగి ఉండాలి. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వారు సంబంధింత వివరాల్ని అధికారిక పాస్ పోర్ట్ వెబ్ సైట్లలో నమోదు చేసుకోవాలి. అలా ఎవరైతే పాస్ పోర్ట్ వెబ్ సైట్లో నమోదు చేసుకుంటారో వారికి ఆయా దేశాల పాస్ పోర్ట్ అధికారులు వ్యాక్సిన్ డీటెయిల్స్ తో సర్టిఫికెట్స్ ను అందిస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటేనే విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. దీన్నే ఇప్పుడు భారత్ వ్యతిరేకిస్తుంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి ఇజ్రాయెల్ దేశం ఈ వ్యాక్సినేషన్ పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరి దగ్గర ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఉంటే వాళ్లు మాత్రమే ఇజ్రాయెల్ దేశంలో ఉండే వెసలు బాటు కల్పించింది. ఇజ్రాయెల్ బాటలో మరికొన్నిదేశాలు ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చాయి. చదవండి : లాక్డౌన్ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు -
అల్లోపతిపై రామ్‌దేవ్ వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన హర్షవర్థన్
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్యమంటే తమాషా కాదంటూ బాబా రామ్‌దేవ్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్. అల్లోపతి వైద్యంపై రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. లక్షలాది మంది వైద్య సిబ్బంది మనోభావాలను గాయపరిచి.. కంటి తుడుపు చర్యగా రామ్‌దేవ్ ఇచ్చిన వివరణ కూడా సరిపోదన్నారు. ఈ మేరకు రామ్‌దేవ్‌బాబాకి హర్షవర్థన్ లేఖ రాశారు. కోవిడ్ కల్లోల సమయంలో ఎంతో మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతినేలా, వారు చేస్తున్న త్యాగాలను అవమానించేనట్టుగా రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి అన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశంలో ఎంతోమందిని బాధ పెట్టాయన్నారు. వైద్య సిబ్బంది ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే .. మరోవైపు అల్లోపతి వైద్య విధానం వల్ల లక్షల మంది చనిపోయారని.. అదొక , మూర్ఖపు విజ్ఙానం... తమాషా అంటూ రామ్‌దేవ్ వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు తాము ఊహించలేదన్నారు. మరోవైపు బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
ప్రమాదంలో యావత్ దేశం.. కేంద్రం ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రత మరింత విషమంగా మారిందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకరంగా తయారైందని తెలిపింది. ప్రస్తుతం దేశం మొత్తం ప్రమాదంలో పడిందనీ, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన మొదటి 10 జిల్లాల్లో 8 మహారాష్ట్రలో, ఒకటి ఢిల్లీలో ఉన్నట్లు వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్(ఆరోగ్య)సభ్యుడు వీకే పాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో యాక్టివ్ కేసులు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించిన 10 జిల్లాల్లో పుణేలో 59,475 కేసులు, ముంబైలో 46,248, నాగ్‌పూర్‌లో 45,322, థానేలో 35,264, నాశిక్‌లో 26,553, ఔరంగాబాద్‌లో 21,282, బెంగళూరు అర్బన్‌లో 16,259, నాందేడ్‌లో 15,171, ఢిల్లీలో 8,032, అహ్మద్‌నగర్‌లో 7,952 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపారు. ‘దేశంలో ప్రస్తుతం పరిస్థితులు విషమంగా మారాయి. గడిచిన కొన్ని వారాల్లోనే కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. ఏ ఒక్క రాష్ట్రం, ప్రాంతం, జిల్లా ఇందుకు మినహాయింపు కాదు’అని వారన్నారు. ‘ఆస్పత్రుల్లో ఐసీయూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసులు వేగంగా పెరిగిన పక్షంలో ఆరోగ్య వ్యవస్థ స్తంభించిపోతుంది’అని చెప్పారు. జాతీయ స్థాయిలో పాజిటివిటీ రేట్ 5.65% ఉండగా మహారాష్ట్రలో గత వారం ఇది 23%గా రికార్డయినట్లు తెలిపారు. ఆ తర్వాత పంజాబ్‌లో పాజిటివిటీ రేట్ 8.82%, ఛత్తీస్‌గఢ్‌లో 8.24%, మధ్యప్రదేశ్‌లో 7.82%, ఢిల్లీలో 2.04% ఉందన్నారు. దేశంలో యూకే వేరియంట్ కేసులు 807, దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు 47, బ్రెజిల్ వేరియంట్ కేసు ఒకటి బయటపడింది. జిల్లాల వారీగా చర్యలు మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తదితర రాష్ట్రాల్లోని కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న 47 జిల్లాల అధికారులకు శనివారం రాసిన లేఖలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చామని రాజేశ్ భూషణ్ తెలిపారు. ఒక్కో పాజిటివ్ కేసుకు 25 నుంచి 30 కాంట్రాక్టులను గుర్తించి, ఐసోలేషన్‌లో ఉంచాలని కోరామన్నారు. కంటైన్మెంట్ జోన్ల పరిధిని కూడా విస్తరించాలని తెలిపినట్లు వివరించారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి 6.11 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యధికంగా 48.39% మందికి, ఆ తర్వాత ఢిల్లీలో 43.11% మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకా పంపిణీ జరుగుతుందన్నారు. కో–విన్, ఆరోగ్య సేతు యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చని, లేదంటే ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వ్యాక్సిన్ కేంద్రంలోనే పేర్ల రిజిస్ట్రేషన్ ఉంటుందని చెప్పారు. రికార్డు స్థాయిలో 56,211 కేసులు దేశంలో 24 గంటల్లో మరో 56,211 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసులు 1,20,95,855ఎగబాకాయి. ఒక్క రోజులోనే ఈ మహమ్మారితో 271 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,62,114కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మృతుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 102 మంది ఉన్నారని పేర్కొంది. యాక్టివ్ కేసులు 5,40,720 కాగా మొత్తం కేసుల్లో ఇవి 4.47%కు చేరుకున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,1393,021కు చేరుకోగా రికవరీ రేట్ మాత్రం 94.19%కి తగ్గిపోయింది. ఒకే పడకపై ఇద్దరు కోవిడ్ రోగులు నాగ్‌పూర్: ఆస్పత్రిలో ఒకే పడకపై ఇద్దరు కోవిడ్ రోగులను ఉంచిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. నగరంలోని నాగ్‌పూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో తీసిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం కోవిడ్ ఉన్న పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం కోసం భారీగా డబ్బును వసూలు చేస్తాయని భయపడుతున్న వారంతా ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. అంతేగాక బాగా సీరియస్ పరిస్థితిలో ఉన్న రోగులను డాక్టర్లు వార్డుకు పంపిస్తుండడంతో ఈ పరిస్థితి ఎదురైందని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ అవినాశ్ గవాండే చెప్పారు. అయితే ఫొటోలు తీసిన నాటికి, ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. వర్క్‌లోడ్ ఒకప్పుడు ఎక్కువగా ఉండేదని ఇప్పుడు తక్కువే ఉందన్నారు. ప్రస్తుతం బెడ్‌కు ఒక రోగి మాత్రమే ఉన్నారని చెప్పారు. చదవండి: (మాస్క్ సరిగా ధరించకుంటే ఫైన్) -
ఇక 24 గంటలూ ప్రజలకు కరోనా వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ను దేశవ్యాప్తంగా మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 24 గంటలూ ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి వెల్లడించారు. ప్రజలు వారికి అనుకూలమైన సమయాల్లో వచ్చి వ్యాక్సిన్ తీసుకునేందు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో టీకా వేయడానికి ఉన్న సమయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. అదే విధంగా ప్రజలకు కోవిడ్ టీకాలు వేయడానికి ప్రైవేట్ ఆస్పత్రులు కూడా అన్నివేళల్లో అందుబాటులో ఉంటాయిని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లో పాల్గొన్న అన్ని ఆస్పత్రులు కోవిన్ యాప్, వెబ్సైట్ ద్వారా అనుసంధానం చేయబడినట్లు తెలిపారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. కోవిన్ పోర్టల్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టీకా అందుబాటులో ఉంటుందని నిబంధన ఏమి లేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆస్పత్రి యాజమాన్యం కోరుకున్న సమయంలో ప్రజలకు టీకాలు అందించే అనుమతి ఉందని తెలిపారు. చదవండి: ఈ రోజు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న దిగ్గజాలు -
2020 పేరు చెబితే మానవాళికి గుర్తొచ్చేది కరోనా..
2020 పేరు చెబితే మానవాళికి గుర్తొచ్చేది, ప్రాణాంతకమైన వైరస్ విజృంభణ. అది సృష్టించిన కల్లోలం కారణంగా ప్రపంచం ఛిన్నాభిన్నమై సుమారు 15 లక్షల మంది మృత్యు వాత పడ్డారు. ప్రపంచం యావత్తూ కనీవినీ ఎరుగని ఆర్థిక వినాశనాన్ని చవిచూసింది. దాన్ని అదుపులోకి తేవడం, మానవాళిని కాపాడటం లక్ష్యంగా సైన్స్ ఎలా పరుగులు తీసిందో, పరిశోధన, అభివృద్ధికి ప్రపంచ భాగస్వామ్యాలు ఏవిధంగా దోహదపడ్డాయో మానవాళి గుర్తుంచుకుంటుంది. ఈ నేపథ్యంలో 2020ని సైన్స్ సంవత్సరంగా అభివర్ణించాలి. కోవిడ్–19 కారణంగా మానవాళి అత్యుత్తమ సామర్థ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. మహమ్మారి వ్యాపిస్తున్న కొద్దీ దాని ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశోధన ప్రయత్నాలు వేగం అందుకున్నాయి. మానవాళి భద్రతతో ఎలాంటి రాజీ పడకుండానే ఆ మహ మ్మారిని నిలువరించే చికిత్సలు, వ్యాక్సిన్లు, డయాగ్నస్టిక్స్ అభివృద్ధి చేయడంలో ప్రపంచస్థాయి భాగస్వామ్యాలు ఏర్పాటైనాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, దాతృత్వ సంస్థలు చేయి కలిపి ఈ ప్రయత్నం అంతటికీ అవసరం అయిన వనరులు కూడగట్టడం ప్రారంభించాయి. అందుకే ఒక్క సైన్స్ మాత్రమే కాదు, అంతర్జాతీయ భాగ స్వామ్యాలు కూడా ఈ ఏడాదిలో చెప్పుకోదగినవని నేనంటాను. మానవాళి జీవితాలను కాపాడటానికి దోహదపడే విజయాలు సాధించినందుకు మాత్రమే కాదు, కనీవినీ ఎరుగని వేగంతో ప్రయత్నాలు చేసేందుకు అంకితభావం ప్రదర్శించినందుకు కూడా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను అభినందించాలి. శాస్త్రవేత్తలు తమ వ్యక్తిగత పురస్కారా లకన్నా బృందకృషికి పెద్దపీట వేశారు. ఎలాంటి వేగాన్నయినా మనం అందుకోగలమనీ, వేగం వల్ల నాణ్యత దెబ్బ తినదనీ శాస్త్రవేత్తలు నిరూపించారు. శాస్త్ర, ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యాల ఫలాలు అందరికీ సమానంగా అందాలని నేను భావిస్తాను. మనం మరింత సమానత్వం గల ప్రపంచాన్ని సృష్టించుకుని ప్రతీ ఒక్కరికీ ఆ ఫలాలు అందేలా చూడాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్ హోదాలో నేను ఈ అంశంపై అన్ని దేశాలు, నిధులు అందిస్తున్న ఏజెన్సీలు, శాస్త్రవేత్తలు, దాతలతో చర్చిస్తున్నాను. ఇది మనందరి నిబద్ధత. ఈ మహమ్మారి సమయంలో సైన్స్ కమ్యూనిటీ యావత్తూ సామాజిక సమస్యలను పరిష్కరించే దిశగా అలుపు లేకుండా స్థిరమైన చర్యలు చేపట్టింది. గత ఆరున్నర సంవత్సరాల కాలంగా మా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో సాధించిన విజయం– శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇన్నోవేటర్ల ప్రయత్నాల ఫలమేనని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ విజయానికి చిహ్నంగానే 2015 సంవత్సరం నుంచి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) నిర్వహిస్తున్నాం. మన జీవితాల నాణ్యత పెంచడానికి అవసరమైన పరిష్కారాలు అందించే విషయంలో ‘సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్రాలు’ (స్టెమ్) సాధించిన పురోగతిని ప్రజలకు తెలియజేసి వారందరినీ ఇందులో భాగస్వా ములను చేయడం ఐఐఎస్ఎఫ్ నిర్వహణ లక్ష్యం. సైన్స్ అధ్యయనం మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు వీలుగా ప్రజల్లో ఉత్సుకతను పెంచడం కోసం విజ్ఞాన భారతి (విభా) సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్సుల మంత్రిత్వ శాఖలు ఈ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశాయి. శాస్త్రీయ స్ఫూర్తిని ప్రజ్వరిల్లచేసేందుకు ప్రత్యేకంగా విద్యార్థి సమాజానికి చేరువ కావడం ఈ ఉత్సవం లక్ష్యం. ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు విద్యార్థులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మీడియా, సాధారణ ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, అందరూ ఎదురుచూసే ఒక వార్షిక శాస్త్రీయ సమ్మేళనంగా పరిణతి చెందింది. విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలందరూ వచ్చి జీవశాస్త్రాల విభాగంలో జరుగుతున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలు, వస్తున్న ఆవిష్కరణలపై ప్రత్యక్ష అనుభవం పొందేలా చేస్తున్న బహిరంగ ప్రజావేదిక ఇది. ప్రతీ సంవత్సరం ఇది మరింత పెద్దదిగా, మెరుగైనదిగా విస్తరిస్తూ ఉండటం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. అందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసే సైన్స్ కార్యక్రమంగా ఇది రూపాంతరం చెందింది. ఇందులో జరుగుతున్న శాస్త్రీయ కార్యక్రమాలు ప్రపంచ రికార్డులను ఛేదించి ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేజీల్లో స్థానం సంపాదించాయి. ఈ ఏడాది డిసెంబర్ 22 నుంచి 25 వరకు వర్చువల్ విధానంలో జరుగుతోంది. శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) ఆధ్వర్యం లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ (సీఎస్ఐఆర్–నిస్టాడ్స్) ఈ భారీ ఆన్లైన్ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. స్వయంసమృద్ధ భారతదేశాన్ని ఆవిష్కరించి, తద్వారా ప్రపంచ సంక్షేమానికి తోడ్పాటు అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘స్వయంసమృద్ధ భారత్, ప్రపంచ సంక్షేమం కోసం సైన్స్’ అనే ప్రధాన థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశానికి గల సున్నితమైన శక్తిని ప్రపంచానికి చాటడం కోసమే నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. యువ శాస్త్రవేత్తలను ఆకర్షించేం దుకు స్టెమ్ నిర్వహించే వివిధ కోర్సులకు చెందిన 41 విభిన్న కార్యక్రమాలను ఇందులో చేర్చడం జరిగింది. 2020 సంవత్సరం కోవిడ్–19 వ్యాక్సిన్ల పరిశోధన సంవత్సరం అయితే, ప్రపంచవ్యాప్తంగా అది అత్యంత అవసరం అయిన ప్రజలు దాన్ని ఏవిధంగా అధిగమించారో తెలియజేసే సంవత్సరం 2021. ఈ ఉత్సవం సందర్భంగా మనం ఈ మహమ్మారిని తుదముట్టించేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలు రెట్టింపు చేయడానికీ, జీవితాలను కాపాడే సైన్స్‌లో సహకారాన్ని మరింతగా పెంచడానికీ ప్రతిజ్ఞ చేద్దాం. 2020 సంవత్సరం కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించివుండొచ్చు, అయినా శాస్త్రీయ విజయగాథకు కూడా అది ప్రతీక. మానవాళి ఎదుర్కొనే ముప్పును నిలువరించేందుకు శాస్త్రవేత్తలు ఎంత దీటుగా స్పందించారన్నది ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంది. కోవిడ్–19కి సంబంధించిన పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లు అన్నీ అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు చేరేలా చూడటమే ఇప్పుడు మన ముందున్న సవాలు. ఈ ఏడాది వ్యాక్సిన్లు, పరీక్షలు, చికిత్సలపై శక్తియుక్తులన్నీ ధారపోసి కృషి చేసిన శాస్త్రవేత్తలందరినీ గొంతెత్తి అభినందిస్తున్నాను. డాక్టర్ హర్షవర్ధన్ వ్యాసకర్త కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి -
కొత్త కరోనా భయంతో మళ్లీ ఆంక్షలు
31వరకు నిషేధం హమ్మయ్య... కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది. మాస్క్ కాస్త పక్కకు పెట్టి ఊపిరిపీల్చుకోవచ్చు.. అనుకునేలోపే.. బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. కరోనా కంటే వేగంగా దూసుకొస్తోంది. ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను ఈ వైరస్ ఉలిక్కిపడేలా చేసింది. బ్రిటన్‌లో మొదట గుర్తించిన ఈ ‘వీయూఐ 202012/1’ వైరస్ ఇప్పటికే డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టింది. దీంతో పలు దేశాలు యూకే నుంచి రాకపోకలను నిషేధించాయి. బ్రిటన్‌లో కొత్త వైరస్ నేపథ్యంలో భారత్ బుధవారం నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. మంగళవారం అర్ధరాత్రిలోపు వచ్చినవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తామని, ఆ టెస్ట్‌లో ఎవరైనా కోవిడ్ పాజిటివ్‌గా తేలితే వారిని క్వారంటైన్‌కు పంపిస్తామని ప్రకటించింది. బ్రిటన్ నుంచి వేరే దేశం వచ్చి, అక్కడి నుంచి భారత్ రావాలనుకుంటున్న ప్రయాణికులను కూడా అడ్డుకోవాలని డీజీసీఏ ఆదేశించింది. ►కొత్త తరహా వైరస్‌పై కేంద్రం అప్రమత్తంగా ఉంది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నిమిషానికి 1,850 కోట్లు నష్టం సూచీల మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపద హారతిలా కరిగిపోయింది. ట్రేడింగ్‌లో వారికి ప్రతి నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.6.89 లక్షల కోట్లను కోల్పోయారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1.78 లక్షల కోట్లకు దిగివచ్చింది. రాష్ట్రంలో అలర్ట్ బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రం అప్రమత్తమైంది. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షలు చేసిన తర్వాతే పంపాలనినిర్ణయించింది. -
6 నెలల్లో 30 కోట్ల మందికి టీకా
న్యూఢిల్లీ: దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌ను రానున్న ఆరేడు నెలల్లో 30 కోట్ల మందికి ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కోవిడ్–19పై శనివారం మంత్రుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్స్ ద్వారా మన దేశ శాస్త్రవేత్తలు దేశీయంగా రూపొందించిన వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు చెప్పారు. కోటికి పైగా కేసులు మన దేశంలో నమోదైనప్పటికీ, రికవరీ రేటు విషయంలో భారత్ చాలా ముందుందని అన్నారు. పండుగల సీజన్లో కూడా దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య ఓ పరిమితిని మించి పెరగలేదన్నారు. పండుగ సమయాల్లో తీసుకు న్న జాగ్రత్తలనే వ్యాక్సినేషన్ సమయంలో కూడా పాటించాలని సూచించారు. మోదీ కృషి అమోఘం: కరోనా సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న చర్యలే దేశంలో కరోనాను నియంత్రించేందుకు, అవగాహన కల్పించేందుకు తోడ్పడ్డాయని హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ప్రతి విషయాన్ని ఆయన సమీక్షించారని అన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో సైతం మోదీ అదే చొరవను ప్రదర్శించారని తెలిపారు. అంత తీవ్రత ఉండక పోవచ్చు.. న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తిరిగి భారీ స్థాయిలో పెరగకపోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ చెప్పారు. సెప్టెంబర్ మధ్య కాలంలో రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, ఆ స్థాయిలో తిరిగి కేసులు నమోదయ్యే అవకాశం ఉండబోదని ఆయన పేర్కొన్నారు. కేసుల సంఖ్య నవంబర్‌లో నమోదైన తీరులోనే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 25 వేల కొత్త కేసులు: దేశంలో 24 గంటల్లో 25,152 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 347 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,45,136కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95.50 లక్షలకు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,13,831గా ఉంది. -
పొరపాటు దిద్దుకున్న ఎయిమ్స్!
న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించిన ఓ విద్యార్థినికి ఆలిండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీటు నిరాకరించడం సంచలనమైంది. నీట్-2020లో 66వ ర్యాంక్ పొందిన ఫర్హీన్ కేఎస్‌కు ఎయిమ్స్ సీటు ఇవ్వకపోవడంతో ఆమె టూరిజం శాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అల్ఫోన్స్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. దీనిపై స్పందించిన ఎంపీ అల్ఫోన్స్ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాసి విద్యార్థిని సమస్య పరిష్కరించాలని కోరారు. విషయం ఆరోగ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో తమ పొరపాటును సరిదిద్దుకున్న ఎయిమ్స్ యాజమాన్యం ఎట్టకేలకు ఫర్హీన్ కేఎస్‌కు ప్రవేశం కల్పించింది. కాగా, నీట్లో 66 ర్యాంక్ సాధించిన ఫర్హీన్ గడువులోగా క్రిమి లేయర్ సర్టిఫికెట్ సమర్పించలేదన్న కారణంతో ఎయిమ్స్ సీటు నిరాకరించిన సంగతి తెలిసిందే. పేద కుటుంబంలో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఎయిమ్స్‌లో చేదు అనుభవం ఎదురవడం దురదృష్టకరమని అల్ఫోన్స్ ఈ సంర్భంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చొరవతో ఫర్హీన్‌కు సీటు దక్కిందని, మరి మంచి ర్యాంకులు సాధించినప్పటికీ చిన్నచిన్న కారణాలతో ప్రవేశాలకు దూరమవుతున్నవారి సంగతేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారానికి ఒక అప్పిలేట్ అథారిటీ ఉండాలని అల్ఫోన్స్ సూచించారు. ఉన్నత చదువులకు సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీ వచ్చే విద్యార్థులంతా మంత్రులను కలవలేరు కదా అని అన్నారు. ప్రవేశాలకు సంబంధించి ప్రాస్పెక్టస్‌లో సవివరంగా చెప్పాలని అన్నారు. -
కరోనా విజృంభణ.. రాజధాని ఆందోళన
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7,178 కరోనా కేసులు నమోద కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత వరకు ఢిల్లీలో 7000 కరోనా కేసుల సంఖ్యను ఎప్పుడూ దాటలేదు. గత మూడు రోజుల నుంచి రోజుకి 6000కి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండో అత్యధిక కేసులు నవంబర్ 4న 6842 కేసులు నమోదయ్యాయి. నగరంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,23,831కి చేరింది. గత 24 గంటల్లో 64 మరణాలు సంభవించాయని, మరణాల రేటు 1.6 శాతంగా ఉందని, రికవరీ రేటు 89 శాతంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. సీతాకాలం సమీపించడంతో నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో వాయు కాలుష్యం పెరగడం మూలంగానూ ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం శీతాకాలంలో వాయు కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావితం చేస్తుందని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఢిల్లీలో రోజువారీగా కరోనా సోకే సగటు రేటు 12.2 శాతంగా ఉంటే జాతీయ సగటు రేటు 3.9 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా నమోదు కావడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు విజ్క్షప్తి చేస్తుంది. నగరంలో కోవిడ్ నియంత్రణకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ గురువారం ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. నగరంలో కోవిడ్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని, కొవిడ్ సోకిన వారికి మెరగైన వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. యాంటిజెన్ పరీక్షలలో కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ కరోనా లక్షణాలు ఉన్నట్లనిపిస్తే తప్పనిసరిగా పీసీఆర్ పరీక్ష చేయాలన్నారు. ఢిల్లీలోని ఉత్తర, మధ్య, ఈశాన్య, తూర్పు, వాయువ్య ఆగ్నేయ ఆరు జిల్లాల్లో కరోనా పెరుగుదల రేటు గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ కరోనా రాజధాని నగరంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు గురువారం విమర్శించడమే గాక నగరం త్వరలోనే "దేశ కరోనా రాజధాని"గా మారనుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. గత వారం హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వ అధికారుల సమావేశంలో కరోనా కేసులు పెరగడానికి పండుగలు, ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడం, కోవిడ్ నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణాలుగా పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 84.11 లక్షలు కాగా, 1,24,985 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుత కరోనా కేసుల సంఖ్య 5.2 లక్షలు. రికవరీ అయిన వారి సంఖ్య 77.66 లక్షలకు చేరింది. శుక్రవారం ఒక రోజే 54,157 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, బిహార్ పలు రాష్ట్రల్లో కేసుల విపరీతంగా పెరగడంతో మళ్లీ లాక్డౌన్ ప్రకటించాలనే చర్చకుడా సాగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా యూరోపియన్, ఇతర దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. ఇదే విధంగా దేశంలో కరోనా ప్రభావం ఎక్కువైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించక తప్పదు. ఇక నుంచైనా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జీవనం కొనసాగించకపోతే అంతే సంగతులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
డిసెంబరు నాటికి భారత్‌లో వ్యాక్సిన్!
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. మరోవైపు ట్రయల్స్ అన్ని విజయవంతమైన పక్షంలో ఆక్స్ఫర్డ్ టీకా ‘కోవిషీల్డ్’ 2020 చివరి నాటికి భారతీయులకు అందుబాటులోకి రావచ్చునని కూడా పలు రిపోర్టులు చెప్తున్నాయి. వీటితోపాటు జైడుస్ కాడిలా తయారు చేస్తున్న ‘జైకోవ్ డీ’, ఆక్స్ఫర్డ్ ‘ఆస్ట్రాజెనికా’తో జతకట్టిన సీరం ఇన్స్‌స్టిట్యూట్ ట్రయల్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఇవి కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని హర్షవర్ధన్ వెల్లడించారు. వ్యాక్సిన్ల తయారీలో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోందని అన్నారు. (చదవండి: ప్లాస్మా థెరపీ: అనుమతులు నిలిపివేసిన యూఎస్!) సురక్షిత వ్యాక్సిన్‌తోపాటు సరసమైన ధరలకే దానిని ప్రజలకు అందించే దిశగా ఆయా కంపెనీలు పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇక భారత్‌లో అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ ఏదైనా తొలుత 50 లక్షల వ్యాక్సిన్లు కరోనా వారియర్లకే ఇవ్వాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది. దానికోసం ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలాఉండగా.. వ్యాక్సిన్ తయారీలో భారత్ సక్సెస్ అవుతుందని రష్యా పేర్కొంది. ఆ సత్తా భారత్‌కు ఉందని తెలిపింది. కాగా, స్పుత్నిక్ వీ పేరుతో రష్యా తొలి కరోనా వ్యాక్సిన్‌ను అందబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, సరైన నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద రష్యా వ్యాక్సిన్‌ను తెచ్చిందనే విమర్శలు వెలువడుతున్నాయి. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పనితీరు త్వరలో వెల్లడి కానుంది. (డిసెంబరు 3 నాటికి కరోనా కనుమరుగు!) -
మరణాల రేటు 2.72 శాతమే: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు 63 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అదే సమయంలో మరణాల రేటు 2.72 శాతం మాత్రమే ఉందని అన్నారు. భారత్‌లో కరోనా మహమ్మారి ఇంకా సామాజిక వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ) దశకు చేరుకోలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కొన్ని చోట్ల మాత్రం స్థానికంగా కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉందని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. రోజూ 2.7 లక్షల పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, కేసుల పెరుగుదల గురించి ఆందోళన చెందడం లేదని చెప్పారు. వైరస్ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. (చదవండి: పనికిరాని ప్లాస్టిక్‌తో లక్ష కి.మీ రోడ్లు) కాగా, దేశవ్యాప్తంగా శుక్రవారం అత్యధికంగా 26,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,93,802 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 475 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 21,604కు చేరుకుంది. కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,95,513కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2,76,685 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. ఇక రాష్ట్రాలవారీగా కోవిడ్ కేసులు చూస్తే.. 2,30,599 కేసులతో మహారాష్ట్ర, 1,26,581 కేసులతో తమిళనాడు, 1,07,051 కేసులతో ఢిల్లీ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి (కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు) -
కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి ఇంకా సామాజిక వ్యాప్తి( కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ) దశకు చేరుకోలేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ మరోసారి స్పష్టం చేశారు. గురువారం 18వ ఉన్నత స్థాయి మంత్రులు, నిపుణుల సమీక్షలో పాల్గొన్న మంత్రి తాజా పరిస్థితులపై అధ్యయనంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ''కరోనా ప్రభావిత దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ గణాంకాలను సరైన కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే జానాభా పరంగా రెండో స్థానంలో ఉన్న మన దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 538 కేసులే నమోదవుతున్నాయి. ప్రపంచ సగటు పరంగా 1453 కేసులు నమోదువుతుంటే భారత్‌లో ఈ సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ దేశ వ్యాప్తంగా చూస్తే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దశకు మనం ఇంకా చేరుకోలేదు'' అని హర్షవర్దన్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్, నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఐసీఎంఆర్ డిజి డాక్టర్ బలరాబ్ భరగవ సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే కరోనా సామాజిక వ్యాప్తికి ఇంకా చేరుకోలేదని నిపుణుల బృందం మరోసారి స్పష్టం చేసింది. (భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ) ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,29కు చేరుకోగా గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 24,879 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, డిల్లీ, తెలంగాణ, యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లోనూ 75 శాతం ఈ రాష్ర్టాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో వరుసగా ఏడవరోజు కూడా 20వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతుండగా రికవరీ రేటు మాత్రం అధికంగానే ఉందని పేర్కొంది. ఇప్పటికే 4,76,377 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 2,69,789 యాక్టివ్ కేసులే ఉన్నాయని వెల్లడించింది. (యూపీలో తక్కువ టెస్టులే.. అయినా మెరుగ్గానే! ) -
రక్తం అవసరం ఉన్నవారికి ఇకపై సులభంగా
ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుంది. ఈ క్లిష్టమైన సమయంలో రక్తం అవసరం ఉన్నవారికి సులభంగా అందించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం ‘ఈ బ్లడ్ సర్వీసెస్’ అనే యాప్‌ను ప్రారంభించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) భాగస్వామ్యంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని మంతత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే కొద్ది నిమిషాల్లోనే రక్తం అందిస్తారని, సింగిల్ విండో యాక్సెస్ ద్వారా ఈ సేవలు పొందడం చాలా సులభమని హర్షవర్దన్ పేర్కొన్నారు. (కరోనా కొత్త హాట్ స్పాట్ ఢిల్లీ ) The App will act as a boon for the needy. @IndianRedCross has always assisted the Government in various health programs. I commend this effort that they have made during difficult #COVID19. The needy will now have easy access to blood now@cdacindia @MoHFW_INDIA @WHO @pagthals pic.twitter.com/ZblUXas0NO — Dr Harsh Vardhan (@drharshvardhan) June 25, 2020 ఎంతో పారదర్శకంగా పనిచేయడంతో పాటు రక్తం అత్యవసరమైన వారికి తొందరగా చేరుస్తారని అన్నారు. రక్తం కావాలనుకునే వారు యాప్‌లో రిజిస్టార్ చేసుకోవాలని, దీని ద్వారా ఏఏ ప్రాంతాల్లో రక్తం నిల్వలు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం తెలుస్తుందని చెప్పారు. రక్తం అవసరమైన వారికి బ్లడ్ బ్యాంకుల ద్వారా కనీసం నాలుగు యూనిట్లు అందుతుందని చెప్పారు. రెడ్‌క్రాస్ సంస్థ వివిధ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ సహాయం అందిస్తోందని మంత్రి కొనియాడారు. కరోనా లాంటి కష్టకాలంలోనూ ప్రజలకు అండగా నిలబడిందని హర్షవర్దన్ ప్రశంసించారు. (నా కూతురు కెప్టెన్ అని నాన్న అంటుంటే.. ) -
టీబీ నిర్మూలనలో రెండో స్థానంలో ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: టీబీ నిర్మూలనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో 2019లో 24.04 లక్షల టీబీ కేసులను గుర్తించామని, 2018తో పోల్చితే కేసుల సంఖ్య 14 శాతం పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో ప్రైవేటు రంగంలో గుర్తించిన కేసుల సంఖ్య 6.78 లక్షలుగా ఉందని తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే బుధవారం ఇక్కడ టీబీ వార్షిక నివేదిక–2020ని విడుదల చేశారు. నివేదిక ప్రకారం.. ► 2017లో దాదాపు 10 లక్షల మేర తప్పిపోయిన టీబీ కేసుల సంఖ్య ఉండగా.. ఇప్పుడది 2.9 లక్షలకు తగ్గింది. ► హెచ్ఐవీ పరీక్షలు చేసిన టీబీ పేషెంట్ల సంఖ్య 2018తో పోలిస్తే 14 శాతం పెరిగి 81 శాతానికి చేరింది. ► 4.5 లక్షల డాట్ కేంద్రాల ద్వారా దాదాపు అన్ని గ్రామాల్లో టీబీ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ► టీబీ పేషెంట్లకు నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ కోసం వ్యవస్థ పూర్తిస్థాయిలో రూపొందిందని వెల్లడించింది. ► ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వివరించారు. ► నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్టీఈపీ)–2019లో అత్యుత్తమ పనితీరుకు కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. ► 50 లక్షలకు పైబడిన జనాభా గల పెద్ద రాష్ట్రాల కేటగిరీల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబరిచి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ► 50 లక్షల కంటే తక్కువ జనాభా కలిగిన చిన్న రాష్ట్రాల కేటగిరీలో త్రిపుర, నాగాలాండ్ అత్యుత్తమ పనితీరు కనబరిచాయి. ► కాగా, టీబీ నిర్మూలనలో ఏపీ రెండో స్థానం లభించడంపై రాష్ట్ర క్షయ నిర్మూలనా ప్రాజెక్టు అధికారి డాక్టర్ రామారావు సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్రంలో 99,904 మంది టీబీ రోగులను గుర్తించి చికిత్స అందించామని, ఇందులో 92 శాతం రికవరీ రేటు నమోదైనట్లు తెలిపారు. -
ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్
ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్‌లోనూ కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మెడిసన్‌కు సంబంధించి పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కరోనా వల్ల మనదేశ సాంప్రదాయ పద్దతులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్ ప్రారంభించనుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్సీ (ఐసీఎంఆర్ ), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాక మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పోలిస్తే అశ్వగంధ ఏ విధింగా పనిచేస్తుందన్న దానిపై పరీక్షించనున్నారు. #WATCH ...Clinical trials of Ayush medicines like Ashwagandha, Yashtimadhu, Guduchi Pippali, Ayush-64 on health workers and those working in high risk areas has begun from today: Union Health Minister Dr Harsh Vardhan #COVID19 pic.twitter.com/dHKUMGCclX — ANI (@ANI) May 7, 2020 అంతేకాకుండా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు అశ్వగంధతో పాటు యష్తిమధు, గుడుచి పిప్పాలి వంటి సాంప్రదాయ ఔషదాలు (ఆయుష్ -64) గా పిలిచే ఈ ఫార్ములాను నేటినుంచి ఇవ్వనున్నట్లు ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కొటెచా తెలిపారు. దీని వల్ల శ్వాస సంబంధిత సమస్యలు నియంత్రణలో ఉంటాయని పేర్కిన్నారు. ఇదిలా ఉండగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952 కు చేరింది. కోవిడ్ కారణంగా ఇప్పటివరకు దేశంలో 1,783 మంది మరణించారని కేంద్రం వెల్లడించింది. (చ్యవన్‌ప్రాశ్ తినండి.. తులసి టీ తాగండి) -
‘ఢిల్లీలో కరోనా కట్టడికి కఠిన చర్యలు’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఢిల్లీలో లాక్‌డౌన్‌కు స్వల్ప సడలింపులే ఇవ్వాలని, మహమ్మారిని కట్టడి చేసేందుకు కఠిన నియంత్రణలు అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. లాక్డౌన్ సడలింపులకు ఢిల్లీ సిద్ధమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని కంటెన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం నుంచి భారీ సడలింపులు అమలవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టాల్సిన ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఢిల్లీ పరిస్థితిపై తాను ఏం మాట్లాడినా దాన్ని రాజకీయ ప్రకటనగానే చూస్తారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో స్వల్ప సడలింపులనే అనుమతించాలని, మహమ్మారి వ్యాప్తి తీవ్రతను బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర మార్గదర్శకాలను అనుగణంగా వ్యవహరించాలని అన్నారు. దేశ రాజధాని ఢిలీల్లో 4500 కోవిడ్-19 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 64 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. ఢిల్లీలో ఆదివారం అత్యధికంగా 427 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. చదవండి : మద్యం షాపులు ఇలా తెరిచారు..అలా మూశారు.. -
నిబంధనలు ఉల్లంఘిస్తే క్వారంటైన్‌కు తరలింపు
సాక్షి, విజయవాడ : లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలవుతుందని డీసీపీ హర్షవర్దన్ తెలిపారు. నిబంధనలు పాటించని వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో కఠిన చర్యలు చేపట్టడంతో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా ఉంచి పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామని, అనవరసంగా రోడ్లపైకి వచ్చే వారి ద్విచక్రవాహనాలు సీజ్ చేయడంతో కొంత వరకు పరిస్థితిని అదుపుచేశామని అన్నారు. ఇక పడమటలో పోలీసులు ల్యాండ్ మార్చ్ నిర్వహిచి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని కోరారు. ప్రభుత్వాలు సూచించే జాగ్రత్తలను ప్రజలందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. (క్వారంటైన్ కేంద్రాలపై నిరంతర పరిశీలన) -
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు. గడిచిన ఏడు రోజుల్లో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. అలాగే 47 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు వెలుగుచూడలేదని, గత 21 రోజుల్లోనూ 39 జిల్లాలో కరోనా కేసులు నమోదుకాలేదని వెల్లడించారు. ఇక గడిచిన 28 రోజుల్లో దేశ వ్యాప్తంగా 17 జిల్లాల్లో కేసులేమీ వెల్లడికాలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో హర్షవర్థన్ వివరాలను వెల్లడించారు. వైరస్ కట్టడికి దేశ వ్యాప్తింగా విధించిన లాక్డౌన్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. (కరోనా.. 24 గంటల్లో 62 మంది మృతి) మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరంగా ఉందని, దీనిపై స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1543 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29435కి చేరిందన్నారు. ఇప్పటివరకు 6,869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 934 మంది మృతిచెందారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. (ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు) -
కేంద్రమంత్రిని వెంటాడుతున్న కరోనా భయం!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. ఏ వర్గాన్నీ వదలకుండా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు వైద్యులు, పోలీసు అధికారులు వైరస్‌బారిన పడగా... తాజాగా కేంద్రమంత్రిని సైతం కరోనా భయం వెంటాడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్ ఓఎస్డీ (ఆఫీస్ ఆఫ్ స్పెషన్ డ్యూటీ) సెక్యూరిటీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి వ్యక్తిగత సిబ్బందిలో ఒక్కసారిగా వైరస్ కలకలం రేపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రమంత్రి ఓఎస్డీ వద్ద ఆఫీస్ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మంత్రి కార్యాలయ సిబ్బంది అతన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించింది. ఈ క్రమంలోనే వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి హర్షవర్థన్ ఓఎస్డీతో సహా, అతని కుటుంబం, సమీపంగా మెలిగిన వ్యక్తులను అధికారులు స్వీయ నిర్బంధం పాటించాలని ఆదేశించారు. మరోవైపు వీరిలో ఎవరైనా హర్షవర్థన్‌ను ప్రత్యక్షంగా కలిశారా అని అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిలో ఏమాత్రం అనుమానం ఉన్నా.. ముందు జాగ్రత్తగా కేంద్రమంత్రికి సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకు 2625 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 54 మంది మ్యత్యువాత పడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులను మరింత అప్రమత్తం చేశారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. -
'రికవరీ రేటు మన దేశంలో చాలా బాగుంది'
ఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ శుక్రవారం అన్ని రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో కరోనా పై తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్దన్ మాట్లాడుతూ.. నాసిరకం కరోనా టెస్ట్ కిట్లను వెనక్కి తిప్పి పంపిస్తామన్నారు. చైనా కంపెనీలకు టెస్ట్ కిట్ల డబ్బులు చెల్లించలేదన్నారు. కేంద్ర బృందాలనేవి రాష్ట్రాలకు సహకరించడం కోసమే తప్ప పర్యవేక్షణ కోసం కాదన్నారు. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉందన్నారు. కరోనా బారినపడ్డ వారిలో మిగతా దేశాలతో పోలిస్తే రికవరీ రేటు మన దేశంలో బాగుందని హర్ష వర్దన్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 23వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 700 దాటేసింది. (కరోనా ఎఫెక్ట్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలనం) -
వ్యాక్సిన్ తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నాయి
-
ఇంకా మూడు వారాల లాక్డౌన్!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి ఇంకా మూడు వారాల లాక్డౌన్ అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు. ఆయన శుక్రవారం అన్ని రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్పరెన్స్‌ను నిర్వహించారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబేతో కలిసి ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ నుంచి హర్షవర్దన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా కట్టడికి వివిధ రాష్ర్టాల్లో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హర్షవర్థన్‌మాట్లాడుతూ... కరోనా చైనా నుంచి మిగిలిన దేశాలకు విస్తరించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా 212 దేశాలకు వ్యాపించిందన్నారు. కరోనాపై యుద్ధానికి అందరూ సహకరిస్తున్నారన్నారు. కరోనాకు సరిహద్దులంటూ ఏమీ లేవని, కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కొన్ని రాష్ర్టాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కరోనాను తరిమికొట్టడంలో అందరూ మాస్కులు ధరించడం అత్యంత ప్రధానం అని పేర్కొన్నారు. (తెలంగాణలో ఇక మాస్క్‌లు తప్పనిసరి) రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్‌లోని బూర్గుల భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈటెల మాట్లాడుతూ.. రాష్ట్రం, దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలకు సంబంధించిన టాక్స్‌ను ఎత్తివేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వాటికి కస్టమ్స్, టాక్స్ రద్దు చేయాలని కోరారు. రాష్ట్రానికి N-95 మాస్క్ లు, PPE కిట్స్, టెస్టింగ్ కిట్స్ వీలైనంత తొందరగా పంపించాలని హర్షవర్దన్‌ను కోరారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని, ఇక్కడ వచ్చిన పాజిటివ్ కేసుల్లో 85 శాతం మర్కజ్ నుంచి వచ్చినవారివేనని కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణలో మర్కజ్ కేసుల మినహా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అని ఈటల రాజేందర్ హర్షవర్దన్‌కు వెల్లడించారు. -
రాబోయే మూడు వారాలు అత్యంత కీలకం
-
ప్రముఖుల కుమార్తెలూ బాధితులే!
సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా ద్వారా యువతులను ఆకర్షించడం.. తనకు ఉన్న ఆంగ్ల పరిజ్ఞానంతో మాటలు చెప్పి నమ్మించడం... ఉద్యోగం, వ్యాపారం, ప్రాజెక్టులు అంటూ అందినంత దండుకోవడం... ఈ పంథాతో అనేక రాష్ట్రాల్లో నేరాలు చేసిన జోగడ వంశీ కృష్ణ అలియాస్ హర్ష వర్ధన్‌రెడ్డి కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఇతడి చేతిలో మోసపోయిన వారిలో అనేక మంది ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల కుమార్తెలు సైతం ఉన్నట్లు తెలిసింది. ఆన్లైన్లో యువతులతో పరిచయాలు పెంచుకుని, తన మాటల గారడీతో వారి నుంచి డబ్బు లాగి మోసాలకు పాల్పడే ఈ ఘరానా నేరగాడు ఆంగ్లంలో అనర్ఘళంగా మాట్లాడతాడని పోలీసులు చెప్తున్నారు. రెండు రోజుల క్రితం నగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్‌కు చెందిన యువతి రూ.8.5 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం విదితమే. ఈమెకు హర్ష వర్ధన్రెడ్డిగా పరిచయం అయ్యాడు. అప్పట్లో ఇతగాడు ఫేస్‌బుక్‌ను వినియోగించగా... తాజాగా ఇన్‌స్ట్రాగామ్‌కు మారాడు. ఏపీలోని రాజమండ్రిలో ఉన్న రామచంద్రరావుపేటకు చెందిన వంశీ సంపన్న కుటుంబానికి చెందిన వాడే. బీటెక్ రెండేళ్ళకే మానేసిన ఇతగాడు 2014లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. కొన్నాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన ఇతగాడు ఆ తర్వాత సోషల్‌మీడియా ఆ«ధారంగా యువతులకు వల వేసి, తియ్యని మాటలు చెప్తూ డబ్బు లాగడం ప్రారంభించాడు. ఇలాంటి నేరాలకు సంబంధించి వంశీపై నగరంతో పాటు విజయవాడ, నిజామాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఖమ్మం, గుంటూరుల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి స్థిరంగా ఓ చోట ఉండకుండా మెట్రో నగరాల్లో సంచరిస్తూ, గుర్రపు పందాలు కాస్తూ జల్సాలు చేయడం మొదలెట్టాడు. అప్పుడప్పుడు మాత్రం తన స్వస్థలమైన రాజమండ్రికి వెళ్తుంటాడు. ఇతగాడిని 2017లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో సుస్మిత అనే యువతిని లోబరుచుకున్న ఇతగాడు ఆమె ఫేస్బుక్ ఖాతాను వినియోగించాడు. దీని ద్వారా సుస్మిత మాదిరిగా, ఆమె స్నేహితురాళ్ళతో ‘మీరు ఎలా ఉన్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఉద్యోగం ఎలా ఉంది?’ అంటూ పలకరించే వాడు. ఎవరైనా సుస్మిత చాట్ చేస్తోందని భావించి ఉద్యోగంలో ఉండే బాధలు పంచుకునే వారు. ఆపై వారితో ‘మా ఫ్రెండ్ వంశీకృష్ణ నాకు గూగుల్‌లో ఉద్యోగం ఇప్పించాడు. మీకు కూడా ఇప్పిస్తాడు. సంప్రదించండి అంటూ తన నెంబర్‌నే వారికి పంపేవాడు. అలా సంప్రదించిన వారితో బ్యాక్‌డోర్ ఎంట్రీలు అని చెప్పి రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు తన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకునేవాడు. స్నేహారెడ్డి పేరుతో ఓ నకిలీ ఫ్రొఫైల్ క్రియేట్ చేసిన ఇతగాడు ఆమె మాదిరిగా అనేక మంది యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ చేసి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలంటూ దండుకున్నాడు. దాదాపు 40 మంది నుంచి రూ.1.37 కోట్లు కాజేసిన ఇతగాడిని 2017 జూన్ 15న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన వంశీకృష్ణ తన పంథా మార్చుకోలేదు. తూర్పుగోదావరి జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థినికి సోషల్‌మీడియా ద్వారా వల వేసి మోసం చేశాడు. ఇలా ఏపీ మొత్తమ్మీద అనేక మంది నుంచి రూ.44 లక్షలు కాజేశాడు. వైద్య విద్యార్థిని కేసులో జోగడ వంశీకృష్ణ అలియాస్ హర్ష కోసం 2018లో కాకినాడ పోలీసులు ముమ్మరంగా గాలించారు. ముంబై, పుణే, మైసూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల్లో వేటాడి ఆ ఏడాది సెప్టెంబర్ 5న అతడి స్వస్థలమైన రాజమండ్రిలోనే పట్టుకున్నారు. గుర్రపు పందాలు కాసే అలవాటు ఉన్న వంశీకృష్ణ ఓ దశలో గంటకు రూ.7 లక్షల వరకు పందాలు కాసి పోగొట్టుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. వంశీ కోసం గాలిస్తున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని పట్టుకుంటే మరింత మంది బాధితుల వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. -
హర్షకుమార్కు ఆ అర్హత లేదు : పినిపె విశ్వరూప్
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత మాజీ ఎంపీ హర్షకుమార్కు లేదని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హర్షకుమార్ చెల్లని నాణేమని విమర్శించారు. ప్రజలు తిరస్కరించినా అతనిలో మార్పు లేదన్నారు. 48 రోజులు జైలు జీవితం గడిపాక హర్షకుమార్ చిన్న మెదడు చిట్లినట్లుందని ఎద్దేవా చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే నాలుక కోస్తామని హెచ్చరించారు. చంద్రబాబు దృష్టిలో పడటానికి టీడీపీ నేతల మద్దతు కోసం హర్షకుమార్ ప్రాకులాడుతున్నాడన్నారు. ఎప్పుడో జరిగిన ఘటన గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని విశ్వరూప్ పేర్కొన్నారు. -
కొత్త మెడికల్ కాలేజీలు ఇవ్వండి: ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు యాస్పిరేషనల్ జిల్లా కింద కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ కోరారు. మంగళవారం కేంద్ర మంత్రిని కలసి న ఈటల మీడియాతో మాట్లాడారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి ఏడు జిల్లాలతో ప్రతిపాదనలు ఇచ్చామని, వాటిలో రెండు లేదా మూడు జిల్లాల్లో కొత్త కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరామన్నారు. -
రైలుకింద పడి ‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య
-
నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, కడప : ఒత్తిడి తట్టుకోలేక మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్జీవో కాలనీలో నారాయణ ప్రయివేటు కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షవర్థన్ అనే విద్యార్థి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రిమ్స్ సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో అతడు శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కళాశాల అధ్యాపకుల వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి జయరాం ఆరోపించారు. కాలేజీకి రానన్నవాడికి మళ్లీ ఎందుకు వచ్చావని ఏజీఎం తన కుమారుడిని కొట్టడాని, అంతేకాకుండా లెక్చరర్లు అందరి ముందు దూషించడంతో అవమానం తట్టుకోలేక మనస్తాపం చెందిన హర్షవర్థన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తన కొడుకు రైలుకింద పడి చనిపోయినట్లు వాట్సప్ ద్వారా సమాచారం వచ్చిందని కన్నీటిపర్యంతం అయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. -
చిన్నారుల ప్రాణాలు పోతుంటే.. స్కోర్ కావాలా?
పట్నా: బిహార్‌లో మెదడువాపు వ్యాధి ముక్కుపచ్చలారని చిన్నారులను బలి తీసుకుంటోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి 103 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్, బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండేతో కలిసి ఆదివారం మీడియాతో ముచ్చటించారు. మెదడువాపు వ్యాది ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అయితే ఈ సందర్భంగా మంగల్ పాండే మీడియా మిత్రులను భారత్-పాక్ మ్యాచ్ స్కోర్ ఎంత? ఇప్పటి వరకు ఎన్ని వికెట్లు పడ్డాయని అడగడం వివాదస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ఏఎన్ఐ ట్వీట్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకవైపు చిన్నారులు పిట్టల్లా రాలుతుంటే నీకు స్కోర్ కావాల్సి వచ్చిందా? అని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక సోమవారం ఈ వ్యాధితో ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకృష్ణ వైద్య కళాశాల, ఆస్పత్రి (ఎస్‌కేఎంసీహెచ్)లో సౌకర్యాలే లేవని రోగుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బిహార్‌లో సైతం సోమవారం డాక్టర్లు సమ్మె చేయడంతో వైద్య సేవలు స్తంభించాయి. మరణాలపై సీఎం నితీశ్‌కుమార్ స్పందించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బిహార్‌లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. #WATCH Bihar Health Minister Mangal Pandey asks for latest cricket score during State Health Department meeting over Muzaffarpur Acute Encephalitis Syndrome (AES) deaths. (16.6.19) pic.twitter.com/EVenx5CB6G — ANI (@ANI) June 17, 2019 -
97 మంది మృతి: కేంద్రమంత్రిపై కేసు నమోదు
పట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధితో చిన్నారులు మృతిచెందుతున్న విషయం తెలిసిందే. వ్యాధికి కారణమైన అక్యూట్ ఎన్సిఫలైటిస్ సిండ్రోమ్‌పై అవగహన కల్పించడంలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్థన్ విఫలమయ్యారని బిహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రితో సహా, రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి మంగల్ పాండే పేరును కూడా ఫిర్యాదులో పొందుపరిచారు. ఆమె ఫిర్యాదు మేరకు ముజఫర్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 323, 308, 504 ప్రకారం కేసు ఫైల్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పెద్ద సంఖ్యలో పిల్లలు మృతి చెందుతున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఆ నెల 24న పిటిషన్‌పై ముజాఫర్పూర్ కోర్టు విచారణ చేపట్టనుంది. ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారులు బలవుతున్నారు. ఇప్పటి వరకు 97 మంది చిన్నారులు మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో శ్రీకృష్ణ, కేజ్రీవాల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారే అధికం. అంతే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కాగా బిహార్‌లోని ఓ ఆసుపత్రిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమీక్షించిన విషయంతెలిసిందే. మరోవైపు సీఎం నితీష్ కుమార్ కూడా వైద్యులతో సమావేశమై.. ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కాగా, కేంద్రమంత్రి కళ్లెదురే ఓ చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది. ఓ వైపు పిల్లలు చనిపోయిన బాధ, మరోవైపు తమ పిల్లల్ని కాపాడంటి అంటూ ఆవేదనతో ఆసుపత్రుల వద్ద తల్లిదండ్రలు చేస్తున్న అర్థనాదాలు ఆకాశాన్నంటాయి. మెదడు వాపు వ్యాధి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని డాక్టర్లు తెలిపారు. అక్యూట్ ఎన్సిఫలైటిస్ సిండ్రోమ్‌కు అధిక ఉష్ణోగ్రతలు, గాల్లో తేమశాతం ఎక్కువగా ఉండడమే కారణమని వెల్లడించారు. వర్షాలు పడితే పరిస్థితిలో మార్పు వస్తుందని, మరణాలు కూడా తగ్గే అవకాశముందని చెప్పారు. -
చంపి సూట్‌కేస్‌లో కుక్కి..
మెల్బోర్న్ : గత ఆదివారం నుంచి ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన ఎన్నారై డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కత్తితో దాడి చేసి చంపిన దుండగులు ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి సిడ్నీలోని సౌత్ వేల్స్ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న ఆమె కారులోనే వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే అనగా బుధవారం ఆమె మాజీ ప్రియుడు హర్ష వర్థన్ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన తీరు పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు మరణాలకు ఏదైనా సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు. సెయింట్ లియోనార్డ్స్‌లో జరుగుతున్న ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ప్రీతిరెడ్డి మళ్లీ కన్పించలేదు. చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆమె 11 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్లు తెలిసింది. కానీ ఎంతకి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రీతిరెడ్డి అదృశ్యం, హత్య వెనక మిస్టరీ ఉన్నట్లు భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు చివరిసారిగా మెక్ డోనాల్డ్‌కు ప్రీతి వెళ్లినట్లు.. ఆ సమయంలో ఆమెతో పాటు హర్ష వర్థన్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిస్తే తమకు తెలపాలని స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
పెద్దల అండతోనే కుట్ర
-
పెద్దల అండతోనే కుట్ర ‘కత్తి’కి పదును!
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దల పకడ్బందీ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కుట్ర కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్‌పై హత్యాయత్నం కుట్రకు ప్రభుత్వ పెద్దలు పదును పెట్టిన తీరు కరుడుగట్టిన కిరాయి హంతక ముఠాల తీరును తలదన్నుతోంది. ఈ హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో ఈ ఏడాది జనవరి నుంచి పని చేస్తున్న సంగతి తెలిసిందే. రెస్టారెంట్ యజమాని, అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు హర్షవర్దన్ ప్రసాద్ చౌదరికి ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే తేటతెల్లమైంది. హర్షవర్దన్‌ను ఏకంగా రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా నియమించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) సిఫార్సు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రాష్ట్ర ఒలంపిక్ సంఘం ఆఫీస్ బేరర్లు గట్టిగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర పాఠశాలల క్రీడలపై పెత్తనాన్ని ఆయనకు కట్టబెట్టినట్లు తాజాగా బయటపడింది. విశాఖపట్నంలోని స్వర్ణ భారతి స్టేడియంలో 16వ నంబర్ గదిని హర్షవర్దన్‌కు కార్యాలయంగా కేటాయించడం గమనార్హం. హర్షవర్దన్‌తో ప్రభుత్వ పెద్దల సాన్నిహిత్యం వెనుక ఇంతటి కుట్ర ఉందా? అని విశాఖ జిల్లా ఒలంపిక్ సంఘం ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల క్రీడలు ఆయన గుప్పిట్లోనే... ప్రభుత్వ పెద్దల అండతోనే విశాఖ ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్ లీజును హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి దక్కించుకున్నట్ల ఇప్పటికే బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయనను ఏకంగా రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా నియమించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం సిఫార్సు చేయడం సంచలనం సృష్టించింది. రాష్ట్ర ఒలంపిక్ సంఘం ఆఫీస్ బేరర్లు గట్టిగా అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ, విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర పాఠశాలల క్రీడలపై పెత్తనాన్ని ప్రభుత్వ పెద్దలు ఆయనకు కట్టబెట్టేశారు. విశాఖపట్నం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్‌ను కాదని హర్షవర్థన్ ప్రసాద్ విడిగా ఓ సంఘాన్ని స్థాపించారు. జిల్లాలోని 24 క్రీడా సంఘాల్లో ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ గుర్తింపు పొందిన ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఆ సంఘాలన్నీ హర్షవర్థన్‌ను వ్యతిరేకించాయి. దాంతో ఆయన వ్యూహాత్మకంగా రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా వేడుకలపై కన్నేశారు. పాఠశాల క్రీడల సమాఖ్యపై పెత్తనాన్ని తనకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఎందుకంటే ఆ సమాఖ్య ఆధ్వర్యంలోనే రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడలు నిర్వహిస్తారు. సీఎం కప్ పేరిట నిర్వహించే ఆ క్రీడలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుంది. నిబంధనల ప్రకారం.. రాష్ట్ర, జిల్లా ఒలంపిక్ సంఘాల గుర్తింపు లేని హర్షవర్థన్ నెలకొల్పిన సంఘానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకూడదు. కానీ, దీన్ని ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. పాఠశాలల క్రీడల సమాఖ్యపై పెత్తనాన్ని హర్షవర్థన్ నిర్వహిస్తున్న సంఘానికి కట్టబెట్టాలని రాష్ట్ర విద్యా శాఖను చినబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దాంతో పాఠశాల క్రీడల సమాఖ్యపై పెత్తనాన్ని హర్షవర్థన్ నిర్వహిస్తున్న సంఘానికి అప్పగించారు. నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు పాఠశాల క్రీడల సమాఖ్య నిర్వహణను హర్షవర్థన్ తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విశాఖపట్నంలోని స్వర్ణ భారతి స్టేడియంలో 16వ నంబర్ గదిని ఆయనకు కార్యాలయంగా కేటాయించారు. వాస్తవానికి పాఠశాల క్రీడల సమాఖ్య కార్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయాలి. క్రీడల నిర్వహణపై డీఈవో అక్కడే సమావేశాలు, సమీక్షలు నిర్వహించాలి. కానీ, పాఠశాల క్రీడల సమాఖ్య కార్యాలయాన్ని స్వర్ణ భారతి స్టేడియంలోని హర్షవర్థన్ కార్యాలయంలోనే ఏర్పాటు చేయడం గమనార్హం. పాఠశాల క్రీడల సమాఖ్యలో కార్యనిర్వాహక కార్యదర్శి పదవి అత్యంత కీలకం. క్రీడల నిర్వహణ, నిధుల వినియోగం అంతా ఆయనే నిర్వర్తించాలి. అందుకే జిల్లాలో అత్యంత సీనియర్ అయిన పీఈటీకి ఆ పదవి ఇవ్వాలని కచ్చితమైన నిబంధన ఉంది. కానీ, హర్షవర్దన్ అదేమీ పట్టించుకోలేదు. సీనియర్లను కాదని తనకు సన్నిహితుడైన జూనియర్ పీఈటీ లలిత్‌కుమార్‌ను కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఈ సమాఖ్య ఈ ఏడాది విశాఖపట్నంలో 12 రాష్ట్రస్థాయి క్రీడలను నిర్వహించింది. ప్రభుత్వం ఇచ్చిన నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు జరిగాయని ఒలంపిక్ సంఘం ప్రతినిధులు మొత్తుకున్నా విద్యాశాఖ పట్టించుకోలేదు. ఇంతటి కుట్ర ఉందా? ‘‘నిబంధనలను బేఖాతరు చేస్తూ హర్షవర్థన్ ప్రసాద్ చౌదరికి ప్రభుత్వ పెద్దలు ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటా అని అప్పట్లోనే సందేహం కలిగింది. ఆయన రెస్టారెంట్లో పని చేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టడంతో అసలు విషయం అర్థమవుతోంది. హర్షవర్దన్‌తో ప్రభుత్వ పెద్దల సాన్నిహిత్యం వెనుక ఇంతటి కుట్ర ఉందా?’’ అని విశాఖపట్నం జిల్లా ఒలంపిక్ సంఘం ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ‘బాస్’ భారీగా డబ్బులిచ్చాడు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంకకు చెందిన నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభిమాని అని, అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇళ్లు కేటాయించిందని, ఆ ఇళ్ల వద్దకు చేరుకోవడానికి ప్రత్యేకంగా రోడ్డు కూడా వేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి కోడిపందేలు నిర్వహిస్తుంటారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కోళ్లకు కత్తులు కట్టే శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అతడిని ఈ ఏడాది జనవరిలో విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో చేర్చుకున్నారు. నిందితుడికి హర్షవర్దన్ చౌదరి అందరికంటే ఎక్కువ వేతనం చెల్లించడంతోపాటు ఇంటి అద్దెను కూడా భరించినట్లు ఇప్పటికే బయటపడింది. కుట్రలో భాగంగా అప్పుడే అతడు విమానాశ్రయంలో సీసీ కెమెరాలకు చిక్కకుండా రెస్టారెంట్ యజమాన్యం సహకారంతో ఇతర సరుకులతోపాటు కత్తిని తీసుకొచ్చాడు. రహస్య ప్రదేశంలో దాన్ని దాచిపెట్టాడు. ఇంతలో అసలు సూత్రధారులతో కాస్త విభేదాలు తలెత్తడంతో ఉద్యోగం మానేస్తానని శ్రీనివాసరావు వెళ్లిపోతే బతిమిలాడి మరీ పిలిపించుకున్నారు. ఆ సందర్భంగానే ముందుగా కుదుర్చుకున్న ‘డీల్’ కంటే అదనంగా మరిన్ని డిమాండ్లను శ్రీనివాసరావు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనికి కూడా కుట్ర సూత్రదారులు ఒప్పుకున్నారని పోలీసు వర్గాలు గుర్తించాయి. ఆ ధీమాతోనే జగన్‌పై హత్యాయత్నానికి 10 రోజుల ముందు శ్రీనివాసరావు తన స్వగ్రామం ఠానేలంకలో స్నేహితులకు ఇచ్చి ఖరీదైన విందు ఇచ్చాడు. కోటి రూపాయలతో నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేసేందుకు బేరసారాలు సైతం సాగించాడు. రెస్టారెంట్లో పనిచేసే సాధారణ వ్యక్తి అంత భారీ మొత్తంతో భూమి కొనుగోలుకు ప్రయత్నించడం ఏమిటన్నది సందేహాస్పదంగా మారింది. ‘బాసే’ తనకు అంత డబ్బు ఇచ్చాడని శ్రీనివాసరావు వ్యాఖ్యానించినట్లు ఠానేలంక గ్రామస్తులు చెబుతున్నారు. అంటే అప్పటికే నిందితుడికి సూత్రధారులు భారీ మొత్తం ముట్టజెప్పినట్లు స్పష్టమవుతోంది. జగన్‌పై హత్యాయత్నం కుట్రలో శ్రీనివాసరావుకు సూత్రదారులు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. -
జగన్‌పై హత్యాయత్నం: ఏసీపీ అర్జున్ ఓవరాక్షన్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ అధినేత, టీడీపీ విశాఖ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు హర్షవర్దన్ ప్రసాద్ చౌదరిని ఎట్టకేలకు ఎయిర్‌పోర్టు పోలీసులు విచారించారు. శనివారం మధ్యాహ్నం ఆయన్ని ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. సిట్ బృందంలోని సీఐ లక్ష్మణమూర్తి ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పి నోటీసులిచ్చారు. అనంతరం విడిచిపెట్టారు. మీడియాలో వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికే హర్షవర్దన్‌ను మొక్కుబడిగా విచారించి, వదిలేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘సిట్’ అదుపులో మరో ఇద్దరు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వివిధ విమానయాన సంస్థల ఉద్యోగులు, ఫ్యూజన్ ఫుడ్స్ సిబ్బందిని శనివారం సీఐఎస్ఎఫ్, సిట్ అధికారులు విచారించారు. జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావుకు రెస్టారెంట్‌లోని మిగతా సిబ్బందితో ఉన్న సంబంధాలు, అతడి వ్యవహారశైలి తదితర అంశాలపై ఆరా తీశారు. ఎయిర్‌పోర్టులో విమానయాన సంస్థల ఉద్యోగులతోనూ శ్రీనివాసరావు ఎలా మసలేవాడు? ఎవరితో సత్సంబంధాలు కొనసాగించాడు? వంటి విషయాల గురించి వాకబు చేశారు. ఫ్యూజన్¯ ఫుడ్స్ రెస్టారెంట్లో పని చేస్తున్న ఇద్దరిని ‘సిట్’ సభ్యులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. శ్రీనివాసరావు 11 పేజీల లేఖను రాసినట్టు చెబుతున్న శ్రీనివాసరావు సోదరి (వరసకు) విజయలక్ష్మి, ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పలాసకు చెందిన రేవతీపతిలను రెండో రోజూ సిట్ పోలీసులు రహస్యంగా విచారించారు. చెన్నై నుంచి వచ్చిన సీఐఎఫ్ఎఫ్ ఐజీ సీవీ ఆనంద్, డీఐజీ సెల్వంలు ఎయిర్‌పోర్టు భద్రతపై సమీక్షలు కొనసాగించారు. ఏసీపీ అర్జున్ ఓవరాక్షన్ జగన్‌పై హత్యాయత్నం కేసులో విచారణ సాగిస్తున్న ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్‌ను పర్యవేక్షించే నార్త్ జోన్ ఏసీపీ లంకా అర్జున్ ఓవరాక్షన్ విమర్శల పాలవుతోంది. విమానాశ్రయంలో ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో హైడ్రామా నడపడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అభిమాని అని చెప్పడానికే ఆయన ఎక్కువగా తాపత్రయ పడ్డారు. నిందితుడు అమాయకుడంటూ పదేపదే పేర్కొంటూ అతడి తరఫున వకల్తా పుచ్చుకుని మాట్లాడారు. చెక్కు చెదరని క్రాఫ్‌తో నవ్వుతూ కనిపించిన నిందితుడు శ్రీనివాసరావును చూస్తే లంకా అర్జున్ ఆధ్వర్యంలోని బృందం విచారణ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ప్రొఫెషనల్ కిల్లర్లతో శ్రీనివాసరావుకు తర్ఫీదు..!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని అంతమొందించడానికి కుట్ర పన్నారా?అత్యంత ప్రజాదరణ ఉన్న జననేతను కడతేర్చడం ద్వారా మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని స్కెచ్ వేశారా? జగన్‌ని హత్య చేసి.. దాన్ని మరొకరిపై నెట్టేసి, ప్రజల దృష్టిని ఏమార్చేందుకు తాను రచించిన ‘గరుడ’ పురాణాన్ని సినీ నటుడు శివాజీ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారా?..ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు రాజకీయ పార్టీ నేతలు, ప్రజాసంఘాల నేతలు, సామాజిక వేత్తలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ నిర్వాహకుడుగా టీడీపీ నేత హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి ఉండడం.. ఉత్తరాంధ్రలో పాదయాత్ర జరిగినన్ని రోజులూ ప్రతి గురువారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రతిపక్ష నేత విశాఖ విమానాశ్రయానికి వస్తుండడం.. విమానాశ్రయం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) పహారాలో ఉండటంతో ఆయన్ను అంతమొందించడానికి విమానా శ్రయాన్నే వేదికగా చేసుకున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో కలసి ప్రతిపక్ష నేత హత్యకు సర్కారు కుట్ర పన్నిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ప్రొఫెషనల్ కిల్లర్‌గా శ్రీనివాసరావుకు తర్ఫీదు.. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంకకు చెందిన జనిపెల్ల శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త. శ్రీనివాసరావు బాబాయి నాగేశ్వరరావు ఆ గ్రామ తాజా మాజీ ఉప సర్పంచిగా పనిచేశారు. శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబం టీడీపీలో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లతో మాట మార్చారు. గత కొన్ని నెలలుగా శ్రీనివాసరావుకు తర్ఫీదును ఇచ్చి ప్రొఫెషనల్ కిల్లర్‌గా మార్చారని ఠాణేలంక వాసులు చెబుతున్నారు. తమకు సహకరిస్తున్న శ్రీనివాసరావు కుటుంబానికి ఆరునెలలక్రితమే పక్కా ఇంటిని మంజూరు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం శ్రీనివాసరావు కుటుంబంతో దరఖాస్తు చేయించారు. అంతేగాక శ్రీనివాసరావుకు భారీ ఎత్తున సుఫారీ(నగదు) ముట్టజెప్పినట్లు ఆ గ్రామవాసులు చెబుతున్నారు. సుఫారీగా ఇచ్చిన సొమ్ముతోనే శ్రీనివాసరావు తన లైఫ్ సెటిల్ అయ్యిందంటూ ఇటీవల సన్నిహితులు, మిత్రులకు భారీ ఎత్తున పార్టీ ఇచ్చినట్లు నిందితుడి సన్నిహితులు అంగీకరిస్తుండటం గమనార్హం. ప్రొఫెషనల్ కిల్లర్‌గా తాము తర్ఫీదు ఇచ్చిన శ్రీనివాసరావును విమానాశ్రయం రెస్టారెంట్లో చెఫ్‌గా చేర్చారు. కోడి పందేలలో ఉపయోగించే కత్తి అత్యంత పదునుగా ఉంటుంది. ఆ కత్తి గొంతులోకి దించితే క్షణాల్లో ప్రాణం పోతుందని పోలీసు అధికారులే చెబుతున్నారు. పదునైన ఆ కత్తినే హత్యకు ఆయుధంగా ఎంచుకుని.. శ్రీనివాసరావుతో కలిపి పలు మార్లు రెక్కీ నిర్వహింపజేసి గురువారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హత్యాయత్నానికి తెగబడ్డారు. తన గొంతుపై దాడి చేసేందుకు శ్రీనివాసరావు చేస్తున్న యత్నాన్ని పసిగట్టి చాకచక్యంగా తప్పించుకోవడంతో.. తీవ్ర గాయంతో ప్రాణపాయం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటపడ్డారు. కేసును నీరుగార్చే యత్నం.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారన్న సమాచారం క్షణాల్లో సీఎం చంద్రబాబుకు, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు చేరింది. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం వివరాలను గంటలోపే తేల్చుతామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప ప్రకటించారు. కానీ.. ఆ తర్వాత కొద్ది నిముషాల్లోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్ మీడియా ముందుకొచ్చారు. కనీసం విచారణ ప్రాథమిక దశ కూడా దాటకముందే ‘ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై ఆయన అభిమాని దాడి చేశారు. ఇది చిన్న సంఘటన. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. కత్తిని.. తొమ్మిదో పదో పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నాం’ అంటూ తేల్చడం ద్వారా ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసును ఆదిలోనే సర్కారు నీరుగార్చేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న 11 పేజీల లేఖలోనిందితుడితోసహా మరో ఇద్దరి చేతిరాతలున్నట్లు తేల్చడం గమనార్హం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తన ఆవేదనను బహిర్గతం చేయడం కోసం లేఖ రాసుకుంటారని.. కానీ ప్రతిపక్ష నేతపై హత్య చేయడానికి తెగబడిన శ్రీనివాసరావు లేఖ రాసుకోవడంపై పోలీసు అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేసును నీరుగార్చడానికే ఈ లేఖను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడని చిత్రీకరించడానికి సర్కారు చేసిన ‘ఫ్లెక్సీ’ విన్యాసాలను పరిశీలిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును నీరుగార్చడానికే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేస్తున్నారని రిటైర్డు డీజీపీ ఒకరు వ్యాఖ్యానించారు. గురువారం సర్కారు విడుదల చేసిన ఫ్లెక్సీకి.. శుక్రవారం సిట్ వెలికితీసిన ఫ్లెక్సీకి ఏమాత్రం సంబంధం లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపడం గమనార్హం. -
నాటకం వేసిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : పట్టు వస్త్రాలు, ఆభరణాలు, కిరీటం, పెద్ద మీసం, రాజులాగా మేకప్.. హిందీలో ఏకధాటిగా డైలాగ్‌లు చెబుతూ ప్రేక్షకులను ఆలరించారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్ష వర్ధన్. శుక్రవారం ఎర్రకోటలో నిర్వహించిన ‘రామ్‌లీలా’ నాటకంలో, హర్షవర్ధన్ మిథిల రాజు జనకుడి వేషం వేశారు. మీసం, మేకప్‌తో డ్రామా ఆర్టిస్ట్‌లాగానే తయారయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ కార్యక్రమంలో జనక మహారాజు వేషంలో పరిశుభ్రమైన పర్యావరణాన్ని ఏర్పరుచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటారు.. గాలి స్వచ్ఛంగా మారితే అది ఆరోగ్యకరమైన జీవనానికి దారితీస్తుందని అన్నారు. కార్యక్రమం ప్రారంభానికే ముందే హర్షవర్ధన్ తాను రామ్‌లీలాలో నాటకంలో సీతా దేవి తండ్రి అయిన జనక మహారాజు పాత్ర వేస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. హర్షవర్ధన్ గతంలో భోజ్‌పురి నటుడు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. #राजा_जनक के रूप में अपना किरदार देखकर मुझे आश्चर्य हुआ। यह शायद #मर्यादापुरुषोतमश्रीराम और माता #सीता के आर्शीवाद का ही परिणाम है कि मैं इस भूमिका को लोगों की आकांक्षाओं के मुताबिक निभा पाया। #RamLeela #रामलीला @BJP4India pic.twitter.com/JKjOgQZVzT — Dr. Harsh Vardhan (@drharshvardhan) October 12, 2018 -
యువతతోనే దేశ సమస్యలకు పరిష్కారం
లక్నో : దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న యువశక్తిని సద్వినియోగం చేసుకునేందుకు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగా ల్లో భారత విజయోత్సవాలుగా పరిగణిస్తున్న ఐఐఎస్ఎఫ్ 2018 ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందిరాగాంధీ ప్రతిష్టాన్‌లో ఉదయం కేంద్రమంత్రి హర్షవర్ధన్ అధ్య క్షత వహించిన యంగ్ సైంటిస్ట్ కాన్ఫరెన్స్‌తో సైన్స్ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. యువత తమ శక్తి, దూకుడు తత్వాన్ని సరైన దిశగా మళ్లిస్తే దేశాన్ని పట్టిపీడిస్తు న్న సమస్యలకు పరిష్కారాలు దొరకడం కష్టమే మీ కాదన్నారు. నాలుగేళ్లుగా కేంద్రం తీసుకున్న చర్యల ఫలితంగా అనేకమంది భారతయువ శాస్త్ర వేత్తలు విదేశాల నుంచి తిరిగి వచ్చారన్నారు. వైవిధ్యంతోనే రైతు ఆదాయం రెట్టింపు.. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు కావాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రైతులు పంటల సాగులో వైవిధ్యతను అవలంభించటం ఒక్క టే మార్గమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఐఐఎస్‌ఎఫ్‌లో భాగంగా శుక్రవారం వ్యవసాయ సమ్మేళనం జరిగింది. రైతులు, శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. పంటల సాగులో వైవిధ్యత కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను శాస్త్రవేత్తలు వివరించారు. వివిధ శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధనశాలలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలతోపాటు, పాఠశాల విద్యార్థులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడి ఆయా రంగాలపై ఆసక్తిని పెంచుకునేందుకు ఉద్దేశించిన సైన్స్ విలేజ్ కూడా శుక్రవారం ప్రారంభమైంది. -
మంచీ చెడూ త్వరలో...
‘‘గుడ్, బ్యాడ్, అగ్లీ ఈ మూడు కోణాలు మన అందరిలోనూ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తుంటాయి. ఈ మూడు అంశాల మీదే ఈ సినిమా నడుస్తు్తంది. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. కథకు సూట్ అవుతుందనే ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశాం’’ అన్నారు దర్శకుడు హర్షవర్థన్. మురళీ, శ్రీముఖి, కిశోర్ ముఖ్య పాత్రల్లో రచయిత హర్షవర్థన్ దర్శకత్వంలో అంజిరెడ్డి నిర్మించిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో.. ‘‘సినిమా కంప్లీట్ అయింది. ఈ నెలాఖరులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘నా గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నన్ను నేను కొత్తగా చూసుకునే అవకాశం ఈ సినిమా వల్ల వచ్చింది’’ అన్నారు శ్రీముఖి. -
కరెంటు కొమ్మలు.. సోలార్ చెట్టు!
కాలుష్యాన్ని తగ్గించేందుకు, వేసవిలో కరెంటు కోతల ఇబ్బందులను తప్పించుకునేందుకూ సౌరశక్తిని వాడటం మేలు. అయితే ఒక ఇంటికి అవసరమైన సోలార్ ప్యానెల్స్‌ను బిగించుకునేందుకైనా చాలా ఎక్కువ స్థలం అవసరమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవలే ఓ సోలార్ చెట్టును ఆవిష్కరించింది. దాదాపు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలోని సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసేంత విద్యుత్తును ఈ సోలార్ చెట్టు పది చదరపు అడుగుల విస్తీర్ణంలోనూ ఉత్పత్తి చేస్తుంది. చెట్ల మాదిరిగానే దీంట్లో ఒక బలమైన లోహపు కాండం ఆధారంగా కొన్ని కొమ్మల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిపై సోలార్ ప్యానెల్స్‌ను బిగిస్తారన్నమాట. ఒక్కో సోలార్ చెట్టుతో దాదాపు 5 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ప్యానెల్స్‌పై పడే దుమ్మూ ధూళిని ఎప్పటికప్పుడు కడిగేసేందుకు దీంట్లో ఓ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా ఉంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇటీవలే ఢిల్లీలో ఈ సోలార్ చెట్టును ప్రారంభించారు. ఈ తరహా సోలార్‌ట్రీ ఒక్కో దాని ఖరీదు దాదాపు 5 లక్షల రూపాయల వరకూ ఉంటుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని మూడు చోట్ల ఈ చెట్లను ప్రయోగాత్మకంగా వాడనున్నారు. భవిష్యత్తులో సూర్యుడి కదలికలకు అనుగుణంగా సోలార్ ప్యానెల్స్ తమ దిశ మార్చుకునేట్టు సరికొత్త సోలార్ చెట్టును అభివృద్ధి చేస్తామని సీఎస్ఐఆర్ అంటోంది. -
ఈ నెలాఖరుకు శుభవార్త!
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉండబోతున్నాయా? అవుననే అంటున్నాయి ముందస్తు వాతావరణ నివేదికలు. ఈ విషయాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్ష వర్ధన్ సైతం బుధవారం లోక్ సభలో వెల్లడిందారు. 'నైరుతి రుతుపవనాలు మే చివరినాటికి గానీ.. జూన్ మొదటి వారంలో గానీ కేరళను తాకే అవకాశం ఉంది. అలాగే భారత వాతావరణ విభాగంతో పాటు అన్ని వాతావరణ సంస్థలు తమ ముందస్తు నివేదికల్లో ఈ సారి సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే నమోదవుతుందని చెప్పాయి' అని ప్రశ్నోత్తరాల సమయంలో హర్ష వర్థన్ లోక్‌సభలో వెల్లడించారు. 2005- 2014 మధ్య కాలంలో మాదిరిగానే సరైన సమయంలో రుతుపవనాలు కేరళకు రాబోతున్నాయని దీనికి సంబంధించిన ముందస్తు సూచనను మే 15న విడుదల చేస్తామని ఆయన తెలిపారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
కాలిఫోర్నియా: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. స్మిమ్మింగ్పూల్లో పడి చనిపోయాడు. బే ఏరియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధుల సమాచారం ప్రకారం కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ అపార్ట్మెంట్ నెల్లూరు విద్యార్థి హర్ష వర్దన్ స్విమ్మింగ్‌పూల్ లో పడి ప్రాణాలు కోల్పోయాడు. సిలికాన్ వ్యాలీలోని ఓ యూనివర్సిటీలో అతడు చదువుతున్నాడు. హర్ష వర్దన్ మృతివార్తను బే ఏరియా అసోసియేషన్ ప్రతినిధులు అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు. -
ప్రశ్నించిన పాపానికి.. ప్రాణం తీశాడు!
-
'ముదుర్స్' గా పుట్టి 'మదర్స్' మాట వినని హర్ష
'మనుషుల్ని సృష్టించిన దేవుడే...' అంటూ అక్కినేని నాగేశ్వరరావు తన ఆఖరు సినిమా 'మనం' లో డైలాగ్ చెబుతుంటే ప్రేక్షకులు తన్మయులై విన్నారు. 'బై బర్త్ ముదుర్సగా పుట్టిన వారు మదర్స్ మాటే వినరు, ఇంక అదర్స్ మాట ఎందుకు వింటారు' అంటూ 'గుండెజారి గల్లంతయ్యిందే'లో నితిన్ గురించి చిలిపిగా పరిచయం చేస్తున్నా అలాగే విన్నారు. 'ఐలవ్ యు అంటే ఇలా ఇవ్వు' అని కొత్తగా రాసినా అబ్బా బాగుందే అనుకున్నారు. ఈ మాటల మాయ వెనుక ఉన్నది హర్షవర్ధన్. నటునిగా చాలాకాలంగా ప్రేక్షకులకు తెలిసినా రచయితగా ఇప్పుడు కొత్త అవతారంలో అందిరినీ అలరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పుట్టి విజయనగరంలో చదువుకున్న హర్షవర్ధన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో సంభాషించారు. మీది విజయనగరమే కదా..? హర్ష: నేను పుట్టింది రాజాంలో. ఎల్కేజీ నుంచి నాల్గవ తరగతి వరకు విశాఖలో చదువుకున్నా. మళ్లీ డిగ్రీ మొదటి సంవత్సరం వరకు విజయనగరంలో చదువుకున్నా. అందుకే విజయనగరం తో బంధం వీడనంతంగా బలపడింది. చాలా వ రకు స్నేహితులు ఇక్కడి వారే. విజయనగరంలో మూడు రోజులుగా గడుపుతున్నారు. ఎలా ఉంది..? హర్ష: అమ్మతో అనుబంధాలు పంచుకున్నా. నా చిన్న నాటి మిత్రులందరినీ కలుసుకోగలిగాను. చాలా హ్యాపీగా ఉంది. వచ్చే నె ల 26, 27 తేదీల్లో మళ్లీ విజయనగరం వచ్చి ఆరెండు రోజులు పూర్తిగా నా చిన్ననాటి మిత్రులతో గడిపేందుకు ప్లాన్ చేసుకున్నాం. సినీ రంగంలోకి ఎందుకు వెళ్లాలనిపించింది.? మీకు అందులో ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా..? హర్ష: నాకు చిన్న తనం నుంచి సినిమా అంటే పి చ్చి. అందుకే అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలనుకునేవాడిని. డిగ్రీ పూర్తయిన తరువాత సినీరంగంలో ఎవరూ తెలియకున్నా స్నేహితుడి తో కలిసి ఎర్రబస్సెక్కినట్లు గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయా.(నవ్వుతూ...) అక్కడ మీ జర్నీ సంగతులు..? హర్ష: అమ్మ, నాన్న కాస్త భయపడ్డారు. నేను మాత్రం పట్టుదలతో ఎలా అయినా రాణించాలనుకున్నా. అయితే సినిమా అంటే అలా ఉంటుందని అప్పటి వరకు నాకు తెలియదు. అసలు మీరు ఏమి అవుదామని అక్కడికి వెల్లారు..? హర్ష: నా పట్టుదల అంతా ఒక్కటే. మ్యూజిక్ డెరైక్టర్ కావాలని. అయితే అప్పట్లో నాకు కనీసం సంగీతం అంటే అవగాహన ఉంది తప్ప అంతకుమించి ఏమీ తెలియదు. అందరి లాగానే హైదరాబాద్ వెళ్లగానే అన్ని ఆఫీసులకు తిరిగాను. కొన్ని ఇబ్బందులు పడ్డాను. అయితే నన్ను చూసిన వాళ్లంతా నీ కళ్లు, వాయిస్ బాగున్నాయి. యాక్టింగ్ చేయచ్చుగా అని అడిగారు. అయితే మీ తొలి ప్రయత్నం కెమేరా ముందున్న మాట.? హర్ష: ఏదో వచ్చిన తర్వాత నిరాశతో వెనక్కివెళ్లిపోకుండా ఎలా అయినా సినీ రంగంలో సిర్థపడాలనుకున్నా. అందుకే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. ముందుగా రుతురాగాలు సీరియల్లో యాక్ట్ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రారంభమైన వందేమాతరం సీరియల్ ముందు టెలికాస్ట్ అయిందనుకోండి. మీరు తొలుతగా గుర్తింపు తెచ్చుకున్న సందర్బం..? హర్ష: అమృతం సీరియల్. ఆ సీరియల్ నాకు తొలి మెట్టు వంటిది. మీరు కథలు రాస్తుంటారా..? హర్ష: విశాఖ ఎక్స్‌ప్రెస్ సినిమాకు. అందులో హీరో నరేష్, రాజీవ్ కనకాల నటించారు. అందులో సగభాగమే నా పాత్ర ఉంది. మీరు చేసిన సినిమాల్లో ఇష్టమైనవి..? హర్ష: నటన పరంగా లీడర్. క్యారెక్టర్ పరంగా స్టాలిన్ సినిమాలో చేసిన పాత్ర. 55 రోజుల పాటు ఆ సినిమా షూటింగ్లో మెగాస్టార్ చిరంజీవితో గడిపడటం ఎంతో అనుభూతినిచ్చింది. సెట్లో ఆయన నేను మాత్రమే ఉండేవారం. నేను పుట్టిన ఊరు, పెరిగి పెద్దయిన పరిస్థితులు అన్ని ఆయనకు వివరించా. మీకు బాగా గుర్తింపు వచ్చిన సందర్భం..? హర్ష: గుండె జారి గల్లంతయ్యిందే. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ని. అప్పటి వరకు నేను ఏ మాటలు, కథలు రాయాలన్నా సేఫ్‌జోన్‌లోనే ఉంటూ నా పని చేసేవాడ్ని. అయితే ఆ సినిమా నా సినీ జీవితంలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో రిస్క్‌తో (డూ అర్ డై) అన్న చందంగా ఆ సినిమా చేశాం. చివరికి మంచి ఫలితం లభించింది. మీకు నచ్చిన తారలు..? హర్ష: అందరూ ఇష్టమే. ప్రతి ఒక్కరిలో ఓ వైవిధ్యం ఉంటుంది. మీరు సినీరంగంలో రాణించేందుకు ఎవరైనా సహాయం చేశారా..? హర్ష: నాకు ప్రేక్షకులే వెన్నుదన్ను. మొదటిలో చిన్న చిన్న రోల్స్ (అంటే ఆ సీన్ ఎప్పుడు వచ్చి వెళ్లిపోయేదో తెలియనవి) కూడాచేశా. మీరు పుట్టి పెరిగిన ఊరిలో సన్మానం మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది..? హర్ష: అసలు నాకు సన్మానాలంటేనే ఇష్టం ఉండదు. మొన్న రోటరీ వాళ్లు ఇచ్చింది పురస్కారం. ఆ విషయం ఇక్కడకు వచ్చేంత వరకు తెలియదు. సినీ రంగంలో ఒక స్థాయికి ఎదిగారు.. మీ అనుభూతి..? హర్ష: ఈ రంగంలో రాణించాలంటే అదృష్టం ఉండాలి. నా కన్నా బాగా నటించి గలిగే వారు, నటన అంటే ప్రాణం పెట్టేవారు, అందగాళ్లు చా లా మంది ఉన్నా వారికి అవకాశాలు దక్కని పరి స్థితి. అలా అని కాస్త యావరేజ్‌గా ఉన్నా నా కన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారు లేకపోలేదు. మనం సినిమాకి మాటలు రాశారు. ఆ సినిమా గురించి కాస్త...? హర్ష: తప్పకుండా... నేను చిన్నపుడు మాయాబజార్ సినిమా చూశా. అప్పట్లో ఆడియో టేపులు ఉండేవి. మా ఇంట్లో ప్రతి రోజు అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన డైలాగులు వింటుండేవాడిని, ఒక రోజు ఇంట్లో వారి ముందే 90 నిమిషాలు పాటు అందులో డైలాగులు చెప్పేశా. అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి చెప్పాలంటే ఆ సినిమాయే నాకు మాటలు నేర్పింది. ఆ సినిమాలో హీరో నటించిన ఏఎన్ఆర్ చివరి చిత్రానికి మాట లు రాయటం పూర్వజన్మ సుకృతం. నా కోసమే ఆయన అన్నాళ్లు జీవించి ఉన్నారేమో అనిపించింది. నేను సమకూర్చిన మాటలనే ఆయన పలికారు. ఎంతో అనందమనిపించింది. జీవితంలో మీ లక్ష్యాలు ..? హర్ష: సినిమా రంగంలో అయితే ఏమీ లేవు. ప్రస్తుతం జరుగుతున్నదంతా నాకు బోనస్. పర్సనల్ విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం కోటి మొక్కలు నాటాలని ఉంది. 1000 మంది అ నాథ పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివించాలని ఉంది. లేటెస్ట్గా మీరు మాటలు రాసిన సినిమా? హర్ష: వస్తుంది.. గురువారం ఆ సినిమా పాటలు విడుదలయ్యాయి. -
నత్తా... నీవే నయం
ఆలస్యానికి ప్రతీకగా నత్తను చూపిస్తాం. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి, అవకతవకలపై దర్యాప్తు చేసిన అధికారులు మాత్రం ‘పాపం నత్తపై నిందలు వేయొద్దు ... ఆ స్థానాన్ని మేం ఆక్రమించుకుంటున్నా’మంటున్నారు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న చందంగా జిల్లా అధికారే స్వయంగా అవకతవకలకు పాల్పడితే కింది స్థాయి సిబ్బంది కూడా అందిన కాడికి దోచుకున్న వ్యవహారాలపై చేపట్టిన దర్యాప్తులూ సా...గుతున్నాయి. ఒంగోలు సెంట్రల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గతంలో జరిగిన అవినీతి, అక్రమాలపై రెండుసార్లు గుంటూరు ఆర్డీ విచారణ నిర్వహించినా చర్యలు తీసుకోవడంలో జాప్యం చోటుచేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. డీఎంహెచ్‌వో దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది పాల్పడిన అక్రమాలపై విచారణలు పూర్తయినా చర్యలు మాత్రం కానరావడం లేదు. నెలల తరబడి జాప్యం చోటుచేసుకుంటుండడంతో ఉరిమి ఉరిమి మంగళంమీద పడ్డట్టుగా అసలు నిందితులు తప్పించుకొని ఎవర్ని బలితీసుకుంటారోనని భయపడుతున్నారు మరికొంతమంది ఉద్యోగులు.డీఎంహెచ్‌వో పదవీ విరమణ చేసినా దర్యాప్తు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం వెనుక కిం కర్తవ్యమంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు ఇలా..: ఈ ఏడాది ఏప్రిల్‌లో సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందజేయాల్సిందిగా రీజినల్ డెరైక్టర్ ఆఫ్ హెల్త్ (ఆర్డీ) షాలినీ దేవిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఆ ఆదేశాలతో మే నెల 22న ఒంగోలు వచ్చి విచారణ చేపట్టారు. మళ్లీ అదే నెల 29న వచ్చి పల్స్‌పోలియో నిధులు సంబంధిత ఇన్ఛార్జికి తెలియకుండా రూ.7 లక్షల దుర్వినియోగం చేశారన్న ఆరోపణపై జబ్బార్ ఇన్‌ఛార్జి వైద్యురాలు డాక్టర్ పద్మావతిని విచారించి స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. జిల్లాలోని ఎస్పీహెచ్ఓలను పిలిపించి కూడా వివరాలు సేకరించారు. వాహనాల బడ్జెట్‌ను మంజూరు చేయాలంటే రూ.12,000 వేలు లంచం అడిగారనే ఆరోపణలపై కూడా రాతపూర్వక స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వాహనాల ఖర్చులను పర్యవేక్షించే అకౌంట్స్ అధికారి హర్షవర్థన్‌ను, కార్యాలయం పర్యవేక్షణ అధికారిని విచారించారు. వీరందరి వద్దనుంచి రాతపూర్వక ఫిర్యాదులను తీసుకున్నారు. ఇంత జరిగినా దర్యాప్తు అడుగు మాత్రం ముందుకు పడడం లేదు. -
ప్రత్యామ్నాయం చూపాలి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే పొగాకు నిషేధంపై ఆలోచించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ను కోరారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం తీసుకురానున్న బిల్లుపై వారు మంత్రితో చర్చించారు. కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలు కూడా గమనంలోకి తీసుకోవాలని కోరారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పొగాకు ఎక్కువగా పండుతుందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగలు, తదితర పంటలను ముందుకు తీసుకువచ్చినా వాటి వల్ల రైతాంగం నష్టపోయిన సంగతి గుర్తు చేశారు. పొగాకు వాడకం వల్ల కేన్సర్ వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి హర్షవర్ధన్ ప్రస్తావించారు.దీనిపై ఎంపీతో పాటు రైతుల ప్రతినిధి బృందం స్పందిస్తూ దీనికి తాము ఏకీభవిస్తామని, అదేసమయంలో లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా చర్యలు తీసుకుంటేనే రైతులను ఆ పంటలు వేసుకునే విధంగా ప్రోత్సహించే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో దీని గురించి ఆలోచించాలని కోరారు. ప్రతినిధి బృందంలో పొగాకు రైతు ప్రతినిధులు పీవీ సత్యనారాయణ రెడ్డి, ఆర్ నరేంద్ర, గద్దె శేషగిరిరావు, వెంకటరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు ఉన్నారు. -
హర్షవర్ధన్‌ను తక్షణమే తప్పించాలి
ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఎయిమ్స్ ప్రధాన విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేదిని పదవినుంచి తప్పించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మండిపడింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను పదవి నుంచి తప్పించాలని లేదా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై పార్టీ కార్యాలయంలో ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘ఎయిమ్స్ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేసిన హిమాచల్‌ప్రదేశ్‌కి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతి కార్యకలాపాలను సంజీవ్ చతుర్వేది బయటపెట్టారు. ఈ కారణంగానే ఆయనను ఎయిమ్స్ ప్రధాన విజిలెన్స్ అధికారి పదవినుంచి తొలగించారు’ అని అరోపించారు. సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడికి అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ చతుర్వేది సదరు అధికారిపై చర్యలకు ఉపక్రమించాడు. దీంతో ఆ అధికారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కారణంగా సదరు ఐఏఎస్ అధికారి... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాలేకపోయారు. బీజేపీ నాయకుడు చతుర్వేదిపై అనేక పర్యాయాలు ఫిర్యాదుచేశాడు. ఆ ఫిర్యాదులను పరిశీలించి, చివరికి తిరస్కరించారు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వివాద పరిష్కారానికి మరింత సమయం కాగా పరువునష్టం కేసు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు బీజేపీ అగ్రనాయకుడు నితిన్ గడ్కరీ, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మరింత సమయమిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదావేసింది. -
యాజమాన్యాలు తప్పు చేస్తే.. శిక్ష విద్యార్థులకా?
ఎంసీఐపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ఆగ్రహం న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ సీట్ల విషయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తీరును కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తప్పుబట్టారు. వైద్య కళాశాలలు, యాజమాన్యాలు నిబంధనలను అనుసరించకపోతే, విద్యార్థులను శిక్షించడం ఏమిటన్నారు. ఎంబీబీఎస్ సీట్లలో కోత విధించడం అంటే అనేక మంది విద్యార్థుల కెరీర్‌ను నాశనం చేయడమే అన్నారు. -
ఆస్పత్రులున్నాయనే.. అడగలే దు!
ఎయిమ్స్ ప్రతిపాదనపై టీ.ఎంపీలతో ఆరోగ్యమంత్రి న్యూఢిల్లీ : తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు విరివిగా ఉన్నాయన్న సమాచారంతోనే ఎయిమ్స్ తరహా ఆస్పత్రి కోసం రాష్ట్రాన్ని ప్రతిపాదన అడగలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ అన్నట్లు టీ.ఎంపీలు తెలిపారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేకప్రతినిధి రామచంద్రుడు, ఎంపీలు బి.నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కె.కవిత ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యమంత్రిని కలిసి, తెలంగాణకు ఎయిమ్స్ తరహా ఆస్పత్రి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సేవలు అందుబాటులో లేవని చెప్పారు. ఎయిమ్స్ తరహా ఆస్పత్రుల కోసం ఇటీవల 13 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి లేఖవచ్చిందని, తెలంగాణను ఎందుకు పట్టించుకోలేదని ఎంపీలు ప్రశ్నించారు. సరైన సమాచారం తెప్పించుకుని తెలంగాణకు న్యాయం చేస్తానన్నారని టీ.ఎంపీలు తెలిపారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి రూ.వంద కోట్లు, ఇతర వర్సిటీలకు రూ.ఏభై కోట్లు మంజూరు చేయాలని కేంద్రమానవ వనరుల శాఖ స్మృతి ఇరానిని కోరారు. -
సిగరెట్‌పై రూ. 3.50 వడ్డన!
* బీడీ పరిశ్రమకు రాయితీలన్నీ కట్ * బడ్జెట్ పై ఆరోగ్యమంత్రి సూచనలు న్యూఢిల్లీ: పొగాకు వినియోగంతో ఆరోగ్యపరంగా, సామాజికపరంగా కలిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒక్కో సిగరెట్‌పై పన్నును మూడున్నర రూపొయల చొప్పన పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సూచించారు. సిగరెట్ల వినియోగాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకోవాలంటూ ఆయన గురువారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. వచ్చే నెల్లో సాధారణ బడ్జెట్ రాబోతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖరాశారు. ధూమపానాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా, బీడీ పరిశ్రమకు ఇచ్చే పన్ను మినహాయింపునకు కూడా స్వస్తి చెప్పాలన్నారు. దూమపానం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన దష్ర్పభావం చూపుతోందని, ప్రతియేటా కోటిన్నరమంది పేదలుగా మారుతున్నారని హర్షవర్దన్ తెలిపారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో ఒక్కో సిగరెట్‌పై మూడున్నర రూపాయల చొప్పున పన్ను పెంచాలని సూచించారు. ఈ ప్రతిపాదనలను అమలుచేస్తే 30లక్షలమందిపైగా ధూమపానం మానేస్తారని, భారీగా పెంచే పన్నుతో ఖజానాకు రూ.3,800కోట్ల ఆదాయం వస్తుందన్నారు. పన్ను రాయితీలు బీడీ పరిశ్రమ విస్తృతికి ఉపయోగపడ్డాయే తప్ప, బీడీ కార్మికుల పరిస్థితి మాత్రం క్షీణించిందని చెప్పారు. -
కిరణ్ బేడి వ్యవహారంలో ఢిల్లీలో ఆగని నిరసనలు!
న్యూఢిల్లీ: మాజీ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడి వ్యవహారం ఢిల్లీ బీజేపీలో గందరగోళానికి కారణమవుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కిరణ్ బేడి అభ్యర్ధిత్వంపై బీజేపీ నిర్ణయం తీసుకంటే సహకరించేది లేదని స్థానిక నాయకులు స్పష్టం చేశారు. ఢిల్లీలో కిరణ్ అభ్యర్ధిత్వంపై నేతలు అసంతృప్తి ఉంది. మెజార్టీ నేతలు ఆమెను సీఎంగా అంగీకరించడం లేదు అని స్థానిక నేతలు వెల్లడించారు. కిరణ్ బేడికి వ్యతిరేకంగా వస్తున్న నేతల నిరసనల్ని బీజేపీ ఢిల్లీ చీఫ్ హర్ష వర్ధన్, సీనియర్ నేత నితిన్ గడ్కరీల దృష్టికి తీసుకువెళ్లారు. 2011లో జన లోక్ పాల్ ఉద్యమంలో బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా కిరణ్ బేడి చేసిన పోరాటాన్ని సీనియర్ నేతలుకు వివరించినట్టు తెలిసింది. అలాగే బీజేపీ పార్టీ టికెట్ పై గత అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అయిష్టత చూపిన కిరణ్ బేడికి ముఖ్యమంత్రి పదవిని ఎలా కట్టబెడుతారని సీనియర్ నేతలను నిలదీసినట్టు తెలుస్తోంది. -
హాట్‌టాపిక్: ప్రతిష్టాత్మక చాందినీచౌక్
చాందినీచౌక్ చరిత్రాత్మక ప్రదేశం. మొఘల్ చక్రవర్తి షాజహాన్(1628-1658) తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాలనుకున్నప్పుడు యమునా నది తీరాన ఎర్రకోటను నిర్మించారు. ఎర్రకోటలో నివసించే వారి కోసం ఒక బజారు అవసరమని భావించిన షాజహాన్ కుమార్తె జంహా ఆరా చాందినీ చౌక్ బజార్‌కు రూపకల్పన చేశారు. చంద్రుడి వెన్నెల ప్రతిబింబించేలా అప్పట్లో ఈ బజారు మధ్యలో ఓ కొలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో కొలను పూడుకుపోయినా బజారు పేరు చాందినీ చౌక్ చిర స్థాయిగా నిలిచిపోయింది. ఢిల్లీలో ప్రసిద్ది చెందిన చాందినీచౌక్ పేరును మార్చి, సచిన్ టెండూల్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన మూడేళ్ల క్రితం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చింది. దానిని అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. చాందినీచౌక్ పేరు మార్చడమంటే దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించినట్లుగా భావించారు. చాందినీచౌక్‌ను షాజహాన్ నిర్మించాడని, ఈ పేరును మార్చడం ఈ నగరానికి ఉన్న చరిత్రను కించపర్చడమే అవుతుందని పలువురు పేర్కొన్నారు. దేశరాజధానిలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన చాందినీచౌక్‌లోని అన్ని వ్యాపార సంస్థలను ఆన్లైన్లో పెట్టినట్లు గూగల్ ఇండియా తెలిపింది. ఇక్కడ వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 2500 వ్యాపార సంస్థలున్నాయి. వీటన్నింటికి ప్రత్యేకంగా ఒక్కో వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. చాందినీ చౌక్ ప్రాంతంలో వ్యాపారస్తులే అధికం. అందుకే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి వ్యాపారులు లేదా ఆ వర్గానికి చెందిన వారే గెలుస్తూ ఉంటారు. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత గల ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈ సారి ముగ్గురు హేమాహేమీలు పోటీపడుతున్నారు. ఈ నెల10న ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తరపున కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్, బిజెపి నుంచి పార్టీ సీనియర్ నేత హర్షవర్థన్, ఆమ్ అద్మీ పార్టీ నుంచి ప్రముఖ జర్నలిస్ట్ టీవీ యాంకర్ అషుతోష్ పోటీ చేస్తున్నారు. కపిల్ సిబల్: పంజాబ్‌కు చెందిన కపిల్ సిబల్ గత ఎన్నికలలో ఇక్కడ నుంచే గెలుపొందారు. సాదారణంగా ఇక్కడ నుంచి వ్యాపారులు లేక ఆ వర్గానికి చెందినవారే గెలుస్తూ ఉంటారు. చాందినీ చౌక్ ప్రాంతంలో పంజాబీల సంఖ్య అధికం. తన రాష్ట్ర ఓటర్ల బలంతోనే గతంలో ఆయన ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో సిబల్ మళ్లీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఇష్టపడలేదు. పంజాబ్‌లోని ఏదో ఒక లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ఆయన కాంగ్రెస్ అధిష్టానికి చెప్పారు. ఫలితంలేదు. ఆయన మాట అధిష్టానం వినలేదు. విధిలేని పరిస్థితులలో సిబల్ మరోసారి చాందినీ చౌక్ నుంచి పోటీకి సిద్ధపడ్డారు. హర్షవర్థన్: వ్యాపార వర్గానికి చెందిన హర్షవర్ధన్ బిజెపి సీనియర్ నేత. హర్షవర్థన్ ఇటీవల ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. బిజెపికి తగిన సంఖ్యాబలం ఉంటే ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఉండేవారు. స్థానికుడైన హర్షవర్థన్‌కు ఓటర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. వృత్తిపరంగా వైద్యుడైన ఆయనను మిత్రులు, ప్రత్యర్థులు కూడా ‘డాక్టర్ సాబ్’ అని పిలుస్తారు. అషుతోష్: ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అషుతోష్ ప్రముఖ టీవీ చానల్లో పనిచేసి ఢిల్లీ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆ టీవీ చానల్లో యాంకర్‌గా పని చేసినంత కాలం వైశ్య కులాన్ని సూచించే పేరు ‘గుప్తా’ను పెట్టుకోలేదు. ఇప్పుడు నామినేషన్ వేసే సమయంలో మాత్రం తన పేరు చివర ‘గుప్తా’ను తగిలించుకున్నారు. చాందీనీ చౌక్‌లో గణనీయ సంఖ్యలో ఉన్న వైశ్యుల మద్దతు సంపాదించేందుకే ఆయన ‘గుప్తా’గా పరిచయం చేసుకున్నారు. ఈ ముగ్గురిలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ఉన్న వ్యతిరేకత వల్ల ముస్లిం ఓట్లు తనకే పడతాయని కపిల్ సిబల్ ఆశ. వ్యాపార వర్గం ఓట్లు తనకే పడతాయన్నది హర్షవర్థన్ అభిప్రాయం. ఇక మిగిలిన సామాన్య ఓటర్ల మద్దతు తనకేనన్నది అశుతోష్ గుప్తా అంచనా. -
డాక్టర్ సాబ్.. జాదూ చలేగా?
హర్షవర్ధన్‌కు సవాలుగా మారిన ఢిల్లీ బీజేపీ పగ్గాలు అంతర్గత కుమ్ములాటలే పెద్ద తలనొప్పి ఆప్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదు క్లీన్ ఇమేజ్ కలసి వచ్చే అంశం విధానసభ ఎన్నికల్లో విజయవంతమైన నాయకత్వం సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడు కావడం డా. హర్షవర్ధన్‌కు పెద్ద సవాలుగా మారింది. నరేంద్రమోడీని ప్రధానమంత్రిగా చేయాలంటే ఢిల్లీలోని ఏడు సీట్లలో అత్యధిక సీట్లను బీజేపీ గెలుచుకోవలసి ఉంది. ఇంటా బయటా సమస్యల నుంచి పార్టీని గట్టెక్కించి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు తెచ్చిపెట్టడం అంతసులువైన విషయమేమీ కాదు. అంతర్గత కుమ్మలాటలతో చీలిపోయిన పార్టీని ఒక్కతాటిపై నడిపించడం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ విజయరథానికి కళ్లెం వేయడం హర్షవర్ధన్ ముందున్న సవాళ్లు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య అన్ని సీట్లలో ముక్కోణపు జరుగనుంది. కాంగ్రెస్ బలహీనంగా మారినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా వీస్తోన్న పవనాలు బీజేపీ లక్ష్యసాధనకు అడ్డుపడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఆప్‌ను తేలికగా తీసుకోబోమని బీజేపీ అంటోంది. ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలోనూ, మాజీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఏకపక్షంగా నియమించిన కార్యవర్గంతో పనిచేయడంలోనూ హర్షవర్ధన్ నేర్పు చూపించవలసి ఉంటుంది. ప్రస్తుతం 14 జిల్లాల అధ్యక్షులుగా ఉన్నవారందరూ గోయల్ అనుచరులే.. వారితో పనిచేయడం కష్టం కనుక హర్షవర్ధన్ కొత్త కార్యవర్గాన్ని నియమించవచ్చని కొందరు అంటుండగా, దానికి ఆయనకు తగినంత సమయం లేదని మరికొందరు అంటున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికను పార్టీ ఇప్పటికే ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీ ఇన్చార్జ్గా నియమించిన ప్రభాత్ ఝాతోనూ, నితిన్ గడ్కరీతోనూ కలిసి హర్షవర్ధన్ లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉంది. ఈ నెలాఖరు వరకు బీజేపీ తరఫున ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారవుతాయని అంటున్నారు. ఢిల్లీ బీజేపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత కావడంతోపాటు నిజాయితీపరుడైన నేతగా ఆయనకున్న గౌరవమర్యాదలు, ప్రతిష్ట, పార్టీ సీనియర్ నేతలతో ఆయనకున్న సత్సంబంధాలు, ఆర్ఎస్ఎస్ అండదండలు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించడం, ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం.. హర్షవర్ధన్‌కు అనుకూల అంశాలని రాజకీయపండితులు అంటున్నారు. హర్షవర్ధన్‌కు అనుకూలంగా ఉన్న ఈ అంశాలతో పాటు సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి.. ఒక పదవి.. అనే నియమాన్ని పక్కన బెట్టి విధానసభ పక్ష నేతగా ఉన్న హర్షవర్ధన్‌ను పార్టీ అధ్యక్షునిగా నియమించిందని చెబుతున్నారు. ఏడు సీట్లూ గెలుస్తాం: హర్షవర్ధన్ ‘ఢిల్లీలో 7 ఎంపీ సీట్లను గెలుచుకుని నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేయడమే మా ముందున్న లక్ష్యం.. ఈ క్రమంలో సరైన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. త్వరలోనే ఆ పేర్లను వెల్లడిస్తాం..’ అని హర్షవర్ధన్ గురువారం మీడియాకు తెలిపారు. తనకు, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ‘మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఢిల్లీలోని 7 సీటనూ గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇంటింటికీ తిరిగి ఆప్ సర్కార్ 49 రోజుల పాలనలోని వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం. కాంగ్రెస్‌తో జతకూడి ఆ పార్టీ అవినీతికి ఎలా పాల్పడింది కళ్లకు కడతాం..’ అని వివరించారు. కేజీగ్యాస్ కేసులో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్పమొయిలీపై కేసు నమోదు చేయడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఆప్ మొదటి నుంచీ ఢిల్లీ ప్రజలను మోసం చేస్తూనే ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, ఆప్‌లలో దేనినుంచి బీజేపీకి పోటీ ఉందని ప్రశ్నించగా.. తమ పార్టీకి ఆ రెండూ పోటీ కాదన్నారు. అయితే అవి దేశానికి ప్రమాదకరమని చెప్పారు. ఆప్ సర్కార్ రాజీనామా తర్వాత నగరంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై మాట్లాడేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను త్వరలోనే కలవనున్నట్లు హర్షవర్ధన్ తెలిపారు. -
'అనామిక' మూవీ స్టిల్స్
-
హర్షవర్ధన్: భలే డాక్టర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇంకో నెల రోజుల్లో ఉన్నాయనగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చిన హర్షవర్ధన్‌కు నిజాయితీపరుడని పేరుంది. ఈఎన్టీ వైద్యునిగా బాగా పేరున్న ఆయన సాదాసీదాగా వ్యవహార శైలితో అన్ని గ్రూపులనూ కలుపుకునిపోవడం ద్వారా పార్టీని విజయపథంలో ముందుకు నడిపించారు. ఒకవిధంగా ఆయన్ను సీఎం అభ్యర్థి చేయడం వల్లే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి, అటు కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలిగిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అనూహ్యంగా పెరిగిపోయిన కరెంటు చార్జీలను 30 శాతం మేరకు తగ్గిస్తానన్న ఆయన హామీ ఈ ఎన్నికల్లో ఢిల్లీవాసులను బాగా ఆకట్టుకుంది. ఆరెస్సెస్ కార్యకర్త అయిన 59 ఏళ్ల హర్షవర్ధన్ అందరికీ డాక్టర్ సాబ్‌గా సుపరిచితుడు. 1993లో కృష్ణనగర్ అసెంబ్లీ స్థానం నుంచి నెగ్గడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 1998, 2003, 2008ల్లో అక్కడి నుంచి వరుసగా గెలిచారు. వైద్య మంత్రిగా ఢిల్లీని పోలియో విముక్త రాష్ట్రంగా చేయడంతో ఆయన పేరు మారుమోగిపోయింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని పోలియో నిర్మూలన పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేసింది. ఢిల్లీలో ఆయన అమలు చేసిన ధూమపాన నిషేధ చట్టం కూడా ఇదేవిధంగా 2002లో దేశవ్యాప్తమైంది. మంత్రిగా ప్రతి ఒక్కరికీ నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల్లోనూ హర్షవర్ధన్ ఎంతగానో ఆదరణను పెంచుకున్నారు. -
‘కొండల’ను ఢీకొనేవారెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పార్టీ ముఖ్య నేతలు అన్ని నియోజకవర్గాలలో విస్తృతంగా ప్రచారం చేసి అభ్యర్థుల గెలుపుకోసం పాటుపడడం పరిపాటి. అయితే ఈ ముఖ్యనాయకులను ఆయన నియోజక వర్గానికే కట్టడి చేయడం ఎట్లా? అనేదానిపై అన్ని పార్టీలు మల్లాగుల్లాలు పడుతున్నాయి. ముఖ్య నేతలకు ప్రత్యర్థి పార్టీ తరఫున గట్టి పోటి ఇచ్చే అభ్యర్థిని రంగంలోకి దింపితే అప్పుడు వారు అక్కడికే పరిమితమౌతారు కదా అని ఆలోచనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా న్యూఢిల్లీ నియోజకవ ర్గం నుంచి స్వయంగా తానే బరిలోకి దిగనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఆ పార్టీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్‌కు వ్యతిరేకంగా కష్ణానగర్ నియోజకవర్గం నుంచి ఎవరిని నిలబెట్టాలా అని మల్లగుల్లాలు పడ్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ పేరును బీజేపీ ప్రకటించిన వెంటనే ఆయనకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ పోటీచేస్తారని ప్రచారం జరిగింది. కానీ కుమార్ విశ్వాస్ కష్ణానగర్ నుంచి పోటీచేయడానికి సుముఖంగా లేరని, హర్షవర్ధన్‌కు గట్టి పోటీ ఇవ్వగల బలమైన నేత కోసం తాము అన్వేషిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అంటున్నారు. ఢిల్లీలోని మొత్తం 70 నియోజకవర్గాలలో ప్రచారం చేయవలసిన భారం కుమార్ విశ్వాస్‌పై ఉందని, అందువల్ల హర్షవర్దన్‌కు వ్యతిరేకంగా నిలబెట్టి ఆయనను ఒక్క నియోజకవర్గానికే కట్టిపడేయడం సమంజసం కాదనే అభిప్రాయానికి కూడా పార్టీ వచ్చిందని సంజయ్ సింగ్ అంటున్నారు. అందువల్ల హర్షవర్దన్‌కు వ్యతిరేకంగా కుమార్ విశ్వాస్ ఎన్నికల బరిలోకి ఇగే అవకాశం లేదని స్పష్టం చేశారు. పార్టీలోని మిగతా ప్రముఖ నేతలు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, మనీష్ సిసోడియా, సంజయ్సింగ్కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాల్లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. కృష్ణానగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 1993 నుంచి ఓటమి ఎరుగని హర్షవర్ధన్‌కు నియోజకవర్గం ఓటర్లపై గట్టి పట్టు ఉంది. 20 సంవత్సరాలుగా కృష్ణానగర్ వాసులలో ఒకడిగా మసలుతున్న ఆయనను ఓడించడం అంతసులువు కాదని ఆమ్ ఆద్మీ పార్టీ అంగీకరిస్తోంది. ఆయనను ఓడించలేకపోయినా గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం కలిగిన నేతను బరిలోకి దింపితేనే బీజేపీతో కుమ్మక్కైన పార్టీగా తమపై వచ్చిన ఆరోపణను తోసిపుచ్చినట్లవుతుందని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి , హర్షవర్ధన్‌కు సమఉజ్జీగా ఉండే అభ్యర్థిని నిలబట్టెలేకపోతే బీజేపీకి తోక పార్టీఅన్న ఆరోపణకు బలం చేకూరుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటు బీజేపీ కూడా ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా ఎవరిని నిలబెట్టాలన్నది తేల్చుకోలేకుండా ఉంది. బాలీవుడ్ తారను పోటికి దించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 1998, 2003లో కూడా ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ గోల్‌మార్కెట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు, నియోజకవర్గాల పునవర్య్వవస్థీకరణ అనంతరం షీలాదీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు.