మంచీ చెడూ త్వరలో... | Good Bad Ugly Telugu Movie Press Meet | Sakshi
Sakshi News home page

మంచీ చెడూ త్వరలో...

Published Mon, Feb 5 2018 2:39 AM | Last Updated on Thu, Jul 25 2019 6:37 PM

Good Bad Ugly Telugu Movie Press Meet - Sakshi

హర్షవర్థన్, శ్రీముఖి, మురళి

‘‘గుడ్, బ్యాడ్, అగ్లీ ఈ మూడు కోణాలు మన అందరిలోనూ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తుంటాయి. ఈ మూడు అంశాల మీదే ఈ సినిమా నడుస్తు్తంది. సినిమా మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. కథకు సూట్‌ అవుతుందనే ఈ టైటిల్‌ను ఫిక్స్‌ చేశాం’’ అన్నారు దర్శకుడు హర్షవర్థన్‌. మురళీ, శ్రీముఖి, కిశోర్‌ ముఖ్య పాత్రల్లో రచయిత హర్షవర్థన్‌ దర్శకత్వంలో అంజిరెడ్డి నిర్మించిన చిత్రం ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో.. ‘‘సినిమా కంప్లీట్‌ అయింది. ఈ నెలాఖరులో రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘నా గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నన్ను నేను కొత్తగా చూసుకునే అవకాశం ఈ సినిమా వల్ల వచ్చింది’’ అన్నారు శ్రీముఖి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement