kishor
-
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
అమేథీ: అమేథీ నియోజకవర్గంలో 2019లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే ఓడించిన బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఈయన ఢీకొట్టగలరా? అన్న విశ్లేషకుల అనుమానాలను పటాపంచలు చేస్తూ కిశోరీ లాల్ శర్మ జయకేతనం ఎగరేశారు. మంగళవారం అమేథీ నియోజవర్గంలో çస్మృతి ఇరానీపై 1,67,196 ఓట్ల మెజారిటీతో కిశోరీ లాల్ శర్మ ఘన విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే లక్షకుపైగా మెజారిటీ సాధించి అమేథీ కాంగ్రెస్‌కు కంచుకోట అని కిశోరీలాల్ మరోసారి నిరూపించారు.రాహుల్‌ను ఇరానీ గతంలో 55వేల ఓట్ల తేడాతో ఓడిస్తే ఈసారి ఆమెను శర్మ అంతకు మూడురెట్లకు మించి మెజారిటీతో ఓడించడం విశేషం. ‘‘ ఈ విజయం నా ఒక్కరిది కాదు. మొత్తం నియోజకవర్గ కుటుంబాలది. ఇంతటి విజయం అందించిన అమేథీ ప్రజలకు నా కృతజ్ఞతలు. ఈ విజయం అమేథీ ప్రజలు, గాంధీల కుటుంబానికే చెందుతుంది. మనది బలీయ, ప్రజాస్వామ్య భారతం అని అమేథీ చాటింది’ అని ఫలితం వెలువడ్డాక కిశోరీలాల్ వ్యాఖ్యానించారు.విజయం సాధించిన విధేయత: గాంధీల కుటుంబానికి అత్యంత విధేయుడిగా కిశోరీ లాల్ శర్మకు మంచి పేరుంది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. శర్మ సొంత రాష్ట్రం పంజాబ్. లూథియానాకు చెందిన శర్మ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీకి సన్నిహితుడు కూడా. 1983లో రాజీవ్‌తోపాటు యూపీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. నాటి నుంచి స్థానిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 1991లో రాజీవ్ మరణానంతరం గాంధీల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. 1999లో తొలిసారిగా సోనియాగాంధీ అమేథీ నియోజవర్గంలో ఘన విజయం సాధించడంలో శర్మ కృషి దాగిఉందని అమేథీ రాజకీయ వర్గాలు చెబుతాయి.అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున అన్ని పనులు శర్మనే చూసుకునేవారు. అమేథీ, రాయ్‌బరేలీల్లో రాహుల్, సోనియా అందుబాటులో లేనపుడు నియోజకవర్గ సమస్యలపై పార్టీ అగ్రనాయకత్వానికి తెలియ జేయడం వంటి పనులనూ చక్క బెట్టేవారు. రాయ్‌బరేలీ ప్రజలతో ఈయన మంచి పరిచయం ఉంది. గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ ఓడిపోయాక నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యవహారాలను శర్మనే చూసుకున్నారు.కొంతకాలం బిహార్, పంజాబ్ రాష్ట్రాల వ్యవహారాలనూ చూశారు. అమేథీ రాజకీయాల్లో తెరవెనుకే ఉండిపోయిన కిశోరీ లాల్.. రాహుల్ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయినా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించడం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్‌పై స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదే ఊపులో బరిలో దిగిన స్మృతి ఇరానీని శర్మ ఈసారి ఇంటిబాట పట్టించారు. నియోజవర్గ సమస్యలపై పోరాటం చేసినందుకు ఫలితంగానే కిశోరీలాల్‌కు విజయకిరీటాన్ని ఓటర్లు కట్టబెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు.కిశోరీ భాయ్.. ముందే చెప్పా: ప్రియాంకా గాంధీకిశోరీ లాల్ గెలుపుపై పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ‘‘ కిశోరీ భాయ్.. మొదట్నుంచీ మీ గెలుపు మీద నాకు ఏమాత్రం సందేహం లేదు. మీరు గెలుస్తారని తొలినుంచీ బలంగా నమ్ముతున్నా. మీకు, నియోజకవర్గ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ‘ఎక్స్’లో హిందీలో ట్వీట్‌చేశారు. -
ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్
-
దోషం ఎవరికి?
కిషోర్, సన జంటగా నటించిన చిత్రం ‘దోషం’. ‘నాకా.. దేవుడికా..?’ అన్నది ఉపశీర్షిక. రా మూవీ రిక్రియేషన్స్ పతాకంపై రఘు గోపసాని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్ర దర్శక–నిర్మాత రఘు గోపసాని మాట్లాడుతూ– ‘‘వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు. మనిషిని పట్టి పీడిస్తున్న దోషాల తలలను కోయడానికి త్రిశూలంగా దూసుకొస్తున్న చిత్రం ‘దోషం’. ఈ చిత్రంలోని నటీనటులు నెల్లూరులోని రామాపురం వాస్తవ్యులు. అందరూ చక్కగా నటించారు. ప్రవీణ్ పున్నూరు విలన్‌గా బాగా నటించాడు. మా సినిమాని ఫిబ్రవరి నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పున్నూరు రాజేష్, వసీమ్, అనిల్ డబ్బు, వెన్నెల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గౌతమ్ రవిరామ్, కెమెరా:శంకర్ కేసరి, సహ నిర్మాతలు: ఒంటేరు మాల్యాద్రి, మోహన్ రామచంద్రయ్య, సురేశ్ పెంట్యాల, కోటపాటి రుషీల్ , డబ్బుగుంట వెంకయ్య. -
కేరాఫ్ నువ్వు
1980వ దశాబ్దపు వాస్తవ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘నేను కేరాఫ్ నువ్వు’. సాగా రెడ్డి తుమ్మా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్, సానియా సిన్యా, బాషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. దర్శకుడు సాగారెడ్డి మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల నుంచి ఈ సినిమా తీస్తున్నాం. ఇది నా ఒక్కడి సినిమా కాదు. నా స్నేహితులు, పార్టనర్స్ కూడా ఉన్నారు. లైఫ్‌లో మనకు ఎదురయ్యే కొన్ని సంఘటనలకు రియాక్ట్ అవుతాం, ఆ తర్వాత రియలైజ్ అవుతాం. ఈ సినిమా గురించి ఏం మాట్లాడినా వివాదం అవుతుంది. డైలాగ్స్ చాలా బోల్డ్‌గా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం సాగారెడ్డి బాగా కష్టపడ్డారు. కంటెంట్ నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్నాం’’ అన్నారు సహనిర్మాతలు ఎండీ అతుల్, తమ్మ దుర్గేష్ రెడ్డి, కొండ శశిరెడ్డి అన్నారు. ఈ సినిమాకు కెమెరా: జి.కృష్ణప్రసాద్. -
పల్లెటూరు నేపథ్యంలో...
తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త జంటగా శివగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సకల కళా వల్లభుడు’. అనిల్ కుమార్, కిషోర్, త్రినాథ్, శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ జరుపుకుంటోంది. ‘‘పల్లెటూరు నేపథ్యంలో సాగే యాక్షన్ కామెడీ చిత్రమిది. పూర్తి కమర్షియల్ హంగులతో ఉంటుంది. హీరో, విలన్ మధ్య యాక్షన్ సన్నివేశాలు సంక్రాంతి కోళ్ల పందెంలా కనువిందు చేస్తాయి. 30 ఇయర్స్ పృథ్వీ చేసిన ఓ మేనరిజమ్ ప్రేక్షకుల్లో ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుంది’’ అన్నారు శివగణేశ్. ‘‘కొత్త కథ, కథనాలతో రూపొందిన చిత్రమిది. గీతామాధురి పాడిన ‘తిక్కరేగిన వంకరగాళ్లు’ పాటను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. అజయ్ పట్నాయక్ సంగీతం, సాయిచరణ్ కెమెరా, ధర్మేంద్ర ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు అనిల్ కుమార్. -
మంచీ చెడూ త్వరలో...
‘‘గుడ్, బ్యాడ్, అగ్లీ ఈ మూడు కోణాలు మన అందరిలోనూ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తుంటాయి. ఈ మూడు అంశాల మీదే ఈ సినిమా నడుస్తు్తంది. సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. కథకు సూట్ అవుతుందనే ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశాం’’ అన్నారు దర్శకుడు హర్షవర్థన్. మురళీ, శ్రీముఖి, కిశోర్ ముఖ్య పాత్రల్లో రచయిత హర్షవర్థన్ దర్శకత్వంలో అంజిరెడ్డి నిర్మించిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో.. ‘‘సినిమా కంప్లీట్ అయింది. ఈ నెలాఖరులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ‘‘నా గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నన్ను నేను కొత్తగా చూసుకునే అవకాశం ఈ సినిమా వల్ల వచ్చింది’’ అన్నారు శ్రీముఖి. -
కిశోర్ అండ్ ఎ క్రైమ్ థ్రిల్లర్
క్లాప్ అండ్ కట్... ప్రియమణి లైఫ్‌లో ప్రతి రోజూ వినిపించే కామన్ వర్డ్స్! పెళ్లికి ముందూ, పెళ్లి తర్వాత కూడా! అయితే పెళ్లితో ప్రియమణి కెరీర్‌కి ‘కట్’ పడుతుందేమోనని కొందరు అనుకున్నారు. కానీ, అటువంటిదేం లేదు. అప్పుడూ (పెళ్లికి ముందూ)... ఇప్పుడూ (పెళ్లి తర్వాత)... ప్రియమణి కెరీర్లో ‘కట్’ అనే మాట వినబడుతోంది. అయితే... కొందరు అనుకున్న ‘కట్’ కాదది, షూటింగులో దర్శకుడు చెప్పేది! పెళ్లికి ముందులానే ప్రియమణి కొత్త సినిమాలకు హ్యాపీగా క్లాప్ కొడుతూనే ఉన్నారు. లేటెస్ట్గా కన్నడలో కొత్త దర్శకుడు వినయ్ బాలాజీ తీయబోయే క్రైమ్ థ్రిల్లర్ ‘నన్న ప్రకార’కి క్లాప్ కొట్టారు. ఇందులో కిశోర్ లీడ్ యాక్టర్. రజనీకాంత్ ‘కబాలి’లో గ్యాంగ్‌స్టర్‌గా, కమల్‌హాసన్ ‘చీకటి రాజ్యం’లో పోలీస్‌గా నటించారీయన. తెలుగులో కిశోర్ విలన్‌గా నటించిన రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’ నవంబర్ 3న విడుదల కానుంది. ప్రియమణి, కిశోర్ నటించనున్న క్రైమ్ థ్రిల్లర్ ‘నన్న ప్రకార’ చిత్రీకరణ నవంబర్ 6న ప్రారంభం అవుతుంది. -
సకలకళా కిషోర్
-
సిండికేట్‌పై పత్తి రైతుల ఆగ్రహం
పెద్దపల్లి రూరల్, న్యూస్‌లైన్ : వ్యాపారులు సిండికేట్‌గా మారి అన్యాయం చేస్తున్నారని పెద్దపల్లిలో పత్తి రైతులు సోమవారం రోడ్డెక్కారు. రాజీవ్హ్రదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెండు బస్తాలు తెచ్చిన వారికి ఎక్కువ రేటు చెల్లించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటూ ట్రాక్టర్లలో పత్తి తెచ్చిన రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంట్లో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి అన్యాయం చేస్తున్నా, మార్కెటింగ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటపాటు రాస్తారోకో చేయడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై కిశోర్ వచ్చి రైతులను సముదాయించారు. గతంలో జరిగిన చెల్లింపులను పరిశీలించి, అధికారులు, వ్యాపారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఎస్సై కిషోర్ రికార్డులను పరిశీలించి అధికారులు, వ్యాపారులతో మాట్లాడారు. రైతులకు నష్టం కలగకుండా చూడాలన్నారు. అనంతరం కొనుగోళ్లు జరిగాయి. ఆందోళనలో గుర్రాంపల్లి గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాసరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు తాడూరి శ్రీమాన్, రైతులు పాల్గొన్నారు.