
సాగా రెడ్డి తుమ్మా
1980వ దశాబ్దపు వాస్తవ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘నేను కేరాఫ్ నువ్వు’. సాగా రెడ్డి తుమ్మా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్, సానియా సిన్యా, బాషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. దర్శకుడు సాగారెడ్డి మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల నుంచి ఈ సినిమా తీస్తున్నాం. ఇది నా ఒక్కడి సినిమా కాదు. నా స్నేహితులు, పార్టనర్స్ కూడా ఉన్నారు.
లైఫ్‌లో మనకు ఎదురయ్యే కొన్ని సంఘటనలకు రియాక్ట్ అవుతాం, ఆ తర్వాత రియలైజ్ అవుతాం. ఈ సినిమా గురించి ఏం మాట్లాడినా వివాదం అవుతుంది. డైలాగ్స్ చాలా బోల్డ్‌గా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం సాగారెడ్డి బాగా కష్టపడ్డారు. కంటెంట్ నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్నాం’’ అన్నారు సహనిర్మాతలు ఎండీ అతుల్, తమ్మ దుర్గేష్ రెడ్డి, కొండ శశిరెడ్డి అన్నారు. ఈ సినిమాకు కెమెరా: జి.కృష్ణప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment