Basha
-
టీడీపీ నేత ‘గాజుల’ రాసలీలలు
రాయచోటి: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం ముగియక ముందే తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం పార్టీ పరిశీలకుడుగా ఉంటున్న గాజుల ఖాదర్‌బాషా నిర్వాకం వెలుగులోకి వచ్చింది. రాయచోటిలోని ఓ మహిళను లోబర్చుకుని సాగించిన రాసలీలల వీడియోలు బహిర్గతమవడం ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ రాయచోటి నియోజకవర్గంలో బాషా చక్రం తిప్పుతున్నాడు.మంత్రులు, అధికారులు తన గుప్పెట్లో ఉన్నారంటూ అధికార యంత్రాంగాన్ని, నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు విమర్శలున్నాయి. రాజకీయంగా కానీ, మరే ఇతర పనులు జరగాలన్నా తనకు ‘కావాల్సిన’ పనులు చేసి పెట్టాల్సిందేనని ‘గాజుల’ హుకుం జారీచేస్తుంటాడని.. ఈ నేపథ్యంలోనే రాయచోటిలో పేద, మధ్య తరగతి మహిళలనే ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నాడన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. తన కోరిక తీరిస్తే పెన్షన్ లేదా ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ మహిళలను లోబర్చుకుని అకృత్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఖాదర్‌బాషా పెన్షన్ ఇప్పిస్తానంటూ ఓ మహిళకు నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గురువారం ఉదయం బాధితురాలే స్వయంగా మీడియాకు తెలియజేశారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది.పార్టీ పరువును గంగలో కలిపారుఅధికారాన్ని అడ్డుపెట్టుకుని గాజుల ఖాదర్‌బాషా మహిళలపై లైంగిక దాడులతో పార్టీ పరువును గంగలో కలిపాడంటూ ఆ పార్టీ నాయకులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోల రూపంలో వైరల్ అవుతున్న దృశ్యాలు పార్టీకి మరింత నష్టం తెచ్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఇలాంటి దారుణాలు పార్టీని మరింత ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాయని ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. -
బిగ్‌బాస్‌కు దొరికిన ఆణిముత్యం.. దోమకు అర్థమేంటో తెలుసా?
బిగ్‌బాస్ సీజన్ -8 బుల్లితెర ప్రియులను సరికొత్తగా అలరిస్తోంది. ఒకటి, రెండు తెలిసిన మొహాలు మినహాయిస్తే.. అంతా కొత్త వారే ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఓ వారం ముగిసింది. ఎప్పటిలాగే ఆనవాయితీని కొనసాగిస్తూ లేడీ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశారు. బెజవాడ బేబక్క వారం రోజుల్లోనే ఇంటిదారి పట్టింది. అప్పుడే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. అయితే ఈ సారి అంతా కొత్త ముఖాలే కావడంతో హౌస్‌లో కాస్తా ఎంటర్టైన్మెంట్ తగ్గినట్లు కనిపిస్తోంది. లిమిట్లెస్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన బిగ్‌బాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్లో హౌస్‌లో అంతో, ఇంతో మెప్పిస్తోన్న కంటెస్టెంట్ మాత్రం ఒకరు ఉన్నారు. అతని వల్లే హౌస్‌లో నవ్వులు పూస్తున్నాయి. అతను మరెవరో కాదు.. రాజ్ తరుణ్ ఫ్రెండ్ ఆర్జే శేఖర్ భాషా.(ఇది చదవండి: విష్ణుప్రియపై నీచమైన కామెంట్స్.. సోనియాను తిట్టిపోస్తున్న నెటిజన్లు)రేడియో జాకీగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శేఖర్ భాషా హౌస్‌లోనూ తనదైన కామెడీతో ఆకట్టుకుంటున్నారు. తన ఫన్నీ పంచ్‌లతో హౌస్‌ను ఫుల్ కామెడీని ఎంటర్టైనర్గా మార్చేశాడు. ఏకంగా జబర్దస్త్ కామెడీ షోను మించిన పంచ్‌లతో అదరగొడుతున్నాడు. దీంతో ఆర్జే శేఖర్ భాషా బిగ్‌బాస్‌కు దొరికిన ఆణిముత్యం అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా శేఖర్ భాషా కామెడీ క్లిప్స్‌ను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. మీరు కూడా ఆ ఆణిముత్యాల్లాంటి జోకులను చూసి ఎంజాయ్ చేయండి. Arey ha #ShekharBasha ni ala vadileyakandra evarikaina chupettandraOka onion,oka I love you,Oka spirit,oka Chapathi Oka pindakudu,Oka shardham#BiggBossTelugu8 pic.twitter.com/eUuYjcygyy— Vamc Krishna (@lyf_a_zindagii) September 2, 2024 #ShekharBasha animutyalu part - 90Omlette = Ame + Late #BiggBossTelugu8 pic.twitter.com/7V2GC7MNQi— Vamc Krishna (@lyf_a_zindagii) September 7, 2024 #ShekharBasha is such a sport 😂❤️Shekhar Basha Animutyam part-100😂😭Doma = Dho (Two) + Maa (Amma) anta 😭#BiggBossTelugu8 pic.twitter.com/RS4kbwXBvQ— Hungry Cheetah (@Aniljsp1) September 8, 2024#Shekharbasha and his diamonds 🤣😂#BiggBossTelugu8 pic.twitter.com/1g7lyHjnoN— ALTDHFM (@altSsmb5) September 8, 2024#ShekharBasha animutyalu part -3Magajathi animuthyam nundi inkonni animutyalu 😂😭 meekosam meekosam meekosam Oka Bangaram,oka Puttakamundu 😭#BiggBossTelugu8 pic.twitter.com/2z6ewd1suu— Vamc Krishna (@lyf_a_zindagii) September 5, 2024 Chiraku = Chee Raku 😂😂😭😭Ayya ayya 😂😂😭😭#ShekharBasha animutyalu part-100 #BiggBossTelugu8 pic.twitter.com/luztkgZq9O— stylish Star Lakshmi (@Stylisstarlaxmi) September 9, 2024 -
బాషా వర్సెస్ తిలక్
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది. గత రెండు పర్యాయాలు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీగణేశ్ అకస్మాత్తుగా కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా మారడంతో బీజేపీ అగ్ర నేతలు షాక్‌కు గురయ్యారు. ఈసారి అభ్యర్థి ఎంపికలో గతంలో మాదిరిగా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. పాతిక మందికిపైగా ఆశావహులు పోటీ పడుతుండటంతో, వారిలో బలమైనవారిని అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ముఖ్యంగా స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఏకాభిప్రాయం కుదురడం లేదని తెలుస్తోంది. పార్టీ పట్ల విధేయత, వర్గపోరు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వడపోత పోసి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాజీమంత్రి సదాలక్ష్మి కుమారుడు డాక్టర్ టీఎన్ వంశీతిలక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీమంత్రి శంకర్రావు కుమార్తె సుష్మిత, వర్రి తులసీ విజయ్‌కుమార్, జైనపల్లి శ్రీకాంత్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇద్దరూ ఇద్దరే... డాక్టర్ వంశీతిలక్ తల్లిదండ్రులు సదాలక్షి్మ, టీవీ నారాయణ కంటోన్మెంట్ నియోజకవర్గం బొల్లారం ప్రాంతానికి చెందినవారు. సదాలక్ష్మి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో సంచలనంగా నిలిచారు. ఆమె భర్త టీవీ నారాయణకు 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వీరి వారసుడిగా డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న వంశీతిలక్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు అధిష్టానం పెద్దల ఆశీస్సులతో తనకు టికెట్ దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొప్పు భాషా పాతికేళ్ల క్రితమే ఏబీవీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ‘నా రక్తం నా తెలంగాణ’పేరిట తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం ఉప సర్పంచ్‌గా, ఎంపీటీసీ, ఎంపీపీగా పనిచేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పారీ్టలో కీలక వ్యక్తిగా ఎదిగారు. నగరంలోని ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాల్సిందిగా పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈయన పేరును సైతం బీజేపీ అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. -
అల్ప సంఖ్యాకులకు అగ్రపీఠం
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా మైనార్టీలకు అండగా నిలుస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 50,07,259 మంది మైనార్టీలకు రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో డీబీటీ ద్వారా రూ. 12,366.91 కోట్లు, నాన్‌డీబీటీ ద్వారా రూ. 10,801.02 కోట్లు అందించింది. స్వతంత్ర భారతదేశంలో మైనార్టీలను ఓటు బ్యాంకు కోసమే వినియోగించుకున్నారు. కానీ మైనార్టీ సంక్షేమం కోసం గతంలో వైఎస్సార్, ఇప్పుడు జగన్ మాత్రమే కృషి చేశారు. మైనార్టీ సంక్షేమమంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరే. సీఎం వైఎస్ జగన్ కూడా మైనార్టీల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీల కోసం రూ. 2,665 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ ప్రభుత్వం 50 నెలల్లో రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసి, గత ప్రభుత్వం కంటే 10 రెట్లు అధికంగా నిధులు వెచ్చించింది. – డిప్యూటీ సీఎం అంజద్ బాషా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయండి ప్రభుత్వం మైనార్టీల కోసం 38 పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వంలో ఇమామ్‌లు, మౌజమ్‌లకు, పాస్టర్లకు ఎలాంటి గుర్తింపుగాని, గౌరవ వేతనంగాని ఇవ్వలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ అందరితోపాటు మైనార్టీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా చేశారు. పీలేరు చుట్టుపక్కల మైనార్టీ బాలికలు చదువుకునేందుకు దూరంలో ఉన్న కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. దాంతో చాలామంది చదువును మధ్యలోనే మానేస్తున్నారు. పీలేరులో మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల ప్రారంభిస్తే వారికి మేలు జరుగుతుంది. – చింతల రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే విద్యా సంస్కరణల్లో మనమే మేటి ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి ప్రాధాన్య అంశాల్లో విద్య మొదటి స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నాం, విద్యార్థులకు టోఫెల్ బోధనకు కూడా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నాం. గతంలో అక్షరాస్యతపై అంటే కేరళ గుర్తుకువచ్చేది. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి సైతం ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారంటే మనం ఎంత ప్రగతి సాధించామో తెలుస్తుంది. మూడో విడత నాడు–నేడులో రూ. 8 వేల కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్స్ ఇవ్వనున్నాం. ప్రభుత్వ బడుల్లో సీబీఎస్సీ అమలుతో ఆ బోర్డు మన రాష్ట్రంలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యలో రూ. 15,600 కోట్ల నిధులను విద్యాదీవెన, వసతి దీవెన కింద ఖర్చు చేశాం. ఇంజినీరింగ్ చదువుతున్న 1.69 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నాం. వర్సిటీల్లో 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 3,268 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు విదేశీ వర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ కూడా అందించనున్నాం. దీనివల్ల మన విద్యార్థులకు అంతర్జాతీయంగా అవకాశాలు వేగంగా పొందుతారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యం పరిశీలించేందుకు కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. – మంత్రి బొత్స సత్యనారాయణ ఏజెన్సీ పాఠశాలలకు అధిక నిధులివ్వండి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ వంటివి మన విద్యారంగం గతిని మార్చాయి. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్‌ను బాగుచేస్తున్నారు. ఇందులో గిరిజన నియోజకవర్గాల్లో 1,400 స్కూళ్లు కూడా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 1,000 సింగిల్ టీచర్ పాఠశాలలకు భవనాలు లేవు. నాడు–నేడు కింద భవనాలు నిర్మిస్తే గిరిజన పిల్లలకు మేలు జరుగుతుంది. అదనపు గ్రాంట్ మంజూరు చేసి భవనాలు నిరి్మంచాలి. గతంలో ఆశ్రమ స్కూల్స్‌లో హెల్త్ వలంటీర్లు ఉండేవారు. రాత్రివేళ ఆయా పిల్లలకు ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు హెల్త్ వలంటీర్లను నియమించాలి. – నాగులపల్లి ధనలక్ష్మి , రంపచోడవరం ఎమ్మెల్యే విద్యలో విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో ఇటు తల్లిదండ్రులకు, అటు విద్యార్థులకు మేలు జరిగేలా అనేక పథకాలను సీఎం ప్రవేశపెట్టారు. ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు కూడా మంజూరు చేశారు. మా నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ కాలేజీలు వచ్చాయి. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో ఎంపీపీ స్కూల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. నిడదవోలు టౌన్లో అంతర్భాగమైన లింగంపల్లి గ్రామం.. టౌన్‌కు దూరంగా ఉంది. ఇక్కడి స్కూల్‌ను మెర్జింగ్ చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూల్‌ను డీమెర్జింగ్ చేయాలి. – జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు ఎమ్మెల్యే మన విద్యార్థుల అంతర్జాతీయ ఖ్యాతి నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ నిర్ణయాలతో విద్యారంగం మెరుగుపడింది. మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. ఫౌండేషన్ స్కూల్స్‌ను తీసుకువచ్చాం. అయితే ఉత్తమ ఫలితాలు రావాలంటే వాటిలో బోధకులకు శిక్షణ ఇవ్వాలి. సీఎం లక్ష్యం నెరవేరాలంటే శిక్షణ, బోధనపై పూర్తి అజమాయిషీ అవసరం. దీనికోసం సరైన కార్యాచరణ రూపొందించాలి. – డాక్టర్ ఎం.జగన్మోహన్రావు, నందిగామ ఎమ్మెల్యే పాఠశాలల్లో పిల్లలకు డైనింగ్ ఏర్పాటు చేయండి గత ప్రభుత్వం విద్యను వ్యాపారం చేయడంతో పేద కుటుంబాలు అక్షరానికి దూరమయ్యాయి. ఇప్పుడు సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాల ద్వారా 42 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టించారు. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్‌ను బాగుచేస్తున్నారు. సీబీఎస్సీ సిలబస్, బైలింగువల్ బుక్స్, పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసేందుకు పిల్లలకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలి. దీనికి స్కూల్లో ఓ గదిని కేటాయిస్తే మంచిది. విద్యారంగంలో మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. – కిలారి వెంకట రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే ఏపీలో బెస్ట్ విద్యా వ్యవస్థ ఉంది రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి నాడు–నేడు విధానాలు పరిశీలించేందుకు తెలంగాణ అధికారులు ఇక్కడకు వస్తున్నారు. చాలా స్కూల్స్‌లో ప్లస్ 2 అందుబాటులోకి తెచ్చాం. అయితే, టీచర్లకు సరైన శిక్షణ లేదని తల్లిదండ్రుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. దీనిపై అధికారులు, మంత్రులు దృష్టిపెట్టి, ఇంటర్ బోధించేవారికి శిక్షణ ఇవ్వాలి. నైపుణ్యం ఉన్నవారికే ఆ స్కూల్స్‌లో బోధనా అవకాశం ఇవ్వాలి. దీంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో విశాలమైన మైదానాలు ఉన్నాయి. స్పోర్ట్స్‌ను కూడా ప్రోత్సహించాలి. అన్ని స్కూళ్లలోను పీఈటీలను నియమించాలి. – సామినేని ఉదయభాను, జగ్గయ్యపేట ఎమ్మెల్యే విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్స్ పెంచండి స్వతంత్ర భారత చరిత్రలో విద్యలో ఇన్ని సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఆరు, ఏడు తరగతులకు రీడింగ్ స్కిల్స్ తక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తిచేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప నైపుణ్యం పెంపుపై దృష్టి పెట్టలేదు. ఆరు నుంచి 8 తరగతులకు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ఇస్తే రెండేళ్లలో అద్భుతంగా రాణిస్తారు. దీంతోపాటు అన్ని స్కూళ్లకు వాచ్మెన్లను నియమించాలి. – కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే -
ముస్లింల సంక్షేమంలో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ముస్లిం సమాజానికి మేలు చేసిన గొప్ప నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, తండ్రి కంటే రెండు అడుగులు ముందుకేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లిం సంక్షేమంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా కితాబిచ్చారు. మంగళవారం జరిగిన శాసన మండలి క్వశ్చన్ అవర్‌లో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ముస్లింల సంక్షేమానికి రూ. 2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, సీఎం జగన్ నాయకత్వంలో 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 12,366 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు లెక్కలతో సహా వివరించారు. గత ప్రభుత్వం హయాంలో ఉర్దూ అకాడమీ నిర్వహణలో రూ. 14 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై సీఐడీ విచారణ కూడా జరిగిందన్నారు. ఉర్దూ అకాడమీకి చెందిన 36 కంప్యూటర్ కేంద్రాలను పునరుద్ధరించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ ఇస్తామన్నారు. రానున్న రోజుల్లో మైనారిటీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని అంజద్‌బాషా వెల్లడించారు. వర్సిటీ ఖాళీలు త్వరలో భర్తీ: మంత్రి బొత్స విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో ఖాళీల విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితో త్వరలో భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 2019–20 నుంచి 2022–23 వరకు 1,54,50,580 మంది విద్యార్థులు లబ్ధి పొందారని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 6,262.29 కోట్లు ఖర్చు చేసిందన్నారు. విద్యార్థులకు వారానికి 16 రకాల పదార్థాలను అందిస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా యంత్రసేవా పథకం: మంత్రి కాకాణి వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా వైఎస్సార్ యంత్రా సేవా పథకాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్ ద్వారా రైతులకు బీమా వర్తింపజేస్తున్నామన్నారు. కౌలు రైతులను కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని, కౌలుదారులకు కార్డులు జారీ చేసేలా ప్రత్యేక కార్యాచరణ (స్పెషల్‌డ్రైవ్) చేపడతామన్నారు. ప్రతి రూపాయీ సది్వనియోగం: మంత్రి అంబటి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా నిర్మాణం జరగడంలేదనే అపోహ వద్దన్నారు. ప్రతి రూపాయిని ఈ ప్రభుత్వం బాధ్యతయుతంగా సద్వినియోగం చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తుందన్నారు. పోలవరం నిర్మాణం జాప్యానికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణమన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి కాఫర్ డ్యామ్ పనులు అసంపూర్తిగా చేయడం వల్లే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం వేసిన అంచనాలు మరింత పెరిగాయని, సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదంతో పనులు వేగవంతం చేస్తామని అంబటి స్పష్టం చేశారు. మండలిలో సభ్యులు వరుదు కళ్యాణి, మొండితోక అరుణ్‌కుమార్, మర్రి రాజశేఖర్, రఘురాజు, కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్ షాబ్జీ, అనంత సత్యఉదయభాస్కర్ పలు అంశాలను ప్రస్తావించారు. కాగా, అసెంబ్లీలో ఆమోదం పొందిన 11 బిల్లులను మండలిలో సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టడంతో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. -
విషాదం నింపిన విహారయాత్ర !
మహబూబ్‌నగర్: విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపిన ముగ్గురు స్నేహితులు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. వాహనాన్ని అతివేగంగా నడపడం వల్ల ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ షుకూర్(55), షేక్ బాషా(58), పాకాలపాడుకు చెందిన అంజయ్య కలిసి డ్రైవర్ ప్రశాంత్‌కుమార్‌తో ఈ నెల 22న సత్తెనపల్లి నుంచి కారులో గోవాకు విహారయాత్రకు వెళ్లారు. గోవా నుంచి బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మక్తల్ మండలం గుడిగండ్ల శివారులో మక్తల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టడంతో కారు చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో షుకూర్, షేక్‌బాషా అక్కడికక్కడే మృతిచెందారు. కారులో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో చుట్టపక్కల వారు అక్కడికి చేరుకుని బయటకు తీశారు. కాళ్లు, చెయ్యి విరిగి తీవ్రగాయాలపాలైన అంజయ్యను మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మహబూబ్‌నగర్‌కు తరలించారు. డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. కేసు నమోదు.. షుకూర్‌కు ఓ సినిమా థియేటర్ ఉండగా.. షేక్బాషాకు బేకరి ఉంది. వీరంతా ప్రతి సంవత్సరం గోవాకు వెళ్లి వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. షుకూర్‌కు భార్య షేక్ ఆరిఫ్, కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. షేక్బాషాకు భార్య రఫియా సుల్తానా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సత్తెనపల్లి నుంచి మక్తల్‌కు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పర్వతాలు తెలిపారు. -
హజ్ యాత్ర ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం)/ఏఎన్‌యూ:విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి బుధవారం పవిత్ర హజ్ యాత్ర ప్రారంభమైంది. 170 మందితో కూడిన హజ్ యాత్రికుల తొలి బృందం ప్రత్యేక విమానంలో జెడ్డాకు బయలుదేరింది. అంతకుముందు గుంటూరు జిల్లా నంబూరులో ఏర్పాటు చేసిన హజ్ క్యాంప్ నుంచి నాలుగు ప్రత్యేక బస్సుల్లో యాత్రికులు విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. భద్రతా తనిఖీలు పూర్తయిన అనంతరం.. హజ్ యాత్ర విమానాన్ని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, హజ్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ లాజమ్, ఇతర మత పెద్దలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ వల్ల ఏపీ నుంచి తొలిసారిగా హజ్ యాత్ర ప్రారంభమైందన్నారు. గతంలో హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారన్నారు. దీనివల్ల యాత్రికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం విజయవాడ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు పంపించేందుకు చర్యలు తీసుకుందన్నారు. దీని వల్ల యాత్రికులపై రూ.83 వేల చొప్పున అదనపు భారం పడుతుండటంతో.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సానుకూల స్పందన రాకపోవడంతో సీఎం జగన్ వెంటనే స్పందించి వారిపై భారం పడకుండా రూ.14.51 కోట్లు విడుదల చేశారని చెప్పారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఈసారి మొత్తం 1,814 మంది హజ్ యాత్రకు వెళ్లిరానున్నారని వివరించారు. ఏపీతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలని హజ్ యాత్రికులను అంజాద్ బాషా కోరారు. తాము ఇబ్బంది పడకుండా అదనపు భారం భరించడంతో పాటు అన్ని హంగులతో ప్రభుత్వం వసతి కేంద్రం ఏర్పాటు చేసిందని యాత్రికులు చెప్పారు. తమకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, యాత్రికులకు డిప్యూటీ సీఎం, హజ్ కమిటీ చైర్మన్ తదితరులు డ్రై ఫ్రూట్స్, గొడుగులు అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జఖియా ఖానం, ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, ముస్తఫా, ఎమ్మెల్సీలు రహుల్లా, ఇషాక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, సలహాదారు హబీబుల్లా, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, ఎయిర్పోర్ట్ భద్రతాధికారి వెంకటరత్నం, డీఎస్పీ జయసూర్య, హజ్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ బాసిత్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్ మునీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. -
నగ్నంగా పూజలు చేస్తే డబ్బులంటూ మోసం.. 12 మంది అరెస్ట్
గుంటూరు రూరల్: డబ్బు ఆశ చూపి యువతుల్ని మోసగించేందుకు ప్రయత్నించిన ఘరానా మోసగాడి ఆగడాలకు దిశ యాప్ సాయంతో అడ్డుకట్ట పడింది. బాధిత యువతులు తమ మొబైల్ ఫోన్లోని దిశ యాప్ ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని యువతులను రక్షించారు. వారిచ్చి న సమాచారం ఆధారంగా అఘాయిత్యాలకు పాల్పడిన 12 మందిని నల్లపాడు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ మహబూబ్‌బాషా కథనం ప్రకారం.. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు అనే వ్యక్తి బోర్లు వేసే సమయంలో కొబ్బరి కాయలతో నీరు పడుతుందో లేదో చెప్పే పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే గుప్త నిధులను వెతికేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన వి.నాగేంద్రబాబుకు నగ్నంగా పూజలు చేస్తే ఆర్థికంగా కలిసి వస్తుందని ఆశ చూపాడు. దీంతో నాగేంద్రబాబు తన క్లాస్మేట్ అయిన కర్నూలు జిల్లా ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాలకు చెందిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలకు ఒకసారి నగ్నంగా పూజలో కూర్చునే మహిళలు ఉంటే వారికి లక్ష రూపాయలు ఇస్తారని చెప్పాడు. దీంతో సురేష్, ఖాశిం, పెద్దరెడ్డి ఇద్దరు యువతులతో గత మంగళవారం గుంటూరు వచ్చి నాగేంద్రబాబును కలిశారు. ఈ విషయాన్ని నాగేంద్రబాబు పూజారి నాగేశ్వరరావుకు ఫోన్లో చెప్పాడు. దీంతో నాగేశ్వరరావు అనుచరులు, అతడి కారు డ్రైవర్ సునిల్, చిలకలూరిపేటకు చెందిన ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే అరవిందచౌదరి, సుబ్బు, శివ, రాధ గుంటూరు బస్టాండ్‌కు వెళ్లి నంద్యాల నుంచి వచ్చిన సురేష్, ఖాశిం, పెద్దరెడ్డిలను కలిసి.. డబ్బుల విషయమై మాట్లాడుకుని ఒప్పందానికి వచ్చారు. కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించి.. మంగళవారం రాత్రి పూజలు ప్రారంభించాలని నాగేశ్వరరావు చెప్పగా.. వారంతా తాడికొండ మండలం పొన్నెకల్లులోని నాగేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత నాగేశ్వరరావు యువతులను ఓ గదిలో నగ్నంగా కూర్చోబెట్టి పూజలు ప్రారంభించాడు. మధ్యలో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూజ చేస్తున్న సమయంలో కదిలితే ప్రాణాలు పోతాయని బెదిరించడంతో యువతులు ఏమీ చేయలేకపోయారు. పూజలు ముగిసిన అనంతరం నాగేశ్వరరావు, అతని అనుచరులు యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బుధవారం నాడు పొన్నెకల్లులో పూజలు కుదరటం లేదని చిలకలూరిపేటలోని పండరీపురంలో అరవిందచౌదరి ఇంట్లో పూజలు చేయాలని నిర్ణయించాడు నాగేశ్వరరావు. బుధవారం రాత్రి అందరూ కలిసి చిలకలూరిపేట వెళ్లారు. శుక్రవారం వరకూ పూజలు చేసే క్రమంలో యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుగు రోజులుగా పూజలు చేస్తున్నా ఫలితం లేకపోవటంతో నాగేశ్వరరావు అక్కడినుంచి జారుకున్నాడు. దిశ యాప్‌ను ఆశ్రయించడంతో.. ఈ క్రమంలో సదరు యువతులు ఒప్పందం ప్రకారం తమకు డబ్బు ఇస్తే ఇంటికిపోతామని నాగేశ్వరరావు అనుచరులను అడిగారు. దీంతో నాగేశ్వరరావు అనుచరులకు, యువతులకు వివాదం తలెత్తింది. ఈ విషయాన్ని అరవిందచౌదరి నాగేశ్వరరావుకు ఫోన్ చేసి చెప్పగా.. తన ఇంటికి వస్తే సెటిల్మెంట్ చేసుకుందామని నాగేశ్వరరావు సూచించాడు. అందరూ కారులో పొన్నెకల్లు బయలుదేరారు. మధ్యలో నాగేశ్వరరావు అనుచరులు యువతులను బెదిరించడంతో గోరంట్ల సమీపంలో బాధిత యువతులు తమ వద్దనున్న సెల్ఫోన్లో దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కడంతో వెంటనే స్పందించిన ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ నేతృత్వంలో నల్లపాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణమే నగర శివార్లలోని గోరంట్ల వద్ద ఉన్న యువతుల చెంతకు చేరుకుని ఆమెతోపాటున్న అరవింద చౌదరి, నాగేంద్రబాబు, సునిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు జరిగిన విషయాన్ని ఒప్పుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు నాగేశ్వరరావు, నాగేంద్రబాబు, అరవింద చౌదరి, రాధ, భాస్కర్, పెద్దరెడ్డి, సాగర్, వెంకటసురేష్, శివ, సునీల్, పవన్, సుబ్బులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొందరు ఉన్నారని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ మహబూబ్‌బాషా చెప్పారు. ఎవరైనా డబ్బు ఆశచూపి యువతులు, మహిళలకు ఎరవేస్తే నమ్మి మోసపోవద్దని డీఎస్పీ కోరారు. -
Hyderabad: 300 మందిని నిండా ముంచిన రియల్‌ఎస్టేట్స్ సంస్థ
మియాపూర్ (హైదరాబాద్): పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును ప్లాట్ల కొనుగోలు కోసం చెల్లిస్తే.. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్‌ఎస్టేట్స్ సంస్థ వారిని నిండా ముంచింది. సుమారు 300 మంది నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేసి.. వారికి ప్లాట్లు ఇవ్వకుండా, డబ్బులూ తిరిగివ్వకుండా బోర్డు తిప్పేసింది. దీనితో హైదరాబాద్‌లోని మియాపూర్ ఆల్విన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయం ముందు బాధితులు ఆదివారం ధర్నాకు దిగారు. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో అక్కడి నుంచి మియాపూర్ పోలీస్‌స్టేషన్ వరకు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలదాకా.. బాధితులు వెల్లడించిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన జానీ బాషాషేక్ రామంతాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ.. మియాపూర్‌లో మైత్రి ప్రాజెక్టు రియల్ ఎస్టేట్స్ పేరిట కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోని గాగిలాపూర్లోని రాయల్ లీఫ్, రామేశ్వర్బండలోని రాయల్ ప్యారడైజ్, మామిడిపల్లిలో రాయల్ వింట్, హంబ్టాన్ ఫామ్స్ పేరుతో వెంచర్లు వేసి.. ఓపెన్ ప్లాట్లను విక్రయిస్తున్నట్టు ప్రచారం చేశాడు. తప్పుడు డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు చూపించి తక్కువ ధరకే ప్లాట్లను ఇస్తామంటూ ప్రజలను నమ్మించాడు. పలు ప్రాంతాలకు చెందిన 300 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.10 లక్షల నుండి రూ.30 లక్షల మేర కట్టించుకున్నాడు. కానీ రిజిస్ట్రేషన్స్ చేయకుండా బాధితులను మూడేళ్లుగా తిప్పించుకుంటూ వచ్చారు. చివరికి మకాం మార్చి సంస్థకు తాళం వేసి పారిపోయాడు. నెల రోజుల కిందే ఫిర్యాదు చేసినా.. తమకు న్యాయం చేయాలని కోరుతూ మియాపూర్, పటాన్చెరువు, సంగారెడ్డి పోలీస్ స్టేషన్లలో నెల రోజుల క్రితం ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మైత్రి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మియాపూర్ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ చేశామని వివరించారు. మైత్రిలో డబ్బులు కట్టినవారంతా పేద, మధ్య తరగతికి చెందినవారమేనని.. తమ కలలు కల్లలు అవుతున్నాయని వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
కడపలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
-
అభిమానులకు రజనీ బర్త్‌డే గిఫ్ట్ అదేనా?
రజనీకాంత్ పుట్టినరోజు అంటే ఆయన అభిమానులకు పండుగనే. ఆ రోజు తమ అభిమాన నటుడు అందుబాటులో ఉండకపోయినా, అభిమానులు ఆయన పుట్టినరోజును ఆర్భాటాలతో జరుపుకుంటారు. ఈ ఏడాది రజనీ బర్త్‌డే సందర్భంగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఎదురుచూస్తోంది. రజనీకాంత్ నటించిన పేట చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన దర్బార్ చిత్రంలో నటిస్తున్న విషయం విధితమే. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అగ్రనటి నయనతార నాయకిగా నటించింది. ఏఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి తెరపైకి తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి, కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే రజనీకాంత్ 25 ఏళ్ల క్రితం నటించిన బాషా చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చిత్రంతోనే ఆయన దక్షిణ భారత సూపర్‌స్టార్ అయ్యారు. రజనీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన ఈ చిత్రాన్ని సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో సత్యమూవీస్ సంస్థ నిర్మించింది. రజనీకాంత్ 70వ పుట్టిన రోజు సందర్భంగా బాషా చిత్రాన్ని డిజిటలైజ్ చేసిసరికొత్తగా డిసెంబర్ 11న తమిళనాడులోని ప్రధాన నగరాల్లో విడుదలచేయనున్నట్లు సత్యామూవీస్ వర్గాలు వెల్లడించాయి. రజనీకాంత్ అభిమానులకు బర్త్‌డే కానుక అని సంస్థ పేర్కొంది. ఇటీవలే ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును అందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు బాషా చిత్ర రీ రిలీజ్ సర్ప్రైజే అవుతుంది. -
కేరాఫ్ నువ్వు
1980వ దశాబ్దపు వాస్తవ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘నేను కేరాఫ్ నువ్వు’. సాగా రెడ్డి తుమ్మా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్, సానియా సిన్యా, బాషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. దర్శకుడు సాగారెడ్డి మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల నుంచి ఈ సినిమా తీస్తున్నాం. ఇది నా ఒక్కడి సినిమా కాదు. నా స్నేహితులు, పార్టనర్స్ కూడా ఉన్నారు. లైఫ్‌లో మనకు ఎదురయ్యే కొన్ని సంఘటనలకు రియాక్ట్ అవుతాం, ఆ తర్వాత రియలైజ్ అవుతాం. ఈ సినిమా గురించి ఏం మాట్లాడినా వివాదం అవుతుంది. డైలాగ్స్ చాలా బోల్డ్‌గా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం సాగారెడ్డి బాగా కష్టపడ్డారు. కంటెంట్ నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్నాం’’ అన్నారు సహనిర్మాతలు ఎండీ అతుల్, తమ్మ దుర్గేష్ రెడ్డి, కొండ శశిరెడ్డి అన్నారు. ఈ సినిమాకు కెమెరా: జి.కృష్ణప్రసాద్. -
చిన్నోడా!
అర్ధరాత్రి వేళ నిద్రపట్టక మంచంపై అటూ ఇటూ దొర్లుతున్నాడు బాషా. బాషా తన తల్లిదండ్రులకు లేక లేక కలిగిన సంతానం కావడంతో పేదరికంలో ఉన్నప్పటికీ వాడికి ఏ లోటూ రాకుండా గారాభంగా పెంచారు. ఇంట్లో ఒక్క మంచం మాత్రమే ఉండటంతో కొడుకును మంచంపై పడుకోబెట్టి భార్యాభర్తలిద్దరు నేలపైనే కునుకు తీస్తున్నారు. మంచంపై పడుకుంటున్న బాషా కంటినిండా ఒక్క రోజైనా నిద్రపోయింది లేదు. బాషా తన తల్లిదండ్రులవైపు చూసి, ‘ఇక్కడ నిద్ర పట్టక చస్తుంటే కింద పడుకొని వీళ్లు ఎలా నిద్రపోతున్నార్రా!’ అనుకోని రోజు లేదు. ఇదే విషయం అమ్మను అనేక సార్లు అడిగినా, ఆమె నవ్వి ఊరుకుంటుంది గానీ సమాధానం చెప్పలేదు. బాషా తండ్రి రఫీ మాంసం అమ్ముతాడు. తల్లి రబియా ఆయనకు అన్నివిధాల సహకారంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఒకరోజు రఫీకి నాలుగు పక్కల పని తగిలింది. డబ్బుకి ఆశపడి పనులన్నీ ఒప్పుకున్నాడు. కానీ లోలోన ఆందోళనగానే ఉన్నాడు. ఎలా ఇవన్నీ చక్కబెట్టాలా అని భార్యతో ఆలోచించాడు. ఎవరో ఒక వ్యక్తిని పనికి పురమాయించుకున్నాడు. అయినా ధైర్యం చాలడం లేదు. ‘‘మరేమీ కంగారుపడకండి. మన బాషాను కూడా తీసుకుపోదాం. వాడి కాలేజీకి ఇప్పుడు సెలవులు కూడా! ఇవ్వాళ్టికి వాడినీ తీసుకెళ్తే బాగుంటుంది.’’ అంది రబియా కాస్తంత ధైర్యాన్నిస్తూ. బాషాను పనికి తీసుకెళ్లడం రఫీకి ఇష్టం లేదు. కానీ ఈసారికి తప్పదనుకున్నాడు. రాత్రి పదకొండు గంటలకే బయలుదేరి పన్నెండు గంటలకు మంత్రి గారింటికి చేరుకున్నారు. అక్కడ ఆరు గొర్రెలు కోయాల్సి ఉంది. పెట్టుకున్న మనిషి రాలేదు. రఫీ చకచకా పని కానిచ్చేస్తున్నాడు. రఫీ గొర్రెలను భాగాలుగా విడదీసి పడేస్తుంటే, తల్లి ముక్కలుగా నరుకుతోంది. బాషా ఇద్దరి మధ్య అటు ఇటు అందించడం, సహాయంగా పట్టుకోవడం వంటి పనులు చేస్తున్నాడు. ముగ్గురూ చకచకా పని చేస్తున్నారు కానీ అంత పని ఒకేసారి, ముగ్గురే చేయడం కష్టమైన పనే! సమయం రాత్రి రెండు దాటుతోంది. మంత్రిగారి మనిషి వచ్చి, ‘‘తెల్లారిపోతోంది. ఇంకో ఇద్దరిని తీసుకురాకపోయారా! మీ ఇద్దరివల్ల ఏమవుతుంది? వీడికేమో పని రానట్లుంది’’ అన్నాడు బాషా వైపు చూస్తూ. ‘‘అవునండీ! వాడికి పని రాదు. ఏదో ఉన్నంతలో వాడ్ని చదివిస్తున్నాం. అందువల్ల పని అబ్బలేదు.’’ అంది రబియా. ‘‘ఎంతసేపు లెండి! అయిపోతుంది. మనిషిని పెట్టాను కానీ వాడు రాలేదు. అయినా ఫర్వాలేదు సమయానికి మీకు అందిస్తాను కదా!’’ అన్నాడు రఫీ. ఆ మాటంటూ కూడా పనిచేస్తూనే ఉన్నాడు. తెల్లవారు జాము నాలుగయ్యేసరికి పనంతా పూర్తయింది. మంత్రిగారింట్లో పనవ్వగానే అక్కడ్నుంచి రఫీ హడావుడిగా దుకాణం తెరవాలని వచ్చాడు. రబియా, బాషా ఇంటికి వెళ్లిపోయారు. దుకాణంలో ప్రతిరోజూ మూడు నాలుగు మేకలు అమ్ముతుంటాడు రఫీ. ఈరోజు ఒకటయినా చేద్దామని దానిని సిద్ధం చేసుకుని దుకాణం తెరిచాడు. ఇంతలో రాజుగారి ఇంటినుండి కబురు రానే వచ్చింది. మేకలు కోసేందుకు తొందరగా రావాలన్నది దాని సారాంశం. రఫీ త్వరగా దుకాణం పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. ‘‘రాజుగారింట్లో మేకలు కోయాల్సి ఉంది. త్వరగా బయలుదేరండి.’’ అని భార్యాబిడ్డలను తొందర చేశాడు. బాషా తల్లి వైపు దిగాలుగా చూశాడు.రబియా వాడి పరిస్థితి గమనించి, ‘‘చిన్నోడా! నీకోసమేరా. మీ నాన్నా, నేను కష్టపడుతున్నాం. నువ్వింకా చదవాలి. ఉద్యోగం రావాలి. హాయిగా బతకాలిరా! అందుకేరా ఈరోజు నిన్ను కూడా పనిలోకి తీసుకురాక తప్పలేదు. నాలుగు డబ్బులుంటేనే కదా చదువుకోవడం వీలవుతుంది’’ అని సముదాయించింది. ‘‘పర్వాలేదమ్మా! ప్రతిరోజూ నాన్నా, నువ్వు ఎంత కష్టపడుతున్నారో నాక్కూడా అర్థమైంది.’’ అన్నాడు. రాజుగారింటికి ముగ్గురూ హడావుడిగా బయలుదేరి వెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడ పని పూర్తిచేశారు. చెమటలు కక్కేస్తున్నారు. హడావుడిగా ఇంటికి వచ్చి స్నానాలు చేసి రబియా బిర్యానీ తయారీలో పడింది. ఈరోజు ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి. బాషా అమ్మకు సహయం చేస్తున్నాడు. ఇంతలో ఎవరో వచ్చి, ‘‘రఫీ! నిన్ను వాండ్రమ్ సర్పంచ్ గారు రమ్మంటున్నారు. అక్కడ రెండు మేకలు చెయ్యాలి’’ అన్నాడు. ‘‘రాలేనండీ! రాత్రినుండి పనిచేసి ఇప్పుడే ఇంటికి వచ్చాం. తయారయిన బిర్యాని అప్పగించాలి.’’ అన్నాడు రఫీ. ‘‘రానంటే ఎలా! సర్పంచ్ గారింట్లో ఎప్పుడూ నువ్వే కదా చేసేది’’ అన్నాడతను. ‘‘అవుననుకోండి! కానీ ఇప్పటికిప్పుడంటే ఎలా వీలవుతుంది? ఈ పని అవ్వాలి కదా’’ అన్నాడు రఫీ. ‘‘ఫర్వాలేదు. అక్కడ రాత్రి పది గంటల వరకు ప్రార్థనలు జరుగుతాయి. అవి అయిన తర్వాతే భోజనాలు. నువ్వు నాలుగు గంటలకు వచ్చినా సరిపోతుంది.’’ అన్నాడు ఆ వచ్చినతను. భార్య వైపు చూశాడు రఫీ. ‘‘సర్పంచ్ గారికి ఎప్పుడూ మీరేగా చేసేది. కాదంటే బాగుంటుందా! సరేననండి. ఇవ్వాళ ఉన్న పని రేపు ఉంటుందా?’’ అంది. ‘‘సరే వస్తానని చెప్పండి సర్పంచ్ గారితో’’ అన్నాడు రఫీ. చిన్నోడు ఈసారి తండ్రివైపు గుర్రుగా చూశాడు – ‘‘ఇప్పటికే ఒళ్లు హూనమైంది. ఇంకేం వెళతాం నాన్నా!’’ అంటూ. ‘‘తప్పదురా చిన్నోడా! తెలిసినోళ్లు. కాదంటే ఎలా?’’ అంది రబియా. త్వరగా పని ముగించుకొని సర్పంచ్ ఇంటికి బయలుదేరారు ముగ్గురూ. అక్కడ మేకను కోస్తుండగా సర్పంచ్ వచ్చాడు. రబియాను చూసి, ‘‘మీ చేతి పలావు బాగుంటుందమ్మా! కాస్త పలావు వండి వెళ్లాలి మీరు’’ అన్నాడు. రబియాకు గొంతులో వెలక్కాయ పడినట్టయింది. రబియా ఏదో అనబోతుండగా మళ్లీ సర్పంచ్ అందుకొని, ‘‘నాకు తెలుసు, మీరు రాత్రి నుండి పని చేస్తూనే ఉన్నారని. ఇలాంటి సమయంలో అడగకూడదు. అయినా తప్పదు. ఎందుకంటే మాకు ప్రత్యేకమైన అతిథులు వచ్చారు. వారు మళ్లీ మళ్లీ వచ్చే వ్యక్తులు కాదు. పలావు మీరు చేసినట్లుగా మన చుట్టుపక్కల ఎవ్వరూ చేయలేరు. మా ప్రత్యేకమైన అతిథులకు మీ చేతి పలావు రుచి చూపించాలని అడుగుతున్నాను. వంటవాళ్లు ఉన్నారు. మీకు సాయం చేస్తారు. కాస్త కాదనకుండా చేయండి’’ అన్నాడు. ఈసారి రబియా భర్త వైపు చూసింది. ‘‘సర్పంచ్‌గారు అంతలా అడుగుతుంటే ఎలా కాదంటాం, కానివ్వు..’’ అన్నాడు రఫీ. ఇప్పుడు చిన్నోడు అమ్మవైపు గుర్రుగా చూశాడు. ‘‘నాయనా! నీకోసమేరా ఇదంతా’’ అంది రుబియా. బాషా మాట్లాడలేదు. మేకను కోసే పని అవ్వగానే బిర్యానీ తయారీలో పడింది రబియా. అప్పటికే నీరసం వచ్చిన బాషా ఒక మూల కూలబడ్డాడు.రఫీ, రబియాలు పలావు పూర్తిచేశారు. రాత్రి తొమ్మిది గంటలయ్యింది. అక్కడే కాస్త తిన్నామనిపించి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పదకొండు గంటలయ్యింది.రబియా వెంటనే వేడినీళ్లు పెట్టింది. ‘‘చిన్నోడా! స్నానం చేసి పడుకోరా. ఉదయం నుండి క్షణం తీరిక లేకుండా పోయింది.’’ అంది. చిన్నోడు పలకలేదు. మళ్లీ పిలిచింది. పలకలేదు. ‘‘వాడు కునుకు తీస్తున్నట్లున్నాడే నేను చేస్తా. ఈలోపు వాడు లేస్తాడులే’’ అన్నాడు రఫీ. రఫీ స్నానమయింది. మళ్లీ నీళ్లు కాగాయి. ‘‘చిన్నోడా! స్నానం చెయ్యరా’’ పిలిచింది. చిన్నోడు అరుగు మీద హాయిగా నిద్ర పోతున్నాడు. తల్లి పిలుపుకి ఉలుకూ పలుకూ లేదు. ‘‘సరే! నిద్రలో ఉన్నట్లున్నాడు. నువ్వు చేసిరా. ఆ తరువాత వాడు చేస్తాడులే!’’ అన్నాడు రఫీ. రబియా స్నానమయింది. నీళ్లు రెడీ అయ్యాయి. ‘‘చిన్నోడా!’’ అని పిలిచింది. వాడు మత్తుగా నిద్రపోతున్నాడు. తల్లి మాటలకు పలకలేదు. తట్టి లేపింది. అయినా వాడు లేవడం లేదు. హాయిగా నిద్ర పోతున్నాడు. ‘‘వీడు లేవడం లేదండి. ఏం చేయాలి?’’ అంది రబియా. ‘‘పోనీలే! వాడ్ని లేపకు. పడుకోనీ. లేచినప్పుడే చేస్తాడులే’’ అన్నాడు రఫీ.నేలపైనే నిద్రపోతున్న కొడుకు వైపు ప్రేమగా చూసింది రబియా. ఆ సమయంలో.. ‘‘అమ్మా నాకు మంచి నిద్ర పట్టడం లేదు. నాన్నా, నువ్వు నేలపై ఎలా నిద్దరవుతున్నారే’’ అన్న వాడి మాటలు గుర్తుకు వచ్చి రబియా తనలో తనే నవ్వుకుంది. ప్రేమగా బాషా తల నిమిరి ఆ పక్కనే నిద్రకు ఉపక్రమించింది. ఎప్పుడు తెల్లారిందో బాషాకు తెలియలేదు. లేచి చూసేసరికి తల్లి వంట చేస్తోంది. తను ఎక్కడ పడుకున్నాడో చూసుకుంటే చిన్నోడికి ఆశ్చర్యమేసింది. రోజూ మంచంపై పడుకున్నా పట్టని నిద్ర ఇక్కడ పట్టిందా. ఎంత మత్తుగా పడుకున్నాను. ఊహ తెలిసాక ఇంత మత్తుగా ఎప్పుడూ పడుకోలేదనుకున్నాడు. ‘‘అమ్మా! నాన్న ఎక్కడ?’’ అని అడిగాడు బాషా. ‘‘మీ నాన్న ఉదయాన్నే దుకాణం వెయ్యడానికి వెళ్లార్రా! నువ్వు రాత్రినుండి అలా పడుకొనే ఉన్నావు. ఎంత లేపినా లేవడం లేదని మీ నాన్న వాడి నిద్ర పాడు చేయొద్దు. పడుకోనివ్వు అన్నారని నిన్ను లేపలేదు. త్వరగా స్నానం చేసిరా. టిఫిన్ చేద్దువుగాని’’ అంది. చిన్నోడు కదలలేదు. రబియా దగ్గరకు వచ్చి, ‘‘నాయనా! ప్రతిరోజూ మంచంపై పడుకునేవాడివి రాత్రి నేలపై పడుకుండిపోయావు. ఎలా నిద్ర పట్టిందిరా!’’ అంది ప్రేమగా, బిడ్డవైపు చూస్తూ. ‘‘అమ్మా! నిన్ను ఎన్నోసార్లు నేను ఇదేమాట అడిగేవాడ్ని. నువ్వు సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకునేదానివి. కానీ నాకు సమాధానం దొరికిందమ్మా’’ అన్నాడు. ‘‘ఏంట్రా!’’ అంది రబియా. ‘‘అమ్మా! కష్టపడి పనిచేసేవాడికి నేలేంటి? మంచమేంటి? ఎక్కడైనా నిద్ర పడుతుంది. అమ్మా! శ్రమలోనే సుఖం ఉంది. సంపాదన ఉంది. ఒక ధీమా ఉంది. ధైర్యం ఉంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉంది’’ అన్నాడు. ‘‘ఒరేయ్ చిన్నోడా! ఇవన్నీ నాకు తెలియదుకానీ నువ్వు స్నానం చేసిరా. టిఫిన్ చేద్దువుగాని’’ అంది. చిన్నోడు విషయం గ్రహించాడు. ప్రతిరోజూ తండ్రికి సహాయపడుతూ మరింత ధీమాగా, మరింత హాయిగా నిద్రపోతున్నాడు. - కె. భాగ్య చంద్రశ్రీ -
మంచి–చెడు
ఒక రోజు ఒక కుక్క పూర్తిగా అద్దాలతో కట్టిన ఒక మ్యూజియంలోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ హాలు నిండా అద్దాలు ఉండటం వలన, ఆ కుక్కకు చుట్టూ ఎన్నో కుక్కలు ఉన్నట్టు కనిపించింది. నిజంగానే చాలా ఉన్నాయి అనుకుని, వాటిని భయపెట్టటానికి పళ్లు బయటపెట్టి అరిచింది. చుట్టూ ఉన్న దాని ప్రతిబింబాలన్నీ అలాగే చేశాయి. మళ్లీ గట్టిగా అరిచింది. అద్దాలలో కూడా అలాగే కనిపించింది. గది ఖాళీగా ఉండటం వల్ల శబ్దం మరింత ప్రతిధ్వనించింది. అద్దాల దగ్గరికి వెళ్లేసరికి ఆ కుక్కలు కూడా తన మీదకు వస్తున్నట్టు భ్రమించింది. రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారి ఆ మ్యూజియం కాపలావాళ్లు వచ్చి చూసేసరికి ఆ కుక్క చాలా దీనంగా, ఒంటినిండా దెబ్బలతో లేవలేని స్థితిలో, దాదాపు చనిపోవటానికి సిద్ధంగా ఉంది. ఎవ్వరూ లేని చోట కుక్కకు దెబ్బలు ఎలా తగిలాయి, ఎవరు దీని మీద దాడి చేశారు అని కాపలావాళ్లు ఆశ్చర్యపోయారు. నిజానికి ఆ కుక్క తన ప్రతిబింబాలతో తనే పోట్లాడింది. వాటిపై దాడి చేస్తున్నాను అనుకుని, తనకు తనే భయంకరంగా గాయాలు చేసుకుంది. ఈ ప్రపంచం కూడా సరిగ్గా అలాంటిదే. అది మనకు మంచి కాని, చెడు కాని చేయదు. మన ఆలోచనలు, మన మనస్తత్వమే మన మంచి చెడులను నిర్ణయిస్తుంది. మన ఆశలు, కోరికలు, ఆలోచనల ఫలితమే ఈ ప్రపంచం అనుకోవాలి. ఈ ప్రపంచం ఒక పెద్ద దర్పణం వంటిది. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే కనపడతారు. – ఎస్.ఎం. బాషా -
ఒక్క సినిమాతో వంద సినిమాలు పుట్టించిన బాషా
బాషాలో మంచి సీన్ ఉంటుంది.రజనీకాంత్ చెల్లెలికి మెడిసిన్‌లో సీట్ కావాల్సి వస్తుంది. ఫ్రీ సీట్లు అయిపోయి ఉంటాయి. కాలేజీ ఓనరు ‘ఇక మిగిలింది నా చేతిలో ఉన్న ప్రయివేటు సీట్లే’ అంటాడు.‘ఆ సీటు కావాలంటే నువ్వు కాలేజీతో పాటు అప్పుడప్పుడు గెస్ట్‌హౌస్‌కు వచ్చిపోతుండాలి’ అని అంటాడు.ఈ మాటతో హతాశురాలైన రజనీకాంత్ చెల్లెలు క్యాంటీన్లో కూచుని కన్నీరు పెట్టుకుంటూ రజనీకాంత్‌తో అంటుంది– ‘కాలేజీకెళ్లి చదువుకోవచ్చు, హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు, కాని గెస్ట్‌హౌస్‌కు వెళ్లి ఎలా చదవమంటావ్ అన్నయ్యా’. రజనీకాంత్ అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని కాలేజీ ఓనర్ దగ్గరకు వెళతాడు.‘ఏరా బెదిరించడానికి వచ్చావా నేనే పెద్ద రౌడీని’ అంటాడు ఓనర్.అప్పుడు రజనీకాంత్ అందరినీ బయటకు పంపించేసి ‘అయ్యా... నా పేరు మాణిక్యం’ అని టేబుల్ మీద చేతులు పెట్టి ముందుకు వొంగుతాడు.‘నాకు ఇంకో పేరు కూడా ఉంది’ అంటాడు.అంతే. ఆర్.ఆర్ మొదలవుతుంది. లోపల ఏం మాట్లాడుతున్నాడో మనకు వినిపించదు.అద్దాల గదిలో కాలేజీ ఓనరు సీట్లో నుంచి లేచి నిలుచోవడం, చెమటలు కక్కడం, రజనీకాంత్ ముందు చేతులు కట్టుకుని వణకడం... ప్రేక్షకులకు చాలా సంతృప్తిని, అహం తృప్తిని కలిగిస్తుంది.‘మా హీరో అంటే ఏమనుకుంటున్నావురా’.. అని వాళ్లు అనుకుంటారు. అతడు ఫ్లాష్‌బ్యాక్‌లో చాలా పెద్ద డాన్. తుపాకులతో, బుల్లెట్లతో ఆడుకున్నవాడు. అలాంటివాడు అజ్ఞాతంలో ఒక ఆటోవాడిలాగా బతుకుతుండొచ్చు. కాని పులి బోనులో ఉన్నంత మాత్రాన పులి కాకుండా పోతుందా?ఘనమైన ఫ్లాష్‌బ్యాక్ ఉండి కూడా అతి సామాన్యంగా బతుకుతున్న హీరో మళ్లీ జమ్మి చెట్టు మీద నుంచి అస్త్రాలు దించే తీరుతాడు అని ఎదురు చూసేలా చేసే ఫార్ములా ఇది.భారతం నుంచి బాషా వరకు ఆ ఫార్ములా సక్సెస్ అవుతూనే ఉంది. బాషాలో రజనీకాంత్ ఒక సరదా అయిన సగటు మనిషిలా మొదట కనిపిస్తాడు. కాని అతడిది అది అసలు రూపం కాదని ప్రేక్షకులకు తెలుస్తూనే ఉంటుంది. ఒక గొప్ప వీరుడు మారువేషంలో అజ్ఞాతంలో ఉన్నాడని దర్శకుడు హింట్స్ ఇస్తూ ఉంటాడు. ఆ పాత్రను ప్రేక్షకులే కాదు సాటి పాత్రలు కూడా తలెత్తి చూసేలా ఒక సన్నివేశం పెడతాడు. రజనీకాంత్ తమ్ముడికి పోలీస్ ఉద్యోగం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో కమిషనర్‌కు డౌట్ వస్తుంది. ‘మీ అన్నను రమ్మను’ అంటాడు. అప్పటికే ముంబై రికార్డ్స్‌లో బాషా మరణించాడని ఉంటుంది. ముంబైలో పని చేసి వచ్చిన ఆ కమిషనర్‌కు బాషా తెలుసు. ఇక్కడ ఉన్నది ఆ బాషాయేనా తెలుసుకోవడానికి రమ్మంటాడు. పెద్ద ఆఫీస్ రూమ్ అది.రజనీకాంత్ ఆటోవాలాలా ఎంట్రీ ఇస్తాడు. ఒక్కసారిగా కమిషనర్ లేచి నిలబడతాడు. పక్క పాత్రలూ ప్రేక్షకులు కూడా. మారువేషంలో ఉన్నది భీముడు అని కీచకుడు కనిపెట్టి అదిరిపడితే ఎలాంటి మజా వస్తుందో ఇక్కడ కూడా అలాంటి మజాయే ప్రేక్షకులకు వస్తుంది. రజనీకాంత్, చరణ్‌రాజ్ ముంబైలో స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కాని ఆ ప్రాంతంలో డాన్ అయిన రఘువరన్ మురికివాడను ఖాళీ చేయిస్తుంటే రజనీకాంత్, చరణ్‌రాజ్ అడ్డు పడతారు. చావు ఎదురైనా ఇద్దరం కలిసే ఈ అన్యాయాన్ని ఎదిరిద్దాం అనుకుంటారు. కాని రఘవరన్ చాలా దుర్మార్గుడు. తన దగ్గర పని చేసే మేనేజర్ విజయకుమార్ కొడుకు కాబట్టి రజనీకాంత్‌ని వదిలిపెట్టి చరణ్‌రాజ్‌ను దారుణంగా హత్య చేయిస్తాడు. చరణ్‌రాజ్ పేరు అన్వర్ బాషా. చరణ్ రాజ్ మృతదేహం ఖననం అయ్యేలోపు రజనీకాంత్ అతణ్ణి చంపిన ప్రతి ఒక్కరినీ నరుకుతాడు. బస్తీ వాసులంతా ఈ దుష్ట శిక్షణకు జేజేలు పలుకుతారు. ఆ రోజు నుంచి రజనీకాంత్ తన పేరును మాణిక్ బాషాగా మార్చుకొని ముంబైలో పెద్ద డాన్‌గా మారుతాడు. కాని రఘువరన్‌కు, రజనీకాంత్‌కు మధ్య గొడవలు పెరిగిపోయి ఆ గొడవల్లో తండ్రి ప్రాణమే పోయే పరిస్థితి వచ్చేసరికి తండ్రి చివరి కోరిక మేరకు నేర జీవితం వదిలేసి చెన్నై చేరుకుని మామూలు జీవితం గడుపుతుంటాడు రజనీకాంత్. కాని తిరిగి పాత రూపం చూపించే పరిస్థితి వస్తుంది. ఒక లోకల్ రౌడీ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే మాణిక్యం అవతారం చాలించి తిరిగి బాషా అవతారంలోకి వెళతాడు రజనీకాంత్.ఆ సన్నివేశం సినిమాలో ముఖ్యమైనది. అంతకు ముందు సన్నివేశాలలో ఆ రౌడీని చూసి రజనీకాంత్ భయపడినట్టుగా కనిపిస్తాడు. మనకెందుకు గొడవ అన్నట్టు పక్కకు తప్పుకుంటుంటాడు. చివరకు ఆ రౌడీ తనను స్తంభానికి కట్టేసి చితక బాదినా సహిస్తాడు. కాని ఎప్పుడైతే చెల్లెలి మీద ఆ రౌడీ చేయి వేస్తాడో... ఒకే గుద్దు... రౌడీ ఎగిరి కరెంట్ పోల్‌ను ఢీకొని కిందపడతాడు.రజనీకాంత్ మాణిక్యం అవతారాన్ని చాలించి తిరిగి బాషాగా మారాడన్న సంగతి తెలియగానే తల్లి అక్కడి నుంచి అందరినీ తీసుకెళ్లిపోతుంది. ప్రేక్షకుల రోమాలు నిక్క పొడుచుకుంటాయి. కేరెక్టర్ ఇమేజ్ ఆకాశానికి అంటుతుంది. ఇంతకుముందు సినిమాల్లో ఇలాంటి అనుభూతి లేదు.ఇది బాషా ఫార్ములా అనుభూతి. పాండవులు మారువేషంలో బతకడం సామాన్య జనులకు ఎంత అబ్బురమో హీరోలు మారువేషంలో బతకడం కూడా అంతే అబ్బురం. ఇచ్చిన మాటకు, విలువకు కట్టుబడి కుటుంబం కోసం సాధారణ జీవితం గడపడానికి వచ్చిన బాషా తిరిగి పాత రూపంలోకి వెళ్లి శత్రుశేషం ఎలా నిర్మూలించుకున్నాడన్నది క్లయిమాక్స్.సాధారణంగా సినిమాలు ముగిశాక శుభం కార్డు పడుతుంది. కాని బాషా ముగిశాక కూడా శుభం కార్డు పడలేదు. ఆ సినిమా కథ ముగియలేదు. ఇప్పటికీ అనేక కథలను పుట్టిస్తూనే ఉంది. ‘నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ అనేది ఇందులో పంచ్ డైలాగ్. ఒక్కసారి రిలీజైనా వంద విధాలుగా రీరిలీజ్ అవుతున్నదే– బాషా. ‘హమ్’ నుంచి స్ఫూర్తి పొంది... సురేశ్ కృష్ణ దర్శకత్వంలో 1995లో విడుదలైన ‘బాషా’ చాలా పెద్ద విజయం సాధించింది. ఒక రకంగా రజనీకాంత్ కెరీర్‌ని ఇంకో ఇరవై ఏళ్లు పొడిగించిన సినిమా ఇది. రజనీకాంత్ ఇమేజ్ భారీగా పెరడగానికి ఈ సినిమా ముఖ్యకారణం. దీని తర్వాత రజనీకాంత్ మల్టీ స్టారర్ హిందీ సినిమాలు మానుకొని సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేయడం మానుకొని ఒక్కసారికి ఒక్క సినిమా పద్ధతిలోకి వెళ్లి తన మార్కెట్ బాగా పెంచుకోగలిగాడు. 1991లో వచ్చిన ‘హమ్’ సినిమాలో నటించడం రజనీకాంత్‌కు లాభించింది. ఆ సినిమాలో అమితాబ్ ఇలాగే పెద్ద డాన్‌గా ఉండి అన్నీ మానేసి కుటుంబం కోసం అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతాడు. ఆ పాయింట్‌ను ‘బాషా’ కోసం కొత్తగా డెవలప్ చేసుకున్నాడు రజనీకాంత్. మంచి వయసు, ఆరోగ్యం ఉన్న రోజులలో వచ్చిన సినిమా కాబట్టి ఇందులో రజనీ పూర్తి ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ‘ప్రేమికుడు’తో తెర మీదకు వచ్చిన నగ్మా ఈ సినిమాతో రజనీ పక్కన నటించే చాన్స్ కొట్టేసింది. దేవా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యాయి. ఇక ‘నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ డైలాగ్ ఎన్ని సినిమాలలో ఎన్ని స్పూఫులుగా వచ్చిందో తెలుసు. ‘బాషా ఫార్ములా’ ధోరణి ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’ సినిమాల్లో మనం చూస్తాం. బాషా డిజిటల్లీ ఇంప్రూవ్డ్ ప్రింట్‌ను 2017లో విడుదల చేశారు. 20 ఏళ్ల తర్వాత కూడా ఒక సినిమా రీరిలీజ్ అయ్యిందంటే అది బాషాకు మాత్రమే దక్కిన ఘనత. - సురేశ్ కృష్ణ, దర్శకుడు – కె -
బాషా... ఫెంటాస్టిక్
ను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ – వందేళ్ల తర్వాతైనా డీటీఎస్లో ఈ డైలాగ్ మనకు వినిపిస్తూ ఉంటుందేమో! ఎందుకంటే... రజనీకాంత్ కల్ట్ క్లాసిక్ ‘బాషా’ వచ్చి 22 ఏళ్లయింది. అయినా ఆ సిన్మా పవర్ ఏమాత్రం తగ్గలేదు. సౌత్ సిన్మా ఇండస్ట్రీపై... ఆ మాటకొస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై... ‘బాషా’ సినిమా, అందులోని రజనీ నటన చూపించిన ఎఫెక్టు అటువంటిది! అందుకే, అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ఫెంటాస్టిక్ ఫెస్ట్’ నిర్వాహకులు ‘బాషా’ నిర్మాతలను అడిగి మరీ ఈ ఏడాది తమ ఫెస్టివల్లో సిన్మాను ప్రదర్శిస్తున్నారు. అమెరికాలోని ఆస్టిన్, టెక్సాస్‌లో నిన్న మొదలైన ‘ఫెంటాస్టిక్ ఫెస్ట్’ ఈ నెల 28 వరకు జరుగుతుంది. ఈ ఆదివారం (ఈ 24న) ఉదయం 10.40 గంటలకు, మళ్లీ మంగళవారం (26న) 10.20 గంటలకు ‘బాషా’ను ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోని డిఫరెంట్ జానర్ ట్రెండ్ సెట్టింగ్ సిన్మాలను ప్రతి ఏడాది ఈ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు. అసలు ‘బాషా’ సినిమా ‘ఫెంటాస్టిక్ ఫెస్ట్’కు ఎలా వెళ్లిందంటే... ఈ ఏడాది మార్చిలో ‘బాషా’ డిజిటల్లీ రీమాస్టర్డ్ వెర్షన్‌ను విడుదల చేశారు! అప్పుడు యూకేలో ఓ ఛారిటీ షో వేశారు. అక్కడ ‘ఫెంటాస్టిక్ ఫెస్ట్’ నిర్వాహకులు సినిమాను చూసి ఫెస్టివల్లో ప్రదర్శిస్తామని నిర్మాతలను అడిగారు. ‘క్రైమ్ క్లాసిక్’ కేటగిరీలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. -
రైలు వ్యాగన్ల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి
నల్లింగాయపల్లె (కమలాపురం) : కమలాపురం మండల పరిధిలోని నల్లింగాయపల్లె సమీపంలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ రైల్వే లైను వద్ద ప్రమాదవశాత్తూ రైలు వ్యాగన్ల మధ్య ఇరుక్కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్ఐ మహ్మద్ రఫీ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తలుపుల మండలం పెద్దన్నగారిపల్లెకు చెందిన మహబూబ్ బాషా(35) మూడేళ్లుగా భారతి పరిశ్రమకు బయటి నుంచి బొగ్గు వచ్చే రైల్వే విభాగంలో పాయింట్ మె¯ŒSగా పని చేస్తున్నాడు. బొగ్గు అ¯ŒSలోడింగ్ అయ్యాక వ్యాగన్లకు మధ్య కప్లింగ్ వేసి జాయింట్ చేసే పని చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో మంగâýæవారం తెల్లవారు జామున బొగ్గు అ¯ŒSలోడ్ అయ్యాక రెండు వ్యాగన్లకు మధ్య కప్లింగ్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ వ్యాగన్లకు ఉన్న రాడ్లు మృతుని కుడి చేతి వైపు బలంగా గుద్దు కోవడంతో వ్యాగన్ల మధ్య ఇరుక్కుని మృతి చెందాడు. మృతుడికి భార్య తాహరాబీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాహరాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బాషాకు దీటుగా..
-
బాషాకు దీటుగా..
బాషా చిత్రం తమిళ సినిమాలో ఒక చరిత్ర. గ్యాంగ్‌స్టర్‌గా సూపర్‌స్టార్ నటనకు పరాకాష్టగా పేర్కొనవచ్చు. అప్పట్లో రికార్డులు తిరగరాసిన బాషా చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆ చిత్ర దర్శకుడు సురేశ్‌కృష్ణ ప్రయత్నించినా రజనీకాంత్ నిరాకరించారు. అంతే కాదు బాషా ఒక్కడే అని ఆయన ఏకవాక్యం చేశారు కూడా. మరి బాషాకు దీటుగా మరో చిత్రం వచ్చేనా. వస్తుందంటున్నారు యువ దర్శకుడు పా.రంజిత్. ఈయన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల సూపర్‌స్టార్‌తో ఆయన తెరకెక్కించిన కబాలి చిత్రమే చాలా చెప్పేసింది. కాగా కబాలి చిత్ర టేకింగ్‌కు ముగ్ధుడైన సూపర్‌స్టార్ రంజిత్‌తో వెంటనే మరో చిత్రం చేయడానికి రెడీ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. దీన్ని ఆయన అట్లుడు, నటుడు ధనుష్ తన సొంత సంస్థ వండర్‌బార్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కథను తయారు చేసిన రంజిత్ ఇది కబాలి తరహాలో కాకుండా బాషా పంథాలో ఉంటుందంటున్నారు. అయితే బాషా చిత్రాన్ని మించే విధంగా ఉండదుగాని దానికి దీటుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది కూడా గ్యాంగ్‌స్టర్ కథా చిత్రమేనని తెలిసింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో రజనీని మరో కొత్తకోణంలో ఆవిష్కరిస్తానంటున్నారు దర్శకుడు పా.రంజిత్. ఇందుకోసం లోకేషన్స్ ఎంపిక చేయడానికి రంజిత్ బృందం ప్రస్తుతం ముంబైలో మకాం వేసినట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ తదిపరి పా.రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. -
విద్యుదాఘాతంతో ఒకరు మృతి
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి చనిపోయాడు. గ్రామానికి చెందిన ఎం.బాషా(27) తన ఇంట్లో మోటారు ఆన్ చేశాడు. అది పని చేయకోవటంతో మరమ్మతు చేయబోయాడు. అందులో విద్యుత్ ప్రసారం అవుతుండటంతో షాక్‌తో అక్కడికక్కడే చనిపోయాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. -
కనికరం లేని కొడుకులు
ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చాడు.. కడుపుకట్టుకుని పెంచి పెద్దచేశాడు.. సంపాదించిన ఆస్తిపాస్తులూ సమానంగానే పంచిపెట్టాడు.. బిడ్డలపై భారం కాకూడదని సొంతంగానే బతకడం నేర్చుకున్నాడు.. వయసు మీదపడింది.. బతుకు భారమైపోయింది.. భిక్షమెత్తినా భుక్తి దొరకడం గగనమైపోయింది.. అవసాన దశలో కన్నబిడ్డల చెంతే కన్నుమూయాలనుకున్నాడు.. కానీ కనికరం లేని ఆ కుమారులు రక్తం పంచి ఇచ్చిన తండ్రినే వద్దనుకున్నారు.. నిర్ధాక్షణ్యంగా రైల్వేస్టేషన్లో వదిలివెళ్లిపోయారు.. ఈ ఘటన కలికిరిలో ఆదివారం సంచలనం రేపింది. కలికిరి:కలికిరి పట్టణం అమరనాధరెడ్డి కాలనీలో వున్న కాములూరి బాషా(60)కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. కొడుకుల్లో ఒకరు ఆర్టీసీబస్టాండ్ సమీపంలో టీస్టాల్ నడుపుతున్నాడు. మరొకరు తిమ్మారెడ్డి కాంప్లెక్స్‌కు ఎదురుగా బజ్జీలకొట్టు పెట్టుకున్నాడు. ఇంకో కుమారుడు సౌదీలో ఉంటున్నాడు. అందరూ ఆర్థికంగా స్థిరపడ్డా తండ్రిని పట్టించుకోక వదిలేశారు. చేసేదిలేక బాషా బెంగుళూరుకు వెళ్లిపోయాడు. భిక్షాటన చేసుకుంటూ అక్కడ ఐదేళ్లు జీవించాడు. చివరి రోజుల్లో బిడ్డలను చూసి వారివద్ద తనువు చాలించాలనుకున్నాడు. రెండు రోజుల క్రితం కలికిరికి వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడిని కుమారులిద్దరూ రైల్వేస్టేషన్లో వదిలి చేతులు దులుపుకున్నారు. స్థానికులు గుర్తించి ఆదివారం రాత్రి ఎస్ఐ పురుషోత్తరెడ్డికి సమాచారమందించారు. ఎస్ బాషా కుమారులతో మాట్లాడినా వారు స్పందించకపోవడంతో వృద్ధుడిని స్టేషన్‌వద్దకు తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవసాన దశలో ఇంటికి వచ్చిన తండ్రిని వదిలించుకోవాలనుకున్న వారిపై స్థానికులు మండిపడుతున్నారు. -
పిల్లలు పుట్టడం లేదని..
పిల్లలు పుట్టడంలేదనే మనస్తాపంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నంద్యాల పట్టణంలోని ఎంఎస్నగర్లో గురువారం చోటుచేసుకుంది. ఎంఎస్నగర్కు చెందిన భాషాతో పర్వీన్(28)కు 8 సంవత్సరాల క్రితం పెళ్లయింది. పెళ్లై ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు కాకపోవడంతో ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించింది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
యువకుని దారుణ హత్య
కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక యువకుని గొంతు కోసి హతమార్చారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడు సాదరదిన్నె గ్రామానికి చెందిన బాషా(38)గా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదైహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బైక్‌లు ఢీ - ముగ్గురికి గాయాలు
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పులిచర్ల గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. జేబీ చెరువు గ్రామానికి చెందిన బాష(25), చెంచయ్య(60) బైక్‌పై రాచర్లకు వచ్చి వెళ్తుండగా.. ఎదురుగా బైక్ పై వస్తున్న రంగస్వామి(40), భాగ్యలక్ష్మి(35)లను ఢీకొట్టారు. ఈ ప్రమాదం నుంచి భాగ్యలక్ష్మి సురక్షితంగా బయటపడగా.. మిగితా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మోసం చేసిందనే మల్లీశ్వరిని చంపా: బాషా
అద్దంకి: 'భర్తను వదిలేసిన తర్వాత నాకు దగ్గరైంది. మొదట్లో అన్యోన్యంగానే ఉన్నాం. కానీ రానురానూ తాను విపరీతంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎవరెవరితోనో మాట్లాడేది. ఎక్కడెక్కడికో వెళ్లేది. వద్దని ఎంత మొత్తుకున్నా వినేదికాదు. గట్టిగా అడిగితే నిన్నొదిలేసి హైదరాబాద్ వెళ్లిపోతానని బెదిరించేది. అంతే, పట్టలేని కోపంతో పక్కనున్న నవారు తీసుకొని తన గొంతు నులిమా' అంటూ మల్లేశ్వరిని ఎందుకు చంపాడో పోలీసులకు వివరించాడు బాషా. ప్రకాశం జిల్లా అద్దంకిలో సంచలనంరేపిన ఈ హత్యకేసు పూర్వాపరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామానికి చెందిన మల్లీశ్వరి(25)కి అద్దంకి మండలం మనికేషం గ్రామానికి చెందిన రామారావుతో వివాహమైంది. చాలా ఏళ్ల కిందటే వారు విడిపోయారు. భర్తతో తెగదెంపుల అనంతరం కొత్తదామవారిపాలెంకు చేరుకున్న మల్లీశ్వరి అక్కడ ఒంటరిగా నివసిచసాగింది. ఈ క్రమంలో ముజావర్ పాలెంకు చెందిన బాషా(30) అనే వ్యక్తితో పరిచయమైంది. అదికాస్తా ప్రేమగామారి ఇరువురూ సహజీవనం చేస్తున్నారు. తనతో కలిసి ఉంటూనే మరికొందరితోనూ దగ్గరగా ఉంటోందని మల్లేశ్వరిపై అనుమానం పెంచుకున్నాడు బాషా. చాలాసార్లు హెచ్చరించి చూశాడు. శనివారం రాత్రి కూడా ఇరువురి మధ్య ఇదేవిషయంలో ఘర్షణ జరిగింది. తనను అనుమానిస్తే హైదరాబాద్ వెళ్లిపోతానని మల్లేశ్వరి బెదిరించింది. దీంతో కోపోద్రిక్తుడైన బాషా ఇంట్లో ఉన్న నవారుతో ఆమెకు ఉరి వేసి.. ఏమి తెలియనట్లు నటించాడు. తాను రావడానికి ముందే మల్లీశ్వరి ఉరి వేసుకుందని చుట్టుపక్కలవారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి బాషాను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా మల్లీశ్వరిని తానే చంపానని బాషా అంగీకరించాడు. దీంతో బాషాపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. -
బాషా-2లో అజిత్?
బాషా. ఇది రజనీకాంత్, దర్శకుడు సురేష్‌కృష్ణ సినీకేరీర్లోనూ మరచిపోలేని చిత్రం. అంతేకాదు తమిళ చిత్రపరిశ్రమలోనే ఒక మైలురాయి. దర్శకుడు సురేష్‌కృష్ణ ఎక్కడికి వెళ్లినా బాషా చిత్రానికి సంబంధించిన ప్రశ్నల నుంచి తప్పికోలేరు. అంతగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఆపాధించి పెట్టిన చిత్రం అది. అలాంటి చిత్రానికి సీక్వెల్ తీయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది. అయితే ఇది కత్తి మీద సాము అన్న సంగతి తెలిసిందే. అయినా బాషా-2 రూపొందించాలన్నది సురేష్‌కృష్ణ కోరిక. రజనీ ఓకే అంటే బాషా పార్టు 2 తీస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఆ పట్టుదలతోనే బాషా సీక్వెల్‌కు కథ సిద్ధం చేశారు. ఈ విషయాన్ని మన సూపర్‌స్టార్‌కు తెలిజేశారు కూడా. అయితే బాషా ఒక్కడే మరో బాషాను కలలో కూడా ఊహించుకోలేనని రజనీకాంత్ అన్నారట. దీంతో ప్రత్యామ్నాయ దిశగా దృష్టి సారించిన దర్శకుడు సురేష్‌కృష్ణ. ఆయనకు అజిత్ ఒక్కరే కనిపించారట. అజిత్ ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన బిల్లా చిత్ర రీమేక్‌లో నటించే సాహసంచేసి విజయం సాధించారు. అదీకాకుండా బాషా లాంటి గ్యాంగ్‌స్టర్ పాత్రలకు ప్రస్తుత నటుల్లో ఆయనే గుడ్ ఛాయిస్ అనుకున్నారు. బాషా-2 స్క్రిప్ట్‌ను అజిత్‌కు వినిపించారని, ఆయన నటించడానికి సమ్మతించినట్లు కోలీవుడ్ వర్గాల బోగట్టా. అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఏఎం.రత్నం నిర్మిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి కేవీ ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అనధికార ప్రచారం జరుగుతోంది. మరి బాషా సీక్వెల్ తెరరూపం దాల్చేదెప్పుడో? అసలు ఈ చిత్రం ఉంటుందో? లేదో? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. -
ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే!
ఒక్కసారి కాదు... వందసార్లు చూసినా... బాషా పంచ్‌లు... మళ్లీ మళ్లీ పిడికిళ్లు బిగించేలా చేస్తూనే ఉంటాయి. చాలా కాలం తరువాత... ‘బాషా’ వచ్చాడు తెర పైకి మళ్లీ. కొన్ని వేడిలోనే బాగుంటాయి. కొన్ని చల్లబడిన తరువాత కూడా మునపటి కంటే ఎక్కువ వేడితో, వాడితో బాగుంటాయి. కొన్ని రెండిట్లోనో మహా మహా బాగుంటాయి. బాషా... వేడిలోనే కాదు... ఆ వేడి తగ్గిన కాలంలోనూ మళ్లీ వేడెక్కిస్తాడు. బాషాను చూసి చాలా కాలమే అయ్యుండవచ్చు. కానీ ఇప్పటికీ చూస్తే... ఇప్పుడే చూసినట్లు ఉంటుంది. ‘మాణిక్యం’ క్యారెక్టర్ గుండెలో తడిని తడుముతున్నట్లే ఉంటుంది. బాషా క్యారెక్టర్ కళ్లలో అగ్నులను ఉత్తేజితం చేస్తున్నట్లుగానే ఉంటుంది. ‘‘నేను మాణిక్యమైపోవాలి’’ అనుకుంటాం. మాణిక్యాన్ని బంగారం చేసింది కుటుంబం మీద అతని ప్రేమ. ఆ ప్రేమను మనకు తెలియకుండానే సొంతం చేసుకుంటాం. ఉన్నట్టుండి మనం మాణిక్యాలమై పోతాం. కుటుంబాన్ని ఇంకా... ఇంకా ప్రేమిస్తాం. తన చెల్లిని వేధించినవాడిని చావబాదుతుంటే... మనం మన సీట్లో నుంచి లేచి మాణిక్యంలో ఐక్యమైపోతాం. ఆ గూండాను-‘‘రేయ్... అంటోని గురించి నా దగ్గర చెప్పొద్దు’’ అని హెచ్చరిస్తాం. అప్పటికీ మన ఆవేశం చల్లారదు. ‘‘నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు..’’ అని కాలరు పట్టుకొని వాడి చెంప చెళ్లుమనిపిస్తాం. అంతేనా... మాణిక్యంతో పాటు బాంబే వెళ్లిపోతాం. బాషా అయిపోతాం. బాషాలా చిటికేస్తాం. గొంతు పెంచి- ‘‘ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినపట్లే’’ అని గర్జిస్తాం. గాండ్రిస్తాం. చూస్తూ ఉండగానే బాషా మనల్ని ఆవహిస్తాడు. పేదోడి జోలికి వచ్చే వాడి పీక నొక్కేస్తాం. పేదోడి కడుపు కొట్టే రాబందులను నల్లుల్లా నలిపేస్తాం. ఆవేశం ఆవేశం... ఒంటి నిండా ఆవేశం... అమ్మ తల్లి పూనినట్లు... బాషా మనల్ని పూనుతాడు. వినాయకుడి గుడిలో బాంబు పెట్టడానికి వచ్చిన గుండాను మట్టికరిపించి- ‘‘నాకు పని పెట్టొద్దు. నిజం చెప్పు... తెలుసుగా... ఈ బాషా ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’’ అని ఊగిపోతాం. బాషా మనల్ని పూనాడు కదా... ఇక భయమెందుకు? డాన్ ఆంటోని అయితేనేం... వాడి తాత అయితేనేం? ‘‘రేయ్ నువ్వు చావాలి. లేదా నేను చావాలి. నీ వాళ్లు చావాలి. లేదా నా వాళ్లు చావాలి. ప్రజలు కాదు... అమాయక ప్రజలు కాదు చావాల్సింది. ఇప్పుడు తెలిసింది... నువ్వు పిరికి వెధవ్వి. ఒక పిరికి వాడితో యుద్ధం చేయడం నాకు నచ్చదు. ఈ బాషాకు... మాణిక్ బాషాకు నచ్చదు. ఇంకా ఏడే రోజుల్లో నీ కథ ముగిస్తా. ఈ బాషా ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే! ఒక్క డైలాగ్... ఒకే ఒక్క డైలాగు... మనల్ని ఏకం చేస్తుంది... మన ధైర్యాన్ని ఏకం చేస్తుంది. మన అడుగుల్ని ఏకం చేస్తుంది. గుండెలో రగిలే రణధ్వనిని ఏకం చేస్తుంది. కొందరు భావోద్వేగాలే మనుషులైనట్లు ఉంటారు. కొందరు అవి మచ్చుకైనా లేనట్లు ఉంటారు. అంతమాత్రాన... వాళ్లు రాతిగోడలు కాదు. రాతి గోడలో కూడా తేమ ఉంటుందని గంభీరంగా నిరూపించే వాళ్లు. మనలో భావోద్వేగాల మాణిక్యాలు ఉండొచ్చు. దెబ్బకు దెబ్బ తీసే మాణిక్ బాషాలు ఉండొచ్చు. ‘‘మంచి వాడు మొదట కష్టపడతాడు... కానీ ఓడిపోడు’’ అది బాషా చెప్పిన భాష్యమే కాదు... నిజ జీవిత సత్యం అని మన జీవితాల్లో ఎన్నో ఉదాహరణలు సజీవంగా చెబుతుంటాయి. ‘‘ చెడ్డవాడు మొదట సుఖపడతాడు... కానీ ఓడిపోతాడు’’ ఓడిపోయిన చెడ్డ వాళ్లు మన ముందు దీనంగా క్యూ కడుతూనే ఉంటారు. బాషా ఒక్కడే- కానీ ఎప్పుడు వచ్చినా వందలుగా వస్తాడు. అందరినీ .... పంచ్ పవర్‌తో ఏకం చేస్తూనే ఉంటాడు. బాషా అంటే ఏకవచనం కాదు... అందరిని ఏకం చేసే సర్వనామం! సింహనాదం!! -
మాఫియాడాన్‌గా కనిపించబోతున్న రజనీ
-
ప్రేమించినోడికి బైబై చెప్పింది
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒక్కటవుదామని పోలీసులను ఆశ్రయించారు. యువతి తల్లిదండ్రులు వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. తమ పేగు బంధాన్ని కుమార్తెకు గుర్తు చేశారు. కరిగిన యువతి తల్లిదండ్రుల వెంట నడిచింది. ప్రేమించినోడికి బైబై చెప్పింది. సదరు యువకుడు వాహనం వెంట పడినా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ సంఘటనకు ఆదివారం గిద్దలూరు పోలీసుస్టేషన్ వేదికగా నిలిచింది. గిద్దలూరు రూరల్ : మండలంలోని సూరేపల్లె గ్రామానికి చెందిన బాషా విశాఖపట్నంలో బీటెక్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఎంటెక్ చదువుతున్న యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇంతలో ఆ యువతికి వేరే వ్యక్తితో పెద్దలు వివాహం కుదిర్చారు. పెళ్లి ఇష్టం లేక ఆమె బాషాతో కలిసి గిద్దలూరు వచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో యువతి తల్లిదండ్రులు గిద్దలూరు వచ్చారు. తమ కుమార్తెకు నచ్చజెప్పారు. మధ్యలో చదువు ఆగిపోతుందన్నారు. పేగు బంధాన్నీ సదరు గుర్తు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె తల్లిదండ్రుల వెంట నడి చేందుకు సిద్ధమైంది. స్నేహితుడు బాషా ఎంత బతిమాలినా ఆమె పట్టించుకోలేదు. యువతి వెళ్తున్న వాహనం వెంట బాషా పరుగులు తీశాడు. ఒకసారి ఆలోచించాలని వేడుకున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమనూ గుర్తు చేశాడు. చివరకు పేగు బంధం ముందు ప్రేమ ఓడిపోయింది. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేదాని కన్నా ఆ సన్నివేశం పలువురిని ఆలోచింపజేసింది. -
ఎవరీ బాషా భాయ్?
తిరుపతి, సాక్షి: బాషాభాయ్... ఎర్రచందనం డాన్. చెన్నైలో ఉంటాడు. అతన్ని చూసిన వాళ్లెవరూ లేరు. సినిమాల్లోలాగా అతనికి బోలెడు మంది అనుచరులు. వాళ్లే దందా నడుపుతూ ఉంటారు. చాలా పెద్ద విషయమైతేనే బాషా రంగంలోకి వస్తాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కి దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ దీన్ని వ్యవస్థాగతం చేసింది బాషానే. ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉందని మొదట పసిగట్టింది అతనే. బాషాకి చట్టబద్దమైన వ్యాపారాలు చాలా ఉన్నాయి. అవి ఉంటేనే షిప్పుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ సాధ్యమయ్యేది. అతని మ నుషులు గ్లోబల్ టెండర్లలో గతంలో ఎర్రచందనాన్ని కొనే వారు. దాన్ని రవాణా చేస్తున్నప్పుడు అసలు సరుకులోకి అక్ర మసరుకుని కలిపేస్తారు. ఎక్కడా ఎవరూ నోరు మెదపకుండా మేనేజ్ చేస్తారు. స్మగ్లింగ్‌లో అసలు సమస్య అడవుల్లోకి వెళ్లి నరకడం, సరుకుని లారీల్లోకి ఎక్కించడం, తర్వాత దాన్ని ఆం ధ్రా సరిహద్దు దాటించడం. ఒకసారి సరిహద్దుదాటిన తర్వా త చైనావరకూ దాన్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే బంగా రు, వజ్రాలు, డ్రగ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులపైన ఉన్న శ్రద్ధ కస్టమ్స్ వాళ్లకి ఈ ఎర్రచందనంపై ఉండదు. మొదట్లో స్థానిక కూలీలే అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం వృక్షాలను నరికేవాళ్లు. అయితే వాళ్లు సులభంగా దొరికిపోయేవాళ్లు. కూలీ డబ్బుల ను విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ ఉండడంతో ఇరుగుపొరుగు వాళ్లే సమాచారమిచ్చేవాళ్లు. అంతేకాకుండా అక్రమ రవాణా లో పోటీ పెరగడంతో స్థానిక స్మగ్లర్లలో ఉన్న అనైక్యతవల్ల ఒకరిగురించి మరొకరు అధికారులకు సమాచారమిచ్చి పట్టిం చేవాళ్లు. ఈ నేపథ్యంలో తమిళులు ప్రవేశించారు. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో వీరప్పన్ అనుచరులు న్నారు. వాళ్లు కేరళ, కర్ణాటక, తమిళనాడు అడవుల్లోని శ్రీగంధం వృక్షాలను కొన్నేళ్లపాటు నరికేశారు. ఇప్పుడక్కడ ఏమీ లేకపోవడంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఉన్న ఎర్రచందనంపై పడ్డారు. ఇంకో రెండు మూడేళ్లలో ఇక్కడ కూడా ఏమీ మిగలదు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో రిస్క్కంటే లాభాలే ఎక్కువున్నాయి. అడవిలో నరికి సరుకును గమ్య స్థానానికి చేర్చడం వరకే రిస్క్. ఒకవేళ పట్టుబడితే బెయిల్ లభిస్తుంది. శిక్షపడితే మూడు నెలలకు మించదు. వీళ్లకోసం తమిళనాడు నుంచి లాయర్లు వస్తారు. జరగాల్సింది వాళ్లు చూసుకుంటారు. చివరికి ఈ స్మగ్లింగ్ మనీ సర్క్యులేషన్ స్కీంలా తయారైంది. వేలకు వేలు కూలి డబ్బులు సంపాదించుకుని సొంత వూళ్లకు వెళ్లిన కూలీలను చూసి అనేక గ్రామాలవాళ్లు ప్రభావితమై తమిళనాడు నుంచి ఏకంగా బస్సుల్లో, రైళ్లల్లో వచ్చేస్తున్నారు. కూలీలే కొంతకాలానికి చిన్న స్మగ్లర్లగా మారుతున్నారు. వీళ్లంతా కూడా బడా స్మగ్లర్ బాషా అనుచరులను ఆశ్ర యించాల్సిందే. బాషా అంటే ఒక్కడు కావచ్చు. ఆ పేరుతో అనేకమంది ఉండొచ్చు. శేషాచలం అడవుల్ని ఖాళీ చేయడమే వీళ్ల లక్ష్యం.