పిల్లలు పుట్టడంలేదనే మనస్తాపంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నంద్యాల పట్టణంలోని ఎంఎస్‌నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. ఎంఎస్‌నగర్‌కు చెందిన భాషాతో పర్వీన్(28)కు 8 సంవత్సరాల క్రితం పెళ్లయింది. పెళ్లై ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు కాకపోవడంతో ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించింది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పిల్లలు పుట్టడం లేదని..
Published Thu, May 5 2016 4:35 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement