‘నాన్న, చెల్లి నన్ను క్షమించండి.. భరించడం నా వల్ల అవ్వట్లేదు’ | Software Engineer Commits Suicide in Kurnool District | Sakshi
Sakshi News home page

‘నాన్న, చెల్లి నన్ను క్షమించండి.. భరించడం నా వల్ల అవ్వట్లేదు’

Published Tue, Feb 1 2022 5:01 PM | Last Updated on Tue, Feb 1 2022 5:39 PM

Software Engineer Commits Suicide in Kurnool District - Sakshi

నకు ఉన్న మానసికవ్యాధితో జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉదయం కర్నూలు రైల్వేస్టేషన్‌ నుంచి అలంపూర్‌కు వెళ్లే మార్గంలో (సుమారు 750 మీటర్ల దూరంలో) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సాక్షి, కర్నూలు: ‘నాన్న, చెల్లి శ్రావణి నన్ను క్షమించండి.. కొంతకాలంగా నేను మనోవేదనకు గురవుతున్నా.. భరించడం నా వల్ల అవ్వట్లేదు’ అంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బత్తుల ముకేష్‌రెడ్డి(25) సూసైడ్‌నోట్‌ రాసి  రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన తండ్రి శివశంకర్‌రెడ్డి కల్లూరులోని వెంకటాచలపతి నగర్‌లో రాములదేవాలయం దగ్గర నివాసముంటున్నాడు. ముకేష్‌రెడ్డి బెంగళూరులోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

చదవండి: (ఒకరు బీటెక్‌, మరొకరు బీఎస్సీ.. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌.. ఏ కష్టమొచ్చిందో.!)  

కరోనా కారణంగా కంపెనీ యాజమాన్యం వర్క్‌ ఫ్రం హోమ్‌ అప్పగించడంతో  కొంతకాలంగా కర్నూలులో ఇంటి దగ్గరే ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. తనకు ఉన్న మానసికవ్యాధితో జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉదయం కర్నూలు రైల్వేస్టేషన్‌ నుంచి అలంపూర్‌కు వెళ్లే మార్గంలో (సుమారు 750 మీటర్ల దూరంలో) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ సూపరింటెండెంట్‌ హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్‌పీ ఎస్‌ఐ కిరణ్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement