
పిల్లలు మృతి చెందడంతో రోదిస్తున్న తల్లి
కర్నూలు (న్యూటౌన్): కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులతో సహా ఓ తల్లి బావిలో దూకింది. ఈ ఘటనలో చిన్నారులు ప్రాణాలు కోల్పోగా తల్లిని స్థానికులు రక్షించారు. కర్నూలు మండలం పూలతోట గ్రామానికి చెందిన పాల రమేష్‌రెడ్డి కుమార్తె మనీషారెడ్డికి ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌రెడ్డితో ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి చర్వితారెడ్డి (4), పునీత్‌కుమార్‌రెడ్డి (2) సంతానం. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇటీవల మనీషారెడ్డి (25) తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చింది. ఇంతలో ఏమైందో కాని శనివారం ఇంటి వెనుక ఉన్న బావిలో పిల్లలతో సహా దూకేసింది.
చదవండి: ఫేస్‌బుక్ ద్వారా పరిచయం.. ప్రేమించానని నమ్మించి..
వెంటనే స్థానికులు గుర్తించి మనీషాను బావిలోకి తాళ్లు వేసి బయటకు లాగి ప్రాణాలతో కాపాడారు. చిన్నారులిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే వారు నీట మునిగి మృతి చెందారు. కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే పిల్లలు ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడ్డారని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment