jumped into well
-
ఇద్దరు కొడుకులతో కలసి బావిలోకి దూకిన తల్లి
నడికూడ: ఇద్దరు కొడుకులతో కలసి తల్లి బావిలో దూకగా.. ఒక కొడుకు, తల్లి మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి కుమారస్వామితో దేశాయిపేటకు చెందిన కావ్య అలియాస్ లావణ్య (30)కు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు విద్యాధర్ 3వ తరగతి చదువుతుండగా.. చిన్న కొడుకు శశిధర్ (7) ఒకటో తరగతి చదువుతున్నాడు. కాగా, కావ్య ఆదివారం మధ్యాహ్నం తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. ముందుగా ఇద్దరు కుమారులను బావిలోకి తోసి.. ఆ తర్వాత తానూ బావిలోకి దూకింది. వీరిలో పెద్ద కుమారుడు బావిలోని విద్యుత్ మోటార్ పైపును పట్టుకొని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, వ్యవసాయ కూలీలు వచ్చి విద్యాధర్‌ను పైకి తీశారు. అప్పటికే తల్లి, చిన్న కుమారుడు శశిధర్ మృతిచెందారు. కావ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కొడుకు విద్యాధర్‌ను ప్రశ్నించగా నానమ్మతో తల్లికి గొడవ జరిగిందని తెలిపాడు. మృతురాలు కావ్యకు మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. -
పిల్లలతో పుట్టింటికి వచ్చి.. ఇంతలో ఏమైందో కానీ..
కర్నూలు (న్యూటౌన్): కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులతో సహా ఓ తల్లి బావిలో దూకింది. ఈ ఘటనలో చిన్నారులు ప్రాణాలు కోల్పోగా తల్లిని స్థానికులు రక్షించారు. కర్నూలు మండలం పూలతోట గ్రామానికి చెందిన పాల రమేష్‌రెడ్డి కుమార్తె మనీషారెడ్డికి ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌రెడ్డితో ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి చర్వితారెడ్డి (4), పునీత్‌కుమార్‌రెడ్డి (2) సంతానం. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇటీవల మనీషారెడ్డి (25) తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చింది. ఇంతలో ఏమైందో కాని శనివారం ఇంటి వెనుక ఉన్న బావిలో పిల్లలతో సహా దూకేసింది. చదవండి: ఫేస్బుక్ ద్వారా పరిచయం.. ప్రేమించానని నమ్మించి.. వెంటనే స్థానికులు గుర్తించి మనీషాను బావిలోకి తాళ్లు వేసి బయటకు లాగి ప్రాణాలతో కాపాడారు. చిన్నారులిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే వారు నీట మునిగి మృతి చెందారు. కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే పిల్లలు ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడ్డారని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పెద్దపులిని చూపిస్తానని తీసుకెళ్లి..
రాయికల్:(జగిత్యాల): ‘మీకు పెద్దపులిని చూపిస్త.. నాతో రండి’అని ఓ తల్లి తన ఇద్దరు కుమారులను గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడ పిల్లలతో కలసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, పెద్దకుమారుడు మృతిచెందగా, చిన్నకుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేటలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిష్టంపేటకు చెందిన కస్తూరి సంపత్, లావణ్య(25) భార్యాభర్తలు. వీరికి గణేశ్(8), హర్షవర్ధన్ (6) అనే కుమారులు ఉన్నారు. పదేళ్ల క్రితం స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి ఉపాధి కోసం కిష్టంపేట గ్రామానికి వచ్చారు. ఇక్కడే కూలీ పనిచేసుకుంటూ బతుకుతున్నారు. శుక్రవారం భార్యాభర్తలు అల్లీపూర్ గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద కూలీ పనిచేసి ఇంటికి తిరిగి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత లావణ్య.. పెద్దపులిని చూపిస్తానంటూ తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావివద్దకు వెళ్లింది. తర్వాత ఇద్దరు కుమారులను పట్టుకుని బావిలో దూకింది. అయితే, ఈ ప్రయత్నంలో తల్లి, పెద్దకుమారుడు బావిలో పడిపోగా హర్షవర్ధన్ బావిగట్టువద్దే ఉండిపోయాడు. వెంటనే బాలుడు అక్కడ ఉన్నవారికి ఈ విషయం చెప్పగా, వారు బావి వద్దకు చేరుకుని లావణ్య, గణేశ్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు నీటిలో మునిగి చనిపోయారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే లావణ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అమ్మతో కలసి కేక్ కట్ చేసిన నిన్న నా పుట్టినరోజు. అమ్మా, నాన్న, అన్నయ్యతో కలసి కేక్ కట్ చేసిన. అందరికీ మిఠాయిలు పంచిన. రాత్రి అందరం బాగానే ఉన్నం. పొద్దునే అమ్మ, నాన్న కలసి పనికి పోయిండ్రు. నాకు పెద్దపులిని చూపిస్తనని అమ్మ నన్ను బాయికాడికి తీసుకెళ్లింది. నన్ను, అన్నను తీసుకుని బావిలో దూకింది. నేను బావిగట్టు వద్దే పడిపోయా. – హర్షవర్ధన్, చిన్నకుమారుడు -
బావిలో దూకి పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
అదిలాబాద్: కుటుంబకలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన అదిలాబాద్ జిల్లా తామ్సి మండలం వామన్‌నగర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన ప్రమీల(27) భర్తతో గొడవలు కారణంగా.. మనస్తాపం చెంది తన కొడుకు వికాస్(9), కూతురు సంజన(7)తో పాటు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.