
ఎవరీ బాషా భాయ్?
తిరుపతి, సాక్షి: బాషాభాయ్... ఎర్రచందనం డాన్. చెన్నైలో ఉంటాడు. అతన్ని చూసిన వాళ్లెవరూ లేరు. సినిమాల్లోలాగా అతనికి బోలెడు మంది అనుచరులు. వాళ్లే దందా నడుపుతూ ఉంటారు. చాలా పెద్ద విషయమైతేనే బాషా రంగంలోకి వస్తాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కి దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ దీన్ని వ్యవస్థాగతం చేసింది బాషానే. ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా విలువ ఉందని మొదట పసిగట్టింది అతనే.
బాషాకి చట్టబద్దమైన వ్యాపారాలు చాలా ఉన్నాయి. అవి ఉంటేనే షిప్పుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ సాధ్యమయ్యేది. అతని మ నుషులు గ్లోబల్ టెండర్లలో గతంలో ఎర్రచందనాన్ని కొనే వారు. దాన్ని రవాణా చేస్తున్నప్పుడు అసలు సరుకులోకి అక్ర మసరుకుని కలిపేస్తారు. ఎక్కడా ఎవరూ నోరు మెదపకుండా మేనేజ్ చేస్తారు. స్మగ్లింగ్‌లో అసలు సమస్య అడవుల్లోకి వెళ్లి నరకడం, సరుకుని లారీల్లోకి ఎక్కించడం, తర్వాత దాన్ని ఆం ధ్రా సరిహద్దు దాటించడం. ఒకసారి సరిహద్దుదాటిన తర్వా త చైనావరకూ దాన్ని ఎవరూ ఆపలేరు.
ఎందుకంటే బంగా రు, వజ్రాలు, డ్రగ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులపైన ఉన్న శ్రద్ధ కస్టమ్స్ వాళ్లకి ఈ ఎర్రచందనంపై ఉండదు. మొదట్లో స్థానిక కూలీలే అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం వృక్షాలను నరికేవాళ్లు. అయితే వాళ్లు సులభంగా దొరికిపోయేవాళ్లు. కూలీ డబ్బుల ను విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ ఉండడంతో ఇరుగుపొరుగు వాళ్లే సమాచారమిచ్చేవాళ్లు. అంతేకాకుండా అక్రమ రవాణా లో పోటీ పెరగడంతో స్థానిక స్మగ్లర్లలో ఉన్న అనైక్యతవల్ల ఒకరిగురించి మరొకరు అధికారులకు సమాచారమిచ్చి పట్టిం చేవాళ్లు. ఈ నేపథ్యంలో తమిళులు ప్రవేశించారు.
తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో వీరప్పన్ అనుచరులు న్నారు. వాళ్లు కేరళ, కర్ణాటక, తమిళనాడు అడవుల్లోని శ్రీగంధం వృక్షాలను కొన్నేళ్లపాటు నరికేశారు. ఇప్పుడక్కడ ఏమీ లేకపోవడంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఉన్న ఎర్రచందనంపై పడ్డారు. ఇంకో రెండు మూడేళ్లలో ఇక్కడ కూడా ఏమీ మిగలదు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో రిస్క్‌కంటే లాభాలే ఎక్కువున్నాయి. అడవిలో నరికి సరుకును గమ్య స్థానానికి చేర్చడం వరకే రిస్క్. ఒకవేళ పట్టుబడితే బెయిల్ లభిస్తుంది. శిక్షపడితే మూడు నెలలకు మించదు. వీళ్లకోసం తమిళనాడు నుంచి లాయర్లు వస్తారు. జరగాల్సింది వాళ్లు చూసుకుంటారు.
చివరికి ఈ స్మగ్లింగ్ మనీ సర్క్యులేషన్ స్కీంలా తయారైంది. వేలకు వేలు కూలి డబ్బులు సంపాదించుకుని సొంత వూళ్లకు వెళ్లిన కూలీలను చూసి అనేక గ్రామాలవాళ్లు ప్రభావితమై తమిళనాడు నుంచి ఏకంగా బస్సుల్లో, రైళ్లల్లో వచ్చేస్తున్నారు. కూలీలే కొంతకాలానికి చిన్న స్మగ్లర్లగా మారుతున్నారు. వీళ్లంతా కూడా బడా స్మగ్లర్ బాషా అనుచరులను ఆశ్ర యించాల్సిందే. బాషా అంటే ఒక్కడు కావచ్చు. ఆ పేరుతో అనేకమంది ఉండొచ్చు. శేషాచలం అడవుల్ని ఖాళీ చేయడమే వీళ్ల లక్ష్యం.