
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్ బాషా నిర్వాకం
సీఎంకు, మంత్రికి ముఖ్య అనుచరుడు
పెన్షన్.. ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ మహిళకు గేలం
వీడియోలు బయటకు రావడంతో కలకలం
పేద, మధ్య తరగతి స్త్రీలే ఆయన టార్గెట్
పార్టీ పరువును గంగలో కలిపాడంటూ మండిపడుతున్న టీడీపీ నేతలు
రాయచోటి: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం ముగియక ముందే తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం పార్టీ పరిశీలకుడుగా ఉంటున్న గాజుల ఖాదర్‌బాషా నిర్వాకం వెలుగులోకి వచ్చింది. రాయచోటిలోని ఓ మహిళను లోబర్చుకుని సాగించిన రాసలీలల వీడియోలు బహిర్గతమవడం ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ రాయచోటి నియోజకవర్గంలో బాషా చక్రం తిప్పుతున్నాడు.
మంత్రులు, అధికారులు తన గుప్పెట్లో ఉన్నారంటూ అధికార యంత్రాంగాన్ని, నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు విమర్శలున్నాయి. రాజకీయంగా కానీ, మరే ఇతర పనులు జరగాలన్నా తనకు ‘కావాల్సిన’ పనులు చేసి పెట్టాల్సిందేనని ‘గాజుల’ హుకుం జారీచేస్తుంటాడని.. ఈ నేపథ్యంలోనే రాయచోటిలో పేద, మధ్య తరగతి మహిళలనే ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నాడన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట.
తన కోరిక తీరిస్తే పెన్షన్ లేదా ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ మహిళలను లోబర్చుకుని అకృత్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఖాదర్‌బాషా పెన్షన్ ఇప్పిస్తానంటూ ఓ మహిళకు నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గురువారం ఉదయం బాధితురాలే స్వయంగా మీడియాకు తెలియజేశారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది.
పార్టీ పరువును గంగలో కలిపారు
అధికారాన్ని అడ్డుపెట్టుకుని గాజుల ఖాదర్‌బాషా మహిళలపై లైంగిక దాడులతో పార్టీ పరువును గంగలో కలిపాడంటూ ఆ పార్టీ నాయకులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోల రూపంలో వైరల్ అవుతున్న దృశ్యాలు పార్టీకి మరింత నష్టం తెచ్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఇలాంటి దారుణాలు పార్టీని మరింత ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాయని ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment