రూ.4.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత | Tirupati Task Force Police seize red sandalwood | Sakshi
Sakshi News home page

రూ.4.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

Published Fri, Jan 24 2025 5:25 AM | Last Updated on Fri, Jan 24 2025 5:25 AM

Tirupati Task Force Police seize red sandalwood

ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్‌

కంటైనర్‌ లారీ స్వాధీనం

తిరుపతి మంగళం: అక్రమంగా తరలిస్తున్న రూ.4.5 కోట్ల విలువైన ఏడు టన్నుల ఎర్రచందనాన్ని తిరు­పతి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకుని ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా గురువారం తిరుపతిలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యా­లయం వద్ద పట్టుబడిన ఎర్రచందనాన్ని టాస్క్‌­ఫోర్స్‌ ఎస్పీలు  సుబ్బరాయుడు, శ్రీనివాస్‌లు పరిశీ­లించారు. 

చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తూరు–వేలూరు రోడ్డులో పానాటుర్‌ సమీపంలో­ని అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మికంగా వాహనాలను తనిఖీలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను చూసి కంటైనర్‌ లారీని కొద్ది దూరంలో ఆపి ముగ్గురు స్మగ్లర్లు పారిపోయేందుకు ప్రయత్నించారు. 

వారిని అదుపులోకి తీసు­కుని కంటైనర్‌లో పరిశీలిస్తే ఎర్రచందనం ఉన్నట్టు గుర్తించారు. ఎర్రచందనాన్ని తమిళనాడు రాష్ట్రం సేలం సమీపంలోని గోడౌన్‌కు తరలించి అక్కడి నుంచి అసోంకు తరలిస్తున్నట్లు విచారణలో స్మగ్ల­ర్లు చెప్పారు. నిందితుల్లో తమిళనా­డుకు చెందిన నరేంద్రకుమార్, అసోంకు చెందిన బినోయ్‌కుమా­ర్‌­భగత్, రాజస్తాన్‌కు చెందిన విజయ్‌జోషి ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement