Smugglers
-
రూ.4.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
తిరుపతి మంగళం: అక్రమంగా తరలిస్తున్న రూ.4.5 కోట్ల విలువైన ఏడు టన్నుల ఎర్రచందనాన్ని తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గురువారం తిరుపతిలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయం వద్ద పట్టుబడిన ఎర్రచందనాన్ని టాస్క్‌ఫోర్స్ ఎస్పీలు సుబ్బరాయుడు, శ్రీనివాస్‌లు పరిశీలించారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తూరు–వేలూరు రోడ్డులో పానాటుర్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా వాహనాలను తనిఖీలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులను చూసి కంటైనర్ లారీని కొద్ది దూరంలో ఆపి ముగ్గురు స్మగ్లర్లు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని కంటైనర్‌లో పరిశీలిస్తే ఎర్రచందనం ఉన్నట్టు గుర్తించారు. ఎర్రచందనాన్ని తమిళనాడు రాష్ట్రం సేలం సమీపంలోని గోడౌన్‌కు తరలించి అక్కడి నుంచి అసోంకు తరలిస్తున్నట్లు విచారణలో స్మగ్లర్లు చెప్పారు. నిందితుల్లో తమిళనాడుకు చెందిన నరేంద్రకుమార్, అసోంకు చెందిన బినోయ్కుమార్భగత్, రాజస్తాన్‌కు చెందిన విజయ్జోషి ఉన్నారు. -
అదుపులోకి కర్ణాటకకు చెందిన ముగ్గురు స్మగ్లర్లు
-
చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే అడ్డగోలుగా దోచేశారు..
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో నిబంధనలను ఉల్లంఘించి, జీవనదులను విధ్వంసం చేసి.. పర్యావరణాన్ని చావుదెబ్బ తీస్తూ అడ్డగోలుగా యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిందని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తేల్చి చెప్పింది. కృష్ణా నదీ గర్భంలో ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో అప్పటి సీఎం చంద్రబాబు నివాసముంటున్న అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలో పొక్లెయినర్లతో భారీ ఎత్తున ఇసుకను తవ్వి.. వందలాది ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను స్మగ్లర్లు తరలిస్తున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని మండిపడింది. ఈ మేరకు 2019 ఏప్రిల్ 4న స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని 2016 మార్చి 4 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత ఇసుక స్మగ్లర్లు విజృంభించారు. అప్పటి నుంచి ఒక్క ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో ఎనిమిది చోట్ల రోజూ 34 వేల టన్నుల ఇసుకను పొక్లెయిన్లతో తవ్వి 2,500 ట్రక్కుల్లో తరలించి.. ఒక్కో ట్రక్కు ఇసుకను కనీసం రూ.5 వేల చొప్పున విక్రయించి రూ.1.25 కోట్ల చొప్పున ఏడాదికి రూ.450 కోట్లను ఇసుక స్మగ్లర్ల ముఠా ఆర్జించిందని ఎన్జీటీ తేల్చింది. శ్రవణ్‌కుమార్ అనే న్యాయవాది వేరే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా ఏడాదికి రూ.పది వేల కోట్లను స్మగ్లర్లు సంపాదిస్తున్నారని చెప్పడాన్ని ఎన్జీటీ ఎత్తిచూపింది. అక్రమంగా ఇసుకను తవ్వడం ద్వారా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిందని.. అందుకు రూ.వంద కోట్ల జరిమానాగా చెల్లించాలని గత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ రూ.100 కోట్లను ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలు చేయాలంటూ 2019 ఏప్రిల్ 4న పేర్కొంది. అప్పట్లో అధికారంలో ఉన్నది టీడీపీ సర్కారే. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలోనే 8 చోట్ల అక్రమంగా ఇసుకను తవ్వి, తరలించి, విక్రయించి ఏడాదికి రూ.450 కోట్లను ఇసుక స్మగ్లర్లు దోచేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి, పెన్నా, తుంగభద్ర, వంశధార, నాగావళి, చిత్రావతి సహా జీవనదులు, వాగులు, వంకల్లో ఇసుకను అడ్డగోలుగా దోచేయడం ద్వారా ఇంకెన్ని రూ.వేల కోట్ల దోచుకొని ఉంటారో అంచనా వేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి, తరలించడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలుగుతోందంటూ 2016లో ఎన్జీటీలో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని ఆదేశిస్తూ 2017 ఫిబ్రవరి 23న ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కానీ.. ఎన్జీటీ ఆదేశాలను తుంగలో తొక్కిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలకు దన్నుగా నిలిచింది. ఇదే అంశాన్ని రైతులు మరోసారి ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో.. కృష్ణా నది గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలను నిగ్గు తేల్చాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లను 2018 డిసెంబర్ 21న ఎన్జీటీ ఆదేశించింది. సీపీసీబీ, పీసీబీలకు చెందిన ఏడుగురు అధికారులతో విచారణ కమిటీని నియమించింది. బాబు జమానాలో లెక్కలేనన్ని ఇసుక అక్రమాలు చంద్రబాబు జమానాలో తవ్వినకొద్దీ లెక్కలేనన్ని ఇసుక అక్రమాలు బయటపడ్డాయి. చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగించి, ఇసుకను తరలించింది. అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులైన దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, నక్కా ఆనందబాబు, జవహర్, చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్, పెందుర్తి వెంకటేష్, బూరుగుపల్లి శేషారావు, ముళ్లపూడి బాపిరాజు, శ్రావణ్ కుమార్, తంగిరాల సౌమ్య, కొమ్మాలపాటి శ్రీధర్, శ్రీరాం తాతయ్య, ఆలపాటి రాజా తదితరులు ఇసుక అక్రమాల్లో చెలరేగిపోయారు. ఈ ముఠా అంతా ఇసుక ద్వారా దోపిడి చేసిన మొత్తంలో నెలవారీ కమీషన్లు ఏకంగా రూ.500 కోట్లు లోకేశ్‌కు ముట్టజెప్పేవారనేది బహిరంగ రహస్యం. గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులతోపాటు తమ్మిలేరు తదితర నదులు, ఏరుల్లో సైతం అడ్డు అదుపులేకుండా పెద్ద ఎత్తున ఇసుక దందా సాగించారు. స్వయం సహాయక బృందాల పేరుతో టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దందా నడిపారు. ఇసుక విధానంపై ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటూ దాదాపు 19 సార్లు జీఓలు ఇచ్చారు. వాస్తవానికి ఉచితంగా ఇసుక ఎవరికీ అందలేదు. అధిక ధర చెల్లించి కొనుక్కోవాల్సిన దుస్థితి కల్పించారు. పొరుగు రాష్ట్రాలకు సైతం పెద్ద ఎత్తున ఇసుకను లారీల్లో తరలించారు. అడ్డుకున్న వారిపై టీడీపీ నేతలు రెచ్చిపోయి దాడులు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధితులనే తప్పు పట్టడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. దోపిడీ గుట్టు రట్టు చేసిన కమిటీ ఎన్జీటీ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో కృష్ణా నది గర్భంలో ఇసుకను తవ్వుతున్న ప్రాంతంతోసహా ఎగువన మరో ఏడు రీచ్‌లను 2019 జనవరి 17, 18న క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసింది. ఆ తనిఖీలో వెల్లడైన అంశాల ఆధారంగా 2019 జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. నివేదికలో ప్రధానాంశాలు.. ► ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో కృష్ణా నది గర్భంలో అనుమతి లేకుండా.. నదీ పరిరక్షణ చట్టం, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది చోట్ల భారీ ప్రొక్లెయిన్లు, మర పడవల ద్వారా రోజుకు సుమారు 34,650 టన్నుల ఇసుకను తవ్వుతున్నారు. ఇలా తవ్విన ఇసుకను రోజూ 2,500 ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ట్రక్కు ఇసుకను కనీసం రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. అంటే రోజుకు ఇసుక అక్రమ అమ్మకాలతో రూ.1.25 కోట్లు ఆర్జిస్తున్నారు. ఏడాదికి ఈ 8 రీచ్‌ల నుంచే రూ.450 కోట్ల చొప్పున కొల్లగొట్టారు. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం వల్ల జీవనది కృష్ణా విధ్వంసమైంది. కృష్ణా నది గర్భంలో 25 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. అందువల్ల ప్రవాహ దిశ మారే అవకాశం ఉంది. వరద గట్లు, భవానీ ద్వీపం దెబ్బతిన్నాయి. ► ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించిన ఎన్జీటీ.. ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలిచిన అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రూ.వంద కోట్లను జరిమానాగా విధించింది. ► ఇసుక దందా గురించి 2016 నుంచి హిందూ వంటి జాతీయ పత్రికలతోపాటు టీవీ ఛానెళ్లు వరుస కథనాలను ప్రసారం చేయడాన్ని ఎన్జీటీ తన తీర్పులో ప్రస్తావించింది. ఇసుక స్మగ్లర్లు తవ్వేసిన గుంతల్లో పడి.. ఇష్టారాజ్యంగా ట్రక్కులు నడపడం వల్ల వాటి కింది పడి 14 మంది చనిపోవడాన్ని ఎత్తిచూపింది. ఇసుక స్మగ్లర్లు అడ్డగోలుగా దోచేస్తున్నా.. దానికి అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడంలో ఔచిత్యం ఏమిటని చంద్రబాబు సర్కార్‌ను నిలదీసింది. -
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆటకట్టు
సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని బొక్కే అక్రమార్కులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. పటిష్ట చర్యలతో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే నిత్యావసరాలను దారిమళ్లించడం, దుర్వినియోగానికి పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలికంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తరచూ పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్టును ప్రయోగిస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో సత్ఫలితాలు గతంలో రేషన్ బియ్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగేది. వందల టన్నుల బియ్యం సరిహద్దులు దాటేసేది. మరోపక్క పేదలు తినే బియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేసి, వాటిని తక్కువ రేటుకు కొని, తిరిగి పాలిష్ పట్టి మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. లారీలతో లోడ్లు తరలిపోతున్నా కేసులే నమోదయ్యేవి కావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టిస్తోంది. రేషన్ బియ్యం రవాణాపై నిఘాను పటిష్టం చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు, మండల నిల్వ పాయింట్లు, చౌక దుకాణాలు, ఎండీయూ వాహనాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా పెట్టడంతో చాలా వరకు అక్రమ రవాణా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 743 మందిని అరెస్టు చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం – 1955 సెక్షన్ 6ఏ ప్రకారం అక్రమ రవాణాలో పట్టుబడిన సరకులు, వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొని, అక్రమార్కులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తోంది. పట్టుబడిన బియ్యాన్ని వెంటనే తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాల్లో బియ్యం అక్రమరవాణాలో పట్టుబడ్డ సరుకు నిల్వల విలువ రూ.50 లక్షల లోపు ఉంటే జేసీలు, అంతకు పైబడి ఉంటే కలెక్టర్లకు కేసుల పరిష్కార బాధ్యతలను అప్పగించింది. ఫలితంగా ఏళ్లు తరబడి సీజ్ చేసిన సరుకు ముక్కిపోయి, పురుగులు పట్టి పాడవకుండా బహిరంగ వేలం ద్వారా వెంటనే తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. ఇలా గడిచిన నాలుగేళ్లలో 6ఏ కేసులు 8,696 నమోదు చేస్తే, వాటిల్లో 4,565 కేసులను పరిష్కరించింది. మొత్తం 4.70లక్షల క్వింటాళ్ల స్టాక్‌ను స్వాధీనం చేసుకోగా, 2.82 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్ టైం మానిటరింగ్ 6ఏ కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే సీజ్ చేసిన స్టాక్ వివరాలను ఇందులో అప్లోడ్ చేస్తారు. జిల్లాలు, తేదీలు, నెలలవారీగా నమోదైన కేసులు, పరిష్కరించినవి, సీజ్ చేసిన స్టాకు, బయటకు విడుదల చేసిన స్టాక్ వివరాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించి, వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద చూపించడం, పాలిష్ పట్టి కొత్త ప్యాకింగ్‌లో మార్కెట్లో విక్రయించడాన్ని సంపూర్ణంగా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. పటిష్ట నిఘాతో అక్రమ రవాణా కట్టడి ఇప్పటి వరకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని సీజ్ చేసి పక్కన పెట్టేవారు. వాటిని పట్టించుకోకపోవడంతో తినడానికి పనికిరాకుండా పాడయ్యేవి. ఈ క్రమంలోనే మేము 6ఏ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాం. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. దీనికి తోడు బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే వారిని పీడీ యాక్టులో పెడుతున్నాం. పటిష్ట నిఘా ఉంది కాబట్టే కేసులు నమోదవుతున్నాయి. అంతేగానీ అక్రమ రవాణా జరిగిపోతున్నట్టు కాదు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
‘అటవీ’ దొంగలు? స్మగ్లర్లకు సహకరిస్తున్న కొందరు అటవీశాఖ సిబ్బంది
చుంచుపల్లి: ఒకవైపు హరితహారం కింద రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను విరివిగా నాటుతూ అడవులను పెంచేలా చర్యలు తీసుకుంటుంటే మరోవైపు అడవులను నిరంతరం కాపాడాల్సిన అటవీశాఖ సిబ్బందిలో కొందరు ఇంటిదొంగలుగా మారుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు విలువైన టేకు, జిట్రేగి, వేప, తుమ్మ చెట్లను నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంగా కలప స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే కారణంతో ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం అటవీ డివిజన్ల పరిధిలో పలువురు సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయినా కలప అక్రమంగా తరలిపోతోంది. ఉన్నతాధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారని, అందుకే సిబ్బందిలో మార్పు రావడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. ● దుమ్ముగూడెం మండలంలో రెండేళ్ల క్రితం ఇద్దరు అటవీశాఖ సిబ్బంది మధ్య కలప రవాణాకు సంబంధించిన పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరిగింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ● భద్రాచలం డివిజన్ పరిధిలోని ఒక గ్రామంలో అక్రమంగా కలపను తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్థానికులు గుర్తించి ఆపేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ● గతేడాది మార్చిలో చాతకొండ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలిస్తూ కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద పట్టుబడిన వాహనాన్ని వదిలేసేందుకు సహకరించారనే కారణంతో ఒక రేంజ్ ఆఫీసర్‌తో పాటు, ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ● అదే ఏడాది జూన్‌లో అశ్వాపురం రేంజ్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప విషయంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. అధికారుల నివేదిక ఆధారంగా ఇందులో నిర్లక్ష్యంగా వ్యహరించిన ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ● ఇల్లెందు రేంజ్ పరిధిలో కలప విక్రయం, నిధుల గోల్మాల్ వంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ చేసిన అటవీశాఖ ఉన్నతాధికారులు గతేడాది జూలైలో ఒక రేంజర్‌తోపాటు ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక బీట్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. ● ఇక తాజాగా అశ్వాపురం రేంజ్ ఇరవెండి పరిధి లో జామాయిల్ కలపను కొట్టి ఐటీసీ కాంట్రాక్టర్ల తో కలిసి విక్రయించారనే ఆరోపణలతో విచారణ చేపట్టి అటవీశాఖ జిల్లా అధికారులు ఒక సెక్షన్ ఆఫీసర్, ఒక బీట్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. ఉపేక్షించేది లేదు అటవీశాఖలో పనిచేస్తూ తప్పుడు మార్గాల్లో స్మగ్లర్లకు సహకరించే అటవీ సిబ్బంది విషయంలో ఉపేక్షించేది లేదు. అలాంటి వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. పద్ధతి మార్చుకోకపోతే శాఖాపరంగా కఠినమైన చర్యలకు సైతం వెనకాడబోం. –లక్ష్మణ్ రంజిత్ నాయక్, డీఎఫ్ఓ -
క్లైమాక్స్ సీన్ ను తలపించేలా స్మగ్లర్ లను పట్టుకున్న పోలీసులు
-
సెబ్ దూకుడు
సాక్షి, అమరావతి: సారా, గంజాయి దందాను కట్టడి చేయడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) దూకుడు పెంచింది. వారం రోజుల్లోనే విస్తృతంగా దాడులు జరిపి 566 కేసులు నమోదు చేసి 705 మందిని అరెస్టు చేసింది. అలాగే 64 వాహనాలను జప్తు చేసింది. ఆపరేషన్ పరివర్తన్ 2.0 కింద సారా తయారీ, రవాణాపై సెబ్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. రాష్ట్ర సరిహద్దులకు అవతల సాగు చేసిన గంజాయిని రాష్ట్రం గుండా అక్రమ రవాణా చేయకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. స్మగ్లర్లు అక్రమ రవాణాకు ఉపయోగించే దారులను ఇప్పటికే మ్యాపింగ్ చేసి సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దోనూరు, చింతూరు, ఇదుగురలపల్లి, లక్ష్మీపురం, మారేడుమిల్లిలతోపాటు అనకాపల్లి జిల్లాలోని తాటిపర్తి, భీమవరం గ్రామాల్లో చెక్ పోస్టులను నెలకొల్పింది. మరోవైపు వివిధ జిల్లాల్లో సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను వినియోగించింది. క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారాన్ని తెప్పించుకుంటూ దాడులు నిర్వహిస్తోంది. వారం రోజులుగా చేపడుతున్న కార్యాచరణ సత్ఫలితాలను అందించిందని సెబ్ వర్గాలు తెలిపాయి. సారా తయారీ, విక్రయాలకు సంబంధించి 560 కేసులు నమోదు చేసి 692 మందిని అరెస్టు చేశారు. అలాగే 2,940 లీటర్ల సారాను స్వాధీనం చేసుకోవడంతోపాటు 30 లీటర్ల సారా ఊటను సెబ్ ధ్వంసం చేసింది. 63 వాహనాలను జప్తు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 6 కేసులు నమోదు చేసింది. 13 మందిని అరెస్టు చేశారు. అలాగే 1,009 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒక వాహనాన్ని జప్తు చేశారు. -
కొబ్బరి కాదు.. కాలకూటం!
జయపురం(భువనేశ్వర్): కొరాపుట్ జిల్లాలో గంజాయి రవాణా ముఠా రోజుకో కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అధికారుల కళ్లు గప్పి, పెద్ద ఎత్తున సరుకు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొబ్బరికాయల లోడు మధ్య ట్రక్కులో తీసుకు వెళ్తున్న సుమారు 16క్వింటాళ్ల గంజాయిని జయపురం ఎక్సైజ్ పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎక్సైజ్ ఎస్పీ మనోజ్‌కుమార్ సెఠి ఆదివారం వెల్లడించారు. గంజాయి రవాణా అవుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ ప్రమోద్‌కుమార్ బంటువ, ఎస్ఐ దిలీప్‌కుమార్ రథ్‌తో కూడిన ప్రత్యేక బృందం జయపురం వైపు వెళ్తున్న ట్రక్కును గమనించారు. వారిచ్చిన ఆనవాళ్ల ఆధారంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దుర్భదల్ బిశ్వాల్, ఆఫీస్ ఇన్చార్జి సంజయ్‌కుమార్ కండి, ఏఎస్ఐ ఎం.లక్ష్మణరావు, మాధవేశ్ మహంతి, సిబ్బంది జయపురం ఘాట్ రోడ్డులో మాటు వేశారు. అతి వేగంగా వస్తున్న ట్రక్కుని నిలువరించి, సోదా చేయగా.. అందులో 100 బస్తాల కొబ్బరి కాయలతో పాటు 150 గంజాయి బస్తాలు బయటపడ్డాయి. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.81 లక్షలు ఉంటుందని వెల్డించారు. ఘటనకు సంబంధించి బీహార్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ ప్రభు యాదవ్(35)ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. పద్మపూర్‌లో 3 క్వింటాళ్లు.. రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసులు రూ.15 లక్షల విలువైన 3క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన యష్‌బీర్ సింగ్(60), పన్నాలాల్ బాస్‌దేవ్(57)ను అరెస్ట్ చేశారు. పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరిడిగుడ వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రాయగడ వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. క్రిమిసంహారక మందు సరఫరా చేసే డ్రమ్ముల్లో 300 కిలోల గంజాయిని గుర్తించారు. దీంతో లారీతో పాటు డ్రైవర్, హెల్పర్‌ను అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. నలుగురి అరెస్ట్.. మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి మంత్రిపూట్ గ్రామం వద్ద చిత్రకొండ పోలీసులు శనివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంగా వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, 253 కిలోల గంజాయిని గుర్తించారు. దీనిని బీహార్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి జిల్లాలోని ఎంవీ–38 గ్రామానికి చెందిన ప్రకాష్ సర్దార్, బీహర్‌కు చెందిన సునీల్‌కుమార్, హరేంద్రకుమార్, విజేంద్రకుమార్ లను అరెస్ట్ చేశారు. నిందితులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, కోర్టులో హాజరు పరుస్తామని ఎస్డీపీఓ అన్షుమాన్ ద్వివేది తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని వివరించారు. -
అటవీ వనం కన్నీరు...గొడ్డలి వేటుకు కనుమరుగవుతున్న పచ్చదనం
ఎటపాక డివిజన్లో అటవీ వనాలుకన్నీరు పెడుతున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతోకళకళలాడుతున్న ఈ ప్రాంతంలో వనాలు స్మగ్లర్ల గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్నాయి. పచ్చదనంతో కళకళలాడాల్సిన ఈ ప్రాంతాలు కళావిహీనంగా మారుతున్నాయి. స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అటవీశాఖ సిబ్బంది చూసీ చూడనట్టువదిలేస్తున్నారని విలపిస్తున్నాయి. ఎటపాక: ఎటపాక డివిజన్లో అడవులు అంతరించిపోతున్నాయి. ఒక్కప్పుడు టేకు, జిట్రేకు వంటి విలువైన అటవీ వనాలకు నిలయమైన ఈ ప్రాంతంలో ప్రస్తుతం వాటి జాడ కనిపించని పరిస్థితి నెలకొంది. అటవీ సిబ్బందిలో కొంతమంది స్మగ్లర్లకు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నెల్లిపాక జాతీయరహదారి సెంటర్లో ఏర్పాటు చేసిన అటవీశాఖ తనిఖీ కేంద్రం మామూళ్ల వసూళ్లకే పరిమితమైందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్రాలకు.. ఎటపాక, చింతూరు మండలాల అటవీ ప్రాంతంలో 18,046 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్, విజయవాడ తదితర నగరాలకు టేకు కలప రవాణా జరుగుతోంది. తెలంగాణలోని భద్రాచలం పట్టణ కేంద్రంగా కలప తరలింపులో కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. వీరు తెలంగాణ సరిహద్దున ఉన్న ఆంధ్రా పరిధిలోని అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. వీరికి మండలంలోని స్మగ్లర్లు సహకరిస్తుండటంతో విలువైన టేకు కలప పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. గోదావరి నదిని దాటించి.. అటవీ కలపను గోదావరి నది దాటించి అక్కడ నుంచి వాహనాల్లో పక్క జిల్లాలకు చేరవేస్తున్నారు. అటవీశాఖలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందితో ముందుగానే చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ అక్రమ రావాణా నిరాటంకంగా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లర్లు టేకు ప్లాంటేషన్లపై కూడా కన్నేశారు. నెల్లిపాక రేంజ్ పరిధిలోని బండిరేవు, మాధవరావుపేట ,ఈడీపల్లి ప్రాంతాల్లోని టేకు ప్లాంటేషన్లలో భారీ టేకు వృక్షాలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. అడవుల్లో టేకు చెట్లను నరికిన అనంతరం అక్కడనే సైజులుగా కోసి లారీ, కార్లలో విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోలేకపోతున్న చెక్‌పోస్టు నెల్లిపాక జాతీయ రహదారిలో అటవీ చెక్‌పోస్టు ఉన్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయకుండా వదిలిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. దీంతో డివిజన్ నుంచి వాహనాల ద్వారా కలపను దర్జాగా తరలించుకుపోతున్నారు. సిబ్బందిని మేనేజ్ చేస్తూ.. స్మగ్లర్లు,ఫర్నిచర్ తరలించేవారు ముందుగా చెక్‌పోస్టు సిబ్బందిని మేనేజ్ చేసి కలపను చెక్‌పోస్ట్ దాటించి భద్రాచలం చేరవేస్తున్నారు. అక్రమ కలపపై ఎవరైనా ముందస్తు సమాచారం ఇస్తే తప్ప ఇక్కడి సిబ్బంది కలప రవాణాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చెక్‌పోస్టులో సిబ్బందితో పాటు స్మగ్లర్లు అప్పడుప్పుడు చెక్‌పోస్టు వద్ద ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రి సమయంలో అటవీశాఖకు సంబంధం లేని కొంతమంది వ్యక్తులు చెక్‌పోస్టులో సిబ్బందితో పాటు కనపడుతున్నారు. స్మగ్లర్లతో చేతులు కలిపి..? ఇక్కడి అటవీ రేంజ్ పరిధిలో విధులు నిర్వహించే కొంత మంది సిబ్బంది స్మగ్లర్లతో చేతులు కలిపి ఈ కలప అక్రమ రవాణా చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. సిబ్బందికి నెల వారీ మామూళ్లకు ఆశపడి పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. కొందరు పరిమిట్ల ముసుగులో కలప అక్రమ దందా చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అడపా దడపా తనిఖీలు చేస్తున్న సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో కలపను పట్టుకుంటున్నా స్మగ్లర్లు బేరసారాలు సాగించి చక్రం తిప్పుతున్నారు. నెల్లిపాక రేంజ్ పరిధిలో ఒకప్పుడు దట్టమైన అడవులు ఉండేవి. ఇప్పుడు మైదాన ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ.. పనితీరుకు ఇవి అద్దం పడుతున్నాయి. చర్యలు తీసుకుంటాం కలప అక్రమ రవాణాపై దృష్టి సారిస్తాం. అడవుల్లో కలప నరికి అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. నెల్లిపాక చెక్‌పోస్టు వద్ద తనిఖీలు పటిష్టంగా చేపట్టి కలప రవాణాను అరికడతాం. – కొండలరావు, ఇన్చార్జి రేంజర్, నెల్లిపాక (చదవండి: ఊరుకాని ఊరులో.. ఇది కదా మానవత్వం అంటే!) -
హాలీవుడ్ మూవీ రేంజ్.. స్మగ్లర్లను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: అక్రమంగా గోవులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను గురుగ్రామ్ పోలీసులు అర్ధరాత్రి ఛేజ్ చేసి పట్టుకున్నారు. దొంగలను పట్టుకునేందు పోలీసులు.. హాలీవుడ్ మూవీ రేంజ్లో రోడ్డుపై లారీని ఛేజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. ఐదుగురు పశువుల స్మగ్లర్లు గోవులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు వారి వాహనాన్ని వెంబడించారు. అయితే, స్మగ్లర్లు ఢిల్లీ బోర్డర్ నుండి గురుగ్రామ్‌లోకి ప్రవేశిస్తుండగా పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు లారీని ఆపకుండా స్పీడ్‌గా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి దాదాపు 22 కిలోమీటర్ల దూరం ఛేజింగ్ చేసిన తర్వాత వారిని పట్టుకున్నారు. Cow Smugglers for Illegal Slaughter Perpetrators: TASLIM, SHAHID, KHALID, BALLU Thanks to Gurugram Police for catching these thieves. https://t.co/JnlW8cfOV9 — शुद्ध | Shuddha (@ShuddhaWorld) April 10, 2022 ఛేజ్ చేసే క్రమంలో పోలీసులు.. స్మగ్లర్ల లారీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్ల్లో లారీ టైర్ పేలిపోయినప్పటికీ వారు వాహనాన్ని మాత్రం ఆపలేదు. కాగా, లారీ పట్టుకున్న తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత లారీలో తనిఖీలు చేపట్టగా అందులో తుపాకులు, బుల్లెట్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆవుల స్మగ్లర్లు గురుగ్రామ్‌లో భీభత్సం సృష్టించడం ఇదేమీ మొదటిసారి కాదు. హర్యానా ప్రభుత్వం ఆవుల స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను రూపొందించినప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పశువుల అక్రమ రవాణా పెరుగుతూనే ఉంది. -
ఈసారి డ్రగ్స్ పంజాబ్ నుంచి..
అల్వాల్: పంజాబ్ నుంచి రాష్ట్రానికి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ శుక్రవారం వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన జగ్తార్‌సింగ్ (58) లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 12 ఏళ్ల క్రితం వలసొచ్చి మేడ్చల్ కండ్లకోయ టోల్‌ప్లాజా సమీపంలో పం జాబీ ధాబా నిర్వహిస్తున్నాడు. రంజిత్‌సింగ్ అనే లారీ డ్రైవర్‌తో ఏర్పడిన పరిచయంతో పంజాబ్ నుంచి డ్రగ్‌ను తెప్పించి ధాబాకు వచ్చేవారికి చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయించేవాడు. మార్చి 31న రాత్రి 10 గంటలకు శామీర్‌పేట్ రోడ్డు వద్ద ఓ అనుమానితకారును ఎస్ఓటీ పోలీసులు తనిఖీ చేయగా జగ్తార్‌సింగ్, అతని అనుచరుడు జైమాల్‌సింగ్ 900 గ్రాముల మాదకద్రవ్యం ప్యాకెట్లతో పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్టు చేసి, మాదక ద్రవ్యం ప్యాకెట్లతోపాటు కారు, 3 సెల్ఫోన్లు చేసుకున్నారు. వాటి విలువ రూ. 15 లక్షలు. రంజిత్‌సింగ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు -
60 కేజీల గంజాయి సీజ్
-
2 లక్షల కిలోల గంజాయి ధ్వంసం
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి : గంజాయి నియంత్రణ, నిర్మూలనలో దేశంలోనే ఇదో సరికొత్త రికార్డు.. ఒకటి కాదు.. రెండు కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 2 లక్షల కిలోల గంజాయిని శనివారం పోలీసులు ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా గత కొద్ది నెలలుగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు, తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిది. అనకాపల్లి నియోజకవర్గం కోడూరులో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గంజాయి సంచులకు స్వయంగా నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. దశాబ్దాల కాలంగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నారు. దళారులు, మావోయిస్టులు గిరిజనులను భయపెట్టి గంజాయిని సాగు చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా ప్రభుత్వం గంజాయి రవాణా, సాగుపై దృష్టిపెట్టింది. నార్కొటిక్స్, ఇంటెలిజెన్స్, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇంత భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 577 కేసుల్లో 1500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం అలాగే ఏజెన్సీ ప్రాంతం 11 మండలాల్లోని 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో మొత్తం 7,552 ఎకరాల్లోని గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. ఈ గంజాయి విలువ రూ.9,251.32 కోట్ల దాకా ఉంటుంది. ఎస్ఈబీ, శాంతి భద్రతల పోలీసులు 7,152 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తే.. 400 ఎకరాల వరకూ ఆయా గ్రామాల గిరిజన ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధ్వంసం చేయడం విశేషం. గంజాయి సాగును గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలు, డ్రోన్లు, శాటిలైట్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆథారిత శాటిలైట్ ఇమేజ్ ప్రాసెసింగ్‌తో ‘ఆడ్రిన్ ఇమేజరీ’ని వినియోగించారు. ఓ పక్క సరిహద్దు గిరిజన గ్రామాల్లో గంజాయి సాగును పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూనే.. అదే సమయంలో అన్ని రవాణా మార్గాల్లో విస్తృత తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించారు. 120 అంతర్రాష్ట్ర మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో గిరిజనులు, స్థానికులు గంజాయి సాగు వైపు మళ్లకుండా వారిలో చైతన్యం కలిగేలా 1,963 అవగాహన కార్యక్రమాలు, 93 ర్యాలీలు నిర్వహించారు. అలాగే గంజాయి సాగుపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా కాఫీ, జింజర్, రాగులు, స్ట్రాబెర్రీ, మిరియాలు తదితర పంటలు సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టూరిస్టులుగా వచ్చి.. స్మగ్లింగ్ గంజాయి స్మగ్లర్లు ఉత్తరాది రాష్ట్రాల నుంచి టూరిస్ట్‌లుగా వస్తున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు రైలు, బస్సు, ఇతర మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. దేశంలోనే విశాఖ ఏజెన్సీలోని గంజాయికి ప్రత్యేకమైన ఆదరణ ఉండటంతో ఈ ప్రాంతం కీలకంగా మారింది. అరెస్ట్ అయిన 1500 మందిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన స్మగర్లు 154 మంది ఉండటం గమనార్హం. గంజాయి ధ్వంసం కార్యక్రమంలో అడిషనల్ డీజీ(ఎల్ అండ్ బీ) రవిశంకర్ అయ్యన్నార్, అడిషనల్ డీజీ(గ్రే హౌండ్స్) ఆర్కే మీనా, ఎస్ఈబీ డైరెక్టర్ వినీత్ బ్రిజ్‌లాల్, ఐజీ రంగారావు తదితరులు పాల్గొన్నారు. గంజాయిని గుట్టలుగా పేర్చి తగలబెడుతున్న దృశ్యం శారదా పీఠంలో డీజీపీ.. విశాఖ శ్రీ శారదా పీఠాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పీఠంలోని రాజశ్యామల అమ్మవారికి డీజీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సచివాలయ వ్యవస్థతో గిరిజనుల్లో పెనుమార్పు ఆపరేషన్ పరివర్తన్‌తో గిరిజన గ్రామాల ప్రజలు, యువతలో మార్పు మొదలైంది. వారంతా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ గిరిజన యువతలో మార్పునకు కీలకంగా మారింది. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లుగా గిరిజన యువత చేరడం, తద్వారా గంజాయి సాగుతో నష్టాలు తెలుసుకోవడం, ప్రజలకు తెలియజేయడం వంటివి కీలక పరిణామాలు. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
కడప అర్బన్/చంద్రగిరి: వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో శనివారం పోలీసులు పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మూడు వాహనాలను సీజ్ చేశారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం ఆకులనారాయణ పల్లి సమీపంలోని అడవుల్లో నిందితులు ఎర్రచందనం చెట్లను నరికి, దుంగలుగా తయారుచేసి వాహనాల్లోకి ఎక్కించి తరలించడానికి సిద్ధంగా ఉంచారు. ఆ సమయంలో పోరుమామిళ్ల సీఐ రమేష్‌బాబు, ఎస్ఏ కాశినాయన ఎస్ఐ అరుణ్‌రెడ్డి తమ సిబ్బందితో దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 455 కిలోల బరువున్న 20 ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో జిల్లాలోని బి.మఠం మండలం సోమిరెడ్డి పల్లెకు చెందిన దేవర్ల సుబ్రమణ్యం, ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మీనేకళ్లు గ్రామానికి చెందిన రావూరి ఉమాశంకర్, కొమరోలు మండలం అక్కపల్లికి చెందిన ధనపాటి రమణయ్య, అదే మండలానికి చెందిన భూమ వసంతకుమార్ ఉన్నారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడినా, వారికి సహకరించినా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. కూరగాయల మాటున.. చిత్తూరు జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్పీ ఆదేశాల మేరకు.. ఆర్ఎస్ఐ వాసు సిబ్బందితో కలసి శనివారం 3 గంటల సమయంలో మూలపల్లి వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఐచర్ వాహనం ఆపకుండా వేగంగా అధికారులను దాటి వెళ్లిపోవడంతో దానిని వెంబడించారు. కొంతదూరం వెళ్లగానే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. వాహనం తనిఖీ చేయగా సుమారు 14 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. ఆర్ఎస్ఐ వాసు మాట్లాడుతూ.. ఐచర్ వాహనం కింది భాగంలో ఎర్రచందనం ఉంచి, దానిపైన చెక్కలు ఏర్పాటు చేసి కూరగాయలను రవాణా చేసే వాహనం మాదిరి చేశారని తెలిపారు. దాడుల్లో పట్టుబడిన డ్రైవర్ తిరుపతికి చెందిన ప్రభాకర్‌గా గుర్తించామన్నారు. అనంతరం వాహనంతో పాటు ఎర్రచందనం, నిందితుడిని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. -
మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం
నర్సీపట్నం (విశాఖపట్నం): నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. వెనుక పోలీసులు వెంబడిస్తున్నారనే కారణంతో వేగంగా వెళ్తూ అడ్డొచ్చిన .. ప్రతి దానిని గుద్దుకుంటూ అలజడి రేకెత్తించారు. ఘటన వివరాలిలాఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన సిద్ధూ, ఇఫ్రాన్, రోహిత్ చింతపల్లిలో 240 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. మహారాష్ట్ర తీసుకెళ్లేందుకు కారులో నర్సీపట్నం వైపు వస్తుండగా.. డౌనూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అపేందుకు ప్రయత్నించగా తప్పించుకుని వచ్చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నర్సీపట్నం ట్రాఫిక్ ఎస్ఐకు కారులో వస్తున్న గంజాయి స్మగ్లర్ల సమాచారం అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అబిద్‌సెంటర్ వద్ద పోలీసులు స్మగ్లర్ల కారును ఆపేందుకు ప్రయత్నించగా వృద్ధురాలికి డాష్ ఇచ్చి వేగంగా దూసుకెళ్లారు. శ్రీకన్య సెంటర్లో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ ఆపే ప్రయత్నం చేయగా.. బారికేడ్లను గుద్దుకుని వెళ్లిపోయారు. వెంటనే ఎస్ఐ ద్విచక్రవాహనంపైన, పోలీసు వాహనంతో సిబ్బంది గంజాయి కారును వెంబడించారు. గంజాయి స్మగ్లర్లు కారుతో ఎలా పడితే అలా దూసుకొస్తుండడంతో వాహనదారులు, ప్రజలు హడలెత్తిపోయారు. స్మగ్లర్ల వాహనం, పోలీసు వాహనం ఒకదాని వెనుక మరొకటి వేగంగా దూసుకెళ్తుండడంతో సినిమా సీన్‌ను తలపించింది. కాగా, దొరికిపోతామనే భయంతో స్మగ్లర్లు పెదబొడ్డేపల్లి వంతెన సమీపంలో కారును ఆపి వంతెన కింద ఉన్న కాలువలోకి దూకేశారు. దీంతో స్థానికులు, పోలీసులు వారిని చుట్టుముట్టారు. కాలువలోంచి ముగ్గురు స్మగ్లర్లను బయటకు రప్పించి స్టేషన్‌కు తరలించారు. -
గొడ్డళ్లతో పోలీసులపై స్మగ్లర్ల దాడి
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు–చిత్తూరు జిల్లాల మధ్య అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం వృక్షాలను నేలకూల్చి.. వాటి దుంగల్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైకి వాహనాలను దూకించి.. గొడ్డళ్లు, బరిసెలు విసిరి వారిని చంపేందుకు యత్నించారు. ఆ దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న పోలీసులు అతి కష్టంపై ముఠాలోని ముగ్గురు ప్రధాన నిందితులతోపాటు 55 మంది తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. రూ.17.38 లక్షలు విలువైన 45 ఎర్రచందనం దుంగలను, ఓ లారీని, ఓ కారును, రూ.75,230 నగదు, 31 సెల్ఫోన్లు, 24 గొడ్డళ్లు, 3 బరిసెలు, 2 రంపాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో.. ఈ ఘటనకు సంబంధించి వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కళాశాలలో జిల్లా ఎస్పీ సీహెచ్.విజయారావు ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా వీబీపురం మండలం ఆరెగ్రాముకు చెందిన దాము అనే వ్యక్తికి ఆయిల్ ట్యాంకర్లు ఉండేవి. నష్టాల పాలైన దాము వాటిని అమ్మేశాడు. ఆ తరువాత తనవద్ద డ్రైవర్ పనిచేసిన తమిళనాడులోని వేలూరుకు చెందిన కుప్పన్ సుబ్రహ్మణ్యంతో కలిసి 5 నెలల క్రితం పాండిచ్చేరికి చెందిన ఎర్రచందనం దుంగల స్మగ్లర్ పెరుమాళ్లు వేలుమలైను కలిశాడు. తాను ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తానని చెప్పడంతో వేలుమలై తన బావమరిది రాధాకృష్ణ పళనిని వారికి పరిచయం చేశాడు. వీరంతా కలిసి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం వృక్షాలను నరికి అక్రమంగా తరలించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ నెల 20న పాండిచ్చేరి నుంచి 55 మంది తమిళ కూలీలు లారీలో తీసుకొచ్చారు. దాము, పళని, సుబ్రహ్మణ్యం కారులో వారికి ఎస్కార్ట్‌గా గూడూరు చేరారు. అక్కడ వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరుకు చెందిన చంద్రశేఖర్‌ను కలిశారు. చంద్రశేఖర్ అక్కడి నుంచి వారందరినీ రాపూరు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. కూలీలు ఎర్రచందనం వృక్షాల్ని నేలకూల్చారు. దీనిపై ఎస్పీ సీహెచ్ విజయారావుకు పక్కా సమాచారం అందటంతో ఆయన ఆదేశాల మేరకు ఈ నెల 21న పోలీసులు రాపూరు అటవీ ప్రాంతానికి చేరుకుని గాలించారు. పోలీసుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు అప్పటివరకు నరికిన ఎర్రచందనం దుంగలను పోలీసుల కంటపడకుండా లారీలో ఉంచి ఈ నెల 22న అటవీ ప్రాంతం నుంచి బయలుదేరారు. పోలీసుల్ని చంపేందుకూ వెనుకాడని దుండగులు పోలీసులు నిందితుల కోసం జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. చిల్లకూరు మండలం బూదనం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. దీనిని గమనించిన స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారుతో పోలీసుల్ని ఢీకొట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. లారీలోని తమిళ కూలీలు గొడ్డళ్లను పోలీసులపైకి విసిరి వారిని చంపేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
రూ.35 లక్షల విలువైన శ్రీగంధం దుంగల పట్టివేత
సూళ్లూరుపేట: భారీ మొత్తంలో శ్రీగంధం దుంగలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు పట్టుకున్నట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ వెల్లడించారు. ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకుని, 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీగంధం దుంగలను తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, తడ, శ్రీహరికోట ఎస్ఐలు శ్రీనివాసులురెడ్డి, రోజాలత సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కలిగిన లారీని తనిఖీ చేయగా 484 శ్రీగంధం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లారీకి పైలెట్లుగా వచ్చిన రెండు కార్లను కూడా పట్టుకున్నారు. గూడూరు మండలం చెన్నూరుకు చెందిన లారీ డ్రైవర్ తుపాకుల మునీంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా అనంతసాగరం మండలం రేవూరుకు చెందిన మోడిబోయిన మురళీకృష్ణ, దగదర్తి చింతోడు సెంటర్‌కు చెందిన ఉప్పు రామచంద్రయ్య, నెల్లూరు నగరం భక్తవత్సలనగర్‌కు చెందిన కర్నాటి మాలకొండయ్య, గూడూరు మండలం మిట్మాత్మకూరుకు చెందిన కర్రా పెంచలయ్య, వెంకటగిరి మండలం సిద్ధాగుంటకు చెందిన కనియపల్లి వెంకటరమణయ్య, పొదలకూరు మండలం వనంతోపునకు చెందిన నల్లు మణి, రాపూరు మండలం గోనుపల్లికి చెందిన వెలుగు అంకయ్య ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నారని వెల్లడించారు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ ఏడుగురిని జిల్లాలో పలుచోట్ల గురువారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన శ్రీగంధం దుంగల విలువ సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. -
గంజాయి దందాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గంజాయి మాఫియాను కూకూటి వేళ్లతో పెకలించి వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మన రాష్ట్రంలో గంజాయి దందాను శాసిస్తున్న స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సిద్ధమైంది. ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీలో) 8 వేల ఎకరాలకుపైగా గంజాయి సాగును సెబ్ ధ్వంసం చేసింది. ఇప్పుడు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అందుకోసం అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల జాబితాను రూపొందించింది. ఆ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణకు ఉపక్రమించింది. అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్ కోసం జాయింట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. 648 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఏవోబీలో గంజాయి దందాను శాసిస్తున్న 648 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను సెబ్ గుర్తించింది. వారు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో దశాబ్దాలుగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని గంజాయి అక్రమ రవాణాను వ్యవస్థీకృతం చేశారు. ఎంపిక చేసిన గిరిజనుల ద్వారా గంజాయి సాగు చేయించి, పంట వచ్చిన తరువాత ఎండబెట్టించి, వారే కొనుగోలు చేసి ఏడాది పొడుగునా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అడపాదడపా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాయి గానీ, ఇతర రాష్ట్రాల్లో తిష్టవేసిన స్మగ్లర్లపై గురి పెట్టలేదు. మొదటిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి ఆట కట్టిస్తోంది. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్న రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో సెబ్ ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించి ఉమ్మడి కార్యాచరణను రూపొందించారు. పరస్పర సహకారంతో ఇప్పటికే 50 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లని సెబ్ అరెస్టు చేసింది. రాష్ట్ర అధికారులు ఆ రాష్ట్రాలకు వెళ్లి 30 మందిని అరెస్టు చేసి తీసుకువచ్చారు. తెలంగాణ పోలీసులు 15 మందిని మన రాష్ట్రానికి అప్పగించారు. కేరళ ఇద్దరిని, కర్ణాటక ఇద్దరిని, తమిళనాడు ఒకరిని అప్పగించాయి. మిగిలిన స్మగ్లర్లను కూడా అరెస్టు చేసేందుకు సెబ్ రెండంచెల్లో ‘జాయింట్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేస్తోంది. డీజీపీ చైర్మన్‌గా ఉండే నోడల్ ఏజెన్సీలో సెబ్ కమిషనర్, డీఐజీలు సభ్యులుగా ఉంటారు. సెబ్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని కార్యనిర్వాహక టాస్క్ ఫోర్స్‌లో ఎంపిక చేసిన జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు సభ్యులుగా ఉంటారు. ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్షలు విధించేలా పర్యవేక్షిస్తుంది. రాష్ట్రం నుంచి అప్పగించింది 20 మందిని కాగా మన రాష్ట్రానికి చెందిన కొందరు స్మగ్లర్లు ఇతర రాష్ట్రాల్లో అక్రమ మద్యం, ఇతర దందాలకు పాల్పడుతున్నారు. ఆ రాష్ట్రాలు ఇచ్చిన జాబితా మేరకు సెబ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ఆ రాష్ట్రాల పోలీసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే 20 మందిని వివిధ రాష్ట్రాలకు అప్పగించారు. -
Timber Smuggling: కలపకు కాళ్లు ! .. నదుల మీదుగా
ఒకప్పుడు దండకారణ్యంగా ఉన్న మహదేవపూర్ అడవులు ప్రస్తుతం పలుచబడ్డాయి. కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న కలప రవాణా మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు కలప అక్రమంగా తరలివస్తుంది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో కలపకు కాళ్లు వచ్చాయనే చందంగా తయారైంది. ఆయా రాష్ట్రాల నుంచి విలువైన వృక్ష సంపద కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం వంతెనల మీదుగా తెలంగాణలోని భూపాలపల్లి, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల పట్టణాలకు యథేచ్ఛగా తరలిపోతున్నట్లు తెలిసింది. రూ.లక్షల్లో వ్యాపారం సాగుతున్నప్పటికీ అటవీశాఖ అధికారులు మొద్దునిద్ర వీడడం లేదు. కానీ ఎక్కడా అటవీశాఖ చెక్‌పోస్టులు లేకపోవడంతో అక్కమార్కులకు ఆడిందే ఆట పాడిండే పాటగా తయారైందని విమర్శలు ఉన్నాయి. – కాళేశ్వరం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విలువైన టేకు వృక్ష సంపద అపారంగా ఉంది. కానీ అక్కడ విలువ తక్కువగా ఉండడంతో అక్రమార్కులు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల సరిహద్దుల నుంచి కలప వ్యాపారం జోరుగా చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన మీదుగా రాత్రి వేళల్లో కలప తరలివస్తుంది. అవతలి వైపు సిరొంచ వద్ద మహారాష్ట్ర చెక్‌పోస్టు ఉంది. అక్కడి సిబ్బందిని మచ్చిక చేసుకొని కలపను టాటా ఏసీ, వ్యాను, లారీల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ మీదుగా కలప తరలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు వంతెనలు దాటి అన్నారం బ్యారేజీ మీదుగా కలప పట్టణాలకు తరలిపోతుంది. కానీ ఎక్కడా ఈ మూడు వంతెనల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం రూ.లక్షల విలువైన టేకు తరలిపోతుందని తెలిసింది. రాత్రి వేళల్లో నిఘా తగ్గడంతో.. ఇలా కలప వ్యాపారం జరుగుతున్నా అధికారులు అటువైపు చూడడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సిరొంచ వద్ద తెలంగాణలోని కొంత మంది స్మగ్లర్లు కొన్ని సందర్భాల్లో టాటా ఏసీ వాహనాల్లో తరలిస్తూ లక్షల విలువైన కలపతో అక్కడి అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణం.. తెలంగాణ వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. దానికి అనుగుణంగా గృహాల యజమానులు కలపను కొనుగోలు చేస్తున్నారు. కలప స్మగ్లర్లు రూ. 5–6వేల వరకు 6 ఫీట్ల పొడవు, ఆరు ఇంచుల వెడల్పు గల (దుంగ) కలపకు తీసుకొంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో రూ.2500–3200 వరకు కొనుగోలు చేస్తూ దండుకుంటున్నారు. ఇళ్లలో దర్వాజలు, తలుపులు, కిటికీలతో పాటు ఇంటికి సంబంధించి ఫర్నిచర్ కోసం కలపను తరలిస్తున్నారు. మహదేవపూర్, పలిమెల మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగరీత్యా పనిచేసి బదిలీ అయ్యే సందర్భంలో కూడా లక్షల విలువైన పర్నిచర్‌ను తయారు చేయించుకొని అనుమతులు లేకుండా తరలిపోతున్నారు. వారిపైన కూడా నిఘా లేదని తెలిసింది. అటవీశాఖ అధికారులు మాత్రం కలపను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. వంతెనల వద్ద చెక్‌పోస్టుల ఏర్పాటులో జాప్యం ఎందుకు ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదని సామాన్య ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయమై మహదేవపూర్ ఎఫ్డీఓ వజ్రారెడ్డిని ఫోన్లో సంప్రదించగా.. మా రేంజ్ పరిధిలో అటవీశాఖ సిబ్బంది లేరన్నారు. చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని పై అధికారులకు నివేదిక పంపాం. మహారాష్ట్ర నుంచి కలప వస్తే మా సిబ్బంది పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. నదుల మీదుగా.. అప్పుడప్పుడు వంతెనల నుంచి కాకుండా అధికారులను రూటు మార్చేందుకు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల మీదుగా టేకు తెప్పలుగా కట్టి తరలిస్తున్నారు. ఇలా తెప్పల ద్వారా తెచ్చిన కలపను పలిమెల, మహదేవపూర్, కాళేశ్వరం మండలాల నుంచి, అటు ఏటూరునాగారం మీదుగా కూడా ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తనిఖీల్లో దొరికేటివి కొన్ని మాత్రమే.. విలువైన టేకు మాత్రం అధికారుల కళ్లు గప్పి అందకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. -
రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసుల కాల్పులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. లంబసింగి ఘాట్‌రోడ్డులో పోలీసులపైకి స్మగ్లర్లు రాళ్లు రువ్వారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భారీ ఎత్తున గంజాయిని నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నల్లగొండ నుంచి విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. ఘటనా స్థలానికి నర్సీపట్నం నుంచి పోలీసు బలగాలను తరలించారు. -
బెజవాడ అడ్రస్‌తో బురిడీ.. గమ్యస్థానం ఢిల్లీయే..
సాక్షి, అమరావతి: ఇటీవల గుజరాత్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ నిల్వలతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు స్పష్టం చేశాయి. అఫ్గానిస్తాన్ నుంచి ఇరాక్ మీదుగా గుజరాత్‌కు దిగుమతైన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ గమ్యస్థానం దేశ రాజధాని ఢిల్లీయేనని ప్రాథమికంగా నిర్ధారించింది. డీఆర్ఐ, ఇతర నిఘా సంస్థలను బురిడీ కొట్టించేందుకే స్మగ్లర్లు విజయవాడ చిరునామాను వాడుకున్నట్లు తుది అంచనాకు వచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో ముడిపడిన డ్రగ్స్ అక్రమ తరలింపు కేసులో దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. హెరాయిన్ దిగుమతితో ఏపీకి సంబంధం లేదని ఈ కేసుకు సంబంధించిన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. విజయవాడకు సంబంధమే లేదు... ఈ కేసులో చెన్నైకు చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య గోవిందరాజు దుర్గాపూర్ణిమ వైశాలితోపాటు ఆరుగురు అఫ్గాన్‌వాసులు, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఓ మహిళను డీఆర్ఐ ఇప్పటికే అరెస్టు చేసింది. అఫ్గానిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా హెరాయిన్ దిగుమతి దందాలో సుధాకర్ దంపతులను కమీషన్ ప్రాతిపదికన వాడుకుందని డీఆర్ఐ ప్రాథమికంగా గుర్తించింది. ఈ క్రమంలోనే నిందితులు విజయవాడ చిరునామాతో రిజిస్టర్ చేసిన అషీ ట్రేడింగ్ కంపెనీ పేరును వాడుకునేందుకు సమ్మతించారు. అఫ్గానిస్తాన్‌కు చెందిన ముఠా సభ్యులే మన దేశంలోనూ తిష్టవేసి డ్రగ్స్ రాకెట్ నడిపించారు. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన రెండు కంటైనర్ల హెరాయిన్‌ను డీఆర్ఐ జప్తు చేసిన విషయం విదితమే. అషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో జూన్‌లో కూడా అఫ్గానిస్తాన్ నుంచి రెండు కంటైనర్ల హెరాయిన్‌ను ముంద్రా పోర్టులో దిగుమతి చేసి గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీకి తరలించినట్లు విచారణలో వెల్లడి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రెండు కంటైనర్ల హెరాయిన్‌ను గుజరాత్ నుంచి నేరుగా ఢిల్లీకి తరలించారని, విజయవాడకుగానీ ఆంధ్ర ప్రదేశ్‌లోని ఇతర చోట్లకుగానీ తరలించలేదన్నది కీలక అంశమని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. అంటే కేవలం తమ కళ్లు గప్పేందుకే విజయవాడ చిరునామాను వినియోగించుకున్నారని, హెరాయిన్ స్మగ్లింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైందని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. ప్రాధాన్యం సంతరించుకున్న న్యాయమూర్తి వ్యాఖ్యలు గుజరాత్లో హెరాయిన్ జప్తు కేసులో అరెస్టైన నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విజయవాడకు చెందిన సంస్థ హెరాయిన్‌ను దిగుమతి చేసుకుంటే పశ్చిమ తీరాన గుజరాత్లో ఉన్న ముంద్రా పోర్టుకు ఎందుకు తెస్తారు? విజయవాడకు సమీపంలో తూర్పు తీరంలోనే పలు పోర్టులు ఉన్నాయి కదా? అని పేర్కొన్నారు. హెరాయిన్‌ను ఢిల్లీకి తరలించాలన్నదే స్మగ్లర్ల ఉద్దేశమని డీఆర్ఐ కూడా న్యాయస్థానానికి తెలిపింది. విజయవాడకు చేర్చడం అసలు స్మగ్లర్ల లక్ష్యమే కాదని పేర్కొంది. స్మగ్లింగ్ ముఠా అంతా అఫ్గానిస్తాన్, ఇరాన్, ఢిల్లీల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. చెన్నై నుంచి అఫ్గానిస్తాన్‌లోని ముఠా సభ్యులతో ఫోన్లో మాట్లాడి హెరాయిన్‌ను గుజరాత్ తీరానికి తెప్పించి ఢిల్లీకి తరలిస్తున్నారని తెలిపింది. అఫ్గానిస్తాన్, ఇరాన్‌లోని ముఠాలు నడుపుతున్న ఈ దందాలో ఉగ్రవాద, దేశ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉన్నట్లు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ స్మగ్లింగ్ కేసులు విచారించే డీఆర్ఐ కాకుండా ఉగ్రవాద నేరాలను దర్యాప్తు చేసే ‘ఎన్ఐఏ’కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. -
అంతర పంటగా గంజాయి!
సాక్షి, సంగారెడ్డి(మెదక్): ఆంధ్ర, ఒడిశా సరిహద్దులకు పరిమితమైన గంజాయి సాగు ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లోనూ విస్తరిస్తోంది. ప్రధానంగా సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలో విస్తారంగా సాగవుతోంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కర్ణాటక సరిహద్దు మారుమూల గ్రామాల్లో గంజాయి క్షేత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా వేల సంఖ్యలో గంజాయిని సాగు చేస్తున్న క్షేత్రాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్న పొలాలను తరచూ గుర్తిస్తున్న ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు మొక్కలను ధ్వంసం చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఒకేచోట రూ.ఐదు కోట్ల విలువైన మొక్కలు ► సంగారెడ్డి జిల్లా ఏడాకులపల్లి గ్రామ శివారులో వెంకటేశ్ అనే వ్యక్తికి చెందిన ఐదెకరాల్లో ఇటీవల మూడు వేలకు పైగా గంజాయి మొక్కలు సాగవుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ గంజాయి మొక్కల విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ► కర్ణాటక సరిహద్దు జహీరాబాద్ డివిజన్లోని పలు గ్రామాల్లో 12 గంజాయి క్షేత్రాలను ఎక్సైజ్, పోలీసుశాఖ అధికారులు గుర్తించి, వేల సంఖ్యలో మొక్కలను ధ్వంసం చేశారు. రాయ్‌కోడ్ మండలం ఉలిగెరలో నాలుగు వేల మొక్కలను గుర్తించారు. పత్తి, చెరుకు, అరటి తోటల్లో భారీగా గంజాయి సాగవుతోంది. ► బాన్సువాడ మండలంలోని సోమ్లానాయక్ తం డాలో, గాంధారి మండలం ధన్‌సింగ్‌తండా శివా రులోనూ ఇటీవల గంజాయి సాగవుతున్నట్లు గు ర్తించి మొక్కలను దహనం చేశారు. రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలోనూ గంజాయి క్షేత్రాలపై ఇటీవల అధికారుల దాడులు కొనసాగాయి. జైళ్లలో మగ్గుతున్నది రైతులే.. ముంబైకి చెందిన స్మగ్లింగ్ ముఠాలు తమ ఏజెంట్ల ద్వారా ఇక్కడి అమాయక రైతులను ట్రాప్ చేసి గంజాయిని సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. కొందరు రైతులు స్థానికేతరుల భూములు కౌలుకు తీసుకొని అందులో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎక్సైజ్ అధికారి అశోక్‌కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ పంట సాగుతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో కొందరు అమాయక రైతులు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పట్టుబడితే నెలల తరబడి జైలులో మగ్గుతున్నారు. గంజాయి సాగుచేస్తున్న అమాయక రైతులు ఎన్డీపీఎస్ వంటి కేసులను ఎదుర్కొంటుండగా, ముంబైలో కూర్చుని రూ.కోట్లు గడిస్తున్న దందా సూత్రధారులపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఇద్దరు మైనర్లపై కేసు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఇద్దరు బాలురు తమ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం వ్యవసాయ క్షేత్రంలో తనిఖీలు చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మూడు నెలల క్రితం తమ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి విత్తనాలు నాటారని సమాచారం అందిందని మెట్పల్లి సీఐ శ్రీను వివరించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: Singareni Employees: ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షలు -
భయపడినప్పుడు వెంట్రుకలు ఎందుకు నిక్కబొడుచుకుంటాయంటే..
కేశవర్ణన, చిత్రణ లేని ప్రాచీన సాహితీ కళారూపాలు లేవంటే అతిశయోక్తి కాదు! ఆధునిక యుగం మొదలయ్యే సరికి – ఎన్నో శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక వర్తక వాణిజ్య అంశాలతో విడదీయలేనంతగా చిక్కుముడి పడిపోయిన జుట్టుకథను సరదాగా చెప్పుకుందాం... కేశసంరక్షణ ఆధునిక కాలంలో ఒక ప్రత్యేక శాస్త్రంగా ‘ట్రైకాలజీ’ పేరుతో అభివృద్ధి చెందింది. ఎంతగానో విస్తృతి చెందిన ఆధునిక వైద్యరంగంలో ఇది పారామెడికల్ సైన్స్‌గా గుర్తింపు పొందింది. ఇక సాదాసీదా క్షురకులు సహా కేశాలంకార నిపుణుల సంగతి సరేసరి! చరిత్ర పరిణామంలో ఇదొక పార్శ్వమైతే, మరోవైపు కత్తిరించి పారేసిన జుట్టు గుట్టలు కొందరికి కోట్లాదిగా విలువచేసే నోట్ల కట్టలు సంపాదించి పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం జుట్టునే ఆలంబనగా చేసుకుని ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. కేశఖండన, కేశసంరక్షణల వ్యాపారం కళ్లు చెదిరేస్థాయిలో సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాపారం 2020 సంవత్సరంలో 7506 కోట్ల డాలర్ల (రూ.5.48 లక్షల కోట్లు) మేరకు సాగింది. ఇది 2019 నాటితో పోల్చుకుంటే, 4.63 శాతం తక్కువ. ‘కరోనా’ ప్రభావం కారణంగా లాక్డౌన్లో సెలూన్లు, బ్యూటీపార్లర్లు, కాస్మొటిక్ క్లినిక్‌లు మూతబడటంతో ఈ వ్యాపారం కాస్త తగ్గినా, 2021–28 మధ్య కాలంలో 5.76 శాతం మేరకు సగటు వార్షిక వృద్ధి సాధించగలదని, 2028 నాటికి 11297 కోట్ల డాలర్ల (రూ.8.26 లక్షల కోట్లు) మేరకు చేరుకోగలదని ‘ఫార్చ్యూన్’ పత్రిక ఇటీవల ఒక అంచనాను ప్రకటించింది. జనాభాలో రెండో పెద్దదేశమైన మన భారత్‌లో కేశసంరక్షణ వ్యాపారం 2020 సంవత్సరంలో రూ.25 వేల కోట్లకు పైమాటే! ఇవన్నీ సంఘటిత రంగంలో జరిగిన వ్యాపారానికి సంబంధించిన లెక్కలు. ఇక అసంఘటిత రంగంలో జరిగే వ్యాపారం, విదేశాలకు జుట్టు అక్రమ రవాణా లావాదేవీలకు సంబంధించిన అధికారిక అంచనాలేవీ లేవు. కేశ విశేషాలను చెప్పుకోవాలంటే కొండవీటి చాంతాడు కంటే పొడవాటి జాబితానే తయారవుతుంది గాని, ఎక్కువ మందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన వేశ విశేషాలను మచ్చుకు చెప్పుకుందాం... ►తలతో సహా మనుషుల శరీరంపై సగటున లక్ష నుంచి లక్షన్నర వరకు వెంట్రుకలు ఉంటాయి. ►వీటిలో రోజూ దాదాపు 50–150 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అంతకంటే ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతున్నట్లయితే మాత్రం ఏదో సమస్య ఉన్నట్లే! ►వెంట్రుకలు ప్రధానంగా ‘కెరాటిన్’ అనే ప్రొటీన్ ద్వారా తయారవుతాయి. జంతువుల కొమ్ముల్లో ఉండే ప్రధాన పదార్థం కూడా ఇదే. ►ఒక వెంట్రుక ఆయుర్దాయం దాదాపు ఐదేళ్ల వరకు ఉంటుంది. ►ఒక వెంట్రుక అదే మందంలో ఉండే రాగితీగ కంటే దృఢంగా ఉంటుంది. ►భయపడినప్పుడు లేదా చలిగా ఉన్నప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి– అదే గూస్బంప్స్ ఏర్పడతాయి. ఆ సమయంలో వెంట్రుకల కుదుళ్లలోని కండరాలు సంకోచించడం వల్ల అలా జరుగుతుంది. ►విగ్గులు ఆధునిక ఫ్యాషన్ సాధనాలేమీ కాదు. ప్రాచీనకాలం నుంచే ఉండేవి. పేల బెడద పడలేక ప్రాచీన ఈజిప్షియన్లు చాలామంది గుండు గొరిగించుకునేవారు. గుండు కనిపించకుండా ఉండటానికి విగ్గులు వాడేవారు. బహుశ చరిత్రలో తొలి ‘విగ్గరులు’ ఈజిప్షియన్లే కాబోలు! ►ఫ్రెంచి పాలకుడు పద్నాలుగో లూయీ కాలంలో విగ్గులకు కిరీటాల స్థాయి గౌరవం ఉండేది. అప్పట్లో యూరోప్ దేశాల్లో విగ్గుధారణ ఒక స్టేటస్ సింబల్. ఎంత పెద్ద విగ్గు ధరిస్తే అంత గొప్ప అన్నమాట! అందుకే ప్రముఖులను ప్రస్తావించడానికి ‘బిగ్విగ్స్’ అనే పదబంధం ఏర్పడింది. ►కొన్ని వృత్తుల్లోని ఉన్నత పదవుల్లో ఉండేవారంతా తప్పనిసరిగా విగ్గులు ధరించేలా చట్టం తేవాలంటూ విగ్గుతయారీదారులు బ్రిటిష్ పాలకుడు మూడో జార్జ్‌కి 1765లో విజ్ఞప్తి చేశారు. రాజావారు సదరు విజ్ఞప్తిని తోసిపుచ్చారు. అయితే, బ్రిటన్‌లో న్యాయమూర్తులందరూ ఇప్పటికీ తప్పనిసరిగా విగ్గులు ధరించే విధులకు హాజరవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. జుట్టునూ వదలని స్మగ్లర్లు విలువైన బంగారం, వజ్రాలు వంటివి స్మగ్లింగ్ చేయడం మామూలే. గంజాయి సహా రకరకాల మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడం కూడా మామూలే. కత్తిరించాక తుడిచి పారేసే జుట్టును కూడా స్మగ్లింగ్ చేసేవారున్నారు. మన దేశం నుంచి గుట్టలు గుట్టలుగా జుట్టును గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించే తతంగం కొన్నేళ్ల నుంచి నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో చైనాకు అక్రమంగా తరలించడానికి సిద్ధంగా గోదాముల్లో దాచిన జుట్టు గుట్టలను కొద్ది వారాల కిందటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్రమంగా తరలించడం కోసం గోదాముల్లో దాచిపెట్టిన జుట్టును, అక్రమంగా తరలిస్తున్న జుట్టును అధికారులు పట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. గడచిన కొద్ది సంవత్సరాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులే కాదు, అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్ తదితర పారామిలటరీ బలగాలు కూడా సరిహద్దులను దాటబోతున్న జుట్టును భారీ పరిమాణంలో స్వాధీనం చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. జుట్టు అక్రమ రవాణాను అరికట్టడానికి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వాణిజ్య మంత్రిత్వశాఖ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు రెండేళ్ల కిందట ఆదేశాలు జారీ చేసినా, జుట్టు స్మగ్లింగ్ యథావిధిగా జరుగుతూనే ఉంది. ఫలితంగా జుట్టు ఎగుమతుల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. జుట్టును అక్రమంగా తరలించడం వల్ల ప్రభుత్వానికి వాటిల్లుతున్న నష్టం ఒక ఎత్తయితే, అనుమతులు తీసుకుని సాగిస్తున్న జుట్టు ఎగుమతుల్లో జరుగుతున్న మోసాలు మరో ఎత్తు. జుట్టును ఎగుమతి చేసే వ్యాపారులు తాము ఎగుమతి చేసే సరుకు విలువ తగ్గించి చూపుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన దాని కంటే తక్కువ మొత్తంలో పన్నులు చెల్లిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఎగుమతి చేసే జుట్టును నాణ్యతను బట్టి విడదీసి, కిలో ఒక యూనిట్ చొప్పున చిన్న చిన్న గుట్టలుగా చుడతారు. వీటిని ‘గోలి’, ‘ఛుట్టి’, ‘థుట్టి’ అనే పేర్లతో వ్యవహరిస్తుంటారు. మన దేశంలో కిలో జుట్టు విలువ రూ.4,500 నుంచి రూ.6,000 వరకు ఉంటోంది. ఎగుమతిదారులు కిలో విలువ గరిష్ఠంగా రూ.1,400 వరకు మాత్రమే చూపుతూ పన్నులు ఎగవేస్తున్నారు. మన దేశం నుంచి దొంగచాటుగా రవాణా అయ్యే జుట్టులో ఎక్కువ భాగం మయన్మార్, వియత్నాం, బంగ్లాదేశ్‌ల మీదుగా భూమార్గంలో చైనాకు చేరుకుంటోంది. మన దేశం నుంచి ఏటా విదేశాలకు చేరుతున్న జుట్టు విలువ రూ.6 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు ఉంటోంది. ఇందులో 5 శాతం జుట్టు తిరుపతి సహా వివిధ పుణ్యక్షేత్రాల్లో భక్తులు సమర్పించుకునే నీలాల నుంచే చేరుతోంది. మన దేశంలో జరిగే జుట్టు ఎగుమతుల వ్యాపారంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 8 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని ‘హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రోడక్ట్స్ మ్యానుఫాక్చరర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు సునీల్ ఇమామి మీడియాకు తెలిపారు. జుట్టు స్మగ్లింగ్ కారణంగా హెయిర్ ప్రాసెసింగ్ పరిశ్రమపై ఆధారపడి బతికే 4.1 లక్షల మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితులు వాటిల్లాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్మగ్లింగ్ వల్ల అటు ప్రభుత్వానికే కాదు, ఇటు అనుమతులు పొంది వ్యాపారాలు సాగిస్తున్న ఎగుమతిదారులకు కూడా భారీ నష్టం వాటిల్లుతోందని ఇమామి చెప్పారు. ఇదిలా ఉంటే, దేశం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న జుట్టు విలువ దాదాపు రూ.8 వేల కోట్ల వరకు ఉంటుందని, దీనివల్ల జీఎస్టీ ఆదాయానికి గండిపడుతోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జుట్టుతో ఏం చేస్తారంటే.... ఆ మాత్రం మాకు తెలీదేంటి? విగ్గులు తయారు చేస్తారు అనుకుంటున్నారా? ఔను! రకరకాల మార్గాల్లో సేకరించిన జుట్టుతో సవరాలు, విగ్గులు, కృత్రిమ గడ్డాలు, కనుబొమ్మలు వంటివి కూడా తయారు చేస్తారు. అలాగని, జుట్టు ప్రయోజనాలు ఈ మాత్రానికే పరిమితం కాదు. జుట్టును చాపల్లా నేసి, వాటిని మొక్కల రక్షణ కోసం ఉపయోగిస్తారు. ఈ చాపలు టెర్రస్ గార్డెన్లు పెంచేవారికి బాగా ఉపయోగపడతాయి. సముద్రంలో చిందిన చమురు తెట్టును శుభ్రం చేయడానికి జుట్టుతో తయారు చేసిన ‘హెయిర్ బూమ్స్’ను ఉపయోగిస్తున్నారు. చమురు తెట్టును శుభ్రం చేయడానికి జుట్టుతో తయారు చేసిన మరింత మెరుగైన నమూనా పరికరాల తయారీపై ‘నాసా’ శాస్త్రవేత్తలు పరీక్షలు జరుపుతున్నారు. నేటివ్ అమెరికన్లు జుట్టుతో పొడవాటి తాళ్లను పేని, వాటితో రకరకాల వస్తువులు తయారు చేస్తారు. ఇటీవలికాలంలో కొన్నిచోట్ల దుస్తుల తయారీలోను, కళాకృతుల తయారీలోను, ఫర్నిచర్ తయారీలోనూ జుట్టును ఉపయోగిస్తున్నారు. ఇక జుట్టు నుంచి వేరుచేసిన ప్రొటీన్‌ను సోయాసాస్, పలు బేకరీ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. రీసైకిల్ చేసిన జుట్టును ఎరువుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. జుట్టులో 16 శాతం మేరకు నత్రజని ఉంటుంది. పశువుల వ్యర్థాలతో తయారయ్యే సేంద్రియ ఎరువులో ఉండే నత్రజని 0.2–0.3 శాతం మాత్రమే. జుట్టుతో తయారైన ఎరువు పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించదు. కొద్దినెలల్లోనే ఇది మట్టిలో పూర్తిగా కలిసిపోయి, మొక్కలకు కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. జుట్టుతో మరో వ్యవసాయ ప్రయోజనం కూడా ఉంది. జుట్టుతో అల్లిన చాపలతో కంచెలను ఏర్పాటు చేసుకుంటే, వాటిని దాటుకుని కుందేళ్లు, ఉడుతలు, ఎలుకలు వంటి జంతువులు పొలాల్లోకి, తోటల్లోకి చొరబడి పంటలను నాశనం చేయలేవు. అంతేకాదు, జుట్టుతో తయారైన చాపలు పంటలను నాశనం చేసే కొన్ని రకాల పురుగులను కూడా సమర్థంగా నిరోధించగలవు. పంటపొలాలకు, తోటలకు రక్షణగా జుట్టుతో తయారైన చాపలతో కంచెలను ఏర్పాటు చేసుకునే పద్ధతి కొన్ని అగ్రదేశాల్లో పరిమితంగానే వాడుకలో ఉంది. ఇదే పద్ధతి వ్యాప్తి చెందితే రైతులకు పురుగుమందుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో కొందరు రైతులు తమ పంటచేలకు జుట్టుతో తయారైన చాపలను కంచెలుగా ఏర్పాటు చేసుకోవడం వల్ల వారికి పురుగుమందుల కోసం అయ్యే ఖర్చుతో ఏటా 50 వేల డాలర్లు (రూ.36.67 లక్షలు) ఆదా కావడమే కాకుండా, దాదాపు పదిలక్షలకు పైగా మొక్కలు నాశనం కాకుండా బతికి ఎదిగాయని అక్కడి అధికారులు వెల్లడించారు. జుట్టు నుంచి వేరుచేసిన ప్రొటీన్లను ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. జుట్టు నుంచి వేరు చేసిన ఎల్–సిస్టీన్, ఎన్–ఎసిటైల్ ఎల్–సిస్టీన్ (ఎన్ఏసీ) ప్రొటీన్లతో ఔషధాలను తయారు చేస్తున్నారు. వైద్యరంగంలో జుట్టు వినియోగం కొత్తదేమీ కాదు. ప్రాచీనకాలంలోనే భారత్, చైనాలలో వైద్యులు జుట్టును కాల్చి బూడిద చేసి, ఆ బూడిదను గాయాలకు పైపూతగా ఉపయోగించేవారు. మధ్యయుగంలో పలు యూరోప్ దేశాల్లో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు కుట్లు వేయడానికి మనుషుల వెంట్రుకలతో తయారు చేసిన దారాలను ఉపయోగించేవారు. మనుషుల జుట్టుకు గల దారుఢ్యం అమోఘమైనది. జుట్టుతో తయారైన దారాలను శస్త్రచికిత్సల్లో కుట్లు వేయడానికి ఇప్పుడు కూడా భేషుగ్గా ఉపయోగించవచ్చని ఆధునిక పరిశోధకులు కూడా చెబుతున్నారు. షాంపూలు, కండిషనర్లు వంటి కేశసంరక్షణ ఉత్పత్తులను తయారు చేసేవారు తమ ఉత్పత్తుల పనితీరును పరీక్షించడానికి జుట్టుతో తయారైన ‘టెస్ట్ స్వాచెస్’ను ఉపయోగిస్తుంటారు. తల‘కట్టు కథలు’ నాగరికత మొదలైనప్పటి నుంచే మనుషులకు జుట్టు మీద మోజు మొదలైంది. ముఖ్యంగా తలకట్టును తీర్చిదిద్దుకోవడాన్ని నాగరికతకే తలమానికంగా భావించడం మొదలైంది. తలకట్టును చూసి మనుషుల స్వభావాలను అంచనా వేసే లక్షణం మనుషుల్లో ఇప్పటికీ ఉంది. బహుశ ఈ లక్షణం ఆదిమ అవశేషమేమో! తలపై జుట్టును ఏపుగా పెంచుకోవడమే కాకుండా, ఆ జుట్టును కాపాడుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకునేవారు. ప్రాచీన ఈజిప్షియన్లు జుట్టును కాపాడుకోవడానికి ఆముదం, బాదంనూనె రాసుకునేవారు. ఎడారి ప్రాంతపు పొడి వాతావరణంలో వారి జుట్టుకు ఇవి రక్షణ కల్పించేవి. క్రీస్తుపూర్వం 1500 నాటి అస్సీరియన్ రాజులు రింగురింగులుగా మెలితిరిగే ఉంగరాల జుట్టు కోసం పడరాని పాట్లు పడేవారు. వాళ్లలో సహజంగానే ఉంగరాల జుట్టు ఉంటే సరేసరి. వాళ్లు అదృష్టవంతుల కిందే లెక్క! ఎలాంటి మెలికల్లేని నిలువైన జుట్టు ఉంటే మాత్రం దానిని రింగురింగులుగా మెలితిప్పడానికి వేడిచేసిన ఇనుప చువ్వలను ఉపయోగించేవారు. క్రీస్తుశకం 13వ శతాబ్ది కాలంలో ఇటలీ ప్రాంతంలో బల్లికొవ్వును ఆలివ్‌నూనెలో కలిపి మరిగించి, చల్లార్చి దానిని తలకు పట్టించుకునేవారు. జుట్టు ఏమాత్రం చెదిరిపోకుండా కట్టుదిట్టమైన తలకట్టును తీర్చిదిద్దుకోవడానికి క్రీస్తుశకం 16వ శతాబ్దికి చెందిన బ్రిటిష్ మహిళలు తలకు మైనాన్ని పట్టించేవారు. ఇంచుమించు అదేకాలంలో ఫ్రాన్స్‌లో మరో ట్రెండ్ ఉండేది. అక్కడి జనాలు జుట్టు పోషణ కోసం ఎముకల మూలుగను ఉపయోగించేవారు. మేక, గొర్రె, గొడ్డు ఎముకల మూలుగను హేజెల్‌నట్ ఆయిల్లో బాగా గిలకొట్టి కలిపి, దానికి కాసింత నిమ్మరసం చేర్చి తలకు పూసుకునేవారు. ఇప్పుడు విరివిగా వాడుకలో ఉన్న లిక్విడ్ షాంపూ అందుబాటులోకి వచ్చి వందేళ్లు కూడా పూర్తి కాలేదుగాని, ప్రాచీనకాలంలో భారత ఉపఖండంలో జనాలు కుంకుడుకాయలతో, షీకాయతో జుట్టును శుభ్రం చేసుకునేవారు. జర్మన్ రసాయనవేత్త, వ్యాపారవేత్త హాన్స్ స్క్వార్జ్కోఫ్ తొలిసారిగా 1927లో ‘స్క్వార్జ్కోఫ్’ బ్రాండ్ పేరుతో లిక్విడ్ షాంపూను మార్కెట్లోకి ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత వివిధ దేశాల్లోని మిగిలిన సంస్థలు కూడా వేర్వేరు ఫార్ములాలతో షాంపూలను తయారు చేయడం మొదలుబెట్టాయి. కేశ సంరక్షణ ఉత్పత్తుల పరిణామం తలనూనెల నుంచి షాంపూల వరకు మాత్రమే పరిమితం కాలేదు. కండిషనర్లు, హెయిర్‌క్రీమ్స్, జెల్స్, బట్టతలపై జుట్టు మొలిపించే లోషన్స్, సీరమ్స్, నెరిసిన జుట్టుకు టెంపరరీ పడుచుదనం తెప్పించేందుకు వాడే రకరకాల హెయిర్‌డైలు వంటి నానా ఉత్పత్తులు ఇటీవలి కాలంలో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తల మీద జుట్టును పొడవుగా పెంచుకోవడం కొన్నాళ్లు ఫ్యాషన్‌గా ఉంటే కురచగా కత్తిరించుకోవడం మరికొన్నాళ్లు ఫ్యాషన్‌గా చలామణీలో ఉంటుంది. పొడవాటి జుట్టుకు పోనీ కట్టుకోవడం, చుట్టూ కురచగా కత్తిరించి, తల నడిమధ్యలో గోపురంలా జుట్టును తీర్చిదిద్దుకోవడం– ఇలా చెప్పుకుంటూ పోతే తలకట్టులో రకరకాల ఫ్యాషన్లు. ఫ్యాషన్లకు అనుగుణంగా మాసిన తలపై జుట్టును కత్తిరించి చక్కగా తీర్చిదిద్దే పనిలో గ్రామీణ క్షురకుల మొదలుకొని నగరాల్లోని సెలూన్లు, బ్యూటీపార్లర్ల వరకు వివిధ దశల్లో ఉపయోగించే దువ్వెనలు, కత్తులు, కత్తెర్లు, రేజర్లు, ట్రిమ్మర్లు, షేవింగ్ బ్రష్‌లు, షేవింగ్ క్రీములు, ఆఫ్టర్‌షేవ్ లోషన్లు వంటి ఉత్పత్తులు, అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఉపయోగించే హెయిర్ రిమూవర్లు వంటి ఉత్పత్తుల మార్కెట్ కూడా తక్కువేమీ కాదు. విగ్గు విలాసం ఖండిత మానవ కేశాలలో ఎక్కువ భాగం చేరేది విగ్గుల పరిశ్రమకే. విగ్గులను తయారు చేసే కంపెనీలు విగ్గులతో పాటు కృత్రిమ కనుబొమ్మలు, మీసాలు, గడ్డాలు వంటివి కూడా తయారు చేస్తాయి. స్థూలంగా ఈ పరిశ్రమను హెయిర్ విగ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ ఇండస్ట్రీగా పిలుస్తారు. ఇదివరకటి కాలంలో ఈ పరిశ్రమకు ఎక్కువగా వినోదరంగం నుంచే ఎక్కువగా గిరాకీ ఉండేది. సినీ పరిశ్రమ, నాటకాలు, సంప్రదాయ వేడుకల్లో వేషాలు వేసేవారు, విచిత్ర వేషధారణ వంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు వంటి వారు మాత్రమే విగ్గులను కొనుగోలు చేసేవారు. జుట్టు ఊడిపోయి బట్టతల ఏర్పడినా సామాన్య ప్రజలు విగ్గుల జోలికి వెళ్లడం చాలా అరుదుగా ఉండేది. గడచిన రెండు దశాబ్దాలుగా సామాన్య ప్రజానీకం నుంచి కూడా విగ్గులకు గిరాకీ పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది జరిగిన విగ్గుల అమ్మకాల విలువ 700 కోట్ల డాలర్లకు (సుమారు రూ.52 వేల కోట్లు) పైమాటే! రానున్న ఐదేళ్లలో ఈ మార్కెట్ 13 శాతం వార్షికవృద్ధి సాధించగలదని ‘బిజినెస్‌వైర్’అంచనా వేస్తోంది. వివిధ దేశాల్లోని విగ్గుల తయారీ కంపెనీలకు భారీ పరిమాణంలో జుట్టును సరఫరా చేసేవి ఆసియన్ దేశాలైతే, విగ్గులను ఎక్కువగా వినియోగించేది వివిధ దేశాల్లో స్థిరపడిన నల్లజాతీయులేనని అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా జుట్టును ఎగుమతి చేసే దేశాల్లో చైనా, భారత్, మయాన్మార్ మొదటి మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. జుట్టును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో యూరోప్ దేశాలు, అమెరికా అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. భారీ ఎత్తున సాగే స్మగ్లింగ్‌ను సమర్థంగా అడ్డుకోగలిగితే, జుట్టు ఎగుమతుల్లో నిజానికి భారత్‌దే మొదటి స్థానమని దేశంలోని జుట్టు ఎగుమతిదారుల సంఘాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో మన దేశంలోనూ విగ్గులకు గిరాకీ పెరుగుతోంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి ప్రక్రియలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో బట్టతలలవారు విగ్గులపై మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే, క్యాన్సర్ బారినపడి కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల ప్రభావం వల్ల జుట్టు కోల్పోయిన వారు కూడా ఆత్మస్థైర్యం కోసం విగ్గులను వాడుతున్నారు. క్యాన్సర్ రోగులకు విగ్గుల కోసం జుట్టును దానం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. మన దేశంలో విగ్గుల తయారీ పరిశ్రమ వార్షిక వ్యాపారం విలువ దాదాపు రూ.300 కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ‘కరోనా’ ప్రభావంతో నాణ్యమైన జుట్టు ధర భారీగా పెరిగింది. ‘కరోనా’కు ముందు 19–26 అంగుళాల పొడవు ఉండే జుట్టు ధర కిలో 16 వేల వరకు ఉంటే, ప్రస్తుతం ఈ ధర రూ. 25 వేల వరకు పెరిగిందని చెన్నైకి చెందిన జుట్టు ఎగుమతి సంస్థ ‘శ్రీ సాయిరాం హెయిర్ ఇండస్ట్రీస్’ ప్రతినిధి ఒకరు చెప్పారు. తిరుమలలో భక్తులు సమర్పించుకునే నీలాలను టీటీడీ నిర్వహించే వేలంపాటలో చెన్నైలోని ఎగుమతిదారులు కొనుగోలు చేస్తుంటారు. తర్వాత నాణ్యత వారీగా గ్రేడింగ్ చేసి, శుభ్రం చేశాక విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అక్కడ జుట్టు కత్తిరించి డబ్బులిస్తారంట!! ఎక్కడైనా జుట్టు కత్తించినందుకు క్షురకులకు డబ్బులు చెల్లిస్తారు. బ్రిటన్‌లోని కొన్ని సెలూన్లలో మాత్రం జుట్టు కత్తిరించుకునే కస్టమర్లకే ఎదురు డబ్బులిస్తారు. బ్రిటన్‌లోని ‘సెలూన్పే’ వంటి కొన్ని సంస్థలు కస్టమర్లకు ఎదురు డబ్బులు చెల్లిస్తూనే తమ వ్యాపారాన్ని మూడు జుట్టుగుట్టలు ఆరు నోట్లకట్టలుగా సాగిస్తున్నాయి. పొడవాటి జుట్టుతో సెలూన్‌లోకి అడుగుపెట్టి, శుభ్రంగా అంటకత్తెర వేయించుకోవడానికి సిద్ధపడితే, జుట్టు నాణ్యతను బట్టి 75–100 పౌండ్ల (సుమారు రూ.7600– రూ.10,130) వరకు చెల్లిస్తారు. కత్తిరించిన తర్వాత ఈ జుట్టును సెలూన్ నిర్వాహకులే జాగ్రత్తగా గ్రేడింగ్ చేసి, ప్యాక్ చేస్తారు. తర్వాత జుట్టు ప్యాకెట్లను విగ్గుల తయారీ కంపెనీలకు టోకున విక్రయిస్తారు. బ్రిటన్‌లోని ప్రముఖ విగ్గుల కంపెనీలన్నీ ఇలా నేరుగా సెలూన్ల నుంచే జుట్టు గుట్టలను కొనుగోలు చేస్తాయి. సెలూన్ల ద్వారా సాగే జుట్టు విక్రయాలకు లెక్కలన్నీ పక్కాగా నమోదవుతుంటాయి. ఈ లావాదేవీల ద్వారా గత ఏడాది 3.8 కోట్ల పౌండ్ల (రూ.384 కోట్లు) ఆదాయం లభించినట్లు అక్కడి రెవెన్యూ–కస్టమ్స్ విభాగం ప్రకటించింది. చదవండి: Tips To Grow Hair Naturally: మీకో విషయం తెలుసా? రోజూ ఈ సంఖ్యలో వెంట్రుకలు రాలడం సహజమేనట! -
రెచ్చిపోయిన ఇసుక స్మగ్లర్లు
మల్లాపూర్ (కోరుట్ల): ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో స్మగ్లర్లు ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. రాళ్లు, కర్రలు, పారలతో ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి శివారు పెద్దవాగులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రాయికల్ మండలం కొత్తపేట వడ్డెర కాలనీ గ్రామానికి చెందిన కొందరు వేంపల్లి పెద్దవాగులోంచి ఇసుక అక్రమంగా తరలించేందుకు మూడు, నాలుగు రోజులుగా యత్నిస్తున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి 20 ట్రాక్టర్లలో, సుమారు 60 మందికి పైగా స్మగ్లర్లు పెద్దవాగులోకి చేరుకుని ఇసుకను తోడుతున్నారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఎస్సై వెంకటేశ్, పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజ్‌కుమార్ అక్కడకు వెళ్లి రవాణాకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో సుమారు 40 మందికి పైగా దుండగులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ రాళ్లు, కర్రలు, పారలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ట్రైనీ ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో మెట్పల్లి డీఎస్పీ గౌస్‌బాబా, సీఐ శ్రీనివాస్, సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీసులతో వేంపల్లికి చేరుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుళ్లకు వైద్యసేవలు అందించారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా పోలీసులపై దాడి చేసిన 24 మందిపై కేసు నమోదు చేశామని, 10 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ట్రైనీ ఎస్సైపై దాడి జరగలేదని, ఇద్దరు కానిస్టేబుళ్లపై దుండగులు దాడి చేసి గాయపరిచారని సీఐ వివరించారు. -
శేషాచలం కొండల్లో చెలరేగిన మంటలు
తిరుమల: శేషాచలం కొండల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శేషాతీర్థం అటవీ ప్రాంతాల్లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. శేష తీర్థం సమీపంలోని డబ్బారెకుల కొనలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి మంటలు దట్టంగా వ్యాపించాయి. అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో అడవంతా అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే మంటలు చెలరేగిన ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులు చేరడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ ప్రాంతానికి కనీసం మనుషులు చేరుకోడానికి ఒక రోజు సమయం పడుతుంది. దీంతో ఆ మంటలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయితే ఆ మంటలు ఎవరైనా ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవికాలంలో శేషచల కొండల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం సాధారణం. -
నిజమే.. ముగ్గురు కాదు ..ఒక్కడే!
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధులను చూస్తే ఏమనిపిస్తోంది? చూడటానికి ఒకేలా ఉన్నా డ్రెస్‌లే వేర్వేరుగా ఉన్నాయనుకుంటున్నారు కదూ! అవును నిజమే..ముగ్గురు కాదు..ఒక్కడే..కాకపోతే త్రిబుల్ యాక్షన్..అవసరం బట్టి ఆర్టీసీ బస్టాండు, తిరుమల, శేషాచలం అడవుల్లో వీళ్లు వేస్తున్న ‘ఎర్ర’గెటప్‌లివి. ఈ తమిళ తంబీల సెటప్ చూసి టాస్క్‌ఫోర్స్ విస్తుపోయింది. ఈ గెటప్‌ల కథేమిటంటే.. సాక్షి, చంద్రగిరి: ఎర్రచందనం దుంగల కోసం శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రకూలీలు, స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ అధికారులు అడ్డుకున్న ఘటన శ్రీవారిమెట్టు వద్ద చోటు చేసుకుంది. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాలతో ఆర్ఎస్ఐ వాసు, డీఆర్ఓ నరసింహారావు బృందాలు మంగళవారం అర్ధరాత్రి శ్రీవారిమెట్టు వద్ద కూంబింగ్ చేశాయి. సుమారు 15 మంది స్మగ్లర్లు, కూలీలు అడవిలోకి ప్రవేశిస్తుండటం చూసి వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో వారు పారిపోయారు. వెంటాడి ఒకరిని అదుపులో కి తీసుకున్నారు. చదవండి: భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..! ప్రాధమిక విచారణలో అతడు తిరువణ్ణామలై జిల్లా జమునామత్తూరు, వెళ్లి చెరువుకు చెందిన వెంకటేశన్ అని తేలింది. ఎర్రచందనం దుంగల కోసం వచ్చినట్లు అతడు వెల్లడించాడు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాగును తనిఖీ చేయగా 3 జతల దుస్తులు లభించాయి. బస్సులో రావడానికి తెల్లటి దుస్తులు, తిరుమలలో తిరిగేందుకు కాషాయం దుస్తులు, అడవిలో వెళ్లేందుకు మరొక దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం స్మగ్లర్ వేషధారణకు సంబంధించిన ఫొటోలను టాస్క్‌ఫోర్స్ అధికారులు విడుదల చేశారు. నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. చదవండి: రేపటి వరకు టీచర్ల బదిలీల వెబ్ ఆప్షన్ -
టిప్పర్‌ను ఢీకొన్న స్మగ్లర్ల వాహనం
వల్లూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా కడప–తాడిపత్రి ప్రధాన రహదారిపై వల్లూరు మండల పరిధిలోని గోటూరు, తోల్లగంగనపల్లె బస్‌స్టాప్‌ల మధ్య సోమవారం వేకువజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకరను అన్లోడ్ చేసిన టిప్పర్ వేకువజామున 3.15 గంటల సమయంలో కడప వైపు వెళ్లేందుకు ప్రధాన రహదారిపైకి ఎక్కుతుండగా అనంతపురం వైపు ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్న స్కార్పియో వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాని వెనుకే వస్తున్న మరో కారు సైతం వీటిని ఢీకొంది. దీంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ ధ్వంసమై మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో స్కార్పియో వాహనంలోని ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాకు చెందిన కూలీల్లో నలుగురు సజీవ దహనం కాగా.. అందులో ఉన్న ఎర్ర చందనం దుంగలు కాలిపోయాయి. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మూర్తి అనే మరో కూలీ మృతి చెందాడు. ప్రాథమిక ఆధారాలను బట్టి సజీవ దహనమైన వారిలో ముగ్గురు తమిళనాడుకు చెందిన రాజన్, సందిరన్, రామచంద్రన్‌గా తెలుస్తోంది. మృతుల్లో మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో టిప్పర్, స్కార్పియోతో పాటు మరో కారు కూడా కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ కిందకు దూకి అపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదానికి గురైన మరో కారు ఎవరిది, అందులో ప్రయాణిస్తున్న వారు ఏమయ్యారనేది ఇంకా తెలియరాలేదు. ప్రమాదంతో వెలుగులోకొచ్చిన స్మగ్లింగ్ అరుదైన ఎర్ర చందనం చెట్లు కడప, రాజంపేట, ప్రొద్దుటూరు డివిజన్ల పరిధిలో దాదాపు 3.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఈ మూడు డివిజన్ల పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 13 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. గతంలో కడప డివిజన్లోని సిద్ధవటం, రాయచోటి, వేంపల్లె, భాకరాపేట ప్రాంతాల నుంచి ఎర్ర చందనం ఎక్కువగా స్మగ్లింగ్ అయ్యేది. ఆ తరువాత సద్దుమణిగినా.. ఈ ఘటనతో స్మగ్లర్ల ఉనికి మరోసారి వెలుగులోకి వచ్చింది. -
'టైగర్' డాగ్.. వేటగాళ్ల గుండెల్లో గుబులు
(పెద్దదోర్నాల): టైగర్.. కొద్దిరోజులుగా నల్లమల అటవీ శాఖలో మార్మోగుతున్న పేరు. స్మగ్లర్లు, వేటగాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న పేరు. తమను ఎవరూ పట్టుకోలేరని విర్రవీగుతున్న వారిని ఇట్టే పట్టేస్తూ జైల్లో ఊచలు లెక్కించేలా చేస్తున్న ఉత్తమ జాతి జాగిలమే ఈ టైగర్. నిజ నిర్ధారణకు అవసరమైన సాక్ష్యాలను అటవీ శాఖాధికారులకు అందిస్తూ నల్లమల అభయారణ్యంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ జాగిలం తన సత్తా చాటుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో 9 వేల చదరపు కిలోమీటర్లలో నల్లమల అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ వన్య ప్రాణుల వేటతో పాటు, అడవులను కొల్లగొట్టే ఘటనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అటవీ వైశాల్యం పెద్దది కావటం, సిబ్బంది తక్కువగా ఉండటంతో స్మగ్లర్లు, వేటగాళ్లకు ఎదురులేకుండా పోతోంది. దీంతోపాటు అటవీ సిబ్బందిపై స్మగ్లర్లు దాడులకు తెగబడుతుండటంతో వీరిని నియంత్రించటం ఆ శాఖకు కష్టంగా మారింది. దీంతో అధికారులు పోలీసు శాఖ తరహాలోనే డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ‘టైగర్’కు ప్రత్యేక సౌకర్యాలు నిజ నిర్ధారణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ టైగర్‌కు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 22 కేజీల బరువు, 24 అంగుళాల ఎత్తుండే ఈ జాగిలానికి అటవీ శాఖ కార్యాలయంలో ఓ క్వార్టర్‌ను కేటాయించారు. దీనికి ప్రతిరోజూ ప్రత్యేక డైట్ మెనూను అమలుచేస్తుంటారు. ఏటా వ్యాక్సిన్లు, డీవార్మింగ్ మాత్రలను వేయిస్తామని శిక్షకుడు సుధాకర్ తెలిపారు. శిక్షణలో భాగంగా డాగ్ విన్యాసం జర్మన్ షెపర్డ్‌తో స్మగ్లర్లలో గుబులు జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ మగ శునకానికి (టైగర్) గ్వాలియర్‌లో శిక్షణను ఇప్పించారు. ఈ శునకం అభయారణ్యంలో కలప స్మగ్లర్లు, వేటగాళ్ల కార్యకలాపాలను అడ్డుకోవటంతో పాటు, పులులు ఇతర వన్య ప్రాణుల కదలికలను పసిగడుతోందని అధికారులు ఈ టైగర్ సేవలను కొనియాడుతున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది నేరగాళ్లను ఈ ‘టైగర్’ పట్టించింది. ఉదా.. ► నంద్యాల డివిజన్ పచ్చర్లలోని రైలు పట్టాల పక్కన 2018 నవంబర్ 17న ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అధికారులు ఈ ‘టైగర్’ సహాయంతో ఘటన కారణాలను ఛేదించారు. ► 2020 జనవరి 16న మం డల పరిధిలో సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వద్ద కుందేళ్లు ఉన్నట్లు ఈ టైగర్ పసిగట్టి నిందితుడ్ని పట్టుకోవటంలో కీలకంగా వ్యవహరించింది. ► అలాగే, ఇదే ఏడాది మార్చి 30న కర్నూల్ జిల్లా నాగటూటి రేంజిలో కొందరు వ్యక్తుల వద్ద కణితి మాంసాన్ని గుర్తించిన ‘టైగర్’ వారిని పట్టించింది. ఆ కేసులో దుండగులకు జైలుశిక్షలు పడ్డాయి. ► ఇదే సంవత్సరం జూలై 21న మండలంలోని సుందరయ్య కాల నీలో బతికున్న రెండు కుందేళ్లతో సంచరిస్తున్న వ్యక్తిని పసిగట్టింది. ► మొన్న ఆగస్టులో హసానాబాద వద్ద అడవిపంది మాంసాన్ని పంచుకుంటున్న వ్యక్తులను కటకటాల పాలయ్యేలా చేసింది. ‘టైగర్’ సేవలు అమోఘం అటవీ శాఖకు ‘టైగర్’ అందిస్తున్న సేవలు అమోఘం. గతంలో ఎన్నో కేసులను ఛేదించిన సందర్భాలున్నాయి. ఓ వన్యప్రాణిని కాల్చేసిన సంఘటనలో, నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించింది. – బబిత, డీఎఫ్ఓ, మార్కాపురం -
సెబ్.. స్మగ్లర్ల పాలిట సింహస్వప్నం
-
అక్రమార్కుల బెండు తీస్తున్న సెబ్
సాక్షి, అమరావతి: అక్రమార్కుల ఆటలు కట్టించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) మెరుగైన పనితీరుతో దూసుకెళ్తోంది. అమల్లోకొచ్చిన కొద్ది రోజుల్లోనే సెబ్ స్మగ్లర్ల పాలిట సింహస్వప్నంగా మారింది. అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బెండు తీస్తోంది. మూడునెలల్లోనే ముప్పై వేలకు పైగా కేసులు నమోదుచేసి ధోనంబర్ దందాగాళ్ళ గుండెల్లో దడ పుట్టిస్తోంది. శాండ్ మాఫియా, గంజాయి స్మగ్లింగ్, సారా తయారీదారుపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం అర్తమూరులో ఎస్సై తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో 500 లీటర్ల బెల్లం ఊటలను ఎస్ఈబీ బృందం ధ్వంసం చేసింది. దీంతోపాటు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎక్సైజ్ పరిధిలో సెబ్ అధికారులు దాడులు చేసి 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 400 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేశామని అక్రమరవాణా ఆపకపోతే కఠినచర్యలు తప్పవని ఈ సందర్భంగా సెబ్ డైరెక్టర్ రామకృష్ణ హెచ్చరించారు. (చదవండి: మడ అడవుల్లో సారా బట్టీలపై మెరుపు దాడి) -
సరిహద్దుల్లో స్మగ్లర్ కాల్చివేత
కోల్‌కతా: భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక స్మగ్లర్ మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా గోపాల్‌నగర్ సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్మగ్లర్ కత్తితో జరిపిన దాడిలో జవాను ఒకరు స్వల్పంగా గాయపడ్డారని బీఎస్ఎఫ్ తెలిపింది. రాత్రి 10 గంటల సమయంలో భారత్, బంగ్లాదేశ్‌లకు చెందిన సుమారు 12 మందితో కూడిన స్మగ్లర్ల బృందం సరిహద్దు కంచెకు సమీపంలో సంచరిస్తున్నట్లు జవాన్లు పసిగట్టారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా తమ వద్ద ఉన్న దగ్గుమందు ఫెన్సిడైల్ బాటిళ్లను కంచె వద్ద పడేసి పరుగు తీశారు. ఒక బంగ్లాదేశీ స్మగ్లర్ మాత్రం జవానుపై కత్తితో దాడి చేశాడు. దీంతో జవాను ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ సందర్భంగా మత్తు కోసం వాడే 75 బాటిళ్ల ఫెన్సిడైల్‌తోపాటు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: 14 కేజీల బంగారం మాయం.. -
1,000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
ముంబై: ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓడరేవుకు సమీపంలో కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో రూ. 1000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. 191 కిలోల డ్రగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. హెరాయిన్‌ను అక్రమంగా రవాణ చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో వారికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్‌ను నిందితులు తీసుకొచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. కాగా.. ప్లాస్టిక్ పైపులకు వెదురు రంగు వేసి ఆయుర్వేద మందులంటూ స్మగ్లర్లు దిగుమతి చేసేందుకు ప్రయత్నించారు. (ఏటీఎం కార్డుతో దోచేశారు) 191 kg of drugs, worth Rs 1000 crores, seized at Nhava Sheva port of Navi Mumbai in a joint operation with customs. Transported inside pipes, drugs were brought through Afghanistan. Court has sent the two accused to 14 days police custody: Directorate of Revenue Intelligence pic.twitter.com/YZw10V7kuw — ANI (@ANI) August 10, 2020 -
శేషాచలం అడవుల్లో రెచ్చిపోయిన స్మగ్లర్లు
సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో మరోసారి తమిళ స్మగ్లర్లు రెచ్చిపోయారు. లాక్డౌన్ కారణంగా కొంతకాలం అడవుల్లోకి ప్రవేశించని స్మగ్లర్లు ఇప్పుడు మళ్లీ తమ వేట ప్రారంభించారు. రెండు రోజులుగా పెద్ద ఎత్తున శేషాచల అడవుల్లోకి వచ్చిన తమిళ స్మగ్లర్లు భారీ ఎత్తున ఎర్ర చందనం దుంగలు తరలించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తిరుపతి టాస్క్ పోర్స్ సిబ్బంది కుంబింగ్‌కు వెళ్ళింది. చంద్రగిరి మండలం భీమవరం ఘాట్‌లో కుంబింగ్ పార్టీకి స్మగ్లర్లు తారస పడ్డారు. స్మగ్లర్లు మొదట పోలీసుల మీద రాళ్ళ దాడి చేశారు. పోలీసులు ప్రతి గతించడం తో స్మగ్లర్లు దుంగలు వదిలేసి పారిపోయారు. తమ వెంట ఉన్న బ్యాగ్‌లను వదిలేసి పోయారు. మొత్తం 33 దుంగలను స్వాదీనం చేసుకొన్నారు. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. -
శేషాచలం అడవుల్లో రెచ్చిపోయిన స్మగ్లర్లు
-
స్మగ్లర్ల ఆట కట్టిస్తాం: డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ: మత్తు పదార్థాలను రవాణా చేసే స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల ఆట కట్టిస్తామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీజీపీ సూచించారు.మత్తు పదార్థాల రవాణాను నిరోధించడానికి దక్షిణాది పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ డాటా ద్వారా గంజాయి పంటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల మధ్య సమన్వయ చర్చల ద్వారా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రవాణాను నివారిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
గంజాయికి బానిసలై.. స్మగ్లర్లుగా మారి..
నెల్లూరు (క్రైమ్): గంజాయికి బానిసైన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు స్మగ్లర్లుగా అవతారమెత్తిన ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో కావలి డీఎస్పీ డి.ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళానికి చెందిన ఎస్.పవన్‌కల్యాణ్, విశాఖపట్టణానికి చెందిన లోకనాథ్ అఖిల్, విజయనగరం జిల్లాకు చెందిన బి.రవితేజ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలానికి చెందిన అమర్నాథ్ (కారు డ్రైవర్) వేలూరులోని విట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదివారన్నారు. వీరంతా అక్కడ చదువుతున్న సమయంలోనే గంజాయికి బానిసలయ్యారని తెలిపారు. మత్తుకు బానిసైన వీరు గంజాయి తామే సరఫరా చేస్తే, తమ అవసరాలు తీరడంతో పాటు అధికంగా డబ్బులొస్తాయని భావించి స్మగ్లర్లుగా అవతారమెత్తారని చెప్పారు. విశాఖ ఏజెన్సీలోని తమ స్నేహితుడి ద్వారా గంజాయిని కొనుగోలు చేసి రైలు, రోడ్డు మార్గాన వేలూరుకు తరలించేవారని తెలిపారు. విశాఖ ఏజెన్సీలో కేజీ రూ.3 వేలకు కొనుగోలు చేసి వేలూరులో రూ.25 వేలకు విక్రయిస్తున్నారని, రెండేళ్లుగా ఈ అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోందని వివరించారు. సరుకు తీసుకెళుతూ.. నిందితులు పవన్‌కల్యాణ్, లోక్‌నాథ్ అఖిల్, రవితేజ, అమర్నాథ్ అద్దెకు కారు తీసుకుని విశాఖ ఏజెన్సీలోని అరకులో గంజాయిని కొనుగోలు చేశారు. కారులో వేలూరుకు బయలు దేరారు. కావలి వద్ద కారును ఆపి తమ స్నేహితుడైన గంజాయి విక్రేత (మహారాష్ట్ర, పూణేకు చెందిన) ప్రత్యూష్ సిన్హాతో మాట్లాడుతుండగా.. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో సోమవారం వారందరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా ఈ వ్యవహారంలో మరికొంతమంది హస్తం ఉందని చెప్పడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పోలీసులపై రాళ్లు రువ్విన‘ఎర్ర’కూలీలు
చంద్రగిరి (చిత్తూరు జిల్లా): ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై కూలీలు తిరగబడిన ఘటన చిత్తూరు జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దీంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరపగా.. కూలీలు పరారయ్యారు. వారిని వెంబడించిన పోలీసులు ఒక స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు టాస్క్‌ఫోర్స్ బృందం గురువారం రాత్రి శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది. ఆ బృందం శుక్రవారం తెల్లవారుజామున మూలపల్లి అటవీ ప్రాంతానికి చేరుకోగా.. పొదల మధ్య నక్కిన కూలీలు స్మగ్లర్లు ఒక్కసారిగా వారిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో వారు ఎర్రచందనం దుంగలను వదిలేసి పారిపోయారు. చీకటిలో వారిని వెంబడించగా ఒక స్మగ్లర్ దొరికాడు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన స్మగ్లర్ తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా జమునమత్తూరు తాలూకా నాచమలై గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. -
దోచేస్తున్నారు..!
సాక్షి, కొత్తగూడెం: అటవీ సంపదను రక్షించడంతో పాటు అడవిలోని కలపను అమ్మగా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన అధికారులు.. ఆ డబ్బును సొంతానికి వాడుకోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ రేంజ్‌ల పరిధిలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ విజిలెన్స్ దాడులు చేయించారు. ఈ దాడుల్లో ఎఫ్డీఓ, ఎఫ్ఆర్ఓలకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ కలప లారీలను పట్టుకోవడంతో పాటు మరికొన్ని వాస్తవాలు సైతం తెలుసుకున్నట్లు సమాచారం. దమ్మపేట రేంజ్‌లోని పూసుగుంట, ఆర్లపెంట సెక్షన్ల పరిధిలో నుంచి సరిహద్దు ఏపీలోకి యథేచ్ఛగా కలప రవాణా చేసినట్లు తెలుస్తోంది. సీతారామ కెనాల్ అలైన్మెంట్లో వచ్చిన కలపను పట్టాభూముల పర్మిట్ల మీద ముందుగా మాట్లాడుకున్న ఏపీలోని వ్యాపారులకు నేరుగా అమ్ముకున్నట్లు సమాచారం. ఏపీ దగ్గరగా ఉండడం, మధ్యలో ఒకే చెక్‌పోస్ట్ ఉండడం, అదీ వీరి పరిధిలోనే ఉండడంతో ఆడిందే ఆటగా మారింది. అలాగే ఒకే పర్మిట్‌పై రెండు లారీ లోడ్లు పంపినట్లు తెలుస్తోంది. ఇక సీతారామ కెనాల్‌పై చెట్లు నరికించేందుకు కూలీలను ఉపయోగిస్తే ప్రభుత్వం ఖర్చులు ఇస్తుంది. అలా కాకుంగా ఏపీకి చెందిన తమకు అనుకూలమైన వ్యాపారులతోనే కలప నరికించడంతో పాటు సదరు కలపను నేరుగా వారే తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకుని, కూలీ ఖర్చులు మాత్రం ఈ అధికారులే తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో వారం రోజుల క్రితం సదరు వ్యాపారి తీసుకెళుతున్న కలప లారీని కిందిస్థాయి బీట్, సెక్షన్ అధికారులు పాల్వంచ డిపోకు తరలించగా, ఈ లారీ కలపను నేరుగా అనధికారికంగా ఐటీసీకి అమ్మడం విశేషం. కిందిస్థాయి సిబ్బందిని మాత్రం ఇతర అంశాల నెపంతో పరోక్షంగా ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎఫ్ఆర్ఓల సహకారంతో కొన్నిసార్లు కలపను ఖమ్మం, సత్తుపల్లి సామిల్లులకు సైతం పంపుతుండడం గమనార్హం. ఇక రైతులకు చెందిన చేదు వేప (సాధారణ) కలప అమ్మకానికి అటవీశాఖ అనుమతులతో పనిలేదు. వీఆర్ఓ, ఎఫ్బీఓ సంతకంతో రవాణా చేయవచ్చు. దీంతో ఇటీవల ఫలానా పట్టాభూమి అనేది లేకుండా 5 లారీల వేప రవాణా చేసినట్లు సమాచారం. ఈ వేప టన్ను రూ.8 వేలు. ఒక్కో లారీకి 30 టన్నుల కలప ఉంటుంది. ధర ఎక్కువ.. చూపింది తక్కువ.. ములకలపల్లి రేంజ్ ఒడ్డుగూడెం డిపోలో ఆక్షన్ సేల్‌లో భాగంగా వెదురుబొంగు ధర ఎక్కువగా పలికినప్పటికీ.. తక్కువగా చూపారనే ఆరోపణలు ఉన్నాయి. వెదురుబొంగుకు ఒక్కొక్కటి రూ.80 ఉండగా, వేలంలో రూ.120 వచ్చినట్లు తెలుస్తోంది. కానీ పోటీ లేదని, రూ.80 మాత్రమే పలికిందని చూపడం గమనార్హం. బయట ఒక్కో వెదురుబొంగుకు రూ.180 వరకు ఉంది. దీంతో ప్రభుత్వానికి 20 నుంచి 30 శాతం ఆదాయం పోతోంది. ఇక టేకు కలప అయితే నేరుగా ఇంటికే తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్పాట్ ఆక్షన్ వద్ద ఎఫ్డీఓ ఉండి బిడ్ జాబితా రాయాల్సి ఉంటుంది. అయితే సదరు వేలందారులతో కుమ్మక్కై కార్యాలయానికి వెళ్లి రాసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలన్నీ విజిలెన్స్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులపై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై జిల్లా అటవీ అధికారి శివాల రాంబాబును వివరణ కోరగా వ్యాపారులతో కుమ్మక్కు అయినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
హైదరాబాద్‌లో అంతరాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
-
చెట్లను రక్షించారు
ఈ ఒడిషా మహిళలు తమ అడవులను స్మగ్లర్ల బారి నుంచి 20 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు దశాబ్దాల కిందట తుడిచిపెట్టుకుపోయిన అడవిని కాపాడుకునే బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. అడవులు నేలమట్టమైపోయిన నేపథ్యంలో పీర్జహానియా వన్ సురఖ్యా సమితి అనే సంస్థను స్థాపించి, అడవులను కాపాడుకుంటున్నారు. ఒడిషా, బీహార్ప్రాంతాలను తరచు తుఫాను భయం వెంటాడుతూనే ఉంటుంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన తుఫాను అడవులను నిర్వీర్యం చేసేసింది. వరదలు కొన్ని చెట్లను లాగేసుకుంటే, అడవి దొంగలు మిగిలిన చెట్లను కొట్టేస్తున్నారు. ‘‘దొంగలు వచ్చినట్లు అనుమానం రాగానే మేము మా కర్రలతో గట్టిగా నేల మీద కొడతాం, పదిమందిమి కలిసి ఒకేసారి ఈలలు వేస్తాం’ అంటారు 52 సంవత్సరాల చారులత బిశ్వాల్. వారంతా వంతులవారీగా అడవిలో తిరుగుతూ కాపలా కాస్తుంటారు. ‘‘అడవులను నరకడానికి ఎవరైనా వస్తే, మా ఈలల శబ్దాలు, మా కర్రల చప్పుళ్లు విని పారిపోతున్నారు’’ అంటారు పీర్ జహానియా వన్ సురఖ్యా సమితికి సెక్రటరీగా పనిచేస్తున్న బిశ్వాల్. 2012లో ఈ సంస్థ వారు అవార్డులు అందుకున్నారు. వారి గ్రామాన్ని కాపాడుకోవడంలో వారు చూపిన బాధ్యతను గుర్తించి ఈ అవార్డులు అందించారు. అడ్డదిడ్డంగా విస్తరించిన సరుగుడు చెట్ల కొమ్మలను నరికేసి, తక్కువ పరిధిలో విస్తరించే జీడిచెట్లను నాటుతున్నారు వీరు. ‘‘తీరంలో ఉన్న మా ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. చేతికి అందివచ్చిన పంటలు కూడా తుడిచిపెట్టుకు పోయాయి. భూములన్నీ నిస్సారమైపోయాయి. కొన్నిరోజుల పాటు తిండి లేకుండా గడపాల్సి వచ్చింది. అడవులు లేకపోవడం వల్లే ఇంత జరిగిందని అర్థమైంది. అలాగే ఇళ్ల దగ్గర కూడా చెట్లు లేకపోవడం కూడా కారణమేనని తెలిసింది. అందుకే మేమంతా అడవులను కాపాడుతామని ప్రమాణం చేశాం’’ అంటారు బిశ్వాల్.. 2001లో 70 మంది మహిళలు ఒక్క మాటగా నిలిచారు. అడవులను మేమే రక్షించుకుంటాం అని స్త్రీశక్తిని బలంగా చాటారు. ఒక్కో ఇంటి నుంచి కనీసంగా ఒకరు ముందుకు వచ్చారు. 75 హెక్టార్ల అడవిని తమ సొంత బిడ్డగా భావించుకోవడం మొదలుపెట్టారు. దేవీ నదికి దగ్గరగా ఉన్న ఈ గ్రామంలో మొత్తం 103 గృహాలు ఉన్నాయి. ఇంట్లోని మగవారంతా జీవనం కోసం సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్తుంటారు. అందుకే మహిళలు ఈ బాధ్యతను తీసుకున్నారని చెబుతారు బెహరా. రెండు రోజులకి ఒకరు చొప్పున బాధ్యతలను సమానంగా పంచుకుంటున్నారు. ఉదయం 7.30 గంటలకు వెళ్లి, మళ్లీ మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి, భోజనం చేసి, ఇంటిని చక్కదిద్దుకుని, మళ్లీ సాయంత్రం విజిల్స్ పుచ్చుకుని వెళ్లి, చీకటి పడుతుండగా ఇంటికి వస్తారు. అడవిలోకి వెళ్లడానికి మీరు భయపడరా అని ప్రశ్నిస్తే, ‘మాకెందుకు భయం, అడవి అంటే మా ఇల్లే కదా, అడవి మీద మాకు హక్కులు లేకపోయినా, దాన్ని రక్షించడం మా విధి’ అని చెబుతారు బిశ్వాల్. ప్రతి చెట్టును వీరు తమ బిడ్డగా భావిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకుంటారు. బిడ్డకు ఏదైనా జరిగితే తల్లి ఎంత బాధపడుతుందో, ఈ చెట్లకి ఏం జరిగినా వీరంతా అలాగే బాధపడతారు. ఇవి వారి జీవితంలో భాగంగా మారిపోయాయి. ఇప్పుడు వారి గ్రామం పచ్చగా కళకళలాడుతోంది. స్వచ్ఛమైన తాగునీరు దొరుకుతోంది. ఉప్పు నీటిని నిరోధించే మొక్కలను పెంచటమే ఇందుకు కారణం. పొలాలు కూడా వరదలు, ఈదురు గాలుల బారిన పడకుండా ఏపుగా పెరుగుతున్నాయి. -
సినీ ఫక్కీలో 30 మంది ఎర్రకూలీలు, స్మగ్లర్ల అరెస్ట్
చిత్తూరు, పీలేరు: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వెళుతున్న 30 మంది తమిళ కూలీలను సినీ ఫక్కీలో అరెస్ట్ చేసిన సంఘటన గురువారం సాయంత్రం పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో కలకలం సృష్టించింది. వివరాలు..ముందుగా అందిన సమాచారం మేరకు పీలేరు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, సిబ్బంది కలకడ నుంచి ఈచర్ వాహనాన్ని వెంబడించారు. స్మగ్లర్లు, కూలీలను మారణాయుధాలతో తరలిస్తున్నారనే సమాచారం అందడంతో ఆద్యంతం అనుమానం రాకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. చాకచక్యంగా పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో తుపాకులు ఎక్కుపెట్టి ఏపీ16 టీఎక్స్ 3615 నంబరు గల ఈచర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ఎటువంటి అనుమానం రాకుండా చుట్టూ టమోటా బుట్టలు పెట్టి లోన 30 మంది ఎర్ర కూలీలు, స్మగ్లర్లు ఉండటం గుర్తించారు. అలాగే అడవిలో వంట చేసేందుకు అవసరమైన వస్తు సామగ్రి, సరకులు అందులో ఉన్నాయి. తుపాకులతో చుట్టుముట్టడంతో వారి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. వారిని అటవీ కార్యాలయానికి తరలించారు. వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారో విచారణలో తెలియాల్సి ఉంది. అటవీ అధికారుల గోప్యత విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామంటూ అటవీ అధికారులు మీడియాకు చెప్పారు. డీఎఫ్ఓ నరసింహారావు ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు, సాయుధ పోలీసు సమక్షంలో విచారణ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఎర్రకూలీలు, స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం పీలేరులో చర్చనీయాంశమైంది. -
శేషాచలం అడవుల్లోకి చొరబడటానికి ప్రయత్నించిన స్మగ్లర్లు
-
అటవీ అధికారులపై కలప స్మగ్లర్ల దాడి
ఇచ్చోడ(బోథ్): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మం డలం చించోలి ఎక్స్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి కలప స్మగ్లర్లు అటవీ అధికారులపై దాడి చేశారు. ఈ సంఘటనలో టైగర్‌జోన్ ఎఫ్ఆర్వో వాహబ్ అహ్మద్, బేస్‌క్యాంప్ ఉద్యోగి శంకర్ గాయపడ్డారు. ఎఫ్ఆర్వో వాహబ్ అహ్మద్ సిబ్బందితో కలసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సిరిచెల్మ అటవీ ప్రాంతంలో కొందరు మూడు ఎడ్లబండ్లలో టేకు దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నారు. వాటిని ఇచ్చోడ అటవీ కార్యాలయానికి తరలిస్తుండగా చించోలి ఎక్స్‌రోడ్డు వద్ద కలప స్మగ్లర్లు కాపుకాసి అటవీ అధికారులపై ఒక్కసారిగా దాడి చేశారు. ఎడ్లబండ్లను తీసుకెళ్లిపోయారు. ఎఫ్ఆర్వో ఫిర్యాదు మేరకు గుండాల గ్రామానికి చెందిన అఫ్సర్, అలీంలతోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుల్లయ్య తెలిపారు. -
ఒకేరోజు ఇద్దరు స్మగ్లర్ల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా వచ్చి దేశంలోకి ప్రవేశించిన తరవాత దేశవాళీ సర్వీసులుగా మారే విమానాలు కేంద్రంగా సాగుతున్న బంగారం అక్రమ రవాణా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు గురువారం ఇద్దరు స్మగ్లర్లను పట్టుకుని కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ నిఘాకు చిక్కకుండా స్మగ్లర్లు అనుసరిస్తున్న ఈ విధానంపై కొంతకాలంగా కన్నేసిన అధికారులు వరుసగా అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. జెడ్డా నుంచి త్రివేండ్రం మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన కేరళవాసి అర కిలో బంగారాన్ని ‘రెక్టమ్ కన్సీల్మెంట్’పంథాలో తీసుకువస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. అలాగే, బహ్రెయిన్ నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్‌వాసిని పట్టుకున్న అధికారులు మరో 460 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు ఇద్దరు స్మగ్లర్లు చిక్కడం గమనార్హం. అంతర్జాతీయంగా నడిచే విమానాలపై కస్టమ్స్ తనిఖీలు ముమ్మరం చేయడంతో స్మగ్లర్లు పంథా మార్చుకున్నారు. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించే వరకు అంతర్జాతీయ సర్వీసుగా, ఆపై డొమెస్టిక్‌గా మారిపోయే విమానాలను ఎంచుకుని వాటి ద్వారా రవాణా ప్రారంభించారు. స్మగ్లింగ్ ముఠాసభ్యులు ఆ విమానం ప్రారంభమయ్యే ప్రాంతంతోపాటు దేశవాళీ సర్వీసుగా మారే ప్రాంతంలోనూ ముందే ప్రయాణికుల రూపంలో కాచుకుని ఉంటారు. సాంకేతిక పరిభాషలో వీరిని క్యారియర్లుగా పేర్కొంటారు. వీరు చిక్కినా లింకు ముందుకు సాగడం కష్టం. ఆయా దేశాల్లో ఆదాయపుపన్ను లేకపోవడంతో మనీలాండరింగ్ సమస్య ఉత్పన్నం కాదు. ఇక్కడ నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని పంపి, బంగారం కొని తీసుకువస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేరళవాసి ప్రయాణించిన విమానం అక్కడి నుంచి కేరళలోని త్రివేండ్రానికి అంతర్జాతీయ సర్వీసుగా నడుస్తుంది. ఆపై డొమెస్టిక్ సర్వీసుగా మారిపోయి హైదరాబాద్‌కు వస్తుంది. ఈ నేపథ్యంలోనే స్మగ్లర్లు దీనిని ఎంచుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అత్యధికశాతం స్మగ్లర్లు బం గారాన్ని బ్యాగుల అడుగుభాగంలో ఉండే తొడుగు లు, లోదుస్తులు, రహస్యజేబులు, బూట్ల సోల్, కార్ట న్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతోపాటు మొబైల్ చార్జర్స్‌లోనూ దాచి తీసుకువచ్చేవారు. బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపం లోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తీసుకువచ్చేవారు. తాజాగా రెక్టమ్ కన్సీల్మెంట్ జోరు గా సాగుతోందని కేరళవాసి ఉదంతం బయటపెట్టింది. స్మగ్లర్లు పట్టుబడింది ఇలా... సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు(రెక్టమ్ కన్సీల్మెంట్) చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా రెండు కిలోల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తాజా ఉదంతం స్పష్టం చేసింది. ఈవిధంగా కేరళవాసి రెక్టమ్ కన్‌సీల్‌మెంట్‌లో అర కిలో బంగారం పెట్టుకుని వచ్చి పట్టుబడ్డాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే బహ్రెయిన్ నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్ వాసి 460 గ్రాముల బంగారా న్ని బ్యాగ్ అడుగుభాగంలో దాచి తీసుకువస్తూ పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లో ఎవరికి చేరవేయడానికి వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
టాస్స్‌ఫోర్స్ లైవ్ ఆపరేషన్.. నలుగురు స్మగ్లర్ల అరెస్ట్
సాక్షి, తిరుపతి: గత కొంతకాలంగా యథేచ్చగా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన నలుగురు స్మగ్లర్లు తిరుచానూరు సమీపంలోని చైతన్యపురంలోని ఓ ఇంట్లో దాగిఉన్నారని పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌పోర్స్ అధికారులు లైవ్ ఆపరేషన్ చేపట్టారు. మొదట భారీగా సిబ్బందిని మోహరించి స్మగ్లర్లు ఉన్న ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో భయాందోళనకు గురైన స్మగ్లర్లు సిబ్బందిపై బాటిల్స్ విసిరారు. అంతేకాకుండా ఇంటిలోపలికి ప్రవేశించిన సిబ్బందిపై కత్తులతో దాడికి యత్నించారు. స్మగ్లర్ల దాడిని చాకచక్యంగా ప్రతిఘటించిన సిబ్బంది, వారిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
శ్రీవారి భక్తుల ముసుగులో అడవిలోకి స్మగ్లర్లు
తిరుపతి సిటీ: ఎర్ర స్మగ్లర్లు శ్రీవారి భక్తుల ముసుగులో కొండలోకి ప్రవేశిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఒక దశలో స్మగ్లర్లు తమ వద్ద ఉన్న ఆయుధాలు, రాళ్లతో దాడులకు దిగుతున్నారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి కొందరిని అదుపులోకి తీసుకుంటున్నారు. టాస్క్‌ఫోర్స్ ఐజీ మాగంటి కాంతారావు ఆదేశాల మేరకు ఆర్ఐ భాస్కర్ తన సిబ్బందితో కలిసి శనివారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. ఆదివారం ఉదయం నరసింగాపురం బ్రిడ్జి నుంచి లోనికి వెళ్లే మార్గంలో స్మగ్లర్ల రాకను పసిగట్టారు. సిబ్బంది అప్రమత్తమై వేర్వేరుగా విడిపోయి ముళ్లపొదల్లో మాటువేశారు. ఏడుగురు స్మగ్లర్లపై మూకుమ్మడిగా దాడి చేశారు. స్మగ్లర్లు తమ వద్ద ఉన్న ఆయుధాలు, నిత్యావసర సరుకులు పారవేసి పారిపోయారు. వారిలో తమిళనాడు వేలూరు జిల్లా తిరుపత్తూరు పుదురునాడుకు చెందిన అలిగేషన్ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా శ్రీవారి భక్తుల ముసుగులో అడవిలోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ వెంకటరమణ, ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎఫ్ఆర్వో ప్రసాద్ పరిశీలించారు. స్మగ్లర్లు అడవిలోకి వెళ్లకుండా కట్టడి చేయడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు, ఎస్పీ రవిశంకర్ ప్రత్యేకంగా అభినందించారు. -
రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగర్లు
-
పసిడికి హెన్నా టచ్!
సాక్షి, హైదరాబాద్ : కడ్డీలు.. బిస్కట్లు.. వివిధ వస్తువుల రూపంలో ఇప్పటి వరకూ పసిడి స్మగ్లింగ్‌కు పాల్పడిన ముఠాలు.. తాజాగా హెన్నా(మెహెందీ పొడి)తో బంగారాన్ని కలిపి, పేస్ట్‌లా మార్చి అక్రమ రవాణా చేసేస్తున్నాయి. ఈ గోల్డ్ పేస్ట్ స్మగ్లింగ్ కోసం శ్రీలంక రాజధాని కొలంబో నుంచి వచ్చిన ‘ఇంటర్నేషనల్–డొమెస్టిక్’ఫ్లైట్‌ను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పేస్ట్ రూపంలో తీసుకువచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. దీన్ని తీసుకువచ్చిన చెన్నై వాసిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొలంబో నుంచి నగరానికి.. కొలంబోకు చెందిన సూత్రధారులు 1,150 గ్రాముల బంగారాన్ని మెత్తని పొడిగా చేశారు. ఆ పొడి కూడా బంగారం రంగులోనే ఉండటంతో పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బంగారం పొడిని గోధుమ రంగులో ఉండే హెన్నాలో కలిపేశారు. 1,120 గ్రాముల బంగారం పొడిలో 730 గ్రాముల హెన్నాను కలిపారు. పౌడర్ రూపంలోకి మారిన బంగారం, హెన్నా మిక్స్‌ను పేస్ట్‌గా మార్చడానికి చెక్లెట్ తయారీకి వినియోగించే లిక్విడ్స్ వాడారు. ఇలా తయారైన గోధుమ రంగు పేస్ట్‌ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసిన స్మగ్లర్లు.. దాన్ని బ్రౌన్ కవర్లలో ఉంచి పైన ప్లాస్టర్లు వేశారు. ఇలా తయారు చేసిన 1,850 గ్రాముల బరువున్న 2 ప్యాకెట్లను ‘ఇంటర్నేషనల్–డొమెస్టిక్’పంథాలో శంషాబాద్‌కు పంపారు. చేతికి పసిడి అంటకుండా.. విమానంలో సీట్లు బుక్ చేసుకోవడంలో తెలివిగా వ్యవహరించిన ఈ వ్యవస్థీకృత ముఠా ‘చేతికి పసిడి’అంటకుండా పని పూర్తి చేయడానికి పథకం వేసింది. అంతర్జాతీయ సర్వీసుల్ని నడిపే అన్ని విమానయాన సంస్థలూ మార్గ మధ్యలో దేశవాళీ సర్వీసుగా మార్పును ప్రోత్సహించవు. కొన్ని మాత్రమే ఈ విధానాన్ని అవలంభిస్తున్నాయి. స్పైస్ జెట్‌కు చెందిన ఎస్జీ–1314 విమానం కొలంబో–హైదరాబాద్ మధ్య నడుస్తుంది. ఇది కొలంబోలో అంతర్జాతీయ సర్వీసుగా మొదలై మధురై వచ్చిన తర్వాత దేశవాళీ సర్వీసుగా మారుతుంది. డొమెస్టిక్ ట్రావెల్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న, అప్పటికప్పుడు కొనుగోలు చేసిన ప్రయాణికులను అంతర్జాతీయ ప్రయాణికులతో కలిపి గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ ఎయిర్‌లైన్స్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే సమయంలో కల్పిస్తున్న మరో సౌకర్యాన్ని స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పసిడి ప్యాకెట్లను సీటు కిందే వదిలి.. కొలంబో నుంచి రెండు ‘గోల్డ్ పేస్ట్’ప్యాకెట్లను తీసుకుని ఓ స్మగ్లర్ మధురై వరకు వచ్చాడు. పసిడి ప్యాకెట్లు ఉన్న హ్యాండ్ బ్యాగేజ్‌ను తన సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా విమానం దిగి కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని బయటకు వెళ్లిపోయాడు. స్మగ్లింగ్ ముఠాలో పాత్రధారిగా ఉన్న చెన్నైకు చెందిన మరో వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చే డొమెస్టిక్ ప్యాసింజర్‌గా అదే విమానం ఎక్కాడు. ఇతగాడు కొలంబో నుంచి వచ్చిన వ్యక్తి కూర్చున్న సీటులోనే కూర్చున్నాడు. విమానం హైదరాబాద్ చేరేసరికి ఈ చెన్నై వాసి దేశవాళీ ప్రయాణికుడే కావడం తో కస్టమ్స్ తనిఖీలూ లేకుండా హ్యాండ్ బ్యాగేజ్‌తో విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేయవచ్చు. ప్రత్యేక బృందం కాపు కాసి.. ఈ విమానం శనివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం చేరే వరకు అంతా స్మగ్లర్లు అనుకున్న ప్రకారమే జరిగింది. అయితే ఈ వ్యవహారంపై డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్‌కు ఉప్పందడంతో ఓ ప్రత్యేక బృందం విమానాశ్రయంలో కాపుకాసింది. ఫ్లైట్ దిగి హ్యాండ్ బ్యాగేజ్‌తో ఎరైవింగ్ హాల్ వైపు వెళ్తున్న చెన్నై వాసిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేసింది. రెండు ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని విచారించిన నేపథ్యంలో సూత్రధారులెవరో తనకు తెలియదని, కమీషన్ తీసుకుని పని చేసే తాను మధురై నుంచి హైదరాబాద్ చేరుస్తానని, ముఠాకు చెందిన రిసీవర్లే తన వద్దకు వచ్చి ప్యాకెట్లు తీసుకువెళ్తారని తెలిపాడు. ఇతడి వద్ద లభించిన రెండు ప్యాకెట్లలోని 1,850 గ్రాముల పేస్ట్‌ను ఓ గిన్నెలో వేసి కిరోసిన్ పోసి నిప్పుపెట్టగా అది పొడిగా మారింది. ఈ పొడిని కొలిమిలో కరిగించగా.. 1,120.78 గ్రాముల బంగారు బిస్కెట్ తయారైంది. దీని విలువ మార్కెట్లో రూ.34,57,606 ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ తరహా ‘గోల్డ్ పేస్ట్’కేసు హైదరాబాద్‌లో చిక్కడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు.. ఈ కేసును అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. కొన్ని విమానయాన సంస్థలు టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేప్పుడు ‘చూజ్ యువర్ సీట్’పేరుతో ప్రయాణికుడు తమకు అనువైన సీటును ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దీన్నే స్మగ్లింగ్ గ్యాంగ్స్ తమకు అనువుగా మార్చుకుంటున్నాయని తేలింది. కొలంబో నుంచి మదురై, మదురై నుంచి హైదరాబాద్ రావడానికి ముఠా సభ్యుల కోసం నిర్ణీత సమయం ముందుగానే విడివిడిగా ఒకే విమానంలో టికెట్లు బుక్ చేస్తున్నారు సూత్రధారులు. ఈ అన్ని సర్వీసుల్లోనూ ఒకే సీటును వారు ఎంచుకుని ఎటువంటి ఇబ్బందీ లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. మరికొందరు స్మగ్లర్స్ ఇదే తరహా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న అధికారులు నిఘా ముమ్మరం చేయాలని నిర్ణయించారు. -
నిర్ధాక్షణ్యంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చేశారు..
తమిళసినిమా: అగ్రనటి నయనతార. ఆమె చిత్రం అంటే వ్యాపారం పరంగా ఎలాంటి ఢోకా ఉండదు. ఇక ప్రేక్షకులు కూడా నయనతార చిత్రం అంటే ఎలాగున్నా మినిమం గ్యారెంటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. అలాంటిది ఆ నటి చిత్రంపై దర్శక నిర్మాతలు అసంతృప్తితో ఉండడం ఏమిటనేగా మీ సందేహం. ఆ కథేంటో చూసేద్దాం. నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కొలమావు కోకిల ఒకటి. ఆమె డ్రగ్స్ స్మగ్లర్‌గా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. చిత్ర నాయకి డ్రగ్స్ స్మగ్లర్ పాత్రలో నటిస్తోందన్న సమాచారం బయటకు రాగానే కొలమావు కోకిల చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది. ఇక నయనతార ప్రధాన పాత్ర పోషించిన చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. చిత్రం టీజర్ ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తోంది. అందులో నయనతారను విపరీతంగా ఒన్‌సైడ్ చేసే హాస్యనటుడు యోగిబాబు పాత్రకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతా బాగానే ఉంది. సమస్య అంతా సెన్సార్‌బోర్డుతోనే. ఈ చిత్రం సెన్సార్‌కు వెళ్లగా పూర్తిగా చూసిన సభ్యులు నిర్ధాక్షణ్యంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీంతో చిత్ర వర్గాలకు షాక్. అయితే దర్శకుడు నెల్సన్ ఎలాగో సెన్సార్ సభ్యులతో పోరాడి యూ/ఏ సర్టిఫికెట్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. అదీ కొన్ని సన్నివేశాల కట్స్ తరువాతేనట. అయితే చిత్ర నిర్మాత మాత్రం ఈ విషయంలో చాలా అప్సెట్ అయ్యారని, కొలమావు కోకిలను రివైజింగ్ కమిటీకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఆర్సీకి వెళ్లితే నయనతార చిత్రానికి యూ సర్టిఫికెట్ లభిస్తుందని నిర్మాత నమ్ముతున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. -
పెద్దఎత్తున బంగారం పట్టివేత
సాక్షి, చిత్తూరు : రేణిగుంట అటవీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట మీదుగా రాజంపేటకు బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆంజనేయపురం చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీని చేపట్టారు. అటుగా వస్తున్న టాటా సుమోను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో బంగారు బిస్కెట్లను గుర్తించారు. దీంతో వాహనంలో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా కడప వాసులుగా పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కువైట్‌లో పనిచేస్తూ సొంత ఊరికి వెళ్తామని చెప్పి సెలవు తీసుకొని ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికి ఎక్కడా అనుమానం రాకుండా పక్కా పథకం ప్రకారం స్మగ్లింగ్ చేశారన్నారు. వాహనంతో పాటు ఆరుగురిని రేణికుంట అర్బన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
ఇంట్లోనే డ్రగ్స్ అమ్ముతుందట..
తమిళసినిమా: లేడీ సూపర్‌స్టార్ నయనతార స్మగ్లర్ అవతారమెత్తారట. ఈ బ్యూటీ నటించిన చిత్రాలకిప్పుడు యమ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ చేతి నిండా అవకాశాలు ఉన్నాయి. మరిన్ని చిత్రాలు ఈ అమ్మడి కోసం వెయిటింగ్లో ఉన్నాయి. స్టార్ హీరోల చిత్రాలకు దీటుగా నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాలకు మార్కెట్ ఉంది. ఈ మధ్య అరమ్ చిత్రం సాధించిన వసూళ్లే అందుకు సాక్ష్యం. నయనతార అరమ్ చిత్రంలో ప్రజల కోసం పోరాడిన కలెక్టర్‌గా ప్రేక్షకులను అలరించారు. అలాంటి ఇమేజ్ తెచ్చుకున్న నయనతారను స్మగ్లర్‌గా చూడగలమా? చూసి తీరాల్సిందే. ఎందుకంటే తన తాజా చిత్రంలో డ్రగ్స్ స్మగ్లర్‌గా ఈ అగ్ర నటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నది తాజా సమాచారం. నయనతార నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో కొలమావు కోకిల ఒకటి. నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత భాణీలు కడుతున్నారు. అంతే కాదు ఇందులో ఒక గెస్ట్ పాత్రలో మెరవనున్నారనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల అనిరుద్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ కొలమావు కోకిల చిత్రంలో నయనతార ఇంట్లోనే మాదక ద్రవ్యాలను విక్రయించే యువతిగా నటిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమె అలా డ్రగ్స్ స్మగ్లర్‌గా ఎందుకు మారారన్నది చిత్రంలో ఆసక్తికరమైన అంశంగా ఉంటుందని చెప్పారు. ఏదేమైనా కొలమావు కోకిల చిత్రం డార్క్ హ్యూమర్ కథా చిత్రంగా అందరికీ వినోదాన్ని పంచుతుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో నయనతారతో పాటు, జాక్యూలైన్, యోగి బాబు, శరణ్య, నిషా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం నటుడు శివకార్తీకేయన్ ఒక పాటను రాయడం విశేషం. -
రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పెద్ద మొత్తంలో గురువారం ఎర్రచందనం పట్టుబడింది. జిల్లా సరిహద్దు అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు, 20 సెల్‌ఫోన్స్, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లని జిల్లా ఎస్పీ రామకృష్ణ తెలిపారు. -
రూ.35 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
సాక్షి, బీఎన్ కండ్రిగ: ఎర్రచందనం స్మగ్లర్లను బీఎన్ కండ్రిగ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరుజిల్లా పిచ్చాటూరు మండలంలోని అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుండగా బీఎన్ కండ్రిగ పోలీసులు దాడి చేసి ఐదుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరినుంచి రూ.35 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాలను కూడా సీజ్ చేశారు. -
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
వైఎస్సార్ జిల్లా : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అనేకట్ బాబు అలియాస్ వేలూరు బాబుతో పాటు అతని నలుగురు అనుచరులను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇప్పటి వరకు 500 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. వారి నుంచి 1.5 కోట్ల రూపాయల విలువ గల 37 ఎర్ర చందనం దుంగలు,3 కార్లు, ఒక టాటా సుమో, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బాబుజీ తెలిపారు. -
ఆ నలుగురితో పార్టీ పరువు గోవిందా
సాక్షి, తిరుపతి :‘నలుగురు కిడ్నాపర్లు.. స్మగ్లర్లు టీడీపీని అడ్డుపెట్టుకుని అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆ నేతలపై కఠిన చర్యలు తీసుకోండి’ అని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫి ర్యాదు చేశారు. సంక్రాంతి వేడుకలకు వచ్చిన ముఖ్యమంత్రితోపాటు మంత్రి లోకేష్‌ను పాకాల మండలం నేతలు మంగళవారం కలిశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బెల్ట్‌షాపులు నడిపేవారు, కిడ్నాపర్లు, ఎర్రస్మగ్లర్లు పార్టీలో తిష్టవేసి అరాచకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గల్లా అరుణకుమారి, బాలకృష్ణారెడ్డి పేర్లతో మండలంలో దందాలు చేస్తూ లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో రెవెన్యూ పంచాయతీరాజ్, ఎక్సైజ్ ఇలా అన్ని విభాగాల్లో మా మూళ్లు వసూలు చేస్తున్నారని, ఇవ్వని వారపై వేధింపులకు దిగుతున్నారని ముఖ్యమంత్రికి చెప్పారు. పార్టీని అడ్డంగా అమ్మేస్తున్నారని, పరువు బజారున పడిందని వివరించారు. ఆ నలుగురి కారణంగా పార్టీ కేడర్ నిస్సహాయ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి పార్టీ నుంచి బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నాగరాజనాయుడే సూత్రధారి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజనాయుడు మద్యం మాఫి యాను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈయ న మండలంలోని మిగిలిన మద్యం షాపులపై పెత్తనం చెలా యిస్తూ మాటవినని వారిపై తప్పుడు కేసులు బనాయించేలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మాట వినని అధికార పార్టీ నేతలపైనా కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వెళ్లగక్కారు. ఆయన అనుమతిలేనిదే ఎవరికీ ఎలాంటి పనులు మంజూరు చేయవద్దని మండల కార్యాలయాల్లో దౌర్జన్యానికి దిగుతున్నట్లు వివరించారు. పర్సెంటేజీ ఇస్తే తప్ప అభివృద్ధి పనులు మంజూరు కావని బహిరంగానే చెబుతున్నారని, దీంతో పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ సురేష్ బంధువు కావడంతో వీరి అరాచకాలు మితిమీరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో కిడ్నాపర్లు, స్మగ్లర్లు పాకాల మండలం టీడీపీలో కిడ్నాపర్లు, స్మగ్లర్లు పెత్తనం చెలాయిస్తున్నారంటూ చలపతినాయుడు, కిశోర్నాయుడిపై ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులుగా చెలామణి అవుతున్న వీరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఇప్పటికే పట్టుపడ్డారని చెప్పారు. మూడేళ్లుగా వీరి అరాచకాలకు అడ్డేలేకుండా పోయిందన్నారు. వీరిని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. వీరి ఫిర్యాదుపె కంగుతిన్న ఆ నలుగురు నేతలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ గల్లా అరుణకుమారి, గతంలో ఆమెకు పీఏగా పనిచేసిన బాలకృష్ణారెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు తెలిసింది. -
క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా
సాక్షి, హైదరాబాద్ : నిషేధిత క్యాట్‌ఫిష్ పిల్లల (సీడ్) అక్రమ రవాణా గుట్టును శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. మంగళవారం ఇద్దరిని అదుపులోకి తీసుకుని, 44 బాక్సుల్లో పార్శిల్ చేసిన లక్ష క్యాట్‌ఫిష్ సీడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాలుష్య కారకం కావడంతో భారతదేశంలో క్యాట్‌ఫిష్ పెంపకంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి ఈ సీడ్‌ను కర్ణాటకలోని బీదర్‌కు చెందిన స్మగ్లర్లు ఖరీదు చేస్తున్నారు. దీన్ని నేరుగా బంగ్లాదేశ్ నుంచి బీదర్‌కు తరలించే ఆస్కారం లేదు. ప్యాకెట్లలో ఉన్న ఈ సీడ్‌కు ప్రతి నాలుగు గంటలకూ ఒకసారి ఆక్సిజన్ అందిస్తూ ఉండాలి. 12 గంటల్లోనే గమ్యస్థానానికి చేర్చి చెరువులో వదిలేయాలి. దీంతో స్మగ్లర్లు ఈ సీడ్‌ను తొలుత బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు తీసుకువస్తున్నారు. అక్కడ నుంచి ప్యాసింజర్ ఫ్లైట్‌లో లైవ్ ఫిష్ పేరుతో కార్గో బుక్ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్‌కు తీసుకువచ్చిన తర్వాత రోడ్డు మార్గంలో బీదర్‌కు తరలిస్తున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు మంగళవారం ఇండిగో ప్యాసింజర్ ఫ్లైట్ కార్గోలో బుక్ చేసిన 44 కార్టన్ బాక్సుల్ని తనిఖీ చేశారు. ఇందులో క్యాట్‌ఫిష్ సీడ్ బయటపడటంతో రవాణా చేస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీటి విలువ రూ.మూడు లక్షలు ఉంటుందని, పెరిగిన తర్వాత రేటు కొన్ని రెట్లు పెరుగుతుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. -
14 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. జిల్లాలో పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 14 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
శేషాచలం అడవుల్లో మళ్లి అలజడి
-
పోలీసుల కూంబింగ్.. రెచ్చిపోయిన స్మగ్లర్లు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జ్లిలాలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాలోని చంద్రగిరి మండలం మొరవపల్లి వద్ద శుక్రవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులు కూంబింగ్‌లో ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, స్మగ్లర్లు పోలీసులపై రాళ్లు విసిరి అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో వారి కోసం పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటనా స్థలంలో 20 ఎర్రచందన దుంగలు, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
చిత్తూరు జిల్లాలో పోలీసుల కూంబింగ్
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. శ్రీవారి మెట్టు సమీపంలో శుక్రవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. పోలీసులను చూసి ఎర్రచందనం దుంగలను వదిలేసి కూలీలు పరారయ్యారు. ఘటనాస్థలంలో 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
గంజాయి రవాణ అడ్డుకునేందుకు 10 చెక్‌పోస్టులు
-
అరణ్యరోదన
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: హరితహారం పేరుతో ప్రభుత్వం ఓవైపు కోట్లాది రూపాయలు వెచ్చించి మూడేళ్లుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతుండగా, మరోవైపు అడవుల నరికివేత యథావిధిగా కొనసాగుతోంది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మొదలుకొని వరంగల్, మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వరకు అడవుల నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. అటవీ ప్రాంతంలోని గ్రామాలకు చెందిన వారితో పాటు కలప స్మగ్లర్లు విలువైన టేకు చెట్లను నరికి తరలించుకుపోతున్నారు. అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో అడవుల ధ్వంసం ప్రమాదకర స్థాయిలో సాగుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్యేగా గెలిచిన గజ్వేల్‌లో నెలనెలా రూ. కోట్ల విలువైన కలప అక్రమంగా రవాణా అవుతుండగా, భూపాలపల్లి జిల్లాకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అక్రమంగా కలప తరలివస్తోంది. ఖమ్మం, కొత్తగూడెంల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో కూడా టేకు వృక్షాలు కనుమరుగవుతున్నాయి. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, చెక్‌పోస్టులు నామమాత్రంగా మిగిలిపోవడం, స్మగ్లర్లకు సిబ్బంది సహకారం నేపథ్యంలో అడవుల్లోని భారీ వృక్షాలు స్మగ్లర్ల ద్వారా హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చేరిపోతున్నాయి. మామూళ్ల మత్తులో అటవీ అధికారులు చోద్యం చూస్తున్నారు. అభయారణ్యం నుంచే నరికివేత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని పలు మండలాల్లో అడవిని నరికి చెట్లను తరలించే కార్యక్రమం పకడ్బందీగా సాగుతోంది. ఇక్కడికి వందేళ్ల క్రితం వలస వచ్చిన ముల్తానీ కుటుంబాలతో పాటు మహారాష్ట్రకు చెందిన స్మగ్లర్లు, స్థానికులు అడవుల నరికివేతలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాళ్లపేట రేంజ్ పరిధిలోని మల్యాల, సింగరాయిపేట, తపాల్పూర్, మహ్మదాబాద్ బీట్ల నుంచి టేకు చెట్ల నరికివేత, కలప తరలింపు ప్రక్రియ సాగుతోంది. బోథ్ మండలం పరిధిలోని మర్లపల్లి, నిగిని అటవీ ప్రాంతాల నుంచి చెట్లను నరికి వేస్తున్నారు. పెంబి మండలంలోని పలు ప్రాంతాలతో పాటు తిర్యాణి, మంగి, గుండాల, ఖానాపూర్, ఉట్నూరు, ఇచ్చోడ ప్రాంతాల నుంచి కలప నరికివేత, అక్రమ రవాణా కొనసాగుతోంది. బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు, ఉట్నూర్, నార్నూర్ మండలాలలోని అడవుల్లో స్మగ్లర్లు పగటి వేళల్లో నరికే చెట్లను గుర్తించి, రాత్రివేళ్లల్లో నరికి హైదరాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు తరలిస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండానే రూ. కోట్ల విలువైన అటవీ కలప తరలిపోతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరిస్థితి రివర్స్‌లో ఉంది. ఇక్కడికి ఛత్తీస్‌గఢ్ నుంచి అక్రమంగా కలపను స్మగ్లర్లు తీసుకొస్తున్నారు. ‘చెన్నూరు అటవీ ప్రాంతంలోని దుగ్నెపల్లి జీపీ పరిధిలోని లింగంపేట అడవిలో నరికిన 40 టేకు చెట్లను దుంగలుగా మార్చి ట్రక్కులో మంచిర్యాల వైపు తరలిస్తుండగా శుక్రవారం చెన్నూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు’ కుమ్రం భీం జిల్లాలోని మామిడిపల్లి అటవీ సెక్షన్ కొత్తపల్లి బీట్ పరిధిలోని అడవిలో మామిడిపల్లి నుంచి కవ్వాల్కు రోడ్డు వేయాలన్న డిమాండ్‌తో మామిడిపల్లి గ్రామస్తులు అడవిలోని 120 టేకు వృక్షాలను నరికివేశారు. -
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
-
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
సాక్షి, కడప అర్బన్: మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఆర్కాట్ భాయ్‌తోపాటు, మరో 10 మంది స్మగ్లర్లను జిల్లాలోని మూడు పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 85 ఎర్రచందనం దుంగలు, కంటైనర్, రెండు లారీలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందన్నారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా కడపలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ వివరాలు వెల్లడించారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి పోలీస్స్టేషన్ల పరిధిలో తమిళనాడుకు చెందిన ఆర్కాట్ భాయ్, వెడి శక్తివేలు, మురగరి రామన్‌లు, చిన్నకన్ నాగరాజు, విశ్వనాథన్, గోవిందరాజు సందీప్‌కుమార్; ఓబులవారిపల్లెకు చెందిన ఆదిశేఖర్‌రెడ్డి అలియాస్ మందారపు బాబు, వై.కోటకు చెందిన పాకాల చంద్రమౌళి, చెన్నంరాజుపోడుకు చెందిన గంగరాజు వెంకటరామరాజు, గుంటుమడుగు దశరథరాజు, తలారి సుబ్బారాయుడులను పట్టుకున్నామన్నారు. వీరంతా ఎర్రచందనం దుంగలను వాహనాల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ఆర్కాట్ భాయ్.. దుబాయ్‌కి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ సాజికి ప్రధాన అనుచరుడని, దాదాపు 500 టన్నుల ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసినట్టు తెలిసిందన్నారు. పట్టుకున్న 11 మందిలో ఏడుగురు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అని పేర్కొన్నారు. వీరిని అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన రాజంపేట డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు కనుమారి సాయినాథ్, ఎస్డీ శివశంకర్ నాయక్, ఎస్ఐలు భక్త వత్సలం, బి.హేమకుమార్, కొండారెడ్డి, వెంకటేశ్వర్లు, హాజివల్లి, డాక్టర్ నాయక్, బి.నాగమురళి, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. -
అటవీశాఖ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి
ఇచ్చోడ(బోథ్): ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ సిబ్బందిపై కలప స్మగ్లర్లు మంగళవారం రాత్రి మరోసారి దాడికి దిగారు. ఈ దాడుల్లో బేస్ క్యాంప్ ఉద్యోగి సిడాం బాపురావు తలకు తీవ్రగాయాలయ్యాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్టేషన్లో గుండాల గ్రామానికి చెందిన తొమ్మిది మంది కలప స్మగ్లర్లపై పోలీసులు హత్యానేరం (307) కింద కేసులు నమోదు చేశారు. కవ్వాల్ టైగర్‌జోన్ అటవీ అధికారి వాహబ్ అహ్మద్‌కు మాల్యాల్, జుగునపూర్ సమీపంలో అక్రమ కలప రవాణా చేయడానికి స్మగ్లర్లు వాహనంతో సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అయన సిబ్బందిని అప్రమత్తం చేసి బీట్ ఆఫీసర్ రాజు, బేస్ క్యాంప్ సిబ్బందితో పెట్రోలింగ్ చేయించారు. వేకువ జామున జుగనపూర్ సమీపంలో ముసుగులు కట్టుకొని మూడు మోటార్ బైకులపై వచ్చిన స్మగ్లర్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ వాహనంపై రాళ్లతో దాడికి దిగారు. వీరు తేరుకునేలోపే వాహనంలో వెనుకలో ఉన్న సిడాం బాపురావు తలకు తీవ్రగాయమైంది. దీంతో వెళ్లిన వారంతా ఇచ్చోడకు తిరిగివచ్చారు. ఈ దాడుల్లో బైకులపై వచ్చిన దుండగులే కాకుండా పంటపొలాల్లో మరికొంత మంది స్మగ్లర్లు ఉన్నట్లు వారు తెలిపారు. ఇటీవల అటవీశాఖ సిబ్బంది కేశవపట్నం,గుండాల గ్రామాలపై మూడు సార్లు దాడులు నిర్వహించి.. కలపతో పాటు కట్టె కోత యంత్రాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పథకం ప్రకారం ఈ దాడికి దిగినట్లు భావిస్తున్నారు. -
కాకినాడ తీరంలో చమురు దొంగలు
-
అటవీ అధికారులపై స్మగ్లర్ల దాడి
జయశంకర్ భూపాలపల్లి: అటవీ శాఖ అధికారులపై కలప స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం గుర్రంపేట శివారులో మంగళవారం చోటు చేసుకుంది. చెల్పూరు అటవీ రేంజ్ అధికారి విక్రముద్దీన్ మరో నలుగురు సిబ్బందిపై స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై అటవీ సిబ్బంది వెంకటాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
అడవి తల్లికి రక్షణేదీ?
అటవీ శాఖలోని అన్ని విభాగాల్లో మంజూరైన పోస్టులు 6,882 ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య 3,511 భర్తీ కావాల్సిన ఉద్యోగాలు 3,371 ఖాళీల శాతం 48.98 సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో లక్షలాది ఎకరాల అటవీ భూమి ఆక్రమణలపాలైంది. మరోవైపు అత్యంత విలువైన అటవీ సంపద అడ్డగోలుగా దోపిడీకి గురవుతోంది. ఎర్రచందనం నిరాటంకంగా ఎల్లలు దాటి పోతోంది. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలు లారీలు, కార్లు, మినీ వ్యాన్లలో సైతం నిత్యం తరలిపోతున్నాయి. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విక్రయం కోసం ఇటీవల అటవీశాఖ టెండర్లు నిర్వహించగా నాణ్యమైన కలప టన్ను రూ.30 లక్షలు పలికింది. ఇంత విలువైన ఎర్రచందనం భారీ పరిమాణంలో శేషాచలం నుంచి తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలకు అక్రమంగా తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో స్మగ్లర్లు పంపిన ఎర్రచందనం కూలీలు అరకొరగా ఉన్న అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడిన సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అడవుల పరిరక్షణను పూర్తిగా గాలికి వదిలేసింది. నిత్యం అడవుల్లో తిరుగుతూ నిఘా కొనసాగించే క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని, ఉన్నతాధికారుల వరకు వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమే అడవి తల్లి పాలిట శాపంగా మారిందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధ టాస్క్‌ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్)కు మంజూరు చేసిన పోస్టుల భర్తీని సైతం ప్రభుత్వం పట్టించుకోకపోవడం అటవీ సంపద పరిరక్షణపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సగానికి పైగా పోస్టులు ఖాళీయే.. అటవీ భూమి, అటవీ సంపద పరిరక్షణలో క్షేత్రస్థాయిలో ఉండే ఫారెస్టు సెక్షనాఫీసర్లు (ఎఫ్ఎస్ఓ), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (ఎఫ్బీఓ), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల (ఏబీవో) పాత్ర ఎంతో కీలకం. వీరిని పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేసే ఫారెస్ట్ రేంజి ఆఫీసర్లు (ఎఫ్ఆర్ఓ), డిప్యూటీ రేంజి ఆఫీసర్లు (ఆర్ఓ)ల భూమికా ముఖ్యమైనదే. అటవీ పరిభాషలో నిర్దిష్ట ప్రాంతాన్ని బీట్ అంటారు. ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించే బాధ్యత బీట్ ఆఫీసరుదే. అటవీ ప్రాంతంలో ఎవరెవరు తిరుగుతున్నారు? టేకు, ఎర్రచందనం, బట్టగడప, రోజ్ ఉడ్ వంటి విలువైన చెట్లను ఎవరు నరుకుతున్నారు? ఎక్కడకు తరలిస్తున్నారు? ఈ దందా వెనుక ఎవరున్నారు? ఎలా అడ్డుకట్ట వేయాలి? అనే సమాచారం తెలియాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది నిత్యం అడవిలో తిరగాలి? రోజూ తిరుగుతూ పరిశీలిస్తుంటేనే ఎక్కడెక్కడ ఏయే చెట్లు ఉండాలి. ఎక్కడ ఏ చెట్లు కొట్టారు.. అనే విషయాలు తెలుస్తాయి. కానీ రాష్ట్రంలో బీట్ ఆఫీసరు కేడర్ స్ట్రెంగ్త్ (మంజూరైన పోస్టులు)లో సుమారు 40 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 60 శాతం ఖాళీలే. అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షనాఫీసరు పోస్టులు కూడా సగానికి పైగా ఖాళీ ఉన్నాయి. ఇవి మంజూరైన పోస్టుల్లో ఖాళీలు మాత్రమే. వాస్తవ అవసరాల ప్రాతిపదికన అయితే అటవీశాఖకు మంజూరు చేసిన క్షేత్రస్థాయి పోస్టుల కంటే రెట్టింపు సిబ్బంది అవసరం. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా.. క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది ఖాళీల భర్తీ కోసం అటవీశాఖ ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నాలుగేళ్ల క్రితం రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే 13 ఏపీ జిల్లాల్లో 1,256 ఎఫ్ఎస్ఓ, ఎఫ్బీఓ, ఏబీవో పోస్టుల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి రాతపరీక్ష, శరీర దారుఢ్య పరీక్షలు కూడా నిర్వహించింది. జిల్లాల వారీగా ఎంపిక పరీక్షలు పూర్తయి ఫలితాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగినా యథాతథంగా ఫలితాలు ప్రకటించి భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంఆ పరీక్షలను రద్దు చేసింది. మూడేళ్లయినా తిరిగి ఆ ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ‘ఇంట్లో బీరువాలో దాచుకున్న వస్తువులే చోరీ అవుతున్నాయి. ఇక అడవి అనేది బహిరంగ కోశాగారం లాంటిది. ఇందులో విలువైన కలప స్మగ్లింగ్‌ను నిరోధించాలంటే పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం. అయితే దురదృష్టవశాత్తూ రాష్ట్ర అటవీశాఖలో ఉండాల్సిన సిబ్బందిలో నాలుగోవంతు కూడా లేరు. కేడర్ స్ట్రెంగ్త్‌ను రెండింతలు చేయాల్సిన అవసరం ఉంటే మంజూరైన పోస్టుల్లోనే సగం ఖాళీలుంటే ఎలా..’ అని ఒక సీనియర్ అటవీశాఖ అధికారి ప్రశ్నించారు. ఇక ‘శేషాచలం అడవుల్లో ఎర్రచందనం పరిరక్షణ కోసం పది సాయుధ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి 605 మందిని నియమించాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. స్మగ్లింగ్ నిరోధ టాస్క్ఫోర్సులో సగం ఖాళీలు అలాగే ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏముంటాయి..’ అని కా అధికారి ప్రశ్నించారు. -
పైన మొక్కజొన్న.. కింద గంజాయి..
- ఓఆర్ఆర్పై 300 కేజీల గంజాయి పట్టివేత - విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి రవాణా - ఐదుగురి అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురు హైదరాబాద్: పైన మొక్కజొన్న సంచులు.. కింద గంజాయి బ్యాగ్‌లు.. మాదకద్రవ్యాల రవాణా కోసం స్మగ్లర్లు ఎన్నుకున్న మార్గమిది. బుధవారం ఔటర్ రింగ్ రోడ్డుపై బొలేరో వాహనంలో తరలిస్తున్న 300 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. బుధవారం శంషాబాద్ డీసీసీ పీవీ పద్మజ విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారం రోజులుగా ఔటర్‌పై ఆర్జీఐఏ పోలీసులతో పాటు ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో అనుమానాస్పదంగా వెళుతున్న బొలేరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనం లోడులో పై భాగం మొత్తం మొక్కజొన్న సంచులతో నింపి.. కింది భాగంలో 11 బ్యాగుల్లో తరలిస్తున్న 300 కేజీల గంజాయి గుట్టు రట్టయ్యింది. విశాఖ జిల్లా చింతపల్లి తొటమామిడి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌రావు, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ గ్రామానికి చెందిన పరుశురాంతో గంజాయిని స్మగ్లింగ్ చేసే విషయంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి బొలేరో వాహనంలో మూడు క్వింటాళ్ల గంజాయిని బ్యాగుల్లో సర్దుకుని, దానిపై భారీగా మొక్కజొన్న సంచులను వేసుకుని విశాఖ జిల్లా కోడుగుమ్మడి గ్రామానికి చెందిన తంబెల్లి చందర్రావు(24), తుని మండలానికి చెందిన జొక్కన్న శ్రీను బయలుదేరారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన మోహన్(20), సీహెచ్ వెంకట్(29) ఇండికా కారులో పరుశురాం సూచనల మేరకు సూర్యాపేట నుంచి బొలేరో వాహనానికి పైలట్‌గా వస్తూ పోలీసు తనిఖీల గురించి బొలేరోలో ఉన్న వారికి సమాచారం అందిస్తున్నారు. శంషాబాద్ కొత్వాల్‌గూడ పరిధిలోకి వచ్చిన వీరి వాహనాలను పోలీసులు తనిఖీ చేయడంతో గంజాయి రవాణా గుట్టు రట్టయింది. రూ.30 లక్షల విలువ చేసే 300 కేజీల గంజాయితో పాటు రెండు వాహనాలు, రూ.4,250 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చందర్రావు, శ్రీను, మోహన్, వెంకట్‌తోపాటు విశాఖ వాసి బొంతల నాగులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. లక్ష్మణ్‌రావు, పరుశురాంతో పాటు విశాఖ వాసి తంబెల్ల సురేశ్ పరారీలో ఉన్నారు. -
‘180 మందిని సముద్రంలోకి తోసేశారు’
దుబాయ్: యెమెన్ సమీపంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. స్థానిక అధికారులు అరెస్టు చేస్తారన్న భయంతో స్మగ్లర్లు అక్రమంగా యెమెన్‌కు తరలిస్తున్న 180 మంది ఆఫ్రికన్లను సముద్రంలోకి తోసేయడంతో ఆరుగురు మృతి చెందగా..దాదాపు 50 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం గాయాలతో యెమెన్ దక్షిణ తీరానికి చేరుకున్న 25 మంది శరణార్థులకు చికిత్స అందిస్తున్నట్లు ఐరాస అంతర్జాతీయ వలస వ్యవహారాల సంస్థ(ఐఓఎం) తెలిపింది. శరణార్థుల్లో ఇథియోపియోకు చెందిన యువతీయువకులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. బుధవారం కూడా మనుషులను అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్లు యెమెన్ తీరం సమీపంలో సోమాలియా,ఇథియోపియాకు చెందిన 120 మంది శరణార్థులను సముద్రంలోకి తోసేయడంతో 50 మంది మృతి చెందగా, 22 మంది గల్లంతయ్యారని ఐఓఎం పేర్కొంది. తీరానికి కొట్టుకువచ్చిన 29 మృతదేహాలను మిగిలిన శరణార్థులు పూడ్చిపెట్టారని వెల్లడించింది. -
రెండు క్షణాలు ఆలస్యమైతే...!
రెండే రెండు క్షణాలు... ఆ రెండు క్షణాలు ఆలస్యమైతే.. ఘోరం జరిగేది. మూడు నిండు ప్రాణాలు పోయేవి. అప్రమత్తతే ఆదుకుంది. అసలేం జరిగిందంటే... అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలంలో కలప స్మగ్లర్లు బరితెగింగించారు. చివరకు, పోలీస్ జీపుపైకి వ్యానుతో దూసుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో గురువారం తెల్లవారుఝామున ఇది జరిగింది. అశ్వారావుపేట ఏఎస్ఐ శంకర్ తెలిపిన వివరాలు.. గురువారం తెల్లవారుఝామున సుమారు మూడు గంటలు. ఏఎస్ఐ శంకర్, హోంగార్డులు ఐతపు వెంకటరమణ, వెంకటేశ్వర్లు (డ్రైవర్)కలిసి బస్టాండ్ పక్కనున్న బ్రాందీ షాపు వద్ద తనిఖీ నిర్వహించారు. వారి జీపు ముందుకు వెళుతోంది. సరిగ్గా అదే సమయంలో వినాయకపురం రోడ్ నుంచి వోల్వో స్టిక్కర్‌తో ఐషర్ వ్యాన్ వాయు వేగంతో దూసుకొస్తోంది. పోలీస్ జీప్ డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమయ్యాడు. ప్రమాదం తప్పింది. పోలీస్‌స్టేషన్ ముందు నుంచే ఆ వ్యాన్ మెరుపు వేగంతో దూసుకెళ్లింది. దానిని జీపులతో పోలీసులు వెంబడిస్తున్నారు. కొద్ది దూరం వెళ్లగానే డీజిల్ అయిపోయింది. వెంటనే కిందికి దిగి, అటుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఆపి, వాటిపై వెంబడించారు. కాకతీయ గేటు వద్ద ఆ వ్యానును అడ్డగించారు. నంబర్ లేదు.. సామాన్లు లేవు.. ఆ వ్యానులో బాడీలో కేవలం ఆరు నారవేప దుంగలు (ఒక్కోటి మీటర్ వెడల్పు, రెండు మీటర్ల పొడవు,. వీటి విలువ రూ.2.50లక్షలు) ఉన్నాయి. నంబర్ ప్లేట్ లేదు. ఈ దుంగలను రాజమండ్రికి తరలించేందుకు మండలంలోని ఆసుపాకకు చెందిన ఓ ముఠా రవాణా చేస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. పోలీసులను చూడగానే ఆ వ్యానులోని వారు కిందకు దూకి చీకట్లో పారిపోయారు. జరిగినదంతా అశ్వారావుపేట ఎస్ఐ సురేష్‌కు తెతిపారు. ఇంతలో అటవీ సిబ్బంది వచ్చారు. వ్యాన్ గేర్ రాడ్ ఊగిపోతూ న్యూట్రల్లో ఉందా... గేర్‌లో ఉందా తెలియని పరిస్థితి. బ్రేక్, ఎక్సలరేటర్, క్లచ్‌లకు కనీసం పెడల్స్ కూడా లేవు. స్టీరింగ్ ఊగుతోంది. ఎంత ప్రయత్నించినా వ్యాన్ స్టార్ట్ కాలేదు. క్రేన్ సాయంతో దానిని తెల్లవారుఝామునే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అశ్వారావుపేట రేంజర్ మక్తార్ హుస్సేన్‌కు ఆ కలప వ్యానును పోలీసులు అప్పగించారు. గుండె ఆగినట్టయింది... జీపు మీదకు వ్యాన్ దూసుకురావడంతో ఒక్కసారిగా గుండె ఆగినట్టయిందని పోలీసు సిబ్బంది ‘సాక్షి’తో చెప్పారు. తమ డ్రైవర్ వెంకటేశ్వర్లు ఏమాత్రం ఏమరుపాటు ఉన్నా.. తమ ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసేవేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. -
హెరిటేజ్ వ్యాన్‌లో ఎర్రచందనం దుంగలు
తిరుపతి: ఎర్రచందనం స్మగ్లంగ్ కొంతపుంతలు తొక్కుతోంది. ఏకంగా హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. తిరుపతి టాస్క్ఫోర్క్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. హెరిటేజ్ వాహనాలను ఎర్రచందనం రవాణాకు ఉపయోగిస్తున్నారని చాలా రోజుల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే అనుమానాలు నిజం చేస్తూ హెరిటేజ్ వాహనాన్ని స్మగ్లర్లు అక్రమ రవాణాకు ఉపయోగించారు. వివరాలు.. తిరుపతి శివారులో గ్రాండ్ వరల్ఢ్ జీవకోన అటవీప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి నుంచి కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తారసపడ్డారు. పోలీసులను గమనించిన స్మగ్లర్లు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దాదాపు వంద మంది ఎర్రచందనం స్మగ్లర్లు వాహనాలు వదిలి పరారయ్యారు. అయితే స్మగ్లర్లు వదిలి వెళ్లిన వాహనాలు హెరిటేజ్ సంస్థకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. కాగా హెరిటేజ్ వాహనంలో దుంగల రవాణాపై పోలీసులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. పట్టుబడిన వాహనాలు రెండు నంబర్లతో రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. ఒకటి ఏపీకి సంబందించిన రిజిస్ట్రేషన్ కాగ, మరొకటి తమిళనాడుది గా గుర్తించారు. తమిళనాడుకు చెందిన రిజిస్టర్ నంబర్ కనిపించకుండా స్మగ్లర్లు పెయింటింగ్ వేశారు. అయితే ఈ అంశంపై పోలీసులు పూర్తి సమాచారం సేకరించేందుకు విచారణ చేపట్టారు. -
25 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్
మర్రిపాడు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడు అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో గురువారం వేకువజామున అడవిలో గాలింపు చేపట్టిన పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దీంతో 25 మంది కూలీలను అరెస్ట్ చేసి.. 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు కూలీలు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ చీకటిలో వంతెన పై నుంచి కిందకు దూకడంతో గాయపడ్డారు. కూలీలందరూ తమిళనాడుకు చెందినవారేనని పోలీసులు తెలిపారు. వీరు మూడురోజుల క్రితమే అడవిలోకి వచ్చినట్లు సమాచారం. -
200 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: విశాఖ జిల్లా మాడుగుల మండలం సాగరం వద్ద సోమవారం భారీగా గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. పోలీసులను గుర్తించిన స్మగ్లర్లు కారును వేగంగా పక్కకు తిప్పడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ముగ్గురు స్మగ్లర్లు అక్కడి నుంచి పరారు కాగా పోలీసులు కారుతో పాటు 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. -
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లర్లకు జిల్లాలో మరో ఎదరుదెబ్బ తగిలింది. మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో పీలేరు, సత్యవేడు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సహాయంతో రెండు ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగుల్లో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 వాహనాలు( 1 లారీ, 1 కారు, 4 మోటారు సైకిళ్లు), సుమారు 1.5 టన్నుల బరువైన 48 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అబ్దుల్ రహమాన్ అనే అంతర్జాతీయ స్మగ్లర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ జి. శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
అడవి నిండా స్మగ్లర్లే
►వారాల తరబడి కొండా కోనల్లో మకాం ►అదును చూసి వన సంపదపై వేటు ►నలు దిశలా యథేచ్ఛగా అక్రమ రవాణా ►టాస్క్‌ఫోర్స్ కదలికలపై స్మగ్లర్ల ముందస్తు నిఘా ►ఎదురు పడితే దాడి... క్షణాల్లో కనుమరుగు ►రాత్రింబవళ్లూ కొనసాగుతున్న కూంబింగ్ అడవి తల్లి కన్నీరు పెడుతోంది. కొండల మధ్య పెరుగుతున్న ఎర్ర కూలీల అరాచకాలకూ, అక్రమ రవాణాకు తల్లడిల్లుతోంది. టన్నుల కొద్దీ తరలిపోతున్న ఎర్రచందనాన్ని కాపాడుకోలేక విలవిలలాడుతోంది. పోలీసుల కూంబింగ్ జరుగుతున్నా తెలివిగా తప్పించుకుంటోన్న స్మగ్లర్ల మాయాజాలానికి మూగగా రోదిస్తోంది. మారుతున్న మంత్రులు, ఏడాదికోసారి జరిపే సమీక్షలు, తీసుకునే నిర్ణయాలూ స్మగింగ్ను ఏ మాత్రం ఆపలేకపోతున్నాయని పదేపదే ఆక్రోశిస్తోంది. తిరుపతి : స్మగ్లర్ల గొడ్డళ్ల వేటుకు శేషాచలం నిలువెల్లా వణికిపోతోంది. తిరుపతి, భాకరాపేట, పీలేరు, తలకోన, కరకంబాడి ప్రాంతాలతో పాటు కడప జిల్లా రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో శేషాచలం విస్తరించి ఉంది. రెండు వారాలుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో టాస్క్‌ఫోర్స్, పోలీస్, అటవీ పోలీసుల తనిఖీలు పగటి పూట తగ్గాయి. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళ స్మగ్లర్లు వ్యూహాత్మకంగా అడవిలోకి ప్రవేశిస్తున్నారు. తమిళనాడు నుంచి బస్సుల్లో, కారుల్లో వచ్చే వందలాది మంది ఎర్ర కూలీలు, స్మగ్లర్లు వాటర్ బాటిళ్లు, బియ్యం. పప్పు, బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్, తినుబండారాలతో పాటు పదునైన గొడ్డళ్లు, రంపాలతో అడవిలోకి ప్రవేశిస్తున్నారు. ప్రధానంగా భాకరాపేట, శ్రీవారిమెట్లు, కరకంబాడి, మామండూరు ప్రాంతా ల్లో ఉన్న కాలి బాటల ద్వారా ఫారెస్టులోకి ప్రవేశిస్తున్న స్మగ్లర్లు మేకలిబండ, సచ్చినోడిబండ, చీకటీగలకోన ప్రాంతాల్లోని కొండ రాళ్లు, చిన్నచిన్న గుహల్లో రోజుల కొద్దీ తలదాచుకుంటూ పగటి పూట ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారు. సుమారు 10 నుంచి 20 చెట్లు నరికాక వాటిని రవాణా చేసే పనుల్లో పడుతున్నారు. అక్రమ రవాణా సమయంలో పోలీసులు ఎదురు పడితే దుంగలను కింద పడేసి అడవిలోకి పారిపోతున్నారు. రోజుకు వంద మందికి పైగా ఎర్ర కూలీలు అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారని అంచనా. అన్ని ప్రాంతాల్లోనూ సుమారు వెయ్యిమందికి పైగా ఎర్ర కూలీలు అడవిలోనే ఉంటారని పోలీసుల అంచనా. పారిపోయే వారే ఎక్కువ... శేషాచలంలో తిరుపతి టాస్క్‌ఫోర్స్ కూంబింగ్ పెరిగింది. మొత్తం 4 బృందాలు ఆయుధాలతో అడవిలో స్మగ్లర్ల కోసం జల్లెడ పడుతున్నాయి. అయితే వీరి రాకను ముందే పసిగడుతున్న స్మగ్లర్లు పోలీసుల కన్నుగప్పి రాళ్లు, గుబురు చెట్ల మధ్య తలదాచుకుంటున్నారు. కొంత మంది తప్పించుకోలేక పోలీసులకు చిక్కుతున్నారు. అయితే పోలీసులకు దొరికేవారి కంటే తప్పించుకుని అడవిలోకి పారిపోయే వారే ఎక్కువ. పటిష్ట ప్రణాళికలు కరువు... ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను నిలువరించే విషయంలో ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. పటిష్టమైన ప్రణాళికలు లేకపోవడం, సరిపడ సిబ్బందిని, ఆయుధాలను సమకూర్చలేకపోవడమే కారణమని తెలు స్తోంది. తిరుపతి టాస్క్ఫోర్సుకు కేటాయించిన సిబ్బందిని పూర్తిగా సమకూర్చే విషయంలో సర్కారు మూడేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఈ లోగా ఇటీవలనే అటవీ శాఖకు కొత్త మంత్రి వచ్చారు. సీఎంతో చర్చించిన మీదట అదనపు బలగాల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ఈ లోగా జరగాల్సిన స్మగ్లింగ్ మొత్తం జరుగుతూనే ఉంది. దుంగలు రోజూ దొరుకుతూనే ఉన్నాయ్... రోజూ ఎక్కడో ఒక చోట టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న ఎర్ర చందనం దుంగలు పెరిగిన స్మగ్లింగ్‌ను తేట తెల్లం చేస్తున్నాయి. దుంగలు దొరుకుతున్నాయి గానీ, వాటిని రవాణా చేసే ఎర్ర కూలీలు, స్మగ్లర్లు మాత్రం దొరకడం లేదు. దీంతో కోట్ల విలువ చేసే వన సంపద యథేచ్ఛగా సరిహద్దులు దాటుతూనే ఉంది. దీనికి ముగింపు ఎలా పలకాలో పోలీసులకు అర్థం కావడం లేదు. -
14 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
కడప: జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 14 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 627 కిలోల బరువున్న 41 ‘ఎర్ర’ దుంగలతో పాటు 10 సెల్ఫోన్లు, 2 కార్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ సత్య ఏసుబాబు వివరాలు తెలిపారు. పట్టుబడిన వారిలో అంతర్జాతీయ స్మగ్లర్ సాహూల్‌భాయ్ ప్రధాన అనుచరుడు శివలింగం శ్రీధర్‌తో పాటు అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఇక్రం భాయ్ ఉన్నట్లు ఆయన తెలిపారు. -
ఆగని దందా
ఇసుక దందా ఆగడం లేదు. పోలీసుల మామూళ్లు ఆగడం లేదు. స్వర్ణముఖి, కాళంగి నదుల నుంచి ఇసుకను తరలిస్తూ స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. ఇది ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు పోలీస్స్టేషన్లకు కూడా వరంగా మారింది. తడ, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా పరిధిలోని వరదయ్యపాళెం మండలాల్లో పలు ప్రాంతాలను డంపింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసుకున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లలో తమిళనాడుకు ఇసుకను తరలిçస్తూ రూ.లక్షలు దోచుకుంటున్నారు. సూళ్లూరుపేట : పగలంతా ట్రాక్టర్లు ద్వారా డంపింగ్ కేంద్రాలకు ఇసుక తరలించుకుంటున్నారు. రాత్రి 8 గంటలైతే చాలు జేసీబీలతో తమిళనాడుకు చెందిన లారీలకు లోడ్ చేసి ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలతోనే చిత్తూరుజిల్లా ఏర్పేడులో 16 మంది బలైన విషయం తెలిసిందే. తడ మండలం సరి«హద్దుల్లోని ఆరంబాకం, కారూరు, పూడి, మాంబట్టు అపాచీ వెనుక భాగాన టీడీపీ చోటా నాయకులే డంపింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఎవరిదైనా ట్రాక్టరు పట్టుకుంటే చాలు టీడీపీ నేతలు అధికారులకు ఫోన్ చేసి మనోడే వదిలేయండి హుకుంజారీ చేస్తున్నారు. దీంతో అధికారులు కూడా తమకెందున్నట్గు వ్యవహరిస్తున్నారు. ఉచితంగా ఇసుక తీసుకోవచ్చుననే ప్రభుత్వ ప్రకటన అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో పట్టపగలు పబ్లిగ్గానే ఇసుకను తరలిస్తున్నారు. తమిళనాడులో నిబంధనలు కఠినతరం తమిళనాడులో ఎక్కడా ఇసుక తవ్వకూడదనే నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో ఆంధ్రా నుంచి వెళ్లే ఇసుక మీదే ఆధారపడి భవన నిర్మాణాలు చేస్తున్నారు. నాయుడుపేట, శ్రీకాళహస్తి, పెళ్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాల నుంచి శ్రీసిటీ, రామాపురం పేరుతో పగలూ రాత్రి తేడా లేకుండా సుమారు రోజుకు 400 ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రా–తమిళనాడు సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో డంపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి లారీల్లో ఇసుకను చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు తదితర పట్టణాలకు రవాణా చేస్తున్నారు. ఆంధ్రా ఇసుకకు డిమాండ్ జిల్లాలోని స్వర్ణముఖి, కాళంగి నది ఇసుకకు తమిళనాడులో డిమాండ్ ఉండటంతో అక్రమ రవాణా పెరిగిపోయింది. ఆంద్రా–తమిళనాడు సరిహద్దులోని ఆరంబాకంలో పెన్నా, స్వర్ణముఖి ఇసుక టన్ను రూ.450 నుంచి రూ.500 కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు 6 నుంచి 8 టన్నుల దాకా లోడ్ చేసుకుని వెళుతున్నారు. చెరకు రవాణా చేస్తే ట్రాలీలో అయితే 20 టన్నుల ఇసుకను లోడ్ చేసుకుని వెళుతున్నారు. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి నగరాల్లో ఒక్క లారీ ఇసుక రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు పలుకుతోంది. దీంతో తమిళనాడుకు చెందిన వ్యక్తులు కొంతమంది సూళ్లూరుపేట, వరదయ్యపాళెం మండలాల సరి«హద్దులోని సంతవేలూరు రోడ్డు సమీపంలోని మంగళంపాడు చెరువుకు సమీపంలో రెండు డంపింగ్ కేంద్రాల నుంచి లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. మామూళ్లు మత్తులో జోగుతున్న పోలీసులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టులను ఎత్తేశారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించినపుడు తొలుత తడ పోలీస్‌స్టేషన్ ముందు తనిఖీ పాయింట్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత తడ మండలం పన్నంగాడు వద్ద ఏఆర్ పోలీసులు, స్థానిక పోలీసులను మమేకం చేసి నిఘా ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టు పెట్టిన కొద్ది రోజులు అందరూ భయంగానే వ్యవహరించారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు తడ, సూళ్లూరుపేట పోలీసులతో మాట్లాడుకుని నెల మామూళ్లు ఏర్పాటు చేసుకుని లారీలతో రవాణా చేయడం ప్రారంభించారు. రవాణాలో పోలీసులే కొంత వెసులుబాటు కల్పిస్తూ రావడంతో నాయుడుపేట, వాకాడు, కోట, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ నుంచి ట్రాక్టర్లు ద్వారా శ్రీసిటీ పేరుతో ఆరంబాకం దాకా ఇసుక తరలించడం ప్రారంభించారు. ఆ తరువాత నెమ్మదిగా తెలుగు తమ్ముళ్ల జోక్యం పెరిగింది. ఇదే అదునుగా చేసుకున్న పోలీసులు సరిహద్దు చెక్‌పోస్టును నెమ్మదిగా ఎత్తేశారు. ఒక ట్రాక్టర్‌కు నెలకు దొరవారిసత్రం పోలీస్‌స్టేషన్, సూళ్లూరుపేట పోలీస్‌స్టేసన్‌లో రూ.3,200 లెక్కన మామూళ్లు ఏర్పాటు చేసుకున్నారు. తడ పోలీస్‌స్టేషన్‌లో నెలకు రూ.5,200 లెక్కన నెలకు సుమారుగా 300 నుంచి 350 ట్రాక్టర్ల వరకు నెల మామూళ్లు చెల్లిస్తున్నారు. తడ చెక్‌పోస్టులో ఒక ట్రాక్టర్‌కు నెలకు రూ.5వేలు లెక్కన వసూలు చేస్తున్నారు. ఈ మొత్తంలో ఎవరి వాటా ఎంత అనేది సూళ్లూరుపేట సీఐ, తడ ఎస్సైలకే తెలియాలి. ఇదే తరహాలో ఇసుక అక్రమ రవాణా జరిగితే స్వర్ణముఖి, కాళంగి నదుల్లో ఇసుక కనుమరుగైపోయి భవిష్యత్తులో భూగర్భజలమట్టం భారీగా పడిపోయే అవకాశం ఉంది. -
ఒకే ఫ్లైట్‌లో ఇద్దరు నగర స్మగ్లర్లు!
2 కిలోల బంగారంతీసుకువచ్చిన వృద్ధురాలు 366 గ్రాములు తెచ్చిన మరో మహిళ అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు ఒకే విమానంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు స్మగ్లర్లను బుధవారం రాత్రి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.70.98 లక్షలు విలువైన 2.366 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జెడ్డా నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఇద్దరు మహిళలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరిలో ఒకరైన 60 ఏళ్ల వృద్ధురాలు విమానాశ్రయంలో అనుమానాస్పదంగా సంచ రించడాన్ని కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు గుర్తించారు. అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా... వస్త్రాల్లో దాచుకున్న రెండు కేజీల బంగారం బయటపడింది. వృద్ధురాలిని క్యారియర్‌గా వాడుకున్న సూత్రధారులు ఒక్కోటి కేజీ బరువున్న బిస్కెట్‌ను మూడేసి ముక్కలు చేసి జెడ్డాలో అప్పగించారని బయటపడింది. దీన్ని హైదరాబాద్ చేరిస్తే కొంత మొత్తం కమీషన్ ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్యారియర్ ఫొటోను వాట్సాప్ ద్వారా ఇక్కడున్న రిసీవర్లకు సూత్రధారులు పంపారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే తమ వాళ్లే వచ్చి బంగారం తీసుకుని నగదు చెల్లిస్తా రంటూ వృద్ధురాలికి చెప్పారు. ఈ రిసీవర్ల కోసం వెతుకుతున్న నేపథ్యంలోనే వృద్ధురాలు కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఇదే విమానంలో వచ్చిన మరో మహిళ సైతం తన దుస్తుల్లో 366 గ్రాముల బంగారం దాచుకుని వచ్చింది. నగరానికే చెందిన ఈమెను సైతం అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ మహిళ వ్యక్తిగతంగానే బంగారం తీసుకు వస్తున్నట్లు అనుమా నిస్తున్నారు. వృద్ధురాలికి బంగారం ఇచ్చిన సూత్రధారులు, ఇక్కడ దాన్ని తీసుకునే రిసీవర్ల కోసం కస్టమ్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. -
రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం..
చిత్తూరు క్రైం: కర్ణాటక రాష్ట్రంలోని మాలేరులో రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను చిత్తూరు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన జ్యోతి(43), ఆమె భర్త నాగేంద్ర, వేలూరులో బీటెక్ చదువుతున్న ఆమె ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరిని పోలీసులు సోమవారం ఉదయం వేలూరులో అరెస్టు చేశారు. వీరంతా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరారు. వీరిని చిత్తూరు తరలించిన పోలీసులు ఎస్పీ సమక్షంలో విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు.