టాస్క్‌ఫోర్సు పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు
చంద్రగిరి: చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం రైల్వే గేటు వద్ద సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్సు పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు.
వివరాలు.. టాస్క్‌ఫోర్సు ఆర్‌ఎస్‌ఐ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు, అటవీ శాఖాధికారులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నరసింగాపురం రైల్వే గేటుకు సమీపంలో 50మందికిపైగా స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూ ఎదురుపడ్డారు. వీరిని పట్టుకునేందుకు యత్నించిన టాస్క్‌ఫోర్సు పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు కూడా గట్టిగా ఎదుర్కోవడంతో దుంగలను వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. 48 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.