Red sandal
-
పెద్దిరెడ్డిపై దుష్ప్రచారం.. పవన్‌కు నాగార్జున యాదవ్ కౌంటర్
తాడేపల్లి: నేపాల్‌లో దొరికిన ఎర్ర చందనం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోణలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్.‘నేపాల్‌లో దొరికిన ఎర్ర చందనం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్లు దుష్ర్పచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై పవన్ ఆరోపణలు సరికాదు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలోనే ఎర్రచందనం అక్రమ రవాణా జరిగింది. పదేళ్ల క్రితమే ఎర్రచందనం దొరికింది. నేపాల్, మలేషియాతో పాటు ఇతర దేశాల్లో దాదాపు 8 వేల టన్నుల ఎర్ర చందనం దొరికింది. వాటిని ఏపీకి తెప్పించేందుకు జగన్ సర్కారు ఎన్నోసార్లు కేంద్రానికి లేఖలు రాసింది.కావాలంటే పవన్ ఆ శాఖలోనే ఉన్న లెటర్లను చదువుకోవాలి. పవన్‌కి కేంద్రంలో పలుకుబడి ఉందని చెప్పుకుంటున్నారు కదా?. మరి ఆయా దేశాల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఏపీకి తెప్పించాలి. దాన్ని వేలం వేస్తే వచ్చే డబ్బు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది’ అని ధీటుగా బదులిచ్చారు నాగార్జున యాదవ్,. -
‘ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్’ ముందు ఎర్ర చందనం వెలవెల..
ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అత్యుత్తమ ఫర్నిచర్‌ను సమకూర్చుకోవాలని అనుకుంటారు. ఖరీదైన కలప విషయానికొస్తే భారతదేశంలో ఎర్ర చందనం అత్యంత ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే ప్రపంచంలో దీనికి మించిన ఖరీదైన కలప మరొకటుంది. అదే ఆఫ్రికన్ బ్లాక్ కలప. దీని ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. ఆఫ్రికన్ బ్లాక్ కలపను అత్యంత విలువైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ప్రపంచంలో అతి అరుదుగా దొరుకుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ కలప ప్రపంచంలోని 26 దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఆఫ్రికన్ బ్లాక్ చెట్టు పూర్తిగా అభివృద్ధి చెందడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టు ఎక్కువగా ఆఫ్రికన్ ఖండంలోని మధ్య, దక్షిణ భాగాలలో పెరుగుతుంది. ఈ కలప ధర కిలో రూ.7 నుంచి 8 వేల వరకూ పలుకుతుంది. ఫర్నిచర్‌తో పాటు, షెహనాయ్, వేణువుతో సహా పలు సంగీత వాయిద్యాలను ఈ చెక్కతో తయారు చేస్తారు. అత్యంత ధనవంతులు తమ ఇంటిని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఈ కలపను ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ కలపకున్న డిమాండ్, ధరను దృష్టిలో పెట్టుకుని స్మగ్లర్లు ఈ కలపను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్‌ను రక్షించేందుకు కెన్యా. టాంజానియా తదితర దేశాలలోని ప్రభుత్వాలు సాయుధ బలగాలను వినియోగిస్తున్నాయి. -
ఫ్రెంచ్ వెబ్ సిరీస్‌లో తెలుగు జర్నలిస్ట్
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి గురించి కానీ, ఆయన రచించిన 'బ్లడ్ సాండర్స్ - ది గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్' గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే తెలుగు పాఠకులకు సుపరిచయమైన సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై రచించిన ఈ పరిశోధనాత్మక రచనను గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఇన్విస్టిగేషన్ జర్నలిజంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న హైదరాబాద్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఇప్పుడు అరుదైన ఘనతను సాధించారు. ఈయన ఫ్రెంచ్ భాషలో త్వరలో విడుదల కానున్న డాక్యుమెంటరీలో లీడ్ క్యారెక్టర్ చేశారు. తిరుమల అడవుల నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న ఎర్రచందనం గురించి ఈయన పుస్తక రూపంలో బయటపెట్టారు. ఎంతో మంది పోలీస్ అధికారులు, అటవీ శాఖ అధికారుల అభిప్రాయాలతో ఈ పుస్తకాన్ని సమగ్రంగా మలిచారు. సుధాకర్ రెడ్డి త్వరలో ప్లానెట్ కిల్లర్స్ వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. ప్రపంచంలో ప్రకృతిని నాశనం చేస్తున్న అంతర్జాతీయ క్రిమినల్స్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంటోంది. ఇందులో ప్రధానంగా అడవులను నరికివేయడం, ఏనుగులను చంపి దంతాలను దొంగిలించడం, ఎర్రచందనం వంటి వాటిపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీలను రూపొందించారు. 2023 ఏప్రిల్ 3వ తేదీన ఈ డాక్యుమెంటరీ ఫ్రెంచ్ టీవీలో విడుదలకానున్నట్లు సమాచారం. ఇందులో సుధాకర్ రెడ్డి పాత్ర కూడా ఉంది. ఇది నిజంగా తెలుగు జర్నలిస్టులకు దొరికిన అరుదైన, అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. ఈ డాక్యుమెంటరీలో ఎర్రచందనం స్మగ్లర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సాహుల్ హమీద్‌పై ప్రత్యేకంగా కథనాన్ని రూపొందించారు. సాహుల్ హమీద్ ప్రస్తుతం దుబాయ్‌లో ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఉన్న ఎర్రచందనం కాజేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్, తిరుపతి, శేషాచలం అడవులు, చెన్నై, తమిళనాడులోని జావాదు మలై, సింగపూర్, దుబాయ్‌లలో చేశారు. అంతే కాకుండా చెన్నైలో సాహుల్ హమీద పుట్టిన ప్రాంతంలో కూడా షూటింగ్ జరిపారు. సాహుల్ హమీద్ విషయానికి వస్తే, యితడు అనేక నేరాలకు పాల్పడి దాదాపు 120 మిలియన్ డాలర్ల ఆస్తులను సంపాదించినట్లు ఇతనిపై అనేక వార్తలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు గతంలో ఇతన్ని అరెస్టు చేశారు. ఆ తరువాత సాహుల్ దుబాయ్‌కి పారిపోయాడు. అక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. సాహుల్ హమీద్ ఎర్రచందనం ఎలా దొంగిలిస్తాడు? అతని ముఠా ఎంతవరకు విస్తరించి ఉంది? అనే వివరాలు ఏప్రిల్ 3న ఎపిసోడ్లో ప్రసారమవుతాయి. ఫ్రాన్స్ డైరెక్టర్లు ఉడుముల సుధాకర్ రెడ్డి సహకారంతో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. త్వరలో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌లో పర్యావరణాన్ని నాశనం చేయడానికి నేరగాళ్లు ఎలా పాల్పడుతున్నారు? పర్యావరణం వారి వల్ల ఎలా నాశనమవుతోంది? అరుదైన జంతువులను, అటవీ సంపదను ఎలా నాశనం చేస్తున్నారు? పోలీసులకు దొరకకుండా ఎలా తప్పినందుకుంటున్నారు? పోలీసులు వారిని ఎలా వెతుకుతున్నారనే విషయాలన్నీ సమగ్రంగా వివరించారు. ఈ డాక్యుమెంటరీలో మన తెలుగు తేజం సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి లీడ్ క్యారెక్టర్ చేయడం తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం. ఇది తెలుగు జర్నలిస్టుకు దొరికిన గొప్ప అవకాశం. ఇది అదృష్టం అనటం కంటే కూడా, శ్రమ, పట్టుదల, లోతైన విశ్లేషణ వంటి వాటితోనే ఉడుముల సుధాకర్ రెడ్డి ఈ ఘనత సాధించారని చెప్పాలి. భవిష్యత్తులో ఈయన మరింత గొప్ప స్థాయికి చేరాలను మనస్ఫూర్తిగా ఆశిద్దాం.. -
సాగు చేస్తే చం'ధనమే'!.. పంటకాలం 12 ఏళ్లు.. చేతికి రూ.కోట్లలో ఆదాయం
సాక్షి, ఆళ్లగడ్డ: డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అంటే అవుననే అంటున్నారు శ్రీగంధం, ఎర్రచందనం సాగు చేస్తున్న రైతులు. ఏళ్లతరబడిగా ఒకే తీరు పంటలు వేస్తూ దిగుబడులు రాక పెట్టుబడులు ఎల్లక అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహనతో ఇప్పుడిప్పుడే ఇతర పంటలు, లాభదాయక సాగుపై దృష్టిసారిస్తున్నారు. నంద్యాల జిల్లాలో అటవీ సమీప గ్రామాల రైతులు ఎక్కువగా శ్రీగంధం, ఎర్రచందనం, అగర్ ఉడ్, మల్బరీ వేప, మహాగని తదితర పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. మొదటి రెండేళ్లు కష్టపడితే అవి పెరిగి పెద్దవై రూ.కోట్లలో ఆదాయం తెచ్చి పెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు అవసరం లేదు సిరి సంపదల గని శ్రీగంధం. అడవి సంపదలో రారాజు ఎర్రచందనం. ఇవి ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన ధర పలికే చెట్లుగా వెలుగొందుతున్నాయి. అయితే, ఇవి దట్టమైన అడవుల్లో మాత్రమే లభించే చెట్లు. వీటి చెక్కను ఎన్నో ఔషధాల్లో, కాస్మోటిక్లో విరివిగా వాడుతారు. ప్రస్తుతం వీటి వినియో గం పెరగడంతో అంతరించి పోతున్న అరుదైన జాతి సంపదను స్మగ్లర్ల బారి నుంచి సంరక్షించుకునేందుకు ప్రభుత్వం వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో శ్రీగంధం మినహా మిగతా మొక్కలను సో షల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి కొన్ని రకాలు ఉచితంగా మరి కొన్ని రకాల మొక్కలు నామమాత్రపు ధరకు రైతులకు అందజేస్తోంది. దీంతో జిల్లాలో పలువురు వీటిని సా గు చేస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లో అమ్ముకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటవీ శాఖ అనుమతులు ఇస్తోంది. దీంతో జిల్లాలో ప్ర స్తుతం ఎర్రచందనం, శ్రీగంధం సుమారు 80 హెక్టార్లలో సాగు అయినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీగంధం చెట్టు రైతుకు ఆదాయం.. వాతావరణ పరిరక్షణ శ్రీగంధం, ఎర్రచందనం పెంపకం చాలా తేలిక. అటవీ సాగు మొక్కలైన టేకు, జామాయిల్, సుబాబుల్ మొక్కలు మాదిరే వీటిని పెంచవచ్చు. నీరు నిలవని మెట్టభూములు వీటి సాగుకు అనుకూలం. ఈ మొక్కలకు ఎటువంటి క్రిమి కీటకాలు ఆశించవు. రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. ఏడాదికి నాలుగైదు సార్లు నీటితడులు, ఒకసారి పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. గంధం, చందనం సాగు రైతులకు ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. సాగు ఇలా.. ఎకరం విస్తీర్ణంలో 450 నుంచి 560 మొక్కలు నాటుకోవచ్చు. ఎర్రచందనం మొక్కలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోషల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి ఉచితంగా అందజేస్తారు. శ్రీగంధం మొక్కలు ప్రైవేటు నర్సరీల్లో లభ్యమవుతాయి. మొక్కలు నాటిన మూడు, నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు, సాగు చేసుకోవచ్చు. సాగు వ్యయం ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు అవుతుందని అంచనా. పచ్చని బంగారం శ్రీగంధం ఎర్రచందనం తరువాత శ్రీగంధం కలపకు భారీ డిమాండ్ ఉంటుంది. దీని ఖరీదు కూడా ఎక్కువే. శ్రీగంధం చెక్కను సెంట్లు, అగరబత్తీలు, సబ్బులు, అందమైన బొమ్మలు తయారీలో వినియోగిస్తారు. ఒక కిలో ధర రూ. 8 వేల నుంచి రూ. 16వేల వరకు ఉంటుంది. 12 నుంచి 15 ఏళ్లు తరువాత ఒక్కో చెట్టు నుంచి 15 నుంచి 20 కిలోల వరకూ పొందవచ్చు. దీంతో ఒక్కో చెట్టు నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆదాయం లభిస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. అయితే, వీటిని దొంగల బారిన పడకుండా రక్షించుకోవాల్సి ఉంటుంది. పెరిగి పెద్దయితే ఎర్ర బంగారమే.. ఎర్రచందనం 15 సంవత్సరాల వయసు తరువాత ఈ చెట్లు గరిష్టంగా 20 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. వీటిని నరికితే ఎకరాకు 200 నుంచి 300 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఏ – గ్రేడు దుంగలకు టన్ను రూ 60 లక్షలు, బి–గ్రేడు రూ. 40 లక్షలు, సీ–గ్రేడు రూ. 31 లక్షలు ధరలుగా నిర్ణయించారు. ఈ లెక్కన కనీసం సీ గ్రేడు రకానికి లెక్కేసినా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సాగులో పాటించాల్సిన మెలకువలు ►నాటిన మొదటి సంవత్సరం మొక్కల బతుకుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మొదటి రెండేళ్ల పాటు మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తరువాత మొక్కలు నేలలో స్థిరపడి బాగా పెరుగుతాయి ►వీటిని మెట్ట,గరప నేలల్లో సాగు చేయవచ్చు ►ఎకరాకు 560వరకు మొక్కలు నాటుకోవచ్చు ►మొక్కల మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలి ►శ్రీ గంధం వేర్లకు సొంతంగా పోషకాలను గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. అందుబాటులో చెట్ల వేర్లతో శ్రీగంధం వేర్లు పెనవేసుకొని వాటి నుంచే తేమను పోషకాలను సంగ్రహిస్తాయి. ►నాటిన మూడేళ్ల వరకు శ్రీగంధానికి అందు బాటులో ఏదో ఒక మొక్క ఉండి తీరాల్సిందే. -
శేషాచలం.. నల్లమల.. అడవి ఏదైనా జల్లెడ పట్టడమే వారి విధి
సాక్షి, రాయచోటి: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు అడవిబాట పడుతున్నారు. ఇంతకుమునుపు మావోయిస్టుల ప్రాబల్యం నేపథ్యంలో అనునిత్యం అరణ్యంలో గడుపుతూ వచ్చారు. అయితే కాలక్రమేణా మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడం.. ఎర్రచందనం స్మగ్లర్ల బెడద పెరిగిపోవడంతో వారిని ఎదుర్కొనేందుకు ఖాకీలు శ్రమిస్తున్నారు. ఒక వైపు స్మగ్లర్లు, మరోవైపు ఎర్రచందనం కూలీల చర్యలు తిప్పికొట్టేందుకు అడవిలోనే మకాం వేస్తున్నారు. అడవిలో అనేక రకాల సవాళ్లు.. కష్టాలు ఎదురవుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఇష్టంగా ముందుకు వెళుతున్నారు. ఒక్కరోజులో పదుల సంఖ్యలో కొండలు, గుట్టలు..వాగులు, వంకలు దాటుకుంటూ ఎర్రచందనం చెట్ల రక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. సుమారు 20 మందితో కూడిన కూంబింగ్ దళం ప్రతినెల మూడు వారాలపాటు అడవిలోనే తిరుగుతోంది. అరణ్యంలో కిలోమీటర్ల మేర నడక అన్నమయ్య జిల్లాలో నల్లమలతోపాటు ఎర్రమల, శేషాచలంతోపాటు ఇతర పలు రకాల అడవులు విస్తరించాయి. ప్రధానంగా ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్న కొండల్లోకి బృందం అడుగు పెట్టిందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నడకే సాగుతుంది. ఆహారం తీసుకునే సమయం మినహా మిగతా సమయంలో అడవినంతా జల్లెడ పడతారు. తెల్లవారుజామున 4 గంటలకే లేవడం, ఒక ప్రాంతంలో టిఫెన్ చేసుకుని ఉదయాన్నే 6 గంటలకు అలవాటు ఉన్న వారు తినడం, లేని వారు పార్సిల్ కట్టుకుని నడక మొదలు పెడతారు. అక్కడి నుంచి అటవీశాఖ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపడతారు. నడిచే సమయంలో మాట్లాడకుండా, సెల్ఫోన్లు చూడకుండా తుపాకీ భుజాన పెట్టుకుని కూంబింగ్‌లో భాగంగా వేట కొనసాగుతుంది. అలా మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం వరకు తిరగడం, రాత్రికి సమీప ప్రాంతంలోనే టెంటు వేసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. అందులోనూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కాకుండా బయట ప్రాంతాలను ఎంచుకుంటారు. అడవిలో నీరు నిల్వ ప్రాంతాలకు జంతువులు వచ్చే అవకాశం ఉండడంతో కూంబింగ్ దళం సమీప ప్రాంతాల్లో ఎక్కడా టెంట్లు వేసుకోరు. దుంగలు దొరికితే ‘అడవంత కష్టం’ అడవిలో కొండలు, రాళ్లు, చెట్ల పొదలను దాటుకుని నడవడమే కష్టం. అలాంటిది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసుకున్న దుంగలు కూడా ఒక్కోసారి కనబడతాయి. ఈ తరుణంలో వాటిని అటవీ ప్రాంతం నుంచి బయటికి తీసుకు రావాలన్నా...అడవిలో మోయాలన్నా అడవంత కష్టముంటుంది. ఎందుకంటే ఒకవైపు బ్యాగు, మరోవైపు తుపాకీ, ఇంకోవైపు ఎర్రచందనం దుంగలను ఎత్తుకుని కాలిబాటగా రావాల్సిందే. కనీసం బయటికి సమాచారం ఇవ్వడానికి సెల్ఫోన్లు పనిచేయవు.. సిగ్నల్స్ ఉండవు. కేవలం భుజానికి ఎత్తుకుని కిలోమీటర్ల మేర నడవడమే మార్గం. అనుక్షణం అప్రమత్తం అడవిబాట పట్టిన పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే నీరు నిల్వ ఉన్నచోట, మధ్యాహ్న సమయంలో స్వయంగా ఈ బృందమే వంట సిద్ధం చేసుకుని తిని వెళతారు. అయితే ఒకవైపు స్మగ్లర్లు, ఎర్రచందనం కూలీలతో ముప్పు పొంచి ఉంటుంది. మరోవైపు అడవి జంతువులతోనూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో ప్రధానంగా విష సర్పాలు, పురుగులతో సహవాసం తప్పదు. రాత్రి సమయంలో సెల్ఫోన్ల లైటింగ్ కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రాత్రి పూట ఒక సెంట్రీ అడవిలో కూంబింగ్ నిర్వహణకు వెళ్లిన పోలీసులు నిద్రపోయే సమయంలో కూడా ఒక సెంట్రీ పహారా కాస్తారు. రాత్రంతా రెండు గంటలకు ఒకరు చొప్పున మారుతూ డ్యూటీలు చేస్తారు. పగలంతా నడక చేసినా రాత్రి పూట కూడా వారందరికీ రక్షణగా ఒకరు మేలుకుని విధులు నిర్వర్తిస్తారు. ఎందుకంటే రాత్రిపూట స్మగ్లర్లు, కూలీలు, అడవి జంతువుల దాడుల నేపథ్యంలో కచ్చితంగా ఒక పోలీసు నిద్ర మేల్కొని సెంట్రీ డ్యూటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. జోరు వానలో.. ఎముకలు కొరికే చలిలో.. కూంబింగ్ దళానికి సంబంధించి ఒక ఆర్‌ఎస్‌ఐతోపాటు ఒక లోకల్ ఎస్ఐ, పది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు అటవీశాఖ సిబ్బందితో కలిసి అడవిలోకి వెళితే వర్షం వణికిస్తున్నా.. చలి చంపేస్తున్నా.. మంచు కమ్మేస్తున్నా.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవమే లక్ష్యంగా అడుగు మాత్రం ముందుకు పడాల్సిందే. ఒక్కోసారి అడవిలోకి బృందం వెళ్లిందంటే మూడు రాత్రులతోపాటు నాలుగు పగళ్లు అక్కడే ఉండి ఇంటికి చేరుకుంటారు. జిల్లా కేంద్రం నుంచి చుట్టు పక్కల అటవీ ప్రాంతం సమీపం వరకు వాహనం వదిలి వస్తుంది. నాలుగు రోజుల తర్వాత అడవి నుంచి బయటికి రాగానే మళ్లీ వాహనం వెళ్లి తీసుకు వస్తుంది. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకే కూంబింగ్ అన్నమయ్య జిల్లాలోని అడవుల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. అయితే కొంతమంది స్మగ్లర్లు, తమిళ కూలీలు అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దుంగల అక్రమ రవాణా వ్యవహారంలో కఠినంగా ముందుకు వెళుతున్నాం. – వి.హర్షవర్దన్‌రాజు, జిల్లా ఎస్పీ, అన్నమయ్య జిల్లా రోజుకు 40 కిలోమీటర్ల మేర నడక అడవిలోకి కూంబింగ్ వెళ్లిన దళం ఉదయం 6 గంటలకు నడక మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు సాగుతూనే ఉంటుంది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అడవిలో నడుస్తూనే ఉంటాం. ఒకరినొకరు మాట్లాడుకోకుండా గ్రూపులుగా అడవి అంతా జల్లెడ పడతాం. అడవినంతా గాలిస్తూ ముందుకు వెళతాం. ఎక్కువ యుక్త వయస్సు వారే ఉంటుండడంతో ఎక్కువ కిలోమీటర్లు నడవగలగడంతోపాటు వంట కూడా మేమే చేసుకుంటాం. – తులసిరామ్, కానిస్టేబుల్, రాయచోటి అక్రమ రవాణాను అడ్డుకోవడమే సవాలుగా తీసుకుని.. అడవిలోకి వెళుతున్నామంటే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్న సంకల్పంతో ముందుకు వెళతాం. ఎలాంటి సవాళ్లు ఎదురైనా కూడా భయపడం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురైనా వారిని అదుపులోకి తీసుకునేందుకు అడవినంతా గాలిస్తాం. అడవిలో ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఉన్నా అడుగు మాత్రం వెనక్కి పడదు. – రెడ్డిశేఖర్, కానిస్టేబుల్, రాయచోటి -
అన్నమయ్యకు సింగారం.. ఎర్ర బంగారం
సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా అడవులకు నిలయంగా మారింది. ఎక్కడ చూసినా చుట్టూ కొండ కోనలు.. పచ్చని చెట్లతో ప్రకృతి పరవశింపజేస్తోంది. శేషాచలం, పెనుశిల, ఎర్రమల, పాలకొండలు, వెంకటేశ్వర అభయారణ్యాలలో విస్తరించిన అడవులు అందంగా దర్శనమిస్తున్నాయి. మరోపక్క ఎక్కడ చూసినా ప్రకృతి ఒడిలో చెక్కిన శిల్పాల్లా ఎర్రబంగారానికి నిలువెత్తు సాక్ష్యంగా అన్నమయ్య జిల్లా నిలుస్తోంది. సువిశాలమైన మైదానాలు.. గలగలపారే సెలయేర్లు.. పక్షుల కిలకిలా రావాలు.. అడవి జంతువులతో అటవీ ప్రాంతం అలరారుతోంది. అంతేకాకుండా జిల్లాలోని అడవులు పెద్దపెద్ద గజరాజులకు నిలయమనే చెప్పాలి. వైఎస్సార్ జిల్లా 5.40 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉండగా.. ప్రస్తుతం విభజన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఆరు నియోజకవర్గాలు, 30 మండలాల పరిధిలో 2.45 లక్షల హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. లక్ష హెక్టార్లలో ఎర్ర బంగారం జిల్లాలోని శేషాచలం, వెంకటేశ్వర అభయారణ్యాల్లో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఎర్రచందనం ఉన్న జిల్లాల్లో మొదటగా అన్నమయ్యనే చెప్పుకోవాలి. ప్రస్తుతం రాజంపేట డివిజన్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో సుమారు 92 వేల హెక్టార్ల నుంచి లక్ష హెక్టార్ల వరకు ఎర్రచందనం విస్తరించి ఉంది. ఎర్రచందనంతోపాటు నారేడు, నెమలినార, సండ్ర, తుమ్మచెట్లు, వెదురుతోపాటు ఇతర అనేక రకాల చెట్లతో అటవీ విస్తీర్ణం పచ్చదనంతో కళకళలాడుతోంది. రాజంపేట డివిజన్‌లోకి పలు రేంజ్‌లు రాజంపేట డివిజన్ పరిధిలో ఇప్పటివరకు చిట్వేలి, కోడూరు, రాజంపేట, సానిపాయి రేంజ్‌లు కలిసి ఉండగా.. తాజాగా తిరుపతి పరిధిలోని బాలుపల్లె, కడప పరిధిలోని రాయచోటి, చిత్తూరు పశ్చిమ పరిధిలోని మదనపల్లె, చిత్తూరు తూర్పు పరిధిలోని పీలేరు రేంజ్ అడవులు కూడా రాజంపేటలోకి వచ్చి చేరాయి. అయితే రానున్న కాలంలో జిల్లాకు సంబంధించి ప్రత్యేక జిల్లా అధికారిని నియమిస్తారని తెలియవచ్చింది. సామాజిక అటవీ విభాగానికి సంబంధించి ఆరు నియోజకవర్గాలకు కలిపి ఏడు నర్సరీల వరకు ఉన్నాయి. గజరాజులకు నిలయం జిల్లాలోని అడవుల్లో అనేక రకాల జంతువులు నివసిస్తున్నాయి. వేల సంఖ్యలో పక్షులకు ఆలవాలంగా నిలుస్తోంది. అయితే శేషాచలం, బాలుపల్లె రేంజ్ పరిధిలోని అడవుల్లో ఏనుగుల గుంపులు ఉన్నాయి. ఈ అడవుల్లో సుమారు 35 గజరాజులు ఉన్నట్లు అటవీశాఖ అంచనా వేస్తోంది. అవే కాకుండా ఎలుగుబంట్లు, చిరుతలు, కొండ గొర్రెలు, జింకలు, కొండ దుప్పులు, కుందేళ్లు ఇలా చెబుతూ పోతే అనేక రకాల జంతువులు నివసిస్తున్నాయి. జిల్లాలో భారీ అటవీ విస్తీర్ణం అన్నమయ్య జిల్లాలో భారీ అటవీ విస్తీర్ణం ఉంది. సుమారు 2.45 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. అనేక రకాల చెట్లతోపాటు ఏనుగులు, ఎలుగుబంట్లు ఇలా వివిధ రకాల జంతువులు ఉన్నాయి. కొత్తగా బాలుపల్లె, రాయచోటి, మదనపల్లెతోపాటు పలు రేంజ్‌లు వచ్చి రాజంపేటలో కలిశాయి. – వై.వెంకట నరసింహారావు. డీఎఫ్ఓ, రాజంపేట -
పైకి చూస్తే పెళ్లి కారు.. లోన చూస్తే..
సాక్షి, తిరుపతి : టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. కారులో తరలించేందుకు సిద్ధమైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ వాసు కథనం మేరకు.. రేణిగుంట్ల సమీపంలోని తిరుమల నగర్ వద్ద సోమవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పెళ్లి కారు కనిపించింది. ఇది పెళ్లిళ్ల సీజన్ కాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.. పెళ్లి పేరుతో అందంగా అలంకరించిన కారులో స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగలను, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిండ్ర మండలానికి చెందిన దొరవేలు, మంగళంకు చెందిన దిలీప్‌కుమార్, తేజ, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మస్తాన్‌లుగా గుర్తించారు. -
పోలీసులపై గొడ్డళ్లు, రంపాలతో దాడి..
సాక్షి, చిత్తూరు : చంద్రగిరి మండలం భీమవరం పాలెంకొండ వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. తమకు ఎదురుపడ్డ టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై గొడ్డళ్లు, రంపాలు, రాళ్లతో దాడికి దిగారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనలో ఫారెస్టు ఎఫ్‌బీవో కోదండకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. జవ్వాదిమలైకి చెందిన నలుగురు స్మగ్మర్లను అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 25 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వెల్లడించారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం..విద్యార్థి అరెస్ట్
తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన ఓ బీటెక్ విద్యార్థిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో భాగంగా వాహనానికి డ్రైవర్‌గా వచ్చి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలు..మంగళవారం అర్ధరాత్రి కరకంబాడి అడవులలో కూంబింగ్ చేస్తున్న టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ విజయ్ నరసింహులు బృందానికి భూపాల్ నాయుడు కాలనీ వెనక టవేరా కారు కనిపించింది. ఆ కారు నెంబర్ ప్లేటు చూసి, ఆ నెంబర్‌ను వెబ్సైటల్లో చూడగా అది ఒక స్కూటర్ నెంబరని తేలింది. వెంటనే కారుని ఆపి తనిఖీలు చేశారు. కారుకు సమీపంలో నాలుగు ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. కారులో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని చూసి మరో వ్యక్తి పారిపోగా..డ్రైవర్ పట్టుబడ్డాడు. డ్రైవర్ని విచారించగా..తన పేరు మేఘనాథన్ అని..తమిళనాడులోని వేలూరు జిల్లా రెడ్డిపాళయంకు చెందిన వాడినని వెల్లడించాడు. తనకు వేలూరులో హమీద్ అనే ట్రావెల్ యజమాని కారును తిరుపతికి తీసుకుని వెళ్లి అక్కడ మంగళం వద్ద మరో డ్రైవర్‌కు అప్పగించి రావాలని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. తనతో పాటు సతీష్ అనే వ్యక్తి వేలూరు నుంచి వచ్చినట్లు చెప్పాడు. సంఘటనాస్థలానికి ఎస్పీ రవిశంకర్ చేరుకుని స్మగ్లర్‌ను విచారించి కూంబింగ్ కొనసాగించాల్సిందిగా ఆదేశించారు. ఎర్రచందనం దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రచందనం వేలం వెనుక కుట్ర : భూమన
సాక్షి, తిరుపతి : ఎర్రచందనం వేలం వెనుక కుట్ర ఉందని సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎర్రచందనం ఆదాయం ద్వారా రుణమాఫీ చేస్తామని చెప్పి ..అడవుల్లో ఉన్న పచ్చదనన్నాంత మాఫీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో ఒక్కరూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. 35 లక్షల ఎకరాల్లో విస్తారంగా ఉన్న ఎర్రచందనాన్ని పచ్చదండు తన్నుకుపోతోందని ధ్వజమెత్తారు. ఎర్రచందనం వేలం ద్వారా వచ్చిన ఆదాయం ఏమైందని భూమన ప్రశ్నించారు. పతంజలి సంస్థకు A గ్రేడు అమ్మి C గ్రేడుగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మండిపడ్డారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పతంజలి సంస్థకు సరఫరా చేస్తున్న సీ గ్రేడ్ ఎర్రచందనాన్ని పట్టుకుంటే అది ఏ గ్రేడ్‌గా తేలిందన్నారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోందని, ఏపీ పరువు చంద్రబాబు బంగాళాఖాతంలో కలిపారని మండిపడ్డారు. చంద్రబాబు తన అనుచరులను అడవిలోకి పంపి దోపిడీ దొంగలకంటే దారుణంగా ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు అండదండలతో టీడీపీ నేతలు బరి తెగించారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టామని చెప్పడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వచ్చే వందల కొట్లతో వచ్చే ఎన్ని కల్లో చంద్రబాబు గెలవాలని చూస్తున్నారని భూమన తెలిపారు. -
ఎర్రచందనం వేలం వెనుక చంద్రబాబు కుట్ర
-
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో 12 మంది అరెస్ట్
కడప అర్బన్ : అటవీశాఖ కడప సబ్ డివిజన్ పరిధిలో వేంపల్లె రేంజ్లో ముచ్చుకోన, పీకల కోన మ«ధ్యలో దాచి ఉంచిన 20 ఎర్రచందనం దుంగలను, వాహనాన్ని బుధవారం స్వాధీనం చేసుకుని 12 మంది నిందితులను అరెస్టు చేసినట్లు కడప డీఎఫ్ఓ శివప్రసాద్ తెలిపారు. కడప నగరంలోని అటవీశాఖ డీఎఫ్ఓ కార్యాలయ ఆవరణంలోని పంచవటి అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం పాపాఘ్ని నది వంతెన సమీపంలో ఈనెల 7వ తేది రాత్రి, తమ అధికారులు, సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో ఆరుగురు యువకులు కనిపించారన్నారు. వారు పొంతన లేని సమాధానాలు చెబుతుండగా, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలించామన్నారు. అందులోని కాల్‌డేటా ఆధారంగా ఎర్రచందనానికి సంబంధించిన వ్యవహారం బయటపడిందన్నారు. దీంతో వారిని విచారించగా, తాము ఎర్రచందనం దుంగలను ముచ్చుకోన ప్రాంతంలో నరికి దాచి ఉంచామని వెల్లడించారన్నారు. తర్వాత వారిని విచారించి సంఘటనా స్థలానికి తీసుకెళ్లామన్నారు. అక్కడ మరో ఆరుగురు 20 ఎర్రచందనం దుంగలను దాచి ఉంచారన్నారు. ప్రధానంగా నిందితులలో కొండయ్య అలియాస్ బన్ని, ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన శివ అనే యువకుడితోపాటు బాల గంగాధర్, మురళి, నారాయణస్వామి, చంద్రమౌళిలు ఉన్నారన్నారు. అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికి దాచి ఉంచిన ప్రదేశంలో సుబ్బారెడ్డి, రమణ, ఆనంద్, శ్రీరాములు అలియాస్ కాశన్న, దేవ్లా నాయక్, కొండారెడ్డిలు ఉన్నారన్నారు. వీరిని అరెస్టు చేయడంలోనూ, నెట్‌వర్క్‌ను ఛేదించడంలోనూ వేంపల్లె రేంజ్ ఆఫీసర్ స్వామి వివేకానంద, శ్రీరాములు, మనోహర్, ప్రసాద్‌నాయక్, వెంకట రమణ, సుబ్బరాయుడు, కిశోర్, రసూల్, శేషయ్య, ఓబులేశు, గోపిచంద్రలు తమవంతు కృషి చేశారన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐఎఫ్ఎస్ నరేంద్రన్, స్క్వాడ్ డీఎఫ్ఓ ఆర్డీ వెంకటేశ్వర్లు, ఏసీఎఫ్ సోమశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
శేషాచలం అడవుల్లో వందకుపైగా తమిళ స్మగ్లర్లు !
సాక్షి, తిరుపతి : శేషాచలం అడవుల్లో వంద మందికిపైగా తమిళ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు అనుమానిస్తున్నారు. గురువారం రాత్రి స్మగ్లర్ల కోసం టవేరా వాహనంలో ఆహార పొట్లాలను తీసుకురావటం అధికారులు గుర్తించారు. తిరుపతి ఎస్వీ జూ పార్కు సమీపంలో పొదల చాటున టవేరా బ్రాండ్ న్యూ కారు టాస్క్ ఫోర్స్ సీఐ మధు బృందం కంటపడింది. టవేరా కారు వద్దకు వారు వెళుతుండగా మరో కారు అక్కడకు చేరుకుంది. అధికారులను గమనించిన స్మగ్లర్లు కారును వేగంగా వెనక్కు తిప్పి చంద్రగిరి వైపు మళ్లించారు. దీంతో సీఐ మధు ఆ కారును వెంబడించారు. కారు వడమాలపేట మార్గంలో తప్పించుకుంది. దీంతో వెనక్కు వచ్చిన అధికారులు టవేరా వాహనాన్ని పరిశీలించగా అందులో వందకు పైగా చపాతీ ప్యాకెట్లు వాటికి కర్రీ ప్యాకెట్లు, బస్తా బియ్యం, వంటకు అవసరమైన వస్తువులు, 200 హాన్స్ ప్యాకెట్లు, బీడీ బండలు ఉన్నాయి. అక్కడ కారును రిపేర్లు చేసిన బిల్లు వారికి దొరికింది. ఆ బిల్లులో తమిళనాడు ఆరణిలోని ఓ కారు మెకానిక్ షాపు అడ్రసు ఉంది. తిరువన్నామలై జిల్లాకు చెందిన రెండు అధార్ కార్డులు ఉన్నాయి. సీఐ మధు మాట్లాడుతూ.. అడవులలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలింపులు చర్యలు తీవ్రం చేయనున్నట్లు తెలిపారు. అధార్ కార్డుల అధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని మిగిలిన వారి అచూకీ కనుగొంటామన్నారు. ఖచ్చితంగా అడవులలో పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు ఉన్నారని దానికి సంబంధించిన ఆధారాలు తమకు లభించినట్లు తెలిపారు. ఐజీ శ్రీకాంతారావు దీనికి సంబంధించిన సూచనలు అందజేశారు. ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎస్ఐ సోమశేఖర్, రైటర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
రైల్వేకోడూరు : నియోజకవర్గంలో వేరు వేరు చోట్ల దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ లక్ష్మినారాయణ తెలిపారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉర్లగట్టుపోడు పంచాయతీలోని కన్నెకుంట రోడ్డులో బుగ్గలవాగు పరిసర ప్రాంతాలలో గాలిస్తుండగా పోలీసులపై స్మగ్లర్లు రాళ్లు, కట్టెలతో దాడిచేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇందులో భాగంగా చాకచక్యంగా అక్కడున్న ఐదు ఎర్రచందనం దుంగలను, ఒక మహేంద్ర గూడ్స్ వాహనం, ఒక హీరో హోండా బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన దంతం వెంకటేష్, అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన బెల్డోనా మల్లయ్య, వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన నుగాలన్ అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ. 2.30 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే ఓబులవారిపల్లె మండలం వైకోట సమీపంలోని గుండాలేరు అటవీ ప్రాంతంలో 6 ఎర్రచందనం దుంగలను , ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కె.బుడుగుంటపల్లె పంచాయతీ సమతానగర్‌కు చెందిన వెలుగు గంగయ్య, అల్లం మణి, రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన ఎలకచెర్ల సుదర్శన్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే చిట్వేలి మండలం రాజుకుంట సమీపంలో నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన వెంకటేష్, కన్నెకుంట ఎస్టీ కాలనికి చెందిన కమ్మల వెంకటరమణ,, తమిళనాడుకు చెందిన పూచి గోవ్నరాజ్‌లను అరెస్ట్ చేశామన్నారు. పై మూడు దాడుల్లో 15 దుంగలను, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సాయినాథ్, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె , చిట్వేలి ఎస్ఐలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలం, సత్యనారాయణ, డాక్టర్ నాయక్‌లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
స్మగ్లర్ల వలలో యువత
– కృష్ణగిరి కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతున్న ఏలుమలై ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని భావించాడు. ఉపాధి లేక అడవిబాట పట్టాడు. ఎర్రచందనం చెట్లు నరికి వాహనంలో తీసుకొస్తుండగా గత గురువారం రాత్రి కరకంబాడి సమీపంలోని ఆంజనేయపురం వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారులకు చిక్కాడు. – వేలూరుకు చెందిన గోవిందరెడ్డి తిరువణ్ణామలై ఆర్ట్స్ కళాశాలలో ఎంకాం చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు గోవిందరెడ్డిని స్మగ్లర్‌గా మార్చాయి. కుటుంబ అవసరాల కోసం గోవిందు అడవిబాట పట్టాడు. తమిళనాడు నుంచి వాహనంలో అడవిలోకి వెళ్తుండగా గత గురువారం రాత్రి టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడిలో పట్టుబడ్డాడు. .. ఇలా ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు నిరుద్యోగంతో విసుగుచెంది స్మగ్లర్లుగా మారుతున్నారు. పుస్తకాలు చేతబట్టాల్సిన చేతులు గొడ్డళ్లు పట్టుకుని అడవి బాటపడుతున్నాయి. సాక్షి, తిరుపతి: ఆర్థిక ఇబ్బందులు.. చదువుకున్నా ఉపాధి లేక.. ఇంట్లో ఖాళీగా ఉండలేక.. కుటుంబంపై ఆధారపడలేక యువత నలిగిపోతోంది. ఏం చేయాలో తెలియక తప్పటడుగు వేస్తోంది. స్మగ్లర్లుగా మారి తల్లిదండ్రులకు తలవొంపులు తెస్తోంది. ఇటీవల ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ దాడిలో పట్టుబడుతున్న వారిని చూస్తే ఇదే అనిపిస్తోంది. నెల క్రితం చంద్రగిరి సమీపంలో పట్టుబడ్డ సుబ్రమణియన్ (బీటెక్), మురుగన్ (ఎంటెక్)తో పాటు ఆర్థిక ఇబ్బందులతో చదువు పూర్తిచేయలేని వారు, ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్యోగం రాక ఇబ్బందులు ఎదుర్కొం టున్న వారు అనేక మంది ఉన్నారు. శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనానికి దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ దుంగలను గమ్యస్థానానికి చేరవేస్తే కోట్ల రూపాయలు వస్తుండడంతో స్మగ్లర్లు తమ అవసరాల కోసం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యువతకు గాలం వేస్తున్నారు. అందులో భాగంగా వేలూరు కు సమీపంలోని తిరువణ్ణామలై కళాశాలలో చదువుతున్న విద్యార్థులపై దృష్టి సారించారు. వారే టార్గెట్ అర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని స్మగ్లర్లు లక్ష్యంగా చేసుకున్నారు. అటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఐదుగురి చొప్పున ఏడు గ్రూపులను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ గ్రూపులు కళాశాల సమీపంలో టీ అంగళ్లు, క్యాంటీన్ల వద్ద తిష్టవేస్తారు. అక్కడకు వచ్చే విద్యార్థులను ఆకర్షిస్తారు. రెండు, మూడు పర్యాయాలు మాటలు కలిపి పరిచయం చేసుకుంటారు. వారి ద్వారా నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తిస్తారు. ఎర్రచందనం రవాణా ద్వారా లక్షాధికారి కావొచ్చని ఆశలు చిగురింపజేస్తారు. సేలంలో ప్రత్యేక శిక్షణ ఎర్రచందనం అక్రమ రవాణాలో కొందరు అనుభవం ఉన్న స్మగ్లర్లతో యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విద్యార్థులు, నిరుద్యోగులను గుర్తించి వారిని సేలంకి తీసుకెళ్తారు. అక్కడ రహస్య ప్రాంతాల్లో వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజుల పాటు ఎర్రచంనదం చెట్లు నరకడం, వాటిని దుంగలుగా మలచడం, వాటిని వాహనం వద్దకు తరలించడం వంటి మెళకువలు నేర్పిస్తున్నట్లు తెలిసింది. దుంగలు తరలిస్తున్న సమయంలో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులకు చిక్కకుండా పారిపోయే విషయం లోనూ మరింత శిక్షణ ఇస్తున్నారు. ఒకవేళ దొరికిపోతే విచారణలో ఏం చెప్పాలో కూడా నేర్పిస్తున్నారు. ఎవరు ఎంత విచారించినా ప్రధాన స్మగ్లర్ల పేర్లు చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం శేషాచలం అడవిలోకి చొరబడుతున్న స్మగ్లర్లలో 35శాతం మంది యువతే అని టాస్క్‌ఫోర్స్, పోలీసులు స్పష్టం చేస్తున్నారు. యువతకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఎర్రచందనం అక్రమ రవాణాకు ఆకర్షితులవుతున్న యువతకు టాస్క్‌ఫోర్స్ బృందం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తోంది. యువత స్వగ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులను కలిసి వివరిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ అధికారులు ఎర్రచందనంపై షార్ట్ ఫిలిమ్స్ తీసి యూట్యూబ్ ద్వారా ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
వైఎస్సార్ జిల్లా : అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అనేకట్ బాబు అలియాస్ వేలూరు బాబుతో పాటు అతని నలుగురు అనుచరులను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇప్పటి వరకు 500 టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. వారి నుంచి 1.5 కోట్ల రూపాయల విలువ గల 37 ఎర్ర చందనం దుంగలు,3 కార్లు, ఒక టాటా సుమో, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బాబుజీ తెలిపారు. -
తిరుపతిలో ఎర్రచందనం పట్టివేత
సాక్షి, తిరుపతి: తిరుపతి నగరంలోని హరిత కాలనీలో మంగళవారం పోలీసులు దాడిచేసి ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా వెళ్ళి పట్టుకున్నారు. పోలీసులను చూసిన స్మగ్లర్లు ఎర్రచందనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ సందర్బంగా 12 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపుచర్యలు చేపట్టారు. -
శేషాచలం అడవుల్లో మళ్లి అలజడి
-
13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సాక్షి, చంద్రగిరి: శేషాచలంలోని ఎర్రగుట్ట ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా దాచిన 13 ఎర్రచందనం దుంగలను ఆర్ఎస్సై వాసు బృందం ఆదివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఆర్ఎస్సై వాసు బృందం కూంబింగ్ చేపట్టారు. నరసింగాపురం ఎస్టీకాలనీ వద్ద కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అధికారులను చూసి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశాడు. అధికారులు వెంబడించినా లాభం లేకపోయింది. ఎర్రగుట్ట వద్ద తనిఖీ చేయడంతో చెట్ల పొదల్లో దాచిన సుమారు 13 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన కూలీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడుల్లో డీఆర్వో నరసింహరావు, ఎఫ్‌బీవో జానీబాషా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట
► 35 దుంగలు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్ నెల్లూరు సిటీ : ఎర్రచందనం అక్రమ రవాణాకు కొందరు కొత్త ఎత్తులు వేస్తున్నారని, వారి ఎత్తులను చిత్తు చేస్తూ జిల్లా పోలీస్ యంత్రాంగం అడ్డు కట్ట వేస్తుందని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అన్నారు. నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో విశాల్‌గున్నీ మాట్లాడారు. గత ఒకటిన్నర సంవత్సరంగా ఎర్రచందనం అక్రమ రవా ణాను పూర్తిస్థాయిలో అరికట్టగలిగామని తెలిపారు. వెంకటగిరి, డక్కిలిలో బుధ, గురువారాల్లో ఎర్ర చం దనం తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ నెల 22న వల్లివేడు చెరువు వద్ద వెళ్తున్న వాటర్ ట్యాంకర్‌ను తనిఖీలు చేయగా అందులో రూ.6.80 లక్షలు విలువ చేసే 24 ఎర్రచందనం దుంగలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ రవాణాలో సూత్రధారి పారె మురళీ, గోనుగొడుగు రమేష్‌ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మురళీపై గతంలో అనేక కేసులు ఉన్నాయన్నారు. రౌడీషీట్ కూడా ఉన్నట్లు తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 23న డక్కిలి మండలం చీకిరేనిపల్లి చెరువు వద్ద ఎర్రచందనాన్ని ట్రాక్టర్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో రూ.3.10 లక్షలు విలువ చేసే 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, సుధారాసి మునేంద్రను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరికి సహకరించిన వాళ్లు పరారీలో ఉన్నారని, వాళ్లను ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు కేసుల్లో అతి చాకచక్యంగా నిందితులను పట్టుకున్న గూడూ రు ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాసాచారి, వెంకటగిరి సీఐ మద్ది శ్రీనివాసులు, వెంకటగిరి ఎస్సై కొండపనాయుడు, సిబ్బందికి రివార్డులు అందజేశారు. -
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లర్లకు జిల్లాలో మరో ఎదరుదెబ్బ తగిలింది. మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో పీలేరు, సత్యవేడు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సహాయంతో రెండు ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగుల్లో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 వాహనాలు( 1 లారీ, 1 కారు, 4 మోటారు సైకిళ్లు), సుమారు 1.5 టన్నుల బరువైన 48 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అబ్దుల్ రహమాన్ అనే అంతర్జాతీయ స్మగ్లర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ జి. శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
డోన్ కోర్టుకు హాజరైన గంగిరెడ్డి
డోన్ టౌన్ : ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని మంగళవారం కడప పోలీసులు డోన్ కోర్టులో హాజరుపరిచారు. పలు కేసుల్లో నిందితుడైన ఇతను.. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. డోన్‌లో గతేడాది ఎర్రచందనం పట్టుబడిన కేసులో నిందితుడిగా ఉన్నందున కడప నుంచి పోలీస్ బందోబస్తు మధ్య డోన్‌కు తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. -
ఎర్రచందనం కోసం రూ.22కోట్లతో గోదాము
విజయవాడ: ఎర్రచందనం కోసం నిర్మించిన గిడ్డంగులను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. సుమారు రూ.22 కోట్లతో 25 ఎకరాల్లో ప్రభుత్వం తిరుపతిలో నిర్మించినట్లు ఆయన తెలపారు. బుధవారం ఆయన అటవీశాఖ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు 950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. మరో 2 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మడానికి త్వరలోనే టెండర్లను పిలుస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఆరు వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ముఖ్యమంత్రితో సంప్రదించి త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. -
సంగీతకు 14 రోజుల రిమాండ్
-
సంగీతకు 14 రోజుల రిమాండ్
పాకాల (చిత్తూరు జిల్లా): ఎర్రచందనం అక్రమ కేసులో అరెస్టైన ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీ(26) ని చిత్తూరు పోలీసులు బుధవారం ఉదయం పాకాల జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. చిత్తూరు నుంచి బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆమెను ప్రత్యేక వాహనంలో పట్టిష్ట బందోబస్తు నడుమ పాకాల కు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను పాకాల జూనియర్ సివిల్ జడ్జి దేవేంద్రరెడ్డి ముందు హాజరుపరిచారు. ఆమెకు 14 రోజులు రిమాండ్ విధిచారు. అక్కడి నుంచి ఆమెను పోలీసులు చిత్తూరు జైలుకు తరలించారు. సంగీతను పాకాలకు తరలిస్తున్నరని తెలిసి పాకాల సీఐ రామలింగమయ్య ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎర్రచందనం కేసులో సంగీత, భర్త లక్ష్మన్ తో పాటు ముద్దాయిగా ఉంది. కల్లూరు పోలీస్ స్టేషన్ లో, చిత్తూరు జిల్లా లోని మరికొన్ని పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఈమెపై నమోదై ఉన్నాయి. ఉగాది పండుగ సందర్భంగా కోర్టు సెలవు కావడంతో జడ్జి ఇంటి వద్ద ఆమెను హాజరు పరిచారు. -
35 మంది తమిళ కూలీలు అరెస్టు
బద్వేలు అర్బన్: బాలాయపల్లె పరిధిలోని చిరుతబండ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 35 మంది తమిళకూలీలను అరెస్టుచేసి వారి వద్ద నుంచి 44 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ డీఎస్.సుదర్శన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మైదుకూరు మండలం ఖాజీపేట సమీపంలోని నాగసానిపల్లె పరిధిలో గురువారం రాత్రి అధిక సంఖ్యలో తమిళకూలీలు పట్టుబడిన నేపథ్యంలో కొందరు తప్పించుకుని పక్కనే ఉన్న బాలాయపల్లెకు వచ్చారని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో గాలింపు చర్యలు చేపట్టాం. చిరుతబండ ప్రాంతంలో తమిళ కూలీలు తారసపడి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకున్నామని తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన 44 ఎర్రచందనం దుంగల డంప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో డీఆర్వో బి.లక్ష్మీనారాయణ, ఎఫ్ఎస్ఓ .రమణ, ఎఫ్‌బివోలు జాకీర్‌హుసేన్, రవిచంద్ర, ఆనందం, కరుణాకర్ పాల్గొన్నారు. -
40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని జీవకోన శేషాచలం అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి 20 మంది తమిళ కూలీలు తారసపడ్డారు. వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా 19 మంది పారిపోయారు. ఈ సందర్బంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 40 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసులపై ‘ఎర్ర’ స్మగర్ల రాళ్ల దాడి
చంద్రగిరి: చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం రైల్వే గేటు వద్ద సోమవారం రాత్రి టాస్క్ఫోర్సు పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. వివరాలు.. టాస్క్ఫోర్సు ఆర్ఎస్ఐ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు, అటవీ శాఖాధికారులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నరసింగాపురం రైల్వే గేటుకు సమీపంలో 50మందికిపైగా స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూ ఎదురుపడ్డారు. వీరిని పట్టుకునేందుకు యత్నించిన టాస్క్ఫోర్సు పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు కూడా గట్టిగా ఎదుర్కోవడంతో దుంగలను వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. 48 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
'ఎర్ర' దొంగలు అరెస్ట్
- 11 మంది నిందితుల్లో ప్రకాశం జిల్లా, కర్ణాటక వాసులు - 64 దుంగలు, రెండు కార్లు స్వాధీనం కర్నూలు: 'ఎర్ర దొంగలు' అవుకు నుంచి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు అక్రమంగా ఎర్ర చందనాన్ని తరలిస్తూ పోలీసుల వలకు చిక్కి కటకటాలపాలయ్యారు. నల్లమల అటవీ ప్రాంతంలో కొల్లగొట్టిన ఎర్ర చందనం దుంగలను కొన్నేళ్లుగా ప్రకాశం జిల్లా మీదుగా బెంగళూరుకు తరలించేవారు. అక్కడ పోలీసు నిఘా పెరగడంతో మరో దారి గుండా ఎర్ర చందనాన్ని తరలించే ప్రయత్నంలో దొంగలు దొరికిపోయారు. సోమవారం ఉదయం కర్నూలు జిల్లా అవుకు మండలం పాతచెర్లోపల్లి రిజర్వాయర్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఏపీ09 టీవీ3, ఏకే01 పి 5310 కార్లలో ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేయగా అక్రమ రవాణా గుట్టు రట్టయ్యింది. అవుకు మండలం సంగపట్నం గ్రామం పొలిమేరలో ఎస్ఆర్బీసీ కెనాల్ దగ్గర పొలాల్లో దాచి ఉంచిన సుమారు రూ.8 లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగలను, వాటిని రవాణా చేస్తున్న వ్యక్తులను బనగానపల్లె పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఓఎస్డీ రవిప్రకాష్, డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద వద్ద నుంచి రూ.8 లక్షలు విలువ చేసే 64 ఎర్ర చందనం దుంగలు, నేరానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగల బరువు సుమారు 13 టన్నులు ఉంటుంది. పట్టుబడిన నిందితులు: అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన దుర్గా నూర్ బాషా, కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన షమీవుల్లా, సులేబైలు హబీబుల్లా, వూంలేబైలు, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నదికోట గ్రామానికి చెందిన బాణాల చెన్నకేశవ, గంధం నాగేంద్రప్రసాద్, దిగువమెట్ట గ్రామానికి చెందిన పసుపుల బేబితో పాటు, తుమ్మలపల్లె గ్రామానికి చెందిన సారే కాశయ్య, సూరేపల్లె గ్రామానికి చెందిన పఠాన్ మాబూవలి, పెద్ద మస్తాన్‌రెడ్డి తదితరులను అరెస్టు చేశారు. రెండేళ్లుగా కొనసాగుతున్న అక్రమ రవాణా... గిద్దలూరు ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచి ఎర్ర చందనం రవాణా రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు పోలీసు విచారణలో వెలుగు చూసింది. అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన నూర్ బాషా మిరప పంటను గుంటూరుకు తీసుకెళ్లే క్రమంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమిట్ట గ్రామం వద్ద టీ దుకాణం నిర్వహించే బేబీతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మిర్చీ వ్యాపారి నూర్ బాషాకు ఎర్ర చందనం రవాణాదారులు షమీవుల్లా, హబీబుల్లాకు కూడా టీ స్టాల్ వద్ద పరిచయం పెరిగింది. ఈ క్రమంలో నూర్ బాషా ద్వారా షమీవుల్లాకు, అక్కడి నుంచి హబీబుల్లాకు ఎర్ర చందనం సరఫరా చేసే క్రమంలో నిందితులందరూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎర్ర దొంగలను అరెస్టు చేసి పెద్ద మొత్తంలో ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నందుకు బనగానపల్లె సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రాకేష్, జయలక్ష్మి, అవుకు ఎస్ఐ వెంకట్రామిరెడ్డి, డోన్ ఎస్ఐ శ్రీనివాస్, అవుకు పోలీస్‌స్టేషన్‌కు చెందిన సిబ్బంది శ్రీనివాస్, ప్రసాద్, మోహన్‌రాజు, పురుషోత్తం, బనగానపల్లె హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర గౌడు, సిబ్బంది నాగన్న, మహేష్, ఖాసీం వలి, హుసేనయ్య, మధుసూదన్, సురేష్, రమేష్, రాజశేఖర్, నాగన్న, భారతి, సుల్తాన్, కంబగిరి స్వామి తదితరులను ఎస్పీ అభినందించారు. -
15 మంది తమిళకూలీల అరెస్ట్
బద్వేలు అర్బన్: లంకమల అభయారణ్యంలోని కంచెర్ల కోన వద్ద శనివారం తెల్లవారుజామున 15 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ డిఎస్.సుదర్శన్ తెలిపారు. స్థానిక ఫారెస్ట్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. లంకమల అభయారణ్యంలోకి తమిళ కూలీలు ప్రవేశించారన్న సమాచారం రావడంతో తనతోపాటు ఇతర సిబ్బంది అటవీప్రాంతంలోకి వెళ్లగా.. కంచెర్ల కోన వద్ద వంట చేస్తూ తారస పడ్డారని తెలిపారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు యత్నించారని చెప్పారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి మూడుగొడ్డళ్లు, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అందరూ తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, తిరువన్నామలై, కృష్ణగిరి జిల్లాలలోని పెరుంబల్లి, డేగరకుప్పం, నడుకుప్ప, తిరుపత్తార్, చంగం, వెలుచునూరు గ్రామాలకు చెందిన వారని వివరించారు. ఈ దాడులలో ఎఫ్ఎస్ఓ రమణ, ఎఫ్‌బివోలు జాకీర్ అహ్మద్, రవి, కరుణాకర్, మునెయ్య, సుదర్శన్, బాషా, ఏబీఓలు సురేష్, బ్రహ్మయ్యతోపాటు వివిధ బీట్ల ప్రొటక్షన్ వాచర్లు పాల్గొన్నారు. -
15 మంది తమిళకూలీల అరెస్ట్
బద్వేలు అర్బన్: లంకమల అభయారణ్యంలోని కంచెర్ల కోన వద్ద శనివారం తెల్లవారుజామున 15 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ డిఎస్.సుదర్శన్ తెలిపారు. స్థానిక ఫారెస్ట్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. లంకమల అభయారణ్యంలోకి తమిళ కూలీలు ప్రవేశించారన్న సమాచారం రావడంతో తనతోపాటు ఇతర సిబ్బంది అటవీప్రాంతంలోకి వెళ్లగా.. కంచెర్ల కోన వద్ద వంట చేస్తూ తారస పడ్డారని తెలిపారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు యత్నించారని చెప్పారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి మూడుగొడ్డళ్లు, వంట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అందరూ తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, తిరువన్నామలై, కృష్ణగిరి జిల్లాలలోని పెరుంబల్లి, డేగరకుప్పం, నడుకుప్ప, తిరుపత్తార్, చంగం, వెలుచునూరు గ్రామాలకు చెందిన వారని వివరించారు. ఈ దాడులలో ఎఫ్ఎస్ఓ రమణ, ఎఫ్‌బివోలు జాకీర్ అహ్మద్, రవి, కరుణాకర్, మునెయ్య, సుదర్శన్, బాషా, ఏబీఓలు సురేష్, బ్రహ్మయ్యతోపాటు వివిధ బీట్ల ప్రొటక్షన్ వాచర్లు పాల్గొన్నారు. -
అటవీ అధికారుల అదుపులో 20 మంది తమిళ కూలీలు
మైదుకూరు(చాపాడు): మైదుకూరు మండలం జాండ్లవరం వద్ద గల లంకమల అడవుల్లో నుంచి బయటికి వస్తున్న 20 మంది తమిళనాడు ప్రాంతానికి చెందిన ఎర్రచందనం కూలీలను మంగళవారం రాత్రి ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా లంకమల అడవుల్లో ఎర్రచందనం నరుకుతూ ఉన్న తమిళ కూలీలు మంగళవారం జాండ్లవరం గ్రామానికి చెందిన బడా స్మగ్లర్, అధికార పార్టీ నాయకుడిని సంప్రదించేందుకు వస్తుండగా బీట్‌లో ఉన్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ సిబ్బంది గమనించి వారిని వెంటాడి పట్టుకున్నట్లు తెలిసింది. తమిళ కూలీలు పట్టుబడిన విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకుడైన బడా స్మగ్లర్ వారిని విడిపించేందు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఇందుకు సిబ్బంది అంగీకరించకపోవడంతో తాను అధికార పార్టీ అండ ఉన్న వ్యక్తినని, నియోజకవర్గంలో కీలకమైన నాయకుడినని, కూలీలను వదలకపోతే మీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఊడిపోతాయని బెదిరింపులకు పాల్పడటంతో పాటు ఓ ఫారెస్ట్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. కాగా, జాండ్లవరం పరిధిలో తమిళ కూలీలు పట్టుబడగా.. ఫారెస్ట్ అధికారులు మాత్రం అక్కడ కాదని, ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టాలు వద్ద తమిళ కూలీలు దొరికారని చెబుతున్నారు. జాండ్లవరం వద్ద దొరికినట్లు చెబితే ఆ ప్రాంతానికి చెందిన బడా డాన్‌తో ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఫారెస్ట్ సిబ్బంది ఇలా మాట మారుస్తున్నారని, జాండ్లవరం ప్రాంతానికి చెందిన వారు చర్చించుకుంటున్నారు. 20 మంది తమిళ కూలీలు దొరికారుః డీఎఫ్ఓ శివశంకర్ లంకమల అడవుల్లో నుంచి బయటికి వస్తున్న 20 మంది తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలను పట్టుకున్నాము. వీరందరూ ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టాల వద్ద అడవిలో నుంచి బయటకి వస్తుండగా తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు, అని డీఎఫ్ఓ శివశంకర్ తెలిపారు. -
తమిళ కూలీల కదలికలపై నిరంతరం నిఘా
ముద్దనూరు: ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్న తమిళ కూలీలపై నిరంతర నిఘా కొనసాగుతోందని,ఈ విషయంలో పోలీసు శాఖ సహకారం మెరుగ్గా ఉందని ప్రొద్దుటూరు డివిజనల్ ఫారెస్టు అధికారి రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అటవీశాఖ రేంజ్ కార్యాలయాన్ని డీఎఫ్‌వో తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం కొల్లగొడుతూ, అక్రమరవాణాలో పాత్రదారులైన తమిళ కూలీలను అరికట్టడానికి సుమారు 80మందికిపైగా సాయుధ పోలీసులు,అటవీశాఖ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉన్నారని, ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో ఇప్పటికే 14మంది తమిళ కూలీలను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు డివిజన్లో ఎర్రచందనం సంపద ఉన్న అటవీ ప్రాంతంలో తమ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఈ డివిజన్లో ప్రస్తుతం సమారు 1లక్షా20వేల ఎకరాల విస్తీర్ణంలో ఎర్రచందనం సంపద ఉందన్నారు. ఇటీవల కాలంలో ఎర్రచందనం అక్రమరవాణా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డుల నిర్వహణ,సిబ్బంది పనితీరు,అభివృద్ధి పనుల ప్రగతిపై ఫారెస్టు రేంజ్ అధికారి రామ్మెహన్‌రెడ్డి,డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాసులతో డీఎఫ్‌వో రవిశంకర్ సమీక్షించారు. -
ఆశల ఎర్రకూలీలు
– కూలీలకు మోటార్ బైక్‌ల తాయిలం –ఎర్ర చందనం నరికివేతకు స్మగ్లర్ల ఒప్పందం –నాలుగు ట్రిప్పులకు రూ. లక్ష నగదు – జావాదిమలయ్ చుట్టూ తమిళ స్మగ్లర్లు – పట్టుబడతున్న వారిలో వీరే ఎక్కువ తిరుపతి మంగళం: తమిళనాడులోని తిరువణ్ణామలై, కృష్ణగిరి, జావాదిమలయ్ ప్రాంతాల్లోని యువతకు కొత్త కొత్త మోటార్ బైక్‌లంటే ఎంతో ఇష్టం. అక్షర జ్ఞానం లేకపోయినా కొత్త బైక్లనెక్కి జోరుగా తిరగడం వీరికి మహా సరదా. అయితే ఇక్కడుండే కుటుంబాల్లో అధిక శాతం పేద, మధ్య తరగతి కుటుంబాల వారు కావడంతో మోటార్ బైక్‌లు కొనుగోలు చేయడం వీరికి కష్టంగా మారింది. ఆర్థిక స్తోమత సరిగా లేని యువకులంతా మోటార్‌బైక్‌లపై ఉన్న మోజును తీర్చుకోలేక అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. సరిగ్గా ఇదే బలహీనతను పక్కాగా పసిగట్టిన తమిళ స్మగ్లర్లు వీరిని కలిసి మోటార్ బైక్‌లను ఎర వేస్తున్నారు. సామాన్య యువతపై స్మగ్లర్లు ఆశల వల విసురుతున్నారు. వారి చిన్నపాటి కోరికలను అనుకూలంగా మార్చుకుంటున్నారు. చాకచక్యంగా ఎర్రచందనం స్మగ్లింగు ఉచ్చులోకి దించుతున్నారు. శేషాచలంలోనికి రెండు సార్లు Ðð ళ్లొస్తే ఒక బైక్, నాలుగు సార్లయితే రూ.లక్ష చొప్పున నగదు ఆశ చూపుతున్నారు, సరైన ఉపాధి పనులు లేక, కుటుంబం గడవక అవస్థ పడే ఎంతోమంది జావాదిమలయ్ యువకులు ముందూ వెనకా చూసుకోకుండా ఎర్ర కూలీలుగా శేషాచలంలో చొరబడుతున్నారు. ఇదే వీరి పాలిట శాపంగా మారుతోంది. టాస్క్ఫోర్సు పోలీసుల చేతుల్లో చిక్కి ఖైదీలుగా మారుతున్నారు. బతుకును కోల్పోతున్నారు. తమిళనాడులోని జావాదిమలయ్ ప్రాంతానికీ శేషాచలానికీ దగ్గర సారూప్యం ఉంది. ఈ రెండు ప్రాంతాల్లోనూ విలువైన వృక్ష సంపద ఎక్కువ. ఎర్రచందనం, శ్రీగంధం చెట్లున్న ఈ ప్రాంతాలు కొండలు, లోయలతో ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఇక్కడి అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు కూడా ఎక్కువే. ఈ తరహా అటవీ ప్రాంతంలో సామాన్య ప్రజానీకం తిరగాలంటే కష్టం. కొండలెక్కి దిగడంలో మంచి అనుభవమున్న జావాదిమలయ్ ప్రాంతీయులే శేషాచలంలో సులభంగా తిరగ గలుగుతారు. దీంతో స్మగ్లర్లు ఎక్కువగా జావాదిమలయ్ ప్రాంతానికి చెందిన కూలీలనే ఎంచుకుంటున్నారు. 2016 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ చిత్తూరు, కడప జిల్లాల్లో 163 స్మగ్లింగ్ కేసులు నమోదైతే 800 మందికి పైగా అరెస్టు చేశారు. వీరిలో 80 శాతం మంది జావాదిమలయ్ ప్రాంతం వారే. కేసులు తగ్గుముఖం... రెండు నెలలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన అటవీ చట్టం కింద టాస్క్ఫోర్సుకు ప్రత్యేక విచారణాధికారాలను వర్తింపజేసింది. గతంలో మాదిరిగా టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేసిన స్మగ్లర్లను అటవీ, పోలీస్ అధికారులకు అప్పగించాల్సిన పనిలేదు. నేరుగా వీరే విచారణ చేయొచ్చు. కోర్టుకు కూడా పెట్టవచ్చు. అంతేకాకుండా ఫారెస్టు ప్రాంతాల్లోనే కాకుండా మైదాన ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ టాస్క్ఫోర్సు పోలీసులు తనిఖీలు చేయొచ్చు. కొత్త జీవో వచ్చాకనే ఈ తరహా వెసులుబాటు టాస్క్ఫోర్సు పోలీసులకు లభించింది. అప్పటి నుంచి తనిఖీలను ముమ్మరం చేశారు. దీంతో గడచిన రెండు నెలలుగా స్మగ్లింగ్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో అరికడుతాం అటవీశాఖలో వచ్చిన కొత్త చట్టాలు, టాస్క్ఫోర్సుకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలతో ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా, ఎర్రకూలీలను శేషాచల అడవుల్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించి రూ.కోట్లు దండుకున్న ప్రధాన స్మగ్లర్ల ఆట కట్టించేందుకు రంగం సిద్దం చేశాం. కొత్త చట్టాలతో స్మగ్లర్లకు శిక్ష పడేలా చేస్తాం. ఎం కాంతారావు, టాస్క్ఫోర్సు డీఐజీ -
సంగీత పేల్చిన ‘గన్’..!
► తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ► ఆలిండియా తుపాకీ లెసైన్సులు ► బుల్లెట్ సురేష్‌కు రూ.7 లక్షలకు పిస్టల్ విక్రయం ► పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో సంగీత స్పష్టీకరణ ► బుల్లెట్‌పై కేసు నమోదుకు రంగం సిద్ధం ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో ఆమె చెప్పిన వివరాల మేరకు పోలీసులు చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్‌పై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మన్ జైలులో ఉండగా సంగీత అన్నీ తానై వ్యాపారాన్ని యథేచ్ఛగా నడిపింది. అంతేగాక స్మగ్లర్లకు రూ.10 కోట్లు పంపిణీ చేసింది. ఈ క్రమంలో చిత్తూరు పోలీసులు పశ్చిమబెంగాల్లో సంగీతను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను ట్రాన్సిట్ వారెంట్‌పై చిత్తూరుకు తీసుకురావాలనుకున్నారు. కోల్‌కతాలో స్థానిక పరిస్థితులు అనుకూలిం చలేదు. దీంతో ఆమె అరెస్టును అక్కడే చూపించి ఒక రోజు జైలు ఉంచి తర్వాత బెయిల్‌పై విడుదల చేసిన విషయం తెలిసిందే. సంగీత చటర్జీని అరెస్టు చేసిన సమయంలో ఆమె నుంచి పోలీసులు కన్ఫెక్షన్ స్టేట్మెంట్ (నేర అంగీకార పత్రం)ను తీసుకున్నారు. ఇందులో అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం, తప్పుడు గన్లెసైన్సుల వివరాలు బయటపడ్డాయి. నలుగురి వద్ద లెసైన్సులు ఎర్రచందనం స్మగ్లింగులో అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన లక్ష్మణ్ రెండో భార్య సంగీత ఇచ్చిన సమాచారంతో చిత్తూరు పోలీసులు దర్యాప్తును లోతుగా చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తుపాకులు విచ్చలవిడిగా దొరుకుతాయి. వీటికి గన్లెసైన్సులు పొందడానికి లక్ష్మణ్, సంగీత చటర్జీ, సెల్వరాజ్, బుల్లెట్ సురేష్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్టు విచారణలో తేలింది. వాటితో గన్‌లెసైన్సు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ నలుగురు ఎర్రచందనం స్మగ్లింగులో అరెస్టయిన వాళ్లే. చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్ నాగాలాండ్‌లోని తిమ్మాపూర్‌లో నివాశముంటున్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి గన్‌లెసైన్సు తీసుకున్నాడని, ఇతను లక్ష్మన్ నుంచి రూ.7 లక్షలు వెచ్చించి ‘కామా’ పిస్టల్‌ను కొనుగోలు చేశాడని సంగీత చటర్జీ పోలీసులకు చెప్పింది. అక్కడి పోలీసు స్టేషన్లలో ఎలాంటి కేసులు లేవని ఎన్వోసీ తీసుకుని ఆలిండియా గన్‌లెసైన్సు పొందినట్లు పేర్కొంది. నాగాలాండ్ గన్‌లెసైన్సు ఉన్నప్పటికీ పిస్టోలు తనతోపాటు ఉంచుకోవాలంటే తప్పనిసరిగా స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) అనుమతి ఉండాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. బుల్లెట్ సురేష్‌కు అలాంటి అనుమతి లేదని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అతనిపై అక్రమ ఆయుధాల నిరోధక చట్టం, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించినందుకు మరో కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉంటూ ఇటీవల బెయిల్‌పై వచ్చిన బుల్లెట్ సురేష్‌కు సంగీత చటర్జీ కొత్త కేసుల్ని తెచ్చిపెట్టింది. -
రూ.3.5 కోట్ల ఎర్రచందనం పట్టివేత
పోలీసుల అదుపులో ఇద్దరు కూలీలు తిరుపతి మంగళం/ఎర్రావారిపాళెం: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున వన్యప్రాణుల విభాగం అధికారులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండు చోట్ల కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు సుమారు రూ.3.5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకొని, ఇద్దరు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. మామండూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం డంప్‌ను గుర్తించినట్లు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్‌వో) చలపతిరావు తెలిపారు. ఈ సమయంలో అధికారుల రాకను గమనించి కొందరు కూలీలు పరారవ్వగా.. తమిళనాడులోని వేలూరుకు చెందిన రమేశ్ అనే కూలీని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ, తువ్ముచేనుపల్లె ప్రాంతాల నుంచి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భాకరాపేట ఘాట్‌లో కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన సువూరు వంద మంది కూలీలు పోలీసులను చూసి రాళ్లతో దాడి చేసి పారిపోయేందుకు యుత్నించారు. ఈ దాడిలో శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ గాయుపడ్డాడు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. -
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి టోల్ ప్లాజా వద్ద భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.రెండున్నర కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతోంది. కేఎంఎం కళాశాల సమీపంలో కూంబింగ్ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. శుక్రవారం ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు యత్నం
-
అన్ని నివేదికల్ని కోర్టు ముందుంచండి
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసులో బాలిస్టిక్ విశ్లేషణ నివేదికలు, సీసీటీవీల నివేదికలు, డీఎన్ఏ రిపోర్టులు, పోస్టుమార్టం నివేదికలు, ఇతర స్థాయీ నివేదికల్ని సిద్ధం చేసి తమ ముందుంచాలని హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు స్పష్టం చేసింది. వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామంది. ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై సిట్ వాదనలు వినిపించేందుకు వీలుగా తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం, బాధిత కుటుంబసభ్యులు వేర్వేరుగా పిటిషన్లు వేయడం తెలిసిందే. అలాగే సిట్ ఏర్పాటును సవాలుచేస్తూ వాసిరెడ్డి శ్రీకృష్ణ అనే వ్యక్తి మరో పిటిషన్ వేశారు. వీటన్నింటినీ కలపి ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వృందాగ్రోవర్, డి.సురేశ్‌కుమార్, వి.రఘునాథ్‌లు ఈ కేసును సీబీఐకి ఎందుకప్పగించాలో వివరిస్తూ వాదనలు వినిపించారు. బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు? కేసు దర్యాప్తును పూర్తిచేసే విషయంలో సిట్ ఉద్దేశపూర్వకంగా అసాధారణ జాప్యం చేస్తోందని, దీనివల్ల బాధితులకు న్యాయం జరిగే పరిస్థితులుండవని, కాబట్టి కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీబీఐకి అప్పగించాలని వృందాగ్రోవర్ నివేదించారు. ఎన్కౌంటర్ కేసును హైకోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం స్వయంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ సిట్ జాప్యం చేస్తోందని, దీన్నిబట్టి దర్యాప్తు తీరు ఎలాగుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 10కి ఎన్కౌంటర్ జరిగి ఏడాదవుతుందని, అప్పటికీ దర్యాప్తు పూర్తికాలేదంటే.. బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నించారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయకుండా దర్యాప్తు ప్రారంభించడంలోనే సిట్ ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయన్నారు. -
'నేనేం పారిపోలేదు, వ్యాపార పనుల కోసం వెళ్లా'
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని మారిషస్‌లో అరెస్ట్ చేసినట్లు ఏపీ డీజీపీ రాముడు వెల్లడించారు. గంగిరెడ్డిపై కడప, కర్నూలు జిల్లాలలో పలు కేసులు ఉన్నాయనీ, వీటిపై సమగ్రంగా విచారణ జరగాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే గంగిరెడ్డి మాత్రం నేనెక్కడికీ పారిపోలేదు, వ్యాపార పనుల కోసం మారిషస్ వెళ్లాను, నా టైం బాగోలేదు కాబట్టే ఇలా జరిగింది అంటున్నాడు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొనడం సరికాదని తనకు ఎవరి నుండి ప్రాణహాని లేదని గంగిరెడ్డి తెలిపాడు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఇంటర్‌పోల్ అధికారులు మారిషస్‌లో గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. చాలా కాలంగా ఆయన్ని ఇండియాకు రప్పించడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించి ఎట్టకేలకు తమ అదుపులోకి తీసుకున్నారు. -
'ఎర్ర' స్మగ్లర్ల ఆస్తులు జప్తు!
- అటవీచట్టం-1967లో సవరణల ద్వారా సాధ్యం.. ఆ దిశగా ఆలోచించండి - శాంతిభద్రతల సమీక్షలో అధికారులతో సీఎం చంద్రబాబు అవసరతీసుకురావాల్సి సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్ల కార్యకలాపాలు మళ్లీ పెరిగాయని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసే అధికారం ఉండేలా అటవీచట్టం-1967లో సవరణలు తీసుకురావాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై సీఎం తన నివాసంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం స్మగర్ల ఆగడాలకు అరికట్టేలా నిరంతరం నిఘా ఉంచాలని, సీసీటీవీ మానిటరింగ్, ఎఫెక్టివ్ ట్రెంచింగ్, అవుట్‌పోస్టులు పెంచడం, అదనపు సిబ్బంది నియామకం వంటి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పోలీస్ శాఖలో సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసుకుని, నేరాల నియంత్రణలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో సమర్థత పెంచుకోవాలని అన్నారు. గతంలో పలు నేరాల్లో గుర్తించిన 2వేల మంది నేరగాళ్ల వేలిముద్రలు, ఐరీష్ నమూనాలను సేకరించి సెంట్రల్ సర్వర్‌లో నమోదు చేసి వారి కదలికలపై నిఘా పెంచాలని అన్నారు. అన్ని స్థాయిల్లోను పోలీసులు పనిచేసిన చోట్ల నేరాల నియంత్రణలో పనితీరుపై ఐదేళ్ల ట్రాక్ రికార్డును తయారు చేయాలని అన్నారు. వారి హయాంలో ఆయా స్టేషన్లలో నమోదైన కేసుల సంఖ్య, నిందితులకు పడ్డ శిక్షలు తదితర వివరాలతో పోలీసుల పనితీరును బేరీజు వేసే ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. భవిష్యత్‌లో పోలీస్ శాఖలో తీసుకునే నిర్ణయాలకు ఈ ట్రాక్ రికార్డు ఒక ప్రాతిపదికగా ఉంటుందని అన్నారు. సమావేశంలో శాంతిభద్రతల డీడీజీ ఆర్పీ ఠాకూర్, ఇంటలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఐజీ హరీశ్‌గుప్తా, విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లు గౌతం సవాంగ్, అమిత్‌గార్గ్, సీఎంవో సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న పాల్గొన్నారు. -
భారీగా ఎర్రచందనం డంప్ స్వాధీనం
వెలుగొండ అడవుల్లో భారీఎత్తున నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగల డంప్‌ను స్పెషల్ పార్టీ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగలను నెల్లూరు జిల్లాకు తరలించినట్లు తెలిసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు సమీప వెలుగొండ అడవుల్లో గత రెండురోజులుగా స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్‌లో సుమారు రూ.50 లక్షల విలువ చేసే 50 ఎర్రచందనం దుంగలు దొరికినట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ పోలీసు అధికారి పర్యవేక్షణలో డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఎర్రచందనం దుంగలు స్వాధీనం విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. వెలుగొండల్లో ఇంకా ఎర్రచందనం దుంగలు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారంతో ముమ్మరంగా గాలింపుచర్యలు చేపడుతున్నారు. -
ఇసుక రవాణాలో కొత్త ఎత్తులు
- ట్రాక్టర్‌కు బదులు ఐషర్ వాహనాల్లో తరలింపు - ఒకే రశీదుతో పలు ట్రిప్పులు - అనేక ఉపాయాలతో అక్రమాలకు పాల్పడుతున్న వైనం ప్రొద్దుటూరు : ఎర్రచందనం లాగే ఇసుక అక్రమ రవాణాలో కూడా కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల కంట పడకుండా ఉండేందుకు గాను పలు రకాలుగా తీసుకెళ్తున్నారు. ఇందుకోసం వాహనాలను మార్చుతున్నారు. సాధారణంగా ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్తుండగా ప్రొద్దుటూరులో ప్రత్యేకంగా ఐషర్ వాహనాలను కొనుగోలు చేసి పైన వాటికి పట్ట కప్పి ఇసుకను తీసుకెళుతూ పట్టుబడ్డారు. వాహనంపై పట్టలు కప్పడంతో ఏదైనా శుభ కార్యానికి వెళుతున్నారేమోనని అనుకునేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఒకే రశీదుతో పలుమార్లు ఇసుక రవాణా చేస్తున్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. తహశీల్దార్ కార్యాలయం వద్దనున్న ఇసుకను గృహ, మరుగుదొడ్ల నిర్మాణాలకు తీసుకెళ్లేందుకు ఆర్డీఓ అనుమతి తీసుకుంటున్నారు. చలానా చెల్లించి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఇసుక తీసుకెళ్లడంతోపాటు అదే రశీదు చూపి పలు మార్లు పెన్నా నదిలో నుంచి రవాణా చేస్తున్నారు. ఒక ట్రిప్పునకు బదులు మూడు, నాలుగు దొంగ టిప్పులు తోలుకుంటున్నారు. ఇటీవల బైపాస్ రోడ్డులో వెళ్తున్న ట్రాక్టర్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉంచారు. ఉదయాన్నే ట్రాక్టర్ లోడ్ చేసుకున్నావు కదా ఇంకా ఎందుకు అన్లోడ్ చేయలేదని వీఆర్ఓ డ్రైవర్‌ను ప్రశ్నించగా.. టైర్లు పంచర్ అయ్యాయని, అందుకే ఆలస్యమైందని చెప్పడం గమనార్హం. పేరుకుపోతున్న నిల్వలు: స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద మొత్తంలో ఇసుక నిల్వలు వృథాగా ఉన్నాయి. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ ఇసుకను రెవెన్యూ అధికారులు పట్టుకుని ఇక్కడ నిల్వ చేస్తున్నారు. నిత్యం వాహనాలు పట్టుబడటం, ఇసుకను ఇక్కడ అన్లోడ్ చేయడం జరుగుతోంది. దీంతో కార్యాలయం ప్రాంగణమంతా ఇసుక నిల్వలు రాశులుగా ఉన్నాయి. ఎక్కువ రోజులు అవుతుండటంతో ఇసుక నిల్వలు మట్టిదిబ్బలుగా మారుతున్నాయి. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిళ్లుతోంది. అదే విధంగా కార్యాలయానికి వచ్చే వెళ్లే వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంటనే అధికారులు నిబంధనల ప్రకారం ఇసుకను అమ్మితే సమస్య పరిష్కారం అవుతుంది. -
ఎర్రచందనం దుంగల పట్టివేత
-
ఎర్రచందనం టెండర్‌కు స్పందన కరువు
- 3,500 టన్నుల్లో 1,300 టన్నులకే టెండర్లు తిరుపతి మంగళం : రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ఎంఎస్టీసీ సంస్థ ద్వారా ఎర్రచందనం విక్రయానికి నిర్వహించిన గ్లోబల్ టెండర్లకు స్పందన కరువైంది. మొదటి దశలో 1,400 టన్నుల ఎర్రచందనానికి నిర్వహించిన టెండర్లలో 1100 టన్నులకు టెండర్లు వచ్చాయి. రెండో విడతలో భాగంగా ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు టెండర్లు నిర్వహించారు. రెండో దఫా నిర్వహించే టెండర్లపై గంపెడాశపెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి చేదు పరిస్థితిలు ఎదురయ్యాయి. దుంగల రూపంలో ఎర్రచందనం ఎగుమతికి టెండర్లకు సంబంధించిన సైటీస్, డీజీఎఫ్టీ(డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్), వాణిజ్యశాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల నేపథ్యంలో రెండో దఫా టెండర్లకు అటవీశాఖ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రేణిగుంట సమీపంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో నిల్వ ఉంచిన 4వేల మెట్రిక్ టన్నుల్లో 3500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలకు ఈనెల 17 నుంచి 20వతేదీ వరకు టెండర్లు నిర్వహించారు. 3500 మెట్రిక్ టన్నులకుగానూ కేవలం 1300 టన్నులకు మాత్రమే టెండర్లు వచ్చాయి. ఎర్రచందనం వేలం ద్వారా రూ.కోట్లాది ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఆశించింది. తొలి దశ వేలంలో సుమారు రూ.800 కోట్లు వరకు ఆదాయం సాధించాలని భావించినా సరైన ప్రచారం లేకపోవడంతో అది సాధించలేకపోయ్యారు. అయితే రెండో దఫా టెండర్ల ద్వారా విక్రయించే ఎర్రచందనం దుంగల్లో ఎక్కువ శాతం ఎ,బి గ్రేడ్ దుంగలే ఉండడంతో ప్రభుత్వ లక్ష్యం కూడ పూర్తవుతుందని అటవీశాఖ భావించింది. ఎలాగైనా ఎర్రచందనం టెండర్లకు మంచి ఆదరణ లభించేలా విదేశాల్లో సైతం ఒక ప్రత్యేక బృందాలతో ప్రచారం కూడ నిర్వహించారు. అయినా అటు ప్రభుత్వం ఇటు అటవీశాఖ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. మొదటి దఫా నిర్వహించిన టెండర్లలో కొనుగోలు చేసిన గుత్తేదారులు చాలామంది ఇంతవరకు ఎర్రచందనం దుంగలను తీసుకెళ్లకుండా అలానే వదిలేశారు. రెండుసార్లు నిర్వహించిన టెండర్లలో ఔత్సాహికుల నుంచి స్పందన కరువు అవడంతో ప్రభుత్వం, అటవీశాఖ నిరాశకు గురయ్యాయి. అయితే ముంబయిలోనిడెమైండ్ సంస్థ ప్రతినిధులు గతంలో టెండర్లలో కొనుగోలు చేసిన ఎర్రచందన దుంగలను తీసుకెళ్లేందుకు శనివారం అలిపిరి వద్ద ఉన్న అటవీశాఖ కార్యాలయానికి వచ్చారు. ఎర్రచందనాన్ని తీసుకెళ్లేందుకు కావాల్సిన అనుమతులన్నీ పొందామని, తమ సరుకు అప్పజెప్పాలని ఫారెస్ట్ రేంజర్ బాలవీరయ్యను కోరారు. అనుమతులను పూర్తిస్తాయిలో పరిశీలించి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేస్తామని చెప్పారు. -
ముగ్గురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ యాక్ట్
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం అక్రమ రవాణాలో ఇప్పటికే పోలీసులు అరెస్టుచేసిన ముగ్గురు స్మగ్లర్లపై ప్రివెన్టివ్ డిటెక్టివ్ (పీడీ) యాక్టు నమోదు చేస్తూ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ శనివారం ఆదేశాలు జారీచేశారు. చిత్తూరు నగరానికి చెందిన షేక్‌మున్నా (33) అనే లెఫ్ట్ మున్నా, రియాజ్ బాషా (32) అనే దాడీ మున్నా, శ్రీనివాసులు మధు (35) అనే చింతచెట్టు మధుపై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. నిందితులు ముగ్గురినీ చిత్తూరులోని జిల్లా జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుల నేర చరిత్రకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. షేక్ మున్నా : చిత్తూరు నగరంలోని అశోకపురానికి చెందిన మక్బూల్ కుమారుడైన ఇతను ఆరో తరగతి వరకు చదువుకున్నాడు. లారీ డ్రైవర్ జీవనాన్ని గడిపేవాడు. అయితే 2011 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాలో అడుగుపెట్టాడు. ఎస్కార్ట్‌గా పనిచేస్తూ స్మగ్లర్‌గా ఎదిగాడు. కర్ణాటకకు చెందిన స్మగ్లర్లతో పరిచయాలు ఉన్న ఇతనిపై పోలీసులు ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేశారు. ఇతని నెలసరి ఆదాయం దాదాపు రూ.3 లక్షలు. రియాజ్‌బాషా : చిత్తూరు నగరంలోని లాలూ గార్డెన్‌కు చెందిన చాంద్సాహెబ్ కుమారుడైన రియాజ్‌బాషా పట్టభద్రుడు. త్వరగా లక్షాధికారి అయిపోవాలనే అత్యాశతో 2011లో ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి అడుగుపెట్టాడు. ఇతనూ ఎస్కార్ట్‌గా జీవితం ప్రారంభించి స్మగ్లర్‌గా ఎదిగాడు. ఇతనిపై జిల్లాలో 16 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇతని నెలసరి ఆదాయం సుమారు రూ.4 లక్షలు శ్రీనివాసులు మధు : చిత్తూరు నగరంలోని ఆర్టీసీ డిపో రోడ్డులో ఉన్న బాలాజీ కాలనీకి చెందిన ఇతను పాలిటెక్నిక్ (మెకానికల్ ఇంజినీరింగ్) చదువుకున్నాడు. ఫైనాన్స్ వ్యాపారంచేస్తూ 2011లో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రవేశించాడు. పెలైట్ నుంచి స్మగ్లర్‌గా ఎదిగాడు. ఇతనికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లతో, బడా స్మగ్లర్ కమల్ కిషోర్‌తో పరిచయాలున్నాయి. ఇతను ఇప్పటివరకు సుమారు 150 టన్నుల ఎర్రచందనం జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేశాడు. ఇతనిపై జిల్లాలో 13 కేసులు ఉన్నాయి. ఇతని నెలసరి ఆదాయం సుమారు రూ.5 లక్షలు. -
బరితెగించారు..
- రేణిగుంట చెక్‌పోస్టు వద్ద దారుణం - పట్టుకోబోయిన సిబ్బందిపై దూసుకెళ్లిన లారీ - ప్రయివేటు జవాన్ దుర్మరణం రేణిగుంట: బడాస్మగ్లర్లు, అక్రమరవాణాదారులు బరితెగిస్తున్నారు. తమ వ్యాపారానికి అడ్డొస్తున్నా రన్న నెపంతో చెక్‌పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బందిని హతమార్చేందుకు సిద్ధ పడుతున్నారు. జిల్లాలో మరెక్కడా చోటు చేసుకోని విధంగా సోమవారం రేణిగుంట చెక్‌పోస్టు వద్ద జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. రేణిగుంట ఆర్టీఏ చెక్‌పోస్టులో సాంబశివ (47) ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆగకుండా వేగంగా వెళ్లిన లారీని పట్టుకోడానికి యత్నించి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఎర్రచందనం లోడుతో కర్ణాటకకు వెళ్తున్న లారీనే సాంబశివను ఢీకొట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనతో జిల్లాలోని చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న కిందిస్థాయి ఉద్యోగుల్లో ప్రాణభయం మొదలయింది. పట్టపగలే ఇలాంటి దారుణానికి ఒడిగట్టారంటే రాత్రుల్లో ఇంకెంతటి కిరాతకానికి పాల్పడతారోనన్న ఆందోళన నెలకొంది. చెక్‌పోస్టుల్లో వాహనాలు ఆగకుండా వెళితే వాటిని పట్టుకోడానికి ప్రత్యేక వాహనం ఉంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన. ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మృతదేహంతో ధర్నా అక్రమ రవాణా లారీ ఛేజింగ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన స్థానిక ఆర్టీఏ చెక్‌పోస్టు ప్రయివేటు జవాన్ సాంబశివ కుటుంబాన్ని ఆదుకోవాలని అతని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. రేణిగుంటలోని రామకృష్ణాపురానికి చెందిన సాంబశివ, హోంగార్డు సోమవారం అధిక లోడ్‌తో వెళుతున్న లారీని ఛేజింగ్ చేయగా, నాయుడుపేట-పూతలపట్టు రహదారిలో తూకివాకం వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆ లారీ ఢీకొని వెళ్లడంతో అతడు మృతిచెందాడు. అనంతరం ఎస్‌ఎన్‌పురం, రామకృష్ణాపురం వాసులు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి చెక్‌పోస్టు వద్ద అతని మృతదేహంతో ధర్నా నిర్వహించారు. సాంబశివ కుటుంబసభ్యులను ఆర్థికంగా ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ైబె ఠాయించారు. ఆర్టీఏ చెక్‌పోస్టులో ఇన్చార్జి అధికారిగా పనిచేస్తున్న ఎంవీఐ శివప్రసాద్, రేణిగుంట అర్బన్, రూరల్ సీఐలు బాలయ్య, సాయినాథ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. జీవనాధారం కోల్పోయిన కుటుంబం సాంబశివ మృతితో అతని కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది. మృతి చెందిన సాంబశివకు భార్య విమల, ఇద్దరు కమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె యోజన ఇంటర్మీడియట్, చిన్న కుమార్తె జ్యోత్స్న తొమ్మిదో తరగతి, కుమారుడు ఉదయ్‌కుమార్ ఆరో తరగతి చదువుతున్నారు. చెక్‌పోస్టులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డలను చదివిస్తూ వచ్చాడు. అతని మృతితో కుటుంబసభ్యులు బోరున రోదిస్తున్నారు. -
'ఎర్ర' కేసులో చైనా దేశీయుడి అరెస్ట్
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు చైనా దేశానికి చెందిన యంగ్‌పెంగ్ (36)ను గురువారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో హైదరాబాదు-వరంగల్ హైవేపై అరెస్టు చేశారు. అతని నుంచి రెండు ఎర్రచందనం దుంగలు, పాస్‌పోర్టు, చైనా దేశానికి చెందిన కరెన్సీని, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి సిబ్బియాలకు చెందిన కె. శ్రీనివాసరాజు (40)ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరినీ చిత్తూరులోని మూడో అదనపు జిల్లా కోర్టులో శుక్రవారం హాజరుపరచగా న్యాయమూర్తి రాఘవేంద్ర ఈనెల 21వ తేదీ వరకు రిమాండు విధించారు. వీరిని చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. గతనెల 24న టూరిస్ట్ వీసాపై యంగ్‌పెంగ్ చైనా నుంచి హైదరబాదుకు చేరుకున్నారు. ఇతనికి ఎర్రచందనం దుంగలను విక్రయించడానికి మన రాష్ట్రానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాదు సమీపంలోని ఘట్కేసర్ టోల్‌ప్లాజా వద్ద గురువారం అర్ధరాత్రి స్మగ్లర్లంతా డీల్ కుదుర్చుకుంటుండగా చిత్తూరు జిల్లాకు చెందిన ఆపరేషన్ రెడ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడిచేసి పట్టుకున్నారు. -
‘ఎర్ర’ స్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్ ఉక్కు పిడికిలి
- 181 మంది స్మగ్లర్లపై సస్పెక్ట్ షీట్స్ - మరో పది మందిపై పీడీ యాక్ట్ - టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నిరంతర నిఘా - వారానికొకమారు పోలీసు కౌన్సెలింగ్ - ‘సాక్షి’తో చిత్తూరు టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ రత్న సాక్షి,చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్ ఉక్కు పిడికిలి బిగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 181 మంది ఎర్రస్మగ్లర్లపై టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణలో సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తోంది. కొత్తగా మరో పది మంది స్మగ్లర్లపై పీడీ యాక్టు కేసులు సైతం నమోదు చేస్తోంది. ఈ విషయాలను ఏఎస్పీ టాస్క్‌ఫోర్స్ రత్న శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు. ఇప్పటివరకూ పది చందనం స్మగ్లింగ్ గ్యాంగ్‌లపై సస్పెక్ట్ షీట్స్ నమోదు చేసినట్లు చెప్పారు. ఇందులో ఆయా గ్యాంగుల్లోని లీడర్లతోపాటు వారి అనుయాయులు,ఎస్కార్ట్, వాహనాలు సమకూర్చినవారు, నడిపేవారు తదితరులు ఉన్నారన్నారు. ఒక్కొక్క గ్యాంగ్‌లో ఆరు నుంచి 24 మంది వరకూ ఉన్నారని ఏఎస్పీ చెప్పారు. ఇప్పటివరకూ 181 మంది పైనే షీట్లు ఓపన్ చేసినా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జాబితాలోనివారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. వారానికొకమారు పోలీసు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. వారు తిరిగి స్మగ్లింగ్‌కు పాల్పడితే కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెక్ట్ షీట్లో ఆ వివరాలు నమోదు చేస్తామన్నారు. దీన్నిబట్టి పోలీసులు రౌడీషీట్లు సైతం నమోదు చేసే అవకాశం ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. ఐదుకు మించి కేసులు నమోదైతే పీడీయాక్టు నమోదు చేస్తామన్నారు. ఇప్పటివరకూ 35 పీడీ యాక్టు కేసులు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు. వారిలో 15 మంది వరకూ బెయిల్ పై బయట ఉన్నారన్నారు. వారిపై కూడా నిరంతరం నిఘా ఉంటుందన్నారు. తిరిగి స్మగ్లింగ్‌కు పాల్పడితే మరో మారు పీడీ పీడీయాక్టు కేసులు సమోదు చేసేందుకు వెనుకాడబోమన్నారు. కొత్తగా మరో పదిమంది స్మగ్లర్లపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తున్నామన్నారు. వీరిలో చిత్తూరు,తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. చందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న ఇంటి దొంగలపై చర్యలుంటాయని ఏఎస్పీ తెలిపారు. ఇందుకోసం ఉన్నతాధికారులు మార్గదర్శకాలు రూపొందిస్తున్నారన్నారు. త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయని ఏఎస్పీ స్పష్టం చేశారు. చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఇప్పటివరకూ 336 కేసులు నమోదు చేశామన్నారు. దాదాపు రెండు వేల మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చిత్తూరు పరిధిలోని కేసులకు సంబంధించి మరో 400 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. వీరితో పాటు మరో పది మంది అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. వీరిలో తమిళనాడు,కర్ణాటక వారు మాత్రమే ఉన్నట్లు ఆమె చెప్పారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్ల జాబితా కూడా ఉందన్నారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన స్మగ్లర్లు ఉన్నట్లు ఏఎస్పీ చెప్పారు. సౌందర్‌రాజన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందన్నారు. కొత్త స్మగ్లర్ల జాబితా తెలిసే అవకాశం ఉందన్నారు. కస్టడీ కోసం కోర్టుకు విన్నవించినట్లు ఆమె చెప్పారు. చందనం స్మగ్లింగ్‌కు అడ్డు కట్ట వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. -
10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రైల్వే కోడూరు మండలం వాగేటికోన చెరువు సమీపంలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను మంగళవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు. వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమరవాణాపై సమాచారం అందటంతో తనిఖీలు నిర్వహించినట్టు అటవీ అధికారులు తెలిపారు. కాగా పట్టుబడ్డ ఎర్రచందనం నిందితులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏడుగురు డిగ్రీ విద్యార్థులను బైండోవర్ చేశారు. -
ఎన్కౌంటర్లపై కేంద్రం జోక్యం చేసుకోదు
అది రాష్ట్రాల అంశం: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, అవి రాష్ట్రాలకు సంబంధించిన అంశాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్కౌంటర్ల అంశం రాష్ట్రాల పరిధిలోనిది. వాటిపై కేంద్రం జోక్యం చేసుకోదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆ రాష్ర్ట ప్రభుత్వంపైనే ఉంది. ఎన్కౌంటర్ వల్ల తమిళనాడు, ఏపీల మధ్య ఏర్పడిన వివాదం ఏక్కడికి వెళుతుందో చూద్దాం. సిమి ఉగ్రవాదులను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్ధంగా పనిచేసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎన్కౌంటర్ జరిగితే కొంత మంది తీవ్రంగా స్పందిస్తున్నారు. సామాన్య ప్రజలు, పోలీసులు అలాంటి సంఘటనల్లో మరణిస్తే వీరు కనీసం మాట కూడా మాట్లాడరు. గతంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపితే మజ్లిస్ నేతలు ఎందుకు నోరు మెదపలేదు. పోలీసులు మనుషులు కాదా?. ఎన్కౌంటర్లపై విచారణ జరపాలని కోరడంలో తప్పులేదు. కానీ అసహాయులు చనిపోయినప్పుడు మౌనం వహించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల అతిగా స్పందించడం సరికాదు. ‘బోస్’ నిఘా వార్తలపై కాంగ్రెస్‌కు ఉలుకెందుకు? జాతి నేత సుభాష్ చంద్రబోస్ కుటుంబంపై గతంలో 20 ఏళ్లపాటు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న కథనాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను దేశ ప్రజల ముందుంచాలి. ఈ విషయాలు బయటకు పొక్కగానే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కి పడుతోంది?. ఇళ్లు కొనేవారు, అమ్మేవారిద్దరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రియల్ఎస్టేట్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులైజేషన్ చట్టం ఆమోదం కోసం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టబోతోంది. -
తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తమిళనాడు ముఖ్యమత్రి పన్నీర్ సెల్వంకు లేఖ రాశారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే పూర్తి వివరాలు సమర్పిస్తామని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన తమిళులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిచాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీ పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు ఆయన ఓ లేఖ రాశారు. స్మగ్లింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయి న్యాయవిచారణ జరిపించాలని, మరణాలను మానవహక్కుల ఉల్లంఘన కోణంలో విచారించాలని లేఖలో పన్నీరు సెల్వం పేర్కొన్నారు. ఆయన లేఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. -
ఎర్రచందనం స్మగ్లింగ్- సిసి పుటేజీ
-
ఎర్ర చందనానికి ఎందుకంత క్రేజ్?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో విస్తారంగా దొరికే ఎర్ర చందనానికి అంతర్జాతీయ డిమాండ్ ఎంతో ఉంది. దీంతో అక్రమంగా చెట్లను నరికేసి దుంగలకు తరలించే దొంగలు కూడా ఎక్కువే. అలా దొంగల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న ఎర్ర చందనం దుంగల్లో కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలం వేయగా అక్షరాల వెయ్యి కోట్ల రూపాయలు వచ్చాయి. కేంద్ర విదేశీ వాణిజ్య విభాగం డెరైక్టర్ జనరల్ అనుమతితో 2014, డిసెంబర్ నెలలో 4,160 టన్నుల ఎర్ర చందనాన్ని ఏపీ ప్రభుత్వం ఈ వేలం వేయగా ఈ వెయ్యి కోట్ల రూపాయలు వచ్చాయి. వేలంలో టన్నుకు 27.41 లక్షల రూపాయల ధర పలికింది. దొంగల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనంలో ప్రభుత్వం వద్ద ఇంకా 4,694 టన్నుల చందనం ఉంది. దీన్ని ఈ ఏడాది ప్రభుత్వం వేలం వేయాలని భావిస్తోంది. రైతుల రుణాలను ఎలా మాఫీ చేస్తారంటూ విపక్షం నుంచి వచ్చిన విమర్శలకు ఎర్ర చందనాన్ని వేలం వేయడం ద్వారా మాఫీ చేస్తానని ఓ దశలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం తెల్సిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్ర చందనాన్ని కొనుగోలు చేయడానికి చైనా, జపాన్, సింగపూర్ లాంటి దేశాలు ముందున్నాయి. ‘అంతర్జాతీయ ప్రకృతి సంపద పరిరక్షణ సంఘం’ జాబితాలో చోటు చేసుకోవడం వల్ల ఎర్ర చందనం క్రయవిక్రయాలపై అంతర్జాతీయంగా పలు అంక్షలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరులోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించివున్న శేషాచలంలో అడవుల్లో 4.67 లక్షల హెక్టార్లలో ఎర్ర చందనం వనాలు విస్తారంగా ఉండడంతో అంతర్జాతీయ ఆంక్షల అడ్డంకి మనకు పెద్దగా లేదు. అలా అని చెట్లను పూర్తిగా నరికేసుకుంటామంటే కుదరదు. వేలం వేయడానికి కూడా కేంద్రం అనుమతి తప్పనిసరి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం విస్తారంగా ఎర్ర చందనం వనాలు ఉన్నప్పటికీ వాటిని పరిరక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందే. అందుకనే చందనం వేలం ద్వారా వచ్చే సొమ్ములో 30 శాతం సొమ్మును ఆ వనాల పరిరక్షణకు, మిగతా 70 శాతం సొమ్మును రైతుల రుణాల మాఫీకి ఉపయోగిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పురుషుల్లో వంధ్యత్వం నివారణకు, మహిళల్లో సంతానప్రాప్తికి ఉపయోగించే మందుల్లో ఎర్ర చందనాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. అలాగే సంగీత వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తారు. అంతేకాకుండా విలాసవంతులు ఎర్రచందనంతో ఫర్నీచర్ కూడా చేయించుకుంటారు. -
ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన తమిళులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఏపీ పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన ఓ లేఖ రాశారు. స్మగ్లింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయి న్యాయవిచారణ జరిపించాలని, మరణాలను మానవహక్కుల ఉల్లంఘన కోణంలో విచారించాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఎన్ కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలో ఏపీ డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. పలు తమిళ రాజకీయ పార్టీలు ఆంధ్రా ఆస్తులపై దాడి చేస్తామని హెచ్చరించాయి. తమిళ కూలీలెవ్వరూ ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లొద్దంటూ సరిహద్దు వద్ద తమిళనాడు అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. -
ఎన్‌కౌంటర్‌పై రాజ్‌నాథ్‌కు సీఎం వివరణ
ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. తమిళనాడుకు చెందిన పలు రజకీయ పార్టీలు ఎన్‌కౌంటర్‌పై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం కేంద్ర మంత్రికి ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ తీరు తెన్నుల్ని రాజ్‌నాథ్‌కు వివరించారు. అంతకు ముందు గవర్నర్ నరసింహన్‌కు కూడా ఎన్‌కౌంటర్‌పై వివరణ ఇచ్చారు. -
ఎర్రచందనం పట్టివేత
చిన్నమండెం : 10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలంలోని దేవగుడిపల్లె గ్రామం మాండవ్యనది నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించి 10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రామాపురం మండలానికి చెందిన వీరనాగయ్య, సుబ్బయ్య, చలపతినాయుడు, రైల్వేకోడురుకు చెందిన బాబు, రవి, రామంజనేయులు అనే ఆరుగురు కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్లీజ్..అడవులకొచ్చి బలికావద్దు
రేణిగుంట : అమాయకత్వంతో శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు వచ్చి అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దు.. ప్లీజ్.. అంటూ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు ఎర్రచందనం కూలీలను వేడుకున్నారు. రేణిగుంట పట్టణ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులోని సేలం, ధర్మపురి, తిరువణ్ణామైలై, తిరువళ్లూరు ప్రాంతాల నుంచి అధికంగా ఎర్ర కూలీలు వస్తున్నారని, కిలోకు రూ.300లు ఇస్తారనే ఆశతో వచ్చే కూలీలు, మేస్త్రీలు దయచేసి మానుకోవాలని కోరారు. శేషాచల అడవులను కాపాడుకోవాలనే దృఢసంకల్పంతో అటవీ, పోలీసు శాఖలు టీమ్ స్పిరిట్‌తో ధైర్యంగా ముందుకు సాగుతున్నాయన్నారు. త్వరలో గ్లోబెల్ పొజిషన్ సిస్టమ్, అడవుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, గగనతలం నుంచి అడవులను పరిశీలించే విధానాల ద్వారా అటవీ సంపదను కాపాడుకునే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. 5.5టన్నుల ఎర్రచందనం స్వాధీనం రేణిగుంట మండలం కృష్ణాపురం సమీపంలోని రాళ్లకాల్వ వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 5.5 టన్నుల(184 దుంగలు)ఎర్రచందనం దుంగలను సోమవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ కాంతారావు తెలిపారు. సుమారు 200 మంది ఎర్రకూలీలు రాళ్ల వర్షం కురిపించినా ఆత్మస్థైర్యంతో ఎదిరించి ఎర్ర సంపదను కాపాడినట్లు చెప్పారు. టాస్క్‌ఫోర్స్ చురుకుగా కదలడంతో ఎర్ర కూలీలు పారిపోయారని పేర్కొన్నారు. సంఘటన స్థలంలో వారు వదలిపెట్టిన బ్యాటరీలు, సంచులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడులు నిర్వహించడంలో చాకచక్యంగా వ్యవహరించిన డీఎఫ్‌వో శ్రీనివాసులు, రేణిగుంట డీఎస్పీ నంజుండప్పను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో సీఐ బాలయ్య, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత
అనంతపురం: అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పరిగి మండలం ఊస్సేనాపురం గ్రామ సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద సోమవారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించారు. రిఫర్(సన్నటి చెక్కలు) లోడ్‌తో వెళ్తున్నలారీలో ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు. చెన్నై నుంచి ముంబాయికి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందన్నారు. లారీ డ్రైవర్ సుబ్రమణ్యంను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (తాడిపత్రి) -
అభయారణ్యమే రక్తచందనానికి రక్ష
అంతరించిపోతున్న పక్షి, జంతుజాతుల పరిరక్షణ, వృద్ధికృషిలో అభయారణ్యాల వల్ల మంచి ఫలితాలు లభించాయి. అలాగే ఎర్రచందన ప్రాంతాలను కూడా అభయార ణ్యంగా గుర్తించి, ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. రక్తచందనం! దక్షిణ భార తంలోని తూర్పు కనుమలకే పరిమితమైన అరుదైన ఈ కలప కోసం రక్తం చిందుతోం ది. ఎర్ర బంగారంగా పేరు మోసిన అపురూప సంపద అంతర్జాతీయ స్మగ్లర్ల గొడ్డలి వేటుకు బలైపోతోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవులకే నేడు పరిమితమైన ఎర్రచందనం ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొం ది. ఎర్రచందనం ప్రధానంగా చిత్తూరు, కడప, కర్నూ లు, నెల్లూరు జిల్లాల్లోనే ఉంది. ప్రపంచంలో మరెక్కడా దొరకని ఈ కలపను పూర్వీకులు రోకళ్లుగా ఉపయోగిం చేవారు! దశాబ్దంనర క్రితం నేను కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తుండగా వంట చెరకుగా, గుడిసెల గుంజలుగా, బొమ్మల తయారీకి ఆ కలపను వాడటం చూశాను. అపు రూపమైన ఈ కలపను ఇలా వాడటమేమిటని ప్రశ్నిస్తే ప్రజలు విస్తుపోవడమూ గమనించాను. ఆ నాలుగు జిల్లాల్లో దాన్ని రక్త చందనం అంటారనీ అప్పుడే తెలి సింది. పాత కాలపు ఫర్నిచర్‌గా దర్శననిచ్చే ఎర్రచంద నానికి పెనుముప్పు రానున్నదని గానీ, ప్రపంచంలో మరే కలపకు లేని ధర దానికి పలుకుతుందని గానీ ఊహించలేకపోయాను. స్మగ్లర్ల నుంచి దాన్ని రక్షించడా నికి అధికారులు రక్తం చిందించాల్సి వస్తుందని అసలే అనుకోలేదు. ఈ మధ్య ఏపీ ప్రభుత్వం ఎర్రచందనం దుంగలను వేలం వేస్తే మొదటి శ్రేణి కలపకు కిలో పదిహేను వేల రూపాయల ధర పలికింది. దాదాపు వెండి ధరలో సగం! ఇంత విలువ కాబట్టే ప్రభుత్వం దాని ఎగుమ తులను నిషేధించినా స్మగ్లర్లు, అసాంఘిక శక్తులు ప్రాణా లు తియ్యడానికి, ఇవ్వడానికి వెనుకాడక అక్రమ రవా ణాకు పాల్పడుతున్నారు. అసలు ఈ కలపకు విదేశాల్లో అంత విలువ ఎందుకుంటుందో అంతుబట్టడం లేదు. చైనాలో సంగీత వాద్యాల, వాస్తు సంబంధ వస్తువుల తయారీలో వాడుతారని మాత్రం వింటున్నాం. అత్యంత ఖరీదైన ‘వయాగ్రా’ వంటి ఔషధాల తయారీలో వాడు తున్నారని కొందరు అంటున్నారు. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు స్మగ్లర్ల దుష్ట రాక్షస క్రీడ పట్ల ఉపేక్ష వహిం చడం వల్లనే ఎర్రచందనం అంతరించిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇప్పటికే ఎంతో అటవీ సంపదను, ప్రభుత్వ రాబడిని నష్టపోయాం. అంతరించిపోతున్న పక్షి, జంతు జాతుల పరిరక్షణ, వృద్ధిలో అభయార ణ్యాల వల్ల మంచి ఫలితాలు లభించాయి. అలాగే ఎర్ర చందన ప్రాంతాలను కూడా అభయారణ్యంగా గుర్తించి, ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఏం చెయ్యాలి? 1920లలో సర్ కేసిన్ అనే బ్రిటిష్ అటవీ అధికారి ఎర్ర చందనం అడవుల పరిరక్షణకు ఒంటరిగా చేసిన కృషి మనకు ప్రేరణ కావాలి. వర్షం కురిసిన ప్రతిరోజూ ఆయన సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్తూ కోటు జేబుల నిండా ఎర్రచందనం విత్తనాలను నింపుకొని, చేతికర్ర వాడి మొనతో తడిచిన నేలలో రంధ్రాలు చేస్తూ ఒక్కొక్క విత్తే వేసి బూటు కాలుతో మట్టి కప్పేవారు. ఏళ్ల తరబడి ఆ ఒక్కడు చేసిన కృషి ఫలితం చిత్తూరు నడిబొడ్డున సగ ర్వంగా నిలిచి ఉన్న 156 హెక్టార్ల వనం. రచయిత ఈ వ్యాసం రాసినది ఆ రక్తచందనం చెట్ల నీడన సేద తీరుతూనే! ఈ వృక్ష సంపద పరిరక్షణ ఆవశ్యకతపైనా, అం దుకోసం ఇప్పటికే ఉన్న చట్టాలపైనా ప్రజలకు అవ గాహన కల్పించాలి. అటవీ, పోలీసు సిబ్బందితో సమన్వయం ఉండేలా గ్రామగ్రామానా యువతతో నిఘా విభాగాల్ని ఏర్పాటు చేయాలి. విదేశాల్లో ఈ కలపను ఎందుకు ఉపయోగిస్తున్నారనే రహస్యాన్ని కని పెట్టి, ఆ అంతిమ వస్తువును మనమే తయారు చేసి ఎగుమతి చేయవచ్చు. తద్వారా దొంగ రవాణాను అరి కట్టడంతో పాటూ ప్రభుత్వ రాబడిని, విదేశీ మారక ద్రవ్య ఆర్జనను పెంచుకోవచ్చు. అడవుల్లోని వృక్షా లను ప్రభుత్వమే వయసు, వన్నె, చేవ ఆధారంగా గుర్తిం చి, నరికించి, తగురీతిన ఉపయోగించాలి. విలువైన వృక్షాలు వయసుమీరి ఎండిపోయి, చెదపట్టి వ్యర్థమైపో తున్నాయనే విమర్శా ఉంది. తమిళనాడులోని కృష్ణ గిరి, తిరువణ్ణామలై, సేలం, ధర్మపురి జిల్లాలే ఎర్ర చందనం నరికే కూలీలకు నెలవులు. ఒక్కో చెట్టుకు కూలిగా కొన్ని వేలు లభిస్తాయన్న ఆశతోనే వాళ్లు ఎంత కన్నా తెగిస్తున్నారు. స్వచ్ఛందసంస్థల సహాయంతో కలిసి ఆ ప్రాంతాల్లోని అక్రమ కూలీలలో పరివర్తనకు కృషి చేయాలి. తెగింపు కలిగిన కూలీలు లేనిదే స్మగ్లర్ల ఆటలు సాగవు. అటవీశాఖను సమూలంగా ప్రక్షా ళనచేసి నిజాయితీ, నిబద్ధత, సమర్థతలకు మారు పేరుగా తీర్చిదిద్దాలి. నాలుగు జిల్లాల్లోని దట్టమైన విలు వైన ఎర్రచందనం అడవుల రక్షణకుగానూ ప్రతి 20 చద రపు కిలోమీటర్లకు ఒక బీట్ ఆఫీసర్‌ను, అసిస్టెంటును నియమించాలి. అంతిమంగా అడవి రక్షణ బాధ్యత ఫారెస్టర్లు, బీట్ ఆఫీసర్లదే కాబట్టి రాజకీయ జోక్యం పట్ల వారిలో ఉన్న ఆందోళనలను తొలిగించి, ధైర్యాన్ని కలి గించి, ఉత్తేజితులను చేయాలి. సిబ్బందికి మంచి ఆయు ధాలను, ప్రత్యేక అధికారాలను సమకూర్చాలి. అవ సరమైన చోట్ల పటిష్టమైన కంచె నిర్మాణం చేపట్టాలి. స్మగ్లర్లకు కఠినశిక్షలు పడేలా చేయడమేగాక, వారికి రాజ కీయ అండదండలు ఉంటున్నాయన్న ఆరోపణే రాకుం డా నేతలు జాగ్రత్త వహించాలి. పోలీసు, రెవెన్యూ, అటవీ అధికారులు స్థానిక సంస్థలతో కలిసి పనిచే యాలి. ఈ అందరి భాగస్వామ్యమే ఎర్ర చందనం అడ వులకు రక్ష. ఎర్ర చందనం నర్సరీలను విస్తరింపజే యడంతో పాటూ, వాటిని పెంచుకుంటామనే రైతులకు మొక్కల్ని ఇచ్చి ప్రోత్సహించాలి. సందర్భం: డా॥కృష్ణ చంద్రమౌళి, (వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్ అధికారి) -
బైకులపై స్మగ్లింగ్ : నలుగురి అరెస్ట్
బద్వేలు: వైఎస్సార్ కడప జిల్లాలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఎర్రచందనం దుంగలను చిన్న చిన్న ముక్కలుగా కోసి అనుమానం రాకుండా వాటిని లగేజీ బ్యాగుల్లో పెట్టుకుని బైకులపై వెళుతూ మైదుకూరు వద్ద తనిఖీల్లో దొరికిపోయారు. రెండు బైకులపై వెళుతున్న షేక్ ఖాజారసూల్, గొడ్లవీటి వెంకటేశ్వర్లు, ఇమ్మిడిశెట్టి పెంచలయ్య, జి.చెన్నారెడ్డిలను గోపవరం రూరల్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎర్రచందనాన్ని, బైకులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారు నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.2.5 లక్షలు ఉంటుందని వారు చెప్పారు. -
రూ. 7 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం
పుంగనూరు: ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యాకలాపాలకు అడ్డుకునేందుకు అధికారులు ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతున్నా... ఎర్రచందనం అక్రమ రవాణాకు తెరపడటంలేదు. తాజాగా చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పుంగనూరు పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. చౌడేపల్లి మండల కేంద్రంలోని ఓ తోటలో ఎర్ర చందనం దుంగలను నిల్వచేసి వాటిని కర్ణాటక రాష్ట్రానికి తరలించే ప్రయత్నంలో ఉన్నట్టు పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో పలమనేరు డీఎస్పీ శంకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 7 లక్షల విలువచేసే ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
'ఎర్ర' దొంగల అరెస్ట్
కురబలకోట : చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని చెన్నామర్రి వద్ద రెండు రోజుల క్రితం పట్టుబడ్డ ఎర్రచందనం నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రూరల్ సీఐ మురళి, ముదివేడు ఎస్ఐ రామక్రిష్ణ శుక్రవారం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు... జిల్లాలోని ఎర్రావారిపాళెం ప్రాంతం నాగుల కుంట గ్రామానికి చెందిన ఎం.సురేష్ (34), రెడ్డెప్ప (26) బావా బావమరుదులు. దగ్గరున్న తలకోన అడవి నుంచి కొంత కాలంగా ఎర్రచందన కొట్టి ఒక చోట దాచారు. లోడుకు సరిపడ్డాక దీన్ని బెంగళూరుకు చెందిన వారికి మధ్యవర్తి ద్వారా అమ్మారు. దీన్ని ములకలచెరువు వరకు చేర్చడానికి టయోటా క్వాలీస్‌ను మాట్లాడుకున్నారు. రెండు రోజుల క్రితం ఆరుగురు ఎస్కార్టుతో బయలు దేరారు. కురబలకోట మండలంలోని అంగళ్లు వద్ద వేగంగా వెళుతుండగా స్పీడ్ బ్రేకర్ వల్ల క్వాలీస్ బేరింగ్ దెబ్బతింది. దీంతో బండి నడవడం కష్టంగా మారింది. చెన్నామర్రి వద్ద రోడ్డుపక్కన మట్టి రోడ్డు రావడంతో కొంత దూరం పోనిచ్చి ఎర్రచందనం దుంగల్ని దించేశారు. పరారవడానికి యత్నించగా అప్పటికే అక్కడికి చేరుకున్న రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సమీప కొండల్లోకి పరారయ్యారు. గాలింపులో వీరిద్దరు పట్టుపడగా అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సకాలంలో స్పందించి వీరిని పట్టుకోవడంతో జిల్లా ఎస్పీ రూరల్ సీఐ మురళి, ముదివేడు ఎస్ఐ రామకృష్ణ ఇతర సిబ్బందిని అభినందించారు. రివార్డు ప్రకటించనున్నట్లు సమాచారం. -
భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు అర్బన్: అటవీ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గాలిలోకి కాల్పుల జరపాల్సి వచ్చిందని కోడూరు ఏసీఎఫ్ వైవీ నరసింహరావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఐదు రోజులుగా 25మందితో కూంబింగ్ చేస్తున్నామన్నారు. శనివారం రాత్రి 10గంటల ప్రాంతంలో తమిళనాడు, ఆంధ్రాకు చెందిన సుమారు 200మంది ఎర్రచందనం కూలీలు తమకు తారసపడ్డారన్నారు. తమను చూడగానే ఇరువైపులా రాళ్లతో దాడి చేశారన్నారు. దీంతో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరపగా కూలీలు పారిపోయారన్నారు. అందులో కొంత మంది కూలీలు ‘రాళ్లతో కొట్టి చంపేయండిరా’ అంటూ తెలుగులో కేకలు వేశారన్నారు. సంఘటనా స్థలంలో ఇప్పటివరకు 200 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దుంగల కోసం ఇంకా గాలిస్తున్నామన్నారు. కాగా విషయం తెలిసిన వెంటనే డీఎఫ్ఓ వెంకటేష్ సంఘటనా స్థలికి చేరుకున్నారు. నిందితుల కోసం అడవి అంతా తీవ్రంగా గాలించారు. ఓబుళవారిపల్లె రైల్వేస్టేషన్లో ఇద్దరు తమిళనాడు కూలీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎఫ్ఓ తెలిపారు. -
ఆర్టీసీలో కలకలం
నంద్యాల: ఆర్టీసీలో కలకలం రేగింది. ఎర్రచందనం అక్రమ రావాణాలో ఆ సంస్థ డ్రైవర్ల పాత్ర ప్రధానం కావడం సంచలనం రేకెత్తిస్తోంది. తొలిసారి 11 మంది డ్రైవర్లను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో 21 మందిని అరెస్టు చేయడం గుబులు సృష్టిస్తోంది. ఈ ఉదంతంలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు ఆర్టీసీ డిపోలకు చెందిన 21 మంది హైటెక్ సర్వీసు డ్రైవర్లను వైఎస్సార్ జిల్లా రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారణ జరుపుతున్నారు. గత నెలలో నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన 11 మందిడ్రైవర్లను అరె స్టు చేసిన విషయం తెలిసిందే. ఒకేసారి 21 మంది డ్రైవర్లను పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకోవడం ఆర్టీసీలో కలకలం రేపింది. ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 32కు చేరింది. ఇంతటితో ఈ వ్యవహారం ఆగలేదని, మరో 10 మందిని అరెస్టు చేయాల్సి ఉందని సమాచారం. సహచరుల సమాచారం మేరకే... మొదటి ఎపిసోడ్లో పోలీసులకు చిక్కిన 11 మంది డ్రైవర్లు విచారణలో తెలిపిన వివరాల ప్రకారం తాజాగా 21 మందిని పోలీసులు అరెస్టు చేయగలిగారు. శుక్ర, శనివారాల్లో నంద్యాల డిపోలో 10 మంది, ఆళ్లగడ్డ డిపోలో ఐదుగురు, ఆత్మకూరు డిపోకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారందరిఈన రాజంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని విచారణ చేస్తే మరికొందరి పేర్లు బయటికి రావచ్చని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. రాజంపేట డీఎస్పీ అరవిందబాబు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. వీరే గాక చెన్నై సర్వీసులకు వెళ్తున్న ఇతర డిపోల డ్రైవర్ల పాత్ర కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొద్దునిద్రలో ఆర్టీసీ నిఘా వ్యవస్థ ఆర్టీసీ నిఘా విభాగం విఫల్యం వల్లే ఈ దారుణాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నై వెళ్లే సర్వీసుల డ్రైవర్లు అక్కడి నుంచి తిరుపతి మీదుగా రాజంపేటకు ఎర్రచందనం దొంగలను సురక్షితంగా పిల్చుకుని వచ్చేవారని సమాచారం. అందుకు ప్రతిఫలంగా ఒక్కో ట్రిప్పులో రూ.2 వేల నుంచి రూ.3 వేల మధ్యన స్మగ్లర్లు ఇచ్చేవారని తెలుస్తోంది. ఇలా నెలకు ఒక్కో డ్రైవర్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అదనపు ఆదాయం సమకూరేదని పోలీసులు తెలిపారు. చెన్నైనుంచి రాజంపేటకు వచ్చే ముందు తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు వెళ్లేవారు కాదు. కుక్కలదొడ్డి తదితర ప్రాంతాల్లో వీరిని వదలిపెడుతూ రాజంపేటకు వెళ్లి అక్కడి నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరుకు చేరుకునే వారని పోలీసులు కనుగొన్నారు. ఆర్టీసీ డీఎం హుస్సేన్‌సాహెబ్ ఏమంటున్నారంటే... 21 మంది డ్రైవర్లను రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మా దృష్టికి రాలేదు. పోలీసుల నుంచి కూడా ఎటువంటి సమాచారం మాకు లేదు. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. -
తవ్వేకొద్దీ..
క్రైం (కడప అర్బన్) : ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లకు తమిళ కూలీలను చేరవేస్తున్న వ్యవహారంలో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర ఉందని పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆధ్వర్యంలో గతనెల 2వ తేదీన ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన 11 మంది డ్రైవర్లను అక్బర్ హుసేన్ అనే కీలక డ్రైవర్‌తోపాటు అరెస్టు చేశారు. మరో డ్రైవర్‌ను గత వారంలో అరెస్టు చేశారు. పోలీసుల సిఫార్సు మేరకు ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన జోనల్ స్థాయి అధికారులు కర్నూలు, కడప, అనంతపురం రీజియన్ల పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు ఎవరైనా ఎర్ర కూలీలను తరలించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారా అనే విషయమై లోతుగా ఆరా తీశారు. గత ఏడాది కాలం నుంచి జరుగుతున్న వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఆర్టీసీ ఎండీ, జిల్లా ఎస్పీలకు జాబితా ఎర్ర కూలీలను చెన్నై నుంచి తరలించడంలో సంబంధం ఉన్న మరో 30 మంది డ్రైవర్ల జాబితాను విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రారావుకు ఇరవై రోజుల కిందట పంపించారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిర్దరణ కావడంతోనే వారి పేర్లను జాబితాలో చేర్చారు. ఆర్టీసీ ఎండీ సిఫార్సు మేరకు అదే జాబితాను జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీకి అందజేశారు. పోలీసుల అదుపులో 21 మంది డ్రైవర్లు కర్నూలు రీజియన్‌లో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు డిపోలకు సంబంధించిన డ్రైవర్లలో 21 మందిని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు ఇప్పటికే రాజంపేట డీఎస్పీ అరవిందబాబు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో నంద్యాల డిపోకు చెందిన 10 మంది డ్రైవర్లు, ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఐదుగురు డ్రైవర్లు, ఆత్మకూరుకు చెందిన ఆరుగురు డ్రైవర్లను అరెస్టు చేశారు. వీరిని నేడో, రేపో మీడియా ఎదుట హాజరు పరచనున్నారు. విజిలెన్స్ అధికారుల విచారణ వేగవంతం ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు ఎర్రచందనం స్మగ్లర్ల మామూళ్లకు కక్కుర్తిపడి చెన్నైనుంచి కర్నూలు రీజియన్‌కు చెందిన ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు డిపోల బస్సులలో రెండేసి సర్వీసులకు వచ్చే డ్రైవర్లు తమిళ కూలీలను జిల్లాలోని అటవీ ప్రాంతాల సరిహద్దు గ్రామాల వద్ద వదిలేసి వెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తర్వాత డ్రైవర్లను, కొంతమంది మెకానిక్‌లను, ఉద్యోగులను క్షుణ్ణంగా విచారించారు. కూలీలను తరలించడంలో డ్రైవర్లకు రింగ్ లీడరుగా నంద్యాల డిపోకుచెందిన అక్బర్ హుసేన్ కీలకపాత్ర పోషించగా, చెన్నైకి చెందిన డ్రైవర్లు పాండు, శివుడు అనే వారు స్మగ్లర్లతో చేతులు కలిపి వీరికి వేలాది రూపాయలు ఒక్కో సర్వీసు సమయంలో అందజేస్తున్నట్లు సమాచారం. అక్బర్ హుసేన్ సూచించిన డ్యూటీ చార్టులోని డ్రైవర్లకు మాత్రమే ఈ వ్యవహారాన్ని ఇతరులకు తెలియకుండా నిర్వహించినట్లు తెలిసింది. అలాగే ఒక మెకానిక్ చెన్నైనుంచి టైర్లకు సపోర్టునిచ్చే కట్టలు బలహీనంగా ఉన్నాయని, మరమ్మతుల కోసం వచ్చి బాలుపల్లె వద్ద కూలీలను దించేసి ఆళ్లగడ్డకు ఓ సర్వీసు వెళ్లినట్లు విచారణలో తెలిసింది. మరో మెకానిక్ బెలూన్ రిపేరు రాకపోయినా అడ్డంగా బ్లేడుతో కోసేసి తమపని ముగించుకుని ఆళ్లగడ్డకు నేరుగా బస్సు సర్వీనును తీసుకెళ్లినట్లు, కొత్త బెలూన్ లాంటి సామాను అమర్చగా అతన్ని విచారించినట్లు తెలుస్తోంది. ఇంకా ఎనిమిది మంది డ్రైవర్లు, చెన్నైకి చెందిన ముగ్గురు ఉద్యోగులు కీలకపాత్ర వహించినట్లు, వారికోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. -
డంప్‌ల కోసం డాన్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎర్రచందనం డంప్‌ల కోసం జిల్లాలో డాన్లు వేట ప్రారంభించారు. హైదరాబాద్, చెన్నై ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు ఆపరేషన్ ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో ఉన్న ప్రధాన అనుచరుల ద్వారా ఎర్రచందనం అక్రమరవాణాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆత్మకూరు పోలీసులకు చిక్కిన ఎర్రచందనం స్మగ్లర్ కృష్ణ ఆ కోవకు చెందిన వారేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతని ద్వారా మరింత మంది గుట్టు తెలుసుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఎస్పీ, కొందరు అటవీశాఖ అధికారుల చర్యలతో స్మగ్లర్లలో వణుకుపుట్టింది. ఆ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన స్మగ్లర్లు కొందరు అధికారపార్టీ నేతలు, మరి కొందరు పోలీసు, అటవీ అధికారులను ప్రసన్నం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నాళ్లు రహస్యప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలను దాచి ఉంచాలని స్మగ్లర్లు బరితెగించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గుట్టుచప్పుడుగా ఉన్న స్మగ్లర్ల ప్రధాన అనుచరులు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు. రహస్యప్రదేశాల్లో దాచి ఉంచిన డంప్‌లను తరలించే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో వెంకటగిరి, డక్కిలి, రాపూరు, అనంతసాగరం, సోమశిల, ఆత్మకూరు పరిధిలోని అడవుల్లోని ఎర్రచందనం చెట్లను కొద్దిరోజుల క్రితం బ్యాటరీతో తయారు చేయించిన రంపాలతో నరికినట్లు తెలిసింది. తమిళనాడుతో పాటు జిల్లాలోని కొన్నిగ్రామాలకు చెందిన కూలీలకు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పి చెట్లను నరికించినట్లు సమాచారం. అడవుల్లో నరికిన చెట్లను గ్రామాలకు చేరవేసినట్లు అధికారులకు సమాచారం అందింది. కాలిబాట ద్వారా దుంగలను భుజాన ఎత్తుకుని వ్యవసాయ పొలాల్లోని తోటల్లో దాచి ఉంచినట్లు కొందరు అధికారులు గుర్తించారు. ఆపరేషన్ ఎర్రచందనం అటు పోలీసులు.. ఇటు అటవీ అధికారులు నిద్రాహారాలు మాని కూంబింగ్ నిర్వహిస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం ఎర్రచందనం దుంగలను రహస్యప్రాంతాల నుంచి అనుకున్న చోటుకు చేరవేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం కొందరు ఇంటి దొంగల సహకారంతోనే ఎర్రబంగారం తరలిపోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ అపవాదు నుంచి బయటపడేందుకు కొందరు అధికారులు పథకం వేశారు. వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల పరిధిలో దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి తాము పట్టుకున్నట్లు కొందరు అధికారులు ప్రచారం చేయించుకుంటున్నట్లు సమాచారం. అదే విధంగా పాత దొంగలను పిలిపించి ఈ కేసుల్లో ఇరికించి వారిని హింసిస్తున్నట్లు బాధితులు కన్నీరుపెట్టుకుంటున్నారు. ఈ విషయాలను ఎస్పీకి ఫిర్యాదు చేయాలని కొందరు ప్రయత్నించగా కొందరు అధికారులు వారిని భయపెట్టి నెల్లూరుకు రానివ్వకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. అదే విధంగా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన కొందరిని, ఎర్రచందనం అక్రమరవాణా సమాచారం ఇచ్చేవారిపై నిఘాపెట్టారు. అటువంటి వారిపై టీడీపీ నేతలు కొందరు పోలీసుల సహకారంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తున్నట్లు తెలిసింది. దీంతో అనేక మంది ఎర్రచందనం అక్రమరవాణా సమాచారం ఇవ్వటానికి ముందుకు రాకపోవటం గమనార్హం. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి కొందరు పోలీసులు, అటవీ అధికారుల స్వార్థాలకు బలవుతున్న అమాయకులను కాపాడాల్సిన బాధ్యత ఉందని బాధిత బంధువులు కోరుతున్నారు. -
పేరుకే పెద్దమనుషులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమాజంలో పెద్దమనుషుల్లా చలామణి అవుతున్న కొందరు నాయకులు ఎర్రచందనం అక్రమ రవాణాలో చక్రం తిప్పుతున్నారు. వారికి స్థానిక పోలీసుల సహకారం మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు పోలీసులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు.., ఎస్పీ వద్ద మెప్పుపొందేందుకు గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాలో పాలుపంచుకున్నవారు.. తప్పు తెలుసుకుని మానేసిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వేధింపులకు గురవుతున్న వారు ప్రధానంగా గతంలో ఈ పెద్ద మనుషులకు అడ్డొచ్చినవారేనని తెలిసింది. గూడూరు, ఆత్మకూరు డివిజన్ పరిధిలో కొందరు పోలీసు అధికారులు తీరే ఇందుకు నిదర్శనం. పోలీసులు, అటవీ అధికారులు గట్టి నిఘాపెట్టినా ఆ డివిజన్ పరిధిలోని ఎర్రచందనం అక్రమ రవాణా గుట్టుచప్పుడుగా సాగిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నట్లు తెలిసింది. పెద్దమనుషులుగా చలామణి అవుతున్న టీడీపీ నాయకులు కొందరు ఎర్రచందనం అక్రమరవాణా కేసుల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తపడుతున్నారు. అనంతసాగరం మండల పరిధిలో కొందరు రైతులను స్థానిక పోలీసు అధికారి ఒకరు తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఏడాది క్రితం ఎప్పుడో ఒకసారి ఎర్రచందనం అక్రమరవాణాలో పాలుపంచుకున్న వారు తప్పు తెలుసుకుని అక్రమరవాణాకు దూరంగా ఉంటూ.. కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే వారిని స్టేషన్‌కు పిలిపించి రకరకాల వేధింపులకు గురిచేస్తునట్లు తెలిసింది. సంబంధం లేదన్నా ఒప్పుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆ కుటుంబంలోని కొందరు నెల్లూరు కలెక్టరేట్ వద్ద విలేకరులను కలిసి బోరుమన్నారు. అదేవిధంగా అసలు సంబంధమే లేని వ్యక్తులపైనా ఎర్రచందనం అక్రమరవాణా కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని మరి కొందరు బాధితులు వివరించారు. అయితే వారి పేర్లు చెప్పడానికి భయపడ్డారు. పేపర్లో తమ పేర్లు, ఫొటోలు వేయవద్దని బతిమలాడారు. తామ ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చామని తెలిస్తే ఆ పోలీసులు మమ్మల్ని బతకనివ్వరని వాపోయారు. దర్జాగా దొంగలు. డివిజన్ల పరిధిలో కొందరు స్మగ్లర్లు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. ఎర్రచందనం అక్రమరవాణాలో తమకు సంబంధం లేనట్లే నడుచుకుంటూ చలామణి అవుతున్నారు. ఎర్రచందనం అధికంగా ఉన్న అటవీ ప్రాంతంలో సునాయాసంగా వెళ్లి వచ్చేందుకు కొందరు పోలీసులు, అటవీ అధికారుల సహకారంతో దారి ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం గూడూరు, ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో అనేకచోట్ల ఎర్రచందనం దుంగలను డంప్ చేసినట్లు తెలిసింది. అలా డంప్‌చేసిన దుంగలను ఇటీవల ఓ లారీకి నింపి జిల్లా సరిహద్దు దాటించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు కొందరు పోలీసులు తప్పుడు కేసులుపెట్టి హడావుడి చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి అసలు దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది. స్మగ్లింగ్‌తో సంబంధం లేదు బాలాయపల్లి: వెంకటగిరి వేలుకొండ అడువుల్లో నుంచి తరలిపోతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎటువంటి సంబందం లేదని టీడీపీ మండల అధ్యక్షుడు రావి మస్తాన్‌నాయుడు, టీడీపీ జిల్లా కార్యదర్శి విందురు పరంధామరెడ్డి, రైతు సంఘం ఉపాధ్యక్షుడు కొరపాటి రామచంద్రయ్య తెలిపారు. బాలాయపల్లిలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఓ ఉన్నత స్థానంలో ఉన్నాడన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. -
ఎర్రచందనం ధరలపై తకరారు !
ఎర్రచందనం ధరలపై అటవీశాఖ అధికారుల లెక్కలకూ పోలీసు అధికారుల గణాంకలకూ పొంతన కుదరడం లేదు. ఏ-గ్రేడ్ ఎర్రచందనం టన్ను ధర రూ.12 లక్షలుగా అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. పోలీసులు మాత్రం నాణ్యతతో నిమిత్తం లేకుండా ఎర్రచందనం టన్ను ధర రూ.35 లక్షలుగా లెక్కకట్టారు. ఆదివారం శ్రీకాళహస్తి సమీపంలో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రెండు టన్నుల ఎర్రచందనం విలువను రూ.70 లక్షలుగా పోలీసులు ప్రకటించడమే అందుకు తార్కాణం. అధికారపార్టీ నేతలకు ఎ ర్ర చం‘ధనాన్ని’ దోచిపెట్టడానికే ప్రభుత్వం తక్కువ ధరలు నిర్ణయించిందనే ఆరోపణలకు ఇది బలం చేకూర్చుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలోని గోదాముల్లో నిల్వ చేసిన 8,584.1353 టన్నుల ఎర్రచందనాన్ని అమ్మే బాధ్యతను ఎంఎస్టీసీ(మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్)కు ప్రభుత్వం అప్పగించింది. తొలి దశలో 4,159.693 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించేందుకు ఆగస్టు 8న ఈ-టెండర్ నోటిఫికేషన్‌ను ఎంఎస్టీసీ జారీచేసింది. ఎర్రచందనాన్ని ఈ-టెండర్ కమ్ వేలం పద్ధతిలో విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఏ-గ్రేడ్ ఎర్రచందనం టన్ను రూ.12 లక్షలు, బీ-గ్రేడ్ రూ.పది లక్షలు, సీ-గ్రేడ్ రూ.ఎనిమిది లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. అంతర్జాతీయ మార్కెట్లో అంతకు రెట్టింపు స్థాయిలో ధరలు పలుకుతున్న విషయం విదితమే. ఓ కీలక మంత్రి.. మరొక టీడీపీ ఎంపీకీ ఎర్రచం‘దనాన్ని’ దోచిపెట్టడానికే కనిష్ఠ ధరలను ప్రభుత్వం నిర్ణయించిందనే ఆరోపణలు అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి. సెప్టెంబర్ 19 నుంచి ఎర్రచందనం విక్రయానికి వేలం నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ.. విదేశీ వ్యాపారులు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో వేలం వాయిదా వేసింది. అక్టోబర్ 10 నుంచి ఎర్రచందనాన్ని వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. కానీ.. ఎర్రచందనం విక్రయానికి కేంద్రం ఇచ్చిన అనుమతి గడువు ముగియడం, చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎర్రచందనం టెండర్లపై స్టే విధించడంతో చివరి నిముషంలో వేలం రద్దు చేసింది. ఎర్రచందనం విక్రయానికి మరో ఆర్నెళ్లు గడువు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం.. ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. రాష్ట్రంలో అటవీశాఖ గోదాముల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగల విక్రయానికి 2010లోనే కేంద్రం అనుమతి ఇచ్చింది. అప్పట్లో టెండర్ల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైనప్పుడు నాణ్యతతో నిమిత్తం లేకుండా టన్ను ఎర్రచందనం రూ.12 లక్షల చొప్పున కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన ఓ సంస్థ అప్పటి అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రతిపాదించింది. అంతలోనే రోశయ్యను సీఎం పీఠం నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం దించేసింది. ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టిన కిరణ్ ప్రభుత్వం 2011లో తొలి దశలో 600 టన్నుల ఎర్రచందనం విక్రయానికి టెండర్లు నిర్వహించింది. చైనా సంస్థ ప్రతిపాదించిన ధరతో నిమిత్తం లేకుండా ఎర్రచందనం టెండర్లు నిర్వహించింది. ఏ-గ్రేడ్ టన్ను రూ.ఏడు లక్షలు, బీ-గ్రేడ్ రూ.ఆరు లక్షలు, సీ-గ్రేడ్ రూ.5.3 లక్షలు, వర్గీకరించని ఎర్రచందనం టన్ను రూ.3.6 లక్షలకు కాంట్రాక్టర్లు కోట్ చేశారు. అవే ధరలను ఖరారు చేసి.. కాంట్రాక్టర్లకు ఎర్రచందనాన్ని అప్పగించారు. ఎర్రచందనం కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు అప్పటి సీఎం కిరణ్‌కు సన్నిహితులేనని కాంగ్రెస్ వర్గాలు అప్పట్లో ఆరోపించాయి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే రీతిలో పయనిస్తోందనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. గ్రేడ్లతో నిమిత్తం లేకుండా టన్ను ఎర్రచందనం రూ.35 లక్షలుగా లెక్కకట్టిన పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించడమే అందుకు తార్కాణం. -
ఏడుగురు అంతర్రాష్ట్ర ‘ఎర్ర’ దొంగల అరెస్టు
చిత్తూరు(అర్బన్): ఎర్రచందనం ఇతర రాష్ట్రాలను ఎగుమతే వ్యక్తులు, దుంగల లోడ్‌కు పెలైట్లుగా వెళ్లేవాళ్లు, చెట్లు నరికే కూలీలను సరఫరాచేసే మేస్త్రీలను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశా రు. అరెస్టయిన వారిలో ఏడుగురు నిం దితులు ఉన్నారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఈ వివరాలను చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, ఓఎస్డీ రత్న, ఏఆర్ డీఎస్పీ దేవదాసులు విలేకరులకు వివరించారు. నేరస్తుల నేపథ్యం ఇదీ.. నారాయణ... ఐరాల మండలంలోని పుల్లూరుకు చెందిన నారాయణ (26) 2005 వరకు కారు మెకానిక్‌గా పనిచేసి ఆటో గ్యారేజీ పెట్టుకుని కొన్ని రోజుల జీవనం సాగించాడు. 2008 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా ప్రారంభించాడు. కడపలోని రాయచోటి, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో ఎర్ర చందనం చెట్లను నరికించి బెంగళూరు, కటికనహళ్లి చెందిన ఇజాజ్, అసీఫ్, మజ్జూ, ముజీబ్‌లను సరఫరా చేసేవాడు. 10 మంది మేస్త్రీలను పెట్టుకుని 30 మంది కూలీల ద్వారా ఎర్రచందనం చెట్లను నరికించేవాడు. ఇతనిపై కడపలోని లక్కిరెడ్డిపల్లె, తిరుపతి రంగంపేట ఫారెస్టు రేంజ్‌లలో కేసులు కూడా ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా ఇప్పటి వరకు రూ.2 కోట్ల విలువ చేసే ఇల్లు, వాహనాలు, స్థలాలు కొన్నాడు. మస్తాన్ హుస్సేన్...: చిత్తూరు గిరింపేటకు చెందిన మస్తాన్హుస్సేన్ (24) నగరానికి చెందిన ఎర్రస్మగ్లర్ ఆయిల్ రమేష్ వాహనాలకు పెలైట్ డ్రైవర్‌గా వ్యవహరించేవాడు. ఇతన్ని ఆరు నెలల క్రితం భాకరాపేట అటవీశాఖ అధికారులు అరెస్టు కూడా చేశారు. ఇప్పటి వరకు పెలైట్‌గా పనిచేసి రూ.30 లక్షల వరకు సంపాదించాడు. నాగరాజు.. చిత్తూరులోని మంగసముద్రంకు చెందిన రాజూరి నాగరాజు (22) తిరుపతి ఆటోనగర్‌లో స్థిరపడ్డాడు. ఎర్రచందనం వాహనాలు ఎటువైపు వెళ్లాలి, పోలీసులు ఎక్కడ గస్తీ కాస్తున్నారనే వివరాలను స్మగ్లర్లకు తెలియచేస్తూ పెలైట్‌గా వ్యవహరించేవాడు. ఇతను ఇప్పటి వరకు రూ.40 లక్షలు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో సంపాదించాడు. లోగు..: తమిళనాడులోని ఆంబూరుకు చెందిన లోగు అనే లోకనాథన్ ఎర్రచందనం చెట్లను నరకడానికి కూలీలను చిత్తూరు మీదుగా పంపించేవాడు. ఐరాలకు చెందిన నారాయణకు ఎర్ర కూలీల ను సరఫరాచేసేవాడు చెట్లను నరికిన తరువాత నారాయణ సరుకు చెప్పిన చోటుకు చేర్చేవాడు. ఇతను ఇప్పటి వరకు 20 లక్షలు సంపాదించాడు. షేక్ షరీద్..: తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన షేక్షరీద్ (20) ఆర్టీసీలో అటెం డరుగా పనిచేసి మానేశాడు. తరువాత ఆటో నడుపుతూ జీవనం సాగించాడు. 2013 నుంచి నారాయణకు పరిచయమై ‘ఎర్ర’దొంగల వాహనాలకు పెలైట్‌గా వ్యవహరించేవాడు. దుంగల్ని స్మగ్లర్లకు అప్పగించేవాడు. ఇప్పటి వరకు అక్రమంగా రూ.10 లక్షలు సంపాదించాడు. అన్నాదొరై...: తమిళనాడులోని ఆంబూరుకు చెందిన అన్నాదొరై (36) కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో ఎర్రచందనం చెట్లను నరకడానికి కూలీగా వెళుతూ రెండేళ్లలో ఇతనే కూలీలను సరఫరా చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు రూ.10 లక్షలు ఎర్రచందనం ద్వారా సంపాదించాడు. మురళి...: తిరుపతి కొర్లగుంటకు చెందిన ఏకపాటి మురళి (34) నారాయణ అనుచరుడు. చెట్లు కొట్టడానికి వచ్చే కూలీలకు బియ్యం, ముడిసరుకులు సరఫరా చేసేవాడు. ఇతనికున్న ఆటోలో ఎర్ర దుంగల్ని నారాయణ ఎక్కడ దింపమంటే అక్కడ దింపేవాడు. రెండు నెలల క్రితం ఇతన్ని తిరుపతి పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఎర్రచందనం అక్రమ తరలింపు ద్వారా రూ.10 లక్షలు సంపాదించాడు. -
అంతర్జాతీయ స్మగ్లర్ సహా మరో ఇద్దరి అరెస్టు
కడప అర్బన్/ఓబులవారిపల్లె: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కందస్వామి వెంకటేశ్(41)ను అరెస్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ శనివారం ఒక ్రపకటనలో తెలిపారు. చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన వెంకటేశ్ సహా అబ్దుల్ షుకూర్(40) అనే కూలీ (చెన్నై), స్కార్పియో డ్రైవర్ ముత్తుకన్నన్(37)ను సైతం అరెస్టు చేశామన్నారు. ఓబులవారిపల్లె సమీపంలోని చెన్నంరాజుపోడు వద్ద రాజంపేట ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, రైల్వేకోడూరు సీఐ హుసేన్‌పీరా, ఓబులవారిపల్లె ఎస్ఐ నాగరాజు శుక్రవారం రాత్రి నిర్వహించిన వాహన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారన్నారు. వారి నుంచి రూ.6 లక్షలు విలువైన స్కార్పియో వాహనంతో పాటు రూ.1.62 లక్షలు విలువైన పది ఎర్రచందనం దుంగలు, రూ.29,950 నగదు, రెండు బంగారు ఉంగరాలు, ఒక ప్లాటినం ఉంగరం, తొమ్మిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. నిందితులను రాజంపేట కోర్టులో హాజరు పరచగా, రిమాండుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారని ఎస్పీ తెలిపారు. -
‘ఎర్ర’ స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం!
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవులకు మాత్రమే పరిమితమైన అరుదైన జాతి సంపద ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసేవారి ఆస్తులను సైతం స్వాధీనం చేసుకోవాలని ఏపీ పోలీసు శాఖ భావిస్తోంది. దీనిపై ప్రస్తుతం గట్టి చట్టాలు లేకపోవడంతో ప్రాథమికంగా క్రిమినల్ ఎమెండ్మెంట్ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. ఎర్రచందనం స్మగ్లర్లు మాదకద్రవ్యాల వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇటీవల నిర్ధారించింది. చెన్నై విమానాశ్రయంలో గత వారం చిక్కిన చిత్తూరు జిల్లా వాసి ఆనంద్‌ను విచారించిన సమయంలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీ చట్టంతో పాటు ఐపీసీ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అటవీ చట్టంలోనూ అక్రమ రవాణా దారులు హడలెత్తిపోయే చర్యలు తీసుకునే సెక్షన్లు లేవు. అక్రమ రవాణాదారుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. దీంతో ఐపీసీ కింద చోరీ సెక్షన్‌తో సరిపెట్టాల్సి వస్తోంది. నిందితుడు ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టాడని తెలుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. క్రిమినల్ ఎమెండ్మెంట్ యాక్ట్‌లోని సెక్షన్లను ఈ కేసులకు జోడిస్తే గట్టి చర్యలకు ఆస్కారం లభిస్తుందని పోలీసు శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చట్టం అమలులో సాంకేతిక ఇబ్బందులు, ఇతర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ కార్యాలయం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోపక్క ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక చట్టం తెచ్చేందుకు కూడా పోలీసు విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. దీనికి అటవీ శాఖ అధికారుల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. -
ఎర్రచందనం స్మగ్లరు.. బరి తెగించారు!
-
కలెక్టర్ ‘పిడి’కిలి సడలించారు..
9 మంది స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు సుముఖత చూపని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ పోలీసుశాఖ ప్రతిపాదనను నెలన్నర రోజుల పాటు తొక్కిపెట్టడంలో మర్మమేమిటో...? ఆ తొమ్మిది మందిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇన్చార్జ్ కలెక్టర్ పేరుమోసిన తొమ్మిది మంది అంతర్జాతీయ ఎర్రదొంగలపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విముఖత చూపారు. ఆయన అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లిన నాలుగు రోజులకే ఇన్చార్జ్ కలెక్టర్ ఆ తొమ్మిది మందిపై ‘పిడి’కిలి బిగించారు. కలెక్టర్ పిడికిలి సడలిస్తే.. ఇన్చార్జ్ కలెక్టర్ బిగించడం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. ఆ టాస్క్‌ఫోర్స్, పోలీసుల నేతృత్వంలో ఇప్పటిదాకా 179మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అందులో పేరుమోసిన తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నారు. ఆయిల్ రమేష్, రియాజ్‌ఖాన్, హమీద్ ఖాన్, లక్ష్మణ్ నాయక్, లక్ష్మణన్, మహ్మద్ఫ్రీ, అసిఫ్అలీఖాన్, విక్రమ్మెహందీ, శరణన్లను జూలై 15న పోలీసు లు అరెస్టు చేశారు. ఆ తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వాలని అప్పటి చిత్తూరు ఎస్పీ రామకృష్ణ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు జూలై 16న ప్రతిపాదించారు. సాధారణంగా ఎస్పీ చేసిన ప్రతిపాదనపై రెండు మూడు రోజుల్లో కలెక్టర్ ఆమోదముద్ర వేయడం.. ఆ తర్వాత పీడీ చట్టాన్ని ప్రయోగించడం రివాజు. కలెక్టర్ రాంగోపాల్ హయాంలో ఇదే రీతిలో పీడీ చట్టాన్ని ప్రయోగించేవారు. కానీ.. సిద్ధార్థ్‌జైన్ మాత్రం తద్భిన్నంగా వ్యవహరించారు. ఆ తొ మ్మిదిమందిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించడానికి సంబంధించిన ఫైలుపై సంతకం పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. ఎర్రచందనం టెండర్లలో తక్కువ ధరకు ఎర్రచందనాన్ని కొట్టేసి.. ఆ తొమ్మిది మంది స్మగ్లర్ల సహకారంతో అధిక ధరలకు అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి ఇద్దరు టీడీపీ కీలక ప్రజాప్రతినిధులు వ్యూహం రచించారు. ఆ వ్యూహంలో భాగంగానే ఆ తొమ్మిది మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించకుండా కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు అప్పట్లో ఆరోపణలు వ్యక్తమయయ్యాయి. నెలన్నర పాటు తొమ్మిది మందిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించే ఫైలుపై కలెక్టర్ ఆమోదముద్ర వేయకపోవడం ఆ ఆరోపణలకు బలం చేకూరింది. ఐఏఎస్‌ల విభజనలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను తెలంగాణకు కేటాయిస్తూ ఆగస్టు 21న ప్రత్యూష కమిటీ ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఆ మరుసటి రోజే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. సింగపూర్ పర్యటన ముగించుకుని ఈనెల 2న జిల్లాకు రానున్నారు. కలెక్టర్ సింగపూర్ వెళ్లిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఇన్చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించేందుకు ఆగస్టు 27న ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీధర్ అనుమతి ఇచ్చారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు అనుమతి ఇచ్చిన ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీధర్‌ను అటు పోలీసు, అటవీ అధికారులు.. ఇటు ప్రజాసంఘాలు ప్రశంసిస్తున్నాయి. ఈ క్రమంలోనే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ వ్యవహరించిన తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
శ్రీవారి సంపద రుణమాఫీకా?!
-
‘ఎర్ర’ స్మగ్లింగ్‌లో ఇంటి దొంగలు
చంద్రగిరి పోలీస్ స్టేషన్లో దుంగలు మాయం కోట్లకు పడగలెత్తిన ఓ పోలీస్ అధికారి భాకరాపేట ఫారెస్ట్ గోడౌన్‌లోనూ మాయమవుతున్న దుంగలు తిరుపతి రూరల్ : శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా ఇంటిదొంగల సహకారంతో యధేచ్ఛగా సాగుతోందనే విమర్శలున్నాయి. ముందుగా ఇంటిదొంగల పనిపడితే ఎర్రచందనం స్మగ్లిం గ్ చాలా వరకు నియంత్రించవచ్చని పలువురు అంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి, చిన్నగొట్టిగళ్లు, ఎర్రావారిపాళెం మండలాల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమరవాణా జరుగుతోంది. అక్రమ రవాణా వెనుక ఇంటిదొంగల ప్రమేయం ఉండడమే కారణం. పోలీస్ శాఖలో రహస్య సమావేశాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు తీసుకున్న నిర్ణయాలు సైతం స్మగ్లర్లకు తెలిసిపోతున్నాయంటే ఆశాఖలో ఎర్ర దళారీలు ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాకు చంద్రగిరి పోలీసులు పెలైట్లుగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నా యి. ఎర్రచందనం స్మగ్లర్లకు శేషాచల అడవుల్లోకి మార్గాలు చూపడం, ఏ మార్గాన వెళితే తనిఖీలు ఉండవు, స్మగ్లింగ్‌కు సులువుగా ఉంటుంది, వంటి సలహాలు చెప్పడం, దుంగలను రోడ్డు దాటించడమే కొంతమంది పోలీసులు పనిగా పెట్టుకున్నారని అక్కడి వారే చెబుతున్నారు. వీటంతటికీ ఓ పోలీస్ అధికారి సహకరిస్తున్నారని తెలుస్తోంది. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో 38 ఎర్రచందనం దుంగలు మాయమయ్యాయని సమాచారం. స్పెషల్ బ్రాంచ్ పోలీసు లు కూడా 38 దుంగలు మాయమయ్యాయని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. వీటి కి సంబంధించిన లెక్కలను రికార్డుల్లో తారుమారు చేశార నే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇన్ఫార్మర్ల సహకారం ఎర్రచందనం అక్రమ రవాణా కోసం పోలీసులు కొంతమందిని ఇన్ఫార్మర్లు గా పెట్టుకున్నారు. స్మగ్లర్లకు సహకరిస్తు న్న కొంత మంది ఇంటి దొంగలు ఇన్ఫార్మర్ల సహాయంతోనే తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారి ద్వారా దుం గకు ఇంతని రేటు నిర్ణయించి అక్రమంగా రోడ్డు దాటిస్తున్నారు. ఇన్ఫార్మ ర్లు ఒక పార్టీని పట్టించి నాలుగు పార్టీల నుంచి డబ్బు వసూలు చేసి వదిలేస్తున్నారు. ఈ డబ్బును అందరూ కలసి పంచుకుంటున్నారని సమాచారం. కోట్లకు పడగలెత్తిన పోలీస్ అధికారి ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న చంద్రగిరి పరిధిలోని ఓ పోలీస్ అధికారి కోట్లకు పడగలెత్తారు. అనతి కాలంలోనే ఆయన కోట్లాది రూపాయలు సంపాదించారని కింది స్థాయి సిబ్బందే బాహాటంగా చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇక్కడకు బదిలీపై వచ్చిన ఆయన ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తూ కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. ఇక్కడే తిష్ట వేసేందుకు పెద్ద ఎత్తున పైరవీలకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఫారెస్టు గోడౌన్‌లోనూ దుంగలు మాయం భాకరాపేట ఫారెస్టు గోడౌన్లో కొన్నేళ్లుగా భద్రపరిచిన ఎర్రచందనం దుంగ లు ఒకొక్కటే మాయమవుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో గోడౌన్ నుం చి కింది స్థాయి ఉద్యోగి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ దొరికిపోయాడు. దుంగల తరలింపు వెనుక ఓ ఫారెస్టు అధికారి హస్తం ఉందని తెలిసింది. ఎర్రచందనాన్ని కాపాడాల్సిన అధికారులే డబ్బులకు ఆశపడి ఇలా చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ అయినా ఇంటి దొంగల భరతం పట్టి ఎర్రచందనం అక్రమ రవాణా నివారించాలని ప్రజలు కోరుతున్నారు. -
శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి బాధ్యతలు చేపట్టిన ఎస్పీ తిరుమల/ తిరుపతి అర్బన్: నిబద్ధతతో పనిచేస్తూ శాంతి, భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తిరుపతి అర్బన్ నూతన ఎస్పీ గోపీనాథ్ జట్టి అన్నారు. గురువారం ఉదయం ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయంలో సంప్రదాయంగా ఫైల్‌పై ఎస్పీ సంతకం చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని, వకుళమాతను దర్శించుకున్నారు. తదుపరి తిరుపతి చేరుకుని ఎస్పీ కార్యాలయం లో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి అర్బన్ ఎప్పీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమల, తిరుపతి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలు, తిరుపతి నగరం తనకు కొత్తేమీ కాదన్నారు. తాను ఇక్కడే వ్యవసాయ కళాశాలలో ఎంఎస్సీ చదివానన్నారు. గతంలో తమిళనాడులోనూ అటవీ శాఖకు సంబంధించిన శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు. ఆ కారణంగా అటవీ శాఖపై కూడా పూర్తి పట్టు ఉందని, శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. అందుకోసం ప్రస్తుత అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని అక్రమ రవాణాను అదుపు చేస్తామని వివరించారు. తిరుపతిలాంటి పుణ్యక్షేత్రంలో విధులు నిర్వర్తించడం అదృష్టంగా భావించడమే కా కుండా సంతోషంగా ఉందన్నారు. అదే తరుణంలో దేశం నలుమూలల నుంచి వచ్చే వేలాదిమంది యా త్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని లా అండ్ ఆర్డర్‌ను పటిష్టం చేస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి మరింత లోతుగా అధ్యయ నం చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. తిరుపతి నగరం రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో అల్లరి మూకలను కూకటివేళ్లతో పెకలిం చి వేసేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తామన్నారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీ సుకుంటామని తెలిపారు. అనంతరం ఎస్పీ పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించారు. కొత్త గా బాధ్యతలు చేపట్టిన అర్బన్ ఎస్పీని విజిలెన్స్ అం డ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రవిశంకర్‌రెడ్డితోపాటు ఏఎస్పీలు, అర్బన్ జిల్లా పరిధిలోని పలువురు డీఎస్పీ లు, సీఐలు, నగరంలోని ప్రముఖులు కలసి పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు శ్రీవారి సందర్శన సమయంలో ఎస్పీ వెంట తిరుపతి ఏఎస్పీ సిద్ధారెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ విజయశేఖర్, ఎస్ఐ తిమ్మయ్య ఉన్నారు. -
దావుద్ కన్ను ఎర్రచందనంపై పడిందా?
-
ముదురు పోలీసులు !
ఎస్పీనే బదిలీ చేయించేందుకు పూనుకున్న సీఐలు ‘ఎర్ర’ అక్రమాలు బట్టబయలవుతాయనే భయంతోనే.... సీఐల బదిలీల్లోనూ చక్రం తిప్పుతున్న వైనం... క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖ దారి తప్పింది. తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని దొర(ఎస్పీ)నే బదిలీ చేయించేందుకు కంకణం క ట్టున్నారు ‘అయ్య’గార్లు!. ఎర్రచందనం కేసుల వ్యవహారం కీలక దశలో ఉన్న తరుణంలో ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ బదిలీ వ్యవహారమే ఇందుకు సంబంధించిన కథాంశం. సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టులకు సంబంధించిన కేసులు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయి. 178మంది దాకా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 12మంది అంతర్జాతీయ దొంగ లు ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రధాన పాత్రధారులు వీరే. అరుుతే వీరిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ ప్రకటించినా, అందులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా అరె స్ట్ చేయాల్సిన దొంగలు 800 మంది దాకా ఉన్నారు. ఎర్రస్మగ్లర్ల నెట్వర్క్ ఎలా ఉంది ? దొంగలెవరు ? వారికి సహకరించిన పోలీసు అధికారులు ఎవ రు? అటవీశాఖ అధికారులు ఎంతమం ది ? వారి వెనుక ఉన్న రాజకీయనేతలు ఎవరు ? అనే వివరాలను ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సాక్ష్యాలతో సేకరించి రిపోర్ట్ తయారు చేశారు. ఇందులో ఇద్దరు డీఎస్పీలతో పాటు సీఐలు, ఎస్ఐల పాత్ర కూడా ఉన్నట్లు ఎస్పీ తేల్చినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి చేరవేస్తారనే సమయంలో ఎస్పీ రామకృష్ణ బదిలీ ‘వార్త’ వినాల్సి వచ్చింది. బదిలీకి వీరే కారణమా? ఎస్పీ రామకృష్ణ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తే అందులో తమ పేర్లు కచ్చితంగా ఉంటాయని, ఉన్నాయని కొంతమంది సీఐలు తెలుసుకున్నారు. ఇదే జరిగితే సస్పెన్షన్, ప్రమోషన్లపై ప్రభావంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని బెంబేలెత్తిపోయారు. దీంతో ‘ఎర్ర’ వ్యవహారంలో హస్తమున్న కొంతమంది సీఐలు ఓ గ్రూపుగా ఏర్పడి తాము ఎలా భయటపడాలని చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో నేరుగా పరిచయమున్న ఓ సామాజిక వర్గానికి చెందిన సీఐలు చొరవ తీసుని నేరుగా సీఎంతోనే ఈ అంశాన్ని చర్చించినట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము పార్టీ కోసం, పార్టీ నేతలు, కార్యకర్తలను రక్షించామని, ఇప్పుడు తాము కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడాలని వేడుకున్నట్లు తెలిసింది. దీంతో సీఎం చంద్రబాబు కూడా సీఐల మాటలు ఆలకించి, వారిని కాపాడే చర్యల్లో భాగంగానే ఎస్పీపై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. దీని వెనుక చంద్రగిరి, కార్వేటినగరం, పాకాలలో పనిచేసి ప్రస్తుతం వేరేచోట కొనసాగుతున్నవారు ఉన్నట్లు తెలిసింది. వీరితో పాటు చిత్తూరు ఎస్పీ పరిధిలో పనిచేసి ప్రస్తుతం బయట ఉన్న మరో నలుగురు సీఐలు కూడా ఉన్నట్లు సమాచారం. సీఐల బదిలీల్లోనూ.... త్వరలో జరగబోయే సీఐల బదిలీల్లోనూ ఈ సీఐలే చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. వారు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు తమ అస్మదీయులకు కూడా ఆశించిన సర్కిల్ దక్కేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అధికారపార్టీలోని మంత్రుల అండతో వీరు డీవోల జారీలో తమదైన ‘ముద్ర’ వేయనున్నారని పోలీసులు జోరుగా చర్చించుకుంటున్నారు. దీంతో నే ఈ నెల 23న రావాల్సిన డీవోలు నెలాఖరుకు వాయిదా పడ్డాయని కూడా తెలుస్తోంది. చివరలో కొంత ఉత్కంఠ.. ఎస్పీ రామకృష్ణ బదిలీ ఆగిపోనుందని ప్రచారం జరిగింది. దీంతో ఆయన బదిలీ కోసం శ్రమించిన సీఐల వెన్నులో వణుకుపుట్టింది. అదే జరిగితే తమ పరి స్థితి ఏంటని మధనపడుతుండగా సోమవారం రాత్రి రామకృష్ణ రిలీవ్ అయ్యారు. దీంతో సీఐలదే పైచేయి అయ్యింది. -
వీళ్లతోనా చంద్రబాబు స్నేహం ?!
-
ఎర్రదొంగలకు ‘పచ్చ’ తివాచీ!
పీడీ యాక్టు నిందితుడికి జెడ్పీటీసీ టికెట్ ఎంపీపీ బరిలో నిలిచిన మరో బడా స్మగ్లర్ కుటుంబం ఎన్నికల్లో టీడీపీలో క్రియాశీల పాత్ర పోషించిన మరికొందరు నేరచరితులు తాజాగా టీడీపీ నేత బుల్లెట్ సురేష్ అరెస్ట్ రాజమండ్రి జైలులో రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు సాక్షి ప్రతినిధి, కడప/చిత్తూరు నూతన ఆంధ్రప్రదేశ్‌లో నేరగాళ్లకు స్థానంలేకుండా చేస్తామంటూ హూంకరిస్తున్న ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చేతల్లో వారితోనే అంటకాగుతున్నారని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనాన్ని దోచుకుంటున్న స్మగ్లర్లకు పార్టీ టికెట్లిచ్చి పోటీ చేయించడమే ఇందుకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లర్లుగా పేరుమోశారు. వారిపై వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో అనేక స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా యంత్రాంగం 2010లో పీడీయాక్టు కూడా ప్రయోగించింది. అనంతరం కూడా వారు స్మగ్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తూనే వచ్చారు. వారే 2012లో రాయచోటి, రాజంపేట ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన మరో ఎర్రచందనం స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌పై 20 కేసులు ఉన్నాయి. పది రోజుల కిందట సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసినట్లు చూపించారు. ఆయన 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ విజయానికి తీవ్రంగా కృషి చేయడం గమనార్హం. వెన్నుతట్టి ఎన్నికల్లో ప్రోత్సాహం ఎర్రచందనం స్మగ్లర్లుగా గుర్తింపుబడ్డా, పీడీ యాక్టులో జైలు కెళ్లినా పర్వాలేదు... ఎన్నికల్లో పోటీ చేసి గెలవండంటూ వైఎస్సార్ జిల్లా సంబేపల్లె జెడ్పీటీసీ స్థానాన్ని రెడ్డినారాయణకు టీడీపీ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఆయన పోటీచేసి ఓడిపోయారు. మహేష్నాయుడి కుటుంబానికి సుండుపల్లె ఎంపీపీ పదవి కేటాయిస్తూ, ఆయన తల్లికి రెడ్డివారిపల్లె ఎంపీటీసీ టికెట్ అప్పగించారు. ఆమె గెలిచినప్పటికీ ఎంపీపీ పదవి మాత్రం దక్కలేదు. రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు ఇరువురూ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న ఎర్రచందనం కేసుల కారణంగా పీడీయాక్టులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. వీరికే కాకుండా సుండుపల్లెలో మరో ఎర్రచందనం స్మగ్లర్ పటాల రమణ సోదరుడు వీరమల్లనాయుడుకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారు. పటాల రమణపై పలు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె టీడీపీ ఎంపీటీసీగా గెలుపొందిన సుబ్బానాయుడుపై సైతం కేసులున్నాయి. మైదుకూరు మండలంలో బడా స్మగ్లర్ శ్రీని వాసులనాయుడు సైతం టీడీపీలో క్రియాశీల భూమిక పోషించేవారు. ప్రస్తుతం పీడీ యాక్టులో రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన సోదరుడు వెంకటసుబ్బయ్య స్మగ్లర్‌గా రికార్డులకు ఎక్కారు. టీడీపీ మైదుకూరు ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ ముఖ్య అనుచరుడు చినమల నరసింహులు యాదవ్ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుకైన పాత్ర పోషించారు. ఎర్రదొంగల్లో తెలుగు తమ్ముళ్లే అధికం అధికార పార్టీ నేతల అండదండలతో ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మొత్తం 198మంది ఎర్రదొంగలున్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటివరకూ 110మందికిపైగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది టీడీపీ నేతలే ఉండటం గమనార్హం. అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వారిలో చిత్తూరు జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శి వసంత్, మధుతో పాటు మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో కొందరిపై ఇదివరకే పీడీ యాక్టు నమోదు చేశారు. ఇప్పుడు వారిపై పీడీ యాక్టు తొలగించడంతో పాటు, మిగిలిన దొంగలపై పీడీ యాక్టు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎర్రదొంగల అక్రమ సంపాదనలో వాటాలు ఉండటంతో వారిని రక్షించడం టీడీపీ కీలక నేతలకు అనివార్యంగా మారిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతని పేరు బుల్లెట్ సురేష్. చిత్తూరు టీడీపీ నేత. ‘ఎర్ర’చందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన వ్యక్తి. 20 కేసులు ఉన్నాయి. చిత్తూరు టూటూన్ పోలీసు స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. చిత్తూరు తాలూకా, టూటౌన్, భాకరాపేట, యాదమరి, చిత్తూరుతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇతడు రెడ్డి నారాయణ. వైఎస్సార్ జిల్లా సంబేపల్లె మండలం గుట్టపల్లె వాసి. ఇతడు కూడా రాయచోటి నియోజకవర్గం టీడీపీలో కీలక నేత. ఆ పార్టీ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇతనిపై పీడీ యాక్టు కూడా నమోదైంది. రాయచోటి, పీలేరు, గంగవరం, కేవీపల్లె, వీరబల్లితో పాటు పలు స్టేషన్లలో పలు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. ఇతని పేరు మహేష్ నాయుడు. వైఎస్సార్ జిల్లా సుండుపల్లె మండలం చప్పిడివాండ్లపల్లె. మహేష్ తల్లి శ్రీదేవి టీడీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేష్‌పై రెండుసార్లు పీడీ యాక్టు నమోదైంది. కేవీపల్లె, పీలేరు, కలకడతో పాటు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత. -
అటవీశాఖ గోడౌన్లో ఎర్రచందనం మాయం
-
ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికడతాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్రచందనం అక్రమ రవాణ, విద్యుత్ సంక్షోభంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపగ్రహం ద్వారా ఎర్రచందనం విస్తరించిన అటవీ ప్రాంతాన్ని గుర్తించాలని, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నియంత్రిస్తామని చెప్పారు. ఎర్రచందనంపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాకు తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలోనే కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని చంద్రబాబు వివరించారు. -
నిధుల కోసం ఎర్రచందనం విక్రయం: యనమల
సాక్షి, హైదరాబాద్: నిధుల సమీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిల్వ ఉన్న ఎర్రచందనం విక్రయించాలని నిర్ణయించినట్లు రాష్ర్ట ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. ఎర్రచందనం విక్రయించడానికి అంతర్జాతీయ టెండర్లను పిలవాల్సి ఉంటుందని, దీనికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ చట్టం(ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎర్ర చందనం స్మగ్లర్లపై పొలీసుల కాల్పులు
-
250 మంది ఎర్రచందనం స్మగ్లర్ల పట్టివేత
-
250 మంది ఎర్రచందనం స్మగ్లర్ల పట్టివేత
ఎర్ర చందనం స్మగ్లర్లు భారీ సంఖ్యలో పట్టుబడ్డారు. అడవుల్లోకి పెద్ద సంఖ్యలో వెళ్లి ఎర్ర చందనాన్ని తరలించి, అక్కడినుంచి తిరిగి వెళ్తున్న కూలీలను రేణిగుంట రైల్వేస్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ నుంచి భారీ సంఖ్యలో ఒకే ప్రాంతానికి చెందినవాళ్లు చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడంతో అక్కడి రైల్వే పోలీసులకు అనుమానం వచ్చింది. వాళ్లు వెంటనే తిరుపతి రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. రేణిగుంట స్టేషన్లో కాపు కాసిన పోలీసులు.. రైలు రాగానే ఆపి దాన్ని తనిఖీ చేయగా, మొత్తం 250 మంది ఎర్ర చందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వీళ్లంతా శేషాచలం అడవుల్లో తమ పని ముగించుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్తున్నట్లు తెలిసింది. అందరూ ఒకే ప్రాంతం వారు కావడం, అంతా కలిసి గుంపుగా వెళ్లడంతో అనుమానం వచ్చి విచారించగా.. అందరూ స్మగర్లేనని తేలిపోయింది. వీరందరినీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తాత్కాలికంగా తిరుచానూరులోని కళ్యాణమండపంలో ఉంచారు. సోమవారంనాడు అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. -
శేషాచలం అడవుల్లో కూంబింగ్!
-
రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం
కుప్పం, న్యూస్‌లైన్: కర్ణాటక నుంచి తమిళనాడుకు కుప్పం మీదుగా వెళ్తున్న రూ. కోటి విలువచేసే ఎర్రచందనం లారీని అటవీ శాఖాధికారులు బుధవారం పట్టుకున్నారు. ముందస్తుగా వచ్చిన సవూచారం మేరకు పోలీసులు, అటవీ శాఖాధికారులు కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని వి. కోట వద్ద కాపుకాశారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న లారీలో ఎర్రచందనం దుంగలు ఉన్నాయన్న అనుమానంతో తనిఖీ చేశారు. వీరిని చూసి డ్రైవరు, క్లీనరు వాహనాన్ని వదిలిపెట్టి పరారయ్యూరు. వాహనాన్ని కుప్పం అటవీ శాఖ కార్యాలయానికి తరలించి పూర్తిగా తనిఖీ చేశారు. అందులో ఎర్రచందనం ఉన్నట్లు బయటపడింది. ఈ వాహనంలో మాత్రలు, మందుల బాక్సులు, ప్లాస్టిక్ కవర్లు, వివాహ పత్రికలు, మరిన్ని పార్సిళ్లు నింపారు. అడుగు భాగంలో ఎర్రచందనం దుంగలు వేశారు. -
సీఎం కుటుంబీకులదే...స్ధానికులు
-
అందరూ దొంగలే
-
అందరూ దొంగలే
* అధికారులు, నేతల కనుసన్నల్లో ఎల్లలు దాటుతున్న ఎర్రచందనం * జపాన్, సింగపూర్, మలేసియూలకు అక్రమంగా ఎగుమతి * ఖాళీ అవుతున్న శేషాచలం, పాపికొండలు, లంకమల అభయారణ్యాలు * అరుదైన సంపద అంతరించిపోతున్నా పట్టించుకోని పోలీసు, అటవీ అధికారులు * అప్పుడప్పుడు చిన్న స్మగ్లర్లు పట్టుబడినా వదిలేయాలంటూ రాజకీయ ఒత్తిళ్లు.. ఎల్.రఘురామిరెడ్డి, సాక్షి: వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అందరూ దొంగలే! డబ్బు మూటల సాక్షిగా అధికారులు, రాజకీయనేతల ‘అపవిత్ర బంధం’తో అత్యంత కట్టుదిట్టమైన నెట్వర్క్ మధ్య ‘ఎర్రబంగారం’ అనునిత్యం రాయలసీమ జిల్లాల నుంచి దేశం ఎల్లలు దాటిపోతోంది. పోలీసు, అటవీశాఖలకు చెందిన పలువురు అధికారులు ఇంటి దొంగల పాత్ర పోషిస్తుండగా.. కొందరు రాజకీయ నేతలు రాజీలు కుదిర్చే పెద్దన్నల పాత్ర పోషిస్తున్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా అందరూ కలిసి ఎర్రచందనాన్ని నిరాటంకంగా సరిహద్దులు దాటిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఈ ఇంటి దొంగలకు తెలియకుండా ఎవరైనా అధికారులు దాడులు చేసి పట్టుకున్నా దొరికేది కూలీలు, డ్రైవర్లే! వారు చెప్పే వివరాల ఆధారంగా చిన్న స్మగ్లర్లను అధికారులు అరెస్టు చేసినా వెంటనే వదిలేయాలంటూ నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తాయి. గట్టి అధికారి ఎవరైనా వినకపోతే ఉన్నతాధికారులతో చెప్పించి విడుదల చేయిస్తారు. అంతటితో దాని ‘కథ’ ముగిసిపోతుంది. శేషాచలం టూ సింగపూర్ కోట్లు కుమ్మరిస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణా ఓ మాఫియాలా మారడంతో.. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని అత్యంత అరుదైన, విలువైన ఈ వృక్షజాతి ఉన్న అడవులు అంతరించిపోతున్నాయి. ఈ అయిదు జిల్లాల్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా ఈ వృక్ష జాతి లేదు. (అంతరించిపోతున్న వృక్షజాతుల్లో చేర్చారు) ఈ కలప ఎగుమతికి ఎవరికీ అనుమతి లేదు. దీంతో రాష్ట్రంలోని, తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని రాయలసీమలోని శేషాచలం, పాపికొండలు, లంకమల అభయారణ్యాల నుంచి వేలాది టన్నులు జపాన్, సింగపూర్, మలేషియా, హాంకాంగ్ తదితర దేశాలకు చట్టవిరుద్ధంగా తరలిస్తున్నారు. పెలైట్ల సాయంతో చెక్‌పోస్టులు దాటి ఒక ప్రాంతం నుంచి వాహనంలో సరుకు తరలించే ముందు స్మగ్లర్లు తమకు అనుకూలమైన పోలీసు, అటవీ సిబ్బంది ద్వారా సదరు మార్గంలో ఎవరైనా అధికారులు ఉన్నారా? అని విషయం తెలుసుకుంటారు. లైన్ క్లియర్‌గా ఉందని సమాచారం వచ్చినా ఒక పట్టాన నమ్మరు. ఆ ప్రాంతంలోని నమ్మకస్తులైన కొందరు యువకులను మాట్లాడుకుని మోటార్ సైకిల్ లేదా కారులో ఆ మార్గంలో పెలైట్‌గా పంపుతారు. అటవీ/పోలీసు సిబ్బంది లేరని నిర్ధారించుకున్న తర్వాత ముందు ఒక ఖాళీ వాహనం వెళుతుంది. దాని వెనుక ఎర్రచందనం దుంగలున్న వాహనం వెళుతుంది. మధ్యలో సెల్ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ ఏమాత్రం అనుమానం వచ్చినా వాహనాన్ని దారి మళ్లించేస్తారు. అటవీ ప్రాంతం, చెక్‌పోస్టులు దాటుకుని నిర్ధారిత ప్రధాన మార్గానికి చేరుకుంటారు. ఇలా పెలైట్‌గా వెళ్లినవారికి 3 నుంచి 5 కిలోమీటర్లకు రూ.10 వేలు చొప్పున ఇస్తారు. కంటెయినర్లలో ఓడరేవుకు సాధారణంగా చెన్నై పోర్టు ద్వారానే ఎర్రచందనాన్ని విదేశాలకు పంపిస్తారు. అందువల్ల ఆయూ జిల్లాల నుంచి చెన్నై మార్గంలో వెళ్లే వాహనాలనే అధికారులు తనిఖీ చేస్తారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు తాము కలప నిల్వ చేసిన ప్రాంతం నుంచి తొలుత హైదరాబాద్, ముంబై, బెంగళూరు లాంటి నగరాలకు తరలిస్తున్నారు. అంబులెన్సులు మొదలు ఆయిల్ ట్యాంకర్ల వరకూ దేనిలో వీలైతే దానిలో తరలిస్తున్నారు. ఆయా నగరాల్లోని ఫ్యాక్టరీల నుంచి వెళ్లే భారీ కంటెయినర్ల డ్రైవర్లకు దారిమధ్యలో భారీగా డబ్బు ఎరవేసి అందులో ఎర్రచందనం దుంగల్నీ నింపి చెన్నై, కృష్ణపట్నం, ముంబై, కాండ్లా తదితర ఓడరేవులకు చేరవేస్తున్నారు. ఇలా వేరే సరుకుల పేరుతో కంటెయినర్లు విదేశాలకు చేరతాయన్న మాట. కస్టమ్స్ అధికారులు పెద్ద పెద్ద కంపెనీలకు సెల్ఫ్ సీలింగ్ సదుపాయం కల్పించడమూ ఇందుకు అనువుగా మారింది. ‘‘మా పోర్టు నుంచి ప్రతిరోజూ 1500 కంటెయినర్లు వెళుతుంటాయి. అన్నింటినీ తనిఖీ చేయాలంటే రవాణా వ్యవస్థ స్తంభించి షిప్పులన్నీ ఆగిపోతాయి. అందువల్ల ర్యాండమ్ పద్ధతిలో కొన్ని కంటెయినర్లే తనిఖీ చేస్తాం. అలా చేసినప్పుడు గతంలో కొన్నింటిలో ఎర్రచందనం దొరికింది. దానిని సీజ్ చేశాం’’ అని చెన్నైకి చెందిన డెరైక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారి తెలిపారు. తమిళ కూలీలకు కాసులే కాసులు అటవీ ప్రాంతంలో చెట్లు నరికి ఎర్రచందనం దుంగలు తరలించే కూలీలకు వేలకు వేల కూలీ లభిస్తోంది. అందువల్లే తమిళనాడు సరిహద్దుల నుంచి ఈ పనికి 18-25 ఏళ్ల మధ్య వయసుగల కూలీలు అధిక సంఖ్యలో శేషాచలం అడవులకు వస్తున్నారు. అడవిలో చెట్టుకొట్టి తయారు చేసిన దుంగను వీరు 25-30 కిలోమీటర్లు మోసి వాహనాలు వెళ్లే మార్గం దగ్గరకు చేరవేస్తారు. ఇందుకు వారికి కిలోకు రూ.500 నుంచి రూ. 700 వరకూ ఇస్తున్నారు. ఒక్కో కూలీ మూడు రోజుల్లో 30 కిలోల బరువున్న దుంగను ఇలా చేర్చుతారు. వీరికి కిలోకు రూ.500 చొప్పున మూడు రోజుల కూలి కింద రూ.15 వేలు వస్తుంది. అంటే రోజు కూలి అక్షరాలా రూ.5 వేలు. అందువల్లే తమిళనాడులోని జమునా మత్తూర్, మామత్తూర్, ఆంబూర్, కన్నమంగళం, మలయార్ మక్కల్ ప్రాంతాల నుంచి కూలీలు వచ్చి ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారు. గత నెలలో శేషాచలం అడవుల్లో ఇద్దరు అటవీశాఖ సిబ్బందిని హత్య చేసింది ఈ ప్రాంతాలకు చెందిన కూలీలే. రాష్ట్రానికి చెందిన కూలీలకు రోజుకు రూ.2వేల నుంచి రూ.4 వేల వరకు ఇస్తున్నారు. 2011-12లో అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం 1430 మెట్రిక్ టన్నులుండగా.. దీనికి 10 నుంచి 12 రెట్లు విదేశాలకు తరలి ఉంటుందని అంచనా. పట్టుబడుతున్నదీ కూలీలే ఇటీవల రాయలసీమలో ప్రత్యేకించి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికేవారిలో 90 శాతం మంది తమిళ కూలీలే. కేసుల భయంవల్ల మన రాష్ట్రంలోని అటవీ పరిసర గ్రామాలవారు ఎర్రచందనం చెట్లు నరికేందుకు ఇష్టపడట్లేదు. స్మగ్లింగ్ నిరోధం పేరిట పోలీసు, అటవీ సిబ్బంది పట్టుకుంటున్నది కేవలం ఈ కూలీలు, వారిని పంపించే చిరుచేపల్నే. అధికారులు, రాజకీయ నేతల సహకారంతో రూ. వేల కోట్లు ఆర్జిస్తున్న తిమింగలాల్లాంటి అసలు నేరగాళ్లు దొరల్లా దర్జాగా తిరుగుతున్నారు. టాస్క్ఫోర్సు పట్టించిన చిన్న స్మగ్లర్లపై కేసు పెట్టకుండా వదిలేయడం వల్లే సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన సీఐ పార్థసారథితోపాటు ఇద్దరు పోలీసు అధికారులు సస్పెండ్ కావడం, మరికొందరి పాత్రపై దర్యాప్తు జరుగుతుండ టం స్మగ్లింగ్‌లో ఇంటి దొంగల పాత్రను స్పష్టం చేస్తోంది. తమిళనాడుకు చెందిన లాయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని అరెస్టరుున కూలీలకు బెయిల్ ఇప్పిస్తున్న స్థానిక న్యాయవాదులూ భారీగా ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు. ‘‘అరెస్టయినట్లు తెలియగానే ఇక్కడి అడ్వకేట్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఒకరికి బెయిలిప్పిస్తే రూ.10 వేలు తీసుకుంటున్నారు.’’ అని కడపకు చెందిన ఓ లాయర్ తెలిపారు. -
స్మగ్లర్లదే పైచేయి
విలువైన ఎర్రచందనం చెట్లను కాపాడేందుకు ఒకవైపు అటవీ అధికారులు, మరోవైపు పోలీసు యంత్రాంగం ఎన్ని ఎత్తులు వేస్తున్నా వాటిని స్మగ్లర్లు చిత్తు చేస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేసినా ఎర్రచందనం దుంగల తరలింపు ఆగడం లేదు. ఇందుకు నిదర్శనం రోజూ పట్టుబడుతున్న దుంగలు, దొంగలే నిదర్శనం. తాజాగా మంగళవారం కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలుతున్న దుంగలను అధికారులు పట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే అటవీ దొంగలదే పైచేయి అన్పిస్తోంది. ఒంటిమిట్ట, న్యూస్‌లైన్: కడప-చెన్నై జాతీయ రహదారిలోని కొత్తమాధవరంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఓ కారును మంగళవారం తెల్లవారుజామున సిబ్బంది పట్టుకున్నారు. వాటిని తనిఖీ చేయగా అందులో 13 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించామని రేంజర్ హయ్యద్ తెలిపారు. రాజంపేట వైపు నుంచి కడప వైపునకు వచ్చిన ఓపెన్ఆల్ట్రా కారుతో పాటు దుంగలను తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు. వారు కర్ణాటకకు చెందిన నయూమ్, ఆసిఫ్‌గా గుర్తించామన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రెడ్డయ్య, సెక్షన్ ఆఫీసర్ లక్ష్మీకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. పోరుమామిళ్లలో... ఇటుకుల్లపాడు బీట్‌లో మంగళవారం అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి, లింగాలదిన్నెపల్లెకు చెందిన శ్రీనివాసులును అరెస్టు చేసి వారి నుంచి నాలుగు దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి పంపిస్తామని అటవీ సిబ్బంది తెలిపారు. వీరబల్లెలో... శీతంపేట సమీపంలో పాన మంగళవారం టాటా మ్యాక్స్‌లో తరలిస్తున్న 51 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. దుంగలను తరలిస్తున్న గుంతరాజుపల్లె దళితవాడకు చెందిన వెంకటరమణను అదుపులోకి తీసుకున్నామన్నారు. రైల్వేకోడూరు రూరల్‌లో... కుక్కలదొడ్డి అటవీ ప్రాంతంలో మురళీ అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతని నుంచి నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని రైల్వేకోడూరు రేంజ్ అధికారి శ్రీరాములు తెలిపారు. దాడిలో ఎఫ్బీఓ లింగారెడ్డి, సిబ్బంది శ్రీరామమూర్తి పాల్గొన్నారు. -
సమన్వయలోపమే ప్రాణం తీసింది
=పోలీసులకు సమాచారం ఇవ్వని అటవీ సిబ్బంది =టాస్క్‌ఫోర్స్ లేకుండానే అడవిలోకి.. =క్రెడిట్ కోసం అటవీ సిబ్బంది పాకులాట సాక్షి, తిరుపతి: అటవీ శాఖాధికారులకు, పోలీసులకు మధ్య ఏర్పడిన సమన్వయ లోపం రెండు ప్రాణాలను బలిగొంది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, వారిని తామే పట్టుకోవాలనే మొండి పట్టుదలతో అటవీ సిబ్బంది ముందుకు సాగడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఇంత దారుణానికి పాల్పడతారని అటవీ సిబ్బంది అనుకోలేదు. తమను చూసి నిం దితులు పారిపోతారని, ఒకరిద్దరు ఎదురుతిరిగినా వారిని తాము అదుపులోకి తీసుకోగలమని భావించి, ముందుకు సాగడం ఈ ఘోర సంఘటనకు కారణమయింది. అటవీ శాఖ సిబ్బంది వెంట టాస్క్ఫోర్సు పోలీసులు కూడా ఉండి ఉంటే, ఈ సంఘటన జరిగేది కాదు. ఆయుధాలు లేకుండా కేవలం లాఠీలతో అటవీ శాఖ సిబ్బంది వెళ్లడంతో, వారిపై స్మగ్లర్లు తిరగబడ్డారు. అటవీ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇక్కడ అటవీ, పోలీసు సిబ్బందిలో ఏర్పడిన సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఎర్రచందనం దుంగలను లేదా, స్మగ్లర్లను పట్టుకున్నపుడు టాస్క్ఫోర్సు వల్లే వీరిని పట్టుకున్నట్లు చెబుతుంటారని అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్న అటవీ సిబ్బంది ప్రమేయం లేదన్నట్లు చెప్పడం పలుసార్లు వివాదాస్పదమయిందన్నారు. దీంతో కొంతకాలంగా టాస్క్ ఫోర్సు ఆపరేషన్లు జరగడం లేదన్నారు. ‘‘స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం అందగానే అటవీ సిబ్బంది రొటీన్‌గా వెళ్లారు. దానిని పోలీసులకు తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కువ మంది మారణాయుధాలతో ఉన్న కారణంగా వారు తప్పకుండా సాయుధ దళాలను తీసుకుని వెళ్లి ఉండాలి. ఆ విధంగా చేసి ఉంటే, ప్రాణాపాయం తప్పేది’’ అన్నారు. పోలీసు అధికారులు సైతం ఇదే అంటున్నారు. ఒక టాస్క్ ఫోర్సు బృందంలో పోలీసులు, అటవీ సిబ్బంది కలిపి 25 మంది ఉంటారన్నారు. ఈ బృందం వెళ్లినట్లయితే గాలిలో రెండుసార్లు కాల్పులు జరిపినా నిందితులు పారిపోయి ఉండేవారన్నారు. ఏది ఏమైనా ఇంత ఘోర సంఘటనకు సిబ్బందిలోని సమన్వయ లోపమే కారణమనే విషయం స్పష్టమవుతోంది. అయితే ఇకపై తమకు ఆయుధాలు ఇస్తేనే గాని, అడవుల్లోకి వెళ్లమని అటవీ సిబ్బంది తెలుపుతున్నారు. ఆత్మరక్షణకు ఆయుధాలు లేకుండా అడవిలోకి వెళ్లడం సాధ్యం కాదని, భవిష్యత్తులో ఆయుధాలను తప్పకుండా సరఫరా చేయాలని, దీనిపై సమ్మె చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. -
’ఎర్ర’ బంగారంపై వెర్రి
అంతరించిపోతున్న అరుదైన వృక్షసంపద రాష్ట్రంలో మినహా ప్రపంచంలో మరెక్కడా లేని ఎర్రచందనం వృక్షాలు టన్ను విలువ రూ. 20 లక్షలు పైనే దొంగతనంగా నరికించి సరిహద్దులు దాటిస్తున్న స్మగ్లర్లు ఈ ఏడాదిలోనే 500 టన్నుల దుంగలు స్వాధీనం సాక్షి, చిత్తూరు ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచల అడవుల్లో తప్ప ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ దొరకని అరుదైన వృక్ష సంపద.. ఎర్రచందనం. శాస్త్రీయంగా పెట్రోకార్పస్ సానతలీనస్ అని పిలిచే ఈ వృక్షాలు.. పాలకొండ, శేషాచలం పర్వత శ్రేణుల్లోని కడప, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా.. కొంత భాగం కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యాపించి ఉన్నాయి. మొత్తం ఐదు జిల్లాల్లో 5,160 చదరపు కిలోమీటర్ల పరిధిలో మూడు లక్షల హెక్టార్లలో ఈ ఎర్రచందనం అడవులు విస్తరించి ఉన్నాయి. అత్యంత అరుదైన ఈ వృక్షాల అంతర్జాతీయ విక్రయాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మన దేశంలో ఎర్రచందనం కలపను పెద్దగా వినియోగించరు. కానీ.. చైనా, జపాన్, సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. సంగీత వాద్య పరికరాలు, ఖరీదైన ఫర్నిచర్‌తో పాటు.. ఔషధాల తయారీకి కూడా అక్కడ ఎర్రచందనాన్ని వినియోగిస్తారు. అంతర్జాతీయ విపణిలో టన్ను ఎర్రచందనం విలువ దాదాపు రూ. 20 లక్షలకు పైగా ఉందని అనధికారిక అంచనా. దీనినే స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. శేషాచల అడవుల్లోని ఎర్రచందనం వృక్షాలను ఇష్టానుసారం నరికివేసి.. దుంగలను దొంగ రవాణా చేస్తూ సరిహద్దులు దాటిస్తున్నారు. ఫలితంగా అరుదైన ఎర్రచందనం వృక్షాలు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. స్మగ్లింగ్ దందా సాగుతోందిలా... ఎర్రచందనం కీలక స్మగ్లర్లు ప్రధానంగా చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో ఉన్నారు. వీరికి తిరుపతి, చిత్తూరు, కడప ప్రాంతాల్లోని మధ్యవర్తులు సహకరిస్తున్నారు. ఈ మధ్యవర్తులు స్థానికులతో పాటు, సరిహద్దుల్లోని తమిళనాడు ప్రాంతం వారికి లక్షల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చి.. వారిని అడవుల్లోకి పంపి ఎర్రచందనం వృక్షాలను నరికిస్తుంటారు. అలా నరికిన ఎర్రచందనం దుంగలు సమీపంలోని రోడ్డు పాయింట్‌కు రాగానే స్మగ్లర్లు ముందే ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో ఎక్కించి.. రాత్రికి రాత్రి చెన్నై, బెంగళూరుల్లోని రహస్య గోడౌన్లకు తరలిస్తారు. స్మగ్లర్లు బియ్యం, రాగులు, ఎర్రగడ్డలు ఇతర సాధారణ వస్తువులు సముద్రమార్గంలో మలేసియా, చైనా, దుబాయ్‌లకు; రోడ్డు మార్గంలో బర్మా, నేపాల్‌లకు ఎగుమతి చేసే విధంగా నకిలీ పర్మిట్లను సృష్టిస్తారు. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వీటిని ఎగుమతి చేసేందుకు కంటెయినర్లు బుక్ చేస్తారు. ఆ కంటెయినర్లను సెంట్రల్ ఎక్సైజ్ సిబ్బంది తనిఖీ చేసి సీల్ వేసిన తర్వాత.. వాటిని సమీపంలోని రహస్య గోడౌన్లకు తీసుకెళ్లి సీల్ తీసి.. సరుకుల మధ్యలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తారు. మళ్లీ సీల్ అతికించి ఆ కంటెయినర్లను.. నేరుగా చెన్నై, కోచి, మంగళూరు, ముంబై, గుజరాత్‌లోని ముంద్రా, కాండ్ల పోర్టుల ద్వారా కార్గో షిప్పుల్లోకి ఎక్కిస్తారు. అలా ఓడల ద్వారా సింగపూర్, ఇండొనేసియా, మలేసియా, దుబాయ్ పోర్టులకు.. అక్కడినుంచి హాంకాంగ్, చైనాలకు ఎర్రచందనం రవాణా అవుతోంది. ఇక్కడి స్మగ్లర్ గ్యాంగ్‌కు సంబంధించినవారే ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులకు ఎర్రచందనం దుంగలను నేరుగా అందిస్తారు. దానికి సంబంధించిన సొమ్మును హవాలా మార్గంలో తెప్పించుకుంటారు. ఇక రోడ్డు మార్గంలో అయితే.. ఇదే విధమైన కంటెనర్లలో ఒకవైపు నేపాల్ నుంచి నేరుగా చైనాకు తరలిస్తారు. మరోవైపు అసోం, మణిపూర్, మిజోరం సరిహద్దుల గుండా బర్మాకు.. అక్కడి నుంచి చైనాకు తరలిస్తారు. చెట్లు నరుకుతూ పట్టుబడ్డా శిక్ష స్వల్పమే... ఎర్రచందనం వృక్షాలు నరికేందుకు కూలీలు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల వరకూ అడ్వాన్‌సను స్మగ్లర్లు ఇస్తున్నారు. వారు అడవిలోకి చేరేందుకు ప్రత్యేక వాహన సదుపాయం, ఆహారం సమకూరుస్తారు. ఒక దుంగ నరికితే రూ. 1,500 వరకు గిట్టుబాటు అవుతోంది. ఒకవేళ పట్టుబడితే ఏపీ అటవీశాఖ చట్టం సెక్షన్ 20(1)డీ కింద నేరం రుజువైతే మూడు నెలల నుంచి ఏడాదిలోపు శిక్ష పడుతుంది. బెయిల్ వెంటనే లభిస్తుంది. దీంతో స్వల్పకాలిక శిక్షను లెక్క చేయకుండా మళ్లీమళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రధానంగా తమిళనాడులోని తిరువణ్ణామలై, వేలూరు, తిరువళ్లూరు, కంచి, సేలం, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల నుంచి ఎక్కువగా వస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరు సైతం ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డాగా ఉంది. ఇక్కడ కొందరు చోటా నాయకులు ఎర్రచందనం అక్రమ రవాణాతో కోట్లు గడించి ఇప్పుడు రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నారు. వీరిలో కొందరికి అధికార పార్టీ నాయకుల అండదండలూ ఉన్నాయి. పట్టుబడిన దుంగలు 15 వేల టన్నులు పైనే... ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అటవీశాఖ పదేళ్లుగా దాడుల్లో జరిపి 15 వేల టన్నులకు పైగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో 8,600 టన్నులను గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించేందుకు ఇటీవల కేంద్ర పర్యావరణశాఖ అనుమతి ఇచ్చింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 6,000 కోట్లకు పైమాటే. గతేడాది వరకూ అటవీశాఖ మాత్రమే స్మగ్లర్లపై దాడులు చేసేది. 2013 నుంచి పోలీసుశాఖ కూడా రంగంలోకి దిగింది. పోలీసు, అటవీశాఖలు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాయి. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఐదు జిల్లాల పరిధిలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్మగ్లర్ల వేట సాగిస్తున్నారు. అయినా స్మగ్లింగ్ కొనసాగుతూనే ఉంది. చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో గత మూడేళ్లలో నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ. 15 కోట్లకు పైగా విలువైన 500 టన్నుల ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. వెయ్యి మందికి పైగా ఎర్రచందనం నరికేవారిని, 50 మంది రెండో శ్రేణి స్మగ్లర్లను అరెస్టు చేశారు. -
అటవీ ఉద్యోగులపై స్మగ్లర్ల దాడి