సంగీతకు 14 రోజుల రిమాండ్‌ | 14 Day Remand For sangeeta in red sandal smuggling case | Sakshi
Sakshi News home page

సంగీతకు 14 రోజుల రిమాండ్‌

Published Wed, Mar 29 2017 12:23 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

సంగీతకు 14 రోజుల రిమాండ్‌

సంగీతకు 14 రోజుల రిమాండ్‌

పాకాల (చిత్తూరు జిల్లా): ఎర్రచందనం అక్రమ కేసులో అరెస్టైన ఎయిర్‌ హోస్టెస్‌  సంగీత చటర్జీ(26) ని చిత్తూరు పోలీసులు బుధవారం ఉదయం పాకాల జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు.  చిత్తూరు నుంచి బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆమెను ప్రత్యేక వాహనంలో పట్టిష్ట బందోబస్తు నడుమ పాకాల కు తీసుకొచ్చారు.

అనంతరం ఆమెను పాకాల జూనియర్ సివిల్ జడ్జి దేవేంద్రరెడ్డి  ముందు హాజరుపరిచారు. ఆమెకు 14 రోజులు రిమాండ్ విధిచారు. అక్కడి నుంచి ఆమెను పోలీసులు చిత్తూరు జైలుకు తరలించారు. సంగీతను పాకాలకు తరలిస్తున్నరని తెలిసి పాకాల సీఐ రామలింగమయ్య ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎర్రచందనం కేసులో సంగీత, భర్త లక్ష్మన్ తో పాటు ముద్దాయిగా ఉంది. కల్లూరు పోలీస్ స్టేషన్ లో, చిత్తూరు జిల్లా లోని మరికొన్ని పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఈమెపై నమోదై ఉన్నాయి. ఉగాది పండుగ సందర్భంగా కోర్టు సెలవు కావడంతో జడ్జి ఇంటి వద‍్ద ఆమెను హాజరు పరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement