sangeeta
-
భారత్ శుభారంభం
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 4–0 గోల్స్ తేడాతో మలేసియా జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (8వ, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ప్రీతి దూబే (43వ నిమిషంలో), ఉదిత (44వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఇతర తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా 15–0తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేయగా... జపాన్, కొరియా మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. మలేసియా చేతిలో ఓటమి ఎరుగని భారత జట్టు ఈసారీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఎనిమిదో నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను సంగీత లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు కొనసాగించినా ఫినిషింగ్ వేధించింది. ఫలితంగా 42వ నిమిషం వరకు భారత్ ఖాతాలో మరో గోల్ చేరలేదు. అయితే రెండు నిమిషాల వ్యవధిలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను ప్రీతి దూబే, ఉదిత సది్వనియోగం చేసుకోవడంతో భారత్ ఒక్కసారిగా 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా సంగీత ఫీల్డ్ గోల్‌తో భారత ఆధిక్యం 4–0కు పెరిగింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత్‌కు 11 పెనాల్టీ కార్నర్లు, మలేసియాకు ఒక పెనాల్టీ కార్నర్ లభించాయి. -
బీసీసీఐ షాకిచ్చింది.. చహల్ అక్కడ అలా!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. గతేడాది జూలైలో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా బరిలోకి దిగిన అతడు మళ్లీ పునరాగమనం చేయలేదు. షాకిచ్చిన బీసీసీఐ వన్డే ప్రపంచకప్-2023 జట్టులోనూ అతడికి స్థానం దక్కలేదు. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ ఇవ్వలేదు సెలక్టర్లు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టుతో పాతుకుపోవడంతో చహల్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో 2023-24 ఏడాదికి గానూ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోనూ యజువేంద్ర చహల్‌కు మొండిచేయి చూపింది బీసీసీఐ. ఐపీఎల్లో కింగ్ ఈ నేపథ్యంలో ఇక ఐపీఎల్‌లోనే మళ్లీ యుజీ స్పిన్ మాయాజాలాన్ని చూసే వీలుంది. గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన చహల్ 14 మ్యాచ్‌లలో కలిపి 21 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు(187) తీసిన బౌలర్‌గా చహల్ చరిత్రకెక్కాడు. చుక్కలు చూపించిన సంగీత ఇదిలా ఉంటే.. తనకు దొరికిన విరామ సమయాన్ని భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ కోసం కేటాయించాడు చహల్. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్ దిఖ్లాజా షోతో బిజీగా ఉంది. భారత రెజ్లర్ సంగీత ఫొగట్ కూడా ఈ టీవీ షోలో పాల్గొంది. ఈ నేపథ్యంలో విరామ సమయంలో చహల్‌తో కలిసి సంగీత సందడి చేసింది. అతడిని గొర్రెపిల్లలా వీపుపై వేసుకుని గిరాగిరా తిప్పుతూ తన రెజ్లింగ్ నైపుణ్యాలు ప్రదర్శించింది. ఆ సమయంలో చహల్ కిందపడతానేమోన్న భయంతో దింపేయమంటూ వేడుకున్నా ఆమె వినలేదు. View this post on Instagram A post shared by Tadka Bollywood (@tadka_bollywood_) ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా ఫొగట్ సిస్టర్స్‌లో చిన్నవారైన సంగీత ఫొగట్.. స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాను వివాహమాడింది. ఇక ఝలక్ దిఖ్లాజా షోలో పాల్గొన్న సంగీత తాజాగా ఎలిమినేట్ అయింది. ధనశ్రీ వర్మ మాత్రం టాప్-5లో కొనసాగుతోంది. చదవండి: అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు? -
Redin Kingsley-Sangeeta Birthday Photos: పెళ్లయ్యాక నటుడి తొలి బర్త్‌డే.. భార్య సర్ప్రైజ్ పార్టీ (ఫోటోలు)
-
ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్
సంగీత జ్ఞాని ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ఇందులో ధనుష్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారు. మెర్క్యూరీ గ్రూప్, కనెక్ట్ మీడియా సంస్థలు ఈ బయోపిక్‌ను నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబరులో ఈ చిత్రం షూటింగ్ప్రారంభించి, 2025 ఏడాది మధ్యలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తి శరణ్ మాట్లాడుతూ –‘ప్రాంంతీయ కథలతో సినిమాలు తీస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. అందుకే లోకల్,ప్రాంతీయ కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘రాబోయే రెండు దశాబ్దాల్లో భారతీయ వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ వినోద పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన మెర్క్యూరి సంస్థతో మెగా బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది’’ అని కనెక్ట్ మీడియా ప్రతినిధి వరుణ్ మాథుర్ అన్నారు. -
స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!
మావీరన్( తెలుగులో మహావీరుడు) చిత్రానికి ఇప్పుడు కొత్తగా పబ్లిసిటీ వచ్చేసింది. నటుడు శివకార్తికేయన్, అదితి శంకర్ జంటగా నటించిన చిత్రం మావీరన్ ఈనెల 14న థియేటర్లలో విడుదలైంది. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి సరిత ముఖ్యపాత్రను పోషించడం విశేషం. చాలా గ్యాప్ తర్వాత ఈమె ఇందులో తల్లి పాత్రలో నటించారు . దర్శకుడు మిష్కిన్, టాలీవుడ్ నటుడు సునీల్ ప్రతినాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని అరుణ్ విశ్వ భారీస్థాయిలో నిర్మించారు. దీన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేసింది. (ఇది చదవండి: స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!) అయితే ఈ చిత్రాన్ని తొలి రోజు మొదటి షోను చూడడానికి స్టార్ హీరో విజయ్ సతీమణి సంగీత థియేటర్‌కు రావడం విశేషం. ఇటీవల విజయ్, సంగీత దంపతుల గురించి పలు రకాల రూమర్స్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సంగీత విజయ్ నిర్వహించిన ఏ కార్యక్రమానికి హాజరుకాలేదు. విజయ్ విద్యార్థులకు ప్రోత్సాహకాల అందించిన కార్యక్రమంలో కూడా సంగీత పాల్గొనలేదు. కారణం ఆమె తన బిడ్డల సంరక్షణ బాధ్యతలను కోసం విదేశాల్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఒక్కసారిగా శుక్రవారం సంగీత ముఖానికి ముసుగేసుకుని శివకార్తికేయన్ నటించిన మావీరన్ చిత్రాన్ని చూడ్డానికి చైన్నెలోని ఒక థియేటర్‌కు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె రావడం ఈ చిత్రానికి అదనపు ప్రచారాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. దీంతో విజయ్ అభిమానులు ఆనంద పడిపోతున్నారు. కారణం ఇటీవల విజయ్ నిర్వహించిన ఏ కార్యక్రమానికి సంగీత హాజరు కాకపోవడంతో పలు రకాల వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరలైన సంగతి తెలిసిందే. కాగా విజయ్ తాజాగా నటిస్తున్న లియో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం త్వరలోనే జరగనుంది. ఈ వేడుకల్లో సంగీత కచ్చితంగా పాల్గొంటారనే విశ్వాసాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓ వైపు విజయ్ అభిమానులు మావీరన్పై నెగిటివ్ రివ్యూలు ఇస్తూనే.. మరోవైపు శివకార్తికేయన్‌కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతలో సంగీత థియేటర్లో శివకార్తికేయన్ భార్య ఆర్తితో కలిసి ఆమె చేయి పట్టుకుని చాలా సంతోషంగా మాట్లాడింది. ఈ సినిమా గురించి శివకార్తికేయన్‌ను కూడా అడిగినట్లు కోలీవుడ్ సమాచారం. (ఇది చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) -
ట్రైలర్ అద్భుతంగా ఉంది.. 'మసూద'పై విజయ్ దేవరకొండ ప్రశంస
సీనియర్ నటి సంగీత, తిరువీర్, సాయికిరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మసూద'. హారర్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ తన మూడో చిత్రంగా ‘మసూద’ను ప్రకటించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ..' ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ నా అభినందనలు. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇలాంటి కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న నిర్మాత రాహుల్ యాదవ్‌గారికి ప్రత్యేకంగా నా అభినందనలు. వారి కలలు నిజం కావాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. (చదవండి: పాన్ ఇండియా చిత్రంగా 'మసూద') ట్రైలర్ విషయానికి వస్తే.... 'భవిష్యత్తు అనేది మనం ఈరోజు ఏం చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే పూర్తిస్థాయి హారర్ మూవీని తలిపించేలా ఉంది. దెయ్యం పట్టిన అమ్మాయి చుట్టు కథ మొత్తం తిరుగుతోందని ట్రైలర్లో అర్థమవుతోంది. తల్లీకూతుళ్ల మధ్య ప్రేమ, మధ్య తరగతి కుటుంబాల బాధలు, స్నేహం, ప్రేమ వంటి అన్ని కోణాలను టచ్ చేస్తూ సాగిన ట్రైలర్.. ఒక్కసారిగా హర్రర్ సీన్స్‌తో భయపెట్టేస్తోంది. ‘అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అసలు భయం ముందుంది’ అని చిత్ర బృందం చెబుతున్న తీరు చూస్తుంటే.. హారర్ మూవీ చెప్పకనే చెప్పేశారు ఇప్పటికే విడుదలైన టీజర్‌కి, పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఎస్వీసీ బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు. -
అలనాటి హీరోయిన్ల మధ్య మీనా బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ మీనా తాజాగా తన 46వ పుట్టిన రోజును సెలబ్రెటీ స్నేహితులు మధ్య జరుపుకున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 16న) మీనా బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె తన ఇండస్ట్రీ స్నేహితులు, అలనాటి స్టార్ హీరోయిన్లు సంగీత, సంఘవి, రంభలతో కలిసి పుట్టిన రోజును జరుపుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీనాకు ఇండస్ట్రీలో చాలామంది సన్నిహితులు ఉన్నారు. సంగీత, రమ్యకృష్ణ, సంఘవి, శ్రీదేవి విజయ్ కుమార్, రంభ, స్నేహ ఇలా చాలామంది తనకు ఆప్తమిత్రులని మీనా పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల భర్తను కొల్పోయి విషాదంలో ఉన్న మీనాకు వారంతా అండగా నిలుస్తున్నారు. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు.. సందర్భం వచ్చినప్పుడల్లా వారంత మీనాను కలిసి కాసేపు ఆమెతో గడుపుతున్నారు. ఈ క్రమంలో నిన్న తన పుట్టిన రోజు కావడంతో రంభ, సంగీత, సంఘవిలు కలిసి ఆమె బర్త్‌డేను సెలబ్రెట్ చేశారు. మీనాతో కేక్ కట్ చేయించి తనతో కాసేపు సరదగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను మీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలాటి కఠిన సమయంలో మీనాకు అండగా నిలుస్తున్న ఈ తారలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ‘నిజమైన స్నేహం అంటే మీది’, ‘మీనా గారు ఇండస్ట్రీలో మంచి స్నేహితులను పొందారు’ అంటూ ఆమె పోస్ట్‌పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
స్టార్ రెజర్ల పెళ్లి సందడి : ఫోటోలు
భారత స్టార్ రెజర్లు భజరంగ్ పునియా సంగీత ఫొగట్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నవంబరు 26, గురువారం వీరి వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఈ మేరకు సంగీత, పునియా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. జీవితం పరిపూర్ణం. ఈ జీవితానికి తోడునువ్వు. ఈ కొత్త అధ్యాయం ప్రేమ, సంతోషంతో నిండాలి అంటూ ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు వివాహంలో కూడా అద్భుతమైన వేడుక ఉందంటూ భజరంగ్ పునియా తన ఉద్వేగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ రోజు నా జీవిత భాగస్వామిని నా ఇంటికి తీసుకు వచ్చాను. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను. సంతోషంగా ఉంది ..అలాగే కొంచెం ఆందోళనగా ఉంది. ఈ పరీక్షలో నెగ్గాలి ఫ్రెండ్స్. అత్యంత ప్రేమను. ఆశీర్వాదాలు అందించిన అందరినీ ధన్యవాదాలు అంటూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఈ నూతన దంపతులకు అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లికి ముందు నిర్వహించే వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో క్రీడాభిమానులకు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హల్దీ వేడుకల్లో పసుపు రంగు దుస్తుల్లో సంగీత మెరిసి పోయిన సంగతి తెలిసిందే You Complete Me ❤️ Soulmate for life. A New chapter of Life Would be Full Of love and Happiness. #SangRang @BajrangPunia ❤️ pic.twitter.com/dFIgSPNh6Q — Sangeeta Phogat (@sangeeta_phogat) November 26, 2020 Wishis you a Beautiful Happy Marriage 💞 Anniversary to Bajrang Punia 💞 Sangeeta Phogat the Best Wishes You ❣️🌹❣️ Lovely ♥️ Styles Anniversary to God Bless you Bajrang Punia Bhaiya ji 🙏 ka jawab Nahi ✔️💃🕺✌️👏👏 Sangeetha Bhabhi ji 🙏💐🙏 Also. pic.twitter.com/RhASqCxP1T — Raviprakashsingh (@Ravipra70338031) November 26, 2020 -
వరుడు భజరంగ్- వధువు సంగీత!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజర్లు భజరంగ్ పునియా- సంగీత ఫొగట్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు నవంబరు 25న మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పెళ్లికి ముందు నిర్వహించే వేడుకలతో కాబోయే వధూవరుల ఇళ్లలో సందడి నెలకొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో హల్దీ, మెహందీ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సంగీత ఫొగట్‌తో పాటు, ఆమె సోదరీమణులు, రెజర్లు గీత ఫొగట్, బబితా ఫొగట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హల్దీ వేడుకలో భాగంగా పసుపు రంగు దుస్తుల్లో మెరిసి పోతున్న సంగీతకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: రోహిత్ స్థానంలో అయ్యర్!) ఇక రెజ్లింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భజరంగ్ పూనియా వరల్డ్ నెంబర్‌వన్ రెజ్లర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫొగట్ సిస్టర్స్‌లో అందరికంటే చిన్నవారైన సంగీత ప్రేమించిన అతడు, పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లిచేసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన సంగీత తండ్రి మహావీర్ సింగ్ ఫొగట్ సైతం 'ఇది వారిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమని, పిల్లల అభిప్రాయాలను గౌరవించడమే మా కర్తవ్యమని' పేర్కొన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్ తర్వాతే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా కరోనా కారణంగా ఈ మెగా ఈవెంట్ వాయిదా పడటంతో ఇంకా ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భజరంగ్ పూనియా 65 కేజీల విభాగంలో, సంగీతా ఫొగట్ 59 కేజీల విభాగంలో పోటీ పడుతున్నారు. View this post on Instagram A post shared by Sangeetaphogat (@sangeetaphogat57) -
స్క్రీన్ టెస్ట్
1. నాని ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో తెలుసా? ఎ) 3 బి) 5 సి) 1 డి) 6 2. నాటి తరం హీరోలు కృష్ణ, కృష్ణంరాజులు ఎన్ని చిత్రాల్లో కలిసి నటించారో కనుక్కోండి? ఎ) 12 బి) 21 సి) 9 డి) 15 3. మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందామా? ఎ) అనూ ఇమ్మన్యుయేల్ బి) నిత్యామీనన్ సి) నివేథా థామస్ డి) మంజిమా మోహన్ 4. సౌత్‌లో చాలా సినిమాలు చేసి, నార్త్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఆమె ఏ భాషలో మొదట హీరోయిన్గా నటించారో తెలుసా? ఎ) తమిళ బి) ఇంగ్లీషు సి) మలయాళం డి) తెలుగు 5. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘అలా మొదలైంది’ చిత్రసంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) యం.యం.కీరవాణి బి) కల్యాణి మాలిక్ సి) సాయికార్తీక్ డి) శేఖర్ చంద్ర 6. ‘చెల్లుబోయిన చిట్టిబాబు’ అనే పేరుతో నటించి 2018 బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో నిలిచిన ఈ హీరో ఎవరో తెలుసా? (సి) ఎ) విజయ్ దేవరకొండ బి) నాని సి) రామ్‌చరణ్ డి) అల్లు అర్జున్ 7. ‘బాహుబలి’ చిత్రంలో అస్లాం ఖాన్ పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) నాజర్ బి) సుదీప్ సి) ప్రభాకర్ డి) సుబ్బరాజు 8. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘మేఘ సందేశం’ చిత్రంలో ఓ సింగర్ తన నిజమైన పేరుతోనే ఓ పాత్ర చేశారు. ఎవరా సింగర్? ఎ) యస్పీ బాలసుబ్రమణ్యం బి) కె.జే.ఏసుదాస్ సి) మను డి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 9 మేడమ్ స్పీకర్ అని ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేశ్‌బాబు ఏ ఆర్టిస్ట్‌ను ఉద్దేశించి సంబోధిస్తారో తెలుసా? ఎ) జయలలిత బి) అపూర్వ సి) రజిత డి) ప్రియా 10. ఎన్టీఆర్ బయోపిక్‌లో హెచ్.ఎమ్. రెడ్డి పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడెవరో తెలుసా? ఎ) కైకాల సత్యనారాయణ బి) జయప్రకాశ్ రెడ్డి సి) కోట శ్రీనివాసరావు డి) నరేశ్ 11. ‘పేపర్‌బాయ్’ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన నటి పేరు ఏంటి? ఎ) ప్రియ వడ్లమాని బి) రియా సుమన్ సి) నందితా శ్వేతా డి) నభా నటేశ్ 12. ‘ఎక్స్‌క్యూజ్‌మి మిస్టర్ మల్లన్న... ఒక కాఫీ తాగుదాం ఆవోనా...’ పాట ‘మల్లన్న’ చిత్రం లోనిది. ఈ పాటలో ‘మల్లన్న’ పాత్రధారి విక్రమ్‌ను ఆట పట్టించిన కథానాయిక ఎవరో గుర్తుందా? ఎ) సదా బి) సమంత సి) శ్రియ డి) సంగీత 13. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఫేమస్ అయిన హీరో పేరేంటో తెలుసా? ఎ) ప్రిన్స్ బి) కార్తికేయ సి) నందు డి) వైభవ్ 14. శ్రీ అమ్మయంగార్ అయ్యప్పన్ ఈ ప్రముఖ నటి అసలు పేరు. ఎవరామె? ఎ) సుజాత బి) సుహాసిని సి) రాధిక డి) శ్రీదేవి 15. ‘బాహుబలి’ చిత్రంలో హీరో ప్రభాస్‌కు అమ్మగా నటించారు రమ్యకృష్ణ. ఇప్పుడు మరో హీరోకు అత్తగా ఆమె నటించిన ఓ సినిమా రిలీజ్‌కి రెడీ అయింది. ఆ హీరో ఎవరు? ఎ) అఖిల్ బి) మంచు విష్ణు సి) నాగచైతన్య డి) ఆది 16. ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) చంద్ర సిద్ధార్థ బి) చంద్రశేఖర్ యేలేటి సి) చందు మొండేటి డి) శేఖర్ కమ్ముల 17. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఎ) రాజేంద్ర ప్రసాద్ బి) నరేశ్ సి) శివాజీ రాజా డి) శ్రీకాంత్ 18. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రాజీ’లో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) శ్రద్ధా కపూర్ బి) కరీనా కపూర్ సి) సోనమ్ కపూర్ డి) ఆలియా భట్ 19. ఈ ఫొటోలోని ప్రముఖ నటుడెవరో కనిపెట్టండి? ఎ) చిత్తూరు వి .నాగయ్య బి) యస్వీ రంగారావు సి) కాంతారావు డి) ముక్కామల 20. ఈ ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా? ఎ) మంచు మనోజ్ బి) అఖిల్ సి) ఆది డి) మహేశ్‌బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) బి 4) డి5) బి 6) సి 7) బి 8) డి 9) ఎ 10) ఎ 11) బి 12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) సి 18) డి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
మళ్లీ అత్తింటి ముందు సంగీత ధర్నా
-
తాళం పగులగొట్టి లోపలికి వెళ్లిన సంగీత
-
సంగీతకు ఊరట.. భర్త శ్రీనివాస్‌రెడ్డికి మొట్టికాయలు
-
సంగీతకు ఊరట.. భర్త శ్రీనివాస్‌రెడ్డికి మొట్టికాయలు
సాక్షి, హైదరాబాద్ : ఆమరణ దీక్ష వైపుగా ముందుకెళుతున్న సంగీతను తొలి విజయం వరించింది. మియాపూర్ ఫ్యామిలీ కోర్టు సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డికి మొట్టికాయలు వేసింది. ఆమెను గౌరవ ప్రదంగా ఇంటికి తీసుకెళ్లాలని చెప్పింది. అదే సమయంలో ప్రతి నెల మెయింటెన్స్‌కు రూ.20వేలు చెల్లించాలని ఆదేశించింది. బోడుప్పల్‌కు చెందిన సంగీత తన భర్త శ్రీనివాసరెడ్డి వేధింపులపై గత 54 రోజులుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం ఈ కేసు విచారణలో భాగంగా మియాపూర్ ఫ్యామిలీ కోర్టు సంగీతకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. సంగీతకు మెయింటెనెన్స్ ఖర్చులు నెలకు రూ.20 వేలు చెల్లించాలని, అలాగే, ఆమెను గౌరవ ప్రదంగా ఇంట్లోకి భర్త తీసుకెళ్లాలని ఆదేశించింది. అయితే, దీనిపై భర్త శ్రీనివాస్‌రెడ్డి మరోసారి కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. భార్యను బాగానే చూసుకుంటానని, ఆమె తన వద్దే ఉంటుందని అలాంటప్పుడు మెయింటెన్స్ ఖర్చులు ఎందుకు ఇవ్వడం అని ఆ కౌంటర్లో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. భర్త, అత్తమామలు కొడుతూ, లైంగికంగా వేధిస్తున్నారంటూ సంగీత కేసు పెట్టిన విషయం తెలిసిందే. మొత్తం మూడు కేసులు ఆమె పెట్టారు. ఈ కేసుకు సంబంధించి భర్త, అత్తమామలు కోర్టుకు హాజరుకాగా సంగీత తరుపున ఆమె సోదరుడు కోర్టుకు హాజరయ్యాడు. సంగీత మాత్రం ఇంకా దీక్షలోనే ఉన్నారు. రోడ్డున పడ్డాం, రాజీకి రావా..? -
దీక్ష విరమించా.. ధర్నా కొనసాగిస్తా: సంగీత
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌రెడ్డి నుంచి తనకు న్యాయం చేయాలని ఆయన భార్య సంగీత చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడని, తనకు, తన పిల్లవాడికి న్యాయం చేయాలని కోరుతూ బోడుప్పల్‌లోని అతని ఇంటి ముందు ఆమె 52 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న సంగతి విదితమే. మహిళా సంఘాలు, సామాజికవేత్త దేవి సూచనల మేరకు ఆమె దీక్షను విరమించింది. నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. అయితే ధర్నాను మాత్రం కొనసాగిస్తానని సంగీత స్పష్టం చేసింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ఆమెకు న్యాయం చేయాలని దేవి విజ్ఞప్తి చేశారు. కాగా, తన భర్త, అత్తమామలతో మాట్లాడి న్యాయం చేయాలని సంగీత వేడుకుంటున్నది. -
12 రోజులుగా సంగీత పోరాటం
సాక్షి, హైదరాబాద్: తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బోడుప్పల్లో టీఆర్ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆయన రెండో భార్య సంగీత చేస్తున్న పోరాటం 12 వ రోజుకు చేరింది. తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గత 12 రోజులుగా దీక్ష సాగిస్తున్న సంగీతకు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. సుమారు 200 మంది విద్యార్థులు బోడుప్పలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సంగీత ఇంటి వద్దకూ ర్యాలీ చేరుకుని ఆమెకు బాసటగా ఉంటామని ప్రకటించారు. -
సంగీత దీక్ష: ఎంపీ మల్లారెడ్డి కీలక ప్రకటన
-
సంగీత దీక్ష: ఎంపీ మల్లారెడ్డి కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ బహిష్కృత నేత శ్రీనివాస్‌రెడ్డి, ఆయన రెండో భార్య సంగీత మధ్య గొడవ చర్లపల్లి సెంట్రల్ జైలుకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కలిసి.. చర్చలు జరిపారు. సంగీత డిమాండ్లకు శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారని ఆయన తెలిపారు. సంగీతతో మాట్లాడి.. ఆమె దీక్షను విరమింపచేస్తానని ఆయన తెలిపారు. దీంతో ఈ వివాదానికి తెరపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి మూడో పెళ్లి చేసుకోవడంతో.. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ అతని ఇంటి ముందు గత ఆరు రోజులుగా రెండో భార్య సంగీత నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. చర్లపల్లి జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని వారు కలిసి రాజీ కుదుర్చడానికి ప్రయత్నించారు. సంగీతకు ఎంతో కొంత డబ్బు చెల్లించి వదిలించుకోవాలని శ్రీనివాస్‌రెడ్డికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతల రాకతో జైలు ప్రాంతం సందడిగా మారింది. కాగా ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజీ కుదిర్చేందుకు వచ్చిన సామాజికవేత్తల, రాజకీయ నాయకుల ప్రయత్నాలను కొంతమంది మహిళా కార్యకర్తలు ముందుకు సాగనివ్వడంలేదు. సంగీత కోరుతున్న షరతులకు మామ బాల్‌రెడ్డిని ఒప్పించి దీక్ష విరవింపజేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
జ్వరంతోనూ భర్త కోసం న్యాయపోరాటం
-
సంగీతకు 14 రోజుల రిమాండ్
-
సంగీతకు 14 రోజుల రిమాండ్
పాకాల (చిత్తూరు జిల్లా): ఎర్రచందనం అక్రమ కేసులో అరెస్టైన ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీ(26) ని చిత్తూరు పోలీసులు బుధవారం ఉదయం పాకాల జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. చిత్తూరు నుంచి బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆమెను ప్రత్యేక వాహనంలో పట్టిష్ట బందోబస్తు నడుమ పాకాల కు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను పాకాల జూనియర్ సివిల్ జడ్జి దేవేంద్రరెడ్డి ముందు హాజరుపరిచారు. ఆమెకు 14 రోజులు రిమాండ్ విధిచారు. అక్కడి నుంచి ఆమెను పోలీసులు చిత్తూరు జైలుకు తరలించారు. సంగీతను పాకాలకు తరలిస్తున్నరని తెలిసి పాకాల సీఐ రామలింగమయ్య ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎర్రచందనం కేసులో సంగీత, భర్త లక్ష్మన్ తో పాటు ముద్దాయిగా ఉంది. కల్లూరు పోలీస్ స్టేషన్ లో, చిత్తూరు జిల్లా లోని మరికొన్ని పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఈమెపై నమోదై ఉన్నాయి. ఉగాది పండుగ సందర్భంగా కోర్టు సెలవు కావడంతో జడ్జి ఇంటి వద్ద ఆమెను హాజరు పరిచారు. -
టీఆర్ఎస్ పార్టీలో చేరాలనుకుంటున్నా : హీరోయిన్
‘‘తమిళ, మలయాళ సినిమాలు, సీరియల్స్‌లో ఎక్కువ నటించడం వలన చెన్నైలో స్థిరపడ్డా. అందువల్ల, తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యా. నటిగా మంచి గుర్తింపునిచ్చిన మాతృభాషకు ఎందుకు దూరమవ్వాలనే ఆలోచన రావడంతో హైదరాబాద్ వచ్చేశా. జోవియల్‌గా ఉండే అమ్మ పాత్రలతో పాటు నా వయసుకు తగ్గ అన్ని తరహా పాత్రల్లో నటించాలనుంది’’ అని నటి సంగీత అన్నారు. ‘ముత్యాల ముగ్గు’ సంగీతగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారామె. తెలుగులో రీ-ఎంట్రీతో పాటు రాజకీయాల్లోనూ ప్రవేశించాలనుకుంటున్నారు. సంగీత మాట్లాడుతూ - ‘‘మా సొంతూరు వరంగల్. బాపు, విశ్వేశ్వర్రావుగార్ల అశీర్వాదంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. తెలుగులో హీరోయిన్గా వంద సినిమాలకు పైగా నటించా. నా తొలి తెలుగు సినిమా ‘తీర్పు’. కానీ, ‘ముత్యాల ముగ్గు’ ముందు విడుదలైంది. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సౌత్‌లో 600లకు పైగా సినిమాల్లో నటించా. భవిష్యత్తులో నిర్మాతగా మారే అవకాశాలున్నాయి. దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. గతంలో రాజకీయాల్లోకి రమ్మని చాలామంది ఆహ్వానించారు. అయితే, నేను ఆసక్తి చూపలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరాలనుకుంటున్నా’’ అన్నారు. -
నా భర్తను కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారు
-
చదువుకోవాలని ఉంది సారూ..
గొర్రెలకు కాపలాగా వెళుతున్న బాలికల ఆవేదన మెదక్ రూరల్: తమకు ఇతర పిల్లల మాదిరిగా చదువుకోవాలని ఉందని గొర్రెలకు కాపలాగా వెళుతున్న మెదక్ మండలం రాజ్‌పల్లి పంచాయతీ పరిధిలోని తిమ్మక్కపల్లి గిరిజన తండాకు చెందిన ఇరువురు గిరిజన బాలికలు అనిత, సంగీత వాపోతున్నారు. తమను పెద్దలు గతకొన్నిరోజులుగా చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శనివారం రాజ్‌పల్లి పంటపొలాల్లో జీవాలను మేపుతున్న ఆ బాలికలు సాక్షి ప్రతినిధి కంటపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఇతర పిల్లల మాదిరిగా చదువుకోవాలనే ఉందన్నారు. తండాకు చెందిన లంబాడి హమ్యా లక్ష్మి దంపతులకు సంగీత ఒక్కతే కుమార్తె. ఆమె ప్రస్తుతం రాజ్‌పల్లి ఉన్నతపాఠశాలలో 7వ తరగతి చదువుతోంది.సంగీత తండ్రి హమ్య ఇటీవల పాముకాటుతో మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబం గడవటం కష్టంగా మారిందని, చేసేదిలేక తల్లి లక్ష్మి తన కూతురు చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపిస్తోంది. అయితే చదువంటే తనకు ప్రాణమని, ఆర్థిక ఇబ్బందువల్ల తన తల్లి చదువు మాన్పించిందన్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకుంటే చదువుకుంటానని చెబుతోంది. అలాగే ఇదేతండాకు చెందిన మంగ్యా, బీబ్లీ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆఖరు సంతానం అనిత ప్రస్తుతం మెదక్‌లోని బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉన్నట్టుండి తనను చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపుతున్నారని అనిత పేర్కొంది. తమకు బాగా చదువుకోవాలని ఉందని వారు వాపోయారు. ఈ విషయమై అధికారులు స్పందించి సంగీత, అనిత తల్లి దండ్రులకు అవగాహన కల్పించి వారిని మళ్లీ బడికి పంపేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నేను రోజూ దేవుడ్ని వేడుకునేది ఈ ఒక్కటే!
పదో తరగతి పూర్తవ్వగానే నన్ను ఓ అయ్య చేతిలో పెట్టేశారు అమ్మానాన్నలు. అప్పుడే పెళ్లి వద్దు అని అంటే... నీ భారం తీరిపోతే తమ్ముణ్ని బాగా చదివించవచ్చు అని నా ముఖమ్మీదే అన్నారు నాన్న. పైకి ఏమీ అనకపోయినా, ఆ మాట నన్ను ఎంత బాధపెట్టిందో నాకే తెలుసు. దాంతో నిస్సహాయంగా తలవంచి, అత్తారింటికి వెళ్లిపోయాను. నా భర్తకు, ఆ ఇంట్లోవాళ్లకి నచ్చినట్టుగా ఉండసాగాను. ఓ రోజు మావారు, తన ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పి నన్ను బయటకు తీసుకెళ్లారు. కానీ వెళ్లాక తెలిసింది, అలాంటిదేమీ లేదని. నన్నో పార్కుకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. నా మనసులో ఏముందో చెప్పమని అడిగారు. నాకేమీ అర్థం కాలేదు. ‘ఏమీ లేదే’ అన్నాను. కానీ ఆయన వదిలిపెట్టలేదు. ‘పెళ్లయిన తర్వాత ఏ రోజూ నీ ముఖంలో సంతోషం చూడలేదు, ఎవ్వరికీ ఏ లోటూ లేకుండా చూస్తావ్, కానీ నీకేం కావాలో ఎప్పుడూ చెప్పవ్, నీకేం కావాలి, నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి’ అని అడిగారు. ఆయనకు నా మనసులో ఉన్నదంతా చెప్పాను. చదువుకోవాలన్న బలమైన కోరికను ఎలా చంపుకోవాల్సి వచ్చిందో వివరించాను. ఆయన ఇంటికి తీసుకుపోయారు. ఇంటికొచ్చాక అత్తయ్యని, మావయ్యని ఒప్పించి, వారం తిరిగేసరికల్లా నన్ను కాలేజీలో చేర్పించారు. బడికెళ్లినప్పుడు అమ్మ ఎలా లంచ్‌బాక్సు పెట్టేదో, అత్తయ్య అలా పెట్టేవారు. ఈయనకి ఆఫీసులో లేటైతే, సాయంత్రం మావయ్యగారు వచ్చి ఇంటికి తీసుకెళ్లేవారు. నా పీజీ అయ్యేవరకూ కూడా అందరూ నాకు సాయపడ్డారు. ప్రోత్సహించారు. తర్వాత నేను ఓ కాలేజీలో లెక్చరర్‌గా చేరాను. ఇప్పటికీ అదే వృత్తిలో ఉన్నాను. నా సంతోషం కోసం, నాకంటూ ఓ ఐడెంటిటీని ఇవ్వడం కోసం అదంతా చేశారు మావారు, అత్తమామలు. ఎన్ని జన్మలెత్తినా ఆయనే నా భర్తగా రావాలి. వాళ్లే నాకు అత్తమామలు కావాలని నేను రోజూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. - సంగీత, నిజామాబాద్ -
హత్యాచారం ఓ కట్టుకథ
చెన్నై, సాక్షి ప్రతినిధి: పాఠశాలపై పెత్తనాన్ని ఆశించి భంగపడ్డ అధికారపక్ష నేత స్వార్థ అమాయక ప్రజలను అశాంతికి గురిచేసింది. విద్యార్థుల లేత మనసులను అల్లకల్లోలం చేసింది. పాఠశాలకు తాళం పడేలా చేసింది. చెన్నై పల్లవరంలో పునిద అన్నై తెరసా బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై వారం రోజుల క్రితం పాఠశాల తరగతి గదిలోనే లైంగికదాడి చేసి హత్య చేసినట్లుగా వచ్చిన వదంతులు సోమవారం ఉద్రిక్తతకు దారితీశాయి. వేలాది మంది పాఠశాలను చుట్టుముట్టి ఆందోళన చేపట్టగా జిల్లా కలెక్టర్ భాస్కరన్ పాఠశాలకు సెలవు ప్రకటించి విచారణకు ఆదేశించారు. పదోతరగతి చదువుతున్న సంగీత అనే విద్యార్థినిపై పాఠశాలలో నిర్మాణపు పనులు చేస్తున్న బేల్దారీ కార్మికులు కొందరు ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చారుు. అయితే ఈ పాఠశాలలో సంగీత అనే పేరుతో 14 మంది చదువుతున్నారు. అందరూ పాఠశాలకు హాజరవుతున్నారు. గత ఏడాది పదోతరగతి పూర్తి చేసిన సంగీత ప్రస్తుతం వేరే కాలేజీలో చదువుతోంది. ఆ యువతి కూడా క్షేమంగా ఉన్నట్లు విచారణలో తేలింది. పాఠశాల అనుబంధ హాస్టల్లో వందమంది విద్యార్థినులు ఉండగా, 96 మంది పాఠశాలలోనూ, నలుగురు సెలవుపైన వెళ్లినట్లు గుర్తించారు. ఒక విద్యార్థినిపై ఇంతటి ఆఘాయిత్యం జరిగినపుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంది. అలాంటిదేమీ అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఏ కోణంలో చూసినా పాఠశాలలో హత్యాచారం జరిగినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదు. సోమవారం నాటి ఆందోళన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణను కొనసాగిస్తుండగా, పోలీసులు మాత్రం వదంతులు రేపిన వ్యక్తిని గుర్తించినట్లు చెబుతున్నారు. పల్లవరం ప్రాంతానికి చెందిన అధికార పక్ష నేత ఒకరు సదరు పాఠశాలలో అడ్మిషన్లకు కొందరికి సిఫార్సు చేశాడని, అయితే ఇందుకు పాఠశాల వారు నిరాకరించారని చెబుతున్నారు. ఇందుకు కక్ష కట్టిన సదరు నేత పాఠశాలను అప్రతిష్టపాలు చేసేందుకు ఈ హత్యాచారం వదంతిని సృష్టించాడని చెబుతున్నారు. అధికార పక్షానికి చెందిన నాయకుడు కావడంతో పోలీసులు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్ష్యం చెప్పేందుకు సైతం ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితులు కనపడటం లేదు. పోలీస్ విచారణలో వాస్తవాలు వెలుగు చూసినా అందుకు తగిన ఆధారాలు చూపలేక పోతున్నారు. ఒక వైపు పోలీస్, మరోవైపు విద్యాశాఖ డెరైక్టర్ విచారణ కొనసాగుతుండగా పరిస్థితి సద్దుమణిగే వరకు పాఠశాలకు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఆగ్రహం: ఒక పాఠశాలలో రేగిన వివాదాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూమున్ననిలకు ముడిపెట్టడం సరికాదని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సెంబాకం వేద సుబ్రహ్మణ్యం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు రాజకీయ నాయకులు తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తుండగా ఏమీ లేదని పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడం ఏమిటని ఆయన మండిపడ్డారు. పాఠశాల నిర్వహణపై వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేసి విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొన్న భయాన్ని పారదోలాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ పల్లవరంలో కంటోన్మెంటు భూములను కొందరు అక్రమించి అనుమతుల్లేకుండా విద్యాసంస్థలను నెలకొల్పారంటూ అదే ప్రాంతానికి చెందిన డాక్టర్ రాణా సయ్యద్ యూసుఫ్ మంగళవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెంట్‌థామస్ మౌంట్, పల్లవరం కంటోన్మెంటు పోర్టు 1774 ఏర్పాటు కాగా, ప్రస్తుతం ఈ ప్రాంతంలో అధికశాతం ఆక్రమణలకు లోనైందన్నారు. ఇటీవల మరో 20 ఎకరాలు అన్యాక్రాంతం కాగా అక్కడి సైనికాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆక్రమణ ప్రదేశాల్లో అక్రమంగా అనేక ప్రైవేటు పాఠశాలలు వెలిసి శాంతి, భద్రతల సమస్యలను సృష్టిస్తున్నాయని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్కే కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ ఈ పిటిషన్‌లోని అంశాలను విన్నారు. రెండు వారాల్లోగా పిటిషన్‌దారుని ఆరోపణలపై బదులివ్వాలని 11 మంది అధికారులను ఆదేశించారు. -
శృంగార చిత్రానికి పచ్చజెండా!
గ్లామరస్ పాత్రలు చేయడంలో రవీనా టాండన్‌కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఒకసారి కమిట్ అయితే తన మాట తనే వినననే తరహాలో గ్లామర్‌లో ఏ తరహా అయినా చేయడానికి రెడీగా ఉంటారామె. తాజాగా ఆమె ఓ శృంగార చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఆ సినిమా పేరు ‘షాబ్’. ఆ చిత్రదర్శక, నిర్మాత ఒనిర్ తొలుత ఈ పాత్రకు సంగీతా బిజిలానీని తీసుకోవాలనుకున్నారు. ఈ చిత్రకథ మొత్తం ఆమెకు చెప్పారట. కథపట్ల సంగీతాకి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, ఈ చిత్రంలో ఉన్న ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడలేదట. అందుకని కాదన్నారని సమాచారం. ఆ తర్వాత రవీనా టాండన్‌ని సంప్రదించారట ఒనిర్. శృంగార సన్నివేశాల్లో నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని, ఆ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదని చెప్పి, రవీనా ఈ చిత్రానికి పచ్చజెండా ఊపారట. శృంగార ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఫార్టీ ఫ్లస్‌లో ఉన్న రవీనా ఏ స్థాయిలో విజృంభిస్తారో చూడాలి.