
భారత స్టార్ రెజర్లు భజరంగ్ పునియా సంగీత ఫొగట్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నవంబరు 26, గురువారం వీరి వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఈ మేరకు సంగీత, పునియా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. జీవితం పరిపూర్ణం. ఈ జీవితానికి తోడునువ్వు. ఈ కొత్త అధ్యాయం ప్రేమ, సంతోషంతో నిండాలి అంటూ ఆమె ట్వీట్ చేశారు.
మరోవైపు వివాహంలో కూడా అద్భుతమైన వేడుక ఉందంటూ భజరంగ్ పునియా తన ఉద్వేగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ రోజు నా జీవిత భాగస్వామిని నా ఇంటికి తీసుకు వచ్చాను. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను. సంతోషంగా ఉంది ..అలాగే కొంచెం ఆందోళనగా ఉంది. ఈ పరీక్షలో నెగ్గాలి ఫ్రెండ్స్. అత్యంత ప్రేమను. ఆశీర్వాదాలు అందించిన అందరినీ ధన్యవాదాలు అంటూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఈ నూతన దంపతులకు అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లికి ముందు నిర్వహించే వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో క్రీడాభిమానులకు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హల్దీ వేడుకల్లో పసుపు రంగు దుస్తుల్లో సంగీత మెరిసి పోయిన సంగతి తెలిసిందే
You Complete Me ❤️ Soulmate for life. A New chapter of Life Would be Full Of love and Happiness. #SangRang @BajrangPunia ❤️ pic.twitter.com/dFIgSPNh6Q
— Sangeeta Phogat (@sangeeta_phogat) November 26, 2020
Wishis you a Beautiful Happy Marriage 💞 Anniversary to Bajrang Punia 💞 Sangeeta Phogat the Best Wishes You ❣️🌹❣️ Lovely ♥️ Styles Anniversary to God Bless you Bajrang Punia Bhaiya ji 🙏 ka jawab Nahi ✔️💃🕺✌️👏👏 Sangeetha Bhabhi ji 🙏💐🙏 Also. pic.twitter.com/RhASqCxP1T
— Raviprakashsingh (@Ravipra70338031) November 26, 2020
Comments
Please login to add a commentAdd a comment