Bajrang Punia
-
స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు..
భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియాకు భారీ షాక్ తగిలింది. డోపింగ్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించినందుకు పునియాను నాలుగేళ్లపాటు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెండ్ చేసింది. నాడా యాంటీ డోపింగ్ నిబంధనలలోని ఆర్టికల్ 10.3.1ని ఉల్లంఘించిన కారణంగా పూనియాపై వేటు పడింది.అసలేం జరిగిందంటే?ఈ ఏడాది మార్చి 10న జాతీయ జట్టుకు ఎంపిక కోసం జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్ పునియా తన యూరిన్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఇదే నేరానికి సంబంధించి నాడా ఈ ఏడాది ఏప్రిల్ 23న బజరంగ్ పునియాను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ (UWW) కూడా బజరంగ్‌పై నిషేధం విధించింది.ఈ క్రమంలో బజరంగ్ ఎందుకు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వమని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ.. నాడాకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాడా ఏప్రిల్ 26లోపు తన వివరణ ఇవ్వాలని పూనియాకు నోటీసు జారీ చేసింది.అందుకు పూనియా స్పందించలేదు. అయితే నాడా మే 7లోపు వివరణ ఇవ్వాలని మళ్లీనోటీసు జారీ చేసింది. ఆ నోటీసులకు కూడా పూనియా సమాధానమివ్వలేదు. దీంతో ఈ ఏడాది మేలో నాడా అతడిపై తాత్కాలిక నిషేదం విధించింది.అయితే నాడా నోటిసులకు స్పందించని బజరంగ్ పూనియా.. నాడా యాంటీ డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్ (ADDP)కు మాత్రం తన వివరణ ఇచ్చాడు. పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్లను వాడడంతోనే నమూనాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. దీంతో మే 31న బజరంగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది. కాగా ఈ ఏడాది జూన్ 23న మరోసారి నాడా బజరంగ్ పునియాకు నోటీసులు ఇచ్చింది. జూలై 11 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో నాడా పేర్కొంది. ఈసారి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలకు బజ్రంగ్ జులై 11న వ్రాతపూర్వకంగా సమాధనమిచ్చాడు. ఆ తర్వాత సెప్టెంబరు 20, అక్టోబరు 4న భజరంగ్ వివాదంపై ఏడీడీపీ ప్యానల్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో అతడు డోపింగ్ నిబంధలు ఉల్లంఘించినట్లు ఏడీడీపీ గుర్తించింది. ఈ క్రమంలోనే అతడిపై నాడా నాలుగేళ్ల పాటు నిషేదం విధించింది. -
ఆమె నిజాయితీని అమ్ముకుంది: మండిపడ్డ బబిత
ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్‌పై మాజీ రెజ్లర్, బీజేపీ నేత బబితా ఫొగట్ మండిపడ్డారు. తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం.. సాక్షి తన నిజాయితీని కూడా పూర్తిగా అమ్మేసుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా 2016లో రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్.. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించారు.హర్యానాకు చెందిన సాక్షి ఇటీవలే తన ఆత్మకథ ‘విట్నెస్’ను మార్కెట్లో విడుదల చేశారు. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు భారత స్టార్ రెజ్లర్ల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పలువురు రెజ్లర్లు ఢిల్లీ వేదికగా ఉద్యమం నడిపిన విషయం తెలిసిందే.వినేశ్తో సాక్షి మాలిక్స్వార్థంగా ఆలోచించారుఇందులో సాక్షి మాలిక్‌తో పాటు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తమ గళాన్ని గట్టిగా వినిపించారు. బబితా ఫొగట్ సైతం రెజ్లర్ల నిరసనకు తన మద్దతు ప్రకటించారు. అయితే, ఈ ఉద్యమ సమయంలో ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కావాలని వినేశ్ ఫొగట్, బజరంగ్ కోరడం వల్ల తమకు చెడ్డపేరు వచ్చిందని సాక్షి తన పుస్తకంలో పేర్కొన్నారు.బబిత నటనకు కారణం అదేఎవరో ఉద్దేశపూర్వకంగానే వినేశ్, బజరంగ్లను రెచ్చగొట్టి ఇలా అత్యాశకు పోయేలా.. స్వార్థం నింపి ఉంటారని సాక్షి అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. బబిత ఫొగట్ తమ ఉద్యమానికి మద్దతు తెలపడంలో కూడా స్వార్థమే ఉందని ఆరోపించారు.తాము బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడితే.. బబిత మాత్రం రిజ్భూషణ్ స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే.. తమ శ్రేయోభిలాషి తరహాలో బబిత ప్రవర్తించిందని సాక్షి మాలిక్ విమర్శించారు.నీ బాధ నాకు అర్థమవుతుందిలేఈ నేపథ్యంలో సాక్షి ఆరోపణలపై బబితా ఫొగట్ ఘాటుగా స్పందించారు. ‘‘నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. దాని ద్వారానే నువ్వు ప్రకాశించాలి. అంతేగానీ.. ఇతరులను నిందించడం ద్వారా ఇంకెన్నాళ్లు నువ్వు ప్రకాశించగలవు? కొందరికి అసెంబ్లీ సీట్లు వచ్చాయి.కొందరేమో పదవులు పొందారు. కానీ.. నువ్వు మాత్రం ఏదీ పొందలేకపోయావు కదా! నీ బాధ నాకు అర్థమవుతుందిలే!.. ఆమె తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం తన నిజాయితీని కూడా అమ్ముకుంది’’ అని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు బబిత.వినేశ్ స్పందన ఇదేఅంతకు ముందు వినేశ్ ఫొగట్ సైతం సాక్షి మాలిక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘మాది స్వార్థమా? ఇలా ఎందుకు అన్నారో ఆమెనే అడగండి. తోటి అక్కాచెల్లెళ్ల కోసం పోరాడితే దానిని స్వార్థమే అంటారంటే.. అవును ఈ విషయంలో మేము స్వార్థపరులమే. దేశం కోసం ఒలింపిక్ పతకం తేవడం స్వార్థమే అయితే.. అంతకంటే గొప్ప స్వార్థం మరొకటి ఏది ఉంటుంది?నేను, సాక్షి, బజరంగ్ బతికి ఉన్నంతకాలం మా ఉద్యమం సజీవంగానే ఉంటుంది. ఈ ప్రయాణంలో కొన్ని అవాంతరాలు వస్తాయి. అయినా.. సరే మేము గట్టిగా పోరాడతాం’’ అని పేర్కొన్నారు. కాగా బబిత, వినేశ్ కజిన్స్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. బజరంగ్.. బబిత సొంత చెల్లెలు సంగీత భర్త.రాజకీయాల్లో ఫొగట్ కుటుంబంఇదిలా ఉంటే.. బబిత బీజేపీలో చేరగా.. వినేశ్ ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి జులానా ఎమ్మెల్యే అయ్యారు. బజరంగ్ కూడా కాంగ్రెస్ పార్టీ మెంబర్.అయితే, సాక్షి వ్యాఖ్యలపై ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇచ్చిన కౌంటర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.చదవండి: ‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు’ -
‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది!
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో సీనియర్ రెజ్లర్లు పోరాడారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వీరంతా సమష్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మలిక్ నిరాటంకంగా పాల్గొని పోరాటాన్ని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు సాక్షి మలిక్ నాటి ఘటనపై పలు భిన్నమైన విషయాలు చెప్పింది. తన పుస్తకం ‘విట్నెస్’లో సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్‌లపై ఆమె విమర్శలు కూడా చేసింది. ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సడలింపు వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అభిప్రాయ పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం తర్వాత బాధ్యతలు తీసుకున్న తాత్కాలిక కమిటీ హాంగ్జౌ ఆసియా క్రీడల సెలక్షన్స్‌లో పాల్గొనకుండా నేరుగా పాల్గొనే అవకాశం వినేశ్, బజరంగ్‌లకు కల్పించింది. సాక్షి మాత్రం దీనికి అంగీకరించలేదు. ‘వినేశ్, బజరంగ్ సన్నిహితులు కొందరు వారిలో స్వార్థం నింపారు. వారిద్దరు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించేలా చేయగలిగారు. వినేశ్, బజరంగ్‌లకు సడలింపు ఇవ్వడం మేలు చేయలేదు. మా నిరసనకు అప్పటి వరకు వచి్చన మంచి పేరును ఇది దెబ్బ తీసింది. ఒకదశలో సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అంతా అనుకునే పరిస్థితి వచి్చంది’ అని సాక్షి వెల్లడించింది. మరోవైపు బబిత ఫొగాట్ తమ నిరసనకు మద్దతు పలకడంలో కూడా స్వార్థమే ఉందని ఆమె పేర్కొంది. ‘మేమందరం బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడుతూ వచ్చాం. బబిత ఫొగాట్ మరోలా ఆలోచించింది. బ్రిజ్‌భూషణ్‌ను తొలగించడమే కాదు. అతని స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుంది. అందుకే మా శ్రేయోభిలాషి తరహాలో ఆమె ప్రవర్తించింది’ అని సాక్షి వ్యాఖ్యానించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్య పతకం గెలుచుకుంది. . -
వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే?
భారత స్టార్ రెజ్లర్‌గా పేరొందిన వినేశ్ ఫొగట్ ఆస్తుల విలువ వెల్లడైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసిన సందర్భంగా తన దగ్గర ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను ఆమె వెల్లడించింది. కాగా ఒలింపిక్ పతకం గెలవాలన్న వినేశ్ ఫొగట్ కల ప్యారిస్‌లో చెదిరిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగష్టులో జరిగిన విశ్వక్రీడల్లో మహిళల యాభై కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరిన ఆమె.. స్వర్ణ పతక పోరులో తలపడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.నిరాశతో వెనుదిరిగినిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా వినేశ్ పోటీలో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించిన వినేశ్‌కు అక్కడా నిరాశే మిగిలింది. నిబంధనల ప్రకారం ఒక్క గ్రాము అదనపు బరువు ఉన్నా పోటీకి అనుమతించరని కోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా.. ఫైనల్ వరకు తన ప్రయాణం నిబంధనల ప్రకారమే సాగింది కాబట్టి కనీసం సంయుక్త రజతం ఇవ్వాలన్నా అభ్యర్థనను తిరస్కరించింది.కుస్తీకి స్వస్తిఈ పరిణామాల నేపథ్యంలో కలత చెందిన వినేశ్ ఫొగట్ కుస్తీకి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. అయితే, అభిమానుల కోరిక మేరకు మళ్లీ రెజ్లర్‌గా తిరిగి వస్తానని సంకేతాలు ఇచ్చినా.. రాజకీయరంగ ప్రవేశం చేయడం ద్వారా తానిక ఆటకు పూర్తిగా దూరమైనట్లు వినేశ్ చెప్పకనే చెప్పింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఇటీవలే హస్తం పార్టీ కండువా కప్పుకొంది.రాజకీయ నాయకురాలిగా మారిన వినేశ్అంతేకాదు.. జింద్‌లోని జులనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తి వివరాలను పేర్కొంది. ఆ వివరాల ప్రకారం... ‘వినేశ్ ఫొగట్ పేరిట మూడు కార్లు ఉన్నాయి. వోల్వో ఎక్స్‌సీ 60(ధర దాదాపు రూ. 35 లక్షలు), హుందాయ్ క్రెటా (రూ. 12 లక్షలు), టయోటా ఇన్నోవా(రూ. 17 లక్షలు) వినేశ్ వద్ద ఉన్నాయి.ఆస్తి ఎన్ని కోట్లంటే?వీటిలో టయోటా కొనుగోలు చేసేందుకు రూ. 13 లక్షలు లోన్ తీసుకున్న వినేశ్.. ప్రస్తుతం దశల వారీగా చెల్లిస్తోంది. ఇక తన స్థిరాస్తుల విలువ రూ. 2 కోట్ల మేర(సోనిపట్‌లోని ప్లాట్ విలువ) ఉంటుందని ఆమె పేర్కొంది. 2023-24 ఏడాదికి గానూ తాను రూ. 13,85,000 ఆదాయం పొందినట్లు వినేశ్ తెలిపింది. తన చేతిలో ప్రస్తుతం రూ. 1.95 వేల నగదు ఉన్నట్లు వెల్లడించింది’. కాగా రెజ్లర్‌గా ఎదిగిన క్రమంలోనే 30 ఏళ్ల వినేశ్ ఈ మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.నా కల సంగీత నెరవేరుస్తుందివినేశ్ ఫొగట్ ఇప్పుడే రాజకీయాల్లో చేరడం తనకు ఇష్టం లేదన్న ఆమె పెదనాన్న, కోచ్ మహవీర్ ఫొగట్.. తన కుమార్తె సంగీతను లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు సిద్ధం చేస్తానని అన్నారు. ‘‘వినేశ్ వచ్చే విశ్వ క్రీడల్లో పాల్గొంటుందని భావించాను. కానీ తను రాజకీయాల్లో చేరింది. అందుకే సంగీత ఫొగట్‌ను 2028 ఒలింపిక్స్‌కు సిద్ధం చేయాలని నిశ్చయించుకున్నా.దేశానికి తనే పతకం తీసుకువస్తుంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న కారణంగా సంగీత ఈ ఏడాది జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోయింది. ఈసారి మాత్రం అలా జరగదు’’ అని మహవీర్ ఫొగట్ పేర్కొన్నారు. కాగా నాటి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో జరిగిన ఉద్యమంలో వినేశ్, సంగీత, సంగీత భర్త బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిఇదిలా ఉంటే.. వినేశ్తో కలిసి సంగీత ఫొగట్ భర్త బజరంగ్ కూడా కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. వీరిద్దరు స్పోర్ట్స్ కోటాలో తాము పొందిన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. కాగా వినేశ్ ఫొగట్ భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా రెజ్లరే. అతడు రైల్వేలో పనిచేస్తున్నాడు.చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు -
రెజ్లర్ల నిరసన వెనక కాంగ్రెస్ కుట్ర: బ్రిజ్ భూషణ్
ఢిల్లీ: రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాలు కాంగ్రెస్‌తో కలిసి తనకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర బయటపడిందని రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ అన్నారు. శుక్రవారం వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం బ్రిజ్ భూషణ్ మీడియాతో మాట్లాడారు.‘‘ రెజ్లర్లు నాకు వ్యతిరేకంగా 2023 జనవరి 18న ఆందోళన ప్రారంభించారు. ఆ రోజే నేను అసలు విషయం చెప్పాను. ఈ నిరసన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. హార్యానా మాజీ సీఎం భూపేందర్ హుడా, ఆయన కుమారుడు దీపేందర్ హుడా, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారని చెప్పా. నేను చెప్పింది నేడు నిజమైంది. రెజ్లర్లు నిరసన వల్ల హర్యానా మహిళలు అవమానం ఎదుర్కొన్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు, నిరసన తెలిపిన రెజ్లర్లు బాధ్యత వహించాలి. కాంగ్రెస్ నేతలు మహిళా రెజ్లర్ల గౌరవాన్ని దెబ్బతీశారు. కాంగ్రెస్ స్క్రిప్ట్ ప్రకారమే నాపై రెజ్లర్ల నిరసన జరిగింది’’ అని అన్నారు.అదే విధంగా రెజ్లర్ వినేశ్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం చేజరటంపై స్పందిస్తూ.. ఆమె ఒకే రోజు రెండు వేర్వేరు విభాగాల్లో పాల్గొని నిబంధనలు ఉల్లంఘించారు. అందుకే తుది పోరులో ఆమె అనార్హతకు గురయ్యేలా దేవుడే శిక్ష విధించాడని అన్నారు. -
కాంగ్రెస్‌లోకి వినేశ్, బజరంగ్: సాక్షి మాలిక్ వ్యాఖ్యలు వైరల్
భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా రాజకీయ నాయకులుగా తమ ప్రయాణం మొదలుపెట్టనున్నారు. హర్యానాకు చెందిన వీరిరువురు శుక్రవారం హస్తం గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ స్పందించింది.వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా రాజకీయ రంగ ప్రవేశం చేయడం వారి వ్యక్తిగత నిర్ణయమని.. తాను మాత్రం మహిళా రెజ్లర్ల తరఫున పోరాడేందుకు అంకితమవుతానని స్పష్టం చేసింది. తనకూ వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని.. అయితే, బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ఉద్దేశం తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది.ఢిల్లీలో నిద్రాహారాలు మాని నిరసనకాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి హోదాలో నాటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సాక్షి మాలిక్‌తో పాటు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తదితరులు బాధితులకు మద్దతుగా ఢిల్లీలో నిరసనకు దిగారు. నెలలపాటు పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్‌భూషణ్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం చేశారు.అయితే, ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వం వీరి ఉద్యమంపై స్పందించలేదు. దీంతో పతకాలు, ప్రభుత్వ పురస్కారాలు వెనక్కి ఇచ్చేందుకు రెజ్లర్లు సిద్ధపడిన తరుణంలో ఎట్టకేలకు రెజ్లింగ్ సమాఖ్యకకు ఎన్నికలు నిర్వహించారు. బ్రిజ్‌భూషణ్ పదవి నుంచి దిగిపోయినప్పటికీ అతడి అనుచరుడు సంజయ్ గద్దెనెక్కాడు.ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. వినేశ్, బజరంగ్ సైతం సంజయ్ ఎన్నికపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే, వీరిద్దరు రెజ్లర్లుగా కొనసాగుతూనే ఉద్యమానికి అండగా ఉండగా.. సాక్షి మాత్రం బ్రిజ్‌భూషణ్ విషయంలో మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగేంతవరకు తన పోరాటం ఆగదని ప్రకటించింది.త్యాగాలకు సిద్ధపడాలిఈ నేపథ్యంలో వినేశ్, బజరంగ్ రాజకీయాల్లో చేరడంపై సాక్షి మాలిక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘అది వారి వ్యక్తిగత నిర్ణయం. నాకు తెలిసినంత వరకు ఒక లక్ష్యంతో పోరాడే వారు త్యాగాలకు సిద్ధపడాలి. నేను అదే చేస్తున్నా. మహిళా రెజ్లర్లకు మద్దతుగా మేము సాగించిన పోరాటంపై విమర్శలు వచ్చేలా, వక్రభాష్యాలు ఆపాదించేందుకు ఆస్కారమిచ్చేలా నేను ప్రవర్తించాలనుకోవడం లేదు.నిస్వార్థ పోరాటం ఆగదువారికి అండగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నా ఆలోచలన్నీ రెజ్లింగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నాకు కూడా రాజకీయ పార్టీల ఆహ్వానాలు అందాయి. కానీ నేను ఉద్యమ బాటనే ఎంచుకున్నాను. బాధితులకు న్యాయం జరగాలనే సదుద్దేశంతోనే, వారి ప్రయోజనాల కోసమే నేను ఈ పోరాటాన్ని మొదలుపెట్టాను.మహిళా రెజ్లర్లకు భారత రెజ్లింగ్ సమాఖ్యలోని చీడపురుగుల వికృత చేష్టల నుంచి విముక్తి లభించేదాకా నా పోరాటం ఆగదు. మా పోరాటం నిస్వార్థమైనది.. అది కొనసాగుతూనే ఉంటుంది’’ అని సాక్షి మాలిక్ తన మనసులోని అభిప్రాయాలను వెల్లడించింది.సాక్షి మాలిక్ సాధించిన ఘనతలు ఇవీకామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలుఆసియా చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలురియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం -
కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా
సాక్షి, ఢిల్లీ: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా హస్తం గూటికి చేరారు. పార్టీ సీనియర్ నేతల మధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. ‘మా పోరాటం ఇంకా ముగియలేదు. పోరాటం కొనసాగుతుంది. ఆ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఆ పోరాటంలో కూడా విజయం సాధిస్తాం. మేము తీసుకున్న నిర్ణయంతో దేశ సేవకు కట్టుబడి ఉన్నాం. మా అక్కాచెల్లెళ్లకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీ కోసం ఎవరూ లేకున్నా నేను ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనే హామీ ఇస్తున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | After joining the Congress party, Vinesh Phogat says, "The fight is continuing, it hasn't ended yet. It's in Court. We will win that fight as well... With the new platform that we are getting today, we will work for the service of the nation. The way we played our game… pic.twitter.com/WRKn5Aufv2— ANI (@ANI) September 6, 2024 భజరంగ్ పూనియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. వినేష్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన రోజు దేశంలో అందరూ సంతోషించారు. మరుసటి రోజు అందరూ బాధపడ్డారు. మేము కేవలం రాజకీయాలు చేయాలనుకోవడం లేదు. మహిళల కోసం గొంతు వినిపించేందుకు ముందుకు వస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | Delhi | On joining Congress, Bajrang Punia says, "...What BJP IT Cell is saying today that we just wanted to do politics...We had written to all women BJP MPs to stand with us but they still didn't come. We are paying to raise the voices of women but now we know that BJP… pic.twitter.com/FGViVeGJLY— ANI (@ANI) September 6, 2024 ఇక, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కూడా కలిశారు. దీంతో, హర్యానా రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాగా, వీరు హస్తం పార్టీలో చేరడంతో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. ఇందుకోసమే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఇప్పటి వరకు ప్రకటించలేదని సమాచారం. మరోవైపు.. ఈ పరిణామాల మధ్య వినేష్ ఫోగట్, పూనియా ఇద్దరూ రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. #WATCH | Delhi | Bajrang Punia and Vinesh Phogat join the Congress party in the presence of party general secretary KC Venugopal, party leader Pawan Khera, Haryana Congress chief Udai Bhan and AICC in-charge of Haryana, Deepak Babaria. pic.twitter.com/LLpAG09Bw5— ANI (@ANI) September 6, 2024 ఇదిలా ఉండగా.. అక్టోబర్ ఐదో తేదీన హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఆప్‌తో పొత్తు అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం ఇంకా రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తోంది. కానీ, ఆప్ మాత్రం 10 స్థానాలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో, గందరగోళ పరిస్థితి నెలకొంది. Vinesh Phogat and Bajrang Punia meet Congress national president Mallikarjun Kharge, in Delhi. Party's general secretary KC Venugopal also present.(Pics: Congress) pic.twitter.com/uLwZLa0ftk— ANI (@ANI) September 6, 2024 -
Haryana Assembly Elections 2024: ఎన్నికల బరిలో వినేశ్ ఫొగాట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ తరఫున హరియాణా శాసనసభ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి ఆమె పోటీచేసే అవకాశముందని కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. మరో ప్రముఖ మల్లయోధుడు భజరంగ్ పునియా సైతం బాద్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశముంది. ఈ ఇద్దరు రెజ్లర్లు బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాం«దీతో భేటీ అయ్యారు. దీంతో హస్తం పారీ్టలో వీరిద్దరి చేరిక ఖాయమైందని వార్తలొచ్చాయి. రాహుల్‌తో వినేశ్, పునియాలు దిగిన ఫోటోను కాంగ్రెస్ తన అధికారిక ఖాతా ’ఎక్స్’లో పోస్ట్ చేసిన అనంతరం వీరి పోటీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని గురు లేదా శుక్రవారం జరగబోయే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఖరారుచేస్తారని తెలుస్తోంది. వీరిద్దరి పోటీపై గురువారం నాటికి స్పష్టత వస్తుందని హరియాణా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపక్ బాబరియా మంగళవారం పేర్కొనడం తెల్సిందే. -
కాంగ్రెస్‌లోకి వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా.. హర్యానా ఎన్నికల్లో పోటీ!
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు హీటెక్కాయి. అభ్యర్థలు ఎంపిక, ప్రచారాలపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్‌తో సహా ప్రాంతీయ పార్టీలు వేగం పెంచాయి. అధికారమే అవధిగా వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.భారత స్టారల్ రెజర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అగ్రనేత, లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఇరువురు హస్తం కండువా కప్పుకున్నారు. వినేశ్, బజరంగ్ వచ్చే హర్యానా అసెంబ్లీ ఎన్నికట్లో పోటీ చేయనున్నారు. అయితే వినేశ్ ఫోగట్ జులనా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ జననాయక్ జనతా పార్టీకి చెందిన అమర్జీత్ ధండా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక పునియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు.కాగా గతేడాది భారత రెజ్లింగ్ సమాక్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల అనంతరం బ్రిజ్ భూషన్‌కు బీజేపీ కైసర్‌గంజ్ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో కుమారుడు కరణ్ సింగ్‌కు కేటాయించింది. కాగా 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
రూ. 15 పెట్టి పతకం కొనుక్కోవచ్చు కానీ..
భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ను ఉద్దేశించి ఆమె బంధువు, రెజ్లర్ బజరంగ్ పునియా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ఒలింపిక్ చేజారినా.. వినేశ్ పేరుప్రతిష్టలకు వచ్చిన నష్టమేమీ లేదని.. ఇప్పటికే అందరి హృదయాల్లో చాంపియన్‌గా ఆమె స్థానం దక్కించుకుందని పేర్కొన్నాడు. పతకాన్ని మాత్రమే కోరుకునే వారు పదిహేను రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు అంటూ వినేశ్‌ను విమర్శిస్తున్న వాళ్లకు చురకలు అంటించాడు.ఈ మేరకు.. ‘‘ఈ అంధకారంలో నీ పతకాన్ని ఎవరో మాయం చేశారు. అయినా సరే.. నువ్వొక వజ్రంలా మెరిసిపోతున్నావు. ఈరోజు ప్రపంచమంతా నిన్ను చూస్తూ ఉంది. వరల్డ్ చాంపియన్. వినేశ్ ఫొగట్.. నువ్వు మన దేశపు కోహినూర్వి.వినేశ్ ఫొగట్ అంటే వినేశ్ ఫొగట్ మాత్రమే. హిందుస్థాన్ రుస్తం-ఇ-హింద్ నువ్వు. ఎవరైతే పతకాలు కావాలని కోరుకుంటున్నారో వారు రూ. 15 చెల్లించి వాటిని కొనుక్కోవచ్చు’’ అని బజరంగ్ పునియా ఎక్స్ వేదికగా వినేశ్ ఫొగట్ మెడల్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే.విశ్వ క్రీడల్లో 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీపడ్డ ఈ హర్యానా సివంగి.. పతకం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మేరకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్) బుధవారం తమ తీర్పును వెలువరించింది. ఇక భారత ఒలింపిక్స్ చరిత్రలోనే ఇదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.కాగా మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, జపాన్‌కు చెందిన సుసాకీని ఓడించి చరిత్ర సృష్టించిన వినేశ్.. తదుపరి క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్పై విజయం సాధించింది. తద్వారా సెమీస్ చేరి.. యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను 5-0తో మట్టికరిపించింది. ఫలితంగా ఒలింపిక్స్ ఫైనల్ చేరిన భారత తొలి రెజ్లర్‌గా రికార్డు నమోదు చేసింది.అయితే, స్వర్ణ పతక పోరుకు ముందు అనూహ్య రీతిలో వినేశ్ ఫొగట్‌పై వేటు పడింది. నిర్ణీత 50 కిలోల కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య. ఈ నేపథ్యంలో తన అనర్హత, సెమీస్ వరకు చేరిన కారణంగా సంయుక్త రజత పతకం ఇవ్వాలని వినేశ్ సీఏఎస్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో వినేశ్ తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. అయితే పలుమార్లు తీర్పును వాయిదా వేసిన స్పోర్ట్స్ కోర్టు వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వినేశ్‌కు అభిమానులు అండగా నిలుస్తుండగా.. కొంతమంది మాత్రం బరువు పెరగటంలో తప్పంతా ఆమెదే అన్నట్లుగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో బజరంగ్ పునియా వినేశ్‌కు మద్దతుగా ట్వీట్ చేశాడు. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వినేశ్ ఫొగట్ వారి తరఫున ఢిల్లీలో ముందుండి పోరాటం చేయగా.. బజరంగ్ సహా సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు ఆమెకు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేశ్‌ను వ్యతిరేకించేవారు.. ఆటపై కాకుండా క్రీడేతర విషయాలపై దృష్టి పెట్టిందని.. అందుకే ఈ ఫలితమని ఆమెపై విద్వేష విషం చిమ్ముతున్నారు. -
Vinesh Phogat: తన రాతను తానే మార్చుకుని.. సివంగిలా దూకి!
Vinesh Phogat: ‘ఈ అమ్మాయిని పోలీసు దెబ్బలతో అణచివేశారు... ఈ అమ్మాయిని తన దేశంలోనే రోడ్లపై ఈడ్చుకెళ్లారు... కానీ ఇదే అమ్మాయి ఇప్పుడు ప్రపంచాన్ని గెలుస్తోంది... పోరాటంలో ఎక్కడా తగ్గని మా వినేశ్ సివంగిలాంటిది. ఆమె విజయాలు చూస్తుంటే ఆనందిస్తున్నామో, కన్నీళ్లు వస్తున్నాయో కూడా తెలియడం లేదు.ఆమె ఆడుతున్న తీరు చూస్తే వినేశ్ ఒక్కతే కాదు... దేశంలోని ప్రతీ మహిళ పోరాడుతున్నట్లుగా ఉంది’... భారత మాజీ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మంగళవారం వినేశ్ ఫొగాట్ గురించి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్య ఇది.నిజం... వినేశ్ సాధించిన ఘనత ఇప్పుడు ఒలింపిక్ పతకం మాత్రమే కాదు, అంతకుమించి దానికి విలువ ఉంది. ఆటలో కాకుండా మ్యాట్ బయట ఆమె ఎదుర్కొన్న అవమానం, బాధలు, కన్నీళ్లు ఈ పతకం వెనక ఉన్నాయి. ఏడాదిన్నర ముందు ఆమె ఈ పతకం గెలిచి ఉంటే ఒక ప్లేయర్‌గానే ఆమె గొప్పతనం కనిపించేది. కానీ ఇప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులను దాటి సాధించిన ఈ గెలుపు అసాధారణం.ఢిల్లీ వీధుల్లో ఆమె జీవితంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. పోలీసు దెబ్బలు, అరెస్ట్, బహిరంగంగా అవమానాలు, చంపేస్తామనే బెదిరింపులు, అవార్డులను వెనక్కి ఇచ్చే పరిస్థితులు రావడం, గెలిచిన పతకాలన్నీ గంగానదిలో పడేసేందుకు సిద్ధం కావడం... ఇలా ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా వినేశ్ వేదన అనుభవించింది. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే, సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోమని కోరడం వల్లే ఇదంతా జరిగింది.ఈ మొత్తం వ్యవహారంలో వినేశ్ తన కెరీర్‌ను పణంగా పెట్టింది. రిటైర్మెంట్కు చేరువైంది కాబట్టే ఇలా చేస్తోందంటూ వినిపించిన వ్యాఖ్యానాలను ఆ తర్వాత బలంగా తిప్పి కొట్టింది. మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయం నుంచి కోలుకొని మరీ పోరాడింది. ఆరు నెలలు ముగిసేలోపు తానేంటో నిరూపించుకుంటూ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు ఒలింపిక్స్ ఆడిన భారత రెజ్లర్‌గా బరిలోకి దిగి మూడో ప్రయత్నంలో తన అద్భుత కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని సాధించి సగర్వంగా నిలిచింది.ఈ గాయం బాధ చాలా పెద్దదికెరీర్లో ఎన్నోసార్లు గాయాలతో సహవాసం చేసి కోలుకోగానే మళ్లీ మ్యాట్‌పై సంచలనాలు సృష్టించిన వినేశ్‌పై ఢిల్లీ ఉదంతం తీవ్ర ప్రభావం చూపించింది. శరీరానికి తగిలిన గాయాలకంటే మనసుకు తగిలిన ఈ గాయం బాధ చాలా పెద్దది అంటూ కన్నీళ్ల పర్యంతమైంది. బ్రిజ్‌భూషణ్ శరణ్‌పై పోరాటం తర్వాత మళ్లీ ఆటలోకి అడుగు పెట్టే క్రమంలో కూడా అడ్డంకులు ఎదురయ్యాయి.సెలక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాకుండా సీనియార్టీ ద్వారా అడ్డదారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ మళ్లీ విమర్శలు. ఈ మనో వేదన వెంటాడినా వినేశ్ బేలగా మారిపోలేదు. మళ్లీ పట్టుదలతో నిలబడింది. కెరీర్ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడిన ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీలకు మారాల్సి వచ్చింది. రెజ్లింగ్‌లో ఇలా కేటగిరీ మారడం... అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంత సులువు కాదు. కానీ ఎక్కడైనా నెగ్గగలననే పట్టుదల తనను నడిపించగా ఈ సవాల్‌ను వినేశ్ అధిగమించింది. అప్పుడు అలా చేజారినా2016 రియోలో తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన వినేశ్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా... చైనా రెజ్లర్‌తో బౌట్లో ఎడమకాలు విరిగి కన్నీళ్లపర్యంతమై నిష్క్రమించింది. స్ట్రెచర్‌పై ఆమెను బయటకు తీసుకుపోవాల్సి వచి్చంది. 2020 టోక్యో ఒలింపిక్స్ సమయంలో అద్భుత ఫామ్‌తో అడుగు పెట్టినా క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. దీనికి తోడు టీమ్ యూనిఫామ్ ధరించలేదని, గేమ్స్ విలేజ్ బయట ఉందని, భారత సహచరులతో కలిసి సాధన చేయలేదని క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఫెడరేషన్ ఆమెపై సస్పెన్షన్ విధించింది.తన రాతను తానే మార్చుకొనికొన్నాళ్లకు దానిని ఎత్తివేయడంతో మళ్లీ ఆటలోకి అడుగు పెట్టినా... గత ఏడాది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయంతో దెబ్బ పడింది. ఆపై మళ్లీ శస్త్రచికిత్స, రీహాబిలిటేషన్. మళ్లీ కోలుకొని మ్యాట్‌పై అడుగు పెట్టిన వినేశ్ ఒలింపిక్ పతకం సాధించే వరకు విశ్రమించలేదు. కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్ట్రాగామ్ ప్రొఫైల్‌లో ఒక స్ఫూర్తిదాయక వాక్యం రాసుకుంది. ‘ఖుదీ కో కర్ బులంద్ ఇత్నా కే హర్ తఖ్దీర్ సే పహ్లే ఖుదా బందేసే ఖుద్ పూఛే బతా తేరీ రజా క్యా హై’ (నిన్ను నువ్వు ఎంత బలంగా మార్చుకో అంటే అదృష్టం అవసరం పడే ప్రతీ సందర్భంలో నీకు ఏం కావాలని దేవుడే స్వయంగా అడగాలి). దీనికి తగినట్లుగా ఇప్పుడు వినేశ్ తన రాతను తానే మార్చుకొని రెజ్లింగ్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. – సాక్షి క్రీడా విభాగం -
రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు..
భారత స్టార్ రెజర్, ఒలింపిక్ విజేత బజరంగ్ పునియాకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA ) మరోసారి బిగ్ షాకిచ్చింది. బజరంగ్ పూనియాపై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. బజరంగ్ పునియా డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు నాడా ఆదివారం సస్పెండ్ చేసింది. అతడికి తాజాగా జాతీయ డోప్ కంట్రోల్ ఏజెన్సీ నోటీసు అందజేసింది.అసలేం జరిగిందంటే?ఈ ఏడాది మార్చిలో సోనిపట్‌లో జరిగిన ఒలింపిక్స్ ట్రయల్స్‌లో రోహిత్ కుమార్‌పై బజరంగ్ పునియా ఓడిపోయాడు. ఆ తర్వాత బజరంగ్ పూనియాపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్ అతడి నమూనాలను సేకరించేందుకు ప్రయత్నించింది. కానీ పునియా మాత్రం యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో నాడా.. ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(వాడా)కు పూనియా వ్యవహరం తెలియజేసింది.దీంతో బజరంగ్ ఎందుకు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వమని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ.. నాడాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నాడా ఏప్రిల్ 26లోపు తన వివరణ ఇవ్వాలని పూనియాకు నోటీసు జారీ చేసింది. కానీ పూనియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అయినప్పటకి నాడా మళ్లీ మే 7లోపు వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది. ఆ నోటీసులకు కూడా పూనియా సమాధానమివ్వలేదు. దీంతో గత నెలలో అతడిపై తాత్కాలిక నిషేదం విధించింది.అయితే నాడా నోటీసులకు స్పదించని పూనియా.. నాడా క్రమశిక్షణ సంఘంకు మాత్రం తన వివరణ ఇచ్చాడు. డోపింగ్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వడానికి తానెప్పుడూ తిరస్కరించలేదని, పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్లను వాడడంతోనే నమూనాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. దీంతో జూన్4న బజరంగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది. అయితే అతడు కావాలనే డోప్ టెస్టు తప్పించుకుంటున్నాడని భావించిన నాడా మరోసారి అతడిపై నిషేదం విధించింది. జూలై 11 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో నాడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
బజరంగ్‌పై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) కూడా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఏడాది ముగిసేవరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ ట్రయల్స్ వేదిక వద్ద బజరంగ్ డోప్ టెస్టుకు నిరాకరించడంతో జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ గత నెల 23న బజరంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. -
భారత టాప్ రెజ్లర్‌పై సస్పెన్షన్ వేటు
భారత టాప్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పూనియాపై అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ (United World Wrestling) సస్పెన్షన్ వేటు వేసింది. డోప్ పరీక్షకు నిరాకరించినందుకు NADAచే తాత్కాలికంగా సస్పెండ్ చేయబడిన తర్వాత పునియాను UWW సస్పెండ్ చేసింది. పూనియాపై ఈ ఏడాది చివరి వరకు (డిసెంబర్ 31) సస్పెన్షన్ కొనసాగనుంది.డోప్ టెస్ట్‌కు నిరాకరించాడన్న కారణంగా 20 ఏళ్ల పూనియాను ఏప్రిల్ 23న NADA సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌పై పూనియా అప్పుడే స్పందించాడు. తాను శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించలేదని వివరణ ఇచ్చాడు. శాంపిల్ తీసుకునేందుకు నాడా అధికారులు గడువు ముగిసిన కిట్‌ను ఉపయోగిస్తుండటంతో అందుకు వివరణ మాత్రమే కోరానని తెలిపాడు.UWW సస్పెన్షన్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని పూనియా తాజాగా వివరణ ఇచ్చాడు. పూనియా స్టేట్మెంట్పై UWW సైతం స్పందించింది. పూనియాను సస్పెండ్ చేస్తున్న విషయాన్ని కారణాలతో సహా అతని ప్రొఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపింది. ఒకవేళ పూనియాపై సస్పెన్షన్ వేటు నిజమే అయితే ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత పతక అవకాశాలకు గండి పడినట్లే. -
స్టార్ రెజ్లర్ బజరంగ్‌పై.. తాత్కాలిక నిషేధం!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. మార్చి 10వ తేదీన సోనెపట్‌లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ ట్రయల్స్ సందర్భంగా బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాక డోపింగ్ పరీక్షకు హాజరుకాకుండానే బయటకు వెళ్లిపోయాడు.దాంతో ‘నాడా’ ఏప్రిల్ 23న బజరంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షకు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ మే 7వ తేదీ వరకు బజరంగ్‌కు గడువు ఇచి్చంది. మరోవైపు తాను డోపింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు నిరాకరించలేదని... ‘నాడా’ అధికారులు ఆరోజు గడువు తీరిన కిట్స్‌తో తన నుంచి శాంపిల్స్ సేకరించేందుకు వచ్చారని బజరంగ్ ఆరోపించాడు. ‘నాడా’ అధికారులకు తన న్యాయవాది సమాధానం ఇస్తాడని బజరంగ్ తెలిపాడు.ఇవి చదవండి: రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్ షో.. -
Paris Olympics: బజరంగ్, రవి దహియాలకు షాక్
సోనెపట్ (హరియాణా): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన రవి దహియా... కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ పూనియాలకు షాక్! పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్నల్లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్ (65 కేజీలు), రవి (57 కేజీలు) అనూహ్యంగా ఓడిపోయారు. ఆదివారం నిర్వహించిన ట్రయల్స్‌లో సెమీఫైనల్లో బజరంగ్ 1–9తో రోహిత్ చేతిలో ఓడాడు. ఫైనల్లో రోహిత్‌పై సుజీత్ కల్కాల్ గెలుపొంది ఆసియా, వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన 57 కేజీల విభాగంలో తొలి బౌట్లో రవి దహియా 13–14తో అమన్ సెహ్రావత్ చేతిలో... రెండో బౌట్లో 8–10తో ఉదిత్ చేతిలో ఓడిపోయాడు. ఇతర ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో జైదీప్ (74 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), దీపక్ నెహ్రా (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) విజేతలుగా నిలిచి భారత జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ఏప్రిల్ 19 నుంచి 21 వరకు కిర్గిస్తాన్‌లో... వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ మే 9 నుంచి 12 వరకు ఇస్తాంబుల్‌లో జరుగుతాయి. -
భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తివేసింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై న్యాయపోరాటం చేసిన రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్లపై ఎలాంటి వివక్ష చూపరాదని పేర్కొంది. అదే విధంగా.. కక్ష్యసాధింపు చర్యలు చేపట్టకుండా అందరు రెజర్లకు సమాన అవకాశాలు కల్పించాలని డబ్ల్యూఎఫ్ఐకి యూడబ్ల్యూడబ్ల్యూ సూచించింది. సస్పెన్షన్ తొలగిపోవడంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లంతా మన జెండా కిందే పోటీపడొచ్చు. పతకం గెలిస్తే పోడియంలో మన పతాకమే రెపరెపలాడతుంది. గడువులోగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్ని నిర్వహించలేకపోవడంతో గత ఆగస్టులో సస్పెన్షన్ వేటు వేసింది. -
Rahul Gandhi: రెజ్లర్ల నిరసనలో పాల్గొని రాహుల్ కుస్తీ (ఫొటోలు)
-
‘కుస్తీ’ పట్టిన రాహుల్ గాంధీ
హర్యానా: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారుడు బజరంగ్ పూనియా, ఇతర రెజ్లింగ్ క్రీడాకారులను హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఛారా గ్రామంలొ కలుసుకున్నారు. ఆయన బుధవారం ఉదయమే.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికకు సంబంధించి.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన తెపుతున్న విషయం తెలిసిందే. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎంపికను నిరసిస్తూ... బజరంగ్ పూనియా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును ఎనక్కి ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయాలో బుధవారం ఎంపీ రాహుల్ గాంధీ క్రీడాకారులతో భేటీ అయి వారికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎంపీ రాహుల్ గాంధీ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. वर्षों की जीतोड़ मेहनत, धैर्य एवं अप्रतिम अनुशासन के साथ अपने खून और पसीने से मिट्टी को सींच कर एक खिलाड़ी अपने देश के लिए मेडल लाता है। आज झज्जर के छारा गांव में भाई विरेंद्र आर्य के अखाड़े पहुंच कर ओलंपिक पदक विजेता बजरंग पूनिया समेत अन्य पहलवान भाइयों के साथ चर्चा की। सवाल… pic.twitter.com/IeGOebvRl6 — Rahul Gandhi (@RahulGandhi) December 27, 2023 ‘ఎంపీ రాహుల్ గాంధీ రెజ్లర్ల రోజువారి సాధన, కార్యకలాపాలను తెలుసుకోవడానికి మా వద్దకు వచ్చారు. కాసేపు మాతో పాటు రెజ్లింగ్ కూడా చేశారు’ అని క్రీడాకారుడు బజరంగ్ పూనియా తెలిపారు. ‘రాహుల్ గాంధీ ఇక్కడ వస్తున్నట్లు మాకు ఎవరూ సమాచారం అందించలేదు. మేము రెజ్లింగ్ ప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో అకస్మత్తుగా మా వద్దకు ఆయన చేరుకున్నారు. ఆయన ఉదయమే 6.15 గంటలకు ఇక్కడికి వచ్చారు. మాతో పాటు కాసేపు వ్యాయామం చేశారు. ఆయనకు క్రీడల పట్ల ఉన్న అనుభవాలను మాతో పంచుకున్నారు. రాహుల్ గాంధీకి క్రీడాల పట్ల చాలా పరిజ్ఞానం ఉంది’ అని రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర ఆర్య పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌కు నమ్మినబంటుగా పేరున్న సంజయ్ కుమార్‌ను.. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికపై నిరసన తెలుపుతూ.. తాజాగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా అర్జున, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. రెజ్లర్లు రోడ్డెక్కి పోరాడుతున్న క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం గమనార్హం. #WATCH | Haryana: On Congress MP Rahul Gandhi visits Virender Arya Akhara in Chhara village of Jhajjar district, Wrestler Bajrang Poonia says, "He came to see our wrestling routine...He did wrestling...He came to see the day-to-day activities of a wrestler." pic.twitter.com/vh0aP921I3 — ANI (@ANI) December 27, 2023 చదవండి: వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం -
WFI: మంచో చెడో.. రిటైర్ అయ్యాను! డబ్ల్యూఎఫ్ఐ మంచికి నాంది
Sakshi Malik, Bajrang Punia Reaction On WFI Suspension: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ విధించడాన్ని రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ స్వాగతించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ మంచికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నా. మేం ఎందుకిలా పోరాడుతున్నామనే విషయం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి బోధపడుతుందని ఆశిస్తున్నా. మహిళా అధ్యక్షురాలుంటే దేశంలోని అమ్మాయిలకెంతో మేలు జరుగుతుంది’ అని ఆమె అన్నారు. వారి గౌరవం కంటే అవార్డు పెద్దది కాదు ఇక ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చిన టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నా పురస్కారాన్ని తిరిగిచ్చేశాను. మళ్లీ ఆ అవార్డును స్వీకరించే యోచన లేదు. మాకు న్యాయం జరిగినపుడు ‘పద్మశ్రీ’ని తీసుకుంటా. మన అక్కాచెల్లెళ్లు, కుమార్తెల గౌరవం కంటే ఏ అవార్డు పెద్దది కాదు. ప్రస్తుతం సమాఖ్య వ్యవహారాల్ని అందరు గమనిస్తున్నారు’ అని అన్నారు. సంజయ్ సింగ్‌కు షాకిచ్చిన క్రీడా శాఖ కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా బజరంగ్ పునియా, జితేందర్ సింగ్ వంటివారు ఆందోళనలో పాల్గొన్నారు. బ్రిజ్‌భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెలరోజులకు పైగా నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో మాజీ రెజ్లర్ అనిత షెరాన్ ప్యానెల్‌పై.. బ్రిజ్‌భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. బజరంగ్ పునియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ఆమెకు మద్దతుగా పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఈ పరిణామాల క్రమంలో డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగాన్ని, నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా సంజయ్ సింగ్ ప్యానెల్‌పై కేంద్ర క్రీడా శాఖ వేటు వేయడం ఆసక్తికరంగా మారింది. బ్రిజ్ భూషణ్ జోక్యంతోనే సంజయ్ ఎవరినీ సంప్రదించకుండా ఇష్టారీతిన పోటీల నిర్వహణ అంశాన్ని ప్రకటించారని.. అందుకే డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ పడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మంచో.. చెడో.. రిటైర్ అయ్యాను.. నాకేం సంబంధం లేదు ఈ నేపథ్యంలో.. తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యానంటూ బ్రిజ్‌భూషణ్ సింగ్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘నేను 12 ఏళ్ల పాటు సమాఖ్యకు సేవలందించాను. మంచో, చెడో ఏం చేశానో కాలమే సమాధానమిస్తుంది. ఇప్పుడైతే నేను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యాను. సమాఖ్యతో సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నాను. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల (లోక్‌సభ)పైనే దృష్టి పెట్టాను. డబ్ల్యూఎఫ్ఐలో ఏం జరిగినా అది కొత్త కార్యవర్గానికి చెందిన వ్యవహారమే తప్ప నాకు సంబంధించింది కాదు’’ అంటూ బ్రిజ్‌భూషణ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
నా సోదరి సాక్షిని చూసి గర్విస్తున్నా! చెప్పేదేమీ లేదన్న మంత్రి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై నిరసనగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు స్టార్ రెజ్లర్లు. వీరికి బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా బాసటగా నిలిచాడు. తనకు లభించిన పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ప్రకటించాడు. సాక్షిని చూసి గర్విస్తున్నా డెఫ్ ఒలింపిక్స్ (బధిర ఒలింపిక్స్)లో స్వర్ణ విజేతగా నిలిచిన వీరేందర్ ‘గుంగా పహిల్వాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘భారత మానస పుత్రిక, నా సోదరి సాక్షి మలిక్ కోసం నేను నా ‘పద్మ’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తా. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీజీ... సాక్షిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను. దేశంలోని దిగ్గజ క్రీడాకారులంతా దీనిపై స్పందించాలని నేను కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీరేందర్ ట్వీట్ చేశాడు. స్పందించేందుకు నిరాకరించిన అనురాగ్ ఠాకూర్ మరోవైపు.. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ఫలితాలు, తదుపరి స్టార్ రెజ్లర్ల నిరసన నిర్ణయాలపై స్పందించేందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిరాకరించారు. బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన అథ్లెట్లను అభినందించే కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘దీనిపై నేను ఇదివరకే చెప్పాల్సింది చెప్పా. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను’ అని ఠాకూర్ అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి ఎన్నికకు నిరసనగా కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. అంతేగాక డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ గెలవడం తమపై ప్రభావం చూపుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే.. ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలకగా.. మరో ఒలింపియన్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది? -
నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన భారత స్టార్ రెజ్లర్ల నుంచి మరో తీవ్రమైన నిర్ణయం వెలువడింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రెజ్లర్లు ఆటకు వీడ్కోలు పలకడం, ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను వెనక్కి ఇచ్చేయడం చేస్తున్నారు. ఇది భారత క్రీడాలోకానికి మచ్చగా మిగలడం ఖాయం! డబ్ల్యూఎఫ్ఐలో తిష్ట వేసుక్కూర్చున్న వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ చెరలోనే రెజ్లింగ్ సమాఖ్య కొనసాగనుండటం, ఆయన వీర విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా గెలవడంతో గురువారం రియో ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. శుక్రవారం తాజాగా టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా భారత ప్రభుత్వం 2019లో ఇచ్చిన పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేశాడు. రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి బజరంగ్ పార్లమెంట్ వైపు వెళ్తుండగా కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడి రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి తన నిరసన లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి చేరేలా చూడాలని పోలీసు అధికారుల్ని బజరంగ్ వేడుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు. ‘ప్రధాని మోదీకి నేను పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నా. ఈ లేఖే నా ఆవేదనగా భావించాలి’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. నిరసనగానే ఈ నిర్ణయం ఇక ఆ లేఖలో ఏముందంటే... ‘మోదీజీ మీరు బిజీగా ఉంటారని తెలుసు. అలాగే గత కొన్నాళ్లుగా మహిళా రెజ్లర్లు పడుతున్న పాట్లు, బ్రిజ్‌భూషణ్ నుంచి ఎదుర్కొంటున్న వేధింపులు మీకు తెలుసు. దీనిపై మేం రెండుసార్లు రోడెక్కి నిరసించాం. న్యాయం చేస్తామన్న ప్రభుత్వ హామీతో మా దీక్షను విరమించాం. ముందుగా అసలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. తాత్సారం తర్వాతే కేసు నమోదు చేశారు. మొదట్లో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా 19 మంది మహిళా రెజ్లర్లు స్టేట్మెంట్ ఇస్తే తదనంతరం ఈ సంఖ్య ఏడుగురికి పడిపోయింది. దీంతో అతని పలుకుబడి ఏ రకంగా శాసిస్తుందనేది అర్థమైంది. ఇప్పుడు మళ్లీ ఆయన వర్గమే రెజ్లింగ్ సమాఖ్యకు కొత్తగా ఎన్నికైంది. దీనికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని బజరంగ్ లేఖలో వివరించాడు. అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఎన్నికల విషయంలో మరోవైపు బజరంగ్ ‘పద్మశ్రీ’ని తిరిగిస్తుంటే కేంద్ర క్రీడాశాఖ తేలిగ్గా తీసుకున్నట్లుంది. వెనక్కి ఇవ్వడమనేది అతని వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. రెజ్లింగ్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారని... అయినప్పటికీ బజరంగ్‌ను తన నిర్ణయం మార్చుకోవాలని కోరతామని క్రీడాశాఖ అధికారి ఒకరు తెలిపారు. -
WFI: బజరంగ్ పునియా సంచలన ప్రకటన.. ప్రధాని మోదీకి లేఖ
Bajrang Punia Returns Padma Shri: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా కీలక నిర్ణయం తీసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం తనకు అందించిన పద్మ శ్రీ అవార్డుని వెనక్కి ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. మహిళా రెజ్లర్లకు అవమానం జరిగిన దేశంలో తాను ఇలాంటి ‘గౌరవానికి’ అర్హుడిని కాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్.. తమను లైంగికంగా వేధించాడంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలో.. నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఉద్యమానికి యువత అండగా నిలబడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించిన మేర స్పందన రాలేదు. ఈ క్రమంలో విచారణ కమిటీ నియామకం జరగగా ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం గురువారం (డిసెంబరు 21) ఢిల్లీలో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అనితా షెరాన్‌పై.. ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. బ్రిజ్ భూషణ్‌కు ప్రధాన అనుచరుడిగా పేరొందిన అతడు డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ వంటి ఒలింపిక్ విజేతతో పాటు నిరసనలో భాగమైన వినేశ్ ఫొగాట్.. వీరికి మద్దతుగా నిలిచిన బజరంగ్ పునియా తదితరులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. బ్రిజ్ భూషణ్ మళ్లీ డబ్ల్యూఎఫ్ఐలో పెత్తనం చెలాయించడం ఖాయమంటూ సాక్షి.. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఒలింపియన్ బజరంగ్ పునియా సైతం ఓ అడుగు ముందుకు వేశాడు. సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ.. పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాసిన లేఖలో.. ‘‘ప్రియమైన ప్రధాన మంత్రి గారు.. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. మీ పనులతో తీరిక లేకుండా ఉంటారని తెలుసు. అయినప్పటికీ.. మీ దృష్టిని ఆకర్షించడం ద్వారా దేశంలో రెజ్లర్ల పరిస్థితి గురించి తెలియజేయడానికి నేను మీకు లేఖ రాస్తున్నాను. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఈ ఏడాది జనవరిలో మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ నిరసనలో నేను కూడా పాల్గొన్నాను. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే మేము ఆందోళన విరమించాం. కానీ.. ఇంతవరకు బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మూడు నెలలు గడుస్తున్నా అతడిపై ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి మేము మరోసారి వీధుల్లోకి రావాలని భావిస్తున్నాం. ఏప్రిల్ నుంచి మళ్లీ నిరసనకు దిగుతాం. కనీసం అప్పుడైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే ఆశ. జనవరిలో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా 19 మంది కంప్లైంట్ చేశారు. అయితే, ఏప్రిల్ నాటికి వారి సంఖ్య ఏడుకు తగ్గింది. అంటే పన్నెండు మంది మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ ప్రభావితం చేశారు’’ అంటూ బజరంగ్ పునియా సంచలన విషయాలు వెల్లడించాడు. मैं अपना पद्मश्री पुरस्कार प्रधानमंत्री जी को वापस लौटा रहा हूँ. कहने के लिए बस मेरा यह पत्र है. यही मेरी स्टेटमेंट है। 🙏🏽 pic.twitter.com/PYfA9KhUg9 — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 22, 2023 -
40 రోజులు రోడ్లపై నిద్రించాం కానీ.. సాక్షి మాలిక్ సంచలన ప్రకటన
Sakshi Malik Gets Emotional Video Viral: భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ప్రకటన చేసింది. ఆటకు తాను వీడ్కోలు పలుకనున్నట్లు తెలిపింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వంటి వ్యక్తి అనుచరుడి నేతృత్వంలో తాను పోటీల్లో పాల్గొనలేనని.. అంతకంటే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడమే మేలు అని వెల్లడించింది. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి బజరంగ్ పునియా, జితేందర్ వంటి పురుష రెజ్లర్లు మద్దతుగా నిలిచారు. అనితా షెరాన్‌కు తప్పని ఓటమి ఈ క్రమంలో.. అనేక పరిణామాల అనంతరం బ్రిజ్ భూషణ్ స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఢిల్లీలోని ఒలింపిక్ భవన్ వేదికగా గురువారం జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ వీర విధేయుడిగా పేరొందిన సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన మాజీ రెజ్లర్ అనితా షెరాన్‌పై విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సాక్షి మాలిక్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘దాదాపు నలభై రోజుల పాటు నిరసన చేస్తూ రోడ్లపై నిద్రించాం. దేశంలోని నలుమూలల నుంచి మాకు మద్దతుగా ఎంతో మంది వచ్చారు. కన్నీటి పర్యంతమైన సాక్షి ఒకవేళ బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి, అతడి అనుంగు అనుచరుడు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు అయితే, నేను రెజ్లింగ్‌నే వదిలేస్తా’’ అంటూ సాక్షి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక బజరంగ్ పునియా మాట్లాడుతూ.. ‘‘బ్రిజ్ భూషణ్ విశ్వాసపాత్రులెవరూ డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో పాల్గొనరంటూ ప్రభుత్వం మాకిచ్చిన మాటను దురదృష్టవశాత్తూ నిలబెట్టుకోలేకపోయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. బ్రిజ్ భూషణ్‌కు సన్నిహితుడు కాగా డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వ్యక్తి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో భాగమైన అతడు బ్రిజ్ భూషణ్‌కు అత్యంత సన్నిహితుడని సమాచారం. ఈ నేపథ్యంలో ఇకపై రెజ్లింగ్ సమాఖ్యలో విధివిధానాల రూపకల్పనపై అతడు కచ్చితంగా బ్రిజ్ భూషణ్ సూచనలు, సలహాలు తీసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సాక్షి మాలిక్ వంటి వాళ్లు ఇలాంటి వ్యక్తి నేతృత్వంలో తాము ఆటను కొనసాగించలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Delhi: Wrestler Sakshi Malik says "We slept for 40 days on the roads and a lot of people from several parts of the country came to support us. If Brij Bhushan Singh's business partner and a close aide is elected as the president of WFI, I quit wrestling..." pic.twitter.com/j1ENTRmyUN — ANI (@ANI) December 21, 2023 -
నేరుగా ఆసియా క్రీడల్లో అడుగు.. అనూహ్య రీతిలో ఓటమి! ఎవరూ ఊహించలేరు..
Asian Games 2023: ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు అనూహ్య ఓటమి ఎదురుకాగా... అమన్ (57 కేజీలు), మహిళల విభాగంలో సోనమ్ మలిక్ (62 కేజీలు), కిరణ్ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. కాంస్య పతక బౌట్లలో అమన్ 11–0తో లియు మింగు (చైనా)పై, సోనమ్ 7–5తో జియా లాంగ్ (చైనా)పై, కిరణ్ 6–3తో అరియున్జర్గాల్ (మంగోలియా)పై నెగ్గారు. బజరంగ్ విఫలం సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనకుండా నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం దక్కించుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా నిరాశపరిచాడు. చైనా నుంచి అతను రిక్తహస్తాలతో స్వదేశానికి రానున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బజరంగ్ పూనియా కాంస్య పతక బౌట్లో 4 నిమిషాల 31 సెకన్లలో ఓడిపోయాడు. జపాన్ ప్లేయర్ కైకి యామగుచి 10–0తో బజరంగ్‌ను చిత్తుగా ఓడించాడు. రెండునెలల పాటు నిరసనలో రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బజరంగ్ తన సహచర రెజ్లర్లతో కలిసి దాదాపు రెండునెలలపాటు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో కొంతకాలంపాటు ఆటకు దూరంగా ఉన్న అతను ఆసియా క్రీడల్లో పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. 2014 ఏషియాడ్‌లో బజరంగ్ 61 కేజీల్లో రజతం, 2018 ఏషియాడ్‌లో 65 కేజీల్లో స్వర్ణం నెగ్గాడు. ఎవరూ ఊహించలేరు కూడా! కాగా ఆసియా క్రీడల్లో విఫలమైన బజరంగ్‌కు మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ అండగా నిలిచారు. ‘‘బజరంగ్.. ఇప్పుడూ.. ఎప్పుడూ చాంపియనే! మహిళా రెజ్లర్ల పోరాటంలో అతడు అందించిన సహకారం మరువలేనిది. మాకోసం తను ఎంతగా కష్టపడ్డాడో ఎవరూ ఊహించలేరు కూడా!’’ అని వినేశ్ బజరంగ్ పునియాను ప్రశంసించారు. నేరుగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టి ఓటమిపాలైన నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ మద్దతుదారులు బజరంగ్‌ను విమర్శిస్తున్న తరుణంలో.. లైంగిక వేధింపుల పోరాటంలో అతడు తమకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ వినేశ్ ఉద్వేగానికి లోనయ్యారు. -
బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్; ఏ ప్రాతిపదికన వారికి మినహాయింపు?
న్యూఢిల్లీ: నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అడ్‌హక్ కమిటీ ఇచ్చిన మినహాయింపు అంశం కోర్టుకెక్కింది. అండర్–20 ప్రపంచ చాంపియన్ అంతిమ్ పంఘాల్, అండర్–23 ఆసియా చాంపియన్ సుజీత్ కల్కల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ వీరిద్దరికి మినహాయింపు ఇవ్వడానికి గల కారణాలు, ప్రాతిపదిక ఏమిటని రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అడ్‌హక్ కమిటీని ప్రశ్నించారు. డబ్ల్యూఎఫ్ఐ మార్గదర్శకాల ప్రకారం అన్ని వెయిట్ కేటగిరీలకు సెలక్షన్ ట్రయల్స్ తప్పనిసరి అని పిటిషనర్ల తరఫు న్యాయ వాది వినిపించగా, జడ్జి తదుపరి విచారణన నేటికి వాయిదా వేశారు. బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు గురువారం ఢిల్లీ కోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ను మంజూరు చేసింది. మైనర్ రెజ్లర్ సహా పలువురు రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై ఎట్టకేలకు గత నెల 15న పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్ని విచారించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ షరతులతో కూడిన బెయిల్ ఇచి్చంది. మంగళవారం కేవలం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా తాజాగా పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం లేదు. -
వినేశ్ ఫొగాట్, భజరంగ్‌ల వ్యవహారంపై హైకోర్టుకు అంతిమ్ పంఘల్
ఒలింపిక్ పతక విజేత బజరంగ్, ఆసియా గేమ్స్ చాంపియన్ వినేశ్ ఫొగాట్ ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు బెర్త్‌లు పొందిన సంగతి తెలిసిందే. పురుషుల 65 కేజీల కేటగిరీలో బజరంగ్... మహిళల 53 కేజీల విభాగంలో వినేశ్ చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పోటీ పడతారు. అయితే ఈ విభాగాల్లోనూ ట్రయల్స్ నిర్వహించి విజేతలను స్టాండ్‌బైగా అక్కడికి తీసుకెళ్తారు. ఈ విషయం పక్కనబెడితే.. వినేశ్ ఫొగాట్‌కు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే నేరుగా ఆసియా గేమ్స్‌లో పాల్గొనడంపై యువ రెజ్లర్ అంతిమ్ పంఘల్ తప్పుబడుతూ హైకోర్టులో చాలెంజ్ చేశాడు. ఇదే విషయంపై అంతిమ్ పంఘల్ చిన్ననాటి కోచ్ వికాష్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ''ట్రయల్స్ లేకుండానే వినేశ్, భజరంగ్‌లను ఆసియా గేమ్స్ ఆడనివ్వడంపై హైకోర్టుకు వెళ్తున్నాం. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేసిన ఆందోళనలో యువ రెజ్లర్లు కూడా ఉన్నారు. కానీ డబ్ల్యూఎఫ్ఐ కేవలం సీనియర్లకు మాత్రమే అవకాశమిచ్చి సాక్షి మాలిక్ లాంటి జూనియర్లకు ఆసియా గేమ్స్‌కు ఎందుకు ట్రయల్స్ లేకుండా పంపించడం లేదు. ఇది కరెక్ట్ కాదు. అందరికి ట్రయల్స్ నిర్వహించాల్సిందే. ఎవరిని డైరెక్ట్‌గా ఎంపిక చేయకూడదు. దీనిపై పోరాడుతాం'' అంటూ తెలిపారు. ఇక అంతిమ్ పంఘల్ ఆసియా గేమ్స్‌లో బాక్సింగ్ విభాగంలో 53 కేజీలో కేటగిరిలో పోటీ పడనుండగా.. రెజ్లర్లు భజరంగ్ పూనియా 65 కేజీలు.. వినేశ్ ఫొగాట్ 53 కేజీల విభాగంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ వేదికగా జరగనున్నాయి. చదవండి: DopingTest: రెండేళ్లలో 114 మంది క్రికెటర్లకు మాత్రమేనా.. WADA అసహనం -
Asian Games: వినేశ్, బజరంగ్‌లకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందా?
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లింగ్ జట్లను ఎంపిక చేసేందుకు ఈనెల 22, 23 తేదీల్లో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్‌హక్ కమిటీ ప్రకటించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి... నిరసన చేపట్టిన రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్, సాక్షి మలిక్, సంగీత ఫొగపాట్, సత్యవర్త్, జితేందర్‌లకు ట్రయల్స్‌లో ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలా వద్దా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని అడ్‌హక్ కమిటీ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ బజ్వా తెలిపారు. అభిషేక్‌కు కాంస్యం బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ తొలి రోజు భారత్‌కు ఒక కాంస్య పతకం లభించింది. పురుషుల 10 వేల మీటర్ల విభాగంలో అభిషేక్ పాల్ కాంస్య పతకం సాధించాడు. అభిషేక్ 29 నిమిషాల 33.26 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి (59.10 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచింది. -
బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ కీలక నిర్ణయం.. క్రీడా శాఖ ఆమోదం
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ సెలెక్షన్ ట్రయల్స్‌కు సమాయత్తమయ్యేందుకు భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ విదేశాల్లో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించగా వాటికి ఆమోదం లభించింది. బజరంగ్ 36 రోజుల శిక్షణ కోసం కిర్గిస్తాన్‌ను... వినేశ్ 18 రోజుల శిక్షణకు హంగేరిని ఎంచుకున్నారు. ఆగస్టు రెండో వారంలో ట్రయల్స్ జరగనుండగా... వచ్చే వారంలో వీరు విదేశాలకు బయలుదేరుతారు. వినేశ్ వెంట ఫిజియోథెరపిస్ట్ అశ్విని జీవన్ పాటిల్, కోచ్ సుదేశ్, ప్రాక్టీస్ భాగస్వామిగా సంగీత ఫొగాట్... బజరంగ్ వెంట కోచ్ సుజీత్ మాన్, ఫిజియోథెర పిస్ట్ అనూజ్, ప్రాక్టీస్ భాగస్వామి జితేందర్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ నిపుణుడు కాజీ హసన్ వెళతారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణల కేసును కోర్టులోనే తేల్చుకుంటామని బజరంగ్, వినేశ్ ప్రకటించారు. చదవండి: Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్ -
రాతపూర్వక హామీ.. ఓ మెట్టుదిగిన రెజ్లర్లు
సాక్షి, ఢిల్లీ: రెజ్లర్ల నిరసనలో.. కేంద్రంతో రెజ్లర్ల చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను ఎలాగైనా ఆ సీటు నుంచి దించే ఉద్దేశంతో నిరసనలు కొనసాగిస్తున్న రెజ్లర్లు.. కేంద్రం నుంచి లభించిన హామీతో ఓ మెట్టు దిగారు. జూన్ 15వ తేదీ దాకా ఆందోళనలను చేపట్టబోమని, అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు బజరంగ్ పూనియా మీడియాకు వెల్లడించారు. బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో ఐదు గంటల పాటు రెజ్లర్లు భేటీ అయ్యారు. బ్రిజ్‌పై వచ్చిన ఆరోపణలపై జూన్ 15వ తేదీలోపు విచారణ పూర్తి చేయిస్తామని ఈ సందర్భంగా ఆయన రెజ్లర్లకు స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బజరంగ్ పూనియా బయటకు వచ్చాక మీడియాకు తెలిపాడు. మంత్రి చెప్పిన తేదీ వరకు నిరసనలను ఆపేస్తామని, అప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోతే మాత్రం నిరసనలను ఉదృతం చేస్తామని పూనియా మీడియా ద్వారా తెలిపాడు. అలాగే కేంద్రంతో రెజ్లర్లు ఓ ఒప్పందానికి వచ్చారని, మైనర్ బాధితురాలు కూడా తన ఫిర్యాదును వెనక్కి తీసుకుందంటూ వస్తున్న కథనాలను పూనియా తోసిపుచ్చాడు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామే తప్ప.. వెనక్కి తగ్గబోమని ప్రకటించాడు. మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలను స్వతంత్రగా నిర్వహించాలని, బ్రిజ్ కుటుంబ సభ్యులెవరూ అందులో పాల్గొనకుండా చూడాలని కేంద్రాన్ని రెజ్లర్లు కోరినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తమపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను వాళ్లు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహిళా రెజ్లర్ల భద్రతను ప్రధానాంశంగా పరిగణిస్తామని, అలాగే.. వాళ్లపై ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకుంటామని మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం చర్చల సారాంశాన్ని మీడియాకు తెలిపారు. అయితే.. బ్రిజ్ అరెస్ట్‌పై మాత్రం ఇరువర్గాలు స్పందించకపోవడం గమనార్హం. ఇక ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక మైనర్‌తో పాటు ఆరుగురు రెజ్లర్ల ఫిర్యాదులు కూడా అక్కడే నమోదుకాగా.. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజా పరిణామాలతో జూన్ 15వ తేదీలోపు ఆ దర్యాప్తు పూర్తి చేసి.. నివేదిక సమర్పించాలని కేంద్రం, ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తెచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. -
Wrestlers Protest: వాళ్లనలా చూశాక నిద్రే రాలేదు: బింద్రా
న్యూఢిల్లీ: పోలీసు నిర్బంధం నుంచి ఆదివారం రాత్రి విడుదలైన భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ‘మా తదుపరి కార్యాచరణ ఏంటనేది త్వరలోనే వెల్లడవుతుంది. మేమంతా ఇంకా కలుసుకోలేదు. మమ్మల్ని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. నన్ను అర్ధరాత్రి దాటాక విడిచి పెట్టారు. మిగతా రెజ్లర్లను రాత్రి 11 గంటలకు విడుదల చేశారు. అందువల్లే అందరం కలువలేకపోయాం. అంతా కలిసి చర్చించుకున్నాకే తదుపరి పోరాటానికి దిగుతాం’ అని బజరంగ్ తెలిపాడు. మరోవైపు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు రెజ్లర్లు మళ్లీ నిరసన చేసేందుకు అనుమతి కోరితే ఇస్తామని, అయితే జంతర్‌మంతర్ వద్ద మాత్రం శిబిరానికి అనుమతి లేదని, ఢిల్లీలో ఇంకెక్కడైనా దీక్ష చేపట్టవచ్చని ట్విట్టర్లో పేర్కొన్నారు. వాళ్లనలా చూశాక నిద్రే రాలేదు: బింద్రా దేశానికి ఒలింపిక్, ఆసియా క్రీడల్లో పతకాలు తెచ్చిపెట్టిన రెజ్లర్లతో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని బీజింగ్ ఒలింపిక్స్ (2008) చాంపియన్ షూటర్ అభినవ్ బింద్రా అన్నాడు. మహిళా రెజ్లర్లపై దాష్టీకానికి పాల్పడిన దృశ్యాలు తనను కలచివేశాయని రాత్రంత నిద్రేలేకుండా చేసిందని ట్వీట్ చేశాడు. స్టార్ రెజ్లర్లతో ఖాకీల కాఠిన్యం ఏమాత్రం ఆమోదయోగ్యం కానే కాదని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి అన్నాడు. రెజ్లర్లను పోలీసులు ఈడ్చుకెళ్లిన చిత్రాలు తనను బాధించాయని, సాధ్యమైనంత త్వరలో వారి సమస్య పరిష్కరించాలని మాజీ క్రికెట్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్లో కోరారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు -
‘కాలుస్తావా.. ఎక్కడికి రావాలో చెప్పు’.. రిటైర్డ్ ఐపీఎస్‌కు బజరంగ్ పూనియా ఛాలెంజ్
న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వ్యతిరేకంగా భారత రెజ్లర్లు గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ రాజకీయ ప్రముఖుడిపై కేంద్రం సరిగా స్పందించకపోవడంతో రెజర్లు ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు వారి అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద రెజర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై రిటైర్డ్ ఐపీఎస్ ఒకరు ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా..ధీటుగా బదులిచ్చారు. కాల్పుల అంశంపై పునియా అన్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ రిటైర్డ్ ఐపీఎస్, కేరళ పోలీస్ మాజీ చీఫ్ ఎన్ సీ ఆస్తానా ఈ రకంగా ట్వీట్ చేశారు. ‘పరిస్థితులు బట్టి మీపై కాల్పులు జరుపుతారు తప్ప మీరు చెబితే కాదు. ఒక బస్తా చెత్తను పడేసినట్లే.. మిమ్మల్ని లాగి పడవేస్తాం. సెక్షన్ 129 ప్రకారం పోలీసులకు కాల్చులు జరిపే అధికారం ఉంది. సమయం వస్తే ఆ కోరిక నెరవేరుతుంది. అందుకే మీరు ముందుకు చదువుకుని ఉండాలి. పోస్ట్‌మార్టం టేబుల్‌పై మళ్లీ కలుద్దాం’’ అంటూ రెజర్లను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ పై పునియా స్పందిస్తూ.. ‘‘ఈ ఐపీఎస్ అధికారి మమ్మల్ని కాల్చడం గురించి మాట్లాడుతున్నారు. సోదరా, మేము మీ ముందు ఉన్నాం, ఎక్కడికి రావాలో చెప్పండి. మీ బుల్లెట్లకు మా చాతీని చూపుతామని మీకు ప్రమాణం చేస్తున్నా. ఇప్పటి వరకు రెజర్లు బుల్లెట్లు మినహా మిగతావన్నింటినీ ఎదుర్కొన్నారు. ఇక మిగిలింది అదొక్కటే, అది కూడా తీసుకురండి’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. ये IPS ऑफिसर हमें गोली मारने की बात कर रहा है। भाई सामने खड़े हैं, बता कहाँ आना है गोली खाने… क़सम है पीठ नहीं दिखाएँगे, सीने पे खाएँगे तेरी गोली। यो ही रह गया है अब हमारे साथ करना तो यो भी सही। https://t.co/jgZofGj5QC — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 29, 2023 చదవండి: Delhi Shahbad Dairy Case:: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
దేశం కోసం పతకం... పతకం కోసం సర్వస్వం: బజరంగ్ పూనియా
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లు సాధించిన పతకాలకు వెలకట్టడంపై స్టార్ల రెజ్లర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెజ్లర్ల పతకాలు 15 రూపాయలు కూడా విలువ చేయవని, పతకాలు తిరిగివ్వడం కాదు... రూ.కోట్లలో పొందిన ప్రోత్సాహకాల్ని తిరిగివ్వాలని బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్‌భూషణ్ అన్నారు. దీనిపై జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తున్న ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా మాట్లాడుతూ ‘ఆ పతకం ఛారిటీలో బ్రిజ్‌భూషణ్ ఇచ్చింది కాదు. నేను దేశం కోసం శ్రమిస్తే వచ్చింది. దాని కోసం రాత్రనక పగలనక మా రక్తం ధారపోశాం. ఏళ్ల తరబడి చెమట చిందించాం. దానికి వెలకట్టే అర్హత అతనికి లేనేలేదు’ అని అన్నాడు. మరో రెజ్లర్ సాక్షి మలిక్ కూడా అంతేస్థాయిలో ధ్వజమెత్తింది. బ్రిజ్‌భూషణ్‌కు కనపడిన 15 రూపాయల పతకం కోసమే సర్వస్వాన్ని ధారపోశామని చెప్పింది. అతని వ్యాఖ్యలు సిగ్గుచేటని, క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించాలని సూచించింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజభూషణ్ను అరెస్టు చేయాలని రెజ్లర్లంతా నెలరోజులుగా నిరసన చేస్తున్నారు. -
తండ్రి లాంటి వారు చనువుగా, ఏదో తెలిసీ తెలియక తాకితే అపార్థం చేసుకుంటారా?
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. తాము కోరినట్లు అతడిని అరెస్టు చేయకపోతే తమ నిరసన దీక్షను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ హెచ్చరించారు. రుజువులు ఉన్నాయా? ‘మా నిరసనను ఎల్లలు దాటిస్తాం. అంతర్జాతీయ క్రీడాకారులు, ఒలింపియన్ల మద్దతు కోరతాం. విదేశీ ఆటగాళ్లు కూడా ఇందులో గళం విప్పేలా ప్రణాళికతో ముందుకెళ్తాం’ అని వినేశ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. రెజ్లర్ల ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన కమిటీ తమను లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో, ఆడియో రుజువులు అడిగిందని రెజ్లర్లు చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది. తండ్రిలాంటి వారు తాకితే కూడా అపార్థాలా? కమిటిలోని ఓ మెంబర్ ఓ మహిళా రెజ్లర్‌తో మాట్లాడుతూ.. తండ్రిలాంటి బ్రిజ్ భూషణ్ ఏదో తెలియక, చనువుగా మిమ్మల్ని తాకితే దానిని కూడా అపార్థం చేసుకుంటారా అని అన్నట్లు వారు చెప్పారని తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐ సిబ్బంది, కోచ్, బ్రిజ్ భూషణ్‌కు సన్నిహితంగా ఉండేవాళ్లంతా తమ విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వచ్చి విషయాలు రాబట్టేందుకు ప్రయత్నించారని మరో రెజ్లర్ పేర్కొన్నట్లు తెలిపింది. ఇది కూడా చదవండి: ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ ఓటమి ఇటాలియన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ పోరాటం ముగిసింది. రోమ్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–2, 6–7 (8/10), 10–12తో డిమినార్–కుబ్లర్ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సూపర్ టైబ్రేక్‌లో బోపన ద్వయం ఒక మ్యాచ్ పాయింట్ చేజార్చుంది. బోపన్న జోడీకి 29,300 యూరోల (రూ. 26 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. చదవండి: ICC: హెల్మెట్ కచ్చితం.. ఫ్రీ హిట్‌కు బౌల్డయితే బ్యాటర్ తీసిన పరుగులు? -
‘బ్లాక్‌డే’ పాటించిన రెజ్లర్లు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్ల నిరసన జంతర్ మంతర్ వద్ద కొనసాగుతోంది. నిరసనకు 18వ రోజైన గురువారం రెజ్లర్లు ‘బ్లాక్‌డే’గా పాటించారు. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వీరంతా నల్ల బ్యాండ్లు ధరించి తమ అసంతృప్తిని ప్రదర్శించారు. ‘ఈ రోజు మేం బ్లాక్‌డే పాటించాం. దేశం మొత్తం మాకు అండగా నిలుస్తోంది కాబట్టి విజయం సాధిస్తామని నమ్ముతున్నాం. న్యాయం దక్కే వరకు మా నిరసన కొనసాగుతుంది’ అని బజరంగ్, సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్ అన్నారు. ఇది కూడా చదవండి: భారత్‌కు క్లిష్టమైన ‘డ్రా’ దోహా: ఏషియన్ కప్ పురుషుల ఫుట్‌బాల్ టోర్న మెంట్లో భారత జట్టుకు కఠినమైన ‘డ్రా’ ఎదురైంది. వచ్చే ఏడాది జనవరిలో ఖతర్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. గ్రూప్ ‘బి’లో ఆస్ట్రేలియా (ప్రపంచ 29వ ర్యాంక్), ఉజ్బెకిస్తాన్ (74వ ర్యాంక్), సిరియా (90వ ర్యాంక్) జట్లతో కలిసి భారత్ (101వ ర్యాంక్) ఉంది. వచ్చే ఏడాది జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. 67 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో భారత జట్టు 1964లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత భారత్ 1984లో, 2011లో, 2019లో ఈ టోర్నీకి అర్హత సాధించినా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. -
ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కేసు ముగిస్తున్నాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్ నెరవేరడంతో కేసును ముగిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆయనను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఎదురుదెబ్బ కాదని, బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని బజరంగ్, వినేశ్, సాక్షి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించిందని దీనిని కూడా పరిశీలిస్తామని వినేశ్ తెలిపింది. -
వారిని ఉరితీయాలి.. రెజ్లర్లకు సీఎం కేజ్రీవాల్ మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న భారత రెజ్లర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. మహిళలను లైంగికంగా వేధించే వారిని ఉరితీయాలని అన్నారు. కాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ లైంగిక వేధింపులపై రెజ్లర్లు మరోసారి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లను కలిసిన సీఎం కేజ్రీవాల్ వారి నిరసనకు సంఘీభావం ప్రకటించారు. దేశం గర్వించేలా చేసిన రెజ్లర్లు గత వారం రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారని తెలిపారు. వారిని అవమానించారని.. మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేసేవారిని ఉరితీయాలని అన్నారు. ఎఫ్ఐఆర్లు నమోదైన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను కేంద్రం కాపాడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు.. ‘లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి (బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్) ఎంత శక్తిమంతుడో ఆలోచించాలి. ఆయనపై కేసు నమోదుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టిన అన్నా హజారే దేశ రాజకీయాలను మార్చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రెజ్లర్లు చేస్తున్న నిరసన కూడా క్రీడల్లో మార్పు తీసుకువస్తుందని తెలిపారు. దేశాన్ని ప్రేమించే వారు సెలవు తీసుకుని వారి నిరసనలో పాల్గోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. Delhi CM @ArvindKejriwal पहलवानों से मिलने जंतर-मंतर पहुंचे। BJP के बाहुबली नेता द्वारा महिला खिलाड़ियों के यौन उत्पीड़न के ख़िलाफ़ न्याय की मांग को लेकर सभी Wrestlers 7 दिन से धरने पर बैठे हैं।#KejriwalStandsWithChampions pic.twitter.com/G3Za1u9EqH — Aam Aadmi Party Delhi (@AAPDelhi) April 29, 2023 మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు లైంగిక వేధింపుల కేసునమోదు చేశారు. మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై కేసు నమోదవ్వడాన్ని స్వాగతించిన రెజ్లర్లు.. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్‌ను అన్ని పదవుల నుంచి తొలగించి అరెస్టు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తాను నేరస్థుడిని కానని, ఏ తప్పు చేయలేదని బ్రిజ్ భూషణ్ సింగ్ చెబుతున్నారు. రాజీనామా చేయడమంటే వారి ఆరోపణలను అంగీకరించడమే అవుతుందని, పదవి నుంచి వైదొలగనని పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. ప్రతి సారి ఆ పార్టీ ఖతమైంది: మోదీ ये Jantar Mantar की पवित्र धरती है — हम यहीं से निकले थे। यहां हुए आंदोलन ने देश की राजनीति बदल दी थी। आज मेरा दिल कहता है कि इन बच्चों, इन पहलवानों का ये आंदोलन खेल व्यवस्था में मूल परिवर्तन करेगा। — CM @ArvindKejriwal #KejriwalStandsWithChampions pic.twitter.com/eN1jFyBUmP — Aam Aadmi Party Delhi (@AAPDelhi) April 29, 2023 -
సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం!
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని... వెంటనే ఆయనను అరెస్టు చేయాలని భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయకపోతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న ఈ స్టార్ రెజ్లర్లు స్పష్టం చేశారు. కొందరు మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించారని తాము చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తేలితే తమపైనే కేసు నమోదు చేయాలని 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన సాక్షి వ్యాఖ్యానించింది. మూడు నెలల క్రితం చేపట్టిన నిరసనను విరమించి తప్పు చేశామని... ఈ విషయంలో తమను కొందరు తప్పుదోవ పట్టించారని సాక్షి, వినేశ్, బజరంగ్ విచారం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తుల మాటలు వినబోమని, రెజ్లింగ్ శ్రేయోభిలాషుల సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కన్నౌట్ ప్లేస్ పోలీసు స్టేషన్‌కు తాము వెళ్లినా పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన బజరంగ్ పూనియా తెలిపాడు. ‘అంతర్జాతీయ టోర్నీల్లో దేశం కోసం పతకాలు సాధించినపుడు కేంద్ర ప్రభుత్వం సన్మానిస్తుంది. కానీ మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే మాత్రం ఇదే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని బజరంగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో కేంద్ర క్రీడా శాఖ నియమించిన పర్యవేక్షక కమిటీ మా పట్ల పక్షపాతంగా వ్యవహరించింది. కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే లైంగిక వేధింపులకు గురైన బాధితుల వివరాలు తెలుస్తాయి. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కావడం, ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్లు అనిపిస్తోంది’ అని ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ విజేత వినేశ్ వ్యాఖ్యానించింది. మరోవైపు మే 7వ తేదీన జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలకు గుర్తింపు లేదని... భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటయ్యే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షక కమిటీ తమ నివేదిక అందించిందని... నివేదికను పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా క్రీడా శాఖ వివరించింది. పర్యవేక్షక కమిటీ నివేదిక ప్రకారం డబ్ల్యూఎఫ్ఐలో పారదర్శకత కొరవడిందని... రెజ్లర్ల సమస్యలు వినేందుకు, పరిష్కరించేందుకు ఎలాంటి వ్యవస్థ లేదని తాము గుర్తించినట్లు తెలిపింది. విచా రణ పూర్తి చేసి నివేదిక అందించడంతో పర్యవేక్షక కమిటీ పని ముగిసిందని క్రీడా శాఖ తెలిపింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలు.. రెజ్లర్లకు చేదు అనుభవం! సరైన ఆధారాలు లేనందున..
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను నిరూపించడంలో భారత అగ్రశ్రేణి రెజ్లర్లు విఫలమయ్యారని తెలిసింది. ఈ కేసును విచారించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని నియమించింది. ఈ కమిటీ తమ నివేదికను క్రీడా శాఖకు సమర్పించింది. కొన్నేళ్లుగా బ్రిజ్ భూషణ్ రెజర్లను లైంగికంగా వేధిస్తున్నాడని, ఆయనను ఈ పదవి నుంచి తప్పించాలని ఆరోపిస్తూ జనవరిలో జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన చేపట్టారు. అయితే బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణలు నిజమేనని నిరూపించేందుకు రెజ్లర్లు వినేశ్, సాక్షి, బజరంగ్ పర్యవేక్షణ కమిటీకి కచ్చితమైన ఆధారాలు సమర్పించలేదని సమాచారం. ఈ కేసుకు సంబంధించి పలువురిని పర్యవేక్షణ కమిటీ విచారించినా ఒక్కరు కూడా బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా చెప్పలేదని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. చదవండి: అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. క్రెడిట్ మొత్తం వాళ్లకే: హార్దిక్ -
సైనాకు చేదు అనుభవం
జకార్తా: ఈ ఏడాది ఆడుతున్న మూడో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. మలేసియా ఓపెన్‌లో తొలి రౌండ్లో, ఇండియా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా... తాజాగా ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలోనూ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సైనా 15–21, 7–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ హాన్ యు (చైనా) చేతిలో పరాజయం పాలైంది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా ఏ దశలోనై చైనా ప్లేయర్‌కు పోటీనివ్వలేకపోయింది. తొలి గేమ్‌లోనైతే సైనా ఆరంభంలోనే వరుసగా 10 పాయింట్లు కోల్పోయి 0–10తో వెనుకబడిపోయింది. క్వార్టర్స్‌లో లక్ష్య సేన్ ఇక రెండో గేమ్‌లో సైనా తొలుత వరుసగా మూడు పాయింట్లు, అనంతరం వరుసగా ఎనిమిది పాయింట్లు సమర్పించుకొని కోలుకోలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 19–21, 21–8, 21–17తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. చదవండి: పోటీకి సిద్ధమైన రెజ్లర్లు ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టోర్నీ జాగ్రెబ్ ఓపెన్ గ్రాండ్‌ప్రిలో బరిలోకి దిగేందుకు భారత అగ్రశ్రేణి రెజ్లర్లు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు క్రొయేషియాలో జరిగే ఈ టోర్నీలో టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్, రవి కుమార్, దీపక్ పూనియాలు పోటీపడనున్నారు. వీరితోపాటు మహిళా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, అన్షు మలిక్ బరిలోకి దిగనున్నారు. ఒకవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు కాగా.. మరోవైపు ఈ మేరకు రెజ్లర్లు టోర్నికి సిద్ధం కావడం విశేషం. చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్లో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అంటే? -
ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు పంచాయతీ
ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన మూడోరోజు కొనసాగింది. ఈ వ్యవహారంపై గురువారం కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆందోళనను మరింత ఉదృతం చేసిన రెజ్లర్లు శుక్రవారం భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు లేఖ చేశారు. రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న అవకతకవలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లు పీటీ ఉషకు రాసిన లేఖలో ప్రధానంగా నాలుగు డిమాండ్లను నివేధించారు. కాగా ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ అంశం తనకు బాధ కలిగించిందని.. బాగా డిస్టర్బ్ చేసిందన్నారు. రెజ్లర్లు రాసిన లేఖ తనకు అందిందని.. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఐవోఏ ముందు రెజ్లర్లు ఉంచిన నాలుగు ప్రధాన డిమాండ్లు ► లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలి. ► డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి బ్రిజ్‌భూషణ్ వెంటనే రాజీనామా చేయాలి. ► భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేయాలి ► డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలను కొనసాగించేందుకు రెజ్లర్లను సంప్రదించి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి @PMOIndia @AmitShah @ianuragthakur @PTUshaOfficial pic.twitter.com/PwhJjlawPg — Vinesh Phogat (@Phogat_Vinesh) January 20, 2023 రాజీనామా చేసే ప్రస్తకే లేదు: బ్రిజ్ భూషణ్ అంతకముందు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు.. ఎంపీ బ్రిజ్ భూషణ్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రలో భాగమే అని ఆరోపించిన ఆయన రాజీనామా చేసే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేశారు.ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్మీట్లో మాట్లాడనున్నట్లు తెలిపారు. హర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు తమ వద్ద ఉన్నారని బ్రిజ్ మీడియాకు తెలిపారు. చదవండి: ‘సాయ్’ స్పందన సరిగా లేదు రెజ్లర్ల మీటూ ఉద్యమం..చర్చలు విఫలం!.. ఉత్కంఠ -
జంతర్ మంతర్ వద్ద బృందా కారత్కు చేదు అనుభవం
ఢిల్లీ: సీపీఐ(ఎం) నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్(75)కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన వద్దకు గురువారం ఆమె చేరుకున్నారు. అయితే.. వేదిక ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించాలన్న ఆమె ప్రయత్నానికి రెజ్లర్లు అడ్డు తగిలారు. రాజకీయ ఎజెండాగా ఈ వ్యవహారాన్ని మార్చేయడం సరికాదంటూ మైకులోనే చెబుతూ ఆమెను వేదికపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు. ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన బజరంగ్ పూనియా.. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టేజ్‌పైకి బృందా కారత్ ఎక్కేందుకు యత్నించగా.. తమ పోరాటాన్ని రాజకీయం చేయొద్దంటూ పూనియా ఆమెకు విజ్ఞప్తి చేశారు. దయచేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అదే సమయంలో మరికొందరు రెజ్లర్లు.. కారత్ను ఉద్దేశిస్తూ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయడం గమనార్హం. కారత్‌తో పాటు మరికొందరు కమ్యూనిస్ట్ నేతలు ఆ సమయంలో వేదిక మీదకు వెళ్లకుండా నిలిచిపోయారు. ఆపై కాసేపటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. #WATCH | CPI(M) leader Brinda Karat asked to step down from the stage during wrestlers' protest against WFI at Jantar Mantar in Delhi. pic.twitter.com/sw8WMTdjsk — ANI (@ANI) January 19, 2023 రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ కైసర్‌గంజ్ ఎంపీ(ఉత్తర ప్రదేశ్) బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి. అవినీతి, మానసికంగా వేధింపులు, లైంగిక వేధింపుల పర్వం కొనసాగుతోందంటూ హస్తిన నడిబొడ్డున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్, మరో ఛాంపియన్ సాక్షి మాలిక్‌లు స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో.. వ్యవహారం మరింత ముదిరింది. బ్రిజ్ భూషణ్, కోచ్‌లు.. మహిళా రెజర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపించారు వాళ్లు. ఇక ఈ ఆరోపణలను తోసిపుచ్చిన బ్రిజ్ భూషణ్.. తాను పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమంటూ ప్రకటించారు. ఆరోపణలు నిరూపిస్తే తల నరుక్కునేందుకు సిద్ధమంటూ ప్రకటించారు కూడా. జజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు వారం కిందట తనను కలిశారని, ఇద్దరూ ఎలాంటి సమస్యలు లేవని తనతో చెప్పారని, ఈ నిరసనల వెనుక తనను దించేసే కుట్ర జరుగుతోందని, ఓ బడా పారిశ్రామికవేత్త హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారాయన. మరోవైపు ఈ వ్యవహారంలో గురువారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. శాస్త్రి భవన్‌లోని కేంద్ర క్రీడా శాఖల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించడానికి రెజ్లర్లు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని భజరంగ్ పూనియా సైతం ధృవీకరించారు. సమావేశం తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ పూనియా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించారు. రెజ్లర్లకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. I request PM Modi to make sure that our wrestlers get justice. I will continue to stand with our athletes: Dr Krishna Poonia, Congress MLA & former gold-medal-winning track & field athlete, at Jantar Mantar in Delhi pic.twitter.com/GEVTLJFT2Z — ANI (@ANI) January 19, 2023 -
కన్నీటి పర్యంతమైన వినేశ్ ఫొగాట్..! నిరూపిస్తే ఉరేసుకుంటానన్న ఎంపీ
Indian Wrestler Vinesh Phogat: ‘పలువురు కోచ్‌లు అదే పనిగా లక్నోలో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారు. 10, 12 మంది అమ్మాయిలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి పేర్లను ఇప్పుడే చెప్పను. ప్రధానిని కలిసే అవకాశమిస్తే ఆయనకే వివరిస్తా. నేను ఇదివరకు ఒకసారి బ్రిజ్‌భూషణ్‌పై ఫిర్యాదు చేస్తే చంపుతామని బెదిరించారు’ అని కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్, ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ విలేకర్ల ముందు విలపించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మీడియా ఎదుట ఆవేదన పంచుకున్నారు. కాగా చాలా కాలంగా బ్రిజ్‌భూషణ్ తమని లైంగికంగా వేధిస్తున్నారని భారత మహిళా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. సంగీతా ఫొగాట్ భర్త, టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత బజరంగ్ పూనియా, అతని కోచ్ సుజిత్ మాన్ సహా ఫిజియో ఆనంద్ దూబే వారికి మద్ధతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బజరంగ్ మాట్లాడుతూ తమ పోరాటం ప్రభుత్వం, కేంద్ర క్రీడా శాఖ, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)పై కాదని... కేవలం బ్రిజ్‌భూషణ్ నియంతృత్వంపైనే అని స్పష్టం చేశారు. అయితే, డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్, లోక్‌సభ ఎంపీ బ్రిజ్‌భూషణ్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేయడం గమనార్హం. ఈ ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఉరేసుకొంటానని సవాల్ చేశారు. ఓ పారిశ్రామిక వేత్త ప్రోద్బలంతో ఇదంతా జరుగుతోందని 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా బ్రిజ్‌భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చదవండి: Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. నిప్పులు చెరిగిన లోకల్ బాయ్.. భావోద్వేగ ట్వీట్ ENG vs SA: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన! స్టార్ బ్యాటర్ వచ్చేశాడు -
World Wrestling Championships 2022: భళా బజరంగ్...
బెల్గ్రేడ్ (సెర్బియా): అందివచ్చిన పతకావకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా అద్భుత ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బజరంగ్ పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. కాంస్య పతకం సాధించాలంటే తప్పనిసరిగా రెండు వరుస బౌట్లలో గెలవాల్సిన బజరంగ్ తన సత్తా చాటుకున్నాడు. బజరంగ్‌ను క్వార్టర్ ఫైనల్లో ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో బజరంగ్‌కు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ఆదివారం జరిగిన ‘రెపిచాజ్’ తొలి బౌట్లో 28 ఏళ్ల బజరంగ్ 7–6తో వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించా డు. వాజ్జెన్తో జరిగిన మ్యాచ్‌లో ఒకదశలో బజరంగ్ 1–4తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. అనంతరం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో బజరంగ్ 11–9తో సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. రివెరాతో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే బజరంగ్ 0–6తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే తేరుకున్న ఈ హరియాణా రెజ్లర్ ఆరు పాయింట్లు గెలిచి తొలి భాగం ముగిసేసరికి 6–6తో సమంగా నిలిచాడు. రెండో భాగం ఆరంభంలో బజరంగ్ మళ్లీ మూడు పాయింట్లు కోల్పోయి 6–9తో మళ్లీ వెనుకబడ్డాడు. అయినా ఆందోళన చెందని బజరంగ్ ఉడుంపట్టుతో మెరిసి 2, 2 పాయింట్లు సాధించి 10–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి సెకన్లలో ప్యూర్టోరికో రెజ్లర్ రివ్యూకు వెళ్లడం, దానిని అతను కోల్పోవడంతో భారత రెజ్లర్‌కు అదనంగా మరో పాయింట్ లభించింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో క్యూబా రెజ్లర్ అలెజాంద్రో వాల్డెస్తో పోటీపడుతున్న సమయంలో బజరంగ్ తలకు గాయమైంది. అయినా కట్టు కట్టుకొని ఆడిన బజరంగ్ తొలి రౌండ్లో 5–4తో వాల్డెస్ను ఓడించాడు. ఆ తర్వాత తలకు గాయంతోనే ఈ టోర్నీలో మిగతా మ్యాచ్‌లలో పోటీపడి చివరకు కాంస్య పతకం సాధించాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో నాలుగు పతకాలు సాధించి అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. -
World Wrestling Championships: కాంస్యం రేసులో బజరంగ్
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించేందుకు మరో అవకాశం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో భారత స్టార్ రెజర్ల్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత బజరంగ్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. శనివారం జరిగిన 65 కేజీల విభాగంలో 28 ఏళ్ల బజరంగ్ క్వార్టర్ ఫైనల్లో 0–10తో జాన్ మైకేల్ డియాకొమిహాలిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు బజరంగ్ ప్రిక్వా ర్టర్ ఫైనల్లో 5–4తో అలెజాంద్రో ఎన్రిక్ వాల్డెస్ (క్యూబా)పై గెలుపొందాడు. బజరంగ్‌ను ఓడించిన జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ద్వారా బజరంగ్‌కు కాంస్య పతకం గెలిచే అవకాశం వచ్చింది. వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా), వ్లాదిమిర్ దుబోవ్ (బల్గేరియా) మధ్య విజేతతో నేడు జరిగే ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో బజరంగ్ తలపడతాడు. ఈ బౌట్లో బజరంగ్ గెలిస్తే కాంస్య పతకం కోసం సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)తో ఆడతాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో మూడు పతకాలు సాధించాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. మరోవైపు పురుషుల 74 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాగర్ జగ్లాన్ కాంస్య పతకం సాధించలేకపోయాడు. ఆసియా చాంపియన్ యూనస్ అలీఅక్బర్ (ఇరాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో సాగర్ 0–6తో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన విక్కీ (97 కేజీలు), పంకజ్ (61 కేజీలు) తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. వీరిద్దరిని ఓడించిన రెజ్లర్లు తదనంతరం ఫైనల్ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం సాధించే అవకాశం లేకుండా పోయింది. -
CWG 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ ‘పట్టు’ చాటుకున్నారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు. కేవలం రెండు పాయింట్లు ఇచ్చి... పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్‌కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. లాచ్లాన్ మౌరిస్ మెక్నీల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 9–2తో గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో లోవీ బింగామ్ (నౌరూ)పై, క్వార్టర్ ఫైనల్లో జీన్ గలియాన్ (మారిషస్)పై, సెమీఫైనల్లో జార్జి రామ్ (ఇంగ్లండ్)పై బజరంగ్ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న దీపక్ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్ ఇనామ్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్ 3–1తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్)పై, తొలి రౌండ్లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్ (న్యూజిలాండ్)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్ గ్రెవాల్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆరోన్ జాన్సన్ (జమైకా)పై గెలుపొందాడు. సూపర్ సాక్షి... మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మలిక్ ‘బై ఫాల్’ పద్ధతిలో కెనడా రెజ్లర్ అనా పౌలా గోడినెజ్‌ను ఓడించి తొలిసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో రజతం, 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన సాక్షి మూడో ప్రయత్నంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఒకదశలో సాక్షి 0–4తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని అనా పౌలా భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు అట్టిపెట్టి ‘బై ఫాల్’ పద్ధతిలో విజయాన్ని అందుకుంది. 57 కేజీల ఫైనల్లో అన్షు మలిక్ 3–7తో ఒడునాయో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దివ్య కక్రాన్ కేవలం 20 సెకన్లలో తన ప్రత్యర్థి టైగర్ లిలీ లెమాలి (టోంగా)పై గెలిచింది. -
UWW Ranking Series: అమన్ పసిడి పట్టు.. భారత్‌కు 12 పతకాలు!
కజకిస్తాన్‌లో జరిగిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ అమన్ 57 కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు. ఫైనల్లో అమన్ 10–9తో మెరెయ్ బజర్బయెవ్ (కజకిస్తాన్)ను ఓడించాడు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా (65 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కాంస్య పతక పోరులో బజరంగ్ 7–0తో రిఫత్ సైబొతలొవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. ఈ ఈవెంట్లో భారత్ 12 పతకాలు గెలుపొందగా, మహిళా రెజ్లర్లే 5 స్వర్ణాలు సహా 8 పతకాలు గెలిచారు. చదవండి: Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! -
భారత్‌లో కొన్ని రోజులైనా శిక్షణ ఇచ్చేందుకు ససేమిరా.. అందుకే ఇలా!
న్యూఢిల్లీ: కరోనా కాలంలో విదేశీ కోచ్‌ల వెంట పడకుండా... 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు భారతీయ కోచ్‌ల ఆధ్వర్యంలో తమ ప్రదర్శ నకు మెరుగులు దిద్దుకోవాలని భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, రవి దహియా నిర్ణయం తీసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో రవి రజతం... బజరంగ్ కాంస్యం సాధించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య వీరిద్దరి కోసం భారత్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ కోచ్‌లను నియమించే పనిలో ఉంది. ‘విదేశీ కోచ్‌లు వారి దేశంలోనే 80 శాతం కోచింగ్ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు కానీ భారత్‌లో కొన్ని రోజులైనా శిక్షణ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అందువల్లే స్వదేశీ కోచ్‌పై దృష్టి పెట్టాను’ అని ఉన్న బజరంగ్ అన్నాడు. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్! -
Rewind 2021: ఈసారి మనకు ఒలింపిక్స్‌లో స్వర్ణం, రజతం, కాంస్యం!
Tokyo Olympics: ఆధునిక ఒలింపిక్స్ 1896లో ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వాటిలో భారతదేశానికి సంబంధించినంత వరకు మైలురాయిలాంటి విజయాలను అందించిన సంవత్సరంగా 2021 మిగిలిపోతుంది. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా ప్రాబల్యం కారణంగా వాయిదా పడి, నిబంధనల మేరకు చివరకు 2021లో నిర్వహించారు. ఈ ఒలిపింక్స్‌లో మన దేశం స్వర్ణం, రజతం, కాంస్యం.. ఇలా మూడు రకాల పతకాలను గెలుచుకుని ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఆట తీరుపై అంచనాలను పెంచింది. మన క్రీడాకారులు కూడా ఎంతో ప్రతిభను ప్రదర్శించి విజయాలను చేజిక్కించుకున్నారు. బజరంగ్ పూనియా హరియాణా జజ్జర్ ప్రాంతానికి చెందిన బజరంగ్ అరవై అయిదు కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో కజకిస్తాన్‌కు చెందిన నియజ్ బెకోవన్ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించాడు. నీరజ్ చోప్రా స్వాతంత్య్ర భారత చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని ఒలింపిక్స్‌లో సాధించిన క్రీడాకారుడిగా నీరజ్ రికార్డ్ సృష్టించాడు. అంతగా గుర్తింపులేని జావెలిన్ త్రో క్రీడలో అంతర్జాతీయ దిగ్గజాలను సైతం కాలదన్ని స్వర్ణపతాకంతో భారతీయ కలలను నెరవేర్చాడు. హరియాణా పానిపట్టు జిల్లాలోని ‘ఖంద్రా’గ్రామంలో పదిహేడు మంది ఉండే ఉమ్మడి కుటుంబంలో పెద్దబ్బాయి అయిన నీరజ్ తన కలలను మాత్రమే కాక భారతీయుల కలలనూ నిజం చేశాడు. మీరాబాయి చాను మణిపూర్‌లోని ఇంఫాల్‌కు చెందిన మీరాబాయి 2021, ఆగస్ట్ 5న టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయ త్రివర్ణ పతాకం రెపరెలాడేలా చేసింది. నలభై తొమ్మిది కిలోల వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో స్నాచ్ విభాగంలో ఎనభై ఏడు కిలోలను, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 115 కిలోలను ఎత్తి మొత్తం 202 పాయింట్లతో భారత్‌కు వెండి పతకాన్ని ఖాయం చేసింది. ఇరవై ఆరేళ్ల మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో భారత విజయయాత్రకు శ్రీకారం చుట్టింది. రవికుమార్ దహియా టోక్యో ఒలింపిక్స్‌లో యాభై ఏడు కిలోల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో రజత పతకాన్ని సాధించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతాక విజేతగా, ఏషియన్ చాంపియన్‌గా మంచి ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న దహియా ఒలింపిక్స్‌లోనూ అదే పరంపరను సాగించడం విశేషం. లవ్లీనా బొర్గొహెన్ అస్సాంలోని గోలాఘాట్‌లో జన్మించిన లవ్లీనా కిక్‌బాక్సింగ్‌తో కెరీర్ మొదలుపెట్టింది. టోక్యో ఒలిపింక్స్‌లో అరవై తొమ్మిది కిలోల బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. పి.వి. సింధు బాడ్మింటన్ క్రీడలో చెరిగిపోని ముద్రవేసిన తెలుగు అమ్మాయి పూసర్ల వెంకట సింధు ఈసారి కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించింది. పారాలింపిక్స్‌లో భారతీయులు శారీరకంగా, మానసికంగా ఉన్న సవాళ్లు సంకల్పాన్ని ఉసిగొల్పి, దీక్షగా మలచి, పట్టువిడువని సాధనగా మార్చితే విజయం పతకంగా ఇంటికి రాదూ! అలా మిగిలిన ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే క్రీడాసంరంభమే.. రెండో ప్రపంచానంతరం ప్రారంభమైన పారాలింపిక్స్. 2021 సంవత్సరపు ఈ క్రీడల్లో మన దేశ పతాకం రెపరెపలాడింది. మొత్తం 17 మంది క్రీడాకారులు 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు సాధించి మన సత్తా చాటారు. ఆ విజేతలు వీరే.. అవనీ లేఖరా రోడ్డు ప్రమాదంలో వెన్నెముక విరిగి నడుం కింది భాగం చచ్చుబడిపోయి.. వీల్‌చైర్‌కే అంకితమైంది. అయినా అధైర్యపడక మొక్కవోని దీక్షతో షూటింగ్ నేర్చుకుని భారత్ తరపున పారాలింపిక్స్‌కి ఎన్నికైంది. ఈ పోటీల్లో పాల్గొన్న మొదటిసారే రెండు పతకాలను సాధించిన తొలి భారతీయ యువతిగా రికార్డ్ సృష్టించింది. తంగవేలు మరియప్పన్ తమిళనాడులోని సేలం జిల్లా, పెరియనడాగపట్టి అనే కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన తంగవేలు ఓ బస్సు ప్రమాదంలో కుడికాలిని పోగొట్టుకున్నాడు. అయినా పాఠశాల స్థాయి నుంచే హైజంప్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఓవైపు ఆ క్రీడను సాధన చేస్తూనే మరో వైపు జీవనాధారం కోసం పేపర్‌బాయ్‌గా పనిచేసేవాడు. రియో పారాలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ గెలుపునే టోక్యో పారాలింపిక్స్‌లోనూ కొనసాగించి హైజంప్‌లో రెండో విడతా బంగారు పతకాన్ని సాధించాడు. ప్రమోద్ భగత్ బిహార్‌లోని హాజీపూర్‌లో జన్మించిన ప్రమోద్ పోలియోతో ఎడమ కాలిని కోల్పోయాడు. అయితే క్రికెట్ పట్ల ప్రేమతో ఎప్పుడూ గ్రౌండ్లో గడుపుతూ తన వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంగా మలచుకునే ప్రయత్నం చేసేవాడు. ఆ తర్వాత తన మేనత్తతో భువనేశ్వర్ వెళ్లి అక్కడే తన దృష్టిని బాడ్మింటన్ వైపు మరల్చాడు. నాలుగుసార్లు బాడ్మింటన్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించి వరల్డ్ నంబర్ వన్‌గా ప్రశంసలు పొందాడు. అయితే టోక్యో పారాలింపిక్స్‌తో తొలిసారి బాడ్మింటన్‌ను ప్రవేశపెట్టడం వల్ల ఈ పోటీలో పాల్గొని స్వర్ణపతకాన్ని సాధించి దేశ కీర్తిని చాటాడు. సుమిత్ కుస్తీలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలు గన్న సుమిత్ 2014లో జరిగిన ఓ యాక్సిడెంట్లో ఎడమకాలిని పోగొట్టుకున్నాడు. తన దృష్టిని అథ్లెటిక్స్ అందులోనూ ‘జావెలిన్ త్రో’ వైపు మరల్చి తీవ్రమైన సాధన చేశాడు. ఆ పోటీలో పాల్గొనెందుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పోటీదారులను వెనక్కి నెట్టి టోక్యో పారాలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దేవేంద్ర ఝఝరియా రాజస్థాన్, చుంచ జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టిన దేవేంద్ర ఎనిమిదేళ్ల వయసులో విద్యుదాఘాతానికి గురై ఎడమ చేయి కాలిపోవడంతో దాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినా ఆత్మన్యూనతకు లోనుకాకుండా ఒంటి చేత్తోనే ఆడగలిగిన క్రీడ జావెలిన్ త్రోని ఎంపిక చేసుకొని పట్టుదలతో ప్రాక్టీస్ చేశాడు. ఏథెన్స్ పారాలింపిక్స్‌లో ప్రపంచరికార్డును సృష్టించేంతగా ఎదిగాడు. తర్వాత రియో పారాలింపిక్స్‌లో, ప్రస్తుత టోక్యో పారాలింపిక్స్‌లో కూడా విజేతగా నిలిచి మూడు పారాలింపిక్స్ పతకాలు గెలుచుకున్న ఏకైక భారతీయుడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతనికిప్పుడు 40 ఏళ్లు. ఆ వయసులో ఈ విజయం నిజంగా విశేషం. కృష్ణ నాగర్ రాజాస్థాన్కు చెందిన కృష్ణ .. హార్మోన్ల లోపం వల్ల మరుగుజ్జుగా ఉండిపోయాడు. కానీ బాడ్మింటన్ పట్ల ఆసక్తితో దాన్ని నేర్చుకుని టోక్యో పారాలింపిక్స్‌లో పతకాన్ని సాధించి మరుగుజ్జుతనం తన లక్ష్యసాధనకు ఆటంకం కాదని నిరూపించాడు. మనీష్ నర్వాల్ హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన మనీష్ పుట్టుకతోనే కుడిచేయిపై పట్టును కోల్పోయి, ఒంటి చేతితోనే జీవితాన్ని నెట్టుకు రాసాగాడు. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే ఈ 19ఏళ్ల కుర్రాడు తన లోపాన్ని దృష్టిలో పెట్టుకుని తన ఏకాగ్రతను షూటింగ్ వైపు మళ్లించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. భావినా పటేల్ గుజరాత్, మెహసాగా జిల్లాకు చెందిన భావినా పోలియో వల్ల కాళ్లను పోగొట్టుకుని చక్రాల కుర్చీకే పరిమితం అయింది. ఎన్నో ప్రతిబంధకాలను అధిగమించి టేబుల్ టెన్నిస్‌ను నేర్చుకుని టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుని ఈ క్రీడలో పతకాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ క్రీడాకారిణి వయసు ఎంతో తెలుసా.. పందొమ్మిదేళ్లు మాత్రమే. సమీర్ బెనర్జీ భారతీయ మూలాలున్న ఈ అమెరికన్ యువకుడు ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. అరుదైన రికార్డ్ సృష్టించాడు. సమీర్ తండ్రి అస్సాం రాష్ట్రీయుడు. తల్లిది ఆంధ్రప్రదేశ్. అబ్దుల్ రజాక్ గుర్నా ప్రతిష్ఠాత్మక నోబెల్ సాహిత్య పురస్కారాన్ని 2021 గాను గెలుచుకున్న సాహితీవేత్త అబ్దుల్ రజాక్. టాంజానియాకు చెందిన ఆయన 1994లో ‘ప్యారడైజ్’ నవలతో సాహిత్య ప్రస్థానం మొదలుపెట్టారు. ఆయన రచనల్లో వలసవాదపు మూలాలు, తూర్పు ఆఫ్రికా దేశాల్లోని ఆధునికత తాలూకు విధ్వంసం, సాంస్కృతిక సంఘర్షణలు కనిపిస్తాయి. 1948లో, జాంజిబార్‌లో జన్మించిన అబ్దుల్ 1960వ దశకంలో శరణార్థిగా ఇంగ్లండ్‌కు చేరాడు. అనంతరం అక్కడే ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేసి, రిటైర్ అయ్యాడు. -
Bajrang Punia: కొత్త కోచ్ అన్వేషణలో బజరంగ్... అతడితో జట్టు కట్టే అవకాశం
Bajrang Punia May Tie Up With Andriy Stadnik Ahead Paris Olympics: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా 2024 పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల కోసం కొత్త కోచ్‌ను నియమించుకునే పనిలో పడ్డాడు. ఉక్రెయిన్‌కు చెందిన బీజింగ్ ఒలింపిక్స్ (2008) కాంస్య పతక విజేత అండ్రీ స్టాడ్నిక్తో అతను సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇప్పటిదాకా బజరంగ్‌కు జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్ కోచ్‌గా ఉన్నాడు. షాకో శిక్షణలో బజరంగ్ పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించాడు. కాగా జార్జియన్ కోచ్ షాకో బెంటినిడిస్ వద్ద మార్గనిర్దేశనంలో బజరంగ్టో క్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. అదే విధంగా ఏసియన్ గేమ్స్-2018లో స్వర్ణం, వరల్డ్ చాంపియన్‌షిప్-2019లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. చదవండి: Rahul Dravid: నా ఫస్ట్‌లవ్ ద్రవిడ్.. తన కోసం మళ్లీ క్రికెట్ చూస్తా: నటి MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్ సిక్సర్.. ధోని ఫొటో వైరల్ -
అమృతాంజన్ బ్రాండ్ అంబాసిడర్లుగా చాను, పునియా
ముంబై: టోక్యో ఒలింపిక్ గేమ్స్ విజేతలైన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను, రెజ్లర్ బజరంగ్ పునియాలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నట్లు అమృతాంజన్ హెల్త్‌కేర్ వెల్లడించింది. జాయింట్ మజిల్ స్ప్రే, పెయిన్ ప్యాచ్, బ్యాక్ పెయిన్ రోల్ ఆన్ వంటి నొప్పి నివారణ ఉత్పత్తులకు వీరు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారని సంస్థ సీఎండీ శంభు ప్రసాద్ తెలిపారు. టీవీ, డిజిటల్ ప్రకటనలతో పాటు వినియోగదారులకు చేరువయ్యేందుకు నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో వీరు పాలుపంచుకుంటారని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులుగా తమకు ఎదురయ్యే కండరాలు నొప్పులు మొదలైన సమస్యల నుంచి ఉపశమనానికి అమృతాంజన్ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడ్డాయని మీరా బాయ్ చాను, బజరంగ్ పునియా తెలిపారు. -
వరల్డ్ చాంపియన్‌షిప్‌కు బజరంగ్ దూరం
ఢిల్లీ: మోకాలి గాయంతో బాధపడుతున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత వరల్డ్ బజరంగ్ పూనియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ నుంచి తప్పుకున్నాడు. ఒలింపిక్స్‌కు ముందే అతనికి ఈ గాయం కాగా, అలాగే ఆటను కొనసాగించిన బజరంగ్ ఇప్పుడు చికిత్స కోసం విరామం తీసుకుంటున్నాడు. పూర్తిగా కోలుకునేందుకు కనీసం ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో అక్టోబర్ 2 నుంచి నార్వేలో జరిగే టోర్నీ దూరమయ్యాడు. క్వార్టర్స్‌లో సానియా జోడీ క్లీవ్‌లాండ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ క్లీవ్‌లాండ్ చాంపియన్íÙప్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సానియా–క్రిస్టీనా మెక్హెల్ (అమెరికా) జంట 6–3, 6–2తో ఒక్సాన కలష్నికొవా (జార్జియా) – ఆండ్రీ మితు (రొమేనియా) జోడిపై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్–అమెరికా ద్వయం ఆధిపత్యమే కొనసాగింది. రెండు సెట్లలోనూ ఎక్కడ ప్రత్యరి్థకి అవకాశం ఇవ్వకుండా సానియా జోడీ చెలరేగింది. -
Tokyo Olympics: నిరాడంబరంగా విశ్వక్రీడల ముగింపు వేడుకలు
-
నిరాడంబరంగా విశ్వక్రీడల ముగింపు వేడుకలు
టోక్యో: ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ సజావుగా సాగిన టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగిసాయి. కోవిడ్ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. జపాన్ జాతీయ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. జపాన్ జాతీయ జెండా ఆవిష్కరణతో వేడుకలు మొదలయ్యాయి. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ భజరంగ్ పునియా భారత బృందం ఫ్లాగ్ బేరర్‌గా ఉన్నాడు. వేడుకల్లో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్యారిస్ వేదికగా జరగబోయే తదుపరి(2024) ఒలింపిక్స్ గురించి పది నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నారు. చివర్లో ఒలింపిక్స్ టార్చ్‌ను పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులకు అందించడంతో ఈ ముగింపు వేడుకలు ముగిస్తాయి. ఇదిలా ఉంటే, ఈ ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తంగా ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాల అత్యుత్తమ ప్రదర్శనను ప్రస్తుత ఒలింపిక్స్‌లో అధిగమించి మరుపురానిదిగా మలుచుకుంది. ఇక ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 85 దేశాలు పతకాల ఖాతా తెరవగా.. భారత్ ఏడు పతకాలు( స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు) సాధించడం ద్వారా పతకాల పట్టికలో 47వ స్థానంలో నిలిచింది. ఇక పతకాల వేటలో టాప్ 3 స్థానాల కోసం ఎప్పటిలాగే అమెరికా, చైనా, జపాన్‌లు పోటీ పడగా.. 39 స్వర్ణాలతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. 38 స్వర్ణాలతో చైనా రెండో స్థానంలో, 27 స్వర్ణాలతో ఆతిథ్య జపాన్ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా పతకాల వారిగా చూసుకుంటే అమెరికా 113 పతకాలు(39 స్వర్ణం, 41 రజతం, 33 కాంస్యం), చైనా 88 పతకాలు( 38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం), జపాన్ 58 పతకాలు (27 స్వర్ణం, 14 రజతం, 17 కాంస్యం) సాధించాయి. -
జై బజరంగ్ భళి...
శీతాకాలం... తెల్లవారుజాము 2 గంటలకు ఎముకలు కొరికే చలిలో... ఓ 11 ఏళ్ల బాలుడు ఇంట్లో దిండ్లను వరుస పెట్టి దుప్పటి కప్పి తాను పడుకున్నట్లు చేసి అఖాడాకు వెళ్లేవాడు. ఉదయం అమ్మ అడిగితే 4 గంటల తర్వాతే వెళ్లానని చెప్పేవాడు. తనయుడు ఎప్పుడు వెళ్లాడో తల్లికి తెలుసు! అయినా కొడుకు ఆసక్తికి అడ్డుచెప్పకూడదని ఆ మాతృమూర్తి నిర్ణయించుకుంది. అక్కడ సీన్ కట్ చేసి టోక్యోలో చూస్తే ఆ బాలుడు బజరంగ్ పూనియా అయ్యాడు. రెజ్లింగ్ బరిలో కాంస్యం గెలిచాడు. టోక్యో: ‘పసిడి’ పతకానికి దూరమైనా... తన కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో బజరంగ్ 8–0తో దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్)పై గెలిచాడు. తద్వారా 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో నియాజ్బెకోవ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. హాజీ అలియెవ్ (అజర్బైజాన్)తో జరిగిన సెమీఫైనల్లో లెగ్ డిఫెన్స్ బలహీనత, కౌంటర్ ఎటాక్‌లో తడబడి పాయింట్లు చేజార్చుకున్న బజరంగ్ ఈ బౌట్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. నియాజ్‌బెకోవ్‌కు ఏదశలోనూ పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. దాంతో నియాజ్బెకోవ్ చివరకు ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే ఓటమి చవిచూశాడు. హరియాణకు చెందిన 27 ఏళ్ల బజరంగ్ తన కెరీర్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు (రజతం, 2 కాంస్యాలు), ఆసియా చాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు (2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు), ఆసియా క్రీడల్లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం), కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం) సాధించాడు. బజరంగ్ బాహువుల్లోనో లేదంటే పిడికిలిలోనో రెజ్లింగ్ లేదు. అతని రక్తంలోనే మల్లయుద్ధం వుంది. ఎందుకంటే తన తండ్రి, సోదరుడు కూడా దంగల్ వీరులే! ఈ కుస్తీపట్లే నరనరాన జీర్ణించుకున్న బజరంగ్ తాజాగా ఒలింపిక్ పతకం పట్టాడు. అన్నట్లు ఇతనికి ఒలింపిక్ పతకం కొత్తేమో కానీ ఈ నంబర్‌వన్ (65 కేజీల కేటగిరీ) రెజ్లర్ ఖాతాలో ప్రపంచ, ఆసియా చాంపియన్ షిప్, ఆసియా గేమ్స్ స్వర్ణాలు చాలానే ఉన్నాయి. అందుకే అసలు సిసలు సత్తాచాటాల్సిన చోట స్వర్ణ, రజతాలు చేజార్చుకున్నాడేమో కానీ పతకం లేకుండా ఉత్తచేతులతో రాలేదు. కాంస్యం పోరు లో విజేయుడిగా నిలిచాడు. 34 కేజీల బరువుతో 60 కేజీల విభాగంలో... మచ్రోలి గ్రామంలో 2008లో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు బజరంగ్ వెళ్లాడు. కానీ 34 కిలోల బరువున్న అతన్ని 60 కేజీల కేటగిరీలో పాల్గొనేందుకు నిర్వాహకులు నిరాకరించారు. ఎలాగోలా అతని అన్న హరిందర్ నచ్చచెప్పడంతో ఆర్గనైజర్లు అంగీకరించారు. అపుడు దంగల్‌లో దిగిన బజరంగ్ తనకంటే ఎక్కువ బరువున్న రెజ్లర్ ఓడించడం అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ కుర్రాడి బాహువు బలం తెలిసిన కోచ్ ఆర్య వీరేందర్ మల్లయుద్ధంలో బజరంగ్ పూనియాను తీర్చిదిద్దాడు. అదే ఏడాది తండ్రి బల్వాన్ సింగ్ తనయుడిని ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియంలో చేర్పించాడు. అక్కడ అందరు మేటి రెజ్లర్లే ఉండటంతో వారితో తలపడిన బజరంగ్ రెండేళ్లకే ఆసియా క్యాడెట్ చాంపియన్ అయ్యాడు. మరుసటి ఏడాది (2011) దాన్ని నిలబెట్టుకున్నాడు. అక్కడ్నుంచి ఇక వెనుదిరిగి చూడకుండా ఇంటాబయటా పతకాల పట్టు పట్టేవాడు. 2018లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను సాధించిన రజతం బజరంగ్‌ను ఒలింపిక్ మెడలిస్ట్‌ల జాబితాలో చేర్చింది. యోగేశ్వర్ దత్ కిటుకులు... ఛత్రశాల్ స్టేడియం చేసిన మేలు, మెరుగైన తీరు అంతా ఇంతా కాదు. అక్కడ ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ సాహచర్యం... బజరంగ్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం... అంతర్జాతీయ పోటీల్లో అసాధారణ రెజ్లర్‌గా, పతకాల విజేతగా నిలబెట్టాయి. యోగేశ్వర్ రాజకీయాల్లోకి వెళ్లాక భారత రెజ్లింగ్ సమాఖ్య బజరంగ్‌కు వ్యక్తిగత కోచ్‌గా జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్ను నియమించింది. ఇతని వల్ల విదేశీ రెజ్లర్లతో చేసిన ప్రాక్టీస్ బజరంగ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్ పతక విజేతగా మార్చింది. తల్లి ప్రోత్సాహం... బజరంగ్ తల్లి ఓంప్యారీకి 11 ఏళ్ల తనయుడి అడుగులు ఎటువైపో తెలుసు. అందుకే తెల్లారుజామునే వెళ్తున్నా... ఉదయం లేచాక అబద్ధం చెబుతున్నా... మిన్నకుండిపోయింది. అయితే ఒక విషయం మాత్రం మాతృమూర్తి గట్టిగా చెప్పేది. ‘ఓడినంత మాత్రాన ఏడవొద్దు. ప్రత్యర్థుల ముందు పలుచనవ్వొద్దు. ఓటములను గెలిచేందుకు మెట్లుగా మలచుకోవాలి’ అని! ఈ మాట బాగా వంటబట్టించుకున్న బజరంగ్ చదువులో వెనుకబడినా... దంగల్‌లో మట్టికరిచినా... ఎప్పుడు కన్నీరు కార్చలేదు. అమ్మ అన్నట్లే ప్రతి ఓటమిని గెలుపు మలుపుగా చేసుకున్నాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింహాబలుళ్లను ఓడించే శక్తి తన తల్లి మాటల ద్వారానే సంపాదించుకున్నాడు. -
నీరజ్.. టోక్యోలో చరిత్ర లిఖించావ్: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఒకేరోజు రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు చివరి రోజున నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి.. గోల్డెన్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇక రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. అరంగ్రేంట్రంలోనే భజరంగ్ పూనియా కాంస్యం సాధించి.. చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా, భజరంగ్ పూనియాకులకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నీరజ్.. టోక్యోలో చరిత్ర లిఖించావ్: మోదీ ‘‘నీరజ్ చోప్రా ఈ రోజు టోక్యోలో సాధించని విజయం ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఈ రోజు టోక్యోలో చర్రిత సృష్టించావ్. అద్భుతమైన అభిరుచితో ఆడావు.. అసమానమైన గ్రిట్ చూపించావు. స్వర్ణం గెలిచినందుకు నీకు అభినందనలు’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. History has been scripted at Tokyo! What @Neeraj_chopra1 has achieved today will be remembered forever. The young Neeraj has done exceptionally well. He played with remarkable passion and showed unparalleled grit. Congratulations to him for winning the Gold. #Tokyo2020 https://t.co/2NcGgJvfMS — Narendra Modi (@narendramodi) August 7, 2021 Delightful news from #Tokyo2020! Spectacularly fought @BajrangPunia. Congratulations to you for your accomplishment, which makes every Indian proud and happy. — Narendra Modi (@narendramodi) August 7, 2021 నీవు సాధించిన విజయం యువతకు స్ఫూర్తి: రామ్‌నాథ్ కోవింద్ ‘‘నీరజ్ చోప్రా సాధించిన అపూర్వ విజయం! మీరు మీ మొదటి ఒలింపిక్స్‌లో భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడల్‌ను ఇంటికి తీసుకువచ్చారు. మీ ఫీట్ మా యువతకు స్ఫూర్తినిస్తుంది. మీ విజయం పట్ల భారతదేశం ఉప్పొంగిపోతుంది! మీకు హృదయపూర్వక అభినందనలు’’ అంటూ రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. Unprecedented win by Neeraj Chopra!Your javelin gold breaks barriers and creates history. You bring home first ever track and field medal to India in your first Olympics. Your feat will inspire our youth. India is elated! Heartiest congratulations! — President of India (@rashtrapatibhvn) August 7, 2021 A special moment for Indian wrestling! Congratulations to Bajrang Punia for winning the Bronze at #Tokyo2020. You have distinguished yourself as an outstanding wrestler with untiring efforts, consistency and tenacity over the years. Every Indian shares the joy of your success! — President of India (@rashtrapatibhvn) August 7, 2021 నీరజ్ చోప్రాకు భారీ నజరానా ప్రకటించిన హరియాణా ప్రభుత్వం చండిగఢ్: 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. హరియాణాకు చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో హరియాణా సర్కార్ నీరజ్ చోప్రాకు భారీ నజరానా ప్రకటించింది. అతడికి 6 కోట్ల రూపాయల నగదు బహుమానంతోపాటు.. క్లాస్-1 గ్రేడ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. -
నీరజ్, భజరంగ్‌లను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో ఘనమైన ముగింపు ఇచ్చిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు.జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన జావెలిన్ త్రో తుది పోరులో నీరజ్ చోప్రా 87. 58 మీటర్ల దూరం విసిరి చరిత్ర సృష్టించాడు. అదే సమయంలో టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలోకాంస్యం సాధించి కొత్త అధ్యాయం లిఖించిన భజరంగ్ పూనియాను సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. అత్తుత్తమ ప్రదర్శన, అంతర్గత బలం కనబరచి.. దేశానికి పతకం సాధించావని భజరంగ్ పూనియాను సీఎం జగన్ అభినందించారు. రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ దౌలత్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించి.. భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ భజరంగ్ పూనియాకు అభినందనలు తెలిపారు. Congratulations to @BajrangPunia on winning bronze in 65kgs freestyle #Wrestling, taking India's Olympic medal count to 6. He deserves praise for his outstanding display of courage & inner strength to win the bout with 8-0 for #TeamIndia. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2021 -
భజరంగ్ ఇంటి వద్ద కోలాహలం.. టపాసుల మోత
-
చరిత్ర సృష్టించిన భజరంగ్ పూనియా.. భారత్‌కు మరో పతకం
-
చరిత్ర సృష్టించిన భజరంగ్ పూనియా.. భారత్‌కు మరో పతకం
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భజరంగ్ పూనియా చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే కాంస్యంతో అదరగొట్టాడు. రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ దౌలత్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఉడుం పట్టు అంటే ఏంటో ప్రత్యర్థికి రుచి చూపించిన భజరంగ్ తన కాంస్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు. అంతేగాక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో దేశానికి పతకం అందించిన ఆరో రెజ్లర్‌గా నిలిచాడు. ఇదే ఒలింపిక్స్‌లో రవి కుమార్ దహియా రజతం గెలవగా.. తాజాగా భజరంగ్ కాంస్యం గెలిచాడు. ఇంతకముందు కేడీ జాదవ్(కాంస్యం), సుశీల్ కుమార్ (కాంస్యం, రజతం), సాక్షి మాలిక్( కాంస్యం), యేగేశ్వర్ దత్( కాంస్యం), రవి దహియా(రజతం) గెలిచారు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ పీరియడ్‌లో భజరంగ్ మొదట ఓ పాయింట్ సాధించాడు. రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ కొట్టిన దౌలత్.. ఈ మ్యాచ్‌లో భజరంగ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఫస్ట్ పీరియడ్ ముగింపులో మరో పాయింట్‌ను భజరంగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆ పీరియడ్‌లోకి అతనికి 2-0 లీడ్ వచ్చింది. సెకండ్ పీరియడ్ కూడా రసవత్తరంగా సాగింది. అయితే ఆ పీరియడ్ ఆరంభంలోనే భజరంగ్ రెండు పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత వరుసగా రెండేసి పాయింట్లను రెండు సార్లు సాధించిన పూర్తి ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. ఆ పీరియడ్‌లో ఆరు పాయింట్లు గెలిచాడు. కాగా భజరంగ్ కాంస్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటివరకు భారత్‌కు 2 రజతాలు, 4 కాంస్య పతకాలు వచ్చాయి. -
Bajrang Punia: తొలి ప్రయత్నంలోనే పథకం సాధిస్తాడా..?
ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో మూడు పతకాలు నెగ్గిన ఏకైక భారత రెజ్లర్... ఆసియా చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు... అంతర్జాతీయ టోర్నీ లలో క్రమం తప్పకుండా పసిడి, రజత పతకాలు... అయితేనేం ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత క్రీడా వేదికపై తొలిసారి ఆడుతున్న బజరంగ్ అసలు సిసలు సత్తా చాటాల్సిన చోట తడబడ్డాడు. తొలి రౌండ్లో అంతగా అంతర్జాతీయ అనుభవంలేని కిర్గిజిస్తాన్ రెజ్లర్‌పై అతికష్టమ్మీద నెగ్గిన అతను, క్వార్టర్ ఫైనల్లో ఇరాన్ ప్రత్యర్థిని ‘బై ఫాల్’ పద్ధతిలో ఓడించినా... కీలకమైన సెమీఫైనల్లో మాత్రం నిరాశపరిచి ఓటమి మూటగట్టుకున్నాడు. దాంతో స్వర్ణ–రజత పతకాలపై ఆశలు వదులుకొని ఇక కాంస్య పతకం కోసం పోరాడనున్నాడు. టోక్యో: తన కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని తొలి ప్రయత్నంలోనే సాధించేందుకు భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో 27 ఏళ్ల బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాడు. దాంతో నేడు జరిగే కాంస్య పతక పోరులో దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్)–ఆడమా దియాతా (సెనెగల్) మధ్య ‘రెపిచేజ్’ బౌట్ విజేతతో బజరంగ్ తలపడనున్నాడు. అనుభవం, గత రికార్డుల దృష్ట్యా రెపిచేజ్ బౌట్లో నియాజ్బెకోవ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నియాజ్బెకోవ్తో బజరంగ్ ఆడాల్సి వస్తే మాత్రం భారత రెజ్లర్ గెలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. 32 ఏళ్ల నియాజ్బెకోవ్ మూడుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలువడంతోపాటు 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో బజరంగ్‌ను ఓడించాడు. వివిధ వయో కేటగిరీల్లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హాజీ అలియేవ్ (అజర్బైజాన్)తో జరిగిన సెమీఫైనల్లో బజరంగ్ 5–12 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. బజరంగ్ లోపాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నట్లు అలియేవ్ ఆడాడు. బజరంగ్ లెగ్ డిఫెన్స్‌లో బలహీనంగా ఉండటంతో అలియేవ్ భారత రెజ్లర్ కాళ్లను ఒడిసి పట్టుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. తొలి భాగంలో 2, 2 పాయింట్లు స్కోరు చేసిన అలియేవ్ ఒక పాయింట్ కోల్పోయాడు. రెండో భాగంలోనూ అలియేవ్ దూకుడు కొనసాగించగా... బజరంగ్ కూడా కౌంటర్ ఎటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రెండుసార్లు సఫలమై 2, 2 పాయింట్లు సాధించాడు. అయితే అలియేవ్ ఒత్తిడికి లోనుకాకుండా బజరంగ్ రెండు కాళ్లను పట్టేసి రెండుసార్లు తిప్పేసి 2, 2 పాయింట్లు స్కోరు చేశాడు. ఆ తర్వాత 1, 2 పాయింట్లు తన ఖాతాలో వేసుకొని 11–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరి సెకన్లలో బజరంగ్ రిఫరీ నిర్ణ యాన్ని చాలెంజ్ చేసి దానిని కోల్పోవడం తో అలియేవ్ ఖాతాలో మరో పాయింట్ చేరింది. అంతకుముందు తొలి రౌండ్లో బజరంగ్ 3–3తో ఎర్నాజర్ అక్మతలియేవ్ (కిర్గిజిస్తాన్)పై గెలుపొందాడు. తొలి భాగంలో బజరంగ్ 1, 2 పాయింట్లు సాధించి, మరో పాయింట్ చేజార్చుకొని 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ రెండో భాగంలో ఎర్నాజర్ వరుసగా 1, 1 పాయింట్లు సాధించి స్కోరును 3–3తో సమం చేశాడు. బౌట్ ముగిశాక ఇద్దరూ సమఉజ్జీగా నిలిచినా నిబంధనల ప్రకారం బజరంగ్ ఒకే ఎత్తులో హై స్కోరింగ్ (2) పాయింట్లు సాధించ డంతో అతనిని విజేతగా ప్రకటించారు. ‘బై ఫాల్’తో విక్టరీ... ఇరాన్ రెజ్లర్ మొర్తజా ఘియాసి చెకాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 4 నిమిషాల 56 సెకన్లలో ‘బై ఫాల్’ పద్ధతిలో గెలిచాడు. తొలి భాగం ముగిశాక 0–1తో వెనుకబడ్డ బజరంగ్ రెండో భాగం ఆరంభంలో 2 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత ఇరాన్ ప్రత్యర్థిని కింద పడేసి అతని భుజాలను కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు తగిలించాడు. దాంతో నిబంధనల ప్రకారం బజరంగ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించారు. సీమా తొలి రౌండ్లోనే... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బరిలో నిలిచిన చివరి రెజ్లర్ సీమా బిస్లా (50 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సారా హమ్దీ (ట్యునీషియా)తో జరిగిన తొలి రౌండ్లో సీమా 1–3తో ఓటమి పాలైంది. ఆ తర్వాత సారా హమ్దీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో సీమాకు రెపిచేజ్ పద్ధతిలో కాంస్య పతకం రేసులో నిలిచే అవకాశం కూడా చేజారింది. -
ఒలింపిక్స్‌లో రేపే మనకు ఆఖరిరోజు.. కలిసి వస్తుందా!
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పోటీ పడుతున్న క్రీడాంశాలు రేపటితో ముగియనున్నాయి. ఇప్పటివరకు భారత్ ఐదు పతకాలు సాధించింది. అందులో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ విభాగం నుంచి రెండు రజతాలు.. బాడ్మింటన్, హాకీ, బాక్సింగ్ విభాగాల్లో కాంస్యాలు లభించాయి. కాగా ఒలింపిక్స్ రేపు మనకు ఆఖరిరోజు అయినా పతకాల ఆశలు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా జావెలిన్ త్రోపై ఎక్కువ ఆశలు ఉన్నాయి. నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానంలో నిలవడంతో ఫైనల్లో కచ్చితంగా మెడల్ గెలుస్తాడని అంతా భావిస్తున్నారు. ఇక రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్యం కోసం తలపడనున్నాడు. అలాగే గోల్ఫ్‌లో భారత క్రీడాకారిణి అదితి అశోక్ పతకంపై ఆశలు రేపుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రేపటి భారత షెడ్యూల్ ►జావెలిన్ త్రో ఫైనల్- నీరజ్ చోప్రా ►రెజ్లింగ్‌లో కాంస్య పతక పోరు- భజరంగ్ పునియా ►గోల్ఫ్ పతకం రేసులో భారత క్రీడాకారిణి అదితి అశోక్.. వాతావరణం అనుకూలించక గోల్ఫ్ ఆట రద్దయితే.. రెండోస్థానంలో ఉన్న అదితికి రజతం దక్కే అవకాశం -
కాంస్య పతక పోరు; భజరంగ్ పూనియా వీడియో వైరల్
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్ అజర్బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్‌తో జరిగిన సెమీస్ బౌట్లో భజరంగ్ 5-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. కాగా సెమీస్‌లో ఓడిన భజరంగ్ రేపు కాంస్య పతక పోరుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా భజరంగ్‌కు సంబంధించిన ఒక పాత వీడియోను బాలీవుడ్ స్టార్ రణదీప్ హుడా ట్విటర్లో షేర్ చేశాడు. ఆ వీడియోలో భజరంగ్ మ్యాచ్ సందర్భంగా బౌట్‌కు సిద్ధమవుతుండగా ఇంతలో ఒక వ్యక్తి రింగ్‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే భజరంగ్ అతన్ని రింగ్ బయటే ఆపేందుకు ప్రయత్నించాడు. అతను ఆగకపోవడంతో బజరంగ్ అతన్ని రింగ్ నుంచి ఎత్తిపడేశాడు. ఆ తర్వాత మళ్లీ రింగ్‌లోకి వచ్చి విజయసంకేతాన్ని చూపించాడు. దీనిని షేర్ చేసిన రణదీప్ ఇలాంటి ప్రదర్శనను ఒలింపిక్స్‌లో చూపించాలి అంటూ ట్వీట్ చేశాడు. కాగా సెమీస్‌లో ఓటమి పాలైన పూనియా కాంస్య తెస్తాడేమో చూడాలి. Can’t wait to celebrate like this again .. #BajrangPunia #Olympics #Olympics2020 #Tokyo2020#Wrestling @BajrangPunia pic.twitter.com/TNOHg9sMIf — Randeep Hooda (@RandeepHooda) August 6, 2021 -
సెమీస్ చేరిన భారత రెజ్లర్ భజరంగ్ పునియా
-
బజరంగ్‌పైనే ఆశలు
రెజ్లింగ్‌లో మిగిలి ఉన్న ఇద్దరు భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా, సీమా బిస్లా శుక్రవారం బరిలోకి దిగనున్నారు. బజరంగ్ పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో... సీమా బిస్లా మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఈ ఇద్దరిలో బజరంగ్‌పైనే భారత్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న బజరంగ్‌కు ఒలింపిక్ పతకం మాత్రమే లోటుగా ఉంది. ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత వేదికపై అందరూ పతకం గెలవడానికి వస్తారు కాబట్టి ప్రత్యర్థులను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందనడంలో సందేహం లేదు. తొలి రౌండ్లో కిర్గిజిస్తాన్ రెజ్లర్ ఎర్నాజర్ అక్మతలియెవ్తో బజరంగ్ ఆడతాడు. ఈ బౌట్లో గెలిస్తే క్వార్టర్ ఫైనల్ ఇరాన్ రెజ్లర్ మొర్తెజా ఘియాసితో బజరంగ్ ఆడే చాన్స్ ఉంది. ఈ బౌట్లోనూ గెలిస్తే బజరంగ్‌కు సెమీఫైనల్లో 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హాజీ అలియెవ్ (అజర్బైజాన్) లేదా దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్) లేదా వాల్డెస్ తొబియర్ (క్యూబా) ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి ప్రస్తుత ప్రపంచ చాంపియన్ రషిదోవ్ (రష్యా), ప్రపంచ మాజీ చాంపియన్ టకుటో ఒటోగురు (జపాన్) ఫైనల్‌కు చేరుకోవచ్చు. భారత మహిళా రెజ్లర్ సీమా బిస్లాకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో సీమా ట్యునిషియా రెజ్లర్ సారా హమ్దీపై గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో మూడుసార్లు ఒలింపిక్ రజత పతక విజేత, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మరియా స్టాడ్నిక్ (అజర్బైజాన్) ఎదురుకావడం ఖాయమనిపిస్తోంది. సీమా సంచలనం సృష్టించి సెమీఫైనల్ చేరితే యు సుసాకి (జపాన్) లేదా వాలెంటినా (కజకిస్తాన్)లలో ఒక్కరు ప్రత్యర్థిగా ఉండే అవకాశముంది. బజరంగ్ తొలి రౌండ్: ఉదయం గం. 8:49 నుంచి; క్వార్టర్ ఫైనల్ (అర్హత సాధిస్తే): ఉదయం గం. 9:17 నుంచి; సెమీఫైనల్ (అర్హత సాధిస్తే): మధ్యాహ్నం గం. 2:55 నుంచి -
టోక్యో ఒలింపిక్స్: పతకాల వేటలో మన రెజ్లర్ల పట్టు ఎంత?
దాదాపు ఐదున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ సాధించిన కాంస్య పతకం భారత రెజ్లింగ్ ముఖచిత్రాన్ని మార్చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ మళ్లీ తన పట్టు నిలబెట్టుకొని రజతం సంపాదించగా... యోగేశ్వర్ దత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని దక్కించుకొని దేశం గర్వపడేలా చేసింది. మొత్తానికి గత మూడు ఒలింపిక్స్ క్రీడల్లో భారత రెజ్లర్లు తమ ‘పట్టు’దలతో జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత మల్ల యోధులపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి భారత్ తరఫున ఏడుగురు బరిలో ఉండగా... అందులో కనీసం ముగ్గురు కచ్చితంగా పతకంతో తిరిగి వస్తారని క్రీడాభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. – సాక్షి క్రీడా విభాగం బజరంగ్ పూనియా (65 కేజీలు) కొన్నేళ్లుగా బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్లో పతకంతో తిరిగి రావడం బజరంగ్ పూనియాకు అలవాటుగా మారింది. తాను పాల్గొన్న గత పది టోరీ్నలలో 27 ఏళ్ల ఈ హరియాణా రెజ్లర్ ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించడం విశేషం. అయితే బజరంగ్ పోటీపడుతున్న కేటగిరిలో కనీసం ఆరేడుగురు రెజ్లర్లు పతకాలు కచ్చితంగా సాధించే సత్తాగలవారున్నారు. ఆరంభంలోనే పాయింట్లు సమర్పించుకునే బలహీనతను అధిగమించి... లెగ్ డిఫెన్స్ లోపాన్ని సరిదిద్దుకుంటే టోక్యోలో బజరంగ్ పతకంతో తిరిగి వస్తాడు. బజరంగ్‌కు టకుటో ఒటోగురో (జపాన్), రషిదోవ్ (రష్యా), తుల్గా తుముర్ (మంగోలియా), ముస్జుకజేవ్ (హంగేరి) నుంచి గట్టిపోటీ లభించే అవకాశాలున్నాయి. రవి దహియా (57 కేజీలు) రెండేళ్ల క్రితం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అందరి అంచనాలను తారుమారు చేసి కాంస్య పతకం సాధించిన రవి దహియా తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియంలో శిక్షణ పొందే రవి రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచాడు. ప్రచార్భాటాలకు దూరంగా ఉండే రవి బౌట్ ఆరంభంలో నెమ్మదిగా కదులుతాడు. బౌట్ సాగుతున్నకొద్దీ ప్రత్యర్థి బలహీనతలపై అంచనా పెంచుకొని దూకుడు పెంచుతాడు. బౌట్ మొదట్లో తడబడి పాయింట్లు కోల్పోయే బలహీనత ఉన్న రవికి ఈ విశ్వ క్రీడల్లో జవుర్ ఉగెవ్ (రష్యా), సులేమాన్ అత్లి (టరీ్క), యుకీ తకహాషి (జపాన్) గట్టిపోటీ లభించనుంది. దీపక్ పూనియా (86 కేజీలు) జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు నిలకడగా రాణిస్తున్న రెజ్లర్ దీపక్ పూనియా. 22 ఏళ్ల దీపక్ 2019 జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి... అదే ఏడాది జరిగిన సీనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. గత మూడేళ్లలో దీపక్ ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు, రజతం సాధించాడు. ఎడమ చేతి వేలి గాయం కారణంగాఏడాది కాలంగా అంతర్జాతీయ టోరీ్నలకు దూరంగా ఉన్న దీపక్‌కు హసన్ యజ్దాని (ఇరాన్), డేవిడ్ మోరిస్ టేలర్ (అమెరికా), నైఫోనోవ్ (రష్యా) గట్టి ప్రత్యర్థులు. పెద్దగా అంచనాలు లేకపోవడం దీపక్‌కు కలిసివచ్చే అంశం. వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగి మోకాలి గాయంతో క్వార్టర్ ఫైనల్ బౌట్ మధ్యలోనే వైదొలిగిన వినేశ్ ఈసారి మాత్రం పతకంతో తిరిగి రావాలని పట్టుదలతో ఉంది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి టోక్యో బెర్త్‌ను ఖరారు చేసుకున్న 26 ఏళ్ల వినేశ్ 2018 ఆసియా క్రీడల్లో... 2021 ఆసియా చాంపియన్íÙప్లో స్వర్ణాలు సాధించింది. కౌంటర్ ఎటాక్ చేసే క్రమంలో ప్రత్యర్థులకు పాయింట్లు సమర్పించుకునే బలహీనత ఉన్న వినేశ్ దీనిని అధిగమిస్తే స్వర్ణం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ విశ్వ క్రీడల్లో జపాన్ రెజ్లర్ మాయు ముకైదా నుంచి వినేశ్‌కు ప్రమాదం పొంచి ఉంది. సీమా బిస్లా (50 కేజీలు) అంతర్జాతీయస్థాయిలో అంతగా అనుభవం లేకపోయినా చివరి వరకు పోరాడేతత్వంగల సీమా బిస్లా బల్గేరియాలో జరిగిన ఒలింపిక్ ప్రపంచ క్వాలిఫయింగ్ టోరీ్నలో ఫైనల్ చేరి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. బౌట్ ఆరంభంలో వెనుకబడ్డా వెంటనే పుంజుకోగల సత్తా సీమా సొంతం. హరియాణాకు చెందిన 28 ఏళ్ల సీమాపై ఎటువంటి అంచనాలు లేకపోవడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా టోక్యోలో బరిలోకి దిగనుంది. మరియా (అజర్బైజాన్), యు సుసాకి (జపాన్) ఫేవరెట్స్‌గా ఉన్నారు. అన్షు మలిక్ (57 కేజీలు) రెజ్లింగ్ కుటుంబం నుంచి వచి్చన అన్షు మలిక్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. హరియాణాకు చెందిన 19 ఏళ్ల అన్షుకు అంతర్జాతీయస్థాయిలో అనభవం లేకపోయినా ఆద్యంతం దూకుడైన ఆటతో ప్రత్యర్థులకు ఇబ్బంది పెట్టగల సత్తా సొంతం. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌గా నిలిచిన అన్షుకు రిసాకో కవాయ్ (జపాన్), ఒడునాయో ఫొలాసెడ్ (నైజీరియా), ఇరీనా కురాచ్‌కినా (బెలారస్) నుంచి గట్టిపోటీ తప్పదు. సోనమ్ మలిక్ (62 కేజీలు) దేశవాళీ టోరీ్నలలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ను వరుసగా నాలుగుసార్లు ఓడించిన సోనమ్ మలిక్ ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా టోక్యో బెర్త్‌ను దక్కించుకుంది. క్యాడెట్ స్థాయి నుంచి నేరుగా సీనియర్ విభాగంలో పోటీపడుతున్న సోనమ్‌కు మోకాలి గాయం వేధిస్తోంది. సాంకేతికంగా పటిష్టంగా ఉండటం... కౌంటర్ ఎటాక్ల ద్వారా పాయింట్లు గెలవడం సోనమ్ ప్రత్యేకత. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌గా నిలిచిన సోనమ్‌కు యుకాకో కవాయ్ (జపాన్), తినిబెకోవా (కిర్గిజిస్తాన్), తేబీ ముస్తఫా (బల్గేరియా), కేలా మిరాకిల్ (అమెరికా) నుంచి గట్టిపోటీ లభించనుంది. -
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్‌కు గాయం
మాస్కో: టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం గెలిచే భారత క్రీడాకారుల్లో ఒకరిగా భావిస్తున్న స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా గాయపడ్డాడు. రష్యాలో జరుగుతున్న అలీ అలియెవ్ టోరీ్నలో భాగంగా అబ్దుల్ మజీద్ కుదేవ్ (రష్యా)తో జరిగిన 65 కేజీల విభాగం సెమీఫైనల్లో బజరంగ్ కుడి మోకాలి నొప్పితో బౌట్ మధ్యలోనే వైదొలిగాడు. మ్యాట్‌పైనే కుప్పకూలిన బజరంగ్‌కు ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత బజరంగ్ నిలబడినా నడవడానికి ఇబ్బంది పడ్డాడు. బజరంగ్ గాయం తీవ్రతపై ఒకట్రెండు రోజుల్లో వివరాలు చెబుతామని అతని కోచ్ షాకో తెలిపారు. -
ఆసియా సీనియర్ రెజ్లింగ్: భారత్‌కు ఐదు పతకాలు
అల్మాటీ (కజకిస్తాన్): మరోసారి తమ ఆధిపత్యం చాటుకుంటూ ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు అదరగొట్టారు. శనివారం బరిలోకి దిగిన ఐదు వెయిట్ కేటగిరీల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చాయి. రవి కుమార్ దహియా (57 కేజీలు) తన టైటిల్‌ను నిలబెట్టుకోగా... బజరంగ్ పూనియా (65) రజతం సాధించాడు. కరణ్ (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (79 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చిన రవి కుమార్ ఆసియా చాంపియన్‌షిప్‌లో తన జోరు కనబరిచాడు. అలీరెజా (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో ఢిల్లీకి చెందిన రవి కుమార్ 9–4తో గెలిచాడు. సెమీఫైనల్లో రవి 11–0తో అబురుమైలా (పాలస్తీనా)పై, క్వార్టర్ ఫైనల్లో 9–2తో సఫరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ రవి కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. బజరంగ్‌కు గాయం ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడో స్వర్ణం సాధించాలని ఆశించిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు నిరాశ ఎదురైంది. జపాన్ రెజ్లర్ టకుటో ఒటుగురోతో ఫైనల్ తలపడాల్సిన బజరంగ్ మోచేతి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో బజరంగ్‌కు రజతం... ఒటుగురోకు స్వర్ణం దక్కాయి. ఓవరాల్‌గా ఆసియా చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కిది ఏడో పతకం. ఇందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 3–0తో జియోంగ్ యోంగ్‌సియోక్ (కొరియా)పై, సెమీఫైనల్లో 7–0తో బిల్‌గున్ సర్‌మన్‌డక్ (మంగోలియా)పై గెలిచాడు. కాంస్య పతక బౌట్లలో కరణ్ 3–1తో సీంగ్‌బోంగ్ లీ (కొరియా)పై, నర్సింగ్ యాదవ్ 8–2తో అహ్మద్ మోసిన్ (ఇరాక్)పై, సత్యవర్త్ 5–2తో మిన్‌వన్ సియో (కొరియా)పై విజయం సాధించారు. -
బజరంగ్‌కు స్వర్ణం
రోమ్: వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీ లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ మంగో లియా రెజ్లర్ తుల్గా తుమర్‌పై విజయం సాధించాడు. నిర్ణీత రెండు రౌండ్ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అయితే మంగోలియా రెజ్లర్ ఒక్కో పాయింట్ రెండుసార్లు సాధించగా... చివరి సెకన్లలో ఒకే పట్టుతో రెండు పాయింట్లు సాధించినందుకు బజరంగ్ ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు బజరంగ్ క్వార్టర్ ఫైనల్లో 7–0తో సెలిమ్ కొజాన్ (టర్కీ)పై, సెమీఫైనల్లో 6–3తో క్రిస్టో ఫర్ (అమెరికా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన విశాల్ (70 కేజీలు) కాంస్యం సాధించాడు. -
మరో నెల రోజులు అక్కడే: రూ. 11.65 లక్షల ఖర్చు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు మరో నెల రోజులు అదనంగా అమెరికాలో ప్రాక్టీస్ చేసే అవకాశం లభించింది. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించిన బజరంగ్ డిసెంబర్ 4 నుంచి మిచిగాన్‌లోని క్లిఫ్ కీన్ రెజ్లింగ్ క్లబ్లో సాధన చేస్తున్నాడు. ఫిబ్రవరి మొదటి వారం వరకు అతను అక్కడే ప్రాక్టీస్ చేసే వీలు కలి్పస్తూ గతవారం ఒలింపిక్ సెల్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) వెల్లడించింది. ఇందుకు అయ్యే రూ. 11.65 లక్షల వ్యయాన్ని భరిస్తామని తెలిపింది. క్లిఫ్ కీన్ రెజ్లింగ్ క్లబ్లో నాణ్యమైన ప్రాక్టీస్ లభిస్తోందని బజరంగ్ పేర్కొన్నాడు. ‘ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. మంచి భాగస్వాములు అందుబాటులో ఉన్నారు. భారత్‌లో 74 కేజీలు, 79 కేజీల కేటగిరీ భాగస్వాములతో ప్రాక్టీస్ చేసేవాడిని. ఇక్కడ నా వెయిట్ కేటగిరీకి చెందిన రెజ్లర్లతో సాధన చేస్తున్నా’ అని బజరంగ్ తెలిపాడు. మార్చిలో రోమ్ టోరీ్నతో ఈ ఏడాది పతకాల వేటను ప్రారంభిస్తానన్నాడు. (చదవండి: భారత జట్టుకు నిరాశ ) -
భళా... బజరంగ్
ఆస్టిన్ (అమెరికా): భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఈ ఏడాదిని స్వర్ణ పతకంతో ముగించాడు. అమెరికాలోని ఆస్టిన్ నగరంలో జరిగిన ఫ్లో రెజ్లింగ్ ఇన్విటేషనల్ అంతర్జాతీయ క్లబ్ టోర్నీలో బజరంగ్ విజేతగా నిలిచాడు. 68 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ హరియాణా రెజ్లర్ అజేయంగా నిలిచాడు. ఎనిమిది మంది రెజ్లర్ల మధ్య నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ ఈవెంట్లో బజరంగ్ బరిలోకి దిగిన మూడు బౌట్లలో గెలుపొందాడు. ముందుగా క్వార్టర్ ఫైనల్లో 6–1తో ప్యాట్ లుగో (అమెరికా)పై నెగ్గిన బజరంగ్... సెమీఫైనల్లో 9–0తో ఆంథోనీ యాష్నాల్ట్ (అమెరికా)ను ఓడించాడు. ఫైనల్లో బజరంగ్ 8–4తో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత జేమ్స్ గ్రీన్ (అమెరికా)పై విజయం సాధించాడు. తొలి రౌండ్ ముగిసేసరికి ఇద్దరూ 4–4తో సమఉజ్జీగా ఉండగా... రెండో రౌండ్లో బజరంగ్ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా నాలుగు పాయింట్లు గెలిచాడు. విజేతగా నిలిచిన బజరంగ్‌కు 25 వేల డాలర్లు (రూ. 18 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది. బజరంగ్ రెగ్యులర్‌గా 65 కేజీల విభాగంలో... జేమ్స్ గ్రీన్ 70 కేజీల విభాగాల్లో పోటీపడతారు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. -
స్టార్ రెజర్ల పెళ్లి సందడి : ఫోటోలు
భారత స్టార్ రెజర్లు భజరంగ్ పునియా సంగీత ఫొగట్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నవంబరు 26, గురువారం వీరి వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఈ మేరకు సంగీత, పునియా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. జీవితం పరిపూర్ణం. ఈ జీవితానికి తోడునువ్వు. ఈ కొత్త అధ్యాయం ప్రేమ, సంతోషంతో నిండాలి అంటూ ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు వివాహంలో కూడా అద్భుతమైన వేడుక ఉందంటూ భజరంగ్ పునియా తన ఉద్వేగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ రోజు నా జీవిత భాగస్వామిని నా ఇంటికి తీసుకు వచ్చాను. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను. సంతోషంగా ఉంది ..అలాగే కొంచెం ఆందోళనగా ఉంది. ఈ పరీక్షలో నెగ్గాలి ఫ్రెండ్స్. అత్యంత ప్రేమను. ఆశీర్వాదాలు అందించిన అందరినీ ధన్యవాదాలు అంటూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఈ నూతన దంపతులకు అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లికి ముందు నిర్వహించే వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో క్రీడాభిమానులకు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హల్దీ వేడుకల్లో పసుపు రంగు దుస్తుల్లో సంగీత మెరిసి పోయిన సంగతి తెలిసిందే You Complete Me ❤️ Soulmate for life. A New chapter of Life Would be Full Of love and Happiness. #SangRang @BajrangPunia ❤️ pic.twitter.com/dFIgSPNh6Q — Sangeeta Phogat (@sangeeta_phogat) November 26, 2020 Wishis you a Beautiful Happy Marriage 💞 Anniversary to Bajrang Punia 💞 Sangeeta Phogat the Best Wishes You ❣️🌹❣️ Lovely ♥️ Styles Anniversary to God Bless you Bajrang Punia Bhaiya ji 🙏 ka jawab Nahi ✔️💃🕺✌️👏👏 Sangeetha Bhabhi ji 🙏💐🙏 Also. pic.twitter.com/RhASqCxP1T — Raviprakashsingh (@Ravipra70338031) November 26, 2020 -
వరుడు భజరంగ్- వధువు సంగీత!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజర్లు భజరంగ్ పునియా- సంగీత ఫొగట్ వివాహానికి ముహూర్తం ఖరారైంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు నవంబరు 25న మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పెళ్లికి ముందు నిర్వహించే వేడుకలతో కాబోయే వధూవరుల ఇళ్లలో సందడి నెలకొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో హల్దీ, మెహందీ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సంగీత ఫొగట్‌తో పాటు, ఆమె సోదరీమణులు, రెజర్లు గీత ఫొగట్, బబితా ఫొగట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హల్దీ వేడుకలో భాగంగా పసుపు రంగు దుస్తుల్లో మెరిసి పోతున్న సంగీతకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: రోహిత్ స్థానంలో అయ్యర్!) ఇక రెజ్లింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భజరంగ్ పూనియా వరల్డ్ నెంబర్‌వన్ రెజ్లర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫొగట్ సిస్టర్స్‌లో అందరికంటే చిన్నవారైన సంగీత ప్రేమించిన అతడు, పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లిచేసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన సంగీత తండ్రి మహావీర్ సింగ్ ఫొగట్ సైతం 'ఇది వారిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమని, పిల్లల అభిప్రాయాలను గౌరవించడమే మా కర్తవ్యమని' పేర్కొన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్ తర్వాతే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా కరోనా కారణంగా ఈ మెగా ఈవెంట్ వాయిదా పడటంతో ఇంకా ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భజరంగ్ పూనియా 65 కేజీల విభాగంలో, సంగీతా ఫొగట్ 59 కేజీల విభాగంలో పోటీ పడుతున్నారు. View this post on Instagram A post shared by Sangeetaphogat (@sangeetaphogat57) -
బాక్సర్‌నే ఆశ్చర్యపరుస్తున్న బుడ్డోడు!
చాలా మంది ఆరోగ్యం కోసం రోజు ఎక్సర్సైజ్లు చేద్దామనుకొని బద్దకంతో వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ వీడియో మీరు చూస్తే కచ్ఛితంగా మీకు స్ఫూర్తి కలుగుతుంది. ఈ వీడియోలో ఒక బుడ్డోడు ఆగకుండా పుల్అప్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ వీడియోలను ఇండియన్ బాక్సర్ భజరంగ్ పూనియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 23 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు పుల్ అప్స్ చేస్తున్నాడు. వాళ్ల ఇంటిలోని వారందరూ శభాష్ అంటుంటే ఇంకా ఉత్సాహంగా పుల్అప్స్ చేస్తూ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. प्रैक्टिस शुरू कर दी है आने वाली चैंपियनशिप के लिए 🙏🏽😝😝 pic.twitter.com/pMDGCagtjB — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) September 1, 2020 ఈ వీడియోను పోస్ట్ చేసిన పూనియా ‘వచ్చే ఛాంపియన్ షిప్ కోసం ఇప్పుడే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు’ అనే కాప్షన్‌ను జోడించారు. ఈ వీడియోను ఇప్పటికే 53000ల మందికి పైగా వీక్షించారు. 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. తన గురువు చెప్పినట్లు చక్కగా సాధన చేస్తున్నాడు అని కొంతమంది కామెంట్ చేయగా, చాలా మంది ఆ చిన్నారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. చదవండి: వేడిగా ఉందని.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచింది -
సుదీర్ఘ విరామం రెజ్లర్లకు సవాలే
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా లభించిన సుదీర్ఘ విరామం కొందరు రెజ్లర్లకు చేటు చేసిందని భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పూనియా అభిప్రాయపడ్డాడు. టోక్యో బెర్త్ పొందిన వారు ప్రశాంతంగా పోటీలకు సిద్ధమవుతున్నారని, ఒలింపిక్స్‌కు అర్హత సాధించాల్సిన వారికే ఈ విరామం సవాలుగా మారిందని అన్నాడు. ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఐఐఎస్)లో ఇటీవలే ప్రాక్టీస్ ప్రారంభించిన బజ్రంగ్ వెబినార్‌లో మాట్లాడుతూ... ‘ఒలింపిక్స్‌లో ఎలా సత్తా చాటాలనే అంశంపై నేనో దృక్పథంతో ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ ఇంకా అర్హత సాధించాల్సిన వారే తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. ఈ విరామం వారి ఫిట్‌నెస్‌కు సవాలుగా నిలిచింది. నేనైతే లాక్‌డౌన్‌లోనూ ప్రతీరోజు ట్రెయినింగ్‌లో పాల్గొన్నా. నన్ను నిత్యం ప్రేరేపించేవారు నా చుట్టూ ఉన్నారు’ అని బజ్రంగ్ వ్యాఖ్యానించాడు. -
రెండో ర్యాంక్‌లో రెజ్లర్ బజరంగ్
న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా రెండో ర్యాంక్‌లో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో బజరంగ్ 59 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 60 పాయింట్లతో ఒలింపిక్ చాంపియన్ రషిదోవ్ (రష్యా) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్–56 పాయింట్లు), ఇస్మాయిల్ ముస్జుకజెవ్ (హంగేరి–41 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్ ప్రకారం ఈ నలుగురికి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో టాప్–4లో సీడింగ్ లభించడం ఖాయమైంది. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన రవి దహియా 45 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా 54 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. -
ఒలింపిక్ పతకం సాధించినా...
న్యూఢిల్లీ: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సెమీస్‌లో తనకెదురైన ఓటమి గాయం ఒలింపిక్ పతకం సాధించినా మానేది కాదని భారత రెజ్లర్ బజరంగ్ పూనియా స్పష్టం చేశాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో జడ్జీలు తీసుకున్న వివాదాస్పద నిర్ణయం కారణంగా బజరంగ్ ఫైనల్ పోరుకు అర్హత సాధించలేకపోయాడు. ‘మ్యాచ్‌లో పక్షపాతం, మోసం చేయడం ద్వారా ఎదురైయ్యే ఓటమి మనకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. నేను అక్కడ ఎటువంటి తప్పు చేయలేదు. నేను పసిడి పతకం గెలిచే అవకాశాన్ని నా తప్పుల ద్వారా చేజార్చుకోలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లు భిన్నమైన టోరీ్నలు. నేను ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం చాలా కష్టపడ్డా. ఒలింపిక్ పతకం గెలిచినా ప్రస్తుతం నాకు ఎదురైన ఓటమి గాయం మానదు. ఇటువంటి ఓటములు భవిష్యత్తులో ఎదురైతే నాకు ఈ ఓటమే గుర్తొస్తుంది’ అంటూ బజరంగ్ బదులిచ్చాడు. జాతీయ క్రీడగా రెజ్లింగ్‌ను ప్రకటించండి! జాతీయ క్రీడగా రెజ్లింగ్‌ను ప్రకటించాలని బజరంగ్ డిమాండ్ చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన రెజ్లర్లకు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ జాతీయ క్రీడగా రెజ్లింగ్ చేయాలనే ఆలోచన చేయగా దానికి బజరంగ్ మద్దతు తెలిపాడు. ప్రపంచ వేదికల మీద గత కొంత కాలంగా రెజ్లింగ్ భారత్‌కు పతకాలు అందిస్తూ వస్తోంది. అటువంటి రెజ్లింగ్‌ను జాతీయ క్రీడగా చేయడం సరైనదే అని బజరంగ్ అభిప్రాయపడ్డాడు. అయితే దీనిపై ఆచితూచి స్పందించిన క్రీడల మంత్రి తనకు అన్ని క్రీడలు సమానమేనని, వాటి అభివృద్ధికి దోహదపడతానని అన్నారు. నగదు పురస్కారాల ప్రదానం... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన ఐదుగురు భారత రెజ్లర్లను కిరణ్ రిజిజు నగదుతో సత్కరించారు. రజతం గెలిచిన దీపక్ పూనియాకు రూ.7 లక్షలు, కాంస్యాలు సాధించిన బజరంగ్, వినేశ్ ఫొగాట్, రాహుల్ అవారే, రవి దహియాలకు తలా రూ.4 లక్షల రూపాయల చెక్‌లను బహూకరించారు. -
బజరంగ్, రవి కంచు మోత
ఆతిథ్య నిర్వాకం బజరంగ్ స్వర్ణావకాశాన్నే దెబ్బతీసింది. కానీ పతకాల పూనియా ఘన చరిత్రను మాత్రం అడ్డుకోలేకపోయింది. రోజు వ్యవధిలోనే తనకెదురైన చేదు అనుభవం నుంచి బయటపడిన ఈ భారత ‘ఖేల్‌రత్న’ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాడు. మెగా ఈవెంట్లలో అతనికిది మూడో పతకం. తద్వారా ప్రపంచ చాంపియన్íÙప్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన ఏకైక భారత రెజ్లర్‌గా అతను ఘనతకెక్కాడు. 2013లో కాంస్యం నెగ్గిన బజరంగ్ గతేడాది రజతం సాధించాడు. నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు) ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కంచుమోత మోగించారు. శుక్రవారం జరిగిన కాంస్య పతక బౌట్లలో బజరంగ్ 8–7తో తుల్గతుముర్ ఒచిర్ (మంగోలియా) పై... రవి 6–3తో ఆసియా చాంపియన్ రెజా అహ్మదాలీ అట్రినగర్చి (ఇరాన్)పై గెలిచారు. అయితే వెటరన్ స్టార్ సుశీల్ కుమార్‌కు (74 కేజీలు) తొలి రౌండ్లోనే షాక్ ఎదురైంది. బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన సుశీల్ 2010లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. అయితే ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్íÙప్లో బరిలోకి దిగిన 36 ఏళ్ల సుశీల్‌కు ఈసారి తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. గద్జియెవ్ (అజర్బైజాన్)తో జరిగిన తొలి రౌండ్ బౌట్లో సుశీల్ 9–11తో ఓడిపోయాడు. ఒకదశలో 9–4తో ఆధిక్యంలో నిలిచిన సుశీల్ ఆ తర్వాత వరుసగా ఏడు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. సుశీల్‌పై గెలిచిన ఖద్జిమురద్ క్వార్టర్స్‌లో ఓడిపోవడంతో భారత రెజ్లర్‌కు ‘రెపిచేజ్’ అవకాశం లేకుండా పోయింది. మిగతా పోటీల్లో 125 కేజీల ఈవెంట్లో సుమిత్ 0–2తో లిగెటి (హంగేరి) చేతిలో... 70 కేజీల బౌట్లో కరణ్ 0–7తో నవ్రుజోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... 92 కేజీల కేటగిరీలో ప్రవీణ్ 0–8తో సగలిక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయారు. 65 కేజీల కేటగిరీలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో బజరంగ్ ఆఖరిదాకా ‘పట్టు’ సడలించకుండా తలపడి గెలిచాడు. గురువారం సెమీఫైనల్ బౌట్లో తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి బయటపడిన ఈ చాంపియన్ రెజ్లర్ ఈ బౌట్లో 8–7తో మంగోలియాకు చెందిన తుల్గ తుముర్ ఒచిర్‌పై విజయం సాధించాడు. ఒకదశలో 2–6తో వెనుకబడిన బజరంగ్ ఆ తర్వాత దూకుడు పెంచి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 8–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి నిమిషంలో ఒక పాయింట్ కోల్పోయిన బజరంగ్ ఒక పాయింట్ తేడాతో విజయాన్ని అందుకున్నాడు. సెమీస్ చేరడంతోనే బజరంగ్‌తో పాటు రవి కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. -
అంపైర్లు.. ఇక మీరెందుకు?
న్యూఢిల్లీ: వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా సెమీఫైనల్లో బజరంగ్ పూనియా పట్ల అంపైర్లు నిర్దయగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి స్థానిక కజకిస్తాన్ రెజ్లర్ నియజ్బెకొవ్ కావడమే పూనియాకు ప్రతి కూలంగా మారింది. 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరు 9–9 పాయింట్లతో సమంగా నిలవగా...‘బిగ్గర్ త్రో’ ఆధారంగా నియజ్బెకొవ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించారు. దీనిపై ఇప్పటికే పలువురు ధ్వజమెత్తగా తాజాగా భారత్ స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా మండిపడ్డాడు. ఓవరాల్ ప్రదర్శన చూడకుండా ఏకపక్షంగా కజికిస్తాన్ రెజ్లర్‌ను విజేతగా ప్రకటించడాన్ని తప్పుపట్టాడు. ‘ ఎవరైనా బజరంగ్- నియజ్బోకొవ్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సెమీస్ మ్యాచ్ చూశారా. అందులో ఎవరిది ఆధిపత్యమో స్పష్టంగా కనబడుతోంది.(ఇక్కడ చదవండి: బజరంగ్‌ను ఓడించారు) అసలు అంపైర్లు మీరు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు. మీరు మ్యాచ్‌కు అంపైర్లగా ఉండి ఏమిటి ఉపయోగం. ఒక మెగా టోర్నమెంట్లో ఇంతటి పక్షపాతంగా వ్యవహరిస్తారా. ఎట్టిపరిస్థితుల్లోనూ కజికిస్తాన్ రూల్స్‌కు లోబడి ఆడలేదు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. నిన్నటి సెమీస్ మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయంపై బజరంగ్ అక్కడే తన అసహనాన్ని ప్రదర్శించాడు. అయినా రిఫరీలు పట్టించుకోలేదు. దీనిపై పూనియా కోచ్ షాకో బెనిటిడిస్ తీవ్రంగా మండిపడ్డారు. బజరంగ్ మెరుగైన త్రోలను పట్టించుకోలేదని... బౌట్‌ను పరిశీలిస్తే తమ రెజ్లర్‌కే అదనంగా రెండు పాయింట్లు వస్తాయని, గెలిచేందుకు అది సరిపోయేదని కోచ్ వివరించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో కొరియా రెజ్లర్ జొంగ్ చొయ్ సన్తో తలపడిన బజరంగ్ అలవోక విజయం సాధించాడు. 8–1 స్కోరుతో ప్రత్యర్థిని తేలిగ్గానే చిత్తు చేశాడు. -
బజరంగ్‌ను ఓడించారు
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాను ఆతిథ్య దేశం ఓడించింది. అంతకుముందే తన సత్తాతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన బజరంగ్ ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. కానీ... సెమీఫైనల్లో ప్రత్యర్థి స్థానిక కజకిస్తాన్ రెజ్లర్ నియజ్బెకొవ్ కావడమే పూనియాకు ప్రతి కూలంగా మారింది. నిర్వాహకుల పక్షపాతం భారత రెజ్లర్ సువర్ణావకాశాన్ని దెబ్బతీసింది. 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరు 9–9 పాయింట్లతో సమంగా నిలవగా...ఒకే సారి నాలుగు పాయింట్లు సాధించిన ‘బిగ్గర్ త్రో’ ఆధారంగా నియజ్బెకొవ్‌ను రిఫరీ విజేతగా ప్రకటించారు. ఈ బౌట్లో ఓటమితో బజరంగ్ ఇప్పుడు కాంస్యం కోసం తలపడనున్నాడు. మరో రెజ్లర్ రవి దహియా టోక్యో బెర్తు ఖాయం చేసుకున్నాడు. కానీ సెమీస్‌లో అతను కూడా పరాజయం చవిచూడటంతో భారత్‌కు రజతం, బంగారం దూరమయ్యాయి. కాంస్యం కోసం బజరంగ్... డేవిడ్ హబట్ (స్లోవేనియా)తో తలపడతాడు. మహిళల ఈవెంట్లో సాక్షి మలిక్ తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. కాంస్యం బరిలో నిలిచిన పూజ ధండా కూడా ఓడిపోయింది. పట్టించుకోని రిఫరీలు... గత బుడాపెస్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న బజరంగ్ ఈసారి స్వర్ణంపై కన్నేశాడు. అందుకు తగ్గట్లే కఠోరంగా శ్రమించాడు. ఎదురు లేకుండా 65 కేజీల విభాగంలో సెమీస్ చేరాడు. గురువారం డౌలెత్ నియజ్బెకొవ్‌తో జరిగిన సెమీఫైనల్ బౌట్లో ఆరంభం నుంచి ఆతిథ్య దేశం ఎన్ని కుయుక్తులు చేసినా... పట్టువదలని ఈ కుస్తీవీరుడు పాయింట్లు గెలుస్తూనే వచ్చాడు. 6 నిమిషాల ఈ బౌట్ చివరకు 9–9 స్కోరు వద్ద ముగిసింది. అయితే నిర్వాహకులు, రిఫరీలు... ఈ పోటీలో తమ కజకిస్తాన్ రెజ్లర్ త్రో, పూనియా కంటే మెరుగని ఏకపక్షంగా తేల్చేశారు. పైగా బౌట్ మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా నియజ్బెకొవ్ కోలుకునేందుకు చాలా సమయం ఇచ్చారు. కనీసం మూడు సార్లు ఇలా జరగ్గా ఒక్కసారి హెచ్చరిక కూడా జారీ చేయలేదు. బజరంగ్ అక్కడే తన అసహనాన్ని ప్రదర్శించినా రిఫరీలు పట్టించుకోలేదు. దీనిపై పూనియా కోచ్ షాకో బెనిటిడిస్ తీవ్రంగా మండిపడ్డారు. బజరంగ్ మెరుగైన త్రోలను పట్టించుకోలేదని... బౌట్‌ను పరిశీలిస్తే తమ రెజ్లర్‌కే అదనంగా రెండు పాయింట్లు వస్తాయని, గెలిచేందుకు అది సరిపోయేదని కోచ్ వివరించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో కొరియా రెజ్లర్ జొంగ్ చొయ్ సన్తో తలపడిన బజరంగ్ అలవోక విజయం సాధించాడు. 8–1 స్కోరుతో ప్రత్యర్థిని తేలిగ్గానే చిత్తు చేశాడు. 57 కేజీల విభాగంలో రవి దహియా తొలి రెండు బౌట్లను టెక్నికల్ సుపీరియారిటీ ద్వారా గెలిచాడు. అనంతరం జరిగిన క్వార్టర్స్‌లో అతను 6–1తో యుకి టకహషి (జపాన్)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ జువర్ వుగుయెవ్ (రష్యా) 6–4తో రవి జోరుకు బ్రేకులేశాడు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం రవికి ఊరట. సాక్షి మలిక్ అవుట్... మహిళల 59 కేజీల కాంస్య పతక పోరులో పూజ 3–5తో జిన్ గ్రూ పీ (చైనా) చేతిలో ఓడింది. 62 కేజీల కేటగిరీలో సాక్షి మలిక్ తొలిరౌండ్లోనే నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి 7–10తో నైజీరియాకు చెందిన అమినట్ అడెనియి చేతిలో కంగుతింది. 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్ 0–2తో ఒలింపిక్ చాంపియన్ సార దొషొ (జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. సాక్షి, దివ్యలను ఓడించిన ప్రత్యర్థులు క్వార్టర్స్‌లో ఓడటంతో రెపిచేజ్ అవకాశం లేకుండా పోయింది.